Showing posts with label రమణీయమైన కావ్యములు. Show all posts
Showing posts with label రమణీయమైన కావ్యములు. Show all posts

Monday, July 17, 2017

The Son-Rises; రమణీయమైన కావ్యములు; పసికందుల అందం; కాలము - ముదిమి; అమ్మలేరి?


The Son-Rises

The Son-Risesare inevitable in Congress or any other political party. Our leaders cannot see beyond family, kith and kin whatever is the political party - national or regional. 

It is the bankruptcy of ideas and commitment to nation and nation's growth. They have only quick-fix solutions for any problem and have no vision or will to develop the nation.

Every political party in India is vulnerable to caste-based, community-based, region- and religion-based calculations to win elections, whether the party is left or right.

They are not interested in being a victim in elections by not playing divisive cards.
Voters are teaching the leaders bitter lessons and politicians of all parties are sinking politics to nether worlds.

 *************
రమణీయమైన కావ్యములు

రాతిపై మలచిన కవిత శిల్పం
దివ్యతేజం నిండిన హస్త కళా స్వరూపం

ఎన్నో వన్నెలు దిద్దిన భగవత్ స్వరూపం
ప్రసన్నత కురిపించే భక్తుల పాలిటి గట్టి నమ్మకం

ఆచార్యుల ఆధ్యాత్మిక దృష్టి
ప్రతిబింబించే యోగ సమాహారం

విగ్రహారాధనను గేలి చేస్తూ ,
సిధ్ధాంతకర్తల నాస్తిక ప్రముఖుల
నాలుగు రోడ్ల కూడలుల లోని వారి
శిలా విగ్రహాల మెడలలో పూల మాలలు
వేసి తమ భక్తి ప్రపత్తులు ప్రకటించే
నాస్తిక శిఖామణుల రెండు నాలుకల
ధోరణిని అపహాస్య దృక్కులతో పరికించే దైవ శిఖామణి

గుడులు గోపురములు వాటిపై;
వాటిలో కన్నుల పండుగ చేసే
శిల్ప సంపద; ఆనాటి రాజుల రుచి,
శిల్పుల కళా నైపుణ్యం చాటే రాళ్ళ వైభవములు;

అప్పటి పేదల ఉపేక్షించి; వారి బాగోగులు నిర్లక్ష్యము చేసి,
సొమ్ముల ప్రభువులు రాతి గుండెతో రాళ్ల పాలు చేసినను

శిల్పములు శిలా కట్టడములు
సంస్కృతీ ప్రకటనములు; పరిరక్షణములు

దేశ చరిత్ర వహించిన కాల నాళికలు
శిల్పాలు శిలలపై చెక్కిన
రమ్య రమణీయ కావ్యములు
***************

 పసికందుల అందం

పసికందుల కదలికలు అందం
బోసి నవ్వులు ఇంకెంతో అందం
మాట రాదు కాని హావభావములు
ఆనందదాయకములు; ఏడ్పులు కలరవములు

కావ్యములు; మనసుతో చూడాలి;
దోబూచులాడే వారిని అపురూపంగా
పెంచాలి మన సమయమంతా కేటాయించి;
మన ప్రేమానురాగాలు ఉగ్గుతో రంగరించి
***************
 కాలము - ముదిమి

 కాలము పరుగిడుచున్నది వేగంగా
అంతే వడితో ముదిమి అడుగిడుచున్నది;
శరీరంలో మార్పులు ప్రకృతి నియమం;
మనసులో కూర్పులు చేర్పులు మన సుఖదుఃఖములు

********
 పుస్తకములన్ననేమి
మస్తిష్కమునకు విందులు;
పసందులు; మనసును
వెలిగించు దివ్వెలు, ప్రకాశములు
***********
తాగుబోతులు, డ్రగ్స్ బోతులు, తిరుగుబోతులు సంఘంలో గౌరవనీయులు. మర్యాదస్తులు. నట, విట, విదూషక సమూహమునకు హారతి పట్టు జనులు వీరికి బానిసల వంటి అభిమానులు.
***********

అమ్మలేరి?



