Monday, April 16, 2018

తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు; నా నృషిః కురుతే కావ్యమ్!; పిల్లలు - పెట్స్; ; అంతా మిథ్య తలంచి చూచిన; చదువులు ; అంతర్జాలంలో ఘోష

తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు

మంత్రాలకు చింతకాయలు రాలవు
నిరసనలు తెలిపినంత మాత్రమున
దారుణములు ఘోరములు ఆగవు
సిరియాలో ప్రపంచం లో ఎన్నో చోట్ల

మనిషి నాగరీకం నేర్చినప్పటి నుంచీ
ఘోరాలు, దారుణాలు జరుగుతూనే
ఉన్నాయి; బలాత్కారాలు, హత్యలు,
దోపిడులు, మోసాలు, కిరాతకాలు

జరగని దేశం లేదు, సంఘం లేదు
ఇది గ్రహించాలి ముందు; నిర్భయ
తరువాత అంత, అంతకంటె ఘోరాలు
ఎన్నో జరిగాయి; అప్పటినుంచీ రోజూ

జరుగుతూనే ఉన్నాయి; నిరసనలు
కొవ్వొత్తుల ప్రదర్శనలు, అంతర్జాలమున
హడావుడి, ఏదీ జరగలేదు; ఇప్పుడెందుకు
ఇంత హడావుడి? ఏమో? ఖాళీగా ఇళ్ళల్లో

కూర్చుని, లేదా పనీ పాటా లేక అంతర్జాల మాధ్యమాల్లో 
ఆపసోపాలు పడి, గొంతులు చించుకున్న మాత్రాన ఏదీ ఆగదు; మనకు
ఆయాసం తప్ప; మనకు రోడ్లు లేవు; మురుగునీటి పారుదల సౌకర్యం లేదు; 
తాగడానికి మంచినీరు దొరకదు; ఆమ్యామ్యా లేకుండా పని జరగదు

సరియైన పాలన లేదు; మనమే కులాలు, మతాలు,
ప్రాంతాలుగా విడి, ఉపజాతీయతకు ఊపిరులు
పోస్తూ, ఎంతో ఛిద్రం చేస్తున్నాము; విద్యాలయాల్లో,
వైద్యశాలల్లో దోపిడీ నోరుమూసుకుని భరిస్తున్నాము

అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు, చీకటి
ధనార్జన ఎంతో కులాసాగా మన బహిః ప్రాణం
అయ్యాయి; కులగజ్జి ఉంది; వీటి వేటిపైనా ఏ
పోరూ మనం సలపటం లేదు; మనకు నచ్చి

వీటన్నింటినీ పోషిస్తున్నాము; మనోళ్లు అనుకుని
ఎన్నో ఘోరాలను తప్పులను క్షమించేస్తున్నాము
ఇప్పుడెందుకింత రాద్ధాంతం? అంతా ఒక ప్రహసనం
అయ్యి మన సుఖశాంతులను హరించి వేస్తోంది

రోజూ ఒక మానభంగం, కొన్ని హత్యలు, అవినీతి
కుళ్ళు, రాజకీయ నాయకుల కుల, ప్రాంతీయ గజ్జులు
అభ్యంతరం లేకుండా మననిస్తున్నాం! ఈ విషయంలో 
ఇప్పుడు ఎందుకింత రగడ చేస్తున్నాం?

ప్రకృతి ఆకర్షణను పట్టించుకోక,, నియమాలను
ఉల్లంఘించి, పాపపుణ్యాల గురించి మన పిల్లలకు
చెప్పక, వారిని సరిగా తయారుచేయక, తప్పు చేసిన
వాడికి వెంటనే శిక్ష వేయక, మనోడంటే ఒకలాగ,

ఇంకోడంటే ఇంకోలాగ మాట్లాడే, ప్రవర్తించే మనం
ఏం చేయగలం? ఊరికే హడావుడి చేయడం తప్ప;
హత్యలు, మోసాలు, అవినీతి, కుల, ప్రాంత, ఉప
జాతీయతలు మగవారిని, ఆడువారిని సమానంగా

బాధిస్తున్నాయి; వాటికి వ్యతిరేకంగా మనం గళం
విప్పమేమి? అంతా ఒక సరదా అయింది; పండుగలా
జరుపుకుంటున్నారు నెటిజన్లు ప్రతి ఘోరాన్ని; 
ఇదేమి సంస్కృతి? ప్రభుత్వాలను, పోలీసులను,

న్యాయ వ్యవస్థను పనిచేయనీయండి! మన 
అంతర్జాల అదిలింపులకు ఏమీ జరగదు, ఏదీ
ఆగదు; భావి భారత పౌరులని శ్రద్ధగా పెంచండి
ఆడ, మగ, ఉన్నత, నిమ్న, ఉత్తరాది, దక్షిణాది

అంటూ దేశ, సంఘం వ్యతిరేక కేకలు ఆపి, 
అన్ని ఛిద్రాలపై దృష్టి పెడదాం; కర్ణుని చావుకి 
సవాలక్ష కారణాలు ఉన్నట్లు మన దౌర్భాగ్యానికి 
మనతో పాటు ఎన్నో కారణాలు; వాటిని గుర్తించి పరిష్కారాలు 
కనిపెట్టడం మన విధి; తిడుతూ కూర్చోవడం ఒక వ్యాపకం మాత్రమే;

గిరులు గీచికొని విభజనలలో ఊయలలూగుతూ
అక్కర్లేని దానికి గొడవ చేస్తూ, కావాల్సిన వాటిని
నిర్లక్ష్యం చేసి, ఒక వర్గం కొమ్మే కాస్తామంటే అయ్యే
పనికాదు; మనలో మేధావులు లేరు; అరిచేవారు తప్ప
********
నా నృషిః కురుతే కావ్యమ్!

కథలు రాయడానికి, కవితా సృష్టి చేయడానికి, సాహితీ వ్యవసాయం చేయడానికి వ్యక్తి ఎంతో అనుభవం, పరిపక్వత, పరిణితి కలవాడై ఉండాలి. 

సాహితీ రచన తపస్సు వంటిది. భాషా పాటవం కలిగి ఉండడం తప్పనిసరి. భావుకుడై ఉండాలి. హృదయం సున్నితమై స్పందించగలగాలి. విశ్వశ్రేయస్సుని వాంఛిస్తూ అందుకోసమై రచనలు చేయాలి.

నా నృషిః కురుతే కావ్యమ్!

ఒక రచన పాఠకులను ప్రభావితం చేయాలన్నా, వారికి ఉపయోగించాలన్నా రచయితకు నిబద్ధత ముఖ్యం. కరుణ నిండిన మనసుతో కావ్యరచన చేయాలి. తామరతంపరగా రచనలు చేయడం వేరు, తన్మయత్వాన్ని కలిగించే సాహితీ సృష్టి చేయడం వేరు.
భాషను సరిగా నేర్వక రచనా వ్యాసంగం మొదలు పెట్టడం తన శక్తిని, సమయాన్ని వృథా చేసుకోవడం.
పాఠకుల సమయాన్ని వృథా చేయడంతో పాటు వాళ్ళ నిరసనకు, ఆగ్రహానికి గురవుతారు పండితులు కాని రచయితలు.
సాహితీ సృష్టి చేయడం ఒక సువర్ణావకాశం. ఒక బాధ్యత. అది నగ వలె మెరవాలి. మట్టి ముద్దలా పడి ఉండరాదు. ఏదో రాయడం వేరు, సాహితీ విలువలతో రాయడం వేరు. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అయినట్టుగా రచయితలు ఎక్కువైతే సాహితీ సృష్టి పేలవమవుతుంది. రచయిత అనిపించుకోవడం
వేరు, రచయిత అవడం వేరు.
రమణీయార్థ ప్రతిపాదకః శబ్దః కావ్యః!
వాక్యమ్ రసాత్మకం కావ్యమ్!
విశ్వశ్రేయః కావ్యపరమార్థః!
వసుధైవకుటుంబకమ్!
ఇవి రచయితలకు మార్గదర్శకం కావాలి.
********
ఒక్కో పత్రిక ఒక్కో వార్తా మాధ్యమం ఒక్కో పార్టీ కొమ్ము కాయును 
ఆంగ్ల వార్తా మాధ్యమం మోడీని దుమ్మెత్తి పోయును; 
అనవసరంగా రగడచేయును, ఆందోళనల రగుల్చును

పత్రికాధిపతులకు పత్రికా రచయితలకు విలువలు లేవు
వారి వారి ప్రయోజనములు కాపాడుకొనుటకే వార్తా
పత్రికలు వెలయును; ప్రజలకు నిష్పక్షపాతంగా వార్తలు 
అందవు; అందరూ రంగుటద్దములలో చూపేవారే; 
వాస్తవము, నిజము ఎన్నడు చెప్పరు, అంతయు గారడీ
********

పిల్లలను పెట్స్ గా భావించిన
శ్రద్ధగా పెంచెదరేమో ఆధునికులు;
తల్లిదండ్రుల అనాథలుగ భావించిన
వారానికొకసారైనా పండ్లు, పాలు వృద్ధాశ్రమముల
పంచెదరేమో నవ్య తనయాతనయులు;
అయినవారిని ఇడుముల పాల్జేసి ఇతరులకై,
సంఘ సేవకై ఉరుకు, "ఉన్నత శ్రేణి" వారి
సభ్యతలు, నాగరీకములు అర్థం కావు కదా!

