Monday, April 9, 2018

ఆధునికులు - ఆదర్శాలుశాంత రసము; Marriage; అబద్ధం; ఉగాది, కలల మేడలు - ఖాళీ స్థలం; "అమ్మాయికత్వమా"?; First Night

ఆధునికులు - ఆదర్శాలు

ఆధునికులకు ఆదర్శాలు ఎక్కువ, అనుభవం, ఇంగితం చాలా చాలా తక్కువ. వాస్తవ స్థితిని గుర్తించరు. వాస్తవాన్ని మదింపు చేయక ఆదర్శాలు వల్లించడం నిష్ప్రయోజనం. కంఠశో‌ష.
ఆదర్శం ఒక ఊహ. వాస్తవం ఉన్నది. జరిగేది. ప్రకృతి చోదనంలో మనుషుల ప్రవర్తనలు ఉంటాయి. ఆదర్శాలు ధృవ నక్షత్రం వంటివి. ఎవరూ అక్కడకు చేరుకోరు. ఆదర్శాన్ని ఒక దారి తెలియజేసే, దారి చూపే విషయంగా చూస్తూ ఇంగితం ఉపయోగించి జీవించాలి. వస్తు స్థితి ఎఱిగి ప్రవర్తించాలి.
********
శాంత రసము
నవ రసములలో శాంతము ఒకటి. రసము అంటే మానసిక స్థితి. నిజానికి శాంతి కలిగినప్పుడు మనసుకి ఉనికి ఉండదు. ఆ విధముగా అది మానసిక స్థితి కాదు. అయినా శాంతము రసమయింది.
రసోవై సః - అని ఉపనిషద్వాక్యము.
ఇక్కడ రసము అంటే తాత్పర్య స్థితి. తత్ పర స్థితి.
శాంత రసాన్ని నిర్మలమైన మనసు ఆస్వాదిస్తుంది. కరుణ, శాంతము ఒక రకమైనవే అని కొందరు రస వేత్తలు, ఆలంకారికులు అంటారు.
నిర్మలమైన మనసే ఆత్మ, బ్రహ్మము.
ఆత్మ లేక బ్రహ్మము శుద్ధ గమనిక - అప్పుడు గమనికలో ఏమీ ఉండదు.
విషయానుభవము దృష్టిలో ఉంటే అది ప్రేరణనొందిన
వాసన (స్మృతి, జ్ఞాపకము).
విషయము దృష్టిలో ఉంటే అది భావము, తలపు.
అభావమే శాంతము. భావ రాహిత్యమే నిర్మల మానసము.
కరుణశ్రీ గారైన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కరుణరసాన్ని పండించిన తీరులో శాంత రసాన్ని నా రచనల్లో పండించాలి అని చిన్నప్పుడు అనుకునే వాడిని. చిన్నతనంలో శాంత రసాన్ని గురించి అవగాహన ఏమీ లేని రోజుల్లో అనుకున్నాను అలా.
కాస్త పెద్దయ్యాక అనిపించింది, ఏది చదివితే, తలుస్తే, అనుభవమునొందితే మనసు శమిస్తుందో అటువంటి రచనలు చేయాలనుకున్న ఇచ్ఛ అలా కొనసాగుతూనే ఉంది.
ఇంకా రసస్థితి లీన స్థితి. విషయము కలిగించిన అనుభవంలో మనసు లీనమైన స్థితి. రసాస్వాదనా సమయంలో మన వ్యక్తిత్వం ఉండదు. మనసే మన వ్యక్తిత్వాన్ని కలిగిస్తుంది. మనసు అనుభవంలో లీనమై పోయినపుడు వ్యక్తిత్వమూ అనుభవంలో లీనమై పోతుంది. మనసూ, వ్యక్తిత్వమూ విషయానుభవంలో కాని, విషయానుభవాతీత నిర్విషయ స్థితిలో కాని లీనమై పోవడమే రసస్థితి.
మనసు, వ్యక్తిత్వమూ పరమాత్మలో లీనం అయిపోతే
అది శాంత రసస్థితి.
మానసాతీతమైన నిర్మల స్థితిని మనసు ద్వారానే పొంది, ప్రహించి, ప్రవహించి చివర్లో నది సముద్రంలో కలిసినట్లు, లీనమై పోయినట్లు, తలచి, తలపులు కలిగి, కలిగి, చదివిన దానిని మననము చేసి, చేసి, అలా తలపులు కలగడంద్వారా, భననము చేయడం ద్వారా ఆలోకన కలిగి, అవగాహన కలిగి, తలపులు తమంత తాము అప్పుడు ఆగిపోయి, మానసిక నైర్మల్యాన్ని ఇస్తాయి.
అప్పుడు శాంత రసం పండినట్టు. మనసు తాను అదృశ్యం అయిపోయి, లీనమై పోయి, నదీనాం సాగరో గతిః లాగ భావముల గమ్యము భావాతీత అభావ స్థితి.
ఆ శాంత స్థితి మౌనంగా ఉంటుంది. నిర్మలంగా, ఉపశమనంగా, ఆనందానుభవంగా ఉంటుంది. ఇప్పుడు ద్రష్ట, దృష్టి, దృశ్యము అనే త్రిపుటి ఉండదు. ఒక్క విశ్రాంతమైన దృష్టి మాత్రమే ఉంటుంది. నిరంతర నిర్మల దృష్టి అవుతాము.
జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము కనుమరుగై జ్ఞానముగా మిగులుతాము. 
ధ్యాత, ధ్యానము, ధ్యేయము కనుమరుగై నిరంతర ధ్యానము అవుతాము. 
కర్త, క్రియ, కర్మ కనుమరుగై క్రియా ప్రవాహముగా మిగులుతాము. 
విభక్తులు అంతమై భక్తి గా  జీవిస్తాము. 
********
మన అహం ఎక్కడ లయిస్తుందో అదే సత్ గురు పదం. పరమాత్మ స్థలం ‌ స్థానం. వాసం.
******
There is no right marriage.
******
Marriage
Most are marrying considering it a necessary evil than useful and fulfilling bond. Marriage is viewed more as binding than sublime relationship.
Marriage when viewed also as a bond between two families and not merely between two individuals, the help of marriage to individuals will be more fetching.
After all all our attempts are to live a life of comfort and less inconvenience through all the phases of life - infancy, teenage, adulthood and old age and infirm state.
A family is essential to take care of infants and the aged. And for that facility too marriage is to take place.
*********
ఈ ప్రపంచంలో అతి నీచమైన పని తోటి మనిషిని చంపడం.
********
అబద్ధం - జీవన ప్రాముఖ్యం

