Tuesday, May 26, 2015

కట్టడములు

కట్టడములు
రాజుల సొమ్ము రాళ్ళ పాలనుచు సామెత
పూర్వకాలమున రాతి కట్టడములపై పాలకులు
ఎంతో ధనము వ్యర్ధము చేసారు అని విమర్శ
మరి ఈనాడు?
త్రాగు నీరు లేక, సరియైన రహదారులు లేక
రవాణా సౌకర్యములు, రైతులకు సరియైన సాయములు
అందించక అందరను కూలీలను చేయుచు ఆత్మహత్యల బారిన
పడవేయుచు; శాంతి భద్రతలను గాలికి వదిలి
విద్యుత్ సరఫరా అరకొరయైన ఇప్పుడు వీటిని
అభివృద్ధి పరచక, ఇంత సొమ్ము కట్టడములపై
ఏల రాష్ట్రములలో ముఖ్యమంత్రులు వ్యర్ధ పరచుచున్నారు?
ఉన్న కట్టడములను ఉపయోగించుకుని పబ్బము గడుపు కొని
సొమ్ముని అభివృద్ధి కార్యక్రమములకు ఖర్చు పెట్ట రాదా?
పూర్వ కాలపు నియంతలైన  రాజులను మించిన పొగరుతో
ఇష్టారాజ్యముగా చేయు దౌర్భాగ్యము రాష్ట్రములకు పట్టుట
ప్రజా స్వామ్య వైఫల్యమునకు దర్పణము, ఏనాడైనా పాలకులెవరైనా
ఆనువంశికమో ప్రజాస్వామ్యమో ప్రజల సుఖ శాంతులు సౌకర్యములు
క్షేమములు అవసరములేదు నాటి రాజులకైనా నేటి
ఈ నూతన ప్రజా నాయక నియంతలకైనా
 
కాలము గడిచినా రాచరికమైనా ప్రజా స్వామ్యమైనా ప్రజల కొరకు
ఏమీ జరగదు; నాయకుల లెక్కలకే పెద్ద పీట ప్రజల నోట దుమ్ము
కట్టడములపై  డబ్బుచేసికొనవచ్చును ప్రజల సౌకర్యములకు
ఖర్చు పెట్టుదానిలో ఇలా మిగలదు; ఏమీ చెయ్యకపోయినా
ప్రజలు మరల ఎన్నుకొనెదరు మాయ మాటలు నమ్మి శుష్క వాగ్దానములకు
భ్రమసి; దీపముండగానే ఇల్లు చక్కబెట్టు కొనుట నేటి నాయకులకు
వెన్నతో పెట్టిన విద్య, ఉగ్గుపాలతో అందిన చాకచక్యము
అయ్యో పాపము ప్రజలు కసాయిని నమ్ము గొర్రెలు!
తమ బాగు తమకే తెలియని వెర్రి బాగుల ఓటర్లు!

No comments:

Post a Comment