Tuesday, July 3, 2018

Fine-arts as career; డబ్బు ఖర్చు చదువురకరకాల జీవనాలు; ప్రకృతి నజరానాలు; అనవసర శ్రమలు; కత్తి గొప్పదా, కలము గొప్పదా?

Fine-arts as career
Livelihood problems are there to take fine-arts as career for the youngsters.
And our present life-styles are not congenial for the youngsters to get hooked.
They are not enthusiastic and are not ready to spend many years in learning and put up
rigid practice hours.
Still many youngsters are taking to fine-arts as career and are both giving joy to us by excellent performances and are continuing the tradition well.
********
డబ్బు ఖర్చు చదువు
"చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రీ"
అన్నాడు ప్రహ్లాదుడు విశ్వాసంతో, ఠీవిగా. ఇంతకూ అతను చదివిన చదువు విష్ణు పారమ్యము. తెలుసుకున్నది నారాయణుని సర్వ వ్యాపకత్వము. శ్రీహరి భక్తజనపరిరక్షణా కౌతుకము, దీక్ష.
దీనిని చదువు అంటే ఈనాడు ఎవరూ ఒప్పుకోరు. ఏదైతే ఉద్యోగాన్ని తెస్తుందో, అది మాత్రమే చదువు అని మనం సిద్ధాంతీకరించేసాము.
చదువు వివేకాన్ని పెంచాలి. వికాసాన్ని కలిగించాలి. మనల్ని మంచి మానవులుగా తయారుచేయాలి.
విజ్ఞత నేర్పాలి. ఇంగితం పెంచాలి. కరుణను హృదయాలంకారముగా చేయాలి. జీవకారుణ్యము
మనిషికి ఆభరణంగా అమర్చాలి.
భాషా, శాస్త్ర పరిచయం కలిగించి వాటిలో నిష్ణాతులను చెయ్యాలి. జ్ఞాన, విజ్ఞాన, పరిజ్ఞానములను కలిగించాలి. కుల, మత, ప్రాంతీయ దురభిమానాలను పక్కకు పెట్టి, తోటి మానవులను ఈ భేదాలకు అతీతంగా, ఆదరించేలా చేయాలి.
అలా చేయని చదువుకై వెంపర్లాడటం డబ్బు ఖర్చు మాత్రమే.
********
రకరకాల జీవనాలు
కాలక్షేపం బఠానీల కోసం కొందరు
కిందా మీదా పడుతూంటే;
నాలుగు వేళ్ళూ నోట్లోకి పోవడానికి
ఎందరో కిందా మీదా పడుతున్నారు
ప్రపంచంలో ముఖ్యావసరాలు తీరక
ఎందరో కష్టపడుతూ సతమతమౌతుంటే
కడుపునిండిన బేరంగా కొందరు కష్టాలు
"కొని తెచ్చుకుని" సతమతమౌతున్నారు
ప్రజలకు సేవ చెయ్యాలని కొందరు తమ ధన మాన ప్రాణాలు కుదువపెడుతూంటే; 
ప్రజలను మోసగించి, తమ ధన మాన ప్రాణాలు పరిరక్షించుకుంటూ అధికారం పొంది 
అక్రమంగా దోస్తున్నారు ఎందరో;
ప్రపంచంలో రకరకాల జీవనాలు;
పరాన్న భుక్కులు కొందరు; పరోపకార
పరాయణులు కొందరు; వింతగా ప్రజలు
మాత్రం పరాన్నభుక్కులకే పెద్దపీట వేస్తారు
గొఱ్ఱె కసాయిని నమ్మినట్లు ఇంకెవరినీ నమ్మదు; 
ఓటర్లు తమని ప్రలోభపెట్టే వారిని నమ్మినట్లు
మరెవరినీ నమ్మరు; అంతా మాయ, భ్రాంతి, భ్రమ
*********
కొన్న అన్నింటికీ మన పరిమిత జ్ఞానంతో రిపేర్ చెయ్యగలమా ఏమి? ఎన్నో ఆధునిక ఉపకరణాలు మన ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి. అవి పని చేయనని మొరాయించినపుడు మన ధన, మాన, ప్రాణములు పోయినా సరే, తల తాకట్టు పెట్టైనా సరే వాటి గురించి తెలిసిన జ్ఞాని దగ్గరకు వెళ్ళాల్సిందే!
*****
జ్ఞానము కన్నా సంతృప్తి గొప్పది. ముందు ఈ మాట ఒప్పుకుంటే, దృష్టి మారి, సంతృప్తి, సంతోషం వాటంతట అవే కలుగుతాయి.
********
ప్రకృతి నజరానాలు
మా చిన్నప్పుడు గోదావరికి వరద వచ్చినపుడు (వేగేశ్వరపురం, పశ్చిమగోదావరి, కొవ్వూరు, పోలవరాల మధ్యలో తాళ్ళపూడికి ఇటు పక్క గ్రామం, అటు పక్క ప్రక్కిలంక), ఆ నిండు గోదావరిని, దాని ఉరకలు, ప్రవాహం, నీటి ఉధృతి చూడడానికి వేయికళ్లు చాలేవి కావు. చిన్నతనం (12, 13 ఏళ్ళు) కాబట్టి ఇంతకు మించిన వర్ణన తెలియదు. దూరాన తూర్పు కనుమలు ఎంతో సుందరమైన దృశ్యాన్ని మనో ఫలకంపై ముద్రలు వేసేవి. నిండు గోదారిలో స్నానం చేసేవాళ్ళం కాదు.
గజ ఈతగాళ్లు ఆ ప్రవాహ ఉద్ధృతి లోకి వెళ్ళి దుంగలను తేవడం చూస్తూంటే భయంగా, థ్రిల్లింగ్ గా ఉండేది. అలా నిండు గోదావరిని చూడడం వర్షాకాలంలో మాకు సందడిగా ఉండేది. ఎఱ్ఱని నీరు, దేనినీ లెక్క చేయని ప్రవాహం, ఒడ్లని ఒరుసుకొని ప్రవహిస్తోంటే నయనానందకరంగా ఉండేది. గండి పడుతుందేమోనని భయం. అయినా గోదారొడ్డుకు వెళ్ళి ఆ కమనీయ దృశ్యాన్ని వరద ఉన్నన్ని రోజులూ తప్పని సరిగా సాయంకాలాలు చూసేవాళ్ళం. అదే గోదావరి శీతాకాలంలో ఏటి గట్టుకి దూరంగా, ఎక్కడో దిగువన క్రింద శాంతంగా, నిర్మలోదకంతో ఉండేది. మా ఈతల పాఠాలు అప్పుడు సాగేవి. పెద్ద కుఱ్ఱాళ్ళు
మా లాంటి పిల్లలని లోతుకు తీసికెళ్ళి వదిలేసే వారు.
మేం కొట్టుకు కొట్టుకు ఒడ్డుకు చేరేవాళ్ళం. మధ్యలో మునిగిపోబోతోంటే పెద్ద కుఱ్ఱాళ్ళు వచ్చి ఒడ్డుకు లాగేవారు. అలా నేర్చుకున్నదే మా ఈత. ఇలా ఈత నేర్చుకోవడం చాలా బాగుండేది.
గోదావరి ఒడ్డున నివసించడం ఒక వరం. ప్రకృతి ఇచ్చే నజరానాలు ఎన్నో పుచ్చుకోవచ్చు.
*********
అనవసర శ్రమలు
భగవంతుడన్ని చోటుల కలడని ఎల్లప్పుడూ కలడని తెల్సియు దుర్గమ మార్గముల దూరాభారములు సహించి, ప్రాణములు పణముగా పెట్టి తీర్థయాత్రలు చేయనేల, ప్రాణత్యాగాలు చేయనేల, భక్తులార!
మన ఊరిలోని మన గుడిలోని రాముడో, కృష్ణుడో శివుడో, విష్ణుమూర్తియో, అమ్మవారో, కొలువైయుండ
వారిని భక్తిపూర్వకముగ కొలువక, ఎందుకీ యాతనలు; ఫలమో, పత్రమో, పుష్పమో, తోయమో
మనస్ఫూర్తిగా అర్పించిన సంతసించి కోరికల తీర్చి కాచు మన ఊరి దేవుడుండ ఎందుకీ ఆయాసములు
మనసును మించిన పూజాద్రవ్యము లేదు
ఇష్టదేవతా స్మరణమును మించిన అర్చన లేదు
భగవత్ భజనను మించిన ప్రపత్తి, శరణాగతి లేవు
ఇంత సులువైన భగవదారాధనను ఎక్కడో చేయనేల
హృదయమున గోవిందుని నింపి
మనసే లలితాదేవికి మందిరమును జేసి
భక్తి నిండిన చూపులనే ఉదకముతో భోళా శంకరుని
అభిషేకించి తరించు విధములుండ ఏల ఈ శ్రమలు?
********
మన ఫొటోలకి, రాతలకి, గీతలకి, ఫేస్బుక్ వచ్చాకే గిరాకీ వచ్చింది.
*******
కత్తి గొప్పదా, కలము గొప్పదా? 
ఈ రోజుల్లో ఈ మీమాంస ఎవరికీ అక్కర్లేదు. అశుద్ధమైన నోరు ఎవరికి ఉంటుందో వారే గొప్పవారు. కులగజ్జి ఇంకా గొప్పది.
కుల బలంతో అవాకులు చవాకులు వాగడం అన్నిటికన్నా గొప్ప విషయం. రాజకీయ నాయకులు, మేధావులు, చిన్నా చితకా మనుషులు, మూర్ఖ శిఖామణులు, దరిద్రమైన నోరు కలవారు ఈ కుల బలంతోనే బతుకుతున్నారు. అందరి సున్నితత్వాలకూ ఎసరు పెడుతున్నారు.

నోటికి, రాతకి, మృగానికి, మనిషికి, రాతికి తేడా తెలియడం లేదు.

Sunday, July 1, 2018

అనవసరం; అతి తెలివి; మాయ; చిత్రాతిచిత్రం; Echoes of sense; Indian intellectual scene; నేను లేని ఉనికి; చల్లగ చూచు దైవము;చిరునామా లేని విజ్ఞులు ; ఫేస్బుక్

