Showing posts with label అమ్మాయిలు. Show all posts
Showing posts with label అమ్మాయిలు. Show all posts

Sunday, November 12, 2017

స్థలాలు - మనుషులు; అమ్మాయిలు, ఆడవారు; ఇదే మాయ; ఆత్మారామము, రామబ్రహ్మము; భారతీయ తత్త్వ చింతన

మనిషి పరిమితియే భగవంతుడు. మనిషి పరిణితియే భగవంతుడు.

స్థలాలు - మనుషులు

ఆ రోజుల్లో పనికిరాని స్థలాలు ఇప్పుడు కోట్లు 
గడిస్తున్నాయి, వెధవలని ముఖ్యులను చేస్తున్నాయి

ఎప్పటికీ పనికొచ్చే మనుషులు పనికిరాని చదువులు 
చదివి, ఎందుకూ పనికి రాకుండా పోతున్నారు , ప్చ్!

స్థలాలకున్న విలువ మనుషులకు లేదు
**********

అమ్మాయిలు, ఆడవారు


అందమైన మగవారితో మాట్లాడడానికి
అమ్మాయిలు, ఆడవారు ఇష్టపడతారు
అందవిహీనులతో మాట్లాడడానికి ఇష్టపడరు
వారిని వదిలించుకోవడానికి కష్టపడతారు
ఎంతైనా "కన్యా వరయితే రూపం"
అనాకారులకు అందవిహీనులకు పాపం
***********
ఇదే మాయ

బట్టతల ఉన్నవారికి తలపై వెంట్రుకలిష్టం
వెంట్రుకలు దట్టంగా ఉన్నవారికి బాబ్డ్ హెయిర్ ఇష్టం

లేనిది కావాలనుకోవడం, ఉన్నది ఊడగొట్టుకోవడం
మనుషులకిష్టం; ఉన్నది లెక్క చేయదు మనసు;
పోగొట్టుకున్న దానికై యుగములు కుములుతుంది
అంతా భావనలే, అన్నీ తలపులే; మన తలపులే,

మన ఆలోచనలే మనం; మనసు గారడీ మనం
వాస్తవం గణించని ఊహలే ఊపును మనల; నిజముపై 
ఆనింపులే తాడును పామును చేయును;
కల మెళకువను తప్పుదారి పట్టించును; ఇదే మాయ
***********
ఆత్మారామము, రామబ్రహ్మము,

ఆత్మారామము, రామబ్రహ్మము, పరబ్రహ్మము, మోక్షము, శాంతి, మౌనము, ఆనందము సమానార్థకములు. తత్పరములు. ఉపనిషత్ వాక్య తాత్పర్యములు. భగవదానుభవములు. భగవత్ స్ఫురణలు. భాగవతుల మనములు. భక్తుల హృదయములు.
వేదాంత వాక్య రమణ స్థితులు. మనసు విరామ స్థితులు. రామ స్థితులు. అద్వైతానంద రమ్య స్థితులు. విభక్తి భక్తి యైన స్థితులు. పశ్యంతీ, మధ్యమా, వైఖరులు పరా యందు లీనమైన స్థితులు. పరమశివ, శ్రీమన్నారాయణ వాస స్థితులు.
కైలాస, వికుంఠ (వైకుంఠ) స్థితులు. మనసు గంతులు, గతులు ఆగిన నిర్మల మానసిక స్థితులు.
దివ్య, దైవ, దేవతా స్థితులు. మనం, మనము, నిండుకున్న నిండు స్థితులు. పూర్ణ స్థితులు. పరిపూర్ణ స్థితులు. విశ్వాసము పండిన స్థితులు. సుఖదుఃఖాలు ఎండిన ప్రశాంత స్థితులు. మన వ్యక్తిత్వములు పరమాత్మలో లీనమైన స్థితులు. సద్గతి పొందిన స్థితులు. శుద్ధజ్ఞాన స్థితులు.
పరమేశ్వర సదానంద చిదానంద స్థితులు.
పరమేశ్వరి కరుణాంతరంగ స్థితులు.
*************
భారతీయ తత్త్వ చింతన

