Monday, October 15, 2018

చీకట్లో మగ్గుతున్నాయి; అమ్మ; తప్పుడు రోగనిర్ణయం, నిర్ధారణ; విలయం; Spray Advertisements; సన్యాసి ధర్మం; గురివింద గింజలు; శ్రేయస్కరం; జీవితం

చీకట్లో మగ్గుతున్నాయి

పురుషుని ఆనందం కోసం కాదు స్త్రీ; అవును సృష్టి పెంపు కోసం స్త్రీ
ఎవరింటి పనులు వారు చేసుకోవడం డిగ్నిటీ ఆఫ్ లేబర్;
కాదు మగవానికి దాస్యం; అవును ఇంటికి దీపం
మనింటి పనికి పనిమనిషి
ఇంకో కార్పొరేట్ ఆఫీస్ లో మనం పని మనుషులం
ఏదో పని చేయక స్త్రీ పురుషులు ఉండరాదు;
బయటకు వెళ్లి ఉద్యోగం చేయడమే, వాళ్ళు
అతి తక్కువ జీతం ఇచ్చినా సరే, అనేది విచారించ
వలసిన విషయం; ఇళ్ళను పాడుపెట్టుట సంఘాన్ని నిర్మించలేదు; పునాదులు లేక భవనాలు నిర్మించ లేము; అమ్మలు లేక పసికందులు ఎదగరు;
తల్లే అమ్మ అవుతుందో మెయిడ్ కి ఇచ్చి పెంచమంటుందో?
ఏది ఏమైనా పసికందులకూ మానవ హక్కులు ఉంటాయి
నోరు విప్పి చెప్పలేరు గనుక మన ఆటలు సాగుతున్నాయి
చెప్పినా ప్రయోజనం లేదు గనుక వృద్ధాశ్రమాలు
వెలుగుతున్నాయి; ఇళ్ళు చీకట్లో మగ్గుతున్నాయి
*********
కాల్పనిక సాహిత్యం పాఠకుల కన్న స్రష్టలకే ఎక్కువ ఉపయోగ పడుతుంది. వారికి పేరు, డబ్బు, అవార్డులు రావచ్చు. పాఠకునికి కనీసం మానసిక
ఆహ్లాదం కూడా కలగక పోవచ్చు.
********
Attachment is formidable trait of middle class families of yester years and also reluctance to spend unnecessarily.
*********
అమ్మ
అమ్మని ఆకాశానికి ఎత్తే ముద్దుగుమ్మలు తాము మాత్రం అమ్మలై అనురాగం పంచడానికి తొందర పడరు
అమ్మ మీద కావ్యాలు రాసే వాళ్ళు అమ్మలు కారు
అమ్మను దేవత చేసి తాము మాత్రం మర్త్యులు గానే ఉంటారు అమ్మాయిలు; ఎందుకీ ఉత్తుత్తి పొగడ్తలు
మానవ జీవితం జీవించాలి దాటి ఎన్నో అగడ్తలు
*********
దసరాలలో భక్తి శ్రద్ధలతో దేవీ పూజ చేయాలని చెప్పేవాళ్ళు, రాసేవాళ్ళు ఎందరు? దేవీ పూజ చేసేవాళ్ళెందరు? తనకు మాలిన ధర్మము లేదు కదా? ఇతరులపై ఉన్న కరుణ మనపై మనము కూడా చూపించుకోవాలి.
**********
తప్పుడు రోగనిర్ణయం, నిర్ధారణ
రచనలు, మన గొంతులు ఆదర్శవంతంగా ఉండొచ్చు. కాని ప్రపంచంలో వాస్తవమే గెలుస్తుంది. ఆడ, మగల మధ్య కామాకర్షణ ప్రకృతి పరిణామం. మగవాళ్ళనే కామాంధులనడం విషయాన్ని సగం మాత్రమే చెప్పడం. కుటుంబాలు, ఇతర నియమాలు మనుషులు ఏర్పరచుకున్నవి. సమయం దొరకగానే దొంగ దొంగతనం చేసినట్టు, అవకాశం ఉంటే మగవాడు స్త్రీని తాకకుండా ఉండలేడు.