అనవసరం
మనం ఎన్నో సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ, ఉర్దూ, హిందీ, ఫ్రెంచ్, ఇంగ్లీష్ పదాలని డు, ము, వు, లు చేర్చి తెలుగు పదాలుగా చేసుకున్నాం. వీటీని అన్యదేశ్యములు అంటారు. ఇలా ప్రతి భాషలోనూ జరుగుతుంది. పరభాషా పదాన్ని డు, ము, వు, లు చేర్చి తెలుగు పదాలుగా వాడుకోవడమే. కృతకంగా పదాలను సృష్టించే శ్రమ పడడం అనవసరం. ఈ మధ్య చాలా మంది ఎంతో శ్రమించి ఆంగ్ల పదాలకి తెలుగు పదాలు సృష్టిస్తున్నారు. ఆ పదాలు కూడా ఎంతో పొడవుగా కొల్లేటి చాంతాడంత తయారవు తున్నాయి. ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండటం లేదు.
ఒక కుటీర పరిశ్రమలా పెట్టుకుని పదాలు తయారు చేసుకుంటున్నాము. అంత తతంగం, హడావుడి అనవసరం.
*********
హైందవ ధర్మం గురించి మాట్లాడేవారు కుప్పలుతిప్పలుగా తయారవుతున్నారు. అనుసరించే వారు కరువైపోతున్నారు.
*********
అతి తెలివి
సమాజంలో చాలా మంది ఒక భ్రాంతి లో ఉన్నారు. ఆ భ్రాంతి ఏమిటంటే, పెళ్లిచేసుకుంటే మంచి అంతా
మగవాడికే జరుగుతుందని, స్త్రీకి ఏమీ ఒరగదు అని. పెళ్లి మగవాడికే సౌకర్యం. స్త్రీ కి కాదు అని.
పెళ్ళయితే నా వాళ్ళనే వారు స్త్రీ కీ ఏర్పడతారు. కాని ఆ ఏర్పడడంలో ఆడదానికి ఏ విధమైన ప్రయోజనం లేదని చాలా మంది అపోహ. కాని ఈ నా వాళ్ళు చాకిరీ చేయించుకోవడానికి తప్ప మరెందుకూ ఉపయోగ పడరు అని విశ్వ తీర్మానం చేసేసారు.
పెళ్లి వల్ల స్త్రీ కి కొత్తగా ఏర్పడే మనుషులు మొగుడు, ఆ తర్వాత తనే కన్న తన పిల్లలు. అత్తమామలు, ఆడపడుచులు, బావలు, మరుదులు ఎవరూ ఉండరు ‌ రాకపోకలు కూడా సకృత్తుగా జరుగుతాయి. తోడికోడళ్ళతో కలిసి జీవించడం ఉండదు. ఇంట్లో ముసలాళ్ళెవరూ ఉండరు.
పెళ్లి మగవానితో సమానంగా స్త్రీ కి అవసరమే. బాధ్యతలు స్త్రీ కి ఎక్కువ అంటే ఇదివరకటి స్త్రీల జీవితాలతో పోలిస్తే బాధ్యతలు చాలా తక్కువ.
సౌకర్యాలు ఎంతో ఎక్కువ.
మానసిక ఆలంబన స్త్రీ పురుషులు ఇరువురికీ అవసరం. అది పెళ్లి ద్వారా మాత్రమే లభిస్తుంది. బాయ్ ఫ్రెండ్, సహజీవనం జరిపేవాడు మొగుడి కన్న తక్కువగా ఏం కష్టపెట్టరు. పెళ్ళి కాదనుకొని వారి మీద- బాయ్/గర్ల్ ఫ్రెండ్ మీద, సహజీవన వాసి మీద ఆధారపడడం అంత తెలివైన పని కాదు.
ఆర్ధిక లావాదేవీలు, ఆస్తి పాస్తులు (ఏమైనా ఉంటే) ఇతర సాంస్కృతిక, నాగరీకపు అలవాట్లు, పెళ్లి అనే బంధం అయినా మరే బంధమైనా, ఒకే ఇబ్బంది/సౌకర్యం కలిగిస్తాయి.
ఏ బంధమూ ఏర్పరచుకోక, ఆడదైనా, మగాడైనా జీవించాలనుకోవడం తెలివైన పని కాదు. పెళ్లి బంధం పురుషులతో పాటు సమానంగా స్త్రీలకు అవసరం. పెళ్లి వల్ల సుఖమంతా మగవానిది, బాధ్యతలు, చాకిరీ స్త్రీలదీ అనుకొని వివాహ బంధంలో ప్రవేశించక పోవడం అతి తెలివి.
********
మాయ
మాయా అంటే మానసిక శక్తి. మేధలో ప్రతిఫలించిన చిత్ శక్తి. చిత్ ఆభాసా! ఇది ఆత్మ జనితము. దీనికి స్వతంత్రమైన ఉనికి లేదు. ఉనికికై ఆత్మశక్తిపై ఆధారపడుతుంది. చిద్విభూతి.
యాా సా మాయా (ఏది లేదో అది మాయ) అనీ, యయా అసన్తమ్ పశ్యతి సా మాయా (దేని ద్వారా మనం అసత్ అయిన ఈ జగత్ ను చూస్తున్నామో, అది మాయ) అనీ మాయకు రెండు నిర్వచనములు.
మాయా మయమ్ ఇదమ్ జగత్ అంటే ఈ మాయచే (మానసిక శక్తిచే) నిర్మించబడిన జగత్ అని భావము. తలపుల వరుసయే జగత్. అంతఃకరణముల పరిణామాలే జగత్. మిథ్యా అంటే ఒక సారి ఉండి మరొక సారి లేనిది అని అర్థం.
లేదా అద్దంలో ప్రతిబింబం ఎలా మిథ్యయో (దానికి స్వతంత్రమైన ఉనికి లేదు, అది నిజమైనది కాదు), చిత్ శక్తి యొక్క మేధలో ప్రతిఫలనమే మాయా. మాయని మానసిక శక్తిగా తెలుసుకోవడం వల్ల మిథ్యా పదాన్ని ఏ అర్థం లోనైనా మనం తీసికోవచ్చు.
ఆచార్యుని బట్టి వ్యాఖ్యానాలు మారతాయి కాబట్టే "ఏకమ్ సత్ విప్రాః బహుధా వదంతి" అనే నానుడి వచ్చింది. వస్తువు ఒకటే, వ్యాఖ్యాతని బట్టి పారిభాషిక పదాలు మారతాయి.
*******
చిత్రాతిచిత్రం
అమ్మమ్మలు ఇంటిని నిర్వహించినట్లు అమ్మలు నిర్వహించలేదు.
అమ్మలు నిర్వహించినట్లు భార్యలు నిర్వహించడం లేదు. కూతుళ్ళు, కోడళ్ళు ఇల్లు, ఉద్యోగాల మధ్య నలగడం. రెండు పడవల మీద కాలు వేసి ప్రయాణం చేస్తున్నారు. ఇది ఎంతో శ్రమ, కష్టములతో కూడినది.
మనందరం ఇప్పుడొక నిర్ణయానికి వచ్చేశాము. ఉద్యోగానికి, ఇంటికి సమాన శ్రద్ధ చూపడం అసాధ్యం కనుక, ఉద్యోగంలో అశ్రద్ధ చూపిస్తే కుదరదు కాబట్టి ఇంటి విషయంలో ఆటూ, ఇటూ గా ఉంటున్నాము.
కొడుకులు, అల్లుళ్ళూ తమ వంతు సాయం చేస్తున్నారు. ఇల్లాలు, ఇల్లు పక్కకు తొలగి ఉద్యోగిని, ఆఫీస్ లకు చోటిచ్చాయి.
ఇప్పుడు గృహం, గృహిణి అనడం వెఱ్ఱితనం. ఎటొచ్చీ పసికందులకీ, ముసలి వగ్గులకి ఇంట్లో స్థానం లేదు. అందుకే పసికందులు క్రష్ లలో, ముసలి వగ్గులు వృద్ధాశ్రమాలలో కాలక్షేపం చేస్తున్నారు.
ఈ పురోభివృద్ధి సాధించి మనం ఏం సాధిద్దాము అనుకుంటున్నాం? మనకేమయినా తెలుసా?!
ఇంటిని, ఇల్లాలిని లేకుండా చేసికొని ఎంత పురోభివృద్ధి సాధించినా, సమానత్వం పొందినా మన జీవితాలు అస్తవ్యస్తంగా, అడ్డదిడ్డంగా తప్ప సజావుగా సాగవు.
రెండు తరాల మార్పులకే మన జీవితాలు అల్లకల్లోలంగా సాగడం ఆపుకోలేకపోవడం మన ప్రత్యేకత. ఈ మాట ఒప్పుకోవడానికి బదులు
ఇలా ఎత్తి చూపిన వారిని మాట్లాడనివ్వకుండా చేయడం నేటి సంస్కృతి.
నిజాన్ని ఒప్పుకోవడానికి అహాలు, సమానత్వం కేకలు, ఆర్ధిక స్వాతంత్ర్యం కబుర్లు ముందుకు వచ్చి
అడ్డొస్తాయి.
కుటుంబమే తానై సంఘాన్ని ఒక చక్కని కట్టడంలా
రూపొందించిన ఇల్లాలు ఇప్పుడు, ఇల్లాలు కాక పూర్వం నుంచే తన గురించి మాత్రమే తాను ఆలోచించుకోవాలని అందరు మేధావులు, స్త్రీ వాదులు నొక్కి వక్కాణిస్తున్నారు.త్యాగశీల, అనురాగ శీలి, ఇంటికి దీపాన్ని రకరకాల కారణాలతో ఆర్పేసి మనం సాధించేది పెద్దగా ఉండకపోవచ్చు.
కాని వింతల్లోకి వింత ఆ పాతకాలం ఇల్లాలిని మా అమ్మ మా అమ్మ అంటూ ఎంత పొగుడుతూ పోస్ట్లు పెడతారో నవ యువతులు. అంతా అయోమయం.
********
సావిత్రి అయ్యింది.
ఇప్పుడు సంజయ్ దత్.
కొంత కొంత విరామంతో, తెలిసీ జీవితంలో తమంత తాముగా మునిగిన నిర్లక్ష్యపు మనుషుల కోసం అంతర్జాల సాంఘిక మాధ్యమాల్లో హడావుడే హడావుడి. రామాయణ మహాభారతాలని కూడా ఇంత దీక్షగా ఎవరూ అనుసరించినట్లు లేదు.
గుడ్డిగా జీవించి అన్ని రకాలుగా జీవితాన్ని నాశనం చేసికున్న ఈ సినిమా వాళ్ళంటే జనాలకెందుకో ఇంత క్రేజ్!
********
Echoes of Sense

Words are linked to sense
In fact words are echoes of sense
Words pregnant with sense
Are sensitive, sensible and soothing
Words picture the world
World gets ruffled by words
Words are culture and civilization of Humans; words used reflect invidual's
Sophistication, knowledge, etticasy and scholarship; words are medicine to heart
Loving words are music to beloved
And her heart dances with joy and pleasure
Words repair hearts
Calm the minds, silence
The ongoing rustle within
Words are representatives of Lord;
Rather words are Divine themselves
*********
Indian intellectual scene

Scholarship is no longer celebrated in India, nor knowledge;
In India only the lives of celebrities are
Celebrated;
In India only backwardness is celebrated
Together with mediocrity;
Governments do not have any schemes
For the bright minded, brilliant citizens
Every one is asked to do business
No other profession is sparkling
Medical education has become exorbitantly costlier, mediocre
Students are buying seats putting
The healthcare of Indians in jeopardy
Spirituality, education and healthcare
Have become thriving businesses
Bringing up kids as responsible
Citizens is given a go by; instead
Every one is handed over a certificate
Despite poor learning by the individual
Society is cheating itself
None is sincere or responsible;
Like the politicians, criminals,
People crave for easy money
Making cheating and deception
National sports and traits for success
Unless knowledge is celebrated above
Doing business and earnings illegal;
No progress or peace reigns India
Love for nation is cultivated above all
**********

నేడు ఉన్నాను నేను
రేపు ఉంటానో లేదో తెలియదు
నా జ్ఞాపకాలే నా గతం
బాధలూ, వేదనలే తోడు
నా భవిష్యత్తు నా ఆందోళన,
భయం, నా ఊహాపోహలే;
ఈ గతం, భవిష్యత్తుల మధ్య నలుగుచూ
నేటిలో జీవించలేని బడుగు జీవిని
నా ఉనికి నా ఊహ
నా మరణం నా నిద్ర
నేను లేని ఉనికి
ఎఱుకయే శుద్ధ జ్ఞానం
శాంత మౌన
ఆనందపు
గమనిక
********
చల్లగ చూచు దైవము

కొండల నడుమ నదీ ప్రవాహాలు, కొండల అంచుల దూకు జలపాతాలు, ప్రకృతి సౌందర్యాలు
సముద్రపు ఒడ్లు, అలల రాక పోకలు 
అదో రకపు ఆనంద మగ్నత, సంతసము
మొగ్గలు విచ్చుటలు, మొగ్గులో దింపుటలు
ప్రకృతి ఆటలు; ఆకర్షణకు ఊటబావులు
శ్రావ్య సంగీతం పిట్టల గానం పసివారి బోసి నవ్వులు
ప్రేయసీ ప్రియుల రాగం, ప్రణయ సరాగం స్త్రీ పురుషులకు జీవం శృంగార భరిత రసాస్వాదనం
మేఘ సముదాయం కురియు వర్షము, చెట్లు అందించు ఫలములు, మొక్కలు పూయు పూలు
మన హృదయాహ్లాదకం సరస జీవనపు చిహ్నాలు
పచ్చని బయలు నును వెచ్చని ఎండ
పున్నమి వెన్నెల అన్నీ మన కోసమే
ప్రకృతి ఉనికి మన ఆస్వాదనకే
ఉపయోగానికే; ప్రకృతి మనకు
చెలి, మనల చల్లగ చూచు దైవము
*******
చిరునామా లేని విజ్ఞులు
రాజకీయ నాయకులు గాని, సినిమా రంగానికి చెందినవారు గాని లేకుండా మనకు ఏ విధమైన సభలు జరగవు.
ఏ సభకైనా మనం వాళ్ళను పిలవకుండా ఉండలేము. వాళ్ళూ తయారవకుండా ఉండలేరు.
ఇప్పుడు సినిమా వాళ్ళు రాజకీయాలలో చేరుతున్న నేపథ్యంలో వారే వీరు. వీరే వారు.
సంఘంలో మేధావులు, విజ్ఞాన శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, లలితకళాకారులు పొందలేని గౌరవాభిమానాలు రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు పొందుతున్నారు. మనం వంశ పారంపర్యంగా వాళ్ళని ఆరాధిస్తూ అభిమానిస్తున్నాం.
మనయొక్క ఇంతటి ఆదరాభిమానాలు పొందడానికి వారి ప్రత్యేకత ఏమిటో!
ఆధ్యాత్మిక వేత్తలు, తత్త్వవేత్తలు పొందలేని ఆత్మీయతలు ఈ రెండు వర్గాల వారు పొందుతున్నారు.
ఇదంతా చాలా విచిత్రంగా ఉంది. రాజకీయ నాయకుల అధికారం, సినిమా వాళ్ళ ఆకర్షణ అంత గొప్పవి, ప్రభావితం చేసేవి అన్నమాట. సంఘంలో మేధావితనానికి, జ్ఞానానికి, లలిత కళలకు లేని ఆకర్షణ రాజకీయ నాయకులకు, సినిమా వాళ్ళకు మాత్రమే ఉండడం సంఘ ప్రగతికి, సంఘంలో సంస్కృతికి, సంస్కారానికి పెద్ద అవరోధంగా ఉంది.
వీరి ఇంద్రజాలం, మాయ సంఘంపై అమితంగా ఉండి, సామాన్యులైన వీరు అందలాలెక్కి మన్ని శాసించే స్థితిలో, స్థాయిలో ఉండడం సంఘ, దేశ దురవస్థలలో ఒకటి. సంఘంలో ఆదర్శ పురుషులు
ఇతర రంగాలలో ఉన్నా, వారికి చిరునామాలు, అభిమానులు లేకపోవడం మన సంస్కృతిని తెలియ జేస్తుంది. మన అభిరుచులు మనవి.
**********
ఫేస్బుక్ 

సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకోవడం అంటే ఫేస్బుక్ లాంటి వాటిలో జేరడం. ఆపైన ప్రపంచం లో ఏమి జరిగినా నెత్తీ నోరు బాదుకోవడం. గొప్ప సంఘ సంస్కర్తల్లా అన్ని అభిప్రాయాలు చెప్పెయ్యడం. ఆ తర్వాత మనం ఎందుకు కళవళ పడుతున్నామో తెలపకుండా, అందర్నీ సస్పెన్స్లో పెట్టి మరీ, సున్నితమైన మన మనసును సాంత్వన కోసం బజారులో పెట్టడం. విషయం తెలియక కొందరు వివరం అడిగితే మన స్నేహితులు వారిని కసురుకోవడం. జరిగిందీ, జరుగుతున్నదీ తెలియక అందరూ తెల్ల మొహాలేసి కిందా మీదా పడుతూంటే మనం మరింత వగచడం.
ఫేస్బుక్ సంఘటనలూ, డ్రామాలు నిజంగా ఒక ఫేమిలీ గొడవ లాగ ప్రసారం, ప్రచారం అవడం. ఖాళీగా ఉన్నవాళ్లంతా అందులో పాల్గొనడం. అంతా చిత్ర, విచిత్ర మాయాబజార్ ఫేస్బుక్ రామాయణం.


