Sunday, June 17, 2018

"Raping" Boys; అభివృద్ధి నిరోధకులు; మంచి కాలక్షేపం; స్త్రీ వాదులు;తలనొప్పులు; మురికి గుంటలు; పదాల అందం; సత్యాలు కాని ధోరణులు; వాస్తవం; తెలుగు - క్లాసికల్ లాంగ్వేజ్; ప్రకృతి ప్రకృతులు; Indian Polity;

"Raping" of boys
News of boys getting sexually assaulted by women has increased in frequency recently.
These "rapes" and sexual adventures on teen age boys are not able to churn the hearts and conscience of rights' champions or liberation movement stalwarts, women's clubs.
Why it is so? If it happens to girls we know the deafining noise made by all intellectuals and movement champions. The mental turmoil of the tender mind of a boy is equally hurting and painful as girls'
Are champions thinking boys are different from girls? Can we say men are different from women and let us not make any noise!
**********
మనం ఏం చెప్పినా వినేవారు వాళ్ళకు కావలసినది మాత్రమే వింటారు. మిగిలిన దానిలో ఎంత ఇంగితం, విజ్ఞత, వివేకం ఉన్నా పట్టించుకోరు.
అందుకే ఇన్ని ఉపయోగకరమైన సూక్తులు, గ్రంథాలు, ఇతిహాసాలు, తత్త్వాలు ఉన్నా ప్రజలు నానా అగచాట్లు పడడం సృష్ట్యాది ఆగలేదు.
***********
చిత్రకళ ఇచ్చును రూపు అచ్చముగ మనిషి వలె; చిత్రకారులు అపర బ్రహ్మలు. ముచ్చటైన కళాకారులు.
********
అభివృద్ధి నిరోధకులు
భారతదేశంలో ప్రస్తుతం పాదులేసుకున్న ప్రాచుర్యము కల వివిధ మతాధికారులకు, మత గురువులకు, మతానుయాయులకు నిష్పక్షపాతంగా మాట్లాడడం తెలియదు. తమ మతాన్ని ఆకాశానికి ఎత్తేసుకుంటారు. ఇతర మతాలను దుమ్మెత్తి పోస్తూ తీసిపారేస్తారు.
సహనము, సంయమనం, సంస్కారం ఆయా మతాలు వారికి నేర్పడం లేదు. భిన్నత్వంలో ఏకత్వం కావలసిన భారతదేశంలో ఈ మూఢత్వాలు, మూర్ఖత్వాలు పనికిరావు. ఈ గుంపులోకి సిద్ధాంత ప్రియులు, వాదముల ప్రియులు, కులగజ్జి గాళ్ళు, ప్రాంతీయ దురభిమానులు, ఉపజాతీయతా అనురాగులు చేరి సంఘంలోమరిన్ని సమస్యలు సృష్టించి సమాజంలో సుఖశాంతులు, సంతోషం లేకుండా చేస్తున్నారు. వీళ్ళందరూ ఇదంతా ఒక వృత్తిగా చేస్తున్నారు. లాభసాటి వృత్తిగా ఈ దుర్మార్గాన్ని మార్చారు. మనుషుల ఇబ్బందులలో తమ లాభాలు, సుఖాలు చూసుకుంటున్నారు.
వీరందరికీ బుద్ధి సూక్ష్మతలు అన్నీ ఉన్నాయి. కాని వాటిని దుర్వినియోగం చేసుకుంటున్నారు. తమ అజ్ఞానం, అరాచకం తమ ప్రవర్తనలో యథేచ్ఛగా, నిర్భయంగా, నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తున్నారు.
దేశానికి, పౌరులకూ వీరి దుష్ప్రవర్తన పెద్ద అవరోధంగా, తలనొప్పిగా, అభివృద్ధి నిరోధకంగా తయారైంది.
***********
పనీ పాటా లేనివారికి మంచి కాలక్షేపం
ఫేస్బుక్ లో ఈ మధ్య చాలా మంది సోమరులు తయారై పనీ పాటా లేక ఉన్నదీ, లేనిదీ పోగేసి, ఇంట్లో ఏ.సి. గదిలో కూర్చుని ప్రచారం, ప్రసారం చేస్తున్నారు. వాట్సాప్ మెసేజ్ లు ఇక్కడ, ఇక్కడ పోస్ట్ లు వాట్సాప్ కి తిరుగుతున్నాయి. ఆ పోస్ట్ లలోని నిజానిజాలు, ఆథెంటిసిటీ ఎవరికీ తెలియదు. పట్టదు. వచ్చింది వచ్చినట్లు ఓ నొక్కు నొక్కి పంపించామా లేదా.
