Showing posts with label కాలము. Show all posts
Showing posts with label కాలము. Show all posts

Monday, July 17, 2017

The Son-Rises; రమణీయమైన కావ్యములు; పసికందుల అందం; కాలము - ముదిమి; అమ్మలేరి?


The Son-Rises

The Son-Risesare inevitable in Congress or any other political party. Our leaders cannot see beyond family, kith and kin whatever is the political party - national or regional. 

It is the bankruptcy of ideas and commitment to nation and nation's growth. They have only quick-fix solutions for any problem and have no vision or will to develop the nation.

Every political party in India is vulnerable to caste-based, community-based, region- and religion-based calculations to win elections, whether the party is left or right.

They are not interested in being a victim in elections by not playing divisive cards.
Voters are teaching the leaders bitter lessons and politicians of all parties are sinking politics to nether worlds.

 *************
రమణీయమైన కావ్యములు

రాతిపై మలచిన కవిత శిల్పం
దివ్యతేజం నిండిన హస్త కళా స్వరూపం

ఎన్నో వన్నెలు దిద్దిన భగవత్ స్వరూపం
ప్రసన్నత కురిపించే భక్తుల పాలిటి గట్టి నమ్మకం

ఆచార్యుల ఆధ్యాత్మిక దృష్టి
ప్రతిబింబించే యోగ సమాహారం

విగ్రహారాధనను గేలి చేస్తూ ,
సిధ్ధాంతకర్తల నాస్తిక ప్రముఖుల
నాలుగు రోడ్ల కూడలుల లోని వారి
శిలా విగ్రహాల మెడలలో పూల మాలలు
వేసి తమ భక్తి ప్రపత్తులు ప్రకటించే
నాస్తిక శిఖామణుల రెండు నాలుకల
ధోరణిని అపహాస్య దృక్కులతో పరికించే దైవ శిఖామణి

గుడులు గోపురములు వాటిపై;
వాటిలో కన్నుల పండుగ చేసే
శిల్ప సంపద; ఆనాటి రాజుల రుచి,
శిల్పుల కళా నైపుణ్యం చాటే రాళ్ళ వైభవములు;

అప్పటి పేదల ఉపేక్షించి; వారి బాగోగులు నిర్లక్ష్యము చేసి,
సొమ్ముల ప్రభువులు రాతి గుండెతో రాళ్ల పాలు చేసినను

శిల్పములు శిలా కట్టడములు
సంస్కృతీ ప్రకటనములు; పరిరక్షణములు

దేశ చరిత్ర వహించిన కాల నాళికలు
శిల్పాలు శిలలపై చెక్కిన
రమ్య రమణీయ కావ్యములు
***************

 పసికందుల అందం

పసికందుల కదలికలు అందం
బోసి నవ్వులు ఇంకెంతో అందం
మాట రాదు కాని హావభావములు
ఆనందదాయకములు; ఏడ్పులు కలరవములు

కావ్యములు; మనసుతో చూడాలి;
దోబూచులాడే వారిని అపురూపంగా
పెంచాలి మన సమయమంతా కేటాయించి;
మన ప్రేమానురాగాలు ఉగ్గుతో రంగరించి
***************
 కాలము - ముదిమి

 కాలము పరుగిడుచున్నది వేగంగా
అంతే వడితో ముదిమి అడుగిడుచున్నది;
శరీరంలో మార్పులు ప్రకృతి నియమం;
మనసులో కూర్పులు చేర్పులు మన సుఖదుఃఖములు

********
 పుస్తకములన్ననేమి
మస్తిష్కమునకు విందులు;
పసందులు; మనసును
వెలిగించు దివ్వెలు, ప్రకాశములు
***********
తాగుబోతులు, డ్రగ్స్ బోతులు, తిరుగుబోతులు సంఘంలో గౌరవనీయులు. మర్యాదస్తులు. నట, విట, విదూషక సమూహమునకు హారతి పట్టు జనులు వీరికి బానిసల వంటి అభిమానులు.
***********

అమ్మలేరి?



