నాయకస్వామ్యం
నాయకుల నిజస్వరూపాలు రోజూ తెలుస్తూనే ఉంటాయి
అయినా జనం గొఱ్ఱె కసాయిని నమ్మినట్లు
ఆ మోసగాళ్ళనే నమ్ముతారు
నాయకుల నిజస్వరూపాలు రోజూ తెలుస్తూనే ఉంటాయి
అయినా జనం గొఱ్ఱె కసాయిని నమ్మినట్లు
ఆ మోసగాళ్ళనే నమ్ముతారు
తాము మునుగుతారు అసమర్ధులకు తమ ఓట్లేసి
అందరినీ ముంచుతారు
అందరినీ ముంచుతారు
భారతదేశమున
లేదు ప్రజాస్వామ్యం
పరిఢవిల్లుచున్నది నాయకస్వామ్యం
పరిఢవిల్లుచున్నది నాయకస్వామ్యం
********
పెళ్ళన్న
తర్వాత ఎంత జాగ్రత్తగా చూసి చేసినా తన్నుతూంటుంది.
ఇది భగవన్నియమం ఏమో! మనం మానవ మాత్రులం
మాత్రమే అని నిరూపించడానికేమో!
*******
సంస్కారం
నేర్పని చదువు వ్యర్థం.
చదువులేని మనిషి వింత మృగం.
*******
హిందూ మతం -
సనాతన ధర్మం
హిందూ మతం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సూటియైన
సమాధానం కనిపించదు.లభించదు.
రాధాకృష్ణన్ పండితులు ఎప్పుడో చెప్పిన "A way of living" తప్ప మరేమీ లేదు. హిందూ మతం అంటే "A way of living" మాత్రమేనా?
ఒక్క మాటలో
హిందూ మతం గురించి చెప్పలేము. వైష్ణవము, శైవము, శాక్తేయము, గాణాపత్యము, సౌరము, షణ్ముఖము అని చెప్పాలి. వాటిలోనూ ఎన్నో
తెగలు. ఈ తెగలన్నీ ఇవాళ కూడా పరస్పరం కలహించుకుంటున్నాయి. పరస్పరం కలహించు కునేవి
ఒకే మతానికి ఎలా చెందుతాయి?
ఈ ఇబ్బంది పోగొట్టుకోవడానికి సనాతన ధర్మం అని
వాడతాం. ఇది ధర్మమే కాని మతం కాదు. మతానికి ఉండే అవలక్షణాలు ధర్మానికి ఉండవు.
హిందూ మతం ఫలానా అని చెప్పలేని స్థితిలో
ఉన్నాము.
కులగజ్జి కల పెద్దలు, నాస్తికులు, సాంస్కృతిక సంస్థలు, ప్రాంతీయ దిగ్గజాలు, భాషా దురభిమానులు, ఉపజాతీయతా దురంహంకారులు హిందూ మతం అంటే ఒక
లోకువని మాత్రం సృష్టించారు. అయోమయంలో పడేశారు. పోట్లాటలు తప్ప అన్యోన్యత లేదు.
సాంస్కృతిక సంస్థలు, పై వివిధ తెగలకు చెందిన వారు చెప్పేది హిందూ
మతం కాదు. వీరు హిందూ మతాన్ని ఉద్ధరించలేరు. వీరికి తోడు వివిధ ఆశ్రమాల స్థాపకులు
ఎంతో వీరంగం చేస్తూ హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు.
ఆధ్యాత్మిక గురువులు మరింత అయోమయంలో ఉన్నారు.
వీరిలోనూ ఎన్నో తెగలు. వైష్ణవాశ్రమములు, శైవాశ్రమములు, నాస్తికాశ్రమములు, ఎందరో గురువుల - బాబాలు అమ్మలు, స్వాములు, ఆనందా లు, పేరిట వెలసిన
ఆశ్రమములూ తమ వంతు గందరగోళం సృష్టిస్తున్నాయి. తాము అసలు హిందువులమే కాదంటున్నారు.
ఆశ్రమములూ తమ వంతు గందరగోళం సృష్టిస్తున్నాయి. తాము అసలు హిందువులమే కాదంటున్నారు.
