Showing posts with label దేవుడు. Show all posts
Showing posts with label దేవుడు. Show all posts

Friday, June 22, 2018

శ్రీ మహాలక్ష్మి; అనుచిత ప్రకటనలు; లోకములు; తెలియని స్థితి; దైవాధీనం బస్ సర్వీస్; దేవుడు; శరీరం

శ్రీ మహాలక్ష్మి
వెంకట రమణుని బింకపు రాణి,
క్షీరాబ్ధి కన్యక శ్రీ మహాలక్ష్మీ మనల
బ్రోచుగాక! ఐశ్వర్య విభవముల ఇచ్చుగాక!
అన్నమయ్య పురందర దాసులు మనపై
వాత్సల్యము చూపుదురు గాక! వారి ఇష్ట దేవత కమలవాసిని మనల సుసంపన్నుల చేయుగాక!
పురందర విఠ్ఠలుని ప్రణయ సామ్రాజ్ఞి రుక్మిణీ మాత
మనల సద్గుణవంతులను చేయుగాక! స్థిమితము
ఒసగుగాక! దివ్య దంపతులు మనల బిడ్డలవలె
అక్కున చేర్చుకుని ఆలనా పాలనా చూతురు గాక!
తల్లి అన్నం వస్త్రం ధాన్యం ధనం గోధనం పుత్ర పుత్రికల దయచేసి మనకు యశము, సుఖము, భాగ్యము కలిగించుగాక! నారాయణునిపై నిరతిశయ అనురాగమును మనసున నింపి ప్రపత్తినొందించు గాక!
మాధవి అలమేలు మంగ సౌందర్య నాయకి సౌమ్య
నాయకి పేరిందేవి అమృతవల్లి తాయారులు ఆమ్మలై కాతురుగాక!
**********
కింది కులాలు ఎదగడమంటే
కొన్ని కుటుంబాలు అలా 
తరతరాలుగా రిజర్వేషన్లు
అనుభవించడమా? మేధావులు
కుల పెద్దలు, సంకుచిత ఘనులు!
********
Very beautiful and serene; blue is the color of Lord Krishna and Divinity! Sky is vast and sea is deep, both are blue; so is Truth, both vast and deep..
*******
భారతదేశ ఓటర్లు, నాయకులు కులాల మించి పోలేరు. దురదృష్టవశాత్తు అందరి భారతీయుల జీవితాల్ని వీరే శాసిస్తున్నారు.
నాయక వర్గం వాళ్ళు ఫ్రీబీలు, రిజర్వేషన్లు విసిరి; ఓటర్ వర్గం వారు దానిపై ఆశపడీ.
*********
అనుచిత ప్రకటనలు

ఒక రకమైన షేవింగ్ క్రీమ్ రాసుకుని గడ్డం గీసుకుఃటే అమ్మాయిలు పక్కకి వచ్చి గడ్డం నిమురుతారు.
ఒక రకమైన టూత్ పేస్ట్ తో పళ్ళు తోముకుంటే అమ్మాయిలు పరవశించి పెదవులు కలుపుతారు.
ఇంక అవేవో లోషన్లు రాసుకుంటే ఏకంగా మీదే పడిపోతారు.
ఇలా చేసేది ఈ వ్యాపారస్తుల అమ్మాయిలా, ప్రకటన రూపొందించే వారి అమ్మాయిలా?
నాకు క్లారిఫికేషన్ కావాలి!
*********
Yoga is an individual engagement. Yoga is not a public event or demonstration.
And Yoga is not mere physical exercises.
Yoga also is cultivating the mind and not allowing it to trouble us unnecessarily.
********
లోకములు 