నా బొందోయని ప్రాకులాడుచు

ఇళ్ళను కాచేటి ముగురమ్మల
కలయికయైన గృహలక్ష్ములేరి?
అవ్యాజానురాగముల పంచి
ప్రేమల, అనుబంధముల తెలుపు
కొమ్మలేరి? ముద్దుల దేవేరులేరి?
పురుషునితో సమానత్వము
రుజువుచేయుటకై ఆఫీసులకేగిరి
అన్నిటియందు పురుషునికి తీసిపోమని
జబ్బ చరుచుచు తొడగొట్టుచు నిరంతర
యుద్ధోన్ముఖులైరి; అమ్మా అనిపిచుకొనుట
కన్న ఏమమ్మాయని ఉద్యోగినులుగ అనిపించుకొనుట
గౌరవము, మర్యాదా పరిరక్షణమనకొనుచుంటిరి
విద్య, వైద్యము ఖర్చులు నింగినంటుచుండ
ఎంత సంపాదించినను సరిపోని ధనార్జనముననుండిరి
స్థిరమైన ఉద్యోగములు లేక ప్రైవేటు యాజమాన్యములకు
తక్కువ ఖర్చు సాదా సీదా ఉద్యోగినులైరి; ఇంటి ఊసే ఎత్తలేక
కట్టు బానిసలైరి; వ్రతం చెడ్డా ఫలం దక్కని నోములు నోచినవారైరి
అమ్మలేరి?
నా బొందోయనుచు
ఇళ్ళను కాచేటి ముగురమ్మల
కలయికయైన గృహలక్ష్ములేరి?

Monday, July 3, 2017

తాగుబోతు వాహన చోదకులు;కాలము-సమయము-కాలాతీతము-మానసాతీతము-రామబ్రహ్మము; Adventurous China;


 తాగుబోతు వాహన చోదకులు

తాగి వాహనములు వడపడం ఆడవారికి, మగవారికి ప్రాథమిక హక్కు అయిపోయింది. బాగా ఖరీదైన జీవితాలు కలవారు, మరెంతో ఖరీదైన వాహనములను తాగి నడుపుచూ నరమేధం చేస్తున్నారు. వారి విశృంఖలత్వానికి, విచ్చలవిడికి అడ్డూ అదుపూ లేవు.

ఈ తాగి నడిపే హంతకులందరూ సెలిబ్రటీ స్టేటస్ కలవారే. వీరిపై కేసులు పెట్టబడవు. ఒకవేళ ఖర్మకాలి పెట్టినా దశాబ్దాల తరబడి కోర్టుల్లో నానతాయి. నేరస్థులు బెయిల్ పై బయటకు వచ్చి మరిన్ని రకరకాల నేరాలు చేస్తూంటారు.

త్రాగుడు బడుగులకే నేరం. సెలిబ్రిటీలకు, ధనవంతులకు త్రాగడం స్టేటస్ సింబల్. ఈ పరిస్థితులలో పబ్ లలో, లేదా ఎక్కడో తాగి బళ్ళు నడపడాన్ని సమాజం ఎంతో సానుభూతిగా చూస్తూ, తాగుబోతు హంతకులందరినీ బుజాన వేేసుకుంటోంది.

ఈ తాగుబోతుల నుంచి ప్రజలకు రక్షణ కలిగించడం ప్రభుత్వాల వల్ల కావటం లేదు. కాదు కూడా అనిపిస్తోంది.
అలాగే రకరకాల నేరాలూ మందకొడిగా విచారణకు వస్తున్నాయి. విచారణలూ ఇంకా మందకొడిగా జరుగుతున్నాయి. న్యాయమూర్తుల కొఱత మొదలైన వాస్తవాలు సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి.

అలాగే అత్యాచారాలు. నూరు శాతం నిరోధింపబడవు. పౌరుల సహకారం కూడా అత్యాచారాల విషయంలో ఉండాలి. తగు జాగ్రత్తలను పౌరులు తమంత తాము తీసికోవాలి. విశృంఖలత, విచ్చలవిడి తనము ప్రాథమిక హక్కులు కావు. 24×7 రక్షణ ఏ ప్రభుత్వమూ సమకూర్చలేదు.

కాని తాగుబోతు వాహన చోదకుల విషయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసికోవచ్చు. కాని ప్రభుత్వాలు పాలన మర్చిపోయి సంవత్సరాలు అయింది.

పాలనంటే చాలామంది నాయకులకు, పాలితులకు ఉచితాలు వాగ్దానం చేయడం, ఖజానాాను డొల్ల చేయడం.
పౌరులను కుల, మత, ప్రాంత, వంటి విభేదములతో విడదీసి భేదనీతితో ఓట్లడగడం.