అవి అందుకున్న వారు కిందా మీదా పడుతున్నారు; ఏది నిజం, ఏది కాదు, ఏది జరిగింది, ఏది కల్పన తెలియక చాలా చికాకు పడుతున్నారు. ఈ "అమ్మలక్కల కబుర్లు" అందరు చదువుకున్న వారు,
చిన్నా, పెద్దా భేదం లేకుండా అలా అలా వాళ్ళ వాళ్ళ స్మార్ట్ ఫోన్ లతో తోసేస్తున్నారు.
ఇది ఒక ఎలైట్ కల్చర్ అయిపోయింది. అలా రావడం, ఇలా తోసెయ్యడం జరుగుతోంది. పనీ పాటా లేనివారికి ఇదంతా మంచి కాలక్షేపంగా ఉంది.
********
విరుచుకు పడని మహిళా సంఘాలు స్త్రీ వాదులు
Wild ton, Fog, మొదలైన పురుషులుపయోగించే, స్త్రీలను శృంగార ప్రేరేపితులను చేసే లోషన్ ల ప్రకటనలు మన స్త్రీలను చాలా చంచల మనస్కులుగ, తేలికగా పరవశించి విచలితులై విరహాన్ని, కలయికను కోరుకునే వారిగా చూపుతున్నాయి.
కూతురు బాయ్ ఫ్రెండ్ పూసుకున్న లోషన్ ఆ అమ్మాయి తల్లిని విచలితను చేస్తోంది అని చూపించారు.
ఈ ప్రకటనదారులే ఆ అమ్మాయి వాడు పూసుకున్న లోషన్ ప్రభావంతో తండ్రి కన్ను గప్పి ఆ లోషన్ గాడితో కులికినట్టు చూపించారు.
ఇదివరకు ఇతర లోషన్ వాళ్ళు వివాహిత స్త్రీ మరొక లోషన్ పూతతో ఎంత విచలిత అయి వర్షంలోనే మనసెలా కోల్పోయి శృంగార పరవశ అయిందో చూపించారు.
ఇంకా పురుషుడు అది రాసుకుంటే పడని ఆడది ఉండదు అని క్లబ్ లో యువతులు మనకు తెలియజేస్తారు. ఒక ప్రకటనలో తల్లే కొడుకుని మగాళ్లు ఆ లోషన్ రాసుకోవాలి అని చెప్పి రాయించి పార్టీకి పంపుతుంది. ఒక యువతి ఒక యువకుని పై ఆ లోషన్ వల్ల మరులుగొని, ఆ యువకుడు వెళ్లి పోయినా, కార్పెంటర్ నుంచి ఆ వాసన గ్రహించి అతనిని కామిస్తుంది.
మరి ఫేస్బుక్లో గట్రా గళాలెత్తే మహిళా గణం, రచయిత్రులు, వనితా శిరోమణులు, ఎవరూ స్త్రీలను ఇంత "కాముకి" లుగా చూపించే ప్రకటనలపై ఎందుకు విరుచుకుపడరో అర్థం కాదు. స్త్రీ వాదులు అయిన మహిళల మౌనం మరీ ఆశ్చర్యం. కొందరు స్త్రీ వాదులు ఆ ప్రకటనల లోని స్త్రీలను liberated, cultured, civilized and elite women గా అనుకుని సంతోషంగానే ఉన్నారేమో తెలియదు.
అర్జున్ రెడ్డి వంటి సినిమాలను ఎంతో విజయవంతం చేసిన వారు, ఇదంతా ఇప్పుడు ఇంతే, ఇలాగే ఉండాలి, ఉంటుంది అనుకుంటున్నారేమో!
కాని ఇటువంటి స్త్రీలను లోషన్ పేరుతో చూపించి డబ్బులు చేసుకుంటున్న లోషన్ తయారుచేసే వారు; వాటికి ఇలా ప్రకటనలు రూపొందించే వారి intellectual and artistic freedom ఏమో అని వారు వారితోపాటు అందరూ ఊరుకున్నారేమో!