వీరెవరూ హిందూ మత ప్రవక్తలు కారు. సంస్కర్తలు
అసలే కాదు. ఏదో పొట్ట కూటికి ఆశ్రమాలు పెట్టుకున్న వారే ఎక్కువ. సాంప్రదాయాన్ని
రక్షించే, నిలబెట్టే
ఆశ్రమ నిర్వాహకులు వీరిలో అతి
తక్కువ. సాంప్రదాయాన్ని బ్రతికించే సత్తా, సంస్కారం, సమయజ్ఞత, వివేకము, విచక్షణ, కరుణ, జ్ఞానం కలవారు ఈ ఆశ్రమ యజమానులలో దాదాపు ఎవరూ లేరు. ఎందరో మానసిక బానిసలని మాత్రం తయారుచేయగలరు, అంతే.
తక్కువ. సాంప్రదాయాన్ని బ్రతికించే సత్తా, సంస్కారం, సమయజ్ఞత, వివేకము, విచక్షణ, కరుణ, జ్ఞానం కలవారు ఈ ఆశ్రమ యజమానులలో దాదాపు ఎవరూ లేరు. ఎందరో మానసిక బానిసలని మాత్రం తయారుచేయగలరు, అంతే.
ఈ విపత్కర పరిస్థితుల్లో, హిందూ మతం అంటే సరిగా నిర్వచించలేని నేడు
హిందూ మతం పేరుతో ప్రాకులాడడం మూర్ఖత్వం.
ధర్మో రక్షతి రక్షితః - అంచేత ధర్మాన్ని
పాటిస్తూ బ్రతకాలి. రామాయణ, మహాభారతాలలో, భాగవతంలో, సాంఘిక ధర్మాలను నిర్వచించారు, రామాది దివ్య పాత్రలు మన ప్రవర్తనకు ఆదర్శంగా
నిలిపారు. మన బాధ్యతలను సరిగా, నైపుణ్యంతో నిర్వహించడమే ధర్మం.
క్రతువులు, యాగాలు, పూజలు, పునస్కారములు, అభిషేకములు మతంలో భాగమే కాని, ధర్మంలో భాగం కావు. వీధి వీధికి ప్రతి పండగకీ
డబ్బులు వసూలు చేసి అసహ్యంగా, అసభ్యంగా నిర్వహించే ఉత్సవాలు కూడా హిందూ మతంలో భాగంగా చెలామణీ అయిపోతున్నాయి.
ఇంత దారుణమైన స్థితికి హిందూ మతం చేరుకుంది.
మతం రూపంలోకి మారిపోయిన ఇటువంటి ఉత్సవాలు, పద్ధతులు మన్ని ఉద్ధరించవు. మనకి విపరీతమైన
విసుగు, కాలుష్యము
కలిగించి మనలను ఎన్నో ఇక్కట్ల పాలు చేస్తాయి అంతే.
మనకి కావలసినది ధర్మం. మతం కాదు. ధర్మాన్ని
వదిలి, మతాన్ని
కౌగలించుకుంటే హిందూ శబ్దానికి మరింత హాని కలుగుతుంది.
భారతీయ తత్వశాస్త్రం కొరగాకుండా అయిపోతుంది.
*******
అంతర్జాలం, సామాజిక సాలెగూళ్ళు లేకపోతే, సారస్వత సృష్టి చేసే ఎందరో అనామకులుగా
ఉండిపోయే వారు. అచ్చు పత్రికలు అతి కొద్ది మందికే అవకాశం కలిగించ గలిగేవి. ఇప్పుడు
వాసి గల, ఏ వాదానికీ చెందని వారు కూడా హాయిగా తమ
రచనలకు, కవనములకు వెలుగు చూపించే సావకాశం కలిగింది. రస హృదయం కల పాఠకుల ప్రోత్సాహం బోనస్.
రచనలకు, కవనములకు వెలుగు చూపించే సావకాశం కలిగింది. రస హృదయం కల పాఠకుల ప్రోత్సాహం బోనస్.
*******
బొమ్మలు
చూసి, ముద్దు గుమ్మలనుకొని స్నేహం చేయబోతే
వారివి కాదు బొమ్మలు, కారు వారు ముద్దు గుమ్మలని తేలితే
వారివి కాదు బొమ్మలు, కారు వారు ముద్దు గుమ్మలని తేలితే
ముఖపుస్తకంలో ఏది నిజం?