ఏమయినా యథా ప్రజా తథా రాజా (నాయకాః) లాగ జరుగుతున్న పాలనలు పౌరులకు గంతకు తగ్గ బొంతే.

**************

కాలము-సమయము-కాలాతీతము-మానసాతీతము-రామబ్రహ్మము

సమయము, కాలము వేరు. కాలము పరిణామము. సమయము కాల వ్యవధి. కాలము శక్తి లేక శక్తి ప్రేరిత పదార్ధ పరిణామము. పదార్ధము ద్వారా శక్తి రూపపరిణామమూ కాలమే. కాలము కలనము. కలనము అంటే లెక్క బెట్టుట.

మనము అనుకునే కాల ప్రవాహము నిజానికి శక్తి లేక పదార్ధ పరిణామము. శక్తి, పదార్ధ పరిణామములు చర్యలను, ప్రతిచర్యలను, ఆంతర చర్యలను కలిగిస్తాయి. శక్తి, పదార్ధ పరిణామములు లేక ఎటువంటి చర్యలు జరగవు. చర్యలు లేక కాలము కాని, కాల గతి, గమనము కాని లేవు. కాలపు ఉనికి చర్యలు జరగడంపై ఆధారపడి ఉంటుంది.
కాల స్పృహ, కాలగమన దృష్టి శక్తి, పదార్ధ పరిణామ గ్రహణలు. ఈ గ్రహణలు ఆగిపోతే మనము కాలాతీత స్థితిని అనుభవిస్తాము.

గ్రహణారాహిత్యమే కాలాతీతము, మానసాతీతము కూడా. మనసు ఉనికి లేక కాల స్పృహ, కాలపు ఉనికి లేవు. మన గాఢనిద్ర మానసిక దశలో మనసు పనిచేయక విరమింపబడి ఉంటుంది. అన్ని తలపులు, అనుభవములు స్పృహలోనుండవు. దృష్టి విశ్రాంతమై ఉంటుంది. ఈ స్థితిని జాగ్రత్ సుషుప్తి అంటారు. ఇది మానసాతీత ఆత్మ దశ.

శాంతమన్నా, ఆనందమన్నా, మౌనమన్నా, మోక్షమన్నా, నిర్వాణమన్నా, శుద్ధాహం స్థితియన్నా, ప్రజ్ఞాన స్థితియన్నా, నిర్మల మానసిక స్థితియన్నా, పరా స్థితియన్నా, భక్తి స్థితియన్నా, రస స్థితియన్నా, దివ్య స్థితియన్నా, భగవత్ స్థితియన్నా ఇదే. జీవబ్రహ్మైక్య స్థితియన్నా ఇదే. ఈ దశలో వ్యక్తిత్వము విస్మరింపబడి ఉంటుంది.

ఆత్మారామ స్థితియన్నా, రామబ్రహ్మ స్థితియన్నాఇదే. సమస్త వేదాంత, సకల ఉపనిషత్ సార అవగాహనము, గమ్యము, ఆధ్యాత్మిక జీవన ఫలము ఈ స్థితిని పొంది, అందు సదా నిలిచి ఉండడమే.

ఏతత్ సర్వమ్ శ్రీ పరమేశ్వరార్పణమస్తు!

సమస్త సన్మంగళాని భవంతు!

భగవత్ ప్రీతిరస్తు!

Adventurous China

China is testing waters with us. Is it trying to bully us, frighten us? Why this psychological war with us? Why it is teasing and irritating us with its daily dose of statements? What is its aim? What it wants? Dragon is trying to be mysterious with us. Let us see.

*********

Orphan Children

Save orphan children of India. Good. How about children who have parents but not mother. Who will take care of them?
 

Monday, May 29, 2017

కాలము - కాలగమనము

కాలము - కాలగమనము

కాలము, కాలగమనము రెండూ మనకు పరిచయమే. సమయము అని ఇంకోటి కూడా తెలుసు.
కాని కాలము అనేది లేదు అంటే, అలా అన్నవాడు, పిచ్చివాడు అని తేల్చేస్తాం.

కాని కాలము అనేది లేదండి. కాలము, కలనము, అంటే లెక్కపెట్టడం నుంచి వచ్చింది. కాలములో‌ మనం దేనిని గణిస్తున్నాము? ఒక ఘటన లేక సంఘటన జరిగే సమయాన్ని లెక్కిస్తున్నాము. గడియారాలు, పంచాంగాలు ఇలా ఎన్నో కాలగణన సామగ్రితోటి.

