Friday, October 6, 2017

తమకు తామే ప్రియము; కవితలు; మనకేల దిగులు; సతత పరిణామం


తమకు తామే ప్రియము

తనను తాను చుంబించును
సముద్రం కెరటం రూపంలో
తన్ను తాను పునః సృష్టించుకొను
ద్రుమము విత్తనము రూపములో

తనను తాను చూచుకొనును అమ్మ
సంతానము రూపములో; తనను తాను
పునః సృష్టించంకొనును పరమాత్మ
ప్రకృతి సౌందర్యం రూపంలో; జీవుల
రూపంలో; జ్ఞానములో, భాషా సౌందర్యములలో
తామే తమకు ప్రియము ప్రాణమును జగతిలో
***********
కవితలు

కావ్యములు
కాస్త చిత్రిక పడితే
అవును వరుస పదములు
కవనములుగా;
ఇంకాస్త ఓపిక చూపితే
మారును అవే రస రమ్య
గీతములుగ, సంగీతములుగ
మరింత విద్వత్తు, కౌశలము
కల్గిన అవే అగును
కల కాలము నిలుచు కావ్యములుగ
******
పూల మొక్క రమ్య భాషణములు

అందమైన పూలనే
ఈయగలను, తీపులు
నిండిన ఫలముల ఈయలేను;

ప్రకృతిలో ఒక్కొక్కరు ఒక్కొక్క
పనే చేయగలరు;
ఒక్కరే అన్ని పనులు చేయలేరు;
చేయరాదు;

వివిధము, అనేకము
ప్రకృతి లక్షణము;
అందరూ ఒక పనికే
ఎగపడుట వికృతి;

ఈ చిన్ని విషయము గమనించి
మానవులారా!
అందరూ తలో పని చేయండి;
ఒక్క పనికే అందరూ ఎగబడకండి
***************
మనకేల దిగులు

శక్తి కాంతుడు శివుడు
ముక్తి కాంత నిచ్చు అచ్యుతుడు
శక్తి ఆయుధ యుతుడు శరవణభవుడు
రక్తికి నాథుడు అనంగుడు, రతీ ధవుడు

భక్తికి గమ్యము బాణాసుర దైవము
యుక్తిగా మోక్షమిచ్చును యాదవ ప్రముఖుడు
పంక్తిని కూర్చుండబెట్టి కాచును రామభక్తుడు
అందరు మన దైవములు రక్షకులు మనకేల దిగులు
***********
సామానుతో నిండి ఉన్న గది మనసు.
సామానంతా తీసేసాక మిగిలి ఉండే ఖాళీ గది ఆత్మ. బ్రహ్మము.
**********
సతత పరిణామం

ఆగిపోయిన గడియారాన్ని చూస్తే
అదో ఇబ్బందికరమైన భావన
సాగిపోయే నౌక ఆగిపోయినట్టు
నీటి ప్రవాహం స్తంభించి పోయినట్టు

సాగిపోయే జీవితం ఆగిపోరాదు
తనివితీరా పాడే కోయిల మూగపోరాదు

విరిసే పువ్వులు మొగ్గగా ఉండిపోరాదు
మురిసే హృదయాలు ముకుళించుకు పోరాదు
సరసిని కమలములు విరుస్తూనే ఉండాలి
పీపిలు దోరలు పక్వములు పళ్ళు కావాలి

సూర్యుడు మనల చూచిపోతూండాలి
చందమామ కళలు అలానే అందాలు చిందించాలి
సముద్రపుటలలు పడిలేస్తూండాలి తీరాన్ని తాకుతూ 
ఉండాలి; తమకములు లేక తొందరలు పడక
యువతీయువకులు ఉండరాదు, సరస భావముల
కిందు మీదవుతూండాలి, మురిపాల మునిగి తేలాలి
సృష్టిని సాగుట జీవలక్షణము, ఆగుట
మరణ సూచకము; జీవనం సతత పరిణామం

No comments:

Post a Comment