కుక్కల, నక్కల పాలు
సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు మన జీవితాలను ప్రభావితం చేసినట్లు మరే వృత్తి వారు చేయడంలేదు. ప్రభుత్వోద్యోగులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు మనతో ఆడుకుంటున్నారు.
సినిమా వాళ్ళు, రాజకీయ నాయకుల తరహాలో మన బ్రతుకులను అస్తవ్యస్తం చేస్తున్నది విద్యా, వైద్య వ్యాపారులూను. రౌడీలు, నేరస్తులు, మృగాళ్లు, మతపిచ్చ వాళ్ళు వీరితో చేరుతారు.
తాము మేధావులము అనుకునేవారు తప్ప నిజమైన మేధావులు ప్రభావితం చేయలేని మనము ముఖ్యంగా ఎందరో కృత్రిమ జనాలచే వంచించ
బడుతున్నాము. ఇలా మనలను వంచిస్తున్న వారిలో
పొట్టకూటికోసం కాషాయం కట్టిన వాళ్ళు, మూర్ఖులైన
మతగురువులు, కులగజ్జి కల కుల నాయకులు, ప్రాంతీయ తత్త్వాన్ని ప్రేరేపించి, కుటుంబ పాలన చేస్తున్న వాళ్ళూ ఉన్నారు.
బడుతున్నాము. ఇలా మనలను వంచిస్తున్న వారిలో
పొట్టకూటికోసం కాషాయం కట్టిన వాళ్ళు, మూర్ఖులైన
మతగురువులు, కులగజ్జి కల కుల నాయకులు, ప్రాంతీయ తత్త్వాన్ని ప్రేరేపించి, కుటుంబ పాలన చేస్తున్న వాళ్ళూ ఉన్నారు.
ఇందరు మన మీద బతుకుతున్నారు. మన ఇష్టాయిష్టాలను వక్రంగా వాడుకొని దురభిమానాలను పంచి,పెంచి, పోషించే కుసంస్కారులు మనలను వాడుకుంటున్నారు. మన జీవితాలు వాడిపోయేలా చేస్తున్నారు.
ఇందరి స్వార్థాలకు బలయ్యే మన జీవితాలు మసిబారిన అద్దాలు. బలిపీఠం ఎక్కిన బలి పశువులు మనం. ఈ దుస్థితి మారాలంటే మనందరి ధోరణులు మారాలి. అజ్ఞానం, దురాశ, వెఱ్ఱి తనాలు పోవాలి. మన పసితనాలు, అమాయకత్వాలు, జ్ఞాన రాహిత్యాలు పోతాయేమోనని ఆశతో సంఘం క్షేమం కోరే రచయితలు, మేధావులు, పండితులు, జ్ఞానులు నిస్వార్థంగా పాటుబడుతూంటారు.
సినిమా వాళ్ళ వ్యామోహం వదిలి; కుల, మత, ప్రాంతీయ, వాదాల దురభిమానాలు విడిచి, దురాశ పక్కకు పెట్టి, మన గురించి, మన పిల్లల గురించి ఆలోచించి, అత్యాశ, అనర్హతతో అందలాలు ఎక్కాలనే అతి తెలివి తేటలు చూపించక, సంఘ క్షేమం కోరే వారి మాట వింటే మన జీవితాలలో ఉపయోగకరమైన మార్పుకు నాంది అవుతుంది.
జ్ఞానులు, మేధావులు, పండితులు, ఇంగితం కల సామాన్యులు మనల్ని నడపడానికి తగిన వాతావరణం మనమే కల్పించుకోవాలి. జ్ఞానులు అంటే ఆధ్యాత్మిక వ్యాపారులు, స్వాములు, మత, కుల, వాదముల ప్రేమికులైన "మేధావులు" కాదు.