సినిమా కల్పితం, అబద్ధం
తెరపై వచ్చు బొమ్మలు
రక్త మాంసములు కల
మనుషులు కావు; అబద్ధమునకు
భ్రమసి, జడిసి, తడిసి, మనం
పొందే రకరకాల వికారాలు
మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయరాదు
ఆ బొమ్మల స్వంతదారులైన శరీరధారులు
కారాదు మనకు ఆదర్శాలు, జీవన ప్రాముఖ్యాలు
********
మసాలా లేని కూర
కులాసా లేని యవ్వనము
ఉప్పు లేని పప్పులు
భక్తి లేని హృదయములు
అన్నీ మనుషులు లేని ఊళ్ళు
జ్ఞానులు లేని ప్రదేశాలు, దేశాలు!
*********
ఐదు నక్షత్రాల హోటళ్లను తలదన్నే హాస్పిటల్ లోగిళ్ళు, వైద్యము కన్నా రోగుల పిండుట రివాజు
జైళ్ళను తలపించే కార్పొరేట్ చదువు శాలలు; వాటికి మరియొక పేరు గొడ్లశాలలు, పశువుల కొట్టములు;
అవసరమైన అన్నింటికీ ఈ దోపిడులు భయంకర 
సన్నివేశములు, బాధల, వ్యథల సమూహములు
********
ఉగాది 
ఉగాది, వసంత ఋతువు ఆగమనమున
ప్రకృతి శోభ పరిఢవిల్లు; గమనించు తీరికతో
ప్రకృతితో ప్రకృతిలో పరవశింతుము గాక
కాసేపైన; పూబాలల పలకరించి తరువుల
పచ్చదనములనవలోకించి; కొమ్మల కూయు
కోయిల పాట విని మన మనము; మనము
మనిషి దృష్టి సామరస్యము వైపు మరలు గాక!
మతములు ఇతర విభజనలు ప్రశాంతతను
కాపాడుగాక! భాషను ప్రీతికరముగ మాట్లాడుటకు
ఉపయోగింతముగాక! అందరము ఐక్యతతో
రాజకీయనాయకుల విభజన ‌ఆట కట్టించెదము
గాక! మరీ ఇంద్రియ లౌల్యమున చిక్కకుందుము
గాక! గింజ పొల్లు అవగాహనతో ఆధ్యాత్మికతను
అనుసరించెదము గాక! సతతము ఇష్టదైవనామ
స్మరణమున బ్రతుకులు పండించుకొనెదముగాక!
భక్తి జ్ఞానముల పండు‌ బ్రహ్మైక్యము మనలదగుగాక
*******
కలల మేడలు - ఖాళీ స్థలం
మెళకువలో మనం కట్టుకునే కలల మేడలే మన వ్యక్తిత్వం, ప్రపంచం. దీనినే ఆంతర, లేక అంతర జగత్తు అంటారు.
ఈ కలల మేడలు కట్టని క్రితం ఉన్న ఖాళీ స్థలమే ఆత్మ. పరమాత్మ. బ్రహ్మము. పరబ్రహ్మము.
మెళకువ పోయి గాఢనిద్ర లోనికి జారినపుడు ఈ వ్యక్తిత్వం, ప్రపంచం కనుమరుగౌతాయి. దృష్టి లోంచి తప్పుకుని దృష్టిని విశ్రాంతం చేస్తాయి. మరల మెళకువ ఏర్పడినపుడు దృష్టిలోనికి వచ్చి తదనుగుణంగా అనుభవములను కదిల్చి భావములను కలిగించి మరల మనం కట్టుకున్న కలల మేడలను దృష్టి లోనికి తీసుకువస్తాయి.