ఏది అబద్దం తెలియని గందరగోళంలో
ఏది అబద్దం తెలియని గందరగోళంలో
ఏదో ఆశతో స్నేహాలు
చేసే పాఠకులు
మిథ్యా ప్రపంచాగ్నిలో పడిన మిణుగురు పురుగులు
మిథ్యా ప్రపంచాగ్నిలో పడిన మిణుగురు పురుగులు
********
మనిషి ఎన్నో
వేల సంవత్సరాల నుంచి తన గురించి,
చుట్టూ ఉన్న
ప్రకృతి, ప్రపంచాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు.
కాని ఏ విషయం ఇంకా ఏమీ తేల్చుకోలేక పోతున్నాడు. ఎన్నాళ్ళో ఈ అన్వేషణ కమ్ నిరీక్షణ.
ఈ లోపు మిడి మిడి జ్ఞానం వాళ్ళు పశువులు చేలో
పడి పంట నాశనం చేసినట్లు తాము అనుకున్నది జ్ఞానం, విజ్ఞానం, సంస్కృతి, నాగరికతా అంటూ , ఇంగితం లేకుండా ప్రకటించి సంఘాన్ని అతలా కుతలం చేస్తున్నారు. మతాలు, సంస్కృతులు, సిద్ధాంతాలు రాద్ధాంతాలుగా మారుతున్నాయి తప్ప
మనుషుల మధ్య సామరస్యాన్ని, సౌమనస్యాన్ని హరించి వేస్తున్నాయి.
మనుషుల మధ్య సామరస్యాన్ని, సౌమనస్యాన్ని హరించి వేస్తున్నాయి.
సంఘం అశాంతి, అసౌకర్యం, అసౌఖ్యాలతో గోలగా తయారైంది. విజ్ఞత, కరుణ కరువయ్యాయి. అందరూ సంఘోద్ధారకులే. సంఘం
మాత్రం దురాచారములతో, దౌర్జన్యాలతో, దుడుకుతనంతో అలమటిస్తోంది.
రక్షకులు లేని పురంలా భయ భ్రాంతులతో సతమతమౌతూ
ఈసురోమంటూ ఉంది.
*********
The
nations of the world are suffering from the consequences of inefficient and
vulgar leaders.
********
నిరక్షర
కుక్షులుగా అసహాయులుగా మిగులుస్తున్న ఎంతో ఖరీదైన బడి బాట కన్నా; కడుపు నింపే బతుకు బాట పట్టడం తెలివైన శ్రేయస్కరమైన పని
*********
ఒళ్ళు
చూపించకుండా ఏ మోడల్ కూడా మోడలింగ్ లో పాల్గోవటం లేదు. సినీతార సినిమాల్లో ఎంత
ఎక్స్పోజ్ చేస్తే అంత బోల్డ్ అంటున్నారు. ఇదంతా వారి స్వాతంత్ర్యం అనుకుంటా.
*********
తత్త్వం గురించి
మాట్లాడడానికి చూపించే ఉత్సాహంలో కోటో వంతు కూడా తత్త్వాన్ని అనుసరించడంలో చూపం.
అంతా వేలం వెర్రిగా తయారైంది.