ఇది అతని బలహీనతా కాదు, ఆడవాళ్ళ ప్రతిభా కాదు. ప్రకృతి కేళి. స్వభావ హేల. హార్మోనుల ప్రభావం. మనల్ని స్త్రీ పురుషులను చేసేది ఈ హార్మోన్లే. స్త్రీ శరీరంలోపురుష హార్మోన్లు, పురుష శరీరంలో స్త్రీ హార్మోన్లు స్రవిస్తాయి కూడ. అప్పుడు ఆ "స్త్రీ" పురుషుడుగానూ, "పురుషుడు" స్త్రీ గానూ ప్రవర్తిస్తారు. ఇటువంటి ప్రవర్తనని సుప్రీంకోర్టు ఈ మధ్య చట్టబద్ధం చేసింది.
నేరాలు చేసేక శిక్షించడం కన్నా, నేరం జరగకుండా చేసే నీతి పాఠాలు బోధించాలి. నీతి అంటేనే ఆమడ దూరం పరిగెడుతున్నాం మనం.
స్త్రీ, పురుషులు తమ తమ ఆకృతులను, ప్రకృతులను గమనించి, ఎవరికి వారు నియంత్రణగా ఉండాలి. అతి చనువులు చూపి ఏమీ జరగరాదు అంటే కుదరదు.
మనుషుల్లో ఎన్నో లోపాలు. మరెన్నో వికారాలు. ఇవన్నీ నియంత్రించుకునే బలం కలిగించే వ్యవస్థ ఇప్పుడు మనకు లేదు. ఉన్నదాన్ని ధ్వంసం చేసుకున్నాము. రోగం ఒకటైతే, మందు ఇంకొటి వేస్తే గుణం ఎలా కలుగుతుంది?
పునరుత్పత్తి కై ప్రకృతి ఏర్పరచిన ఆకర్షణ కామం. మిగతా జంతువుల లాగానే మనుషుల్లోనూ ముందు అడుగు మగ జంతువు వేస్తుంది. పెళ్ళిళ్ళు, పెటాకులు మనం ఏర్పరచుకున్నవి. మన నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు, సంస్కారం - ప్రకృతి ప్రభంజనం ముందు బలాదూర్.
మనో వికాసం కలిగించే దారులు, ధోరణులు మనకు లేవు. అసలు మనో వికాసమంటేనే రకరకాల నిర్వచనాలు వచ్చాయి. ఈ కప్పలతక్కెడ వ్యవహారంలో నీతులు, నియమాలు, హక్కులు, సమానత్వాలు నిలవవు. మృగత్వం ఒక్కటే నిలిచి ఆడ, మగలను నేరస్థులను చేస్తుంది. ఇది మనం ఉపేక్షిస్తున్న పెను సాంఘిక సమస్య. మగవారి సంస్కరణతో ఆగని జాడ్యం. అందరూ సంస్కరింపబడాలి.
ఉపదేశాలు ఇవ్వడం మానేసి, ఫర్మానాల జారీ పక్కన పెట్టి, ఊకదంపుడు ఉపన్యాసాలు, కబుర్లు, రచనలు ఆపి పురుషులను మాత్రమే నేరస్థులంటున్న ఈ అవ్యవస్థ మారాలి. లేకపోతే మృగాళ్ల వంటి మగాళ్లు, ఆడాళ్ళు తామరతంపరగా పెరిగి నేరాలు చేస్తారు.
మగవాడు తల్లిని, చెల్లిని, అక్కని, కూతురిని తప్ప ఇతరులను వావి వరుసలు లేకుండా కామదృష్టితో చూస్తాడు. ఇది నిజం. అందరకు తెలియవలసిన సత్యం ఇది. అందరకు కలగవలసిన జ్ఞానం. ఇది అతని పైత్యం కాదు. ప్రకృతి శక్తి. మగవాళ్ళనే దుయ్యబట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు. డయాగ్నోసిస్ సరిగా జరగాలి.
గమనిక:
ప్రపంచంలో బుద్ధి, విచక్షణ కలవారు అరుదు. ఇది వరకు సాంప్రదాయ కుటుంబాల్లో వయసొచ్చిన కూతురు, తండ్రి అయినా ఒక గదిలో ఏకాంతంగా ఉండేవారు కాదు అలాగే మిగతా వారు. పూర్వీకులు నియమాలు ఏర్పరస్తూనే, ప్రకృతి ప్రభావం తెలిసిన వారు కనుక జాగ్రత్తలూ తీసికున్నారు. విశ్వామిత్రాదులే భంగపడ్డారు. మామూలు మనుషులెంత? ఆదర్శాల వల్లింపు కన్న వాస్తవం ఆకళింపు చేసుకోవడం అవసరం.