*******

అంతా మిథ్య తలంచి చూచిన

బంద్ లు చేశారు విభజననను ఆపలేకపోయారు
అరవై రోజుల అష్ట దిగ్బంధనం బూడిదలో పోసిన 
పన్నీరైంది; మళ్ళీ ప్రత్యేక హోదా సాధనకు బంద్ లు
అంటున్నారు; దిగ్బంధనం చేస్తున్నారు; మళ్ళీ

మామూలే; వీరు సాధించగలిగినది సున్నా; రోజూ ఇతరులను బాధ్యులను చేసి ప్రజలను రెచ్చగొట్టి 
వారి నమ్మకాన్ని, అమాయకత్వాన్ని, నిస్సహాయత, దురభిమానాన్ని వాడుకుని చివరకు చేతులు ఎత్తేస్తారు

అంతా ప్రజాస్వామ్య మర్మం
ప్రజల దుర్యోగం, నాయకుల
కుష్టు రోగం; నాగరీకంగా నయవంచన;
అంతా మిథ్య తలంచి చూచిన
********
చదువులు సరిగా చదువుకోవాలి

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణాలకు మన్ని కాకుండా ఇతరులెవరినో బాధ్యులను చేసి తిట్టిపొయ్యడం రివాజు అయింది. ఆ ఇతరులు ఎవరు?
ఎవరి మట్టుకు వాళ్ళం మంచివాళ్ళమే. మరి ఇన్ని దారుణాలు ఇంత విపరీతంగా ఎలా జరుగుతున్నాయి? మంచివాళ్ళమైన మనమే ఒక అనువైన క్షణంలో ఇలా చేస్తున్నాము.
మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను గురించి బల్ల గుద్ది మాట్లాడే మనం మన బాధ్యతల గురించి, మంచి ప్రవర్తన గురించి మాట్లాడము. ఇతరులలోని రాక్షసత్వాన్ని ఏకి పారేసే మనం మనలోని రాక్షసుణ్ణి గురించి మాట్లాడము.
ప్రభుత్వాలు, రక్షక భటులు తమ విధుల్లో అలసత చూపిస్తున్నారని నిందించే మనం మన రక్షణకి ఏ జాగ్రత్తలు, బాధ్యతా తీసికోము. మన స్వేచ్ఛ మనది, ఎవరో మనని రక్షిస్తూ, కాపాడుతూ ఉండాలి. మనం మాత్రం ఇష్టారాజ్యంగా ఉంటాము.
మనుషులు; దుష్టులు, దుర్మార్గులు కాకుండా ఉండాలంటే సమాజం ఎంతో బాధ్యత వహించాలి.
విద్యాలయాల్లో కాగితాల చదువుతో పాటు జీవితానికి,, జీవనానికీ ఉపయోగించే చదువు కూడా నేర్పాలి.
ఈ సందర్భంలో ఘనమైన నిర్లక్ష్యం చూపి రోబోట్లను,మృగాలను తయారుచేసి, యథేచ్ఛగా సంచరింపచేస్తూ, వాళ్ళు దుర్మార్గాలు చేస్తూంటే, మగవాళ్ళని ఆడాళ్ళు తిట్టుకుంటూ కూర్చోకుండా, తిడుతూ సమయ యాపనం చేయకుండా ఈ దారుణాలకు మూలం ఏదో వెతికి గుర్తించాలి. రోగం తెలుసుకొని వైద్యం చేయాలి.
మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను నియమించు కోవాలి. కట్టడి చేసుకోవాలి. మన రక్షణ అంతా ప్రభుత్వానికి, పోలీసులకు అప్పగించి మనం బలాదూర్ తిరిగితే పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి.
పాపపుణ్యాల గురించి పిల్లలకు చెప్పాలి. పాపాలు చెయ్యకూడదు, పుణ్యాలు చెయ్యాలి అని ప్రోత్సాహించాలి. మనుషులలో పాపభీతి కలిగించాలి. పరాయి స్త్రీ తల్లి వంటిది వంటి సూక్తులు వల్లె వేయించాలి. అవి పాత చింతకాయ పచ్చడులు కాదు. మనిషి ప్రతీది అనుకరించి నేర్చుకుంటాడు. నడత, ప్రవర్తన కూడా ఇందులో ఉన్నాయి..
అన్ని రకాల నేరాలకు సత్వర శిక్ష వేయాలి. నాయకులకి, డబ్బున్న వారికి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండరాదు.
ఇవేమీ లేకుండా మగవాడు మాత్రమే ఆడదాని అన్ని కష్టాలకు కారకుడు అనే దుష్ప్రచారం ఆపాలి. మంచి, చెడ్డ; లింగం, కుల, మత, ప్రాంత, ఉప జాతీయతలపై మాత్రమే ఆధారపడి ఉండవు. మనుషుల తత్త్వం మీద కూడా ఆధారపడి ఉంటాయి.
ఇది విస్మరించి మగవారిని మృగాలుగా చిత్రీకరించి కవితలు, వ్యాసాలు రాసి, వార్తా సమీక్షలు చేసి లాభం లేదు. మన విద్యా వ్యవస్థ బాగు పడక సంఘం బాగుపడదు. ఇక్కడ విద్య అంటే భాషలు, లెక్కలు, జ్ఞాన విజ్ఞాన శాస్త్రాలు భట్టీయం వేయడం మాత్రమే, మాత్రం, కాదు. మనిషికి అవసరమైన సదాచరణను తెలిపే, ప్రోత్సాహించే, పెంచే చదువులు కూడా చదవాలి.
సాధారణంగా మతం, జ్ఞానం ఈ విషయంలో సాయం చేయాలి. దురదృష్టవశాత్తు ఆ సాయం అందటం
లేదు. పైపెచ్చు కొందరి చేతుల్లో చిక్కుకొని, మత, కుల, ప్రాంతీయ, ఉప జాతీయతలు ఎన్నో ఘోరాలు చేయిస్తున్నాయి.
ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ప్రకృతి పరంగా ఉన్న ఆకర్షణను దృష్టిలో పెట్టుకొని స్త్రీ పురుషులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను గురించి మాట్లాడాలి.
అందరూ సమానం అనేది అమాయకపు మాట.
********
అంతర్జాలంలో ఘోష
అంతర్జాలంలో ఘోష ఎక్కువై పోయింది. ఏ సంఘటన అయినా, ఏ విషయమైనా నెటిజన్లు చేత రుబ్బైయ్య బడుతోంది.
ఏమిటో అర్థమవదు; సంఘటన జరిగినట్లు మీడియాలో రాగానే వీళ్ళందరూ అక్కడ ఉండి చూసినట్టే సంఘటనను వర్ణించడం, దానిపై వారి కోపతాపాలను ప్రకటించడం, ఆవేశకావేషాలను ప్రదర్శించడం, ఇల్లు పీకి పందిరి వెయ్యడం, అందర్నీ దునుమానడం. తాము ఎంతటి మానవత్వం కలవారో చెబుతూ ఊగిపోవడం. మిగతా వాళ్ళని ఊపెయ్యడం.
ఎందుకింత హడావుడి? ఎందుకింత గందరగోళ పడడం? సృష్టి లో ఈ రోజే దుర్మార్గాలు జరగడం లేదు. మనమే న్యాయమూర్తులమై అందరికీ శిక్షలు వేసెయ్యడం. పూర్వకాలంలో ఎందుకు నియమాలు, నిషిద్ధాలు పెట్టారో, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఎన్ని ఘోరాలు చేయిస్తుంది అనేది అస్సలు ఏమీ తెలియకుండా, సమానత్వాలు, ఆదర్శాలు వల్లిస్తే ఘోరాలు జరగడం ఆగదు.
తమ తమ ప్రకృతికి అనుగుణంగా స్త్రీ పురుషులు వ్యవహరిస్తారు తప్ప మన ఆదర్శాలను, వాదఘోషలను బట్టి ప్రవర్తించరు. ప్రభుత్వాలు, నెటిజన్లు, ఎన్.జి.వోలు ఏ సూత్రాలు చెబుతాయో దానికి అనుగుణంగా సంఘంలో చేతలు ఉండవు.
పాపుణ్యాలు, స్వర్గం నరకం లేవని పాపభీతి చెరిపేసి, అందరూ ఆదర్శంగా ఉండాలి, ప్రవర్తించాలి, జీవించాలి అనడం పసితనం, హాస్యాస్పదం. టెర్రరిస్టులు, నేరస్థులు, దుష్టులు, దుర్మార్గులు అరణ్యంలోని క్రూరమృగాలలా సంచరిస్తూ ప్రవర్తిస్తున్న వేళ, నీతి వాక్యాలు వల్లించి అందరూ ఆదర్శంగా ప్రవర్తించాలి అని సందేశాలు పెట్టడం, గోల చెయ్యడం వృథా ప్రయాస.
విద్యాలయాల్లో నీతి పాఠాలు చెప్పాలి. గౌరవ, మర్యాదలు, సత్ప్రవర్తన నేర్పాలి. అదేమీ చేయకుండా అందరూ యోగి పుంగవుల్లా జీవించి స్త్రీలకి, నిమ్న వర్గాలకి మాత్రమే ఏమీ చేయకూడదని అనడం, వారికి మాత్రమే రక్షణ కావాలనడం అయోమయం నిండిన మనుషులను సూచిస్తుంది.
అందరి యోగక్షేమాలు కావాలనడం విజ్ఞత, యోగ్యత. మరేదైనా బడాయి కబుర్లు మాత్రమే. అందరి సుఖశాంతులు, అందరి సుఖసంతోషాలను కోరుకుందాం. మన కారుణ్యాన్ని ఒక లింగానికో, వర్గానికో మాత్రమే పరిమితం చేయవద్దు. మానవాళి అంతా దుఃఖరహితంగా ఉండేలా ప్రార్థిద్దాం, ప్రవర్తిద్దాం. మన జాగ్రత్తలో మనం ఉందాం. మన యోగక్షేమాలను మనం కూడా చూసుకుందాం. అనవసర రాద్ధాంతం, శుష్క గందరగోళం, కాకి గోల చెయ్యకుండా ప్రభుత్వాలను, రక్షక భట యంత్రాంగాన్ని వాళ్ళ పనులని వాళ్ళని చేసుకోనిద్దాం. మన దుఃఖ ప్రకటనలతో, ఆవేశకావేషాలతో రచ్చ చేసి ఇబ్బంది పడకుందాం. ఇబ్బంది పెట్టకుందాం
సర్వే జనాః సుఖినోభవంతు!
ఆ నోsభద్రాః క్రతవోయంతు విశ్వతః!
సమస్త సన్మంగలాని భవంతు!
********
Wi-fi is all pervading, invisible, untouchable, can not be sensed through sense organs and action organs cannot do anything to it, mind-blowing, mind-glowing like God