అప్పుడు దృష్టి అంతర్ ముఖం అయ్యి క్రమంగా బహిర్ముఖం అవుతుంది. మనసే అంతర్, బహిర్ముఖములవుతూ అన్ని జ్ఞానములను, విజ్ఞానములను, పరిజ్ఞానములను, కళలను కలల మేడలరూపంలో మనలోపల ఏర్పరచి, చూపిస్తూ, భౌతిక ప్రపంచంతో బయట అనుసంధానం కలిగించేది మనసు. మనసు అంతర్హితమైతే వ్యక్తిత్వం, ప్రపంచం కనపడవు. అప్పటికి అన్ని రకాల జ్ఞానములు, కళా నైపుణ్యాలు దృష్టి నుంచి తప్పకుంటాయి. బయటి భౌతిక ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది.
అప్పుడు మనము మానసిక విరామ స్థితిని అనుభవిస్తాము. కలల మేడల నిర్మాణం, మరల గాఢనిద్రలో కనుమరుగై మెళకువ రాగానే విజృంభించే తలపుల రూపమైన వ్యక్తిత్వం, ప్రపంచం, జ్ఞానములు, కళా నైపుణ్యాలు దృష్టిలోకి వస్తాయి.
ఆ విజృంభణ ఆగిపోయి, అది తెలుస్తూ ఉంటే ఆ స్థితిని శాంతానంద స్థితి, లేక మౌన స్థితి లేక మోక్ష స్థితి అంటారు. మోక స్థితిలో మనం కట్టుకున్న కలల మేడలు అదృశ్యమై ఉంటాయి.
అప్పుడు మానసిక స్థలం ఖాళీగా ఉంటుంది. ఖాళీ అయిన మనసే ఆత్మ. నిర్మాణం కరిగిపోయి, లేకుండా పోయి, దానికి ఆధారమైన ఖాళీ స్థలంగా మన మనసు మిగలడమే ముక్తి. నిర్వాణము. వైకుంఠ లేక కైలాస లేక సత్యలోక వాసము. నివాసము.
సమస్త జ్ఞానముల, కళా నైపుణ్యముల మొదలు, చివర ఆత్మయే, పరమాత్మయే. ( శాస్త్ర యోనిత్వాత్ - బ్రహ్మసూత్రములు
భూః, భువః, సువః, మహః, జనః, తపోలోకాలలో నివసించడమే కలల మేడలలో వసించడం. సంసార తాపత్రయాన్ని వహించడం. వ్యక్తిత్వంతో, ప్రపంచానుసంధానంతో కలిగే సుఖదుఃఖానుభవమే సంసారం.
కలల మేడలలో అవసరమైన దానికన్నా ఎక్కువ సమయం వసించక, కర్మలకు కర్తృత్వం వహించక తామరాకు మీద నీటి బొట్టు వలె జీవించడమే
ఆధ్యాత్మిక జీవనము.
తత్త్వ జిజ్ఞాస, జ్ఞాన సాఫల్యము.
*******
ఫేస్ బుక్ లో కాసేపు ఛాటింగ్ చేసిన వాడికి నగ్న చిత్రాలు 
షేర్ చెయ్యడమేమిటి సాఫ్ట్వేర్ ఇంజనీర్

పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని 
పక్కలో చేరడమేమిటి నవయువతి; అంతర్జాలంలో జస్ట్
పరిచయమైనవాడిని నమ్మి పెళ్లి చేసుకుంటానని 
అన్నాడని లక్షలు ఇవ్వడమేమిటి చదువుకొని
ఉద్యోగం చేస్తున్న జవరాలు; ఇంగితం జ్ఞానం 
కొద్దిగా కూడా లేక చరించి మగవాడు మోసం చేశాడనడం

ఎంతవరకు సబబు, ప్రయోజనం? అంతా ఊహలలో
జీవించడమో, ఏమిటీ ఇంత "అమ్మాయికత్వమా"?
********
Our happiness depends on us; not on others. If we choose to be undisturbed and continue with life absorbing all pluses and minuses, with the help of our cultivation of our mind, and a bit of discretion, discrimination, patience and wisdom, which is not ordinarily possible, but an out of the way approach is needed; following it we can remain calm in all exhilarating and testing times. This is not impossible but is possible with effort. All the best.
*******
First Night
Cine star's first night in jail
Is reported and celebrated
As first night after marriage;
Of course first night after marriage
Has lost its romance and passion
Importance and speciality and innocence
After today's lives of promiscuity
Words lose significance as culture
changes; and give another sense
Based on cultivated and nurtured
Priorities and practiced civilization
Words and culture supplement and complement each other as two wedded
Persons; culture is language-based
So are religion, ideology, nationality
And vice versa; culture is inseparable from Language; and language nourishes culture
Words are culture-related
And culture-forming
*******
దొంగలు పడ్డ ఆరునెల్లకి కుక్కలు మొరిగినట్టు, వేల కోట్లు అప్పు తీసుకుని ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోతోంటే మిన్నకుండి, ఎడ్రసుల్లో గూడుపుఠానీ చేసిన తప్పుడు ఎడ్రస్ కార్యాలయాలపై ఇప్పుడు దాడులెందుకు?
ఒకడు ఇంత బాంక్ లని ముంచాడు అంటే వాడికి ఎన్ని బాంక్ ల వాళ్ళు సాయం చేయకపోతే వాడు మోసం
చెయ్యగలడు?
రిజర్వ్ బ్యాంక్ నుంచి, అప్పిచ్చిన బాంక్ లలో నుంచి పని వారు ఆ మోసగాడికి వీలుగా పని చేశారు. అందువల్ల ముందుగా ఎవరూ ఈ మోసాల్ని బయటకు రానివ్వలేదు.
చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి ప్రయోజనం?
*********

No comments:

Post a Comment