Thursday, June 28, 2018

హిందూ మతంలో లేని "హిందువులు"; ప్రగతి లేని జాతి; పెద్ద సిద్ధి; కవియన్న; మాటల గారడీ; ఎవరిని తప్పు పట్టాలి?; ప్రణవ రహస్యము; Wasteful Exercise

హిందూ మతంలో లేని హిందువులు
భారతదేశంలో అనేక వింతల్లో మరొక వింత. బయటి వాళ్ళందరూ హిందూ మతంలో శాఖలు అనుకుంటున్న ప్రముఖ cults మేము హిందూ మతం వాళ్ళం కాము అని నిర్ద్వంద్వంగా చెప్పినట్లు తెలియకపోవడం.
వీటిలో మొదటిది రామకృష్ణ మిషన్. వీరు 1984 ప్రాంతాల్లో జ్యోతి బాసు ప్రభుత్వం హిందూ మతానికి చెందిన స్కూళ్ళపై కొరడా ఝలిపించినపుడు తమది హిందూ మతం కాదని, తమది రామకృష్ణ మతమని చెప్పి మైనారిటీ స్టేటస్ పొందారు.
కొందరు వ్యక్తుల చుట్టూ ఏర్పడ్డ మరెన్నోcults కూడా తాము హిందూ మతం వారం కామని నిస్సంకోచంగా వెళ్ళడిస్తారు. వీరందరు ఉపనిషత్తులు, రామాయణ, భారతాలు వంటి ఇతర ఇతిహాసాలు, పురాణాలు, శంకరాచార్యులు వంటి వారు విరచించిన పుస్తకాలు, స్తోత్రాలపై మాత్రమే వ్యాఖ్యలు చేస్తూ, వ్యాఖ్యానాలు చేస్తారు. వారి ప్రచురణలలో 99.5 శాతం ఈ పుస్తకాల చుట్టే తిరుగుతాయి.
అలాగే కులం హిందూ మతంది, మతం మాత్రం బౌద్ధం, క్రైస్తవం వంటివి. ఇటువంటి వారు కోకొల్లలు.
నాస్తికులు ఎక్కువ మంది హిందూ కుటుంబాలకు చెందిన వారే. వీరు జనాభా లెక్కల ప్రకారం హిందూ కుటుంబాలకే చెందుతారు. నాస్తికులకు మతమే ఉండదు కదా!
ఇంక బాబాలు, స్వాములు, బాపూలు, అమ్మలు, ఇంకా ఇటువంటి వారు హిందువులు కారు. వారి cult ప్రవక్త "మతం" వారు. వీరందరూ హిందువులు గానే చెలామణి అయిపోతున్నారు.
హిందూ మతం మహోదధి. అది చెప్పేవి నమ్మేవారు, అనుసరించేవారే కాక; అందులోంచి శాఖల్లా వచ్చిన cults (మేము హిందూ మతానికి చెందము అని ఘోషించే వారు), నాస్తికులు (భారతదేశంలో హిందూ మతానికి చెందని వారిలో, ఇతర మతాలలో నాస్తికులు ఉండరు), కుల గజ్జి అంటిస్తూ మతం పేరెత్తని కులసంఘ నాయకులు అందరూ హిందూ మతాన్ని నిరసించే ప్రముఖులు, మేధావులు, శాస్త్ర వేత్తలు, పండితులు ఇందరూ ప్రభుత్వం లెక్కల్లో హిందువులే.
అంతా వింత. మిథ్య, మాయ, విచిత్రం.
**********
ప్రగతి లేని జాతి
భాషను సరిగా నేర్చుకోకుండా అందలాలు ఎక్కాలనుకునే జాతి ఏ ప్రగతి సాధించలేదు.
ఏదో విదేశీయులు కనిపెట్టి పెడుతున్నారు కాబట్టి ఈ సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఎంజాయ్ చేస్తున్నాం. ఎన్నో ఆధునిక ఉపకరణాలు, సౌకర్యాలు అనుభవిస్తున్నాం. మనమంటూ కనిపెట్టినది ఏమీ లేదు.
ఎందరో విద్యాధికులకు తెలుగులో రాస్తూ ఉంటే ఎక్కడ యే"థ" రాయాలి, ఎక్కడ "ధ" రాయాలి తెలియదు. దీనికి అదీ దానికి ఇదీ రాసి అయిందని పిస్తున్నారు. అలాగే ఎన్నో పదాల్లో సంశయాలు, తప్పులేకుండా రాద్దామనే శ్రద్ధ, ఆసక్తి, మాతృభాషపై
ఏవిధమైన ప్రేమ, గౌరవం లేక ఇచ్చవచ్చినట్టు రాయడం మామూలైపోయింది.
ఇదంతా జాతిలోని నిర్లక్ష్యం, పొగరుమోత్తనం, అశ్రద్ధ, అనాసక్తి, దేనినీ సీరియస్ గా తీసుకోకపోవడం లను తెలియజేస్తుంది. మన వ్యాపారాలు, వ్యవహారాలు
డబ్బులు తెస్తున్నాయి. ఆధునిక జీవితాన్ని అందిస్తున్నాయి. ఏది ఏమైనా మనకి ఎందుకు? అనవసరం అనే దృష్టితో జీవిస్తున్నాం.
విశ్వవిద్యాలయాలలోనే పరిణితి, పరిపక్వత లోపించాయి. జాతిని నడిపే మేధావులు లేకుండా పోయారు. మేధావులని పేరు పొందిన వారు ఏదో మత లేదా కుల లేదా వాద లేదా సిద్ధాంత ప్రియులై ఉంటారు. వారి ఆలోచన ఆ సంకుచిత్వాన్ని దాటలేదు. దాటే ప్రయత్నమూ చేయలేరు.
ఎంతసేపూ ద్వేష, విద్వేషాలతో కాగిపోతూ, ఊగిపోతూ ఉంటారు. అనైక్యతను, సంకుచితత్వాన్ని తప్ప సౌమనస్యము, సౌమ్యత చెప్పలేరు, పంచలేరు, పెంచలేరు.
ఇదంతా ఒక మాఫియా వ్యవహారం లాగ జరుగుతోంది.
జాతి సమైక్యత, సాంస్కృతిక వైభవం ఎవరికీ పట్టడం లేదు. ప్రభుత్వాలు, మేధావులు గీసుకున్న తమ తమ బరిలు దాటకుండా గడిపేస్తున్నారు. సామాన్య ప్రజలకు తమ దైనందిన జీవితం గురించి పట్టించుకునే సరికే సరిపోతోంది.
అంతా ప్రభుత్వ నిర్లక్ష్యం, అపరిపక్వత, అధికార నిరంకుశత్వం, మేధావుల సంకుచిత తత్త్వం జాతిని నిర్వీర్యం చేస్తున్నాయి.
*********
పెద్ద సిద్ధి
ఈ శరీరం కలిగి ఉండడమే ఒక పెద్ద సిద్ధి. ఈ శరీరంతో మనం ఎన్నో చేయగలం. ఎంతో పొందగలం.
రూపాలు, దృశ్యాలు చూడగలం. అన్ని రకాల ధ్వనులు వినగలం. ఎన్నో వాసనలు పీల్చగలం. ఎన్నో రుచులు ఆస్వాదించగలం. ఎన్నో రకాల స్పర్శలు అనుభవించగలం.
కాళ్ళు, చేతులు, ఇతర అవయవాలతో ఎన్నో పనులు చేయగలం.
మాట్లాడగలం.
భాషాధ్యయనం చేసి భాషా నైపుణ్యం చూపగలం.
మంచి సాహిత్యం సృష్టించగలం. లలిత కళలు ప్రదర్శిస్తూ మైమరచిపోగలం. ఇతరులను పరవశింప చేయగలం.
విజ్ఞాన శాస్త్రాలు సృష్టించి ప్రకృతిని అవలోకించి అర్థం చేసుకోగలం. ఎన్నో ఉపయోగకరమైన ఉపకరణాలు సృష్టించుకోగలం.
పునరుత్పత్తి చేయగలం. అనురాగం అందించగలం. పొందగలం; ఆత్మీయులందరికీ చూపించగలం, పంచగలం.
మంచి సాహిత్యం చదివి ఆనందించగలం. భాషలు, శాస్త్రాలు, సాంకేతికతలు, నేర్చుకుని, అవగాహన చేసుకోగలం. భగవత్ తత్వాన్ని అనుభవించి, వివరించగలం. పరమాత్ముని దర్శించగలం. పరమాత్మయే కాగలం.
కాలస్పృహ కలిగి ఉండగలం. కాలాతీతస్థితిని అనుభవించగలం. తెలివితో గమనించగలం. తెలివి కొల్పోయి సుఖంగా గాఢనిద్ర పోగలం. ఆ అనుభవాన్ని మెళకువ వచ్చాక ఆస్వాదించగలం.
కలలు కనగలం. కలలను సాకారం చేసుకోగలం.
ఇలా ఈ శరీరంతో ఎన్నో చేయగలం. అయినా కొందరు ప్రబుద్ధులు పూర్వకాలం నుంచి అణిమాది సిద్ధుల గురించి మాట్లాడుతూ కలవర పడి, కలవరపెట్టి ఏమీ సాధించకుండానే పోయారు.
భగవంతుడు ఈ శరీరం రూపంలో ఇచ్చిన పెను సిద్ధిని నిర్లక్ష్యం చేసి, అది చేయగల ఎన్నో పనులను మరచి, శరీరాగ్యాన్ని పట్టించుకోక ఇంతటి ఐశ్వర్యంపై తీసువలసినంత శ్రద్ధ తీసుకోక అలమటిస్తాం. అంతా మాయ. అజాగ్రత్త. తెలివితేటల లేమి. భ్రమ, భ్రాంతులలో పడిపోయి, వాస్తవాన్ని విస్మరిస్తాము.
ఈ శరీరం మనకు వరం. ఈ శరీరం కలిగి ఉండడం ప్రకృతి కృప. శరీరమాద్య ఖలు సాధనమ్ అనే సత్యాన్ని మరువక శరీరాన్ని శ్రద్ధగా చూసుకుందాం.
ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
*********
కవియన్న

కవియన్న ఉంగరాల జుట్టుండవలె
సిల్క్ లాల్చీ తొడగవలె బుజమున
షోల్డర్బ్యాగు వేలాడుచుండవలె
ఆవేశముగ మాట్లాడుచుండవలె
నాయకుడన్న ఖద్దరో సిల్కో చొక్కా తొడగవలె
ఉంగరము మెరయు చేతిలో సెల్ఫోనుండవలె
వేగముగ నడచుచు వందిమాగధులు వెంటరాగ
నడచిపోవుచూ చేతులు తిప్పుతూ హామీలు
గుప్పింపవలె, ప్రతపక్షముల ఏకి పారేయవలె
జీన్స్ పాంట్ ఏదో మేచింగ్ ఫారిన్ మేడ్
షర్ట్ యువతీయువకుల కామన్ డ్రెస్ ఇది
ఇప్పుడు మేష్టర్ల తీరుతెన్నులు హావభావాలే
మారిపోయె; ధరించు దుస్తులు వారి ప్రత్యేకతను
సూచించలేకపోతున్నాయి; భరించు వెతలు
బతుకుల హరించి వేస్తూ ఉన్నాయి ముఖంలో
*********
మాటల గారడీ
పేదల, నిర్భాగ్యుల కడగండ్లు, కన్నీళ్లు పోగొట్టువారు తుడుచు 
వారు లేరు; వారికి వారే ఉద్యమించి తమ స్థితులు మార్చుకోవాలి; 
ఇతరుల నమ్ముట పసితనం

వారి కోసమే కవితలు వెలయించే సాహితీ స్రష్టలు 
తమ కీర్తి ప్రతిష్ఠలకై పేద బతుకులు గురించి రాస్తారు

వారి అభివృద్ధికి అభ్యున్నతికి కంకణం కట్టుకున్నామన్న నాయకులు 
ఓట్లు పడగానే పదవులు రాగానే బోర్డు తిప్పేస్తారు