ఆధునికుల ప్రవర్తనలు, సంస్కృతి, నాగరికతా, భావసౌరభములు, ఆలోచనా ధోరణులు ఒక నిర్దుష్టమైన పద్ధతి పాటించని స్వేచ్ఛా విహారములేమో?
ఒక పక్కనుంచి పురుషుల నియంతృత్వాన్ని, వారు స్త్రీ లను బానిసలుగా, సెక్స్ వస్తువులుగా చూసే ధోరణిని ఎండగడతారు. స్త్రీ ని కాముకిగా చూపించే ఈ ప్రకటనల గురించి ఏ రకమైన నిరసన చూపరు. ఏమీ మాట్లాడరు.
ఇది women's liberation లో భాగం అనుకుంటున్నారో? అందరూ అలా అనుకోవాలో!?
ఏమైనా ఆడాళ్ళకు వీలైనప్పుడొకలాగ, వీలు కానప్పుడు ఒకలాగ ప్రవర్తించడం ఇష్టమేమో!
లేకపోతే ఇంత ఛిద్రమైన ప్రకటనలు చూపిచడాన్ని ఖండించక పోవడం వింతే! ఆశ్చర్యమే!
మగవాళ్ళని ఆడిపోసుకోవడం ఆపాలి స్త్రీలు; ఇప్పుడు వారు ఎలా చూపబడుతున్నారో, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకూ, వారి వారికి ఎంతవరకు తెలుసో, ఎవరైనా ఆలోచిస్తున్నారో లేదో రూఢి చేసుకోవాలి. ఇలా ఎంతవరకు జరుగుతోందో అనుమానమే. అసలు జరగటం లేదు అన్నట్లు ఉంది.
పురుషుల్లా తాగి తందనాలాడడం, వారిలా promiscuous గా ఉండడం లిబరేషన్ అని ఇప్పుడు ఎందరో భావిస్తున్నారు. నిజానికి మనకు ఏవిధమైన సంస్కృతి లేదు. నాగరికత అయోమయంగా ఉంది.
అటు సాంప్రదాయం నచ్చటం లేదు. ప్రత్యామ్నాయం ఘోరంగా ఉంది. ఈ విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. ఇన్నాళ్లూ ఆడవాళ్ళని అణిచుంచేశారు అనే మాట అటుంచి నేటి జీవనశైలిలో ఎవరు ఎలా ప్రవర్తించాలి అనే విషయం లోతుగా అధ్యయనం చేయవలసిన తరుణం ఆసన్నమైంది.
అబ్బాయిల జీవితాలు మరింత ఘోరంగా ఉన్నాయి. ఉద్యోగం లేదు. పెళ్లి కాదు. వాళ్ళ గురించి కూడా మేధావులు ఆలోచించాలి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడటం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నాం మనం. ఈ తీరు మారాలి.
అమ్మాయిలతో సమానంగా అబ్బాయిల్ని ప్రేమగా, ఆప్యాయంగా చూడకపోతే చాలా అస్తవ్యస్తంగా పరిస్థితి తయారవుతుంది.
**********
మన ఇంట్లో విషయాల గురించి, సంఘంలో విషయాల గురించి, దేశంలో విషయాల గురించి, ఏవి దాచాలి, ఏవి బయటకు చెప్పుకోవచ్చు తెలియని పౌరులు, రాజకీయ నాయకులు, మీడియా భారత దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.
ఇంగితం బొత్తిగా లేదు. ప్రపంచంలో, మిగతా దేశాల్లో, ఆంతరంగికంగా మన్ని మనమే లోకువ చేసికుంటున్నాం.
********
మనసుకు నచ్చినట్లు బ్రతకడం అత్యంత ప్రమాదకరం; వ్యక్తికీ, సమాజానికీ!