********
విలయం
తల్లి బిడ్డలను సాకననడం విలయం
మానవాళికి పట్టిన పెను తుఫాను
మనుషులు అభిమానాలకన్న
ఆత్మాభిమానానికి పెద్దపీట
వేయడం వారి జీవితాల్లో
పెద్ద ప్రళయం; తెలియలేకున్నారు
విలయం, ప్రళయం ప్రకృతికి
సహజములు; నాశనమూ తప్పనిదే
**********
Nature has made men vulnerable and agitated in issues of courting women. Men are made to evolve in and by nature so; we can also see that in other species.
Thousands of years of civilization, culture and otherwise sayings have no effect on men's behaviour towards women. It is not possible to behave differently for men. It is the attraction decided by nature with men for reproduction when marriages, live-in relationships have not evolved. Nature is most formidable force. The only remedy is less or least Interactions.
***********
ప్రపంచంలో తప్పులెన్నువారు ఎక్కువై పోయారు
వారు తమ తప్పులెరుగరు కదా!
*********
Spray Advertisements
Spray 
advertisements
Girls are shown in spray advertisements to "abandon" their boyfriends and run to the guy who sprayed correct chemical.
The chemistry of girls is shown so fickle and inconsistent. But no girl or feminism is objecting to it. May be later things happen.
******
India is confusing itself. It is expecting its citizens to behave like saints and asking them to live ideally. This is not possible for men or women.
Every human being is a bundle of contradictions. There is no ideal behavior available. But men are targeted for their improper behavior of decades old. It will make a news. That's all. This type of accusations on men in positions or celebrities gives food for distraught.
In these days of mingling of men and women everywhere and freely, given the drink and drug habits of humans in entertainment and elite sections of society, it would be difficult for law and order officials to investigate incidents of yester-years.
Men are made scapegoats in modern living.
*******
సన్యాసి ధర్మం
సన్యాసి ధర్మం వేరు. గృహస్థుల, గృహిణుల ధర్మం వేరు.
లౌకికంలో కలిసి కలగాపులగం అవడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. సనాతన ధర్మం లో సన్యాసం లేదని గమనించండి. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం ఈ మూడే అప్పటి ఆశ్రమాలు. బౌద్ధం, జైనం ప్రభావం వల్ల సన్యాసం "హిందూ" మతంలో ప్రవేశించింది. అదీ కాక గృహస్థాశ్రమం మానవులకు ప్రాణం. అది లేక ఏ ఇతర ఆశ్రమాలు లేవు.
గృహస్థాశ్రమం సన్యాసానికి బంటు కాదు. యజమాని. సన్యాసి ధర్మం తత్త్వ విచారణ, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన, ఒక రోజు కన్న ఉన్నచోట ఉండకపోవడం ఇలా ఎన్నో పారమార్థిక ధర్మాలున్నాయి.
ఆశ్రమాలు స్థాపించుకొని రియల్ ఎస్టేట్, ఆస్తులు, ఇతర ఆధునిక ఉపకరణములు వాడుతూ, గృహస్థులను తేలికగా, లోకువగా చూడడం కాదు.
గృహిణి, గృహస్థుల త్యాగం, ఓపిక, ప్రేమాభిమానాల పంపకం, ఆదరంగా పెంచడం, జీవన ధర్మాలు చెప్పడం వంటివి వారిని పూజ్యార్హులను చేస్తాయి. వారిని మించిన దైవం లేదు.
గృహస్థులను కాక సన్యాసులను రాజకీయ పదవులు అలంకరించేలా చేయడం, వారిని మంత్రులను ముఖ్యమంత్రులను చేయడం గృహస్థులపై అపనమ్మకాన్ని, సన్యాసులపై అమిత నమ్మకాన్ని సూచిస్తాయి.
*******
The Me too hash tag has become a cultural symbol of elite living, digging into willful past.