********
కులరహిత
సమాజానికి, ప్రత్యేకతలు అనుభవిస్తున్న వారు ఒప్పుకోరు; వారే కుల సహిత సమాజానికీ ఒప్పుకోరు; ఇదంతా ఓ
గందరగోళంగా, తమాషాగా తయారయ్యింది; అంతా రోకలి తలకు చుట్టమనే వారే
*********
రాతి
కట్టడములలో నారాయణుడున్నాడో లేదో తెలియదు కాని
కరుణాంతరంగుల రసజ్ఞుల మనసులలో వెలుగుచున్నాడు
మాధవుడు
లక్ష్మీదేవిని వక్షస్థలమునందు వహించెనో లేదో
తెలియదు కాని
సుఖశాంతులను
కాసులు కురిపించు విద్యను నేర్పగలడు
తపస్సులకు ప్రత్యక్షమగునో లేదో తెలియదు కాని
భవబంధ విముక్తి
కలిగించి మోక్షమును కరతలామలకము చేయగలడు తన
ప్రసాదముతో
భక్తి, రక్తులు సమముగా పంచు రసికావతంసుడు రమణీ
లోలుడు
ప్రపంచము రిక్త ప్రదేశమై, శూన్యము. మిగిలినపుడు, ఆనందానుభవమై
వెలిసి వెలుగును శాంతానుభవముగ శాంతాకారుడు
పద్మనాభుడు
నిరంతర మౌని, బ్రహ్మర్షులకు పరమ దైవము బ్రహ్మవేత్త
పరబ్రహ్మము
నారాయణుడు నారద సంగీత లోలుడు నగధరుడు సూరి
శార్ఙ్గధరుడు
విష్ణువు విమలుడు సరాగ విరాగములందు శ్రేష్థి
విజయ సారథి శ్రీకృష్ణుడు
********
India must undergo
turmoil for all issues related to caste.
*******
ప్రస్తుతం
ప్రపంచంలో ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసికోరు. ప్రభుత్వమో, మరేదో, మరొకరో, వారిని
అనుక్షణమూ అనుసరిస్తూ ప్రమాదంలో పడితే రక్షించాలి. వారు మాత్రం విచ్చలవిడిగా
సంచరిస్తారు. మాట్లాడతారు. ఎవరూ వారికి ఏమీ చెప్పరాదు. ఈ దుష్ట సమాజంలో ఎలా
మసలుకోవాలో అస్సలు చెప్పకూడదు.
వారికి ప్రమాదం వచ్చినపుడు, నష్టం కలిగినపుడు సంఘం అంతా వాళ్ళ వెనుక నిలిచి వాళ్ళకి నష్టం చేసిన వాళ్ళని
అభిశంసించాలి. శిక్షించాలి.
ఇటువంటి బాధ్యతారహిత ప్రవర్తనను ఎవరూ ఖండించ
కూడదు. వాళ్ళ ప్రతిభ, వారి ప్రతి పనిని, మాటను గ్రహించు కొని వారిని సమర్థించాలి.
ప్రభుత్వాలు, మేధావులు ఈ
బాధ్యతారాహిత్యాన్ని ఒక అలంకారంగా మార్చేశారు.
సంఘంలో మరింత
అశాంతి ఏర్పడుతుంది. మరిన్ని అరాచకాలు జరుగుతాయి. బాధ్యతా రహితుడైన వ్యక్తి తనకు, సమాజానికి ప్రమాదకారి. అటువంటి వారెవరూ
ప్రమోదకరులు కారు.
*******
Still waters run deep.
It is difficult to gauge the extent and
meaning of Silence.
********
బయటి
ప్రపంచంలో ఏదైనా ఒక ఘోరం జరగడం భయం, ఫేస్బుక్
నిండా అభిశంసనలే. ఎంత మంది న్యాయమూర్తులో, ఎంత మంది
సానుభూతి పరులో,
ఎంత మంది సామాజిక స్పృహ కలవారో! జరిగిన సంఘటన కన్న తమ అభిశంసన మిన్న అనుకుంటూ తమ అనుకంపనను ఉదారంగా వెలిబుచ్చే ఇందరిలో ఎందరు genuine? ఎందరిది fashion?
ఎంత మంది సామాజిక స్పృహ కలవారో! జరిగిన సంఘటన కన్న తమ అభిశంసన మిన్న అనుకుంటూ తమ అనుకంపనను ఉదారంగా వెలిబుచ్చే ఇందరిలో ఎందరు genuine? ఎందరిది fashion?
Why so much hurry and urgency?
But the reactions are
intense and instantaneous.
Even journalists are behind in reporting or expressing reaction
and concern.
*******
ఓటు బేంక్
రాజకీయాలతో ఓటైన భారతదేశం జవసత్త్వములు ఎప్పటికి పుంజుకొనును?
చేతకాని వారందరూ చేరి దేశ అభివృద్ధిని, సుఖ శాంతులను కాలరాయు ఈ నాడు ఏది మనకు రక్ష?
