Friday, February 3, 2017

రథసప్తమి; ఇంజనీరింగ్ కళాశాలలు; ఊపిరి; పాండురంగడు; President Trump; అమ్మాయిలు; Netaji

 రథసప్తమి

ఇవాళ రథసప్తమి. రధసప్తమి కాదు. తెలుగు భాషలోని అక్షరాలను ఎందరో శ్రద్ధగా నేర్వడం లేదు. వారు భాషని సరిగా నేర్చుకోవడం లేదు సరి కదా మిగతా అందరూ మాత్రం తెలుగుభాష నేర్వాలని, తెలుగు సంస్కృతిని కాపాడాలనీ అహర్నిశలూ అంతర్జాలంలోని సాంఘిక సాలెగూళ్ళలో మాత్రం ఈ వర్ణ క్రమ దోషాలతో ఠంచనుగా పోస్ట్ లు పెట్టేస్తున్నారు. ఎందుకో?
 ************

సూర్యనారాయణుడు ప్రత్యక్షదైవము
పద్మనీఉషాఛాయాపతి; మందుని కాలుని
యమునల తండ్రి; మన ఆరోగ్యములకు
శ్రీరామరక్ష; నారాయణస్వరూపుడైన రవి,
భాస్కరుడు మనల కాచుగాక; ఆదిత్యుడు
దివాకరుడు, ద్యుతికరుడు మన మనముల
వెలుగునింపుగాక; మన అజ్ఞాన తిమిరముల
పోగొట్టి హృదయమును ప్రజ్ఞానమయము చేయుగాక


 ********** 
 ఇంజనీరింగ్ కళాశాలలు

 వెలసినవి ఇంజనీరింగ్ కళాశాలలు వీధికొక కిళ్ళీకొట్టు వలె తలారి రాముని
పిల్లల వలె తామర తంపరగ, పుట్టగొడుగుల వలె; చేరిరి, ఎందరో పొందిరి
కాగితము ముక్కలను బదులుగ; ఉద్యోగములు మాత్రము హళక్కాయెను;
వన్నెలు తగ్గినవి, చేరువారును తగ్గిరి; గుడ్డెద్దు చేలోపడినట్టైనది చివరకు
**********
ఈ క్షణమున ఊపిరి తీతుము; మరుక్షణమున కావచ్చును 
తనువు జడము; బుద్బుదప్రాయమైన జీవితమున బరువులెన్నో బాధ్యతలెన్నో
కోరికలెన్నో ఆశాభంగములెన్నో కక్షలెన్నో; క్షణమైన తలవము శ్రియఃపతిని
శివపంచాక్షరిని జపింపము; మూటకట్టుకుపోవువారి వలె వర్తింతుము
***********

పాండురంగడు శ్రీరంగడు కరుణాంతరంగుడు ఆర్తుల,
జిజ్ఞాసువుల, ధనార్ధుల, జ్ఞానుల పాలిటి అంగరంగ వైభోగము; శ్రీమన్నారాయణుడు శ్రీ రుక్మిణీ రస హృదయాంతరంగుడు, భీమానదీ తీరవాసుడు
విఠ్ఠలుడు మనందరికి ఆలంబన ఆశ్రయము విష్ణువు
************
President Trump has achieved in a couple of days with stern message and actions, what all American Presidents couldn't, rather didn't want to do; and on the other hand pampered our neighbour's terrorism sympathies and hand in glove deals and deeds with that country all these decades.
This activity in our neighbour's territory is happening now because President Trump is serious and sincere to fight terrorism in whatever form it is not giving concessions as good and bad terrorists. The USA all these days is responsible for our neighbour's ghastly and dastard adventures together with terrorists against us. Thanks President Trump for being no nonsense person!
***********
When life itself is a romantic verse, what is the need to compose or read romantic poetry? We are both composers and aesthetic readers of our poetic life and experience bliss always.
***********
 సరియైన చదువు నేర్వక మనశ్శాంతి కుదరదు;
మనశ్శాంతి లేక ఇక ఏమున్నను సంతోషముగ అనుభవించలేము; చక్కని కుటుంబము, ఆప్యాయతలు
ఆత్మీయతలు లేని జీవితమున ఎంత సంపాదించినను లోటే; సన్మిత్రులు లేక భగవద్భక్తి అబ్బక, తత్త్వము
మనసుకు పట్టక ఎంతటి ధనవంతుడైనను "నిరుపేదయే"
************
అమ్మాయిలు

అరటి పిలక ఎదిగినట్టు ఎదిగిపోతారు అమ్మాయిలు
సొగసుల లేతాకులు మారాకులు తొడుగుకుంటూ
రంభా స్తంభములగును ఊరువులు; ఫలములగును
వక్షస్థలము; సన్నమగును నడుము; అంతా మారిపోవును
*************
Netaji
The great freedom fighter Sri Subhash Chandra Bose is known as Netaji. But the feud-ridden regional political party's ex+chief is also called Netaji. What a callousness is being exhibited by Indians in relation to their respect and gratitude to their great freedom fighters?!

