Let us write books
Let us write books; verses; fiction. There are people who read; now and from later generations. I am now reading books composed centuries back; the Upanishads, the Panchatantra, the Ramayana, the Mahabharata, the Maha Bhagavatam and like. There is future to good books. Let us create literature. Multimedia can not drive away habit of reading books. Reading remains forever as Himalayas exist; Ganges flows and moon delights.
**************
రాజకీయం - రాజనీతి
ఉగ్రవాదులకు, దేశద్రోహులకు, సంఘ విద్రోహులకు మానవ హక్కులుండవు. తోటి మనుషులను ఊచకోత కోసేవారికి సభ్య సమాజంలో ఏవిధమైన హక్కులూ ఉండవు. వారు తోటి మనుషులు - దేశము - సంఘములను, నాగరికత, సంస్కృతి లను గౌరవించక, చేసే దారుణాలకు వారికి మరణ శిక్షయే సరియైవది.
వారికి ఇంటి అల్లుళ్ళలా మర్యాద చేయాలనడం కొందరి మానసిక వికృతి. వైకల్యము. దానవులైన వారి మానవ హక్కులను కాలరాయవచ్చు. క్రూరజంతువులకు జాలి చూపించాలనడం, రాక్షన సదృశుల పట్ల మర్యాద చూపాలనడం ఒక విధమైన మానసిక అనారోగ్యము.
నీతి, రీతి లేని ప్రవర్తనలు
అతి వెగటు పుట్టిస్తుంది.
మితి సర్వదా మంచిది. అయినా మితికి పరపతి లేదు.
మతి లేని మొగుడు, శ్రుతి లేని పాట లా జీవితాలు గడచిపోతున్నాయి. గతిలేని జతలేని బ్రతుకులు ఎక్కువైపోయాయి.

తోటి మనుషులను ఊచకోత
కోయాలనే మతము, సిద్ధాంతము, వాటిని ఆచరణలో పెట్టాలనుకునేవారు, అటువంటి
మృగసదృశులకు వత్తాసు పలికే వారు నిర్ద్వద్వంగా గర్హనీయులు. వీరెవరికీ సభ్య
సమాజంలో చోటు లేదు. చేటు కలిగించే వీరు కఠిన శిక్షార్హులు.
తప్పుడు మనుషులు, వారిని వెనకేసుకొచ్చేవారు సంఘానికి పట్టిన చీడపురుగులు. వారిని నిర్దయగా నిర్మూలించాలి. లేకపోతే సంఘంలో తోటి మానవులపై జరిగే దారుణాలకు అంతుండదు. క్రూరులను, నిర్దయగా వ్యవహరించేవారి పట్ల మర్యాద చూపాలనడం, వారికీ మానవహక్కులుంటాయనడం రాజకీయం కాని, రాజనీతి కాదు. దుష్టులను, దుర్మార్గులను ఉపేక్షించరాదు.
అలా చేయక పోతే, జరగక పోతే సంఘంలో శాంతి సౌఖ్యములు కాగడా వేసి వెతికినా కనిపించవు. సంఘం ఈ దుష్టస్వభావుల క్రూరత్వములకు అల్లల్లాడి పోతుంది. అంతా అల్లకల్లోలంగా ఉంటుంది.
అపాత్ర దానం ప్రమాదకారి.
***************
తప్పుడు మనుషులు, వారిని వెనకేసుకొచ్చేవారు సంఘానికి పట్టిన చీడపురుగులు. వారిని నిర్దయగా నిర్మూలించాలి. లేకపోతే సంఘంలో తోటి మానవులపై జరిగే దారుణాలకు అంతుండదు. క్రూరులను, నిర్దయగా వ్యవహరించేవారి పట్ల మర్యాద చూపాలనడం, వారికీ మానవహక్కులుంటాయనడం రాజకీయం కాని, రాజనీతి కాదు. దుష్టులను, దుర్మార్గులను ఉపేక్షించరాదు.
అలా చేయక పోతే, జరగక పోతే సంఘంలో శాంతి సౌఖ్యములు కాగడా వేసి వెతికినా కనిపించవు. సంఘం ఈ దుష్టస్వభావుల క్రూరత్వములకు అల్లల్లాడి పోతుంది. అంతా అల్లకల్లోలంగా ఉంటుంది.
అపాత్ర దానం ప్రమాదకారి.
***************
నీతి, రీతి లేని ప్రవర్తనలు
అతి వెగటు పుట్టిస్తుంది.
మితి సర్వదా మంచిది. అయినా మితికి పరపతి లేదు.
మతి లేని మొగుడు, శ్రుతి లేని పాట లా జీవితాలు గడచిపోతున్నాయి. గతిలేని జతలేని బ్రతుకులు ఎక్కువైపోయాయి.
యతి సదృశంగా మాట్లాడడం, మన్మథుడు రతి ఆదర్శంగా రసకేళులు జరపడం నిత్యకృత్యమైపోయింది.
నీతి, రీతి లేక ప్రవర్తించడం కుటీర పరిశ్రమ లా సాగుతోంది.
మమతలు పంచుకోని, సమతలు పెంచుకోని, తాతల మాటలు పెడచెవిని పెట్టే ధోరణులు ప్రబలిపోయాయి.
కలియుగమో, ప్రళయమాసన్నమగుచున్నదో బుద్ధిహీనతలు రాజ్యమేలుచున్నాయి.
మృతి ఆసన్నమైననూ హరినామ స్మరణ అరుదైనది.
ఆత్మజ్ఞానము వ్యాపార వస్తువైనది.
మోక్షము కరతలామలకమని నమ్మబలుకు ప్రకటనలు జారీచేయుచు ధనసంపాదన చేయువారు అధికులైరి.
నీలకంఠుని అర్చించువారు నల్లపూస అయిపోయిరి.
అమ్మలగన్నయమ్మ సురారులమ్మ పేర చేతివాటమధికమైనది.
జ్ఞానభక్తికర్మమార్గములు స్వార్ధస్వాముల కనుసన్నల మెలగుచున్నవి.
మతముల మతులు భ్రష్టు పట్టినవి
పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం - దృష్టి పథంలో లేవు.
వసుధైవకుటుంబకమ్ నానుడి మరచి పోయారు.
భేదములు తప్ప ఐక్యతలు రాజిల్లడం లేదు.
అంతయు వైష్ణవ మాయయో, భగవతీ సంకల్పమో తెలియుట లేదు.

No comments:
Post a Comment