**********
జీవితమే లేని జీవితాలు
ఉద్యోగం ఉంటేనే కాని
అబ్బాయిలు అల్లుళ్ళవలేరు
అబ్బాయిలు అల్లుళ్ళవలేరు
ఉద్యోగాలు చేసే అమ్మాయిలు
పెళ్ళికి అమ్మలవడానికీ ఉత్సుకత
చూపరు; పరిణమించి ప్రకృతి
తయారు చేసింది స్త్రీ పురుషులను;
పెళ్ళికి అమ్మలవడానికీ ఉత్సుకత
చూపరు; పరిణమించి ప్రకృతి
తయారు చేసింది స్త్రీ పురుషులను;
కానీ వారు రకరకాల ఆధునిక
జీవన శైలీ గందరగోళంలో, వివిధ
సంస్కృతీ సమారంభములలో చిక్కుకొని
పునరుత్పత్తికి నడుం కట్టలేకున్నారు
జీవన శైలీ గందరగోళంలో, వివిధ
సంస్కృతీ సమారంభములలో చిక్కుకొని
పునరుత్పత్తికి నడుం కట్టలేకున్నారు
కాని అనంగుని ధాటికీ ఆగలేకున్నారు
అంతా అస్తవ్యస్తం చేసికొని ఏవో చదువులు
చదివి పొట్టపోసుకోవడం మాత్రమే జీవితమైంది
వయసు తొందరలు పెట్టే కౌమారంలో కార్పొరేట్
అంతా అస్తవ్యస్తం చేసికొని ఏవో చదువులు
చదివి పొట్టపోసుకోవడం మాత్రమే జీవితమైంది
వయసు తొందరలు పెట్టే కౌమారంలో కార్పొరేట్
కాలేజీ జైళ్ళలో వాసం; ఏదో బతికి బట్టకట్టిన వారు
ఏదో ఇంజనీరింగ్ చదువు వెలగబెట్టి అదృష్టముంటే
ఉద్యోగస్తులు; లేకపోతే ఇంటో కూచోవడాలు;
ఉద్యోగం లేదు, ఉపాధి లేదు; పెళ్ళి పేరంటాలు లేవు
ఏదో ఇంజనీరింగ్ చదువు వెలగబెట్టి అదృష్టముంటే
ఉద్యోగస్తులు; లేకపోతే ఇంటో కూచోవడాలు;
ఉద్యోగం లేదు, ఉపాధి లేదు; పెళ్ళి పేరంటాలు లేవు
అయోమయంలో జీవితాలు; ప్రకృతికి విరుద్ధంగా
జీవనాలు; జీవనాధారం చూపలేని చదువుల్లో సమయం,
జీవనాలు; జీవనాధారం చూపలేని చదువుల్లో సమయం,
ధనం, ఓపిక, వృథా; ఏమీ చేయలేని
నపుంసక నాయకులు; పని కల్పించే పరిస్థితులు
నపుంసక నాయకులు; పని కల్పించే పరిస్థితులు
సృష్టించలేని ప్రభుత్వాలు; ఎలా మన యువతీ
యువకులు ఈ దౌర్భాగ్యాన్ని, దుస్థితిని, నిరాశను
యువకులు ఈ దౌర్భాగ్యాన్ని, దుస్థితిని, నిరాశను
భరిస్తున్నారో! తల్లిదండ్రులు ఎంత గాబరా పడు తున్నారో!
ఉద్యోగం లేదు పెళ్ళి లేదు జీవితమే లేదు;
**********
సుద్దులు బుద్ధులు
సుద్దులు బుద్ధులు
ఇతరులకు సుద్దులు బుద్ధులు చెప్పి వారిని
బాగు చేయాలనే తాపత్రయం ఒక యావ;
బాగు చేయాలనే తాపత్రయం ఒక యావ;
ఆ యావ, ఎవరికి వారు సుద్దులు బుద్ధులు
చెప్పుకునే తాపత్రయంగా మారితే అందరూ
ధన్యులౌతారు; అనవసర ఆయాసం శ్రమ
జనాలకు తప్పుతాయి; తాను పాటించని
ధర్మము, మొదలు చెడ్డ బేరము లేవు కదా!
Charity must begin at home;
చెప్పుకునే తాపత్రయంగా మారితే అందరూ
ధన్యులౌతారు; అనవసర ఆయాసం శ్రమ
జనాలకు తప్పుతాయి; తాను పాటించని
ధర్మము, మొదలు చెడ్డ బేరము లేవు కదా!
Charity must begin at home;
**********
Loving is absorption of identity in Love without leaving a trace of individual.
***********
No comments:
Post a Comment