ఎవరికీ ఎవరూ ఏమీ చేయలేరు చేయాలనీ
అనుకోరు; అంతా మాటల గారడీ, చేతలు హుళక్కి
**********
The profiles, postings and write-ups on social networking sites are giving an identity to most contributors on these sites. Writers, poets, literary people, persons from fine-arts are building their own images in tune with their abilities.
They are able to get an identity which was almost not possible in print and magazines' age.
Hats off to social networking sites and the followers.
***********
Unlearning and de-learning are a must to advance in spirituality. And then we relearn to enlîghten ourselves and finally bid good bye to all learning, knowledge, scholarship and even spiritual knowledge to attain spiritual living.
******
ఎవరిని తప్పు పట్టాలి?
చాలా మందికి ఆంగ్లభాష రాదు. అందుకని మనం ఆంగ్లం లో రాసిన విషయాలు వారు చదువలేరు. ఈ విషయంలో ఎవరిని తప్పు పట్టాలి?
చాలా మంది సాహితీ స్రష్టలకి ఆంగ్లభాష రాదు. అందుకని వారు ఆంగ్లభాషలో సాహితీ సృష్టి చేయలేరు. ఆంగ్లభాష తెలిసిన సాహితీ స్రష్టలు ఆంగ్లభాషలో రాస్తారు. వారు రాసినది అంతర్జాతీయంగా చదువుతారు. ఆంగ్లభాషలో రాయలేని సాహితీ స్రష్టలు ఆంగ్లభాషని, ఆంగ్లంలో రాసే సాహితీ స్రష్టలను భారతీయ భాషలకు, ప్రాంతీయ భాషల్లో వచ్చే సాహిత్యానికి అడ్డు అంటారు. దీనికి ఎవరిని తప్పు పట్టాలి?
ఆంగ్లభాష లో రాసేవారు భారతీయ భాషలలో సృష్టించబడే సాహిత్యం గొప్పతనాన్ని ప్రకాశించ నీయడం లేదు అంటారు.
అసలు సాహిత్యం ఏ భాషలో సృష్టించ బడ్డా వందనీయమే కదా! ఎందుకీ ప్రాంతీయ ధోరణులు,
సంకుచితత్వాలు?
అంతా మాయ. భ్రమ. భ్రాంతి.
**********
ప్రణవ రహస్యము
ప్రణవము ప్రాణ శక్తి.ఊపిరులు తీసేటప్పుడు ప్రభవించే నిశ్శబ్ద ఆత్మ శక్తి. ఆత్మ శక్తియే ప్రణవ శక్తికి మూలం. దీనిని స్వర శక్తి అనీ అంటారు.
ప్రణవంలోంచే ధ్వనులు, భాషలు, నాదము వచ్చాయి. నాదతనుమనిశం శంకరుని వాచకము ప్రణవము - తస్య వాచకః ప్రణవః - యోగ సూత్రాలు. మాటలు, సంగీతము ప్రణవ మయమే.
జగత్ కూడా ప్రణవమయమే. ప్రణవము ఆత్మశక్తి విభూతి. దానికే చిదాభాసా, మాయ, స్ఫోట, మిథ్యాహం అనీ పేర్లున్నాయి. ఇవన్నీ చిద్విభూతులే. చిద్విలాసాలే. చిదాత్మకములే. సచ్చిదానంద అవతారములే. చిత్ మయములే.
సత్-చిత్-ఆనందాత్మక మైన ఆత్మ నిరంజన స్థితిలో
పరమాత్మ; రంజన స్థితిలో జీవాత్మ. వ్యక్తిత్వ స్పృహ కలిగి ఉంటే జీవాత్మ. వ్యక్తిత్వ విస్మరణము, విరమణము అయితే మిగిలి వెలిగించేది, వెలిగించేది పరమాత్మ. జీవాత్మ వ్యక్తిత్వ స్పృహతో అను సంధానించ బడిన తలపుల, అనుభవముల సమూహము దృష్టిలోనికి వచ్చును. వ్యక్తి ఉనికికి సంబంధించిన భావముల కలగూరగంపయే జీవాత్మ.
మాయా మయమ్ ఇదమ్ జగత్, ప్రణవమయం ప్రపంచం అనేవి ఒకటే మాటలు. ఓంకారాన్ని మాత్రమే ప్రణవం అనడం, దాని మీద ఎన్నో వ్యాఖ్యానాలు, వ్యాఖ్యలు అసంపూర్తిగా అర్థం చేసికున్న వాళ్ళ అపార్థాలు. అపోహలు మాత్రమే.
ప్రణవం ఉపాసనా గమ్యం కూడాను. ప్రణవోపాసన అంటే ప్రణవ స్వరూపాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం. ధ్యాన పద్దతి.
*********
Religions, communities, rich and poor are inevitable once we get civilized, acquire knowledge, invent technology, do business, engaged in farming activity and are "cultural".
The origin and evolution of religion, community, nation, money, position and discrimination based on them are part of reality.
We can only cultivate our minds to transcend them. We can't wish away their presence, whatever damage they are causing to humanity and humaneness.
*******
Engaged in arguments continuously will not lead one anywhere. When arguing tendency decreases and attitude to understand develops then truth presents itself glowing.
Arguments help in finding truth (mostly they mask the truth, knowingly or unknowingly) but they must stop once understanding starts dawning.
Actually truth shines itself brilliantly once mind learns to un-twine itself from useless entanglements.
*********
ఆదర్శం-వాస్తవం
ఆదర్శాలు వేరు వాస్తవాలు వేరు. ఆదర్శం కలిగి ఉండడం చాలా తేలికైన పని. వాస్తవాన్ని ఔపోసన పట్టి, నడక గ్రహించి, నడత తగినట్లుగా మలుచు కోవడం ఎంతో మంది ఆదర్శవాదులకు చేతకాదు.
ఆదర్శాలను వల్లించడం శ్రమ కలిగించని పని. శ్రమిస్తే తప్ప ఆదర్శం వాస్తవంగా మారదు.
*********
Poetry is words of rhythm
Beauty of sense in series
*******
అంతిమ సత్యం 
అంతిమ సత్యం అన్ని మీమాంసలు, తర్కములు, వాదములు, ఇచ్ఛలు, ఆగిపోయి అహంకార మమకారములు అదృశ్యమైనపుడు వెలిగే వెలుగు. వ్యక్తి ఉనికి ఈ వెలుగును కప్పే ఆచ్ఛాదన. వ్యక్తిత్వం అనే తెర తొలగగానే కలిగే శాంతి, ఆనందములే అంతిమ సత్యం.
ఆ సమయంలో మనసు మౌనం వహించి ఉంటుంది.మానసిక కార్యకలాపాలు విరమింపబడి ఉంటాయి.ప్రజ్ఞానము గమనిక రూపంలో లేదా గమనించే తెలివి రూపంలో వెల్లి విరుస్తూ దృష్టి విశ్రాంతమై వ్యక్తిత్వ విస్మరణ జరిగి ఉంటుంది.



Friday, June 22, 2018

శ్రీ మహాలక్ష్మి; అనుచిత ప్రకటనలు; లోకములు; తెలియని స్థితి; దైవాధీనం బస్ సర్వీస్; దేవుడు; శరీరం

శ్రీ మహాలక్ష్మి
వెంకట రమణుని బింకపు రాణి,
క్షీరాబ్ధి కన్యక శ్రీ మహాలక్ష్మీ మనల
బ్రోచుగాక! ఐశ్వర్య విభవముల ఇచ్చుగాక!
అన్నమయ్య పురందర దాసులు మనపై
వాత్సల్యము చూపుదురు గాక! వారి ఇష్ట దేవత కమలవాసిని మనల సుసంపన్నుల చేయుగాక!
పురందర విఠ్ఠలుని ప్రణయ సామ్రాజ్ఞి రుక్మిణీ మాత
మనల సద్గుణవంతులను చేయుగాక! స్థిమితము
ఒసగుగాక! దివ్య దంపతులు మనల బిడ్డలవలె
అక్కున చేర్చుకుని ఆలనా పాలనా చూతురు గాక!
తల్లి అన్నం వస్త్రం ధాన్యం ధనం గోధనం పుత్ర పుత్రికల దయచేసి మనకు యశము, సుఖము, భాగ్యము కలిగించుగాక! నారాయణునిపై నిరతిశయ అనురాగమును మనసున నింపి ప్రపత్తినొందించు గాక!
మాధవి అలమేలు మంగ సౌందర్య నాయకి సౌమ్య
నాయకి పేరిందేవి అమృతవల్లి తాయారులు ఆమ్మలై కాతురుగాక!
**********
కింది కులాలు ఎదగడమంటే
కొన్ని కుటుంబాలు అలా 
తరతరాలుగా రిజర్వేషన్లు
అనుభవించడమా? మేధావులు
కుల పెద్దలు, సంకుచిత ఘనులు!
********
Very beautiful and serene; blue is the color of Lord Krishna and Divinity! Sky is vast and sea is deep, both are blue; so is Truth, both vast and deep..
*******
భారతదేశ ఓటర్లు, నాయకులు కులాల మించి పోలేరు. దురదృష్టవశాత్తు అందరి భారతీయుల జీవితాల్ని వీరే శాసిస్తున్నారు.
నాయక వర్గం వాళ్ళు ఫ్రీబీలు, రిజర్వేషన్లు విసిరి; ఓటర్ వర్గం వారు దానిపై ఆశపడీ.
*********
అనుచిత ప్రకటనలు

ఒక రకమైన షేవింగ్ క్రీమ్ రాసుకుని గడ్డం గీసుకుఃటే అమ్మాయిలు పక్కకి వచ్చి గడ్డం నిమురుతారు.
ఒక రకమైన టూత్ పేస్ట్ తో పళ్ళు తోముకుంటే అమ్మాయిలు పరవశించి పెదవులు కలుపుతారు.
ఇంక అవేవో లోషన్లు రాసుకుంటే ఏకంగా మీదే పడిపోతారు.
ఇలా చేసేది ఈ వ్యాపారస్తుల అమ్మాయిలా, ప్రకటన రూపొందించే వారి అమ్మాయిలా?
నాకు క్లారిఫికేషన్ కావాలి!
*********
Yoga is an individual engagement. Yoga is not a public event or demonstration.
And Yoga is not mere physical exercises.
Yoga also is cultivating the mind and not allowing it to trouble us unnecessarily.
********
లోకములు 

"లోక్యతే ఇతి లోకః"
చూడబడేది లోకము.
ఎవరి చేత, దేని చేత చూడబడేది లోకము? ఇక్కడ ఎవరిచేత అనేది వర్తించదు. దేని చేత మాత్రమే వర్తిస్తుంది.
అంతఃకరణముల చేత చూడబడేది లోకము.
మనోబుద్ధ్యహంకారచిత్తములు అంతఃకరణములు. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము లోకములు.
భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యమ్- అనేవి సప్తలోకములు.
సత్య లోకము తప్ప మిగతా లోకములు అంతఃకరణములచే చూడబడతాయి. సత్యలోకం
అనుభవింప బడుతుంది. సత్యమ్ అనుభవం.
సత్ స్థితి. చిద్రూపము. ఆనందమయం.
ప్రాచుర్యంలో ఉన్న పదునాలుగు లోకములు తత్త్వానికి సంబంధించినవి కావు. ఇవి తరువాతి కల్పనలు.
గాయత్రీ మంత్రం సూచించే సప్తలోకములు బ్రహ్మ జ్ఞానము, అద్వైతము, శాక్తాద్వైతము, ద్వైతము లకు సంబంధించినవి.
బ్రహ్మ జ్ఞానము అనుభవములు, తలపులు, గ్రహణలు, గ్రహింపులకు, ఉచ్ఛారణలకు సంబంధించినది.
అపార్థం చేసుకోవడంలో రంజనము ఉంది. అవగాహనలో శాంతి, సుఖము ఉన్నాయి.
**********
తెలియని స్థితి
సాహితీ తీర్థయాత్రలతో ఎప్పుడూ ఖాళీ లేకుండా అన్ని చోట్లకు తిరిగే సాహితీ స్రష్టలు; తమ తమ
సృష్టుల వినిపించి అలరించి కొనిపించి లబ్ధి పొందే
తెలివైన రచయితలు; సమూహముల క్రింద ఏర్పడి
పరస్పరము మెచ్చుకొని, బిరుదులిచ్చుకొను శ్రేష్ఠులు;
సంసార పక్షంగా రాసి ప్రాచుర్యమునకు, ప్రచురణకు
నోచుకోక తాము సాహితీ స్రష్టలు అవునో కాదో తెలియని కవి, రచయితా వతంసులు ఎందరో; వాదముల
వేడిలో తర్జన భర్జనలు, పొగడ్తలు, కించ పరచడాలు
ఏది కవనమో, ఏది తిట్టో, ఏది కథయో, ఏది వ్యథయో తెలియని సామాజిక స్పృహాతత్పర కతలు, సృష్టులు; అంతయు అయోమయముగ గోచరించు తెలుగు సాహితీ రంగము ఎవరి సాహితీ ప్రకటనలకు, నాట్యములకు రంగస్థలమో తెలియని స్థితి!
***********
దైవాధీనం బస్ సర్వీస్
మనం మెళకువగా ఉన్నా, పడుక్కుని ఉన్నా విమానం, రైలు, బస్, కార్ డ్రైవర్లు మెళకువగా ఉండి వాహనముల జాగ్రత్తగా నడిపి క్షేమంగా మనలను గమ్యస్థానాలకి చేరుస్తారు; ఒక సారి ఎక్కాక మన జాగ్రత్త, అజాగ్రత్తలతో ప్రమేయము ఉండదు అంతా వారి నిర్వహణలోనే నడుస్తుంది; అంతా వారి బాధ్యతయే
అటులనే పుట్టాక మన జీవన ప్రయాణం భగవంతుని
డ్రైవింగ్ లో నడుస్తుంది; మన జాగ్రత్త, అజాగ్రత్తలు
మన ప్రయాణ సంక్షేమంపై ఏవిధమైన పట్టూ కలిగి
ఉండవు; అంతా దైవాధీనం బస్ సర్వీస్లా నడుస్తుఃది
మన ఒప్పుకున్నా , ఒప్పుకోకపోయినా, నమ్మినా, నమ్మకున్నా, ఫలితం మారదు; మన సీట్లో మనం
బుద్ధిగా కూచుని, గడబిడ చేయక ప్రయాణం చేయడమే మన స్వేచ్ఛ; గ్రహిస్తే మంచిది, శుభకరం
**********
దేవుడు
దేవుడంటే మనకు మహిమలు చూపించే గారడీ వాడు కాదు; భగవద్దర్శనమంటే మన అర్చనా
మూర్తి చర్మచక్షువులకు కనిపించి ఏం కావాలని అడగడం కాదు; దేవుడంటే మన అడ్డమైన కోరికలూ తీర్చే కామధేనువో కల్పతరువో కాదు; భగవంతుడు
జ్ఞాని, తత్త్వవేత్త, గురువు, మిత్రుడు, తల్లి, తండ్రి!
*********
పుస్తకములు చదువుటలో మునిగి తేలి; మనసుని ఆహ్లాదపరచుకొని, వికసనమొందించుకొని
చేసిన జ్ఞాన సముపార్జన సద్వర్తనము లేక శోభించదు; రసస్ఫూర్తి కలిగించని కావ్యము వలె.
***********
శరీరం
ముసలితనాలు ఎలా మనుషుల రూపు రేఖలు మార్చేస్తాయో! వయసు గడచి వయసు దాటి
వయసు మీరి శరీరం నెమ్మదిగా శిథిలమౌతుందో!?
జవసత్త్వాలుడిగి జవ్వనము కరిగిపోయి అంతా
అదృశ్యమై నిగారింపు తగ్గి ముడుతలు పడిన
శరీరం; మనసున అనుభవములు నింపి తాను
నెమ్మదిగా జరాతప్తమై విశ్రాంతి కోరుకొను తోలుతిత్తి;
ఊపిరులు తీయుచున్నను రేపేమగునో తెలియదు;
శరీరమాద్య ఖలు ధర్మసాధనమ్ చెప్పినట్లు
అన్ని ధర్మములు, కార్యములు, కలాపములు
వ్యక్తి చేయుటకు పునాదియై కారణ భూతమై
వెలుగొంది వెలుగునిచ్చిన కొవ్వొత్తి కరిగి ఆరిపోవును
ఇంత చేసీ అంతా మిథ్య తలంచి చూచిన అనిపించును; శరీరమును శుష్కింప చేసుకొనుట
అధర్మము; ధర్మ సాధనము ఆరోగ్యం, జీవము
అశ్రద్ధ చేయరాదు; శరీరము లేక అంతయూ శూన్యమే