*********
వేరే బొమ్మలేల
కవితలకు
సరిపోవా పద చిత్రములు?
సరిపోవా పద చిత్రములు?
**********
Now in India, the way
education system is functioning, there is no possibility of producing deep
thinkers, philosophers, scientists, scholars and individuals dedicated to
learning. It is a melonchic
reality.
reality.
And also
self-confidence, self-reliance and self-esteem are missing together with
language abilities.
**********
భారతదేశంలో
నాస్తికులు, హేతువాదులు హిందూ మతాన్ని మాత్రమే
విమర్శిస్తూ, "కోడిగుడ్డు మీద వెంట్రుకలు
పీకడానికే" పుట్టినట్లు అనిపిస్తుంది. వారు ఏ ఇతర మతాలలోని ఏ లోపాల గురించి
మాట్లాడరు. ఎందుకో మనకు తెలుసు.
*********
ప్రపంచాన్ని
అర్థం చేసికొని జీవించే వాళ్ళ కన్న అపార్థం చేసుకుని గొడవ, గోల చేస్తూ అశాంతి రేకెత్తించే వారు సంఘంలో చాలా చాలా ఎక్కువగా తయారయ్యారు.
*********
We try to take help
from all but ourselves. Life is more bearable if we choose proper people as
dear ones, if near ones are not, some solace will be there. Others will always
are partial in helping. Better is self-reliance. Life is a series of
experiences, pleasant and unpleasant. We may not get help when required from
others physically and psychologically.
Life is mind management.
*********
ప్రపంచంలో ఏదీ
మనం అనుకున్నట్లు, మనకు కావలసినట్టు జరగదు. మనం సర్దుకు
బ్రతకాల్సిందే.
******
అనుభవము
మానసిక స్థితి. తలపు మానసిక గతి.
*********
కవిత్వముచే
ఆకర్షింప బడుటకు వ్యక్తికి సరస హృదయం ఉండాలి. ఆస్వాదన తెలియాలి. స్పందన కల
మనసుండాలి. సారస్వత పరిచయం, ఆసక్తి ఉండాలి. భాషపై పట్టు ఉండాలి.
వస్తువుని బట్టి మెచ్చుకోగల కుశలత ఉండాలి. ఇవి కొందరిలోనే ఉంటాయి. అందుకనే చాలా
తక్కువ మంది కవిత్వం వైపు ఆకర్షింప బడతారు.
**********
ఉపాసకులు, స్వాములు, సన్యాసులు, మత గురువులు, ఆశ్రమ నిర్వాహకులు మనల్ని ఉద్ధరించడం కన్న
తమని తాము మనం ఇచ్చిన డబ్బు, ఇతరములతో ఉద్ధరించుకుంటారు. చివరికి జోగీ, జోగీ రాసుకుంటే బూడిద రాలిందన్నట్టు మిగులుతాం మనం, ఉద్ధరింపు మర్చిపోయి.
******
******
అంతర్జాల
మాధ్యమాల్లో మగవారి దౌర్జన్యాలను,
దౌష్ట్యాన్ని, క్రూరత్వాన్ని చీల్చి చెండాడే అతివల ఇంట్లోని మగవారెవరూ ఈ దుర్లక్షణాలు లేని
వారై ఉంటారు. ఎంతో వినమ్రులు,
మంచి వారై
ఉంటారు. అటువంటప్పుడు ఆ స్త్రీలు జీవితాన్ని హాయిగా గడపక ఎందుకు మిగతా మగవాళ్ళని
పట్టించుకుంటారు?
లోకంలో చీకటి, వెలుగులు; రాత్రింబవళ్ళు; మంచి చెడ్డలు ఉంటూనే ఉంటాయి.
***********
30 ఏళ్ళ క్రితం మనం పండుగలు చేసుకోవడం టి.వి.
లోకి మారింది.
ఇప్పుడు పండుగలు చేసికోవడం ఫేస్బుక్ లోకి
మారింది.
********
ఈ ప్రపంచంలో గురువులకు, ఉపదేశాలకు, ప్రవచనాలకు లోటు లేదు. చెప్పినట్టు చేసేవారే లేరు. తాము
చెప్పింది చేసే గురువులూ లేరు.
No comments:
Post a Comment