Shades of Human personality:అడ్డు; ప్రజలు - నాయకులు ; India and Dravidnadu; కాలక్షేపం కబుర్లు; ఆడ - మగ; బాలలకెందుకండీ భగవద్గీతలు!

Shades of human personality

Every Human being has three shades of personality; first, what others think the individual is; second, what individual thinks about oneself what he/she is; and third, which only his intimate near and dear know and not necessarily even the individual knows he/she is.
*********
అడ్డు
మన ఇష్టాయిష్టాలను బట్టి మాత్రమే విమర్శిస్తే సంఘంలో గొడవలు ఎక్కువై పోతాయి. విమర్శ వ్యక్త్యాతీతంగా ఉండాలి. అప్పుడే నలుగురూ ఆ విమర్శ గురించి ఆలోచిస్తారు.
మన ఇష్టాయిష్టాల ప్రకారం విమర్శిస్తే మన నోటి దురుసుదనం తెలుస్తుంది తప్ప మరేమీ ఒరగదు. 
నేడు భారతదేశంలో ప్రజలు, నాయకులు నోటి దురద తీరడం కోసం మాట్లాడుతున్నారు తప్ప దేశోపయోగం కోసం కించిత్తు కూడా మాట్లాడలేక
పోతున్నారు. నోటిలో అశుద్ధం ఉంచుకొని మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. మాటలు చాలా అసహ్యకరంగా, అసభ్యకరంగా మారాయి.
మీకు నచ్చకపోతే ఎవరినైనా ఎంత మాటైనా అనెయ్యచ్చు. నోటికొచ్చినట్టు తిట్టిపొయ్యచ్చు.
ఈ సంస్కృతిలో నాగరీకులు ఇమడలేరు.
నాగరికత లేని, సౌమ్యత, సభ్యత తెలియని సామాన్యులు నాయకులై, ప్రజలకు అది చేస్తాను, ఇది చేస్తాను అంటే చాలు, ఏం చెయ్యకపోయినా, చెయ్యలేక పోయినా, చెయ్యవలసిన అవసరం లేదనుకున్నా ఏమీ కాదు; నోటికొచ్చినట్టు వదరచ్చు.
నాయకులవడం వల్ల వారు ఈ హక్కుని కబ్జా చేసి తీసేసుకుంటారు.
దుర్మార్గులు, దుష్టుల హవాలో మామూలు మనుషులు చిగురుటాకులలా వణికిపోతున్నారు.
అన్ని రకాల ఛిద్రాలు అనుభవిస్తున్నారు. తమ తమ కుల, ప్రాంత, మత, సిద్ధాంత, ఉపజాతీయతలపై దురభిమానాలతో భారతీయులు ఈ స్వార్థ నాయకులకు వంత పాడుతున్నారు. తమ అభివృద్ధికి తామే అడ్డు అవుతున్నారు. అడ్డు పడుతున్నారు.
*******
ప్రజలు - నాయకులు 
ప్రజలు నిరుపేదలగానే ఉందురు
నిరుపేదయైన నాయకుడు మాత్రము కోట్లకు పడగెత్తును పేదల ఉన్నతికై పోరాడుచు, ఎన్నికల గెలుచుచు, అధికారము పొంది నొక్కుకొనుచు
ప్రజాస్వామ్యమున మోసగాళ్ళే ప్రభువులు
ప్రజల సంక్షేమమునకు అభివృద్ధికి పట్టిన రాహుకేతువులు
*********
India and Dravidnadu
If their political future seems to be over as it is south Indian politicians are treacherous without qualms to divide the nation in the name of welfare to and well-being of citizens. That is what the slogan of Dravidnadu is. Dravidnadu is a Tamil word. Why other south Indians should agree to that?
Is it rest of politicians from remaining southern states do not mind to invite hegemony of Tamilnadu to escape from hegemony of Modi and Shah? Is nation and rest of the citizens so cheap? Does any of the south Indian politicians consulted their citizens? Why they are uttering such irresponsible words? They are very unpatriotic and wily to the least.
Let the evil-minded conduct a referendum. Let the people decide whether they want to live in India or in Drsvidnadu. Such ridiculous, silly, unpatriotic and undemocratic behaviour of politicians must be condemned.
India is not south Indian politicians who dear their possible unemployment and are ready to cede certain portion of India for their selfish ends. This will be fought tooth and nail by the citizens, who are chief and it is their preference which is final who matter in a democracy 
********
కాలక్షేపం కబుర్లు
కాలక్షేపం కబుర్లు వేరు. సాహిత్యం వేరు. అంతర్జాలం పుణ్యమా అని అన్ని రకాల బరుకులు, సరుకు లేక పోయినా, సాహిత్యం అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. నిజానికి సాహిత్యానికి ఒక నిర్వచనం అంటూ లేదేమో?
కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ గురువుగారు వెళ్ళిపోయారు. ఆయన రాతలు గ్రాంథిక భాషగా పరిగణింప బడుతున్నాయి. చదివేవారు లేక చెదలు పడుతున్నాయి.
ఎవరు ఏం రాసినా సాహిత్యమే అన్న జమానా నడుస్తోంది. దాని తోడు ఉపయోగించే భాష మీద ఎన్నో చర్చలు. వ్రాసే భాషని కులాల వారీగా విడదీసి ఒక రకమైన భాషను ఈసడించడం, ఒక రకమైన భాషను విరివిగా వాడడం జరుగుతున్నాయి. యాసల ఘోష ఎక్కువైంది. పాతతరం కవులు, సాహితీ కారులు కులాన్ని అనుసరించి నిరసింప బడుతున్నారు.
ఏమీ రాకపోవడం, తెలియక పోవడం ఘనతగా తయారైంది. ఒక వర్గం వారి గురించి రాసినదే సాహిత్యం, ఒక వర్గం గురించి రాస్తేనే సాహిత్యం అన్న స్థాయికి చేరుకుంది తెలుగు సాహితీ సృష్టి.
ఊకదంపుడుగా, గానుగలా, చెప్పిందే చెప్పి, రాసిందే రాసి అదే సాహిత్యం అంటున్నారు. ఎవరికి వారు పురస్కారాలు పొందుతున్నారు.
సాహితీ పఠనం, సాహితీ సృష్టి, వర్గాలుగా, వాదాలుగా విడి, శుష్క వచనములు, శూన్యహస్తములుగా తయారైంది సాహితీ రంగం. వాద ప్రియుల పిడివాదములుగా రూపు దిద్దుకుంటోంది.
కాలక్షేపం కబుర్లే సాహితీ సృష్టి, వర్గాలుగా విడి ముష్టి యుద్ధాలకు దిగడమే సాహితీ చర్చలుగా అనిపిస్తోంది.
సాహిత్యం అంటే నిర్వచనం తెలియకుండా పోయింది.
*******
ఆడ - మగ