 

Monday, January 30, 2017

Education scene in India: Past and Current; Fight against black money

Education scene in India: Earlier and now

Acquiring knowledge is not for employment sake. Fifty to sixty years of Indian independence has mauled the concept of education. Even though education is for acquiring knowledge, scholarship, and deep study and contribution to various disciplines; that spirit is completely killed by both Government policies and private players in providing"education".
Education is reduced to getting a certificate not caring for learning and then enter job market sans any employable skills or efficiency.

And Brahmins and Brahmanism are attached for every social trouble especially in the provision of education.

It is missing in the observation of many intellectuals and rationalists that; all engineering and technology; since civilisation and cultural living in India; have been with castes and social groups other than Brahmins.

Again I stress all engineering and technology has never been with Brahmins. They were distributed among various social groups known as castes. Brahmins are and have been erroneously blamed for not allowing other castes and social groups access to education. This is completely false, silly and discriminative against Brahmins.

Today we know that only engineering and technology are job providers and we are all spending thousands to lakhs of rupees to make our children an engineer or technologist to get employed. And we all know that basic academic courses in science, arts, commerce are no longer employable. That is the reason we want everyone of our children to become an engineer or get a certificate that he or she is an engineer.

Who is learning subject in any discipline throughout India? None. Everyone wants employable certificate, but they refuse to learn anything during their course work but want to get employed.
Courses in languages, sciences, arts, commerce are no longer in demand or students do not join them as such courses do not get them a certificate to be employable.

Thus education which is also a tool for overall growth of Individuals is not imparted at primary, secondary, tertiary, P.G. or research level. Many business men entered the field of providing employable certificates and are looting Indians of their hard-earned money. None is complaining about this are taking decisions that they are not exploited by unscrupulous runners of "educational" institutions.

Mere academics sans employable skills are a waste of time, money and energy. At the same time academics is necessary to initiate, get grown, to study, contemplate, and contribute to knowledge,which work is not attractive from money earning point of view.

Such a thankless and non-remunerative profession had been handled by Brahmins in India. Other castes and social groups have given the charge of engineering and technology, which are also employable.
Now no Indian is enthusiastic to learn or contribute to knowledge of any kind. All want employable certificates sans any learning.

And it is a reality that no Indian is contributing to knowledge nationally or internationally and none is recognised in the world for one's erudition and depth of knowledge and useful contribution to knowledge.

Academically India is going through a dismal phase as far as learning and contribution to knowledge is concerned. That being the reality what is the meaning and fun in blaming Brahmins for every evil in the society? Today who prevents any one from learning and contribution to knowledge? Why none is able to contribute substantially and meritoriously to knowledge by being a scientist, scholar, linguist, philosopher or such academically bright and useful seers of knowledge?

*************

Fight against black money

Tax-men's actions against ordinary citizens for amassing black money and acquiring benami properties will be partial until politicians and leaders who have been in power so and are still in power are also booked.

It is hard to believe that many politicians and leaders in power do not amass black money and did not acquire any benami properties all these days.
It is a must that such corrupt and insincere politicians and leaders must face tax-men and must be penalised accordingly. 

Else the actions on ordinary citizens who are professionals, former or current public servants or business-men or any such kind will be only token.

మౌనము వహించిన మనసే, ఆత్మ లేక బ్రహ్మము; ఉద్యోగం-చదువు; Subtlety



మౌనము వహించిన మనసే, ఆత్మ లేక బ్రహ్మము

మౌనము అయస్కాంత క్షేత్రము వంటిది. మన మనసులనే ఇనుప సూచికలను అలవోకగా ఆకర్షించి మనల ప్రశాంత చిత్తులను చేస్తుంది. కాశ్మీరీ తత్త్వవేత్త, శైవ సిద్ధాంత కర్త, విద్వాంసుడు, ఎన్నో శాస్త్రములను తన రచనలతో, వ్యాఖ్యానములతో సుసంపన్నం చేసిన అభినవగుప్తుడు శాంత రసాన్ని ప్రతిపాదించాడు. ఆయన కాలంలో అప్పటి ఆయన సమకాలికులు ఆ ప్రతిపాదనను విమర్శించారు. ఒప్పుకోలేదు. కాని శాంత రసము మహరాణిలా నవ రసాలను ఏలుతోంది.

మనసు రకరకముల ఉద్వేగములను చెందడం రసస్థితిని పొందడం, రసాన్ని అనుభవించడం అంటారు. శాంతరస స్థితిలో మవసు నిండుకొని ఉంటుంది. ఏ ఉద్వేగము చెందక విరమణము పొంది ఉంటుంది. సకల మానసిక కార్యకలాపములనుంచి విరమింపబడి ఉంటుంది. మానసిక కార్యకలాపములనుంచి విరమింపబడి, నిర్మలమైన మనసునే ఆత్మ లేక బ్రహ్మము అంటారు. దీనినే ఉపనిషత్తులు ప్రజ్ఞానస్థితి అన్నాయి. ఆత్మారామ స్థితి అన్నా, రామబ్రహ్మ స్థితి అన్నా ఇదే. 

