మృతము - అమృతము
లిప్త పాటులో మారును నీరు ప్రవాహమున
గడియలో ముగియును జీవి ఉనికి భూమిపైన
లిప్త పాటులో మారును నీరు ప్రవాహమున
గడియలో ముగియును జీవి ఉనికి భూమిపైన
నిమిసమున మారును వ్యక్తి ధనదారిద్ర్యములు
క్షణమున అటు ఇటగును పరిపాలకుల అధికార సంపదలు
అట్టి గడియ లిప్త నిమిసము క్షణము "అమృత"" మగును
నిలిపిన దృష్టి పరంధామునిపై; నిండిన పరమాత్మ సంవిన్మాత్రపు దృష్టిలో
శాంతి ఆనందము నిండి మనసు మౌనమగును
శబ్ద రాహిత్యమున నిశ్శబ్దమే శాశ్వతానుభవమగును
దృష్టి విశ్రాంత మగును రామమగును రామబ్రహ్మమగును
నైరంతర్య గమనికయై వ్యక్తి ధ్యాన రూపమున పరబ్రహ్మమై నిలుచును
ఉనికి - ఉపయోగము
చదివితేనే పుస్తకం అందం ఉపయోగం
పొగిడితేనే రమణి అందం ఉనికి ప్రయోజనం
పడితేనే వర్షం ఉపయోగం
కదిలిస్తేనే కవిత ప్రయోజనం

వదిలేస్తేనే శాంతి మన సొంతం
చదవ వేస్తె పోకూడదు ఉన్న మతి
చదవక ముందు కాకర కాయ అని
చదివేక కీకర కాయ అనకూడదు
చదువుకున్న వానికన్న చాకలి మేలైనా
సంపాదన విషయములో; చదువు లేక
లేదు ప్రగతి, లేదు సాంకేతికత, లేవు అధునాతన
ఉపకరణములు, అవి ఇచ్చే కిక్కులు మనసుపై చేసే ట్రిక్కులు
చదువు మనిషిని జంతువు నుంచి వేరు చేసి చూపుతుంది
చదువు మానసమున కరుణ ప్రేమ నింపుతుంది; మనల
మనీషుల చేస్తుంది; చదువుకోక బిలియన్లు సంపాదించినా
వాళ్ళు మనకు ఆదర్శులు కారు; చదువుకున్న వాళ్ళు కనిపెట్టిన
ఉపకరణములు అమ్ముకుని జీవించే వారిని ఉటంకించి చదువును అవమానించ రాదు
చదువులేక జీవితముందేమో కాని చదువు లేక మనీషి లేడు ప్రగతి లేదు

No comments:
Post a Comment