"మగవాళ్ళ కంటే ఆడవాళ్ళమైన మేము ఎంతో గొప్పవాళ్ళము,
అన్నింటిలో వారికన్నా నిపుణులము"
అని చాటే మగువలు ఎక్కువైపోయారు!
"అమ్మాయిలు అబ్బాయిలను మించిన
వారు; ఆడపిల్లలా మగపిల్లలు ఉండలేరు
ఉపయోగపడరు"
అనే ముదితలు కోకొల్లలైయ్యారు
మగపిల్లలకీ మనసుంటుందని
ఈ మాటలకు అది గాయపడుతుందని
తెలియని స్త్రీలు ఇబ్బడిముబ్బడయ్యారు
ఏమిటో?
ముందు సమానం అన్నారు
ఇప్పుడు అధికం, ఉన్నతం అంటున్నారు
అనుకుంటున్నారు;
ముదితల్ పలుకగరాని మాట కలదే?
**********
Human beings other living systems, inanimate objects, organizations, nations, universe - all will have three common things. Origin, sustenance, and destruction. This is true for all creation.
The political party of yester years will be no more after some time. All glory and popularity are gone. Ups and downs are natural for every existence. But unfortunately as Dharmaraja has replied to Yaksha, every one thinks he is permanent and does all sins to make money, name, fame and power.
That is how the mystery and wonder will coexist.
*******
నీరే మనకు ఆధారం 
గాలే మనకు ప్రాణం
తిండే మనకు త్రాణ
మనశ్శాంతే మన ఆరోగ్యం
*******
పసికూనలు, ముసలివగ్గులు పువ్వువంటివారు. ఎంతో నాజూకైన వారు. వారిని మనం ఎంతో సున్నితంగా సాకాలి.
దురదృష్ట వశాత్తు మన జీవన విధానంలో వీరికి ప్రాధావ్యం, స్థానం లేకుండా పోయాయి. స్త్రీని గృహ ప్రాంగణం నుంచి విడదీసి చూడడం దగ్గరనుంచి పసికూనలకు, ముసలివగ్గులకు సంరక్షణ లేకుండాపోయింది.
******
ఉదారస్య తృణం విత్తమ్
శూరస్య మరణం తృణమ్
విరక్తస్య తృణం భార్యా
నిస్పృహస్య తృణం జగత్
ఉదారమైన హృదయం కల వారికి ధనం గడ్డిపరకతో సమానము. శూరునికి మరణం గడ్డిపరకతో సమానము. విరక్తుడైన వానికి రతి సుఖము గడ్డిపరకతో సమానము. ఏదీ పట్టించుకోని వానికి (స్పృహ యందు ఏమీ ఉంచుకోని వానికి) ఈ అంతర్, బహిర్ ప్రపంచాలు, తత్సంబంధ వస్తు విశేషములు, అవి కలిగించే సుఖములు గడ్డిపరక తో సమానము.
*******
రాజకీయమన్న ప్రజాస్వామ్యమున ప్రజల బ్రతుకులతో నాయకుల ఆట
*******
Mute mind is Self.
******
ఘనత గన్న మన రాష్ట్ర రాజకీయ నాయకులకు ఇంట ఈగల మోత, బయట పల్లకి మోత.
********
We are all informing us all unnecessary news as if we can't survive and life is at jeopardy if we are not aware of that event. Most of the incidents are unpleasant and beyond our periphery.
Getting informed of news of disturbing events is better avoided and let us not bother our relatives and friends with our "concerns". These happenings have been happening from times immemorial and recently on a daily basis. Reporting such news as a "celebration" is just unkind and awkward. Let us spare ourselves from knowing of such events and details.
All this sharing is done by most of us on social networking sites to show that we are socially conscious and responsible citizens
and our sympathy is with the victim.
Such shares inconvenience our friends and we can grieve in private if we want to react to every ghastly happening over which we have no control and and are not capable of preventing it. This has been happening almost on daily basis right from Nirbhaya case in Delhi.
Let the police and law enforcing authorities look into it and take care of it. Also let parents educate their wards about the evil world around and be vigilant. That alone will have some effect. All other activities are mere nuisance.
********
In India none of media, opposition parties, citizens does know what to highlight and what to ignore and allow it to disappear from minds.
*******
Evil is more focused. It also takes shelter behind divisions and various sentiment-related issues.
******
India badly needs a spiritual direction. This is most ironical that India, the nation known for its spirituality and which is cradle for spirituality from times immemorial is now bereft of spiritual instructions and followers of spirituality. Most of present intellectuals, rationalists, swamis, acharyas, babas, ammas, scholars are missing in spiritual spirit.
Thus drought in spiritual instruction is most evident and troubling.
******
When the executive is hand in gloves with protestors for political reasons and nothing else, not only cricket matches but also citizens have to shift to accommodate ill-designed acts and ill-defined slogans. Executive has washed its hands off from its responsibility to take care of law and order. If any fringe group can black mail the exacutive, where are government and governance? The irresponsible political leaders both in government and in opposition have their political priorities as primary whatever are the necessities and feelings of the citizens.
Governments pampering and allowing the disruptive forces to have upper hand is the bane of our democracy.
******
బాలలకెందుకండీ భగవద్గీతలు!

బాలలకెందుకండీ భగవద్గీతలు!
బట్టీ పట్టి చిలుకల వలె వప్పచెప్పెదరు
భగవద్గీత అంతరార్థం మనకే పెద్దలకే
తెలియదు; వాళ్ళెంత, వాళ్ళ వయసెంత?
సుమతీ, కృష్ణ శతకములు రామాయణ మహాభారతాలు, భాగవతం పంచతంత్రం, హితోపదేశం, జాతక కథలు సరిపోవు వారికి; మన గొప్పలు వారికి కారాదు విద్యా ప్రావీణ్య ప్రదర్శనలు; ఎంత చెట్టుకు అంత గాలి; తత్త్వావగాహనకు వారింకా ఎదగాలి అన్నప్రాశన నాడే ఆవకాయ అన్నమా?
సత్ప్రవర్తన నేర్పి సరిదిద్దితే చాలు, అదే పదివేలు
తత్త్వం నేర్వడానికి అనుభవాలు కలగాలి, వడి దుడుకులు తెలియాలి; మనసు పరిపక్వత చెందాలి
బుద్ధి పరిణితి పొందాలి; అప్పుడు తత్త్వం మొదలు
పెట్టవచ్చు; బొడ్డూడకుండానే ఉపనిషత్తులు, దర్శనాలు, తత్త్వాలు ఏల? పిల్లలది ఆటపాటల వయసు; వారికి అవే ముఖ్యము; సరియైన చదువు
చెప్పించిన చాలు; చెప్పిన చాలు; కార్పొరేట్ విద్యా
సంస్థలలో అందని ఇంగితం, అనుబంధాల అవసరం
ఇతరులను గౌరవించడం, పరుషంగా మాట్లాడక పోవడం, జీవుల పట్ల కారుణ్యం, దేశభక్తి, దైవభక్తి
నేర్పిన చాలు; బాలలకెందుకండీ భగవద్గీతలు!?
******
నాకు ఇప్పటికీ అనుమానమే!? వాళ్ళు ఎడ్వర్టైజ్ చేసేది సెల్ ఫోన్ కా, కెమెరా కా?!!?
*****
ప్రజాస్వామ్యమంటే ఓట్ల నిష్పత్తిలో
పదవులు పంచిపెట్టడం; కులాల వారీగా
ప్రాతినిధ్యం, పార్టీ టిక్కెట్ల పంపకం; వారందరి
సాయంతో తమ కుటుంబ సభ్యుల పెంపకం
ఐదేళ్ళు రాజధాని సొల్లు కబుర్లతో పాలన సరిపెట్టిన
అధినాయకుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో
ప్లేటు ఫిరాయించి, దారి మార్చి, రానిదానికై రసాభాస చేసి, అందరి చెవుల్లో పువ్వు పెట్టే యత్నం; విషం
కక్కుతున్న వైనం; దేశం విడతీతకు వెనుదీయక ఎట్టి దారుణానికైనా సిద్ధపడుతున్న తరుణం; ఇదంతా ప్రజల బాగుకోసం అనడం కొసమెరుపు, ఇంతటి
"మేధాశక్తి" "చాణక్యం" రాష్ట్ర ప్రజలపాలిట అశనిపాతం
*********



Monday, April 9, 2018

Indian Parliament; మంచి మాటలు; సఖ్యమే శ్రీ రామ రక్ష; Mental Illness; అమ్మమ్మలు-మామ్మలు; కాషాయం; సాహితీ పఠనం