నా బొందోయని ప్రాకులాడుచు

ఇళ్ళను కాచేటి ముగురమ్మల
కలయికయైన గృహలక్ష్ములేరి?
అవ్యాజానురాగముల పంచి
ప్రేమల, అనుబంధముల తెలుపు
కొమ్మలేరి? ముద్దుల దేవేరులేరి?
పురుషునితో సమానత్వము
రుజువుచేయుటకై ఆఫీసులకేగిరి
అన్నిటియందు పురుషునికి తీసిపోమని
జబ్బ చరుచుచు తొడగొట్టుచు నిరంతర
యుద్ధోన్ముఖులైరి; అమ్మా అనిపిచుకొనుట
కన్న ఏమమ్మాయని ఉద్యోగినులుగ అనిపించుకొనుట
గౌరవము, మర్యాదా పరిరక్షణమనకొనుచుంటిరి
విద్య, వైద్యము ఖర్చులు నింగినంటుచుండ
ఎంత సంపాదించినను సరిపోని ధనార్జనముననుండిరి
స్థిరమైన ఉద్యోగములు లేక ప్రైవేటు యాజమాన్యములకు
తక్కువ ఖర్చు సాదా సీదా ఉద్యోగినులైరి; ఇంటి ఊసే ఎత్తలేక
కట్టు బానిసలైరి; వ్రతం చెడ్డా ఫలం దక్కని నోములు నోచినవారైరి
అమ్మలేరి?
నా బొందోయనుచు
ఇళ్ళను కాచేటి ముగురమ్మల
కలయికయైన గృహలక్ష్ములేరి?

Sunday, July 17, 2016

సృష్టికర్త - సృష్టి; ప్రయోజనము లేని ఉనికిలు: రమణీయమైన కావ్యములు; జ్ఞానమే శరణ్యము మనకు



సృష్టికర్త - సృష్టి

వాల్మీకి వ్యాసుల కన్న రామ కృష్ణులు ప్రముఖులు
వందనీయులు; అభినందనీయులు ఆనందకారకులు

జక్కన్న కన్న బేలూరు లోని ఆలయ శిల్పసంపదలు
చిర దర్శనీయములు; భరతముని కన్న నాట్యశాస్త్రము
మిన్న; ఐన్ స్టైన్ కన్న సాపేక్ష సిద్ధాంతమునకు ఎక్కువ
ప్రాచుర్యము; యల్లాప్రగడ సుబ్బారావు కన్న ఆయన

కనిపెట్టిన మందులు రోగనివారకములు; త్యాగరాజ
స్వామి కన్న "ఎందరో మహానుభావులు" బ్రహ్మానంద
దాయకము; టి. వి. రాజు కన్న "జయ కృష్ణా ముకుందా
మురారీ" కర్ణపేయము; విశ్వనాథ్ కన్న శంకర శాస్త్రి

ప్రభావము అధికము; రాముని కన్న రామ నామము
ఎక్కువ మోక్షప్రదము; శ్రీ కృష్ణుని కన్న భగవద్గీత
పఠన పాఠనముల హెచ్చు; చతుర్ముఖ బ్రహ్మ కన్న
ఆయన సృష్టించిన జీవజాలమున వైవిధ్యము, అందము
 రామణీయకత ఎక్కువ; అమ్మ కన్న ఆమె సంతానము
నలుగురికీ తెలియును; తమ తపః ఫలమున,
శ్రద్ధాసక్తులతో, అకుంఠిత దీక్షతో సృష్టించిన సాకిన సృష్టి
సృష్టి కర్తల కన్న మిన్నగా రాణించును; లోకమున
అందగించును, అలరించును, అజరామరమగును
*************
 
ప్రయోజనము లేని ఉనికిలు

చిత్తరువు లోని కాఫీ ఘుమ ఘుమలాడదు
మల్లియ పరిమళాలు వెదజల్లదు; నాతి రతి
సుఖమునీయ లేదు; పళ్ళు, ఫలహారములు
ఆకలి తీర్చలేవు; డబ్బు, బంగారము మన
అవసరము తీర్చలేవు; రాజకీయుల మాటలునూ
చిత్తరువు గీతలు; మన గీతల మార్చలేవు

అబద్ధము ఆస్వాదనకు పనికి రాదు; నిజమిచ్చు
సుఖశాంతులు, భ్రమ, భ్రాంతులు, అసత్యము ఈయలేవు;
త్రికరణశుద్ధి లేని ఊహలు, పలుకులు చేతలుగ మారవు
నీటిపై రాతల వలె ఆ క్షణమునకు మాత్రముండును

ప్రయోజనము లేని ఉనికిలు పార్టీల మేనిఫెస్టోలు
అబద్ధాలు ప్రజలను అందలాలెక్కించలేవు; ఆసరా
కాలేవు; ఆయాసము, ఆశాభంగములను మాత్రమిచ్చును
చిత్రములు ప్రజల నమ్మకములు; చిత్తరువుల గీతలు
**************