Tuesday, June 19, 2018

అంతర్జాల మాధ్యమాల్లో ఆపసోపాలు; ఊపిరి; గుదిబండ; పని - ఫలము; జడలో పూలు;

అంతర్జాల మాధ్యమాల్లో ఆపసోపాలు

మన తల్లితండ్రులు మనకి గొప్పే, ప్రపంచానికి కాదు కదా!? 
మన సంతానం కాకి పిల్ల చందంబున మనకి ముద్దే, 
కాని జనాలకి కాదు కదా!? మన ఉద్యోగం 
మన తిండి, గుడ్డల కోసం ప్రపంచోద్ధరణకు కాదు కదా!?

స్త్రీలైనా, పురుషులైనా తమ కోసం 
తాము బ్రతుకుతారు, జగత్సౌభాగ్యానికి కాదు కదా!?
మన గురించి డప్పు కొట్టుకోవడం ఎందుకు?
ఎవరి గొప్పలు వారివి; ఎంత చెట్టుకు అంత గాలి

అంతర్జాల మాధ్యమాల్లో ఆపసోపాలు పడుతూ
మన కీర్తి ప్రతిష్టలు పెంచుకోగలమా? ఎందుకనో 
ఎంత చెప్పినా మన నైపుణ్యాలు, కళాభినివేశాలు, 
పురస్కార ప్రదానాలు ఇతరులకు కావు ప్రధానాలు

స్త్రీలమైనా, పురుషులమైనా ఉద్యోగం చేయడం 
మన కోసం; జీవించేది మనకోసం; ఇతరులకిందులో శ్రద్ధా,
ఆసక్తి ఉండవు; మన వాళ్ళపై ఈ తాపత్రయం పడితే
పుణ్యము పురుషార్ధము; మిగతాదంతా శుష్కం శూన్యం
*********
ఊపిరి తీయడానికి ఉపకరణం

జీవించడానికే ఓపిక లేదు ఊపిరి తీయడానికి కూడా
ఉపకరణం కావాలేమో అన్నట్లు జీవిస్తున్నాం నీరసంతో
నాజూకు పెరిగిన మనుషులమై ఇంటి పనులే 
చేసుకోలేక పోతున్నాం పనిమనుషులూ మనంత 

నాజూగ్గా ఉండి సగం పనులు మనమే చేసుకునేలా చేస్తున్నారు; 
వంటకి గేస్, బట్టలకి వాషింగ్ మెషిన్, ప్రయాణానికి కారు
ఇంకా ఎన్నో ఉపకరణాలు మనకు అందుబాటులో
ఉన్నా అలిసిపోతున్నాం; ఉద్యోగంలో అలిసి ఇంటికి

చేరుకునే మనకి ఒక్కోసారి పీజాలు, బర్గర్లు, స్ట్రీట్
ఫుడ్ శరణ్యమౌతున్నాయి; ఇంట్లోనే ఉన్నా చేసికునే
ఆసక్తి, ఓపిక తగ్గిపోతున్నాయి; ఇది వరకు ఇళ్ళల్లో 
చేసుకునేవన్నీ ఇప్పుడు బజార్లో కొనుక్కుంటున్నాం;

అయినా ఏం చెయ్యాలన్నా శ్రమ పడలేక పోతున్నాం
మనిషికి ఎందుకో జీవించడానికే ఓపిక ఉండటం లేదు

అలసట మనసుదా? శరీరానిదా?
మనం ఓపికమంతులం ఇంక కాదా?
*********
గుదిబండ
ఆత్మహత్యలు చేసికొను ఆధ్యాత్మిక గురువులు
చెలియలతో కులుకు బాబాలు, సన్యాసులు, 
స్వాములు; పరిపాలన గాలికొదిలి సమ్మెలు, 
ధర్నాలు, దీక్షలు చేయు ముఖ్యమంత్రులు

కులాధారిత రిజర్వేషన్ల రద్దు వద్దను కులనిర్మూలన 
సంఘం నాయకులు; మత ప్రసక్తి లేని రాజ్యాంగము 
అనుచు మతాధార రిజర్వేషన్లు, మైనారిటీ స్టేటస్లు
కలిగించు రాజకీయ నాయకులు; అంతా స్వార్థ

సంకుచిత ఆగడములు; రాజ్యాంగం తెలియని
శాసనకర్తలు, ప్రభుత్వం బాధ్యతలు తెలియని
మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రతినిధులు;
నిధులు తీసుకుని వార్తలు వక్రించి వ్రాయు

పత్రికా రచయితలు, వారి కొమ్ముకాయు 
సంపాదకులు, యజమానులు; అందరూ
తమ తమ స్థానములందుండుటకు అనర్హులు;
భారతీయులు ప్రజాస్వామ్య పాలనమునకు అనర్హులు? 

మత దుర్వినియోగమునకు చిరునామాలు? 
తత్త్వం తెలియని నిరక్షర కుక్షులు;
పాలన తెలియని ప్రభుత్వాధినేతలు; అంతయు
శుష్కము, శూన్యము; అసమర్ధులు, అవినీతి 

పరులు, బాధ్యత తెలియని రౌడీ మూకలు
ప్రజాస్వామ్యం భారతదేశమునకు గుదిబండ
**********
ప్రజల సంక్షేమం ఎవరికీ అక్కర్లేదు. ఆ వంకతో తాము అందలాలు ఎక్కాలనే అందరి తపన, కోరికా!
********
మనం ఎంత చదువుకున్నా, రసజ్ఞత కొంచెమైనా అలవడపడకపోతే ఆ చదువంతా వ్యర్థం, నిరర్థకము అని పెద్దలు చెబుతారు.
***********
పని - ఫలము 

చదువుతో చనువు పెరగవలె జ్ఞానముతో;
సాధనతో సరిగమలు, రాగములు పట్టుబడవలె 
సంగీతాభ్యాసమున; మానినితో మనసు పొందు, 
యుతి కలుగవలె ప్రణయమున; శిక్షతో సిగ్గు 

కలుగవలె పెద్దమనిషికి; భక్షణము రుచితో మన
మనము గెలువ వలె; తక్షణమే భక్తి కలుగవలె
గోవింద నామ శ్రవణమున, మోక్షం, ముక్తి కలుగవలె
పంకజాక్షుని దివ్యనామ స్మరణమున ముముక్షువులకు
***********
జడలో పూలు లేవు జడయే లేదు;
స్త్రీ యన్న పురుషుని వలె కనుపింప 
వలెనని ధరించు దుస్తులు పురుషులవి వలే;
మాటలు, చేతలు మగతనము ఉట్టిపడునవియే

ప్రపంచమంతా పురుష ప్రవర్తన నిండిన
స్త్రీ ప్రత్యేకత ఏమి? పురుషుని అనుకరించుటయా?

ఒకరికి లేనివి ఒకరు కలిగి ప్రత్యుత్పత్తి చేయవలసిన
ఆడ, మగ, ప్రకృతి విడిచి ఇరువురొకే విధమైన పనిని
చేసిన, సంఘమున పసికందులు కలుగుటెట్లు? 
వారు ఆలనా పాలనా పొందుటెట్లు; 

ఎంత నాగరికత మార్చినా, 
చేయు పనులు, వహించు బాధ్యతలు 
సమమైన తరువాతి తరము తయారగుటెట్లు?
**********
ప్రేమ అంటే పరవశము ; పర వశము!. స్వ వశము కోల్పోకుండా "ప్రేమిస్తే" దానిని ఇంకో పదముతో సూచించాలి. వక్తిత్వ విస్మరణమే ప్రేమ, భక్తి, అనురాగము, ప్రణయము మొదలైనవి. ప్రేమలో పడ్డం గుడ్డిగా జరుగుతుంది. దానికి తర్కం ఉండదు. తెలివితేటలు ఉయోగించి ప్రేమిస్తే అది తెలివి తప్ప ప్రేమ కాదు. ప్రణయము అనే పదము ప్రాణము లోంచి వచ్చింది. ప్రాణ ప్రదమైన వాడు ప్రియుడు, ప్రేయసి. పంచ ప్రాణాలు ప్రియుడే, ప్రేయసియే.

Monday, June 18, 2018

అనాథ, వృద్ధాశ్రమ దర్శనములు; సారస్వత సేవ; Taste; అశ్రద్ధ; Rescuing Ourselves; ప్రేమ