*********
మనందరం మన ప్రవర్తన గురించి ఇంత కూడా ఆలోచించకుండా, బేరీజు వేసుకోకుండా ఇతరుల ప్రవర్తనల మీద వ్యాఖ్యానాలు చేయడం చేస్తాం. దేనినైనా ఉపదేశించాలనే తాపత్రయంలో లక్షో వంతైనా మన గుణముల మీద, ప్రవర్తన మీద చూపించుకోగలిగితే ఎవరూ ఎవరికీ ఋజు మార్గం గురించి ఉపదేశాలు ఈయనవసరం లేదు. ఎవరిని వారే ఋజుమార్గ వర్తనులుగా చేసికోగలరు.
ఇతరుల తప్పులు, లోపాలు, పాపాలు ఎన్నే సమయంలో అవన్నీ మనలోనూ ఉన్నాయని గ్రహించి ఆ తప్పులు, లోపాలు, పాపాలు అవీ మనం పోగొట్టుకోవచ్చు.
*********
మనలో చాలా మందిమి ఇతరుల పోస్ట్లు చదవము. కాని మన పోస్ట్లు ఎంతమంది చూశారో, చదివారో మాత్రం ఆత్రంగా చూసుకుంటాం. ముఖ్యంగా కవులు, రచయితలు, విమర్శకులు అయినవారు ఈ పని ఎక్కువగా చేస్తూంటారు. దీనికి కారణం ఒకటి సమయం లేకపోవడం, రెండు శ్రద్ధ లేకపోవడం.
మన పోస్ట్ల మీద మనకి ప్రేమ ఉన్నట్లే ఎవరి పోస్ట్ల మీద వారికి అనురాగం ఉంటుంది. అంతర్జాల సాంఘిక మాధ్యమాలు వచ్చిన తర్వాత పోస్ట్ల ట్రాఫిక్ పెరిగింది. పత్రికలు మాత్రమే రాణీల్లా సారస్వత సృష్టి చేసేవారికి కొంత చోటు కల్పిస్తున్న రోజుల్లో మన సృష్టి అచ్చులో చూసుకోవడం గగనమై పోయేది.
ఇప్పుడు ఈ వెసులుబాటు కల్పించిన అంతర్జాల సాంఘిక మాధ్యమాలకు మంగిడీలు. కాస్త సాహితీ, ఇతర పఠనములు ఇతరుల పోస్ట్లల్లో చూద్దాం. ఉత్సాహపరుద్దాం.
***********
అనవసర తలనొప్పులు
ఫేస్బుక్ లో ఎందరో ఎన్నో విషయాలపై పిచ్చి భక్తి ఉన్న జనాలున్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో పిచ్చి.
వారితో మసలకుండా ఉండడం మంచిది. చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు.
వారితో నోరు కలిపితే మన ధన, మాన, ప్రాణాలు హరించుకు పోతాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది.
మన సంస్కృతి, నాగరికత, సున్నితత్వం, చదువు, జ్ఞానం, నైపుణ్యాలు ఛిన్నాభిన్నం చేయబడతాయి.
సంస్కారం ఉన్న జనాలు ఫేస్బుక్, ఇతర అంతర్జాల మాధ్యమాల్లో అరుదైపోతున్నారు. మనలాంటి వాళ్ళం ఆ మాటలు, కుసంస్కారం తట్టుకోలేము.
ఏ విషయం గురించైనా గోడ మీద పిల్లి వాటంలా పోస్ట్లు పెట్టడం తెలివైన పని. మనం అంతర్జాల సాంఘిక మాధ్యమాల్లోకి వచ్చేది కాస్త కాలక్షేపం కోసం. మనకి ఏమైనా కొన్ని నైపుణ్యాలుంటే అవి చూపించు కోవడానికి, కొందరు బాగుందన్నా, మురిసిపోవడానికి వస్తాము. మనం ఏ సమస్యలను పరిష్కరించలేము. చర్చించుకోగలం. కాని పోట్లాటలు పెట్టుకునే వారే తప్ప, చర్చించేవారు ఉండటం లేదు.
ఎవరి మట్టుకు వారికి వాళ్ళ కులం, మతం, ప్రాంతం, మాండలీకం, రాజకీయ పార్టీలు, నాయకులు, వాదాలు, సిద్ధాంతాలు, ఉపజాతీయతలు ఇష్టం. అవి కాదన్నవారిని చీల్చి చెండాడేస్తారు. ఎందుకొచ్చిన అలసట, పోట్లాటలు, అశాంతి మనకు?