******
గురివింద గింజలు
ఎవరి గుడి వారిది; ఎవరి సంపాదన వారిది;
అర్చకులు, బ్రాహ్మణులు వంటకములలోని కరివేపాకులు
అందరూ విమర్శించే అగ్ర కులములు మూడు
భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్వహించేది,
అధికారం చెలాయించేది, తద్వారా కలిగే అవినీతికి అనర్ధములకు కారణం ఈ కులాల వారు మాత్రం, మాత్రమే కాదు
గురివింద గింజ వలె తమ నలుపు గమనించక
ఇతరులను ఆడిపోసుకొను బాధ్యతారాహిత్యము
ఈ పాలకులది; వారి కొమ్ము కాయు కుహనా
మేధావులది; కువాదయుత నాస్తిక వాదములది
సంఘమున సుఖశాంతులు లేకుండా చేస్తున్నది
మనుషుల దుష్ప్రవర్తన; ఇంకెవరో కారణమనే
అబద్ధాల దుష్ప్రచారం ఆగాలి; మనందరం సుఖశాంతులతో జీవించాలి; అందరం ఎదగాలి
********
ఆనందా లు ఏల? స్వాములు ఏల?
సన్యాసులేల? ఆధ్యాత్మిక గురువులేల?
బాబాలేల? ఆ ఈ "అమ్మలేల"? ఇందులో ఎవరు
అమ్మలేని బ్రతుకున సౌఖ్యము, హాయి నింపగలరు?
అమ్మ ఉన్న వీరందరూ ఏల? శుద్ధ దండగ!!! అనవసరం!
*********
శ్రేయస్కరం
జీవితాలు పోతే పోయాయి, హక్కులు మిగిలాయా లేవా అన్నదే ఆధునికుల జీవన విధానంలా తయారైంది.
హక్కు వ్యక్తికి సంబంధించినది. బాధ్యత మనం మనవారలైన ఇతరులకు చేసే మన విధి. మన వ్యక్తిత్వంలో భాగం కావలసిన ముఖ్యమైన అంశం.
బాధ్యతారాహిత్యం సంఘానికి చేటు. అశాంతి కారకం.
హక్కులకై పోరాడితే మనం, మన హక్కులు మిగులుతాయి. బాధ్యత స్వీకరిస్తే మన వల్ల ఎందరో సుఖశాంతులు పొందుతారు. హక్కు లభిస్తే మనం ఒక్కళ్ళమే మనకు సాయం చేసుకుంటాం. మనకు మనం అండగా నిలుస్తాం.
అదే మనందరం బాధ్యతలను స్వీకరిస్తే కుటుంబంలో అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటారు. అండగా ఉంటారు. అలా మనం ఒక్కళ్ళమే మనకు అండగా నిలిచే హక్కుల గురించి పోట్లాడక, మనకు ఎందరి సహాయమో లభించే బాధ్యతలను మనందరం స్వీకరించడం తెలివైన పని. అప్పుడు ఒకరికొకరం అండగా ఉంటాం. ఈ సూక్ష్మాన్ని ఎందరో ఆధునికులు గుర్తించలేకపోతున్నారు. హక్కులు హక్కులు అని జపిస్తూ ఒంటరులవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రతి మనిషీ బాధ్యత స్వీకరిస్తేనే జీవితాలు ఒడుదుడుకులను తట్టుకుంటూ సాగుతాయి. హక్కులే కావాలనుకుంటే అందరినీ తిట్టుకుంటూ బతుకుతాము.
ఒకరికొకరు అండ కాక జీవించాలనుకోవడం శ్రేయస్కరం కాదు.
*******
జీవితం
జీవితమొక కఠోర సత్యం
జీవించడం అసిధారా వ్రతం
జీవించడం కాదు నల్లేరుపై బండి నడక
జీవితం కాదు పూలపాన్పుపై శయనం
జీవితం కాదు అందమైన కలలు కంటూ
రమ్యమైన ఊహల విహరిస్తూ చేసే పయనం
జీవించడానికి కావాలి కష్టపడడం అనే కౌశలం
కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయుల తోడు, ఆదరం
జీవించడం కాదు హక్కుల అనుభవించడం
జీవితమంటే బాధ్యతల స్వీకరించడం, తోడు
నీడవడం; మన సహనం, సేవ, ప్రేమాస్పదత,
మన వారి మనుగడకు అత్యవసరం; ఇల్లు వదిలి
సమాజసేవ చేయబూనడం ఇల్లు మంటల్లో
ఆహుతి అవుతుంటే ఇతరులకు నుయ్యి తవ్వడంలో
సాయపడటం; ఎవరికి వారు వారి ఇల్లు చక్క
బెట్టుకుంటే, సమాజసేవకుల అవసరమే లేదు
అనాథలను లేకుండా చేసికుంటే
మదర్ థెరీసాల అవసరమేముంది?