భారతీయ తత్త్వ చింతనను ఉపయోగించుకొని హిందూ మతం వెలిసింది. భారతీయ తత్త్వ చింతన, హిందూ మతం ఒకటి కాదు. భారతీయ తత్త్వ చింతన మతాతీతం. హిందూ మతము కర్మలకు సంబంధించినది. ఆచార, వ్యవహారములు, పూజలకు, పురస్కారాలకు పెద్దపీట వేస్తుంది.
భారతీయ తత్త్వ చింతన భగవత్ తత్త్వ దర్శనము. ఇందు మతం ప్రసక్తి లేదు. హిందూ మతము భారతీయ తత్త్వ చింతన పై ఆధారపడి ఉంది.
భారతీయ తత్త్వ చింతన కుల, ప్రాంత, దేశ, భాషా, మతాతీతము. సర్వతంత్ర స్వతంత్రము. జ్ఞానోద్దీపకము. మనసును వికసింపచేయును. 
మనసును నియమించును. మూఢనమ్మకములను పోగొట్టి నిజరూప దర్శనము చేయించును


********


Friday, February 3, 2017

రథసప్తమి; ఇంజనీరింగ్ కళాశాలలు; ఊపిరి; పాండురంగడు; President Trump; అమ్మాయిలు; Netaji

 రథసప్తమి

ఇవాళ రథసప్తమి. రధసప్తమి కాదు. తెలుగు భాషలోని అక్షరాలను ఎందరో శ్రద్ధగా నేర్వడం లేదు. వారు భాషని సరిగా నేర్చుకోవడం లేదు సరి కదా మిగతా అందరూ మాత్రం తెలుగుభాష నేర్వాలని, తెలుగు సంస్కృతిని కాపాడాలనీ అహర్నిశలూ అంతర్జాలంలోని సాంఘిక సాలెగూళ్ళలో మాత్రం ఈ వర్ణ క్రమ దోషాలతో ఠంచనుగా పోస్ట్ లు పెట్టేస్తున్నారు. ఎందుకో?
 ************

సూర్యనారాయణుడు ప్రత్యక్షదైవము
పద్మనీఉషాఛాయాపతి; మందుని కాలుని
యమునల తండ్రి; మన ఆరోగ్యములకు
శ్రీరామరక్ష; నారాయణస్వరూపుడైన రవి,
భాస్కరుడు మనల కాచుగాక; ఆదిత్యుడు
దివాకరుడు, ద్యుతికరుడు మన మనముల
వెలుగునింపుగాక; మన అజ్ఞాన తిమిరముల
పోగొట్టి హృదయమును ప్రజ్ఞానమయము చేయుగాక


 ********** 
 ఇంజనీరింగ్ కళాశాలలు

 వెలసినవి ఇంజనీరింగ్ కళాశాలలు వీధికొక కిళ్ళీకొట్టు వలె తలారి రాముని
పిల్లల వలె తామర తంపరగ, పుట్టగొడుగుల వలె; చేరిరి, ఎందరో పొందిరి
కాగితము ముక్కలను బదులుగ; ఉద్యోగములు మాత్రము హళక్కాయెను;
వన్నెలు తగ్గినవి, చేరువారును తగ్గిరి; గుడ్డెద్దు చేలోపడినట్టైనది చివరకు
**********
ఈ క్షణమున ఊపిరి తీతుము; మరుక్షణమున కావచ్చును 
తనువు జడము; బుద్బుదప్రాయమైన జీవితమున బరువులెన్నో బాధ్యతలెన్నో
కోరికలెన్నో ఆశాభంగములెన్నో కక్షలెన్నో; క్షణమైన తలవము శ్రియఃపతిని
శివపంచాక్షరిని జపింపము; మూటకట్టుకుపోవువారి వలె వర్తింతుము
***********