మనయొక్క అన్ని గుణాలు, తింగరితనాలు, ఇష్టాయిష్టాలు మనతో తెచ్చుకొని, తీరికగా ఫేస్బుక్ లో వాద, ప్రతి వాదములలోకి దిగి సమయం వృథా చేసికొని బ్లడ్ ప్రెషర్, షుగర్ తెచ్చుకోవడం ఎందుకు? శుభ్రంగా మంచి పుస్తకాన్ని మన మంచం మీద హాయిగా పడుకొని ఠీవిగా చదువుకోక? మంచి శ్రావ్య సంగీతం వినక?
కాని ఇక్కడ పోట్లాటలు పెట్టుకోవడం, పోటీ పడడం కొందరికి వ్యసనం అయిపోయింది. వీళ్ళందరూ పేచీ కోరు మనుషులు. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత శాంతి, సుఖం.
*********
మురికి గుంటలు
ఎక్కడైతే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలుంటాయో అక్కడ
అభివృద్ధి ఉంటుంది.
ఎక్కడ నియంతృత్వం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది.
ఎక్కడ మితిమీరిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలుంటాయో అక్కడ దారిద్ర్యం తాండవం చేస్తుంది.
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలున్న సంఘం ప్రవహించే నది.
అలా కానిది నిలవనీరున్న మురికి గుంట. ఈ రోజుల్లో ఎన్నో మతాలు, సిద్ధాంతాలు, వాదాలు, ఉప జాతీయతలు ఇటువంటి మురికి నీటి గుంటలు.
*******
అదృష్ట విద్యుదయస్కాంత తరంగాలు మన జీవన సరళిని సమూలంగా మార్చేసాయి.
ఇంకా గుర్తు పట్టలేనంతగా మార్చేస్తాయి.
విద్యుదయస్కాంత తరంగాల వివర్తనము ( పురోధాన-తిరోధాన యుత వర్తనము - modulation - demodulation) మన అన్ని కమ్యూనికేషన్లలో ఉండే ముఖ్య చర్య.
ఈ చర్యయే బ్రెయిన్ తరంగాలకు జరిగి మన మానసిక కార్యకలాపాలు జరుగుతున్నాయి.
************
పదాల అందం
కొన్ని పదాలు మన మనసును ఆకట్టుకుంటాయి.
ఇవాళ ఒక శివస్తుతిలో శివుని "కరిమెడదొర" గా అనడం ఎంతో ఆకర్షించింది. ముద్దొచ్చింది.
అలాగే ఇంకో సందర్భంలో, "సిరిచూలు" పదం. మన్మథుని ఇలా అనడం కూడా నాకు ఎంతో ముచ్చటేసింది.
పదాలు భగవత్ పదాలు. భగవంతుని సంభాషణా పద్య పాదాలు. అన్ని పదములు పరమేశ్వర పదమును చేర్చేవే! పరమేశ్వరుని పాదముల కడకు చేర్చేవే!
అచ్చతెలుగు పదాలు మరింత చనువునిస్తాయి.
తేట తెనుగు ఇదే కదా. పదాలతో ఆడుకోవడం కవులకు ఎంతో సరదా.
వేటూరి సుందర రామమూర్తి గారి కిరాతార్జునీయం లో సగం అందం అచ్చతెనుగు పదాలదే.
అచ్చతెనుగు పదాలు తత్సమములతో సమానంగా అలరిస్తాయి. తిక్కన గారు అలతి అలతి పదములతో జాను తెనుగును మనకి అందించారు.
పోతన్న గారు చెప్పినట్టు, కొందరికి సంస్కృతం, కొందరికి తెనుగు, ఇష్టం. మనలాంటి వారికి రెండూ ఇష్టమే. ఏ పదమైనా ఆనందాన్నిస్తే అదే పదివేలు.
*********
సత్యాలు కాని ధోరణులు
ప్రస్తుతం సంఘంలో కొన్ని వింతలు సత్యాలు అయిపోయాయి.