Indian Parliament
In India, parliament functions or not it doesn't matter much. Washing out of entire sessions has become a norm. Every political party is a culprit in parliament's dis-, or mal-functioning.
Parliament is to act and bring in laws. But okaying budget some how and irresponsibly make parliament irrelevant and unnecessary is the fine tuning done to the Indian democracy by its law makers.
Every party is brazenly playing caste, religion, region, sub-nationality cards with impunity risking the disintegration of the nation. No political party or politician works for all citizens. They shamelessly declare that they work for this caste only, that community only, this religion only, that region only, this outdated ideology only, that ages old sub-nationslity only to the detriment of interests of nation and its citizens and get away unharmed playing havoc to the idea and existence of Indian nation.
The citizens are as divided and are unable to do any thing to the destruction of the fabric of Indian nation is still deplorable.
*******
Celebrities get money or media makes them make money in whatever situation the celebrities are. They can make money when they act, pose in advertisements, hold TV programs, do charity, fall in love, break up, marry, divorce, go to jail or any activity. Media and we are the Kalpavrukshams and or Kamadhenus!
*******
నాలుగేళ్ళు ఒక పార్టీతో అంటకాగి, ఆ పార్టీని, పార్టీ నాయకుల్ని మెచ్చుకున్న తీరులో మెచ్చుకోకుండా ఎన్నో రకాలుగా మెచ్చుకొని, రాసుకు పూసుకు తిరిగి; ఇంత బతుకూ బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు, ప్రతి పక్షం వేసిన ఎత్తుకు చిత్తై, ఇంతటి చాణక్యుడు పాలుపోక, తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళినట్లు కాబినెట్ నుంచి బయటకు వచ్చి రావడంతోనే తిట్లు లంగించుకొని రసాభాస చేసికొని, నిప్పుతొక్కిన కోతిలా గంతులేస్తే రాజకీయాల్లో కుదరదు. రాజకీయాలే అయినా ఒక రకమైన నిబద్ధత కావాలి. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది.
నాలుగేళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి, ఏమార్చి, ఇష్టం వచ్చినట్లు పరిపాలించు కొని; తన అసమర్థత కాచుకోవడంకోసం ఇప్పుడు ఇల్లెక్కి, కోడై కూసినా ప్రయోజనం ఉండదు.
తను నాలుగేళ్ళు అంటకాగిన పార్టీ మీద, నాయకుల మీదా విషం కక్కినా అంత ప్రయోజనం ఉండదు. ఇంత వరకు ముఖ్యమంత్రి పీఠం ఎక్కని, సంఖ్యాబలం కల ఒక కులాన్ని భారతీయ జనతా పార్టీ కూడదీసుకో గలిగితే; డబ్బు దస్కం, వ్యాపారాలు, వ్యవహారాల్లో, సంఖ్యాబలం తక్కువ ఉన్నా సింహభాగం ఆక్రమించకున్న కులాలు ఏమీ చేయలేవు. ఎన్నికల్లో ఓడిపోవడం తప్ప. ఇప్పుడు ఆత్మ గౌరవం లాంటి పదాల అర్థం తెలిసిన ఓటర్లు తమ చిత్తానుసారంగా ఓట్లు వేస్తారు.
అప్పుడు ఈ ఆత్మగౌరవాలు, అసమర్థత కలవ్వు.
విషం చిమ్మడం వల్ల ఏ రాజకీయ పార్టీ బాగుపడదు.
ప్రజల జీవన శైలిని బాగు చేయలేదు.
******
మనసుకు కలిగే గాయాలకు లేవు మందులు
మనసున మనసు కలిపిన వారి ఊసులు తప్ప
*******
But high court may grant bail for legal reasons. But this type of persons do not know an entity called "repentance". Times are suitable for such offenders with impunity, of law. Power and money rewrite law and justice. That is why many offenders are outside on bail and will be on bail for life and are never punished. That is why people in power and celebrities are careless and full of disregard for life of animal or human or laws of the land on economic and financial matters.
*******
మంచి మాటలు. అనుభవపు తేటలు. జ్ఞానపు ఊటలు. లోకపు రీతికి ఏళ్ళ అద్దపు ప్రతిఫలనములు.
మాట వినడానికి కూడా నేర్పు కావాలి. ఉపయోగం గుర్తించగలగాలి. మన హక్కుల గురించి కాక మన బాధ్యతల గురించి చెప్పే వాళ్ళ మాటలు వినే ఓపిక అలవరుచుకోవాలి.
వినే మాటలు చెప్పాలి అంటే కుదరదు. అనుభవజ్ఞులైన వారు చెప్పిన మాటలు పథ్యంలా ఇష్టంగా లేకపోయినా ఎంతో ఉపయోగిస్తాయి. 
మన ఇష్టం వేరు. మన కష్టం వేరు. ఇష్టం లేకున్నా, కష్టమైనా జీవితాన్ని చక్కబరచే, చక్కగా ఉంచే మాటలు శిరోధార్యములు.
********
అందరం సమాజ హితం చెప్పేవారమే!
అందరం మానవ సేవయే మాధవ సేవ అనే వాళ్ళమే
కానీ, ఒకరమంటే ఒకరికి పడదు;
ప్రతి చిన్న విషయంలోనూ విభేదాలే
ఈ అస్తవ్యస్త ధోరణితో మనం మన
సుఖసంతోషాలను కాపాడుకోగలమా?
ఎవరు ఎవరిని హింసించినను
అది అగ్గియై అందరను కాల్చును
ఎవరు ఎవరిని దోచినను కష్టములు
అందరికీ సమానంగా అందించబడును
ఎవరు ఎవరిని మోసం చేసినను
అందరమూ మోసపోయెదము
సఖ్యమే శ్రీ రామ రక్ష
శత్రుత్వమే పెద్ద శిక్ష
*********
Mental Illness
Mental illness is certain to devour us when we refuse to love and be loved. Loving begets love. Love is breath of life; balm to many heart aches. When people refuse to love and hence be loved by family members; who refuse to have family members, are sure to suffer from psychological problems, illnesses even though they earn millions and billions.
Where the people who earn mere lakhs stand in this? Their negligence and dislike for fellow humans will cost them dearly.
******
అమ్మమ్మలు-మామ్మలు
అమ్మా! నీకు వయసైపోతోందే! అలిసిపోయావు! విశ్రాంతి తీసుకోవే అనే కూతురు లేదు
అత్తయ్యగారు మీరు కూర్చోండి నేను చేస్తాననే కోడలు లేదు
ఎందుకంటే కూతురూ, కోడలూ తమ తమ ఉద్యోగాలతో బిజీ!
అరవయ్యొచ్చినా, ఒళ్ళు సహకరించక పోయినా
మా తరం ఆడవాళ్ళకు రిటైర్మెంట్ లేదు
కూతురు పిల్లలకో, కోడలు పిల్లలకో మనుమలు మనమరాళ్ళు అనుకుంటా అంతటి చాకిరిని మళ్ళీ చేయాల్సి రావడంతో ఊపిరి పీల్చు కోవడానికి ఖాళీ
లేని, అనడానికి వీలు లేని, మానవ హక్కులు లేని
అమ్మమ్మలు, మామ్మలు వీరు; అన్ని హక్కుల సంఘాల వారు ఎవరూ పట్టించుకోని సమానత్వం లేని
మహిళలు వీరు; నా బొందో అనుకుంటూ
బొందిలో ప్రాణం ఉన్నంత వరకు పని చేసే శ్రమజీవులు
ఇంత చేసిపెట్టే మనవారైన వీరికి
ఏమిటి మనం ఇచ్చే బహుమతి?
వృద్ధాశ్రమ వసతి!!!
*******
కాషాయం మనుషులను మార్చదు మనసులనూ మార్చదు; తెల్లని వస్త్రములు, నెత్తిపై టోపీలు మతగురువులని సూచిస్తాయి అంతే, హృదయ
స్వచ్ఛతను కాదు; మతపాఠశాలలు, మతం పేరుతో
యుద్ధాలు ఒకవిధమైన రజో గుణాన్ని పెంచుతాయి,
తమో ప్రకృతిని పంచుతాయి తప్ప శాంతి, సౌమ్యత, సామరస్యాలను కాదు; ధరించిన దుస్తులు మతాన్ని
తెలియజేస్తాయి, మానవత్వాన్ని, దైవత్వాన్ని కాదు
*****
తమ తమ మతాలను శ్రద్ధతో అనుసరించే వారికన్నా తమ తమ మతాల గొప్పతనాన్ని ఊదరగొట్టే మనుషులే ఎక్కువ. అందుకనే మతాలకు చెడ్డపేరు వస్తుంది.
మతం, కుల, ప్రాంత సామరస్యం ఏ సంఘానికైనా
ఊపిరి. ఆ సామరస్యం దెబ్బ తింటే తమ తమ మతాలు, కులాలు, ప్రాంతాలు వారిని రక్షించలేవు.
మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు, ఈ విభజన సాంఘిక పరిణామ ఫలితం. గతాన్ని తిట్టుకుంటూ కోర్చోవడం కన్నా సామరస్యం కోసం పాటుపబడడం
సంఘానికి అవసరం.
దీనిని నిర్లక్ష్యం చేయడం రివాజయింది. మేధావులు, విద్వాంసులు, పండితులు, తత్త్వవేత్తలు ఈ దుష్పరిణామాన్ని అరికట్టలేకపోతున్నారు. ఇది సంఘానికి చాలా నష్టం. సంఘ క్షేమానికి గొడ్డలి పెట్టు.
మతాలు, భాషలు, కులాలు, ప్రాంతాలు కలిగించే భేద భావములను మనసులోంచి తీసి, వాటికి అతీతంగా వ్యవహరించగలిగితే అవి ఉన్నా ఏమీ నష్టం చేయలేవు.
*******
సాహితీ పఠనం
ఇంచు మించు ఇరవై ఏళ్ల క్రితం వరకు, ఏదన్నా చదవాలంటే, ఏదైనా అచ్చువేసిన దాన్ని, లేదా పుస్తకాన్ని ఆశ్రయించడం తప్పని సరి అయ్యేది. వార్తాపత్రికలు, వారపత్రికలు, పక్ష, మాస పత్రికలు, పుస్తకాలు, పఠనా, సాహితీ పిపాసలను తీర్చేవి.
అంతర్జాలం వచ్చేక ఈ అవకాశం వటుడింతై, అంతై అన్నట్లు పెరిగిపోయింది. కవులకు, రచయితలకు, వ్యాస రచయితలకు పాఠకులు, పాఠకులకు రచనలు ఇబ్బడి ముబ్బడిగా దొరుకుతున్నాయి.
ఇలా రచయితలు, రచనలు కోకొల్లలు అవడం డిమాండ్ కన్న, సప్లై ఎక్కువైన వాతావరణం నెలకొంది. గీటుగీసి ఇది మేలిమి బంగారం, ఇది సత్తు అని తేల్చే సత్తా కలవారు బాగా అరుదైపోయారు.
దీనికి ఒక కారణం, సాహితీ స్రష్టలు, విమర్శకులు, పాఠకులు వివిధ వర్గాలుగా విడిపోవడం. ఈ విడిపోవడాల వల్ల, ఏది గింజ, ఏది పొల్లు నిర్ణయించడం వర్గాల వర్గీకరణ మీద ఆధారపడుతోంది. సర్వ జన శ్రేయస్సును కోరుకునే రచనలు, రచయితలు లేకుండా పోతున్నారు.
సాహితీ పఠనం వర్గాలకు అనుగుణంగా, వర్గాల వారీగా సాగడం, సాహిత్యాన్ని వర్గ సాహిత్యంగా విడదీసి పొగడడం, దునుమానడం ఒక అప్రియమైన, అసాంఘిక వ్యవహారంగా తయారైంది. భాషను, స్రష్టలను యాసను బట్టి, ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి పొగడడం, లేదా తెగడడం ఎక్కువైపోయింది. వస్తువు, సాహితీ మధురిమలు, సొబగులు, అలంకారాలు, శబ్ద, భావ పరిపుష్టి, పరిణితి, ప్రేమ, ప్రణయం, తత్త్వం, భక్తి, భగవంతుడు, ఇలాంటివి అస్సలు గణింపబడడం లేదు. గుర్తింపు కు నోచుకోవడం లేదు.
ఎంతసేపూ వర్గబాధలు, వాద ప్రియత్వం, ఊహలలో ద్వేషం, విద్వేషం రంగరించి తిట్టడం, తప్పు పట్టడం ఊపులో ఉంది. అది మాత్రమే సాహిత్యం అనే మూర్ఖత్వాలు పెరిగి పోయాయి. సామరస్యం అటకెక్కింది.
సౌమ్య వాదము ఎవరికీ పట్టడం లేదు.
*******
Human life is like a river; in the beginning as a small spring, takes course joined by streams and rivulets, goes through hills, falls, passes between hills in valleys, in plains, when "obstructions (dams)" constructed becomes useful for irrigation and produces power and slowly meanders to merge in the sea at the end of the course. Life is a course of river.