మరి కాలము లేక కాలగణన, కాలగమనము ఏమిటి? ఉన్నవి పదార్థాలు, శక్తి మాత్రమే. పదార్ధము శక్తి సాయంతో స్థితిని మారినా, శక్తి పదార్ధము ద్వారా రూపాంతరము చెందినా కాలము సృజించబడుతుంది.
కాలము అనేది ముందుగా ఏమీ లేదు. మనందరము ఉందనుకుంటున్న కాలము ప్రభావమంటూ మనపై, ఇతర సృష్టిపై లేవు.

జరుగుతున్నదల్లా పదార్ధము లేక శక్తి యొక్క పరిణామము.

కాలః పరిణామః - అని మన పెద్దలు చెప్పారు. కాలః శక్త్యాః పరిణామః అని సిద్ధాంతము. కాలము శక్తి యొక్క (పదార్ధము ద్వారా) పరిణామము. మరియు శక్తి సాయంతో పదార్ధము యొక్క స్థితి పరిణామము.
పదార్ధము లేదా శక్తి యొక్క పరిణామం లేక కాలము, కాలగమనము లేవు. అలాగే శక్తి యొక్క పరిణామం లేక కాలగణన లేదు. కాలః స్పృహ లేవు.

మనకు మెళకువ, కల మానసిక దశలలోనే కాలః స్పృహ ఉంటుంది. గాఢనిద్ర, మెళకువతో కూడిన నిద్ర (జాగ్రత్ సుషుప్తి) దశలలో మనకు కాలస్పృహ కాలగమన స్పృహ లేవు. ఈ చివరి రెండు దశల్లో మనసు విరమింపబడి, పని చేయక దాని మూలంలో పుట్టుక చోటులో లీనమై ఉంటుంది. మనసు పనిచేయక మనకు కాలస్పృహ లేదు. మన కాల, కాలగమన స్పృహలు రెండూ తలపుల రూపమే. భావాత్మకం మాత్రమే.

మనం ఎదగడం, ఇతర ప్రకృతి పరిణామాలు పదార్ధము, శక్తి యొక్క పరిణామం వల్ల జరుగుతున్నాయి గాని మనం గణిస్తున్న కాలగమనం వల్ల కాదు. అలా ప్రవహిస్తోంది అని మనం అనుకునే కాలం, దాని గణన మన కల్పితం. నిజము కాదు. దాని వల్ల, దాని ప్రవాహం వల్ల ఏ ప్రకృతి, విశ్వ, మానసిక పరిణామాలు జరగడం లేదు.

ప్రకృతిలో, విశ్వంలో, మనలో, శక్తి, పదార్ధ పరిణామాలు జరగడం వల్ల కాలము ఏర్పడుతోంది. శక్తి, పదార్థాల యొక్క పరిణామాలు లేక కాలానికి ఉనికి లేదు. అలా మనందరినీ నడిపించే, శాసించే కాలము అంటూ ఏమీ లేదు. కాలః స్పృహ, కాలగమన స్పృహలు మానసిక స్థితి లో జరిగే చిత్ శక్తి (చిదాభాస, మాయ, ప్రణవము, స్పోట దీని అంశలే, అంశాలే, విభూతులే) పరిణామాలే.

కాలము భౌతికము, మానసికము. భౌతిక కాలము మన సృష్టి. మానసిక కాలము మన అనుభూతి. భావము. తలపు. ఆలోచన. పదార్ధ, శక్తి యొక్క పరిణామాలే భౌతిక కాలము. మనసుతో ఈ భౌతిక కాలంతో మనం అహంకార మమకార అహంభావములతో ఏర్పరచుకున్న సంబంధమే మానసిక కాలము.

కాలగమనము నిరపేక్షము, సాపేక్షము అని రెండు విధములు. భౌతిక శాస్త్రం ఈ రెండు కాలగమనముల గురించి చర్చిస్తుంది. వాటి లోతులు, వివరములు భౌతిక శాస్త్రం చదవని వారికి గహనములు.

కాల తత్త్వాన్ని విమర్శించడమూ ఒక ఉపాసనా మార్గమే.

కాలము, కాలాతీతము, వీటి అవగాహన ఒక ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞం.

కృష్ణ పరమాత్మ కాల స్వరూపుడు, కాలాతీతుడూను.