అమ్మాయిలందరూ మంచి వాళ్ళు. బాధ్యతలు తీసి కుంటారు. ప్రేమలు కురిపిస్తారు. వాళ్ళ అమ్మలని తెగ పొగుడుతారు. వాళ్ళు మాత్రం అమ్మ బాధ్యతలు వాళ్ళమ్మల్లా స్వీకరించరు. తమ పిల్లల పెంపకం కూడా అమ్మకో, అత్తగారికో వదిలేస్తారు. ఉద్యోగం చేసే మగువలు ఉద్యోగాన్ని మించి ఏం చేయడానికీ సమయము ఉండదు. వారి అభివృద్ధికి ఇంటి పనులు గొప్ప అవరోధాలు.
అబ్బాయిలందరూ పొగరుబోతులు, చాలా మంది పనికిరాని నిరుద్యోగులు. ఏం చదివినా, ఎంత గుణవంతుడైనా నిరుద్యోగో, చిరుద్యోగో కనుక పెళ్ళి కాదు.
మగవాళ్ళు ఆడవాళ్ళని బానిసలుగా మాత్రమే చూడగలరు. సెక్స్ వస్తువుగా తప్ప మరోలా చూడలేరు.
అగ్రకులాల వారందరూ మిగతా అందరినీ అణచివేసే "దుష్టులు". నిమ్న కులాల వారు అణచివేతకు గురయ్యే బాధితులు.
ఈ పాచిపోయిన ఆలోచనా ధోరణి జాతిని బట్టి, కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, మతాన్ని బట్టి, ఉప జాతీయతలని బట్టి, లింగాన్ని బట్టి మనుషుల మంచి చెడ్డలు నిర్ణయిస్తోంది. ఈ లెక్కలో ఎంతవరకు నిజం ఉంది? ఈ లెక్కలు ఎంత వరకు సమంజసం? సమర్ధనీయం?
***********
వాస్తవం
ఒక జీవిత సత్యం నేను గమనించినది ఏమంటే: సమాజంలో చాలా మంది నిజాయితీగా ఉండి అన్నీ సాధించుకోవాలని అనుకోరు. ఆడ్డదార్లే వారికి ప్రియం. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, వారికి క్షుణ్ణంగా తెలుసు.
చెయ్యకూడని పనులు చేసి చక చకా పైకి వెళ్ళిపోవాలని అన్ని నియమాలు ఉల్లంఘిస్తారు.
అలా అనైతికంగా లాభపడాలనేది వారి నైజం. ఇది రాజకీయాల్లో, లంచాలు తీసుకోవడంలో, రౌడీతనంతో భూకబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించడంలో, ఆర్థిక నేరాలు, ఇతర దారుణాలు చేసి కోట్లకు కోట్లు నొక్కేయడంలో, వ్యాపారాల్లో అవకతవకలు చేయడం, తిమ్మిని బ్రహ్మిని చేయడం, ఇలా ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు చేసి ఆర్థికంగా, రాజకీయంగా, ఆస్తులు సంపాదించడంలో హస్త లాఘవం ప్రదర్శించి "గొప్పవాళ్ళై" పోవడం ఒక "కళ" గా మారింది.
నిజాయితీగా బ్రతికేవారు వెఱ్ఱి వాళ్ళు అనే ముద్రను ఎదుర్కుంటూ సంఘ‌ జీవనంలో ఎన్నో సవాళ్ళను, వడిదుడుకులను, కష్టాలనూ ఎదుర్కుంటూ జీవించ వలసి రావడం చాలా అన్యాయమైన విషయం.
వెధవ పనులు, అసాంఘిక కార్యకలాపాలు చేసేవారికి ఒకే ధైర్యం; తామెప్పటికీ పట్టుబడమనీ, ఒకవేళ పట్టుబడినా, తమ ధన, సంబంధ, బాంధవ్యాలతో బయటపడి, శిక్ష నుండి తప్పించు కోవచ్చని ధీమా. నమ్మకం.
అందుకని అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు నిర్భయంగా, నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా, పొగరుమోత్తనంతో అన్ని వెధవ పనులు సునాయాసంగా చేసి అచ్చోసిన ఆంబోతుల్లా స్వైరవిహారం చేస్తున్నారు. నీతిని, నీతిమంతుల్నీ మూర్ఖులుగా తీసిపారేస్తూ సమాజానికి ఎంతో అపకారం, అపచారం చేస్తున్నారు.