"లోక్యతే ఇతి లోకః"
చూడబడేది లోకము.
ఎవరి చేత, దేని చేత చూడబడేది లోకము? ఇక్కడ ఎవరిచేత అనేది వర్తించదు. దేని చేత మాత్రమే వర్తిస్తుంది.
అంతఃకరణముల చేత చూడబడేది లోకము.
మనోబుద్ధ్యహంకారచిత్తములు అంతఃకరణములు. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము లోకములు.
భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యమ్- అనేవి సప్తలోకములు.
సత్య లోకము తప్ప మిగతా లోకములు అంతఃకరణములచే చూడబడతాయి. సత్యలోకం
అనుభవింప బడుతుంది. సత్యమ్ అనుభవం.
సత్ స్థితి. చిద్రూపము. ఆనందమయం.
ప్రాచుర్యంలో ఉన్న పదునాలుగు లోకములు తత్త్వానికి సంబంధించినవి కావు. ఇవి తరువాతి కల్పనలు.
గాయత్రీ మంత్రం సూచించే సప్తలోకములు బ్రహ్మ జ్ఞానము, అద్వైతము, శాక్తాద్వైతము, ద్వైతము లకు సంబంధించినవి.
బ్రహ్మ జ్ఞానము అనుభవములు, తలపులు, గ్రహణలు, గ్రహింపులకు, ఉచ్ఛారణలకు సంబంధించినది.
అపార్థం చేసుకోవడంలో రంజనము ఉంది. అవగాహనలో శాంతి, సుఖము ఉన్నాయి.
**********
తెలియని స్థితి
సాహితీ తీర్థయాత్రలతో ఎప్పుడూ ఖాళీ లేకుండా అన్ని చోట్లకు తిరిగే సాహితీ స్రష్టలు; తమ తమ
సృష్టుల వినిపించి అలరించి కొనిపించి లబ్ధి పొందే
తెలివైన రచయితలు; సమూహముల క్రింద ఏర్పడి
పరస్పరము మెచ్చుకొని, బిరుదులిచ్చుకొను శ్రేష్ఠులు;
సంసార పక్షంగా రాసి ప్రాచుర్యమునకు, ప్రచురణకు
నోచుకోక తాము సాహితీ స్రష్టలు అవునో కాదో తెలియని కవి, రచయితా వతంసులు ఎందరో; వాదముల
వేడిలో తర్జన భర్జనలు, పొగడ్తలు, కించ పరచడాలు
ఏది కవనమో, ఏది తిట్టో, ఏది కథయో, ఏది వ్యథయో తెలియని సామాజిక స్పృహాతత్పర కతలు, సృష్టులు; అంతయు అయోమయముగ గోచరించు తెలుగు సాహితీ రంగము ఎవరి సాహితీ ప్రకటనలకు, నాట్యములకు రంగస్థలమో తెలియని స్థితి!
***********
దైవాధీనం బస్ సర్వీస్
మనం మెళకువగా ఉన్నా, పడుక్కుని ఉన్నా విమానం, రైలు, బస్, కార్ డ్రైవర్లు మెళకువగా ఉండి వాహనముల జాగ్రత్తగా నడిపి క్షేమంగా మనలను గమ్యస్థానాలకి చేరుస్తారు; ఒక సారి ఎక్కాక మన జాగ్రత్త, అజాగ్రత్తలతో ప్రమేయము ఉండదు అంతా వారి నిర్వహణలోనే నడుస్తుంది; అంతా వారి బాధ్యతయే
అటులనే పుట్టాక మన జీవన ప్రయాణం భగవంతుని
డ్రైవింగ్ లో నడుస్తుంది; మన జాగ్రత్త, అజాగ్రత్తలు
మన ప్రయాణ సంక్షేమంపై ఏవిధమైన పట్టూ కలిగి
ఉండవు; అంతా దైవాధీనం బస్ సర్వీస్లా నడుస్తుఃది
మన ఒప్పుకున్నా , ఒప్పుకోకపోయినా, నమ్మినా, నమ్మకున్నా, ఫలితం మారదు; మన సీట్లో మనం
బుద్ధిగా కూచుని, గడబిడ చేయక ప్రయాణం చేయడమే మన స్వేచ్ఛ; గ్రహిస్తే మంచిది, శుభకరం
**********
దేవుడు
దేవుడంటే మనకు మహిమలు చూపించే గారడీ వాడు కాదు; భగవద్దర్శనమంటే మన అర్చనా
మూర్తి చర్మచక్షువులకు కనిపించి ఏం కావాలని అడగడం కాదు; దేవుడంటే మన అడ్డమైన కోరికలూ తీర్చే కామధేనువో కల్పతరువో కాదు; భగవంతుడు
జ్ఞాని, తత్త్వవేత్త, గురువు, మిత్రుడు, తల్లి, తండ్రి!
*********
పుస్తకములు చదువుటలో మునిగి తేలి; మనసుని ఆహ్లాదపరచుకొని, వికసనమొందించుకొని
చేసిన జ్ఞాన సముపార్జన సద్వర్తనము లేక శోభించదు; రసస్ఫూర్తి కలిగించని కావ్యము వలె.
***********
శరీరం
ముసలితనాలు ఎలా మనుషుల రూపు రేఖలు మార్చేస్తాయో! వయసు గడచి వయసు దాటి
వయసు మీరి శరీరం నెమ్మదిగా శిథిలమౌతుందో!?
జవసత్త్వాలుడిగి జవ్వనము కరిగిపోయి అంతా
అదృశ్యమై నిగారింపు తగ్గి ముడుతలు పడిన
శరీరం; మనసున అనుభవములు నింపి తాను
నెమ్మదిగా జరాతప్తమై విశ్రాంతి కోరుకొను తోలుతిత్తి;
ఊపిరులు తీయుచున్నను రేపేమగునో తెలియదు;
శరీరమాద్య ఖలు ధర్మసాధనమ్ చెప్పినట్లు
అన్ని ధర్మములు, కార్యములు, కలాపములు
వ్యక్తి చేయుటకు పునాదియై కారణ భూతమై
వెలుగొంది వెలుగునిచ్చిన కొవ్వొత్తి కరిగి ఆరిపోవును
ఇంత చేసీ అంతా మిథ్య తలంచి చూచిన అనిపించును; శరీరమును శుష్కింప చేసుకొనుట
అధర్మము; ధర్మ సాధనము ఆరోగ్యం, జీవము
అశ్రద్ధ చేయరాదు; శరీరము లేక అంతయూ శూన్యమే