ఇప్పుడు మనసు మౌనం వహించి ఉంటుంది. దీనినే‌ మోక్షస్థితి లేక నిర్వాణ స్థితి లేక ముక్త, ముక్తి స్థితి అంటారు. స్వస్థితినందిన మనసే రామము. ఆనందము, శాంతి, మౌనము అది కలిగించే అనుభవములు.

శుద్ధ జ్ఞాన స్థితి, శుద్ధాహం స్థితి ఇదే. జ్ఞానుల అంతరంగ స్థితి ఇదే. మౌనము శ్రావ్య నిశ్శబ్ద గానము. ప్రణవ మూలము ఇదే. అటువంటి స్థితి కల మహర్షుల వైపు మన మనసు సహజంగా ఆకర్షింపబడి మౌనములోని ప్రశాంతతను మన అనుభవంగా చేేస్తుంది. ఇలా మన మనసు ఎవరి సన్నిధిలో ఏ ఉద్వేగము చెందక ప్రశాంతంగా ఉంటుందో వారి సన్నిధిని మనం కోరుకుంటాము. ఆ స్థితిని మనకు మన ఇష్టదైవం కలిగించవచ్చు. జీవించి ఉన్న‌ లేదా బ్రాహ్మీభూతులైన మానుష గురువులు కలిగించవచ్చు. లేదా మనకు మనమే (స్ఫురణ, స్ఫూర్తిల) సాయంతో కలిగించుకోవచ్చు.

ఈశ్వరో గురుః ఆత్మ ఇతి మూర్తి భేద విభాగినే‌
వ్యోమవత్ వ్యాప్య దేహాయ (దేశాయ) దక్షిణామూర్తయే
నమః.

మౌనము నొందిన మనసే ఆత్మ, బ్రహ్మము.

అహం బ్రహ్మాస్మి!
అయమ్ ఆత్మా బ్రహ్మా!
ప్రజ్ఞానం బ్రహ్మా!
తత్త్వమసి!
ఆనందో బ్రహ్మ!
రసోవై సః!
సర్వం ఖలు ఇదం బ్రహ్మా!

ఈ మాటనే చెబుతాయి.

సత్యం జ్ఞానమ్ అనంతం బ్రహ్మా!

సమస్త సన్మంగళాని భవంతు!
శుభం భూయాత్!
శ్రీరస్తు!
శుభమస్తు!
అవిఘ్నమస్తు!
****************
 
ఉద్యోగం-చదువు

ఉద్యోగం కోసం చదువు కాదు అని అనుకున్నప్పుడు మాత్రమే విద్యా ప్రమాణాలు చక్కబడతాయి. ఉద్యోగపు చదువు, academics ఒకటి కాదు.
 
ఈ విషయంలో clarity లేకపోవడం వల్లే విద్యా ప్రమాణాలు సన్నగిల్లాయి, ఉద్యోగాలూ రావడం లేదు.

జ్ఞానానికి అందుకే భారతీయులనుంచి ప్రముఖమైన contributions రావడం లేదు. జ్ఞాన సముపార్జన, పాండిత్య ప్రకర్ష‌ వేరు; ఉద్యోగానికి (సంపాదనకు) నేర్చుకోవలసిన కౌశలములు వేరు.
 
స్పష్టత విద్యావిధానములో రాని నాడు, లేని నాడు జ్ఞాన సముపార్జనము ఉండదు, సంపాదనకు వీలైన కాగితపు ముక్కలు లభించవు. విద్య వేరు. ఉద్యోగ కౌశలములు వేరు.

ప్రాధాన్యాలు మారాలి. ఇన్ని వేల సంవత్సరాలలో మానవ జీవనంలో, జీవితంలో ఎన్ని మార్పులు చోటుచేసుకోలేదు? విద్యావిధానములో మార్పు రాక జ్ఞానము, పాండిత్యము, వైజ్ఞానిక పరిశోధనలు వెలగవు. విద్యకు జ్ఞానసముపార్జనమే పరమార్ధము. పండితులని, జ్ఞానులని ఇది వరకు సంఘం పోషించేది. మిగిలిన వారందరు తమ తమ కౌశలములతో జీవిక ఏర్పరచుకునే వారు. అందరికీ సాఫ్ట్ వేర్ మాత్రమే ఉద్యోగాలను ఈయలేదు. ఆలోచనలలో, స్ఫూర్తిలో మార్పు రావాలి. 

