అంతర్జాల మాధ్యమ సాంఘిక సాలెగూళ్ళు
మనందరం మన మన బాజాలు కొట్టుకుందుకు అంతర్జాల మాధ్యమంలోని సాంఘిక సంబంధ సాలెగూళ్ళను వాడతాము. రచయితలము, కవులము, నృత్య సంబంధీకులము, సంగీత ప్రముఖులము, సాంఘిక సేవాతత్పరులము, విదేశయానములు చేసేవాళ్ళము, అక్కడికెళ్ళి పిల్లలతో గడుపుతూ ఆ ఛాయాచిత్రాలను పంచేవాళ్ళము, అందమైన స్వ రచిత చిత్రములను, ఛాయాచిత్రములను, సందేశములను, జీవన, జీవితసత్యములను పంచేవాళ్ళము, స్వంత గుంపులను ప్రాంరంభిచేవాళ్ళము, స్నేహితులను చేర్చుకుని కారణం చెప్పా పెట్టకుండా, వాళ్శని ఇష్టా రాజ్యంగా తొలగించేవాళ్ళము, అడగకపోయినా మన ఇష్టాయిష్టములను చర్చకు పెట్టేవాళ్ళము, స్వోత్కర్ష అధికముగా చూపించే వాళ్ళము, ఇలా ఎన్నో తరహాల వ్యక్తులము కాలక్షేపం చేస్తున్నాము.

ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ప్రయాణిస్తున్నా, హాస్పిటల్ కు వెళుతున్నా,
హాస్పిటల్లో ఉన్నా, డిశ్ఛార్జీ చేసినా, ఠంచనుగా మవ హాజరు వేయించుకుంటూ,
ఇతరుల హాజరు గమనిస్తూ, ఏవేవో అరకొర మాటలు మాటాడుకుంటూ, మన సిద్ధాంత
రాద్ధాంతముల, గొడవల వ్యక్తీకరణలకు, ఇతరుల వ్యక్తీకరణల తక్షణ ఖండన మండనలకు
వాడుతూ ఎంతో హడావుడిగా ఉంటూ జీవితాలను వెళ్ళదోస్తున్నాము.
అంతర్జాల సాంఘిక సాలెగూళ్ళు ఎంతో సంఘసేవ చేస్తున్నాయి. నాలుగు రాళ్ళూ చేసుకంటున్నాయి. ఇంతటి కాలక్షేపము, వ్యవహారము, వ్యాపారము జరుగుచువ్న అంతర్జాల సాంఘిక సాలెగూళ్ళ మాధ్యమము ఒక పుస్తకము చదువుటలా, ఒక చలన చిత్రము చూచుటలా వినోద, విలాస, వికాస ప్రయోజనములు అందించుచున్నది.
ఈ కాలక్షేపము సత్ అవునా కాదా అనే మీమాంస అప్రస్తుతము, అనవసరము. ఆసక్తికరంగా ఇతరుల ప్రసక్తితో కొండవాగులా పడి లేస్తూ పయనిస్తూ జలపాతమై దూకుతూ హడావిడి పడుతూ, హడావిడి
చేస్తూ ఎందరినో కట్టిపడేస్తున్న ఈ కాలక్షేపానికి శుభాభినందనలు.

No comments:
Post a Comment