అన్ని రంగాల్లోనూ ఇటువంటి ఆషాఢభూతులదే పైచేయి. దుష్టులు, దుర్మార్గులదే రాజ్యం. ఏ మతం ఈ "పాపులని" ఏమీ చేయలేకపోతోంది. ఈ అసాంఘిక కార్యకలాపాలను నిలువరించ లేకపోతోంది.
మేధావులు ఇటువంటి చిన్న చిన్న పనికిరాని విషయాలను పట్టించుకోరు. వారి దృష్టియే వేరు.
ఎటోచ్చీ నిజాయితీ పరులైన పౌరులే అన్ని కష్టనష్టాలు భరించవలసి వస్తోంది. చాలా దురదృష్టకరమైన వాస్తవం.
********
తెలుగు - క్లాసికల్ లాంగ్వేజ్
ఒక సాహితీ ప్రభంజనాన్ని తెలుగు సాహిత్యంలో సృష్టించడం శ్రీ శ్రీ కి కుదిరినట్టు ఈ సమీపకాలంలో ఎవరికీ కుదరలేదు. దానికి కారణం ఆయన ప్రతిభా?
పరిస్థితుల ఆనుకూల్యతా? మార్క్సిజం తో అప్పటి కవుల, మేధావుల ప్రణయకలాపాలా?
శ్రీ శ్రీ, ఆరుద్ర, ఆత్రేయ ఇంకా ఎందరో పుర్రచేతి భావజాల ప్రియులు ఉండేవారు. సాహిత్య సృజనా, శ్రీ శ్రీ అంత శ్రద్ధతో, నిబద్ధతతో, ఆవేశంగా, చేసేవారు.
కాని ఆ విప్లవ శంఖారావం పూరించినది శ్రీ శ్రీ అనే చరిత్రకారులు నిశ్చయించారు. అరసం, విరసం, దిగంబర కవులు తరువాత ఆ ప్రభంజన ప్రభావాన్ని ఉపయోగించుకున్నారు. ఎన్నో కవితలు, కవితా సంకలనాలు వెలిశాయి.
ఇప్పటి కవితా సృష్టి సంగతేమిటి? దాని ప్రభావం సాహిత్యం మీద, తోటి కవుల మీద, సంఘం మీద ఏమిటి? కావ్య రచన వెనుకబడింది. కవితా రచనయే
పరమావధి అయింది. ఈ పుర్రచేతి భావాలు మరిన్ని వాదములకు జన్మనిచ్చాయి.
అవి అస్పష్టత, స్త్రీ, దళిత, ప్రాంతీయ, కుల, సిద్ధాంత ఛాందస వాదములుగా ఇంతై వటుడింతై అన్నట్టు పెరిగి తెలుగు సాహితీ మహారణ్యాన్ని పెంచాయి. పాఠకులు ఆ కాననంలో ఇరుక్కపోయి, దారీ తెన్నూ తెలియక అలమటిస్తున్నారు.
ఈ వాదముల విజృంభణ వల్ల కొన్ని సమూహములు తయారై కవితా రచనను, విమర్శను తమ గుప్పిట్లో పెట్టుకొని సాహితీ స్వరూపాన్నే మార్చేశారు. ప్రస్తుత ధోరణిలో తెలుగు భాషలో ఈ పరిమిత భావజాల ప్రభావం వల్ల అంతర్జాతీయ స్థాయి గల రచనలు రావడం దుర్లభం. దుర్గమము.
తెలుగు క్లాసికల్ లాంగ్వేజ్ అయింది. సాహితీ సృష్టి మాత్రం తదనుగుణంగా బ్రహ్మాండంగా లేదు. తెలుగు సాహితేవేత్తలు వాద సంకెళ్లను తొలగించుకొని సహజమైన సాహితీ సృష్టి చేస్తేనే తెలుగు క్లాసికల్ లాంగ్వేజ్ అవడం లోని ప్రాముఖ్యతను, ప్రసిద్ధిని ఉపయోగించుకోగలము.
ఈ విషయమై ఎంతో దృష్టి పెట్టి కార్యరంగంలోకి దూకవలసిన విశ్వవిద్యాలయములు, ఆచార్యులు కిమ్మనకుండా ఉన్నారు.