అది ఏమిటి అనేది ఆ యా కుటుంబాలు తమ ఆర్ధిక పరిస్థితిని బట్టి నిర్ణయించుకోవాలి. వారికై ఇతరులు నిర్ణయించి పెట్టలేరు. ఇది చాలా సున్నితమైన కాని ముఖ్యమైన విషయము. వైట్ కాలర్ జాబ్ ల , ప్రభుత్వ ఉదోగాల కాలం చెల్లింది. ఇది గమనించడం అవసరం. గుడ్డిగా ఈ పనికి రాని చదువుకై వేలు, లక్షలు గుమ్మరించడం ఎంతవరకు సబబో, అవసరమో; భరించగలమో లేదో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. అలా చేయలేనప్పుడు ప్రవాహంలో కొట్టుకుపోవడం మినహా ఏ ప్రయోజనము కలగదు.
**********
Subtlety in humor, sensitivity and sensibility

Subtlety in humor, sensitivity in expression, sensibility in behavior, sense of belonging in bonds are sorely missing in current societal fineness and niceties. Overall, in society; culture, sophistication, civility and fondness for fellow human beings have vanished detrimental to human and humane definitions.


Monday, January 23, 2017

President Trump and Prime Minister Modi; అమ్మాయిలు-అమ్మతనం; చట్టం-నల్లధనం; Jalikattu

President Trump and Prime Minister Modi

I am surprised and find the democratic spirit wanting in the people who criticize day in and day out saying all nasty things about President Trump and Prime Minister Modi.

One of them is constitutional head of their nation and the other chief constitutional personality of his nation. Both are democratically elected constitutional powers.

But many continue to deride them for reasons not democratic. And President Trump rightly asked his biters "why didn't you come and vote?" Had all of them voted, and they are in majority Trump might not have been elected as President of United States of America. It is so obvious and common sense thing! It is dishonoring the democratic spirit shown by majority of voters, which these "democratically spirited" biters want not to recognize and vouch for his removal. Similar is the case with Modi.

In America if they want they can impeach their President and in India the Prime Minister can be dethroned through democratic, judicial like processes. Instead of following democratic procedures to make these authorities demit their office, any amount of disinformation campaign by media, frustrated politicians, wounded intellectuals, emotional cowards is not going to displace these constitutional authorities to from their offices.

Then why these vain and undemocratic shouts?

 **************

 అమ్మాయిలు-అమ్మతనం

ఇప్పటి అమ్మాయిలు అమ్మ ‌అవడం మీద అంత ఆసక్తి చూపించడం లేదు. అమ్మతనంలోని కమ్మతనం చరిత్ర పుస్తకాలలో చేరవలసిందే.‌ ఇప్పుడు అంతా, ఉద్యోగము, సంఘసేవ మనసులను ఏలుతున్నాయి. అమ్మ అనేది ఫుల్ టైమ్ జాబ్. పార్ట్ టైమ్ జాబ్ కాదు.

***************

 చట్టం-నల్లధనం

ఓ పక్కనుంచి ప్రభుత్వం నల్లధనం, అవినీతులపై‌ యుద్ధం ‌ప్రకటించి అన్ని చర్యలు తీసికుంటూంటే అప్పుడే ఆ‌ కార్యక్రమాన్ని "ఉపయోగించుకొని" నల్లధనం పోగేస్తున్న వారి గురించి ఏమి మాట్లాడగలం?

జూదము, మద్య, మాదకద్రవ్యముల సేవ, వ్యభిచారము, లంచములు తీసికొనుట, నల్లధనము పోగేయుట ఒకే రకమైన వ్యసనములా ఉన్నాయి. అవి ఎన్నటికీ పోవులా‌ ఉంది. రాచకీయుల మోసాలు, ధనసంచయములు‌ కూడ ఈ కోవలోకే వస్తాయి.

ఇవి బలహీనతలో, పాశములో, పొగరుబోతుతనాలో, నిర్లక్ష్యాలో, చట్టం, సభ్యత పట్ల అగౌరవము, అమర్యాదలో తెలియదు. కాని ఈ వ్యసననులు, వాటి బారిన పడిన వారిని, మిగతా పౌరులను పట్టి పీడించడం తప్పదులా ఉంది.
చట్టం వీరిలో పట్టుబడిన వారిని శిక్షించడంలో‌ అలసత్వం చూపడం ఒక కారణం కావచ్చు. చట్టమంటే వీరికి భయము, భక్తి, గౌరవము లేవని మాత్రం స్పష్టం అవుతోంది.

చట్టం కఠినంగా‌ అమలు పరచబడనంత వరకు‌ అవినీతి, నల్లధనాన్ని పోగేయడం అరికట్టబడవు. మిగతా ఏం జరిగినా అంతా కంటి తుడుపు వ్యవహారం మాత్రమే.
***********

Jallikattu

It seems jallikattu has become fresh rallying point for the people whom the Dravidian culture word failed and could not bring enough votes; and it seems a ploy to block the entry of any party to ask for votes on the plank of growth, development, de-monetisation or surgical strikes. Strange, stranger and strangest are the ways of Indian politicians. They do not allow voters to be slipped from their iron "cultural" fist.
Emotional blackmail and emotional appeal are causing debility to Indian voters' mental strength and psychological health.
Emotional integration as Indians is never attempted. Cheap tactics to attract and enslave voters are practiced by dangerous Indian politicians. Very unfortunate and sad state of affairs is prevailing in Indian democracy and nation.