Monday, August 28, 2017

మహాలక్ష్మి ప్రార్థన; దేవుడు ఒక్కడే; మన్మథుని తూపులు;The Glows of Mind Within; విద్యుత్ శక్తి - మానసిక శక్తి

 మహాలక్ష్మి ప్రార్థన

శ్రీమన్నారాయణ మనోల్లాసినీం శ్రీ మహాలక్ష్మీం శరణమహం ప్రపద్యే!
కనకధారాం కారుణ్యవరదాం విష్ణు వక్షస్థలవాసినీం ఇందిరాం నమోస్తుతే!
సముద్రతనయాం మన్మథజననీం ఐశ్వర్య కారిణీం పద్మాసనస్థాం భజేహం!
ఈశ్వర భగినీం సరస్వత్యాః స్వసురాం ధనలక్ష్మీం 


ధాన్యలక్ష్మీం మాధవప్రియాం స్మరేహం!

వరలక్ష్మీం విద్యాలక్ష్మీం సకల విజ్ఞాన దాయినీం
మంత్రరూపాం‌ శుద్ధమానసాం పూజామ్యహం!
శ్రీ మహాలక్ష్మీం నమోస్తుతే!

***************

దేవుడు ఒక్కడే

దేవుడు ఒక్కడే ఆయన విష్ణువని వైష్ణవులు
దేవుడు ఒక్కడే ఆయన శివుడని శైవులు
దేవుడు ఒక్కడే ఆయన అల్లా అని‌ ముస్లిములు
దేవుడు ఒక్కడే ఆయన యెహోవా అని క్రైస్తవులు


దేవుడు ఒక్కడే ఆయనకు పేర్లు ఎన్నో అని సనాతన ధర్మము
దేవుడు ఒక్కడే ఆయన మనిషికి వేరు కాదని తత్త్వము
ఇందరు దేవుని స్వరూపము వర్ణించుచుండ
దేవుడే లేడని నాస్తికులు క్రిందమీద పడుచుండ

గురువులు దక్షిణామూర్తి, హయగ్రీవులు, కృష్ణ పరమాత్మల
బోధనలు నాకు దిక్సూచి నన్నుద్ధరించు ప్రమాణములు
***************
 మన్మథుని తూపులు

తలిస్తేనే తాకినట్టుగా అనిపిస్తుంది కొందరికి
మాట వింటేనే వివశులౌతారు కొందరు; తలుచుకుంటూ
పిలిచేవా అని అడుగుతారు ఇంకొందరు; మనసులు
కలిసిన పరవశమున కలయొ మెళకువయో

తెలియని స్థితుల నిదురవోవుదురు వాస్తవమునకు
యువతీయువకులు పెళ్ళి వద్దందురు ప్రేమ ముద్దందురు

అంతరంగమున అలజడులు రాతిరి నిదుర కరవౌటలు
అంతయును మన్మథుని తూపుల ప్రభావమొ నిజమైన హృదయాశ్లేషమొ
*************

The Glows of Mind Within

Criminals in the guise of saints;
Selfish leaders in the name of saviours;
Indians glorify and blindly believe in
Wrong people for right actions and rights


In the land of knowledge, ignorance and
Innocence are ruling; ruling dispensations
Are conniving with cheats and fake gurus
For vote bank politics; Divinity is pious

God and Lords are our intuition
The glows of our minds within
*******************

 విద్యుత్ శక్తి - మానసిక శక్తి

విద్యుచ్ఛక్తి తగిన పదార్ధ‌ సంపుటి ‌ద్వారా రకరకాల శక్తులుగా మారుతూ మనకి ఎన్నో సౌకర్యాలు కలిగిస్తోంది. ఆధునిక జీవనశైలి, జీవనవిధానం విద్యుత్ శక్తి పై ఆధారపడి ఉన్నాయి.
మన మానసిక శక్తి కూడా వివిధ రకాల పదార్థ సంపుటి ద్వారా రూపమును మార్చుకొని మనం మానసికంగా వ్యవహరించేలా చేస్తోంది.

ఈ మానసిక శక్తిని చిదాభాస, మాయ, ప్రణవం, స్ఫోట అని పిలుస్తారు. అన్నీ ఒకే మానసిక శక్తికి వివిధ నామాలు. వేదాంతులు చిదాభాస, మాయ, ప్రణవం అంటారు. వ్యాకరణ వేత్తలు, భాషాశాస్త్ర వేత్తలు స్ఫోట, ప్రణవం అంటారు.
భక్తులు దైవశక్తి అంటారు. ఎవరేమన్నా ఇదంతా చిత్ శక్తి. ఆత్మ శక్తి. మన మానసిక కార్యకలాపాలు జరిపే శక్తి.