ఆధునికులు - ఆదర్శాలుశాంత రసము; Marriage; అబద్ధం; ఉగాది, కలల మేడలు - ఖాళీ స్థలం; "అమ్మాయికత్వమా"?; First Night

ఆధునికులు - ఆదర్శాలు

ఆధునికులకు ఆదర్శాలు ఎక్కువ, అనుభవం, ఇంగితం చాలా చాలా తక్కువ. వాస్తవ స్థితిని గుర్తించరు. వాస్తవాన్ని మదింపు చేయక ఆదర్శాలు వల్లించడం నిష్ప్రయోజనం. కంఠశో‌ష.
ఆదర్శం ఒక ఊహ. వాస్తవం ఉన్నది. జరిగేది. ప్రకృతి చోదనంలో మనుషుల ప్రవర్తనలు ఉంటాయి. ఆదర్శాలు ధృవ నక్షత్రం వంటివి. ఎవరూ అక్కడకు చేరుకోరు. ఆదర్శాన్ని ఒక దారి తెలియజేసే, దారి చూపే విషయంగా చూస్తూ ఇంగితం ఉపయోగించి జీవించాలి. వస్తు స్థితి ఎఱిగి ప్రవర్తించాలి.
********
శాంత రసము
నవ రసములలో శాంతము ఒకటి. రసము అంటే మానసిక స్థితి. నిజానికి శాంతి కలిగినప్పుడు మనసుకి ఉనికి ఉండదు. ఆ విధముగా అది మానసిక స్థితి కాదు. అయినా శాంతము రసమయింది.
రసోవై సః - అని ఉపనిషద్వాక్యము.
ఇక్కడ రసము అంటే తాత్పర్య స్థితి. తత్ పర స్థితి.
శాంత రసాన్ని నిర్మలమైన మనసు ఆస్వాదిస్తుంది. కరుణ, శాంతము ఒక రకమైనవే అని కొందరు రస వేత్తలు, ఆలంకారికులు అంటారు.
నిర్మలమైన మనసే ఆత్మ, బ్రహ్మము.
ఆత్మ లేక బ్రహ్మము శుద్ధ గమనిక - అప్పుడు గమనికలో ఏమీ ఉండదు.
విషయానుభవము దృష్టిలో ఉంటే అది ప్రేరణనొందిన
వాసన (స్మృతి, జ్ఞాపకము).
విషయము దృష్టిలో ఉంటే అది భావము, తలపు.
అభావమే శాంతము. భావ రాహిత్యమే నిర్మల మానసము.
కరుణశ్రీ గారైన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కరుణరసాన్ని పండించిన తీరులో శాంత రసాన్ని నా రచనల్లో పండించాలి అని చిన్నప్పుడు అనుకునే వాడిని. చిన్నతనంలో శాంత రసాన్ని గురించి అవగాహన ఏమీ లేని రోజుల్లో అనుకున్నాను అలా.
కాస్త పెద్దయ్యాక అనిపించింది, ఏది చదివితే, తలుస్తే, అనుభవమునొందితే మనసు శమిస్తుందో అటువంటి రచనలు చేయాలనుకున్న ఇచ్ఛ అలా కొనసాగుతూనే ఉంది.
ఇంకా రసస్థితి లీన స్థితి. విషయము కలిగించిన అనుభవంలో మనసు లీనమైన స్థితి. రసాస్వాదనా సమయంలో మన వ్యక్తిత్వం ఉండదు. మనసే మన వ్యక్తిత్వాన్ని కలిగిస్తుంది. మనసు అనుభవంలో లీనమై పోయినపుడు వ్యక్తిత్వమూ అనుభవంలో లీనమై పోతుంది. మనసూ, వ్యక్తిత్వమూ విషయానుభవంలో కాని, విషయానుభవాతీత నిర్విషయ స్థితిలో కాని లీనమై పోవడమే రసస్థితి.
మనసు, వ్యక్తిత్వమూ పరమాత్మలో లీనం అయిపోతే
అది శాంత రసస్థితి.
మానసాతీతమైన నిర్మల స్థితిని మనసు ద్వారానే పొంది, ప్రహించి, ప్రవహించి చివర్లో నది సముద్రంలో కలిసినట్లు, లీనమై పోయినట్లు, తలచి, తలపులు కలిగి, కలిగి, చదివిన దానిని మననము చేసి, చేసి, అలా తలపులు కలగడంద్వారా, భననము చేయడం ద్వారా ఆలోకన కలిగి, అవగాహన కలిగి, తలపులు తమంత తాము అప్పుడు ఆగిపోయి, మానసిక నైర్మల్యాన్ని ఇస్తాయి.
అప్పుడు శాంత రసం పండినట్టు. మనసు తాను అదృశ్యం అయిపోయి, లీనమై పోయి, నదీనాం సాగరో గతిః లాగ భావముల గమ్యము భావాతీత అభావ స్థితి.
ఆ శాంత స్థితి మౌనంగా ఉంటుంది. నిర్మలంగా, ఉపశమనంగా, ఆనందానుభవంగా ఉంటుంది. ఇప్పుడు ద్రష్ట, దృష్టి, దృశ్యము అనే త్రిపుటి ఉండదు. ఒక్క విశ్రాంతమైన దృష్టి మాత్రమే ఉంటుంది. నిరంతర నిర్మల దృష్టి అవుతాము.
జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము కనుమరుగై జ్ఞానముగా మిగులుతాము. 
ధ్యాత, ధ్యానము, ధ్యేయము కనుమరుగై నిరంతర ధ్యానము అవుతాము. 
కర్త, క్రియ, కర్మ కనుమరుగై క్రియా ప్రవాహముగా మిగులుతాము. 
విభక్తులు అంతమై భక్తి గా  జీవిస్తాము. 
********
మన అహం ఎక్కడ లయిస్తుందో అదే సత్ గురు పదం. పరమాత్మ స్థలం ‌ స్థానం. వాసం.
******
There is no right marriage.
******
Marriage
Most are marrying considering it a necessary evil than useful and fulfilling bond. Marriage is viewed more as binding than sublime relationship.
Marriage when viewed also as a bond between two families and not merely between two individuals, the help of marriage to individuals will be more fetching.
After all all our attempts are to live a life of comfort and less inconvenience through all the phases of life - infancy, teenage, adulthood and old age and infirm state.
A family is essential to take care of infants and the aged. And for that facility too marriage is to take place.
*********
ఈ ప్రపంచంలో అతి నీచమైన పని తోటి మనిషిని చంపడం.
********
అబద్ధం - జీవన ప్రాముఖ్యం