రమణీయమైన కావ్యములు

రాతిపై మలచిన కవిత శిల్పం
దివ్యతేజం నిండిన హస్త కళా స్వరూపం

ఎన్నో వన్నెలు దిద్దిన భగవత్ స్వరూపం
ప్రసన్నత కురిపించే భక్తుల పాలిటి గట్టి నమ్మకం

ఆచార్యుల ఆధ్యాత్మిక దృష్టి
ప్రతిబింబించే యోగ సమాహారం

విగ్రహారాధనను గేలి చేస్తూ ,
సిధ్ధాంతకర్తల నాస్తిక ప్రముఖుల
నాలుగు రోడ్ల కూడలుల లోని వారి
శిలా విగ్రహాల మెడలలో పూల మాలలు
వేసి తమ భక్తి ప్రపత్తులు ప్రకటించే
నాస్తిక శిఖామణుల రెండు నాలుకల
ధోరణిని అపహాస్య దృక్కులతో పరికించే దైవ శిఖామణి
 
గుడులు గోపురములు వాటిపై;
వాటిలో కన్నుల పండుగ చేసే
శిల్ప సంపద; ఆనాటి రాజుల రుచి,
శిల్పుల కళా నైపుణ్యం చాటే రాళ్ళ వైభవములు;

అప్పటి పేదల ఉపేక్షించి; వారి బాగోగులు నిర్లక్ష్యము చేసి,
సొమ్ముల ప్రభువులు రాతి గుండెతో రాళ్ల పాలు చేసినను
శిల్పములు శిలా కట్టడములు
సంస్కృతీ ప్రకటనములు; పరిరక్షణములు

దేశ చరిత్ర వహించిన కాల నాళికలు
శిల్పాలు శిలలపై చెక్కిన
రమ్య రమణీయ కావ్యములు
**********
 జ్ఞానమే శరణ్యము మనకు

కృష్ణుడు ఇస్కాన్ కల్టు వారి స్వంతమా‌ లేక వారి‌ కాపీరైటా, పేటెంటా?
వేంకటేశ్వరుడు వైష్ణవులకు‌‌ మాత్రమే దేముడా ఇతర భక్తుల కాయడా?

ప్రాంతము అక్కడి రాజకీయుల జాగీరా? తాతల ఆస్తా? మరెవరికి అక్కడ
చోటెందుకు లేదు? సంకుచిత్వము విషము చిమ్ముచువ్న నేడు, మత గురువులు,
నాస్తికులు, ప్రాంతీయ నాయకులు బరువు దేశమునకు; సామరస్యము తెలియని‌
మనుషులు శాంతి విధ్వంసకులు, సంఘ విద్రోహులు; అన్య మతముల, 


అన్య తత్త్వముల, అన్యదైవముల దూషించు‌వారు కారు మానవులు

ఇంగితము లేని వారు విద్యలు గరపగలరా? ఈ ఎల్లయ్యలు, పుల్లయ్యలు?
ద్వేషము క్రక్కు వారు సంఘమును నడుపగలరా? ఈ ఆధునిక సిద్ధాంత వాదులు?
మూర్ఖులై మూఢులై అనాగరికులు, సంస్కార హీనులు

గాక ఆ‌ ( నా )స్తిక శిఖామణులు? సమత మమత తెలియక,
నలుగుర కలుపుకుపోగల హృదయ‌ నైర్మల్యము లేక
పేచీ పెట్టు గురువులు, నాయకులు మేధావులు పుడమికి చేటు గాద!

ఆడలేనమ్మ మద్దెల ఓటన్నట్టు చేతగాక,
నూతనముగ ఏమి ఆవిష్కరించక
సాంప్రదాయమును, జ్ఞానమును నిందించువారు
సంస్కృతి, సంస్కారములు లేని అనాగరికులు, ‌
ఆటవికులు; ఇందర కుమనస్కుల భరించుట
భారతమునకు కష్టమగుచున్నది‌ నష్టమగు చున్నది‌;

ఎవరూ దేశమునకు చెందరు! అందరి సుఖ శాంతుల పోగొట్టు
దుండగీడులు వీరు; మేధావుల మనుకొను వాగుడు మూకలు!
జ్ఞానమే శరణ్యము మనకు; పెద్దల ఊసులే చద్దికూడు మనకు