Sunday, January 22, 2017

ఉద్యోగినులు-గృహిణులు; Democracy of Mobs; The menace of pseudo intelletualism in India


 ఉద్యోగినులు-గృహిణులు

ఉద్యోగాలు చేసే కొందరు ఆడవాళ్ళు, ఇల్లాలిగా కుటుంబాన్ని సాకుతూ, గృహిణిగా అన్ని పనులూ చేస్తూ ఇంటి బాధ్యతలను ప్రేమతో, అభిమానంతో చేస్తూ ఇంటిని స్వర్గసీమ చేసే తోటి ఆడవాళ్ళని ఎందుకో తమతో సమానంగా చూడరు. తాము ఉద్యోగం చేస్తున్నామని, గొప్ప వారిమని అనుకుంటూ తమ తమ కుటుంబాలలో ఉన్న గృహిణులతో సభ్యతారహితంగా ప్రవర్తిస్తారు. ఈ గృహిణులు ఇంటిపని, వంటపని చేసే పనివారు అని గేలి చెయ్యడానికి కూడా వెనుకాడరు.

ఈ తరహా ఉద్యోగినులు తమ తమ ఇళ్ళ నిర్వహణ "డబ్బు పడేసి" పనివారికి అప్పగించి తాము, గృహిణులు మాత్రమే అయిన తమ తోటివారిని అగౌరవంగా చూస్తారు. వాళ్ళ దృష్టిలో గృహిణులు, తమ పనివారు ఒకటే. ఇంతటి అనాగరికత, సంస్కార రాహిత్యమూ ఇలా కొందరు స్త్రీలలో చోటు చేసుకోవడము శోచనీయము.
గృహిణులు ఇంటినీ, పిల్లలను, పెద్దవారిని చూసుకుంటూ కుటుంబాలకు, సంఘానికి చేస్తున్న మహోపకారము‌ ఈ అహంకారులకు, గర్వపోతులకు అర్థము కాదు. గృహిణుల ఈ ఉదాత్తత, త్యాగ స్వభావము, సేవానిరతి ఇటువంటి ఉద్యోగినుల చిన్ని బుర్రలకు విశదము కాదు.

ఇలా ప్రవర్తించే ఉద్యోగినులు తమ కుర్రతనాన్ని, మూర్ఖత్వాన్ని, అవగాహనా రాహిత్యాన్ని, అహంభావాన్ని, ప్రేమరాహిత్యాన్ని బయటపెట్టుకుంటున్నారంతే. వీరికి వారి స్థాయికి మించిన ఔన్నత్యాలు అర్థము కావు.
గృహిణులు భవనములకు పునాది వలె కుటుంబానికి ఆలంబన. చెట్లకు వేళ్ళ వలె కుటుంబానికి గృహిణులు ఆధారం. అంతా. భవంతి అందాన్ని, దాని సౌకర్యాన్ని గురించి మాట్లాడేవారి దృష్టిలో పునాది ఉండదు. అలాగే చెట్ల పచ్చదనాన్ని, ఉపయోగాన్ని, ఉపకారాన్ని గురించి మాట్లాడేవారి దృష్టిలో చెట్ల వేళ్ళు ఉండవు.
కంటికి కనిపించని పునాది, వేళ్ళ పాత్ర మూలమైనది. అలాగే గృహిణుల పాత్ర సంఘానికి మూలమైనది. పునాది, వేళ్ళు లేక భవనాలకి, చెట్లకు ఉనికి మనుగడ లేవు. అలాగే గృహిణులు లేక కుటుంబానికి, సంఘానికి ఉనికి, మనుగడ లేవు.

గృహిణులు లేక కుటుంబం లేదు. కుటుంబాలు లేక సంఘం లేదు. ఈ ఇంగితం తెలియని ఉద్యోగినులు, కుహనా మేధావులు, ఎన్.జి.వో. లు కోకొల్లలుగా ఉన్న నేడు గృహిణులను తక్కువగా చూసి కుటంబానికి, సంఘానికి వారి ఉపకారాన్ని, అవసరాన్ని గమనించక, గమనించడం తెలియక మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కునే విధంగా ప్రేమతో, స్త్రీ సహజమైన లాలిత్యంతో, అభిమానంతో గృహావసరాలు చూసే, కనిపెట్టే గృహిణుల పాత్రను, ప్రాముఖ్యాన్ని, అవసరాన్ని‌ గ్రహించక గృహినులను లేకుండా చేస్తున్న నేటి నాగరికత, సంస్కృతి మనకు చేసే, చేస్తున్న అపకారాన్ని విజ్ఞులు గుర్తించాలి.