సినిమా కల్పితం, అబద్ధం
తెరపై వచ్చు బొమ్మలు
రక్త మాంసములు కల
మనుషులు కావు; అబద్ధమునకు
భ్రమసి, జడిసి, తడిసి, మనం
పొందే రకరకాల వికారాలు
మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయరాదు
ఆ బొమ్మల స్వంతదారులైన శరీరధారులు
కారాదు మనకు ఆదర్శాలు, జీవన ప్రాముఖ్యాలు
********
మసాలా లేని కూర
కులాసా లేని యవ్వనము
ఉప్పు లేని పప్పులు
భక్తి లేని హృదయములు
అన్నీ మనుషులు లేని ఊళ్ళు
జ్ఞానులు లేని ప్రదేశాలు, దేశాలు!
*********
ఐదు నక్షత్రాల హోటళ్లను తలదన్నే హాస్పిటల్ లోగిళ్ళు, వైద్యము కన్నా రోగుల పిండుట రివాజు
జైళ్ళను తలపించే కార్పొరేట్ చదువు శాలలు; వాటికి మరియొక పేరు గొడ్లశాలలు, పశువుల కొట్టములు;
అవసరమైన అన్నింటికీ ఈ దోపిడులు భయంకర 
సన్నివేశములు, బాధల, వ్యథల సమూహములు
********
ఉగాది 
ఉగాది, వసంత ఋతువు ఆగమనమున
ప్రకృతి శోభ పరిఢవిల్లు; గమనించు తీరికతో
ప్రకృతితో ప్రకృతిలో పరవశింతుము గాక
కాసేపైన; పూబాలల పలకరించి తరువుల
పచ్చదనములనవలోకించి; కొమ్మల కూయు
కోయిల పాట విని మన మనము; మనము
మనిషి దృష్టి సామరస్యము వైపు మరలు గాక!
మతములు ఇతర విభజనలు ప్రశాంతతను
కాపాడుగాక! భాషను ప్రీతికరముగ మాట్లాడుటకు
ఉపయోగింతముగాక! అందరము ఐక్యతతో
రాజకీయనాయకుల విభజన ‌ఆట కట్టించెదము
గాక! మరీ ఇంద్రియ లౌల్యమున చిక్కకుందుము
గాక! గింజ పొల్లు అవగాహనతో ఆధ్యాత్మికతను
అనుసరించెదము గాక! సతతము ఇష్టదైవనామ
స్మరణమున బ్రతుకులు పండించుకొనెదముగాక!
భక్తి జ్ఞానముల పండు‌ బ్రహ్మైక్యము మనలదగుగాక
*******
కలల మేడలు - ఖాళీ స్థలం
మెళకువలో మనం కట్టుకునే కలల మేడలే మన వ్యక్తిత్వం, ప్రపంచం. దీనినే ఆంతర, లేక అంతర జగత్తు అంటారు.
ఈ కలల మేడలు కట్టని క్రితం ఉన్న ఖాళీ స్థలమే ఆత్మ. పరమాత్మ. బ్రహ్మము. పరబ్రహ్మము.
మెళకువ పోయి గాఢనిద్ర లోనికి జారినపుడు ఈ వ్యక్తిత్వం, ప్రపంచం కనుమరుగౌతాయి. దృష్టి లోంచి తప్పుకుని దృష్టిని విశ్రాంతం చేస్తాయి. మరల మెళకువ ఏర్పడినపుడు దృష్టిలోనికి వచ్చి తదనుగుణంగా అనుభవములను కదిల్చి భావములను కలిగించి మరల మనం కట్టుకున్న కలల మేడలను దృష్టి లోనికి తీసుకువస్తాయి.
అప్పుడు దృష్టి అంతర్ ముఖం అయ్యి క్రమంగా బహిర్ముఖం అవుతుంది. మనసే అంతర్, బహిర్ముఖములవుతూ అన్ని జ్ఞానములను, విజ్ఞానములను, పరిజ్ఞానములను, కళలను కలల మేడలరూపంలో మనలోపల ఏర్పరచి, చూపిస్తూ, భౌతిక ప్రపంచంతో బయట అనుసంధానం కలిగించేది మనసు. మనసు అంతర్హితమైతే వ్యక్తిత్వం, ప్రపంచం కనపడవు. అప్పటికి అన్ని రకాల జ్ఞానములు, కళా నైపుణ్యాలు దృష్టి నుంచి తప్పకుంటాయి. బయటి భౌతిక ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది.
అప్పుడు మనము మానసిక విరామ స్థితిని అనుభవిస్తాము. కలల మేడల నిర్మాణం, మరల గాఢనిద్రలో కనుమరుగై మెళకువ రాగానే విజృంభించే తలపుల రూపమైన వ్యక్తిత్వం, ప్రపంచం, జ్ఞానములు, కళా నైపుణ్యాలు దృష్టిలోకి వస్తాయి.
ఆ విజృంభణ ఆగిపోయి, అది తెలుస్తూ ఉంటే ఆ స్థితిని శాంతానంద స్థితి, లేక మౌన స్థితి లేక మోక్ష స్థితి అంటారు. మోక స్థితిలో మనం కట్టుకున్న కలల మేడలు అదృశ్యమై ఉంటాయి.
అప్పుడు మానసిక స్థలం ఖాళీగా ఉంటుంది. ఖాళీ అయిన మనసే ఆత్మ. నిర్మాణం కరిగిపోయి, లేకుండా పోయి, దానికి ఆధారమైన ఖాళీ స్థలంగా మన మనసు మిగలడమే ముక్తి. నిర్వాణము. వైకుంఠ లేక కైలాస లేక సత్యలోక వాసము. నివాసము.
సమస్త జ్ఞానముల, కళా నైపుణ్యముల మొదలు, చివర ఆత్మయే, పరమాత్మయే. ( శాస్త్ర యోనిత్వాత్ - బ్రహ్మసూత్రములు
భూః, భువః, సువః, మహః, జనః, తపోలోకాలలో నివసించడమే కలల మేడలలో వసించడం. సంసార తాపత్రయాన్ని వహించడం. వ్యక్తిత్వంతో, ప్రపంచానుసంధానంతో కలిగే సుఖదుఃఖానుభవమే సంసారం.
కలల మేడలలో అవసరమైన దానికన్నా ఎక్కువ సమయం వసించక, కర్మలకు కర్తృత్వం వహించక తామరాకు మీద నీటి బొట్టు వలె జీవించడమే
ఆధ్యాత్మిక జీవనము.
తత్త్వ జిజ్ఞాస, జ్ఞాన సాఫల్యము.
*******
ఫేస్ బుక్ లో కాసేపు ఛాటింగ్ చేసిన వాడికి నగ్న చిత్రాలు 
షేర్ చెయ్యడమేమిటి సాఫ్ట్వేర్ ఇంజనీర్

పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని 
పక్కలో చేరడమేమిటి నవయువతి; అంతర్జాలంలో జస్ట్
పరిచయమైనవాడిని నమ్మి పెళ్లి చేసుకుంటానని 
అన్నాడని లక్షలు ఇవ్వడమేమిటి చదువుకొని
ఉద్యోగం చేస్తున్న జవరాలు; ఇంగితం జ్ఞానం 
కొద్దిగా కూడా లేక చరించి మగవాడు మోసం చేశాడనడం

ఎంతవరకు సబబు, ప్రయోజనం? అంతా ఊహలలో
జీవించడమో, ఏమిటీ ఇంత "అమ్మాయికత్వమా"?
********
Our happiness depends on us; not on others. If we choose to be undisturbed and continue with life absorbing all pluses and minuses, with the help of our cultivation of our mind, and a bit of discretion, discrimination, patience and wisdom, which is not ordinarily possible, but an out of the way approach is needed; following it we can remain calm in all exhilarating and testing times. This is not impossible but is possible with effort. All the best.
*******
First Night
Cine star's first night in jail
Is reported and celebrated
As first night after marriage;
Of course first night after marriage
Has lost its romance and passion
Importance and speciality and innocence
After today's lives of promiscuity
Words lose significance as culture
changes; and give another sense
Based on cultivated and nurtured
Priorities and practiced civilization
Words and culture supplement and complement each other as two wedded
Persons; culture is language-based
So are religion, ideology, nationality
And vice versa; culture is inseparable from Language; and language nourishes culture
Words are culture-related
And culture-forming
*******
దొంగలు పడ్డ ఆరునెల్లకి కుక్కలు మొరిగినట్టు, వేల కోట్లు అప్పు తీసుకుని ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోతోంటే మిన్నకుండి, ఎడ్రసుల్లో గూడుపుఠానీ చేసిన తప్పుడు ఎడ్రస్ కార్యాలయాలపై ఇప్పుడు దాడులెందుకు?
ఒకడు ఇంత బాంక్ లని ముంచాడు అంటే వాడికి ఎన్ని బాంక్ ల వాళ్ళు సాయం చేయకపోతే వాడు మోసం
చెయ్యగలడు?
రిజర్వ్ బ్యాంక్ నుంచి, అప్పిచ్చిన బాంక్ లలో నుంచి పని వారు ఆ మోసగాడికి వీలుగా పని చేశారు. అందువల్ల ముందుగా ఎవరూ ఈ మోసాల్ని బయటకు రానివ్వలేదు.
చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి ప్రయోజనం?
*********