పాండురంగడు శ్రీరంగడు కరుణాంతరంగుడు ఆర్తుల,
జిజ్ఞాసువుల, ధనార్ధుల, జ్ఞానుల పాలిటి అంగరంగ వైభోగము; శ్రీమన్నారాయణుడు శ్రీ రుక్మిణీ రస హృదయాంతరంగుడు, భీమానదీ తీరవాసుడు
విఠ్ఠలుడు మనందరికి ఆలంబన ఆశ్రయము విష్ణువు
************
President Trump has achieved in a couple of days with stern message and actions, what all American Presidents couldn't, rather didn't want to do; and on the other hand pampered our neighbour's terrorism sympathies and hand in glove deals and deeds with that country all these decades.
This activity in our neighbour's territory is happening now because President Trump is serious and sincere to fight terrorism in whatever form it is not giving concessions as good and bad terrorists. The USA all these days is responsible for our neighbour's ghastly and dastard adventures together with terrorists against us. Thanks President Trump for being no nonsense person!
***********
When life itself is a romantic verse, what is the need to compose or read romantic poetry? We are both composers and aesthetic readers of our poetic life and experience bliss always.
***********
 సరియైన చదువు నేర్వక మనశ్శాంతి కుదరదు;
మనశ్శాంతి లేక ఇక ఏమున్నను సంతోషముగ అనుభవించలేము; చక్కని కుటుంబము, ఆప్యాయతలు
ఆత్మీయతలు లేని జీవితమున ఎంత సంపాదించినను లోటే; సన్మిత్రులు లేక భగవద్భక్తి అబ్బక, తత్త్వము
మనసుకు పట్టక ఎంతటి ధనవంతుడైనను "నిరుపేదయే"
************
అమ్మాయిలు

అరటి పిలక ఎదిగినట్టు ఎదిగిపోతారు అమ్మాయిలు
సొగసుల లేతాకులు మారాకులు తొడుగుకుంటూ
రంభా స్తంభములగును ఊరువులు; ఫలములగును
వక్షస్థలము; సన్నమగును నడుము; అంతా మారిపోవును
*************
Netaji
The great freedom fighter Sri Subhash Chandra Bose is known as Netaji. But the feud-ridden regional political party's ex+chief is also called Netaji. What a callousness is being exhibited by Indians in relation to their respect and gratitude to their great freedom fighters?!

 

Monday, January 23, 2017

President Trump and Prime Minister Modi; అమ్మాయిలు-అమ్మతనం; చట్టం-నల్లధనం; Jalikattu

President Trump and Prime Minister Modi

I am surprised and find the democratic spirit wanting in the people who criticize day in and day out saying all nasty things about President Trump and Prime Minister Modi.

One of them is constitutional head of their nation and the other chief constitutional personality of his nation. Both are democratically elected constitutional powers.

But many continue to deride them for reasons not democratic. And President Trump rightly asked his biters "why didn't you come and vote?" Had all of them voted, and they are in majority Trump might not have been elected as President of United States of America. It is so obvious and common sense thing! It is dishonoring the democratic spirit shown by majority of voters, which these "democratically spirited" biters want not to recognize and vouch for his removal. Similar is the case with Modi.

In America if they want they can impeach their President and in India the Prime Minister can be dethroned through democratic, judicial like processes. Instead of following democratic procedures to make these authorities demit their office, any amount of disinformation campaign by media, frustrated politicians, wounded intellectuals, emotional cowards is not going to displace these constitutional authorities to from their offices.

Then why these vain and undemocratic shouts?

 **************

 అమ్మాయిలు-అమ్మతనం

ఇప్పటి అమ్మాయిలు అమ్మ ‌అవడం మీద అంత ఆసక్తి చూపించడం లేదు. అమ్మతనంలోని కమ్మతనం చరిత్ర పుస్తకాలలో చేరవలసిందే.‌ ఇప్పుడు అంతా, ఉద్యోగము, సంఘసేవ మనసులను ఏలుతున్నాయి. అమ్మ అనేది ఫుల్ టైమ్ జాబ్. పార్ట్ టైమ్ జాబ్ కాదు.