అనాథ, వృద్ధాశ్రమ దర్శనములు
చాలా మంది సెలిబ్రిటీలు పండుగకీ, పబ్బానికీ అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి వెళ్లి ఎంతో హడావుడి చేస్తూంటారు. అదెంత వరకు అవసరం? అదెంత వరకు సమంజసం?
స్వంత తల్లిదండ్రుల దగ్గర కాకుండా, స్వంత పిల్లల దగ్గర కాకుండా పరాయి పంచన ఉండేవారు శాపగ్రస్తులే!
వృద్ధాశ్రమములలో ఉండేవారు మరణమునకై ఎదురుచూచు అభాగ్యులే, జీవచ్ఛవములే. మనిషి నాగరికత, సంస్కృతి రూపులు మారిన వేళ అభాగ్యులను వాళ్ళ మానానికి వారిని వదిలెయ్యడం మంచిది. మన చుట్టపు చూపులు, తాయిలాలు, గిఫ్ట్స్, సంరంభాలు, వారిని మరింత నిరాశ, నిర్వేదములలోనికి నెట్టుతాయి. 
*********
సారస్వత సేవ
ఇటు చూసిన కవియే, అటు చూసిన కవయిత్రియే అంతా కవితల కోలాహలం, కవితా సంపుటాల ఆవిష్కరణ హడావుడులు; నేల ఈనినట్లు రచయితలు, రచయిత్రులు, పుస్తకాల మేళాలు;
ఇంతటి ఇందరి సారస్వత సేవ 
ఎందరిని అలరిస్తోంది; ఎందరి
హృదయాలను వికసింపజేస్తోంది
బుద్ధిని గరపుతోంది జ్ఞానులను చేస్తోంది
ఎందరకు వారి వారి జీవనయానముల తోడు పడుతోంది; పిల్లల ఊహా, మేధా శక్తులను రంజింప చేస్తోంది; భారతమునకు పేరు ప్రఖ్యాతులు తెస్తోంది; రచయితలు, రచయిత్రులు దేశమునకు ఏమిటి? కవులు, కవయిత్రులు సంఘమునకు ఏమిటి?
అనువాద సాహిత్యమేది ఆనందమగ్నతలు మిథ్యా?
సేవ సారస్వతమునకా లేక స్వయంసేవా పథకమా?
పంచతంత్రము, రామాయణ, మహాభారత, భాగవతములతో సాటిగా జనులకుపయోగించు
రచనలేవి, కావ్యములేవి? మనోహరమై, రసపూర్ణమై,మనో రంజనం, మనో వికాసములు
కలిగించుటలేవి? అంతయు స్వ, పరస్పర పొగడ్తలు
*********
Coffee is tasty because of tongue
Just as youthful and beautiful girl
is so because of beholding by
youthful and aesthetic heart
Else a beauty can never become 
A thing or object or subject of joy
No transmission is successful unless there is reception; else the transmission becomes useless as moonlight shining
In a wild Forest; a girl is beautiful and sexy because the boys of youth and their stirring
Hormones creating pleasant harminies
Nature is responsible for every thing
Humans are part and parcel of nature
Expecting them to behave unnaturally
Is naive and childish; nature the Divine
**********
అశ్రద్ధ
అంతర్జాల సామాజిక సాలెగూళ్ళలో రాసే భాషపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు. వారు ఎంతో హుందాగా రాస్తున్న వర్ణక్రమదోషాలు వాళ్ళ వ్రాతలని చదివేటప్పుడు:
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు లాగా
పంటికింద రాయి, పానకంలో పుడక లాగా
అవస్థ పెడుతున్నాయి. చదవడం ముందుకు వెళ్ళడం లేదు. అలా రాసే వారికి తాము వర్ణక్రమ దోషం ఆచరిస్తున్నామని తెలియదు. తెలియ జేసినా పట్టించుకోవటం లేదు.
ఈనాటి విద్యార్థులు తాము చదువుకున్నది అర్థమైందా, నేర్చుకున్నామా అనేది పట్టించుకోనట్లు.
విద్యార్థుల వారి దృష్టి ఎంతసేపూ తాము సంపాదించబోయే ఉద్యోగం, తద్వారా రాబోయే డాలర్ల గురించే అయినట్లు, అంతర్జాల సామాజిక సాలెగూళ్ళలో తాము రాసిన దానిలో వర్ణక్రమ దోషాలు తద్వారా కలిగే అపార్థాలు పట్టించుకోకుండా, తమ పోస్ట్కు ఎంతమంది లైక్ కొట్టారు, కామెంట్ పెట్టారు ధ్యాసలో అందరూ పడిపోతున్నారు. పదాల అసలు వర్ణక్రమం ఏమిటి అనేదాని లోనే ఎన్నో భేదాలు, ప్రజాస్వామ్య బద్ధంగా
భాషా ప్రయోగాలు జరుగుతున్నాయి. వర్ణక్రమాలు నిర్ణయించబడుతున్నాయి.
పదంలో ఉన్నది తెలియక, థ యొ, ధ యొ తెలియక థ బదులు ధ, రాయడం ఎక్కువగా జరుగుతోంది. అలాగే ఎన్నో. భాషని, పదాలని శ్రద్ధగా నేర్చుకోక పోవడం వల్ల కలిగే ఇబ్బంది ఇది.
ఇలా దోషభూయిష్ఠమైన రచనలు ఇబ్బడి ముబ్బడిగా ఉండడానికి ఒక కారణం: ఫోన్లలో తెలుగు టైప్ చేయడంలోని ఇబ్బందులు కావచ్చు. రెండవది తాము చెప్పదలచుకున్నది అపార్థాలు కలగకుండా చెప్పామా లేదా అనేదాని మీద దృష్టి, శ్రద్ధ పెట్టకుండా, మరొక సారి చూసుకోకుండా పోస్ట్ చేసేయడం.
ఇలా చేయడం వల్ల ఎవరికీ ప్రమాదాలు జరగవు, ప్రాణాలు పోవు. కాని మన భాషపై మనకున్న అశ్రద్ధ తెలుస్తుంది. ఇలా వర్ణక్రమ దోషాలు రాసే వారిలో బాగా చదువుకున్నవారు, కవులు, కవయిత్రులు, రచయితలు, రచయిత్రులు కూడా ఉండడం అదోలా ఉంటుంది. చదువుకున్న వారికి, డిగ్రీలు కలవారికి, రచనలు చేసేవారికి భాషను నేర్చుకోవడంపై శ్రద్ధ లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం.
ఒకటికి రెండు సార్లు భాషను, వర్ణక్రమమును సరిచూసుకోవడం తోటిపాఠకులకు, స్నేహితులకు, తమవారికి మర్యాద చూపించడం. భాష పట్ల, సాహిత్యం పట్ల గౌరవం, అభిమానం, ప్రేమ, శ్రద్ధ, మమకారం చూపనేర్వక నలుగురి దృష్టిలో పడాలనుకోవడం ఈ వర్ణక్రమ, భాషా దోషాలను గమనించనియ్యదు.
శ్రద్ధ, పద, వ్యాకరణ జ్ఞానం ఉంటే పోస్ట్ చేశాక అయినా ఎడిట్ చేసుకోవచ్చు.
*********
Rescuing Ourselves
There is no dearth of religions which profess human welfare; and also of prophets whose sole desire is to provide peace and see well-being of humans.
We also have ideologies whose very presence is to uplift living of humans. And we have this and that sect, cult wedded to human welfare.
Why we still are languishing with all troubles? Somewhere something is wrong. If that wrong is not taken care of and right is not done, all these religions, sects, cults and ideologies will consume humanity. We have to rescue ourselves from this disaster.
*********
అమ్మా నాన్న లను ఆ దినములందు ఆకాశానికి ఎత్తేసి మామూలు రోజుల్లో మామూలుగా ఉండే సంస్కృతి దట్టమాయె; దీనిని ఆచరించేవారెందరో;
నిరసించేవారు కొందరు; అంతా అనుకరణ; నైజమే!
మనసుల్లో అభిమానాలు ఉంచుకొని, జీవితాన్ని శ్రద్ధగా జీవించు రోజులు మారి ప్రకటనలు ఎక్కువాయె; అనుబంధములు శుష్కమాయె;
ఆర్భాటాలు బడాయిలు ఇబ్బడి ముబ్బడాయె!
*********
ప్రేమ అంటే పరవశము ; పర వశము!. స్వ వశము కోల్పోకుండా "ప్రేమిస్తే" దానిని ఇంకో పదముతో సూచించాలి. వక్తిత్వ విస్మరణమే ప్రేమ, భక్తి, అనురాగము, ప్రణయము మొదలైనవి. ప్రేమలో పడ్డం గుడ్డిగా జరుగుతుంది. దానికి తర్కం ఉండదు. తెలివితేటలు ఉయోగించి ప్రేమిస్తే అది తెలివి తప్ప ప్రేమ కాదు. ప్రణయము అనే పదము ప్రాణము లోంచి వచ్చింది. ప్రాణ ప్రదమైన వాడు ప్రియుడు, ప్రేయసి. పంచ ప్రాణాలు ప్రియుడే, ప్రేయసియే.

Sunday, June 17, 2018

"Raping" Boys; అభివృద్ధి నిరోధకులు; మంచి కాలక్షేపం; స్త్రీ వాదులు;తలనొప్పులు; మురికి గుంటలు; పదాల అందం; సత్యాలు కాని ధోరణులు; వాస్తవం; తెలుగు - క్లాసికల్ లాంగ్వేజ్; ప్రకృతి ప్రకృతులు; Indian Polity;