ఏది బానిసత్వం? ఏది సర్వోత్తమం? మనం పరశీలించ వలసిన సమయం ఆసన్నమైనది. పరిణామశీలమైన నాగరికతను, సంస్కృతిని మన ఉనికి, మనుగడలకు అనుగుణంగా‌ మలుచు కోవలసిన తరుణం ఇది. దిగుమతి చేసుకున్న భావాల, సిద్ధాంతాల అవసరం, అపకారం, సాంప్రదాయ పద్ధతుల ఉపకారం బేరీజు వేసుకొని మన ఉనికి, మనుగడలు శాంతిసుఖములతో సాగే దారి నిర్మించవలసిన బాధ్యత మనందరిదీ. మేధావులలో కుహనా తత్త్త్వం ప్రబలి మనకు ఎంతో అపకారం జరుగుతోంది అని గ్రహించవలసిన వర్తమానం ఇది.

సంఘజీవనం ప్రవాహమే అయినా, పరిణామశీలము, మానవ నిర్మితము కూడ.
**************
 నేడు సంఘములో ఆ యా మతములు, సంస్కృతులు, చెప్పిన మంచిని ఆచరించేవారి కన్నా ఆ యా‌ మతముల, సంస్కృతుల గురించి మాట్లాడేవారు, వాదులాడుకునే వారు ఎక్కువ అయ్యారు. అందుకే ఇంత గందరగోళం, గోల, గొడవ.
************


Democracy of Mobs

When mass hysteria decides rather than wisdom and compassion in a society, such society will face many turmoils led by emotional people than intelligent, intellectual, wise and compassionate people. Intellectualism​ and commonsense remain unused. 

The administration of affairs of nation and regions collapses. Culture and civilisation defined and dictated by bigots and fanatic people leads the society towards middle ages.
Democracy of mobs is neither safe nor advisable.

**********

The Menace of pseudo intellectualism in India

"Supposed Fundamentalism" based on religion, only in relation to Hinduism and ancient Indian culture, is condemned left and right by leftist, rationalistic, atheistic and all kinds of self-styled, self-appointed self-aggrandizing, self-serving and self-promoting "intellectuals", sans commonsense or insight of various aspects of the respective issues, ideas, experiences and cultural and civilized authentication.

Can there be a culture sans religion, language, region, ideology and like ingredients to social and socialogical life?

But none of these "intellectuals" is daring and courageous enough to condemn equally menacingly the fundamentalism based on regional cultures or beliefs or imported ideologies or caste or language affiliations.

Why so? So because this kind of "intellectuals" are not genuine but of pseudo type. A genuine intellectual is sincere and just in his observations and utterances; not at all influenced by caste, region, ideology, language, political or other considerations.

Personal likes or dislikes will not shadow or color the minds of just and sincere people and their understanding. Unfortunately today in India such humane and lovers of human-beings as a whole, are vociferously downed by the earlier mentioned pseudo intellectuals.

The voice of seers who have welfare and well-being of all people, irrespective of their false identities; and are not narrow-minded as our pseudo type confined to a particular caste, region, religion, ideology or such inferior affiliations, is stifled by selfish pseudo intellectuals.

If the voice of just, sincere and all-compassionate knowledgeable persons is subdued, undermined and rendered unheard by the noise generated by hollow and vain voices of negatively influencing pseudo and narrow-minded selfish small individuals, the future of such society or nation is neither bright nor promising.
 

Friday, January 20, 2017

ప్రకృతికి పరుడను; మన బ్రతుకులు; Ego; Thick-skinned Criminals; భారతరత్న



మన వాక్పటిమ, భాషాపాటవము, హాస్యభరిత భాషణము ఇతరులను ముగ్ధులను చేస్తాయి.
మౌనం వహించ గలగటం మనలను ముగ్ధులను చేస్తుంది.
మౌనము భాషల మూలము, భాషల సారమూను.

*********

మగవాళ్ళు ఆడవాళ్ళూ పబ్ లకు పండుగ సందడికై వచ్చి
అంతో ఇంతో పుచ్చుకుని తైతెక్కలాడుచూ ఊగుచూ దొరలు
వేళ, ఎవరు మగ, ఎవరు ఆడ తెలియని మత్తులో ఒకరినొకరు
తాకిరని, పొదవుకొనిరని ముద్దులెట్టుకొనిరని రగడచేయట నాగరికమేమొ?
*********

ప్రకృతికి పరుడను

నా రూపురేఖలెటునున్ననూ శ్రియఃపతి
రూపు నా మనసున నిండిన చాలును;

నా పలుకులెటునున్ననూ శివపంచాక్షరిని
తన్మయుడనై ఉచ్చరించి జపించిన చాలును;

నా నడతలెటునున్ననూ నా నడకలు శివ సన్నిధికి
చేర్చిన చాలును; నా చదువులెటునున్ననూ నేను

దేవీ మాహాత్మ్యమును ఎఱిగిన చాలును; నా బుద్ధి
ఎటులున్ననూ పరమాత్మావహగాహనను కలిగి నేను