***************

 చట్టం-నల్లధనం

ఓ పక్కనుంచి ప్రభుత్వం నల్లధనం, అవినీతులపై‌ యుద్ధం ‌ప్రకటించి అన్ని చర్యలు తీసికుంటూంటే అప్పుడే ఆ‌ కార్యక్రమాన్ని "ఉపయోగించుకొని" నల్లధనం పోగేస్తున్న వారి గురించి ఏమి మాట్లాడగలం?

జూదము, మద్య, మాదకద్రవ్యముల సేవ, వ్యభిచారము, లంచములు తీసికొనుట, నల్లధనము పోగేయుట ఒకే రకమైన వ్యసనములా ఉన్నాయి. అవి ఎన్నటికీ పోవులా‌ ఉంది. రాచకీయుల మోసాలు, ధనసంచయములు‌ కూడ ఈ కోవలోకే వస్తాయి.

ఇవి బలహీనతలో, పాశములో, పొగరుబోతుతనాలో, నిర్లక్ష్యాలో, చట్టం, సభ్యత పట్ల అగౌరవము, అమర్యాదలో తెలియదు. కాని ఈ వ్యసననులు, వాటి బారిన పడిన వారిని, మిగతా పౌరులను పట్టి పీడించడం తప్పదులా ఉంది.
చట్టం వీరిలో పట్టుబడిన వారిని శిక్షించడంలో‌ అలసత్వం చూపడం ఒక కారణం కావచ్చు. చట్టమంటే వీరికి భయము, భక్తి, గౌరవము లేవని మాత్రం స్పష్టం అవుతోంది.

చట్టం కఠినంగా‌ అమలు పరచబడనంత వరకు‌ అవినీతి, నల్లధనాన్ని పోగేయడం అరికట్టబడవు. మిగతా ఏం జరిగినా అంతా కంటి తుడుపు వ్యవహారం మాత్రమే.
***********

Jallikattu

It seems jallikattu has become fresh rallying point for the people whom the Dravidian culture word failed and could not bring enough votes; and it seems a ploy to block the entry of any party to ask for votes on the plank of growth, development, de-monetisation or surgical strikes. Strange, stranger and strangest are the ways of Indian politicians. They do not allow voters to be slipped from their iron "cultural" fist.
Emotional blackmail and emotional appeal are causing debility to Indian voters' mental strength and psychological health.
Emotional integration as Indians is never attempted. Cheap tactics to attract and enslave voters are practiced by dangerous Indian politicians. Very unfortunate and sad state of affairs is prevailing in Indian democracy and nation.

Sunday, July 26, 2015

ఇంత కంటే గతి లేదు మనకు

ఇంత కంటే గతి లేదు మనకు

బొట్టు పెట్టుకొని అమ్మాయిలు; జడ వేసుకొని కూతుళ్ళు;
పంజాబీలు, స్కర్టులు, తొడలు కనిపింప చేయు పొట్టి లాగులు,
జీన్స్ పొడుగు లాగులు, మరెన్నో బోల్డ్, హాట్ వస్త్రధారణలు; కొనిపెట్టే మనము
నచ్చక పోయినా అడిగే ధైర్యము లేనిదీ మనకె; అడిగితె మన్ని తిట్టిపోసే ఆధునికులు కోకొల్లలు;
బాయ్ ఫ్రెండ్స్ తో చక్కర్లుకొడుతూ  హాయ్ బాయ్ బై అంటూ కులుకుతూ,
ఏదో హీరో కి ఫాన్లై మనసున మల్లెలు పూయించుకునే యువతులు మనవాళ్ళు;
బాధ్యత కల తండ్రులమైన మనకు ఏదీ చెందదు;అరటాకు సామెతలు బిసి నాటివి;
సామ్ప్రదాయమన్న సంస్కృతి యన్న చెమడలెక్కదీసెదరు ఎన్. జీ. ఓ. లు; నోరు మూసుకుని
ఈ నాగరికతను బిక్కు బిక్కు మంటూ కళ్ళప్పగించి చూడడం తప్ప గతి లేదు మనకు