కాలతత్త్వము భగవత్తత్త్వం వలె ప్రియమైనది, పరమైనది, పరమార్థమైనది. మోక్షానికి వీలు కల్పించేది.

కాలము భగవత్స్వరూపము. గుహ్యము.

ఏతత్ సర్వమ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే సమర్పితమ్!

Friday, January 20, 2017

కాలము, మనసు గారడీ, బ్రాహ్మణులు-హిందూమతము, శుష్క వచనములు - శూన్యహస్తములు

కాలం వల్ల మార్పు జరగదు. మార్పే కాలాన్ని సృష్టిస్తుంది. మార్పు వల్లే సమస్త కార్యములు రూపుదిద్దుకుంటాయి. కాలం మార్పునకు పుత్రిక. ప్రతీక కూడా.‌ మార్పే కాలమునకు, కాలప్రవాహానికి ఆధారము, ఆలంబన. మార్పు లేక కాలమునకు ఉనికి లేదు. మార్పే కాలము.

************
మనలను మన నిజ స్థితి లోనికి మేలుకొల్పడం తత్త్వసాధన పరమార్ధము.
*************

మనసు గారడీ

చాలా మంది ఫలానా ఛానల్ ని ప్రభుత్వం బేన్ చెయ్యాలని పోష్ట్ లు ‌పెడుతున్నారు. మనంతట మనమే ఆ ఛానల్ ని బేన్ చేసికుంటే కలత ఉండదు కదా! ఆ ఛానల్ ని చూడమని మనలని ఎవరూ బలవంతం‌ చేయడం లేదే! మనం ప్రపంచాన్ని మనకి కావలసినట్టు నడుచుకోమని శాసించలేము. మనము మన మనసుని శాసించుకోగలిగితే ఎన్నో కలతలు, బాధలు, వేదనలు, వ్యథలు మనకు కలగవు. మన చేతిలో ఉన్న పనిని నిర్లక్ష్యం చేసి ఇతరులని మనని సుఖపెట్టమని, ప్రశాంతత కలిగించమని డిమాండ్ చేయడమేమిటి?

దేనిని చదవాలి, దేనిని వినాలి, దేనిని‌ చూడాలి, దేనిని‌ పొందాలి‌ అనేది‌ మన‌ నిర్ణయంపై, విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ఎవరూ మనలని బలవంతం చెయ్యరు. అది పూర్తిగా మన ఇష్టం. ఎవరైనా సూచించినా
మన విచక్షణని, మనఃతత్త్వాన్ని ఉపయోగించుకుని చేసే స్వాతంత్ర్యం ఎప్పుడూ మనదే. ఆ విషయం గ్రహించక ఆరాటపడడం, హైరాన‌ పడడం పసితనం. అనవసరం.


ప్రపంచంలో‌ మనకి నచ్చనివి, కలత పెట్టేవి ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఎందరో‌ మన‌ మనసు కష్టపెట్టేలా మాట్లాడతారు, ప్రవర్తిస్తారు. అలా జరగకుండా చేసే శక్తి, యుక్తులు, సావకాశం మనకు లేవు.
మనని బాధపెట్టే, మనకు అయిష్టమైన వారిని ఎదిరించే, సవరించే సమర్ధత మనకు లేదు. మన శక్తియక్తులు పరమితమైనవి. వాటికి అనుగుణంగా‌ జీవించడం ఇంగితం.

మనకయిష్టులందరిపైనా, మన కారణం ఏదయినా, ఎంతో సబబని మనకి అనిపించినా, చర్య తీసికోమని ప్రభుత్వాన్ని కోరడం, ప్రభుత్వం మనకు కావలిసినట్టు చర్య తీసుకోవడం ఎంతో‌ complex and involved process. ఎన్నోసార్లు జరగకపోవచ్చు కూడా. జరగకపోవచ్చేమిటి, జరగదు కూడా.

మన‌చేతిలోని పనిని చేయక, చేయలేక, ఎవరో మనకి శాంతిసుఖములు కలిగించే దాకా కలత చెందుతూనే ఉంటామంటే‌ మనకు భగవంతుడు‌ కూడా సాయం చేయలేడు. ఆ ఛానల్ చూడడమెందుకు, కలత చెందడం ఎందుకు, ప్రభుత్వపు సాయం కోరడమెందుకు?