శాంతానంద మౌన మాధుర్యముల తత్పరతనై
ప్రకృతికి పరుడనై పరముడనై వెలిగిన చాలును

************

మన బ్రతుకులు

మనం మనకోసం బ్రతకటం లేదు. సినిమా వాళ్ళకోసం, రాజకీయ కునాయకులకోసం, ఇతర "లబ్ధ ప్రతిష్టుల" కోసం జీవిస్తున్నాం. వారి కష్ట సుఖములే మన కష్ట సుఖములు. వారి డేటింగ్ లే మన డేటింగ్ లు. వాళ్ళ విడిపోడాలే మన విడిపోడాలు. వాళ్ళ ఎఫైర్సే మన ఎఫైర్స్.

వారి పెళ్ళిళ్ళే మన పెళ్ళిళ్ళు. వాళ్ళ విడాకులే మన విడాకులు. వారి పునర్వివాహాలే మన పునర్వివాహాలు. వారి పురిటి నొప్పులే మన పురుటి నొప్పులు. వారి పిల్లల పుట్టుకే మన పిల్లల పుట్టుక. వాళ్ళ చావులే మన చావులు.
మనకు అంటూ ప్రత్యేకంగా జీవితం ఏమీ లేదు. వారి జీవితాల పయనాలే మన జీవితాల పయనాలు. 

ఇలా మన జీవితాలను "లబ్ధ ప్రతిష్టుల" జీవితాలతో మమేకం చేస్తున్న మల్టీ మీడియాకు మనమెంతో ఋణపడి ఉన్నాము. జన్మజన్మలకూ వారి ఋణం తీర్చుకోలేము. మన జీవిత రణం మనలను ఓడించేస్తున్నా, వ్రణమై బాధిస్తున్నా మనం ఈ లబ్ధ ప్రతిష్టుల జీవితాలనుంచి విడిపోలేము.

అంతా మిథ్య తలంచి చూచిన. మాయయే మన మనసుల ఏలిక. మన వారిపై మమతా రాహిత్యమే మన దీక్ష. లబ్ధప్రతిష్టులకి శ్రీరామరక్ష.
***********
క్రియ లేని వాక్యము, మమత లేని హృదయము అగమ్యగోచరంగా, బోధపడకుండా ఉంటాయి.
***********

వేషము వేయుట పొట్టకూటికి, జనోద్దీపనమునకు మరెందుకు కాదు
ఉపన్యాసముల నిచ్చుటయు అందు కొరకే, ప్రపంచం మరమ్మత్తుకు కాదు
లోకమున సమస్త విద్యలు కూటి కొరకే విశ్వ సముద్ధరణకు కాదు
తత్త్వానుశీలనమొకటే తరించుటకు, తత్ మయము నొందుటకు
***********
Ego is, many times consciously and sometimes unconsciously, built as thought-forms by individuals regarding individual's sex, social status, mental traits, achievements, failures, and related I, me, mine and bonds to these.
************

Unless the economic offenders, who blocked and blacked new currency notes,
inconveniencing crores of honest and naive Indian citizens; are severely punished the whole de-monetisation exercise becomes a farce and no difference will be observed or felt because of this de-monetisation measure.

If government takes this leniently and strong measures are not taken in punishing the cheaters cum over - intelligent and fearless economic offenders- the bankers, the hoarders of old currency notes and now new currency notes will laugh at government and laugh away to hoarding as much money they can and the story repeats itself. 

All this de-monetisation exercise will be a useless and laughing matter.

Wish government punishes these arrogant and law non-caring and non-fearing thick- skinned criminals.

**********
 భారతరత్న

భారతరత్న బిరుదుకు రాజకీయ రంగు పులిమి ఎప్పుడోనే దాని ప్రశస్తిని, గొప్పతనాన్ని కాలరాసారు. ఎవరికైనా ఇచ్చెయ్యచ్చు. చచ్చిపోయిన వాళ్ళకైనా, పుట్టబోయే వాళ్ళకైనా.

భారతమునందు రాజకీయనాయకులే సర్వస్వము. రాజకీయనాయకులదే సర్వస్వము. వారు ఆర్ధిక రంగాన్ని శాసిస్తారు. వైద్య రంగాన్ని దునుమాడుతారు. విద్యా రంగాన్ని పనికి మాలిన దానిని చేస్తారు. గుళ్ళని, గోపురాలని నాస్తికులమంటూ కూడా ఏలుతారు. ఆధ్యాత్మిక రంగాన్ని స్వాములు, ఆనందాలు, అమ్మలు ద్వారా గుప్పిటనుంచుకుంటారు.

రాజకీయనాయకులకు కాదేదీ వేలు పెట్టకూడనిది.

మరే వృత్తి యైనా వీరి కనుసన్నలలో మెలుగాల్సిందే. ఇందుగలడు అందులేడని సందేహము వలదు. రాజకీయనాయకుడు సర్వోపగతుడు. సకల భ్రష్ట కారకుడు, పౌరులారా వింటిరా!