మిగతా సాహితీ ప్రక్రియలలో, ఇతర శాస్త్ర విషయ రచనలో (సాంఘిక, విజ్ఞాన మొదలైన శాస్త్రాలు)
పుస్తకాలు వెలువడినప్పుడే, చర్చలు జరిగినప్పుడే, అన్ని కళలు, శాస్త్రాలు, తత్త్వాలలో గ్రంథ రచనా వికాసం జరిగినప్పుడు తెలుగు క్లాసికల్ లాంగ్వేజ్ గా మరిన్ని వెలుగులు సంతరించుకుని, ఆ ప్రకాశాన్ని నలుదెసలా ప్రసరింపజేస్తుంది.
తథాస్తు!
*******
మనం అంటే అందరు ప్రకటన దారులకు ఒక చిన్న చూపు. సినిమా వాళ్ళ గురించి ఏం రాసినా, ఏం చెప్పినా ఎగబడతాం అని వారి నమ్మకం. అలాగే ఏ సెలిబ్రిటీల గురించి అయినా; మనలో చాలా మందిమి ఆ నమ్మకాన్ని ఏమీ వమ్ము చేయకుండా యథాశక్తి, కొండొకచో, సమయము కల్పించుకొని ఆయా ఘటనలను అనుసరిస్తాం. వేలం వెర్రి చూపిస్తాం.
**********
ప్రకృతి ప్రకృతులు
విదేశాల్లో పిల్లలు
స్వదేశాల్లో వృద్ధులు;
పొట్ట చేత పట్టుకుని
ఇదివరకు పట్టణాలకు
నగరాలకు వచ్చారు;
ఇప్పుడు దేశాలకు
తరలి వెళ్లుతున్నారు
తరం తరానికీ ఈ సమస్య
కొత్త కొత్త రూపులు దాలుస్తుంది
ఏది సుఖం? ఏది శాంతి?
ఆలోచించుకునే వ్యవధి
సావకాశం, భోగం లేవు
దైవాధీనం బస్ సర్వీసులా
దేశాలు పట్టిపోవడం; కావలసిన
అర్హమైన జీవితం స్వదేశంలో
లభించనపుడు మనిషికి వేరే దారి లేదు;
తరలివెళ్లడం మానవ సంఘాలలో మామూలే
కారణాలు ఎన్నో; తీరాలు దాటడం మాత్రం తప్పదు
వృద్ధాశ్రమంలో ఉన్నా సంతానం
అమెరికాలో ఉందని చెప్పుకోవడం
గర్వం; నలుగురిలో మెచ్చుకోలు
ఎవరిదీ తప్పు కాదు; వృద్ధాప్యం,
మరణం తేవడం ప్రకృతి ప్రకృతులు;
మన బ్రతుకులను అల్లకల్లోలం చేసే వికృతులు
********
Indian Polity

Indian politicians, intellectuals, media and voters
Disrupters of social fabric and integration of India and idea of India as a nation are arriving on the political scene as leaders and important persons of political parties.
And thus as politicians they are getting immunity with impunity though they are behaving as traitors and are engaged in all kinds of crimes.
The media and intellectuals are supporting having high disregard and disrespect for India as a nation. It would be very difficult for India to progress under these politicians.
But majority of voters are intending to support these self-serving and corrupt politicians for various affiliate reasons.
Well-intention ed counseling is falling on deaf ears and voters are hell-bent to vote for parties which promise them various freebies, reservations, special treatments and wily politicians are luring voters by exploiting their greed and faith.
Karl Marx and Indian Communists:
Karl Marx might have been forgotten in Germany, former Soviet Union, east European countries, Cuba, China, Vietnam, and other left ideology countries.
But in India he will never be forgotten. Contents of his book Das Kapital have become a religious book in India and his ism a cult. The cult-followers will perform the rituals as any other established religion of India. It has joined the comity of Indian religions.
*******
"Ignorance is bliss" - does not mean not knowing anything. It means - let us ignore all happenings in the sense of "I ignore you". When we are not unduly concerned about all these incidents of life, we will be peaceful and blissful with serene mind.
********
We are losing our individuality by excessively sharing the birth and death dates of not so famous or even famous persons. It is not our destined duty and ritual to be performed to mention their birth and death dates without fail.
Let us think about ourselves too. And it would be irritating to others if we share like that as a mere token of mention and formality. And never care to follow the great persons by imbibing their useful qualities.
*********

No comments:

Post a Comment