Monday, April 2, 2018

స్వర్గం - నరకం; జీవితం; ఎందరో మహానుభావులు అందరికీ వందనములు; బోసి నవ్వులు ; పాఠాలు ; BJP and Congress;

ఋషులైన వేదాంతులు, వేదాంతులైన ఋషులు; సంగ్రహంగా భారతీయ తత్త్వశాస్త్రానికి ప్రతీకలు.
*********
స్వర్గం - నరకం
స్వర్గం అంటే హాయి కలగడం. హాయిగా, సుఖంగా ఉండడం. నరకం అంటే హాయి లేకుండడం. వేదన, బాధ, వ్యథ, నొప్పి ఉండడం.
మనసుకు కలిగే హాయి, నొప్పులే స్వర్గ, నరకాలు. అంతరిక్షంలో ఎక్కడో లేవు. మన పాప, పుణ్య కార్యముల ననుసరించి మనం స్వర్గ నరకములను బ్రతికుండగానే అనుభవించేస్తాం. అలా అనుభవించేలా natural justice చూస్తుంది. మంచి చేసినా, చెడు చేసినా తదనుగుణంగా ఇక్కడే అనుభవించేసాకే ప్రాణాలు విడుస్తాము. ఇహంలో చేసినది ఇహంలోనే అనుభవించేస్తాము.
స్వర్గం, నరకం అనుభవించడానికి చనిపోనవసరం లేదు. బతికుంటే చాలు. చేసిన పనికి మెప్పో, శిక్షో అనుభవించేసి బాల్చా తన్నేస్తాము.
అందుకనే గుడినీ, గుడిలో లింగాన్ని మింగేస్తున్న దుష్టులు, దుర్మార్గులు ఉన్న నేడు మనలాంటి వాళ్ళం కొద్దో, గొప్పో బతుకులీడవగలుగుతున్నాము.
Hats off to natural justice.
జీవితం
మనిషికి కష్టాలవసరం. మానసిక సంఘర్షణలవసరం. ఇష్టమైనవి అందకపోవడం, ఇష్టము లేనివి జరగడం అవసరం. భార్యా భర్తలు, అత్తా కోడళ్ళు, తండ్రీ కొడుకులు, తల్లీ కూతుళ్లు ఒకరితో ఒకరు విభేదించడం అవసరం. మాటా మాటా అనుకోవడం అవసరం.
జీవితం అస్తమానూ ఒక పున్నమి వెన్నెలలా హాయిని ఇవ్వదు. అమవస నిశలా చీకటి నింపుతుంది. ఇబ్బందులు పెడుతుంది. వీటన్నింటికీ సిద్ధపడి జీవించాలి. ఇష్ట, అనిష్ట అనుభవాలతో మనసు రాటు తేలుతుంది. రాటు తేలాలి.
అనవసరమైన సున్నితత్వాన్ని విడనాడాలి. అవసరమైన సున్నితత్వాన్ని ఉంచుకోవాలి. జీవితం నల్లేరు మీద బండి నడక కాదు. కత్తితో సాము. దానికి తగ్గట్టు మనం మెళకువలు నేర్చుకోవాలి. ఆచరణలో పెట్టుకోవాలి.
మనకు హక్కులతో పాటు బాధ్యతలు ఉంటాయి. కుటుంబంపై అవగాహన లేకుండా పెళ్ళికి సిద్ధం కారాదు. అలా అనవగాహనతో వివాహం చేసికుంటే
మనకీ ఇబ్బందులు, మెట్టినింటి వారికి ఇబ్బందులు.
స్నేహితులు, మనసుకు నచ్చిన బంధువులు, దైవము, మన విచక్షణ, వివేకము జీవితానికి సొబగులిస్తాయి. తీయదనాన్ని పంచుతాయి. పెంచుతాయి.
వార్తా మాధ్యమాలు, అవినీతి సినిమాలు, బాధ్యతలేని కుహనా మేధావులు, వర్గ సంకుచిత సాహిత్యం, లలిత కళలు జీవితాన్ని చిందర వందర చేస్తాయి.
ఇన్నిటిని తట్టుకుంటూ జీవించాలి. వారిని, వీరిని తిట్టుకుంటూ కాదు. 
*********
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వలె
దివికెగసి భువికి రానన లేను
భావకవిత్వ సార్వభౌముడను అనిపించుకోలేను
రామాయణము మరల రాసి 
విశ్వనాథ వారి వలె రాజసమున
జ్ఞాన పీఠ మెక్కలేను; కవి సామ్రాట్ కాలేను
ఆత్రేయగారి వలె మనసు పుట్టుపూర్వోత్తరాలు
తెలిసి కమనీయ గీతములనల్లలేను; చలన చిత్ర
రంగమున చురుకైన పాటలు మాటలు రాయలేను

ఆరుద్ర, శ్రీశ్రీ లవలె సవ్యసాచినై పుర్రచేతి భావముల,
సినీ గేయముల శర సంధానము చేయలేను; సాహితీ
 ప్రకర్షతో, పాండిత్య ప్రతిభతో ఆంధ్రుల సాహితీ చరిత్ర 
గతిని మార్చలేను; పురాతన కవుల చరిత్ర రాయలేను;
సన్మానాలందుకొని రాణించలేను

సాహిత్యమును చదువుకొని పిహెచ్. డి పట్టానంది
ఆచార్యుడను కాలేను; శబ్ద పరిపుష్టితో నారాయణ రెడ్డి 
గారివలె ఆడంబరముగ గీతముల రాయలేను
జ్ఞానపీఠారోహణము చేయలేను; ఉపకులపతి 
కాలేను; భాషాసంఘాధ్యక్షుడ కాలేను;

విశిష్టాద్వైత వేదాంతము సామ్యవాదము సమముగ
బుర్రకెక్కించుకొని సాహితీ స్రష్టనై దాశరథి గారి వలె
నిజాం వ్యతిరేక ఉద్యమం నడపలేను; పాటలతో
శ్రీ కృష్ణ దర్శనము చేయలేను

పాటల మాటల రచనలో పింగళి వారి వలె ఎత్తులకు
ఎదగలేను; సముద్రాలలు, మల్లాదుల వలె భక్తి
వేదాంతముల గీతముల పండించలేను

తెలుగు సాహిత్య పరంపరలో నన్నయ మొదలు
కరుణశ్రీ వరకు సాగిన సాహితీ వ్యవసాయ సస్య ఫలమును ఆస్వాదించగలను

నేనును కవితల సృష్టించగలనంతే
కావ్యముల వెలయించలేను; నేను
సామర్ధ్యమున చిన్నవాడనైనను
ఎందరో మహానుభావులు అందరికీ
వందనములు చేయగలను; వారి సృష్టి 
పఠించ గలను, ఆనందిచగలను; వారసుడనంతవరకే


బోసి నవ్వులు 

బోసి నవ్వులు కల్మషమెరుగని
పసివారలకు బంగరు తొడుగులు
వారి అమాయకపు మాటలు భూషణములు
వాటి మాధుర్యములు మనకు శ్రవణపేయములు
పసితనమున మనసు తెల్లని కాగితము
ఎదిగిన కొద్దీ రకరకాల రాతలు దానిని
"ఖరాబు" చేయును; కాని తప్పదు;
వయసు మీరిన పిమ్మట అన్ని రాతలు
చెరిగిపోవును; మళ్ళీ తెల్లనైన కాగితము
ఆధ్యాత్మిక జ్ఞాన రచనకు సిద్ధమగును; జాగ్రత్తగా
వ్రాయవలెను నారాయణ నామములు, లీలలు,
భోళా శంకరుని కారుణ్యములు, భక్తి ప్రపత్తులతో
అమ్మలగన్నయమ్మ అనుగ్రహములు జ్ఞానానుభవములు; ధవళ కీర్తి చంద్రికలవలె
వెన్నెల వెలుగులిచ్చును ఆ వ్రాతలు; ధన్యమగును
జీవితము నిరంతర పరంధామ నివాసమున

**********
పాఠాలు 

ఈ మధ్యన ప్రైవేట్ స్కూల్స్ లోనూ, కాలేజీలలోను గురువులకు autonomy లేదు. నీతులు చెప్పే స్వాతంత్ర్యం లేదు. యాజమాన్యాల లాభ దృష్టే అంతని, అందరిని నడుపుతోంది. తల్లిదండ్రులు నీతి పాఠాల కన్న కంప్యూటర్ పాఠాలే మిన్న అని, అవి చాలని అంటున్నారు. విద్యాలయాల్లో విద్యార్థినీ విద్యార్థులను జీవితాన్ని ఎదుర్కొనడానికి తయారు చేయడం లేదు.
********
శ్రద్ధ ఆసక్తులు లేక ఏ విద్యా అలవడదు. ఏ కౌశలం స్వంతం కాదు.
********
BJP and Congress


There is no difference between Congress and BJP as far as courting and pampering the vote bank castes and communities are concerned. Parties which exhibit this kind of attitude are burden to the nation. They do not care for the welfare or feelings of rest of the communities as these communities need not be cultivated or are already committed to vote to Congress or BJP. The review petition in SC to review its observation and ruling on the misuse of sc/st act is one glaring example. Does it mean misuse of sc/st act can happen?