నోబెల్ శాంతి పురస్కారము - వంద కోట్ల వాక్కు; Royal and Regal Profession, Not at home at home

నోబెల్ శాంతి పురస్కారము - వంద కోట్ల వాక్కు

పువ్వులు బహుమతులకు వికసించవు; తమంత తాము మురిసి తప్ప;
కోయిల డబ్బుకు గొంతు సవరించదు; వసంతమున తనంత తాను పొంగి పాడును తప్ప;
సెలయేరు బహుమానములకు ఎత్తుల పల్లముల ఎగసి దూకదు; తన వీలు కుదిరినట్టు తప్ప;
మేఘసముదాయము ధనాశతో తీయని జలముల కురియదు; తనంత తాను నీటిని సేకరించి మనల తడుపును తప్ప;
పండ్ల చెట్లు భూరి కానుకలకై మనకు మధుర ఫలముల నీయవు; ఋతువుల ఆగమనమున తమంత తాము
పుష్పించి ఫలించును తప్ప;

సూర్యోదయము పుడమిని వెలుగుల నింపుటకై గ్రహ నక్షత్ర నియతిని జరుగును తప్ప ప్రభుత్వ బహుమతులకై కాదు;
పున్నమిని చందమామ పరవశింప చేయు చల్లని కౌముదులు తనంత తాను కురియు హర్షమున తప్ప ప్రభుత ఇచ్చు పురస్కారములకై కాదు;
బుద్ధికుశలత్వము, నిపుణతలు ప్రకృతి అధీనమున వర్తించును తప్ప, మంత్రుల మతిమాలిన తనమున
ప్రకటించు ధన బహుమానములకై కాదు;
తప్పుడు హామీలను కురిపించి, ధనమును పంచి ఓట్లను కొనవచ్చును తప్ప శాస్రజ్ఞుల మేధాశక్తిని ప్రేరేపించ లేము; నోబెల్ బహుమానము రాజకీయ నాయకుల అక్రమముగ
ఆర్జించు ధనము, స్థిర చరాస్తులవలె దోచగలిగినది కాదు;

ఎప్పటికి మతిమాలినతనము తొలగించుకొని, ఇంగితముల నేర్చి రాజకీయ నాయకులు; డబ్బుతో
ఓట్లను కొన్నట్టు నోబెల్ బహుమానమును పొందలేము

అందుకోలేమని తెలిసికొందురు? మేధ సరియైన వాతావరణమున, పరిస్థితుల వికసించును గాని
రిజర్వేషన్ ల బహుమానముల వల్ల కాదు; ఇంతటి

మందమతులు రాజ్యములనేలుచున్నారు; దేశదేశముల
తిరుగుచున్నారు కులాసాగా; ప్రజలు వెఱ్ఱిగా లోభత్వముతో ఓట్లేసిన, ఇటువంటి ప్రకటనలే
వెలువడును; శుష్క వచనములు, శూన్య హస్తములకు
ఓట్లు రాలని పరిస్థితుల మాత్రమే దేశము వికసించును

వికసనము పొందును; నోబెల్ బహుమానములూ వచ్చును;
మగవారు కట్నములిచ్చు స్థితియు కలుగును;
కాని కట్నములిచ్చుట నేరమేమో?
ఆడువారిచ్చిన అది నేరము; మగవారిచ్చిన
నేరము కాదు; ఏమి మేధ, తెలివి!

నోబెల్ శాంతి పురస్కారమునకు,
ప్రభుత్వము ప్రకటించిన వందకోట్ల
బహుమానమునకు పసందుగా అర్హమైన వాక్కు
************

Royal and Regal Profession

Begging is a profession;

Begging has transformed itself
Into a royal profession;


Politicians beg for votes
And the corrupt for bribes;

Rather these two kinds of people
Demand more than beg;

Begging attained the
Stature of demand and right
Status of elite profession;
Even ordinary beggars are
No longer pleading
They are demanding;

If we don't give doles or
Alms they demand for
They are Becoming
Menacing and threatening;

Beggars of all kinds are
Guiding and leading our
Nation and society with
Royal and regal splendour

**********

Not at home at home

Now a days many of us are not at home at home. Many are at home in places outside home, like, pubs, exotic tourist places and eating places. Many are preferring to neglect home life and are enamoured by "outside" attractions. 

It has become culture and civilization to look down home and who strive to make house a home.
People are not finding living at home a civilized living. The simple pleasures that keep us psychologically healthy are being denied to us by us.

The human touch is missing and gadget-philic and outside roaming at day and night has become a fashion.

All homes are deserted and streets, pubs, outside locations became human pullers.

Inability to live at home is a psychological debility.

Humans are psychological beings first and foremost.

Better we renovate the habit of loving and living at home.

It is wise and safe to be at home when outside works are over.

Midnight roaming is not safe equally for women and men.