జీవితాన్ని తేలిగ్గా తీసుకోవడం
మన అశాంతిని, అసౌకర్యాన్ని,
అసౌఖ్యాన్ని ఇష్టపడి కొనుక్కోవడం;
జీవించడం పూలబాటపై పయనం కాదు
బాధ్యతాయుతమైన, ఇచ్చి పుచ్చుకోవలసిన
సహ గమనం; కలిసి చేసే ప్రయాణం,
కాదు హక్కుల యావలో యానం;
కాదు ఒంటరి గమనం

Monday, October 8, 2018

కవిత్వం‌; దృక్-దృశ్య వివేకము; పునాదుల పెకలింపు; భగవంతుడు-మనుషులు;Disunited Hinduism

కవిత్వం‌ అంటే‌ లోకువేమో అందరూ కవితలు రాసేస్తారు
కవితలు చదవడం కష్టమేమో‌ ఎవరూ చదవరు కనీసం చూడరు! ఉత్పత్తి ఎక్కువ వినియోగం తక్కువ అయిన సరుకు కవిత్వం‌; సున్నితత్వం పోయి సుమారుతనం రాజిల్లుతూ ఏలుతోంది!
********

దృక్-దృశ్య వివేకము
దృక్ అంటే చూపు.
దృశ్యం అంటే చూడబడేది.
సాధారణంగా కన్ను విషయంలో ఈ మాటలు ఉపయోగిస్తాము. తత్త్వం లో ఈ మాటలకు విస్తృతార్థము ఉంది.
సత్ దృక్. జగత్ దృశ్యము.
సత్ కే ఆత్మ, బ్రహ్మము అని పేరు.
చూపు ఒక్కటే ఉంటే అద్వైతము.
చూపులో జగత్ ఉంటే ద్వైతము.
చూపునే గమనిక, దృష్టి అనీ అంటారు.
దృశ్యం అంటే కంటికి మాత్రమే పరిమితం అయినది కాదు.
జగత్ - విషయ ప్రపంచం, విషయానుభవములైన వాసనలు, వాటిని చూపించే అంతఃకరణములు - మనోబుద్ధ్యహంకారచిత్తములు విరమింపబడి - మాయ వివర్తనము - పురోధాన, తిరోధాన యుత వర్తనము - పొందక, నిర్మల మానసిక స్థితి అనుభవమై ఉంటే, ఇదంతా ఆత్మ చూస్తూంటే దానిని విశ్రాంత దృష్టి అంటారు.
ఇది అద్వైత స్థితి.
జాగ్రత్ సుషుప్తి - మెళకువతో కూడిన నిద్ర, సుషుప్తి - గాఢనిద్ర - నిర్మల మానసిక దశలు అద్వైత స్థితి దశలు. వీటిని ఆత్మ దశలు అనీ అంటారు. ఇప్పుడు చూపు జ్ఞానముగా మాత్రమే ఉంటుంది. జ్ఞాత, జ్ఞేయము ఉండవు. త్రిపుటి ఏర్పడి ఉండదు.
ఆత్మదృష్టిలో, ఆత్మ చూపులో - గమనికలో మానసిక కార్యకలాపాలు - మాయా పరిణామములు - పురోధాన, తిరోధాన - సంభవించి, అంతఃకరణములు దృశ్యములై, విషయ, విషయానుభవములు (వాసనలు, జ్ఞాపకములు, స్మృతి) వాటికి దృశ్యములు అయితే, అది ద్వైత స్థితి. ఇదే త్రిపుటీ విభజనము - జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము గా - విడివడి ఉండి తెలుస్తూండడము.
మనసు జ్ఞానేంద్రియాల ద్వారా బయటి భౌతిక ప్రపంచాన్ని గ్రహిస్తోంటే అది బహిర్ముఖ దృష్టి. దీనికే జాగ్రత్, మెళుకువ అని పేర్లు.
మనసు, ఇతర అంతఃకరణములు; ప్రపంచంగా పిలువబడే విషయ ముద్రలు, వాసనలుగా పిలువబడే విషయానుభవములు గ్రహిస్తే వరుసగా అవి తలపులు, మానసిక స్థితులు గా చెప్పబడతాయి. అప్పుడు దృష్టిని అంతర్ముఖ దృష్టి అంటారు. దీనికే స్వప్న, కల అని పేర్లు.