"Raping" of boys
News of boys getting sexually assaulted by women has increased in frequency recently.
These "rapes" and sexual adventures on teen age boys are not able to churn the hearts and conscience of rights' champions or liberation movement stalwarts, women's clubs.
Why it is so? If it happens to girls we know the deafining noise made by all intellectuals and movement champions. The mental turmoil of the tender mind of a boy is equally hurting and painful as girls'
Are champions thinking boys are different from girls? Can we say men are different from women and let us not make any noise!
**********
మనం ఏం చెప్పినా వినేవారు వాళ్ళకు కావలసినది మాత్రమే వింటారు. మిగిలిన దానిలో ఎంత ఇంగితం, విజ్ఞత, వివేకం ఉన్నా పట్టించుకోరు.
అందుకే ఇన్ని ఉపయోగకరమైన సూక్తులు, గ్రంథాలు, ఇతిహాసాలు, తత్త్వాలు ఉన్నా ప్రజలు నానా అగచాట్లు పడడం సృష్ట్యాది ఆగలేదు.
***********
చిత్రకళ ఇచ్చును రూపు అచ్చముగ మనిషి వలె; చిత్రకారులు అపర బ్రహ్మలు. ముచ్చటైన కళాకారులు.
********
అభివృద్ధి నిరోధకులు
భారతదేశంలో ప్రస్తుతం పాదులేసుకున్న ప్రాచుర్యము కల వివిధ మతాధికారులకు, మత గురువులకు, మతానుయాయులకు నిష్పక్షపాతంగా మాట్లాడడం తెలియదు. తమ మతాన్ని ఆకాశానికి ఎత్తేసుకుంటారు. ఇతర మతాలను దుమ్మెత్తి పోస్తూ తీసిపారేస్తారు.
సహనము, సంయమనం, సంస్కారం ఆయా మతాలు వారికి నేర్పడం లేదు. భిన్నత్వంలో ఏకత్వం కావలసిన భారతదేశంలో ఈ మూఢత్వాలు, మూర్ఖత్వాలు పనికిరావు. ఈ గుంపులోకి సిద్ధాంత ప్రియులు, వాదముల ప్రియులు, కులగజ్జి గాళ్ళు, ప్రాంతీయ దురభిమానులు, ఉపజాతీయతా అనురాగులు చేరి సంఘంలోమరిన్ని సమస్యలు సృష్టించి సమాజంలో సుఖశాంతులు, సంతోషం లేకుండా చేస్తున్నారు. వీళ్ళందరూ ఇదంతా ఒక వృత్తిగా చేస్తున్నారు. లాభసాటి వృత్తిగా ఈ దుర్మార్గాన్ని మార్చారు. మనుషుల ఇబ్బందులలో తమ లాభాలు, సుఖాలు చూసుకుంటున్నారు.
వీరందరికీ బుద్ధి సూక్ష్మతలు అన్నీ ఉన్నాయి. కాని వాటిని దుర్వినియోగం చేసుకుంటున్నారు. తమ అజ్ఞానం, అరాచకం తమ ప్రవర్తనలో యథేచ్ఛగా, నిర్భయంగా, నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తున్నారు.
దేశానికి, పౌరులకూ వీరి దుష్ప్రవర్తన పెద్ద అవరోధంగా, తలనొప్పిగా, అభివృద్ధి నిరోధకంగా తయారైంది.
***********
పనీ పాటా లేనివారికి మంచి కాలక్షేపం
ఫేస్బుక్ లో ఈ మధ్య చాలా మంది సోమరులు తయారై పనీ పాటా లేక ఉన్నదీ, లేనిదీ పోగేసి, ఇంట్లో ఏ.సి. గదిలో కూర్చుని ప్రచారం, ప్రసారం చేస్తున్నారు. వాట్సాప్ మెసేజ్ లు ఇక్కడ, ఇక్కడ పోస్ట్ లు వాట్సాప్ కి తిరుగుతున్నాయి. ఆ పోస్ట్ లలోని నిజానిజాలు, ఆథెంటిసిటీ ఎవరికీ తెలియదు. పట్టదు. వచ్చింది వచ్చినట్లు ఓ నొక్కు నొక్కి పంపించామా లేదా.
అవి అందుకున్న వారు కిందా మీదా పడుతున్నారు; ఏది నిజం, ఏది కాదు, ఏది జరిగింది, ఏది కల్పన తెలియక చాలా చికాకు పడుతున్నారు. ఈ "అమ్మలక్కల కబుర్లు" అందరు చదువుకున్న వారు,
చిన్నా, పెద్దా భేదం లేకుండా అలా అలా వాళ్ళ వాళ్ళ స్మార్ట్ ఫోన్ లతో తోసేస్తున్నారు.
ఇది ఒక ఎలైట్ కల్చర్ అయిపోయింది. అలా రావడం, ఇలా తోసెయ్యడం జరుగుతోంది. పనీ పాటా లేనివారికి ఇదంతా మంచి కాలక్షేపంగా ఉంది.
********
విరుచుకు పడని మహిళా సంఘాలు స్త్రీ వాదులు
Wild ton, Fog, మొదలైన పురుషులుపయోగించే, స్త్రీలను శృంగార ప్రేరేపితులను చేసే లోషన్ ల ప్రకటనలు మన స్త్రీలను చాలా చంచల మనస్కులుగ, తేలికగా పరవశించి విచలితులై విరహాన్ని, కలయికను కోరుకునే వారిగా చూపుతున్నాయి.
కూతురు బాయ్ ఫ్రెండ్ పూసుకున్న లోషన్ ఆ అమ్మాయి తల్లిని విచలితను చేస్తోంది అని చూపించారు.
ఈ ప్రకటనదారులే ఆ అమ్మాయి వాడు పూసుకున్న లోషన్ ప్రభావంతో తండ్రి కన్ను గప్పి ఆ లోషన్ గాడితో కులికినట్టు చూపించారు.
ఇదివరకు ఇతర లోషన్ వాళ్ళు వివాహిత స్త్రీ మరొక లోషన్ పూతతో ఎంత విచలిత అయి వర్షంలోనే మనసెలా కోల్పోయి శృంగార పరవశ అయిందో చూపించారు.
ఇంకా పురుషుడు అది రాసుకుంటే పడని ఆడది ఉండదు అని క్లబ్ లో యువతులు మనకు తెలియజేస్తారు. ఒక ప్రకటనలో తల్లే కొడుకుని మగాళ్లు ఆ లోషన్ రాసుకోవాలి అని చెప్పి రాయించి పార్టీకి పంపుతుంది. ఒక యువతి ఒక యువకుని పై ఆ లోషన్ వల్ల మరులుగొని, ఆ యువకుడు వెళ్లి పోయినా, కార్పెంటర్ నుంచి ఆ వాసన గ్రహించి అతనిని కామిస్తుంది.
మరి ఫేస్బుక్లో గట్రా గళాలెత్తే మహిళా గణం, రచయిత్రులు, వనితా శిరోమణులు, ఎవరూ స్త్రీలను ఇంత "కాముకి" లుగా చూపించే ప్రకటనలపై ఎందుకు విరుచుకుపడరో అర్థం కాదు. స్త్రీ వాదులు అయిన మహిళల మౌనం మరీ ఆశ్చర్యం. కొందరు స్త్రీ వాదులు ఆ ప్రకటనల లోని స్త్రీలను liberated, cultured, civilized and elite women గా అనుకుని సంతోషంగానే ఉన్నారేమో తెలియదు.
అర్జున్ రెడ్డి వంటి సినిమాలను ఎంతో విజయవంతం చేసిన వారు, ఇదంతా ఇప్పుడు ఇంతే, ఇలాగే ఉండాలి, ఉంటుంది అనుకుంటున్నారేమో!
కాని ఇటువంటి స్త్రీలను లోషన్ పేరుతో చూపించి డబ్బులు చేసుకుంటున్న లోషన్ తయారుచేసే వారు; వాటికి ఇలా ప్రకటనలు రూపొందించే వారి intellectual and artistic freedom ఏమో అని వారు వారితోపాటు అందరూ ఊరుకున్నారేమో!
ఆధునికుల ప్రవర్తనలు, సంస్కృతి, నాగరికతా, భావసౌరభములు, ఆలోచనా ధోరణులు ఒక నిర్దుష్టమైన పద్ధతి పాటించని స్వేచ్ఛా విహారములేమో?
ఒక పక్కనుంచి పురుషుల నియంతృత్వాన్ని, వారు స్త్రీ లను బానిసలుగా, సెక్స్ వస్తువులుగా చూసే ధోరణిని ఎండగడతారు. స్త్రీ ని కాముకిగా చూపించే ఈ ప్రకటనల గురించి ఏ రకమైన నిరసన చూపరు. ఏమీ మాట్లాడరు.
ఇది women's liberation లో భాగం అనుకుంటున్నారో? అందరూ అలా అనుకోవాలో!?
ఏమైనా ఆడాళ్ళకు వీలైనప్పుడొకలాగ, వీలు కానప్పుడు ఒకలాగ ప్రవర్తించడం ఇష్టమేమో!
లేకపోతే ఇంత ఛిద్రమైన ప్రకటనలు చూపిచడాన్ని ఖండించక పోవడం వింతే! ఆశ్చర్యమే!
మగవాళ్ళని ఆడిపోసుకోవడం ఆపాలి స్త్రీలు; ఇప్పుడు వారు ఎలా చూపబడుతున్నారో, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకూ, వారి వారికి ఎంతవరకు తెలుసో, ఎవరైనా ఆలోచిస్తున్నారో లేదో రూఢి చేసుకోవాలి. ఇలా ఎంతవరకు జరుగుతోందో అనుమానమే. అసలు జరగటం లేదు అన్నట్లు ఉంది.
పురుషుల్లా తాగి తందనాలాడడం, వారిలా promiscuous గా ఉండడం లిబరేషన్ అని ఇప్పుడు ఎందరో భావిస్తున్నారు. నిజానికి మనకు ఏవిధమైన సంస్కృతి లేదు. నాగరికత అయోమయంగా ఉంది.
అటు సాంప్రదాయం నచ్చటం లేదు. ప్రత్యామ్నాయం ఘోరంగా ఉంది. ఈ విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. ఇన్నాళ్లూ ఆడవాళ్ళని అణిచుంచేశారు అనే మాట అటుంచి నేటి జీవనశైలిలో ఎవరు ఎలా ప్రవర్తించాలి అనే విషయం లోతుగా అధ్యయనం చేయవలసిన తరుణం ఆసన్నమైంది.
అబ్బాయిల జీవితాలు మరింత ఘోరంగా ఉన్నాయి. ఉద్యోగం లేదు. పెళ్లి కాదు. వాళ్ళ గురించి కూడా మేధావులు ఆలోచించాలి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడటం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నాం మనం. ఈ తీరు మారాలి.
అమ్మాయిలతో సమానంగా అబ్బాయిల్ని ప్రేమగా, ఆప్యాయంగా చూడకపోతే చాలా అస్తవ్యస్తంగా పరిస్థితి తయారవుతుంది.
**********
మన ఇంట్లో విషయాల గురించి, సంఘంలో విషయాల గురించి, దేశంలో విషయాల గురించి, ఏవి దాచాలి, ఏవి బయటకు చెప్పుకోవచ్చు తెలియని పౌరులు, రాజకీయ నాయకులు, మీడియా భారత దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.
ఇంగితం బొత్తిగా లేదు. ప్రపంచంలో, మిగతా దేశాల్లో, ఆంతరంగికంగా మన్ని మనమే లోకువ చేసికుంటున్నాం.
********
మనసుకు నచ్చినట్లు బ్రతకడం అత్యంత ప్రమాదకరం; వ్యక్తికీ, సమాజానికీ!
*********
మనందరం మన ప్రవర్తన గురించి ఇంత కూడా ఆలోచించకుండా, బేరీజు వేసుకోకుండా ఇతరుల ప్రవర్తనల మీద వ్యాఖ్యానాలు చేయడం చేస్తాం. దేనినైనా ఉపదేశించాలనే తాపత్రయంలో లక్షో వంతైనా మన గుణముల మీద, ప్రవర్తన మీద చూపించుకోగలిగితే ఎవరూ ఎవరికీ ఋజు మార్గం గురించి ఉపదేశాలు ఈయనవసరం లేదు. ఎవరిని వారే ఋజుమార్గ వర్తనులుగా చేసికోగలరు.
ఇతరుల తప్పులు, లోపాలు, పాపాలు ఎన్నే సమయంలో అవన్నీ మనలోనూ ఉన్నాయని గ్రహించి ఆ తప్పులు, లోపాలు, పాపాలు అవీ మనం పోగొట్టుకోవచ్చు.
*********
మనలో చాలా మందిమి ఇతరుల పోస్ట్లు చదవము. కాని మన పోస్ట్లు ఎంతమంది చూశారో, చదివారో మాత్రం ఆత్రంగా చూసుకుంటాం. ముఖ్యంగా కవులు, రచయితలు, విమర్శకులు అయినవారు ఈ పని ఎక్కువగా చేస్తూంటారు. దీనికి కారణం ఒకటి సమయం లేకపోవడం, రెండు శ్రద్ధ లేకపోవడం.
మన పోస్ట్ల మీద మనకి ప్రేమ ఉన్నట్లే ఎవరి పోస్ట్ల మీద వారికి అనురాగం ఉంటుంది. అంతర్జాల సాంఘిక మాధ్యమాలు వచ్చిన తర్వాత పోస్ట్ల ట్రాఫిక్ పెరిగింది. పత్రికలు మాత్రమే రాణీల్లా సారస్వత సృష్టి చేసేవారికి కొంత చోటు కల్పిస్తున్న రోజుల్లో మన సృష్టి అచ్చులో చూసుకోవడం గగనమై పోయేది.
ఇప్పుడు ఈ వెసులుబాటు కల్పించిన అంతర్జాల సాంఘిక మాధ్యమాలకు మంగిడీలు. కాస్త సాహితీ, ఇతర పఠనములు ఇతరుల పోస్ట్లల్లో చూద్దాం. ఉత్సాహపరుద్దాం.
***********
అనవసర తలనొప్పులు
ఫేస్బుక్ లో ఎందరో ఎన్నో విషయాలపై పిచ్చి భక్తి ఉన్న జనాలున్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో పిచ్చి.
వారితో మసలకుండా ఉండడం మంచిది. చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు.
వారితో నోరు కలిపితే మన ధన, మాన, ప్రాణాలు హరించుకు పోతాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది.
మన సంస్కృతి, నాగరికత, సున్నితత్వం, చదువు, జ్ఞానం, నైపుణ్యాలు ఛిన్నాభిన్నం చేయబడతాయి.
సంస్కారం ఉన్న జనాలు ఫేస్బుక్, ఇతర అంతర్జాల మాధ్యమాల్లో అరుదైపోతున్నారు. మనలాంటి వాళ్ళం ఆ మాటలు, కుసంస్కారం తట్టుకోలేము.
ఏ విషయం గురించైనా గోడ మీద పిల్లి వాటంలా పోస్ట్లు పెట్టడం తెలివైన పని. మనం అంతర్జాల సాంఘిక మాధ్యమాల్లోకి వచ్చేది కాస్త కాలక్షేపం కోసం. మనకి ఏమైనా కొన్ని నైపుణ్యాలుంటే అవి చూపించు కోవడానికి, కొందరు బాగుందన్నా, మురిసిపోవడానికి వస్తాము. మనం ఏ సమస్యలను పరిష్కరించలేము. చర్చించుకోగలం. కాని పోట్లాటలు పెట్టుకునే వారే తప్ప, చర్చించేవారు ఉండటం లేదు.
ఎవరి మట్టుకు వారికి వాళ్ళ కులం, మతం, ప్రాంతం, మాండలీకం, రాజకీయ పార్టీలు, నాయకులు, వాదాలు, సిద్ధాంతాలు, ఉపజాతీయతలు ఇష్టం. అవి కాదన్నవారిని చీల్చి చెండాడేస్తారు. ఎందుకొచ్చిన అలసట, పోట్లాటలు, అశాంతి మనకు?
మనయొక్క అన్ని గుణాలు, తింగరితనాలు, ఇష్టాయిష్టాలు మనతో తెచ్చుకొని, తీరికగా ఫేస్బుక్ లో వాద, ప్రతి వాదములలోకి దిగి సమయం వృథా చేసికొని బ్లడ్ ప్రెషర్, షుగర్ తెచ్చుకోవడం ఎందుకు? శుభ్రంగా మంచి పుస్తకాన్ని మన మంచం మీద హాయిగా పడుకొని ఠీవిగా చదువుకోక? మంచి శ్రావ్య సంగీతం వినక?
కాని ఇక్కడ పోట్లాటలు పెట్టుకోవడం, పోటీ పడడం కొందరికి వ్యసనం అయిపోయింది. వీళ్ళందరూ పేచీ కోరు మనుషులు. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత శాంతి, సుఖం.
*********
మురికి గుంటలు
ఎక్కడైతే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలుంటాయో అక్కడ
అభివృద్ధి ఉంటుంది.
ఎక్కడ నియంతృత్వం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది.
ఎక్కడ మితిమీరిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలుంటాయో అక్కడ దారిద్ర్యం తాండవం చేస్తుంది.
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలున్న సంఘం ప్రవహించే నది.
అలా కానిది నిలవనీరున్న మురికి గుంట. ఈ రోజుల్లో ఎన్నో మతాలు, సిద్ధాంతాలు, వాదాలు, ఉప జాతీయతలు ఇటువంటి మురికి నీటి గుంటలు.
*******
అదృష్ట విద్యుదయస్కాంత తరంగాలు మన జీవన సరళిని సమూలంగా మార్చేసాయి.
ఇంకా గుర్తు పట్టలేనంతగా మార్చేస్తాయి.
విద్యుదయస్కాంత తరంగాల వివర్తనము ( పురోధాన-తిరోధాన యుత వర్తనము - modulation - demodulation) మన అన్ని కమ్యూనికేషన్లలో ఉండే ముఖ్య చర్య.
ఈ చర్యయే బ్రెయిన్ తరంగాలకు జరిగి మన మానసిక కార్యకలాపాలు జరుగుతున్నాయి.
************
పదాల అందం
కొన్ని పదాలు మన మనసును ఆకట్టుకుంటాయి.
ఇవాళ ఒక శివస్తుతిలో శివుని "కరిమెడదొర" గా అనడం ఎంతో ఆకర్షించింది. ముద్దొచ్చింది.
అలాగే ఇంకో సందర్భంలో, "సిరిచూలు" పదం. మన్మథుని ఇలా అనడం కూడా నాకు ఎంతో ముచ్చటేసింది.
పదాలు భగవత్ పదాలు. భగవంతుని సంభాషణా పద్య పాదాలు. అన్ని పదములు పరమేశ్వర పదమును చేర్చేవే! పరమేశ్వరుని పాదముల కడకు చేర్చేవే!
అచ్చతెలుగు పదాలు మరింత చనువునిస్తాయి.
తేట తెనుగు ఇదే కదా. పదాలతో ఆడుకోవడం కవులకు ఎంతో సరదా.
వేటూరి సుందర రామమూర్తి గారి కిరాతార్జునీయం లో సగం అందం అచ్చతెనుగు పదాలదే.
అచ్చతెనుగు పదాలు తత్సమములతో సమానంగా అలరిస్తాయి. తిక్కన గారు అలతి అలతి పదములతో జాను తెనుగును మనకి అందించారు.
పోతన్న గారు చెప్పినట్టు, కొందరికి సంస్కృతం, కొందరికి తెనుగు, ఇష్టం. మనలాంటి వారికి రెండూ ఇష్టమే. ఏ పదమైనా ఆనందాన్నిస్తే అదే పదివేలు.
*********
సత్యాలు కాని ధోరణులు
ప్రస్తుతం సంఘంలో కొన్ని వింతలు సత్యాలు అయిపోయాయి.
అమ్మాయిలందరూ మంచి వాళ్ళు. బాధ్యతలు తీసి కుంటారు. ప్రేమలు కురిపిస్తారు. వాళ్ళ అమ్మలని తెగ పొగుడుతారు. వాళ్ళు మాత్రం అమ్మ బాధ్యతలు వాళ్ళమ్మల్లా స్వీకరించరు. తమ పిల్లల పెంపకం కూడా అమ్మకో, అత్తగారికో వదిలేస్తారు. ఉద్యోగం చేసే మగువలు ఉద్యోగాన్ని మించి ఏం చేయడానికీ సమయము ఉండదు. వారి అభివృద్ధికి ఇంటి పనులు గొప్ప అవరోధాలు.
అబ్బాయిలందరూ పొగరుబోతులు, చాలా మంది పనికిరాని నిరుద్యోగులు. ఏం చదివినా, ఎంత గుణవంతుడైనా నిరుద్యోగో, చిరుద్యోగో కనుక పెళ్ళి కాదు.
మగవాళ్ళు ఆడవాళ్ళని బానిసలుగా మాత్రమే చూడగలరు. సెక్స్ వస్తువుగా తప్ప మరోలా చూడలేరు.
అగ్రకులాల వారందరూ మిగతా అందరినీ అణచివేసే "దుష్టులు". నిమ్న కులాల వారు అణచివేతకు గురయ్యే బాధితులు.
ఈ పాచిపోయిన ఆలోచనా ధోరణి జాతిని బట్టి, కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, మతాన్ని బట్టి, ఉప జాతీయతలని బట్టి, లింగాన్ని బట్టి మనుషుల మంచి చెడ్డలు నిర్ణయిస్తోంది. ఈ లెక్కలో ఎంతవరకు నిజం ఉంది? ఈ లెక్కలు ఎంత వరకు సమంజసం? సమర్ధనీయం?
***********
వాస్తవం
ఒక జీవిత సత్యం నేను గమనించినది ఏమంటే: సమాజంలో చాలా మంది నిజాయితీగా ఉండి అన్నీ సాధించుకోవాలని అనుకోరు. ఆడ్డదార్లే వారికి ప్రియం. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, వారికి క్షుణ్ణంగా తెలుసు.
చెయ్యకూడని పనులు చేసి చక చకా పైకి వెళ్ళిపోవాలని అన్ని నియమాలు ఉల్లంఘిస్తారు.
అలా అనైతికంగా లాభపడాలనేది వారి నైజం. ఇది రాజకీయాల్లో, లంచాలు తీసుకోవడంలో, రౌడీతనంతో భూకబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించడంలో, ఆర్థిక నేరాలు, ఇతర దారుణాలు చేసి కోట్లకు కోట్లు నొక్కేయడంలో, వ్యాపారాల్లో అవకతవకలు చేయడం, తిమ్మిని బ్రహ్మిని చేయడం, ఇలా ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు చేసి ఆర్థికంగా, రాజకీయంగా, ఆస్తులు సంపాదించడంలో హస్త లాఘవం ప్రదర్శించి "గొప్పవాళ్ళై" పోవడం ఒక "కళ" గా మారింది.
నిజాయితీగా బ్రతికేవారు వెఱ్ఱి వాళ్ళు అనే ముద్రను ఎదుర్కుంటూ సంఘ‌ జీవనంలో ఎన్నో సవాళ్ళను, వడిదుడుకులను, కష్టాలనూ ఎదుర్కుంటూ జీవించ వలసి రావడం చాలా అన్యాయమైన విషయం.
వెధవ పనులు, అసాంఘిక కార్యకలాపాలు చేసేవారికి ఒకే ధైర్యం; తామెప్పటికీ పట్టుబడమనీ, ఒకవేళ పట్టుబడినా, తమ ధన, సంబంధ, బాంధవ్యాలతో బయటపడి, శిక్ష నుండి తప్పించు కోవచ్చని ధీమా. నమ్మకం.
అందుకని అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు నిర్భయంగా, నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా, పొగరుమోత్తనంతో అన్ని వెధవ పనులు సునాయాసంగా చేసి అచ్చోసిన ఆంబోతుల్లా స్వైరవిహారం చేస్తున్నారు. నీతిని, నీతిమంతుల్నీ మూర్ఖులుగా తీసిపారేస్తూ సమాజానికి ఎంతో అపకారం, అపచారం చేస్తున్నారు.
అన్ని రంగాల్లోనూ ఇటువంటి ఆషాఢభూతులదే పైచేయి. దుష్టులు, దుర్మార్గులదే రాజ్యం. ఏ మతం ఈ "పాపులని" ఏమీ చేయలేకపోతోంది. ఈ అసాంఘిక కార్యకలాపాలను నిలువరించ లేకపోతోంది.
మేధావులు ఇటువంటి చిన్న చిన్న పనికిరాని విషయాలను పట్టించుకోరు. వారి దృష్టియే వేరు.
ఎటోచ్చీ నిజాయితీ పరులైన పౌరులే అన్ని కష్టనష్టాలు భరించవలసి వస్తోంది. చాలా దురదృష్టకరమైన వాస్తవం.
********
తెలుగు - క్లాసికల్ లాంగ్వేజ్
ఒక సాహితీ ప్రభంజనాన్ని తెలుగు సాహిత్యంలో సృష్టించడం శ్రీ శ్రీ కి కుదిరినట్టు ఈ సమీపకాలంలో ఎవరికీ కుదరలేదు. దానికి కారణం ఆయన ప్రతిభా?
పరిస్థితుల ఆనుకూల్యతా? మార్క్సిజం తో అప్పటి కవుల, మేధావుల ప్రణయకలాపాలా?
శ్రీ శ్రీ, ఆరుద్ర, ఆత్రేయ ఇంకా ఎందరో పుర్రచేతి భావజాల ప్రియులు ఉండేవారు. సాహిత్య సృజనా, శ్రీ శ్రీ అంత శ్రద్ధతో, నిబద్ధతతో, ఆవేశంగా, చేసేవారు.
కాని ఆ విప్లవ శంఖారావం పూరించినది శ్రీ శ్రీ అనే చరిత్రకారులు నిశ్చయించారు. అరసం, విరసం, దిగంబర కవులు తరువాత ఆ ప్రభంజన ప్రభావాన్ని ఉపయోగించుకున్నారు. ఎన్నో కవితలు, కవితా సంకలనాలు వెలిశాయి.
ఇప్పటి కవితా సృష్టి సంగతేమిటి? దాని ప్రభావం సాహిత్యం మీద, తోటి కవుల మీద, సంఘం మీద ఏమిటి? కావ్య రచన వెనుకబడింది. కవితా రచనయే
పరమావధి అయింది. ఈ పుర్రచేతి భావాలు మరిన్ని వాదములకు జన్మనిచ్చాయి.
అవి అస్పష్టత, స్త్రీ, దళిత, ప్రాంతీయ, కుల, సిద్ధాంత ఛాందస వాదములుగా ఇంతై వటుడింతై అన్నట్టు పెరిగి తెలుగు సాహితీ మహారణ్యాన్ని పెంచాయి. పాఠకులు ఆ కాననంలో ఇరుక్కపోయి, దారీ తెన్నూ తెలియక అలమటిస్తున్నారు.
ఈ వాదముల విజృంభణ వల్ల కొన్ని సమూహములు తయారై కవితా రచనను, విమర్శను తమ గుప్పిట్లో పెట్టుకొని సాహితీ స్వరూపాన్నే మార్చేశారు. ప్రస్తుత ధోరణిలో తెలుగు భాషలో ఈ పరిమిత భావజాల ప్రభావం వల్ల అంతర్జాతీయ స్థాయి గల రచనలు రావడం దుర్లభం. దుర్గమము.
తెలుగు క్లాసికల్ లాంగ్వేజ్ అయింది. సాహితీ సృష్టి మాత్రం తదనుగుణంగా బ్రహ్మాండంగా లేదు. తెలుగు సాహితేవేత్తలు వాద సంకెళ్లను తొలగించుకొని సహజమైన సాహితీ సృష్టి చేస్తేనే తెలుగు క్లాసికల్ లాంగ్వేజ్ అవడం లోని ప్రాముఖ్యతను, ప్రసిద్ధిని ఉపయోగించుకోగలము.
ఈ విషయమై ఎంతో దృష్టి పెట్టి కార్యరంగంలోకి దూకవలసిన విశ్వవిద్యాలయములు, ఆచార్యులు కిమ్మనకుండా ఉన్నారు.
మిగతా సాహితీ ప్రక్రియలలో, ఇతర శాస్త్ర విషయ రచనలో (సాంఘిక, విజ్ఞాన మొదలైన శాస్త్రాలు)
పుస్తకాలు వెలువడినప్పుడే, చర్చలు జరిగినప్పుడే, అన్ని కళలు, శాస్త్రాలు, తత్త్వాలలో గ్రంథ రచనా వికాసం జరిగినప్పుడు తెలుగు క్లాసికల్ లాంగ్వేజ్ గా మరిన్ని వెలుగులు సంతరించుకుని, ఆ ప్రకాశాన్ని నలుదెసలా ప్రసరింపజేస్తుంది.
తథాస్తు!
*******
మనం అంటే అందరు ప్రకటన దారులకు ఒక చిన్న చూపు. సినిమా వాళ్ళ గురించి ఏం రాసినా, ఏం చెప్పినా ఎగబడతాం అని వారి నమ్మకం. అలాగే ఏ సెలిబ్రిటీల గురించి అయినా; మనలో చాలా మందిమి ఆ నమ్మకాన్ని ఏమీ వమ్ము చేయకుండా యథాశక్తి, కొండొకచో, సమయము కల్పించుకొని ఆయా ఘటనలను అనుసరిస్తాం. వేలం వెర్రి చూపిస్తాం.
**********
ప్రకృతి ప్రకృతులు
విదేశాల్లో పిల్లలు
స్వదేశాల్లో వృద్ధులు;
పొట్ట చేత పట్టుకుని
ఇదివరకు పట్టణాలకు
నగరాలకు వచ్చారు;
ఇప్పుడు దేశాలకు
తరలి వెళ్లుతున్నారు
తరం తరానికీ ఈ సమస్య
కొత్త కొత్త రూపులు దాలుస్తుంది
ఏది సుఖం? ఏది శాంతి?
ఆలోచించుకునే వ్యవధి
సావకాశం, భోగం లేవు
దైవాధీనం బస్ సర్వీసులా
దేశాలు పట్టిపోవడం; కావలసిన
అర్హమైన జీవితం స్వదేశంలో
లభించనపుడు మనిషికి వేరే దారి లేదు;
తరలివెళ్లడం మానవ సంఘాలలో మామూలే
కారణాలు ఎన్నో; తీరాలు దాటడం మాత్రం తప్పదు
వృద్ధాశ్రమంలో ఉన్నా సంతానం
అమెరికాలో ఉందని చెప్పుకోవడం
గర్వం; నలుగురిలో మెచ్చుకోలు
ఎవరిదీ తప్పు కాదు; వృద్ధాప్యం,
మరణం తేవడం ప్రకృతి ప్రకృతులు;
మన బ్రతుకులను అల్లకల్లోలం చేసే వికృతులు
********
Indian Polity