ఓపిక, కౌశలము ఉంటే, మన సంస్కృతినీ, సాంప్రదాయాన్ని పరిరక్షించుకునే క్రియ చేబట్టగలిగితే బెస్ట్. అంతర్జాలంలో ఏక్టివ్ గా ఉండడం మన "నాగరికతను, సంస్కృతి" నీ తెలియజేస్తుంది తప్ప దాని వల్ల మాత్రమే సంస్కృతీ సాంప్రదాయముల పరిరక్షణ‌ జరగదు.

సంస్కృతీ, సంప్రదాయములు, వాటిని మనం పాటించడం వల్ల, అనుసరించడం వల్ల, ఆచరించడం వల్ల మాత్రమే నిలుస్తాయి తప్ప; మనం ఊరికే హడావుడి పడడం వల్ల, హడావుడి చేయడం వల్ల నిలవవు. శుష్కవచనములు, శూన్యహస్తముల వలన మన సంస్కృతీ, సాంప్రదాయములు పరిరక్షించబడవు.

అడుసు తొక్కనేల, కాలు కడగనేల?

ఇదే సూత్రం మన జీవితంలో ఎన్నో కలతలకు మందు.

మన ఏవ కారణం మనుష్యాణాం బంధ మోక్షయోః.

ఈ నిజం తెలుసుకొని మనసుని నియమించుకుంటే సుఖము, శాంతి. మనసుని అరికట్టుకోలేకపోతే‌ మనకు అనుక్షణము కలతే. ఈవాళ ఆ ఛానల్, రేపు ఇంకోటేదో మనకు కలత కలిగిస్తూనే ఉంటుంది, మనసుని అలా వదిలేస్తే.

దారిలోని ముళ్ళు గుచ్చుకోకుండా‌ చెప్పులు ధరించడం వంటిది మనసుని నియమించుకోవడం. నేలపైనంతా తివాచీ పరవాలనడం కోతివంటి మనసు చెప్పినట్టల్లా‌ ఆడడం.

Ignorance is bliss. అంటే ఏమీ తెలియకపోవడం ఆనందం అని కాదు. I ignore you - అనే sense లో తీసికోవాలి.
ఈ ఆంగ్ల సామెత అసలు అర్థం ఏమిటంటే, పట్టించుకోకుండా ఉండడం హాయినిస్తుంది అని.
దీనిని కావలిస్తే, దేనిని పట్టించుకోవాలి, దేనిని పట్టించుకోనవసరం లేదు అనే విచక్షణను కలిగి ఉండడం మానసిక ప్రశాంతతకు అత్యవసరం అనీ అన్వయం చేసికోవచ్చు.

అనవసరంగా పట్టించుకోవడం అశాంతి. విచక్షణను ఉపయోగించి పట్టించుకోవడం, పట్టించుకోకపోవడం చేస్తే మన మానసిక సుఖశాంతులకు లోటుండదు. భంగమూ వాటిల్లదు.

శుభం భూయాత్!

**********

 బ్రాహ్మణులు-హిందూమతము

బ్రాహ్మణులను గౌరవించక హిందూ మతము పునరుద్ధరింపబడదు. బ్రాహ్మణులను పక్కన పెట్టి, అగౌరవపరుస్తూ, అమర్యాద ‌చేస్తూ హిందూ మతాన్ని‌ పునరుద్ధరింప బూనడం‌ అమాయకత్వం. పసితనం. జరగని పని.

హిందూమతానికి బ్రాహ్మణులు పునాది, సన్యాసులు కాదు. బౌద్ధము, జైనములకు సన్యాసులు పునాది. హిందూమతమునకు గృహస్థులు పునాది. బ్రాహ్మణులను, గృహస్థులను తక్కువగా చూస్తూ, కించ పరుస్తూ, అగౌరవపరుస్తూ, అమర్యాద చేస్తూ హిందూ మతాన్ని పునరుద్ధరించబూనడం వెఱ్ఱి పని.
గృహస్థాశ్రమాన్ని, బ్రాహ్మణులను ద్వేషిస్తూ‌ హిందూమతాన్ని పునరుద్ధరించే ఊహ అపోహ.
 