బహిర్ముఖ, అంతర్ముఖ దృష్టులు మానసిక దృష్టులు. ద్వైతానుభవములు. అవి ద్వైత స్థితులు.
మన దృక్ (చూపు) విశ్రాంత, అంతర్ముఖ, బహిర్ముఖ దృష్టులుగా మారి - జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - జాగ్రత్ సుషుప్తులుగా మన మానసిక కార్యకలాపాలు జరిగేలా చూస్తుంది. జరుపుతూ ఉంటుంది.
మానసిక కార్యకలాపాలు విరమింపబడిన స్థితినే శాంత, మౌన, ఆనంద, ముక్త, మోక్ష, భక్తి, తత్పర, తాత్పర్య, పరా స్థితులు అంటారు. శుద్ధాహం, శుద్ధ జ్ఞాన స్థితి అన్నా ఇదే.
అలా దృక్ అంటే చూపు. భావములు, అనుభవములు, గ్రహణలు, గ్రహింపులు, వ్యక్తీకరణలు ఈ చూపుకి దృశ్యములు.
ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!
***********
7-10-2019:
మగవాళ్ళందరూ దుష్టులు కారు;
ఒక అమ్మాయి రేప్ చెయ్యబడితే
మొత్తం పురుషజాతినే దుమ్మెత్తి
పోస్తారు, నెటిజన్లు, సమాజ సేవకులు
ఆ పురుషుల్లో దుమ్మెత్తి పోసేవారి బాయ్ ఫ్రెండ్,
తండ్రి, భర్త, సోదరుడు, కొడుకు ఉండరు; అలా ప్రతి వాళ్ళకి
కన్సెషన్ ఇచ్చుకుంటూ పోతే మిగిలే దుష్టులైన
పురుషులెవ్వరు? రేప్ లు చేస్తున్నదెవరు?
**********
పునాదుల పెకలింపు
కన్నవారి తోటి, పెళ్లి చేసికున్నవారి తోటి కలిసి మెలిసి ఉండలేని స్త్రీ పురుషులు తమ జీవితాలను ఎలా గడుపుతారు? ఆఫీసే జీవితం, ఫుడ్ జాయింట్లలలో తినడమే సౌభాగ్యం అనుకుంటే కుటుంబాలు ఏమి నిలుస్తాయి? సంసారాలు ఏమి సాగుతాయి?
ఆధునికులు ఈ సత్యాన్ని విస్మరించి తోచినట్లు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. దాని వల్ల నష్టపోయేది తాము కూడా అని వారికి తట్టకపోవడం ఇంగితం లేకపోవడం.
ఏ మనిషీ ఇంకో మనిషి సాయం తీసుకోక, తోడు లేక జీవిత పరిసమాప్తి చేయలేడు.
ఇతరులకి సాయం చేయడానికి మనకు తీరిక లేకపోతే మనకు సాయం చేయడానికి ఎవరికి మాత్రం తీరిక ఉంటుంది? అనారోగ్యాలు, శారీరక, మానసిక బాధలు, వేదనలు, వ్యథలు ఇవి రాకుండా జీవితం పూర్తి అవదు. రాత్రింబవళ్ళలా సుఖదుఃఖాలు, లాభనష్టాలు జీవితంలో భాగం అవుతాయి.
ఈ సత్యాన్ని విస్మరించి జీవించబూనడం మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కోవడం. మన ఇంటి పునాదులు మనమే పెకలించుకోవడం.

6-10-2018:
జ్ఞానదేవులు ఒక చోట అంతఃకరణములు పరమాత్మ విభూతులే కావున పరమాత్మను దర్శించడానికి అవి సరిపోవు అన్నారు. కాని వాటి సాయం తీసికోవచ్చు. జ్ఞానానుభవం జరిగే సమయంలో అవీ జ్ఞానంలో కలిసిపోయి తమ ఉనికిని కోల్పోతాయి. అప్పుడు శాంతి, ఆనందం, మౌనం వెళ్లివిరుస్తాయి.