Indian politicians, intellectuals, media and voters
Disrupters of social fabric and integration of India and idea of India as a nation are arriving on the political scene as leaders and important persons of political parties.
And thus as politicians they are getting immunity with impunity though they are behaving as traitors and are engaged in all kinds of crimes.
The media and intellectuals are supporting having high disregard and disrespect for India as a nation. It would be very difficult for India to progress under these politicians.
But majority of voters are intending to support these self-serving and corrupt politicians for various affiliate reasons.
Well-intention ed counseling is falling on deaf ears and voters are hell-bent to vote for parties which promise them various freebies, reservations, special treatments and wily politicians are luring voters by exploiting their greed and faith.
Karl Marx and Indian Communists:
Karl Marx might have been forgotten in Germany, former Soviet Union, east European countries, Cuba, China, Vietnam, and other left ideology countries.
But in India he will never be forgotten. Contents of his book Das Kapital have become a religious book in India and his ism a cult. The cult-followers will perform the rituals as any other established religion of India. It has joined the comity of Indian religions.
*******
"Ignorance is bliss" - does not mean not knowing anything. It means - let us ignore all happenings in the sense of "I ignore you". When we are not unduly concerned about all these incidents of life, we will be peaceful and blissful with serene mind.
********
We are losing our individuality by excessively sharing the birth and death dates of not so famous or even famous persons. It is not our destined duty and ritual to be performed to mention their birth and death dates without fail.
Let us think about ourselves too. And it would be irritating to others if we share like that as a mere token of mention and formality. And never care to follow the great persons by imbibing their useful qualities.
*********