హిందూ మతానికి బ్రాహ్మణులు ముఖ్యమే గాని, హిందూమతం బ్రాహ్మణుల సొత్తు కాదు. హిందూమతం నిలవాలని అందరూ అనుకుంటేనే నిలుస్తుంది. నిలవనక్కర లేదనుకుంటే కాలగర్భంలో కలిసిపోతుంది.
*********

శుష్క వచనములు - శూన్యహస్తములు

అందరూ కవులే కవిత్వం చదివేవారే అరుదు
అందరూ నాయకులే ప్రజాసేవ చేసేవారే అరుదు
అందరూ మేధావులే వారిలో మేధ మాత్రం అరుదు
అందరూ గురువులే పరమాత్మను దర్శించిన వారే అరుదు
అందరూ స్కూళ్ళు నడిపేవారే చదువు రావడమే అరుదు
అందరూ సంఘసేవకులే ఇళ్ళల్లో మాత్రం సేవ అరుదు
అందరూ సమాజాన్ని నడపాలనుకునేవారే నడపగలిగిన వారు మాత్రం అరుదు
అందరూ జీవకారుణ్య ఉపన్యాసకులే కోడి, మేక, పంది
మాంసములను తినని వారే అరుదు

కబుర్లు ఘనం ఆచరణకు గ్రహణం
నేటి మన భారత పర్వం ఒక నిరంతర
ఆషాఢభూతుల మయం రెండు నాలికల
ధోరణులు ప్రబలం అంతా శూన్యహస్తం



Monday, January 4, 2016

కాలము-సమయము-కాలాతీతము-మానసాతీతము-రామబ్రహ్మము

కాలము-సమయము-కాలాతీతము-మానసాతీతము-రామబ్రహ్మము

సమయము, కాలము వేరు. కాలము పరిణామము. సమయము కాల వ్యవధి. కాలము శక్తి లేక శక్తి ప్రేరిత పదార్ధ పరిణామము. పదార్ధము ద్వారా శక్తి రూపపరిణామమూ కాలమే. కాలము కలనము. కలనము అంటే లెక్క బెట్టుట. మనము అనుకునే కాల ప్రవాహము నిజానికి శక్తి లేక పదార్ధ పరిణామము. శక్తి, పదార్ధ పరిణామములు చర్యలను, ప్రతిచర్యలను, ఆంతర చర్యలను కలిగిస్తాయి. శక్తి, పదార్ధ పరిణామములు లేక ఎటువంటి చర్యలు జరగవు. చర్యలు లేక కాలము కాని, కాల గతి, గమనము కాని లేవు. కాలపు ఉనికి చర్యలు జరగడంపై ఆధారపడి ఉంటుంది. 

కాల స్పృహ, కాలగమన దృష్టి శక్తి, పదార్ధ పరిణామ గ్రహణలు. ఈ గ్రహణలు ఆగిపోతే మనము కాలాతీత స్థితిని అనుభవిస్తాము. గ్రహణారాహిత్యమే కాలాతీతము, మానసాతీతము కూడా. మనసు ఉనికి లేక కాల స్పృహ, కాలపు ఉనికి లేవు. మన గాఢనిద్ర మానసిక దశలో మనసు పనిచేయక విరమింపబడి ఉంటుంది. అన్ని తలపులు, అనుభవములు స్పృహలోనుండవు. దృష్టి విశ్రాంతమై ఉంటుంది.

ఈ స్థితిని జాగ్రత్ సుషుప్తి అంటారు. ఇది మానసాతీత ఆత్మ దశ. శాంతమన్నా, ఆనందమన్నా, మౌనమన్నా, మోక్షమన్నా, నిర్వాణమన్నా, శుద్ధాహం స్థితియన్నా, ప్రజ్ఞాన స్థితియన్నా, నిర్మల మానసిక స్థితియన్నా, పరా స్థితియన్నా, భక్తి స్థితియన్నా, రస స్థితియన్నా, దివ్య స్థితియన్నా, భగవత్ స్థితియన్నా ఇదే. జీవబ్రహ్మైక్య స్థితియన్నా ఇదే. ఈ దశలో వ్యక్తిత్వము విస్మరింపబడి ఉంటుంది.

ఆత్మారామ స్థితియన్నా, రామబ్రహ్మ స్థితియన్నాఇదే. సమస్త వేదాంత, సకల ఉపనిషత్ సార అవగాహనము, గమ్యము, ఆధ్యాత్మిక జీవన ఫలము ఈ స్థితిని పొంది, అందు సదా నిలిచి ఉండడమే.

ఏతత్ సర్వమ్ శ్రీ పరమేశ్వరార్పణమస్తు!
సమస్త సన్మంగళాని భవంతు!
భగవత్ ప్రీతిరస్తు!