5-10-2018:
భగవంతుడు-మనుషులు
భగవన్నిర్వచనము
న దేవో విద్యతే కాష్ఠే
న పాషాణే న మృణ్మయే
భావేషు విద్యతే దేవః
తస్మాత్ భావోహి కారణమ్
భావము: భగవంతుడు చెక్కతో చేసిన బొమ్మలో గాని, రాతి విగ్రహములో గాని, మట్టి బొమ్మలో గాని ఉండడు. భగవంతుడు మన భావములలోనే ఉన్నాడు. అంచేత భావములే, భావించ గలగలడమే, భావించడమే అంతకూ, అంతటా పరమాత్మని చూడగలగడానికి కారణం.
न देवो विद्यते काष्ठे
न पाषाणे न मृण्मये।
भावेषु विद्यते देवः
तस्मात् भावो हि कारणम्॥

The Lord lives not in the wooden carving
Nor in the sculpture made of stone or clay;
The Lord lives in our thoughts
And it is through our thoughts that we see him dwell in everything.
ఇది భగవంతుని యొక్క ఒక నిర్వచనము. ఈ నిర్వచనం ఆస్తికులకీ నచ్చదు, నాస్తికులకీ నచ్చదు. భగవంతుణ్ణి అలా భావములకు పరిమితం చేయడం ఆస్తికులకు నచ్చదు. అసలు భగవంతుడు అనే పదం ఉచ్చరించడమే నాస్తికులకు నచ్చదు. భగవంతుని ఉనికి ఏ విధంగానూ లేదని వారి వాదన, నమ్మకం.
అన్ని వాదనలు ఆగిపోయిన పిమ్మట మనలోనే భగవంతుడు వెలుగుతాడు అని ఒక తత్త్వం.
భగవంతుని ఉనికి గురించి ఇలా వివిధములైన ఊహలు, అపోహలు, నమ్మకం, స్ఫూర్తి, స్ఫురణలు ఉండడం మానవజాతికి అనూచానంగా వస్తున్న సాంప్రదాయం. భగవంతుని విషయమై యుద్ధాలు, కొట్లాటలు, నరమేధముల గురించి ఎంత మాట్లాడకుండా ఉంటే అంత శాంతి.
సర్వవ్యాపకుడు, దీనజన రక్షకుడు, కరుణాంతరంగుడు, జగన్నాటక సూత్రధారి, జగన్నాథుడు తన ఉనికి గురించి మానవులు పడే మల్లగుల్లాలు చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఏమో?
భగవన్నియామకంగా అంతా జరుగుతుందని చాలా మంది ఆస్తికులు నమ్ముతారు. తాము మాత్రం భగవంతుడు నిషేధించినవి కూడా నిర్లక్ష్యంగా చేస్తూంటారు. ఇదో వింత. ఇందులో గురువులు, ఆచార్యులు, భక్తులు ఉంటారు.
నాస్తికులెంతసేపూ తమ నమ్మకాన్ని విద్వేష పూరితంగా వెళ్ళగక్కుతూ ఉంటారు. ఆస్తికుల మనోభావాలను తమ మాటలతో, వ్యాఖ్యలతో
గాయపరుస్తూంటారు. మనసా, వచసా, కర్మణా అహింస పాటించడం ఎందరో నాస్తికులకి తెలియదు.
భారతదేశంలోని నాస్తికులు హిందూ మతాన్ని మాత్రమే విమర్శిస్తూ, నిందిస్తూ, అది తమ వాక్ స్వాతంత్ర్యం అంటూ విచ్చలవిడిగా చరిస్తారు. ఇదంతా ఒక గుంపు.
భగవంతుడు మతానికి మాత్రమే చెందుతాడా?
జ్ఞాన స్వరూపుడైన పరమాత్మ వెలుగు అర్చామూర్తిని కొలిచే వారిపైనే ప్రసరిస్తుందా? వేదాంతములు, తత్త్వములు స్వతంత్రత కలిగి లేవా?
ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు భగవంతుని సాయంకోరతారని భగవద్గీతలో శ్రీకృష్ణ ఉవాచ.
సామరస్యంగా, ప్రశాంతంగా, సౌమనస్యంతో, మనసుని నిర్మలంగా ఉంచుకోగలగడం అర్చామూర్తిని కొలవని వారికి నిషిద్ధమా? కుదరదా?
భగవంతుని నిర్వచనం పైన ఉటంకించిన శ్లోకం తాత్పర్యం కాదా? అలా నిర్వచించడం సరి కాదా? సరి పోదా? ఏమో!!
4-10-2018:
మనందరికీ తెలిసిన విషయమే, కాని మనలో ఎక్కువ మంది దృష్టిలో లేని విషయం ఏమిటంటే, మనం బాధలో ఉన్నప్పుడు, వ్యథ అనుభవిస్తున్నప్పుడు ఆత్మీయుల సాన్నిధ్యం, సామీప్యం, ప్రియమైన మాటలు ఇచ్చే ఉపశమనం, కలిగించే ఆహ్లాదము ఎన్ని ఏప్ (app) లు అయినా కలిగించ లేవు.
ఎన్ని పుస్తకాలు అయినా, సామాజిక సాలెగూళ్ళు అయినా, వినోద సాధనాలైనా ఆత్మీయులిచ్చే, కలిగించే శాంతిని కలిగించలేవు. వ్యాకులత పోగొట్టడానికి ఆత్మీయులే సమర్ధులు.
మనం వినోద సాధనాలతో పాటు ఆత్మీయులను కలిగి ఉండాలి. జీవితం సంక్లిష్టమైనది.
మన సుఖదుఃఖాలు, వేదనలు, వ్యథలు, లాభనష్టాలు ఆత్మీయులతో పంచుకోవడం మన మానసిక సమతౌల్యాన్ని నిలుపుతుంది.
**********
Truth is to be experienced, not lectured about!
3-10-2018:
అందరికీ తప్పొప్పులు తెలుసు. తప్పు చేసినా శిక్షించబడటం లేదు కాబట్టి అందరూ తప్పే చేస్తున్నారు. తప్పు చెయ్యకూడదని తెలియక కాదు. అంతా సాగుబడి రోగం. మంచి మాటలకి ఎందరో మనుషులు కాదు.
************
India is a country for the marginalized. So it is converting all citizens as the marginalized except for the politicians, their families, kith and kin, and near and dear. Great achievement is made its own on its own.
********
Disunited Hinduism
Hindus are not United because their first affiliation is to caste, next region, next language and culture and then sub-nationality and no affiliation to Hinduism. And then you have traditional philosophical differences as Advaita etc.,
And thus "Hindus" are divided thoroughly and completely. Community interests are dominating over great Indian culture interests.
So Hindus are in minority because of divisions and self-centred feelings. It is very difficult to make them transcend their selfish interests!
 ********
మనకు నచ్చినవన్నీ ప్రపంచానికి నచ్చవు. మనకు కావలసినట్టు ప్రపంచం మారిపోవాలనుకోవడం పసితనం. వీలయితే ప్రపంచంలో జరిగే, మనకు సంబంధం లేని విషయాలను పట్టించుకోకుండా ఉండ
గలిగితే మన జీవితంలో మన బాధ్యతలు మనం నిర్వర్తించడానికి మన మనసుకీ, బుద్ధికీ వెసులుబాటు దొరుకుతుంది.
*************
మనసు పారవేసుకొనుట తృటిలో పని
సంయమనము చూపుట అభ్యాస గరిమ
మనసుకు రమ్యత కావాలి
వెనుక పొంచి ఉన్న ప్రమాదం తెలియదు
ప్రమోదమే కావాలి అస్తమానూ;
నిగ్రహమంటే చిరాకు మనసుకి
ఊహల పల్లకి ఎక్కడం
ఊసుల ఉల్లాసంలో తేలిపోవడం
రక్తిని కామించడం
మనసుకు ప్రకృతి
ఇటూ అటూ తిరిగి అలిసిపోయి
శాంతి కావాలని అంగలార్చడమూ
దానికి సహజమే; పసిపిల్ల మనసు;
కోరిన వెంటనే కోరినది అందాలి
పసిపిల్లయో, పడుచు పిల్లయో
మనసు మనల ఆడించుచునే ఉండును
2-10-2018:
The quota politicians and intellectuals
In India there is a political class consisting of leaders from various political parties and intellectuals from various communities and ideologies, whose survival instinct is to harp on outdated quota politics.
They do not have any other ability, credibility or commitment for the nation and society.
They are making a living on quota issue.
*********
ప్రజాస్వామ్యం లో ప్రజలు ఏమి కోరుకుంటే అదే వారికి లభిస్తుంది, నాయకుల రూపంలో 
********
We humans waste most of our time in praising, admiring, appreciating, adoring and spreading all good, good leaders, culture, and everything good on earth.
But we do not have time, aptitude or desire to practice all that is good. Humans are experts in vain talkTop of Form
*******