Monday, July 18, 2016

Reconciliation of Indian spiritual thought


 

Brahmajnaa or Aatmajnaana has been viewed by our seers differently depending on their intution and the school to which they belong. Views have dominated the interpretations. Books became secondary and views have got prominence. The apparent differences among Sankara, Raamaanuja and Madhwa  interpretations as Adwaita, Visistaadwaita and dwaita have been perpetuated through generations unfortunately sometimes with animosity and an atmosphere of disagreement with vehement denial exists among them.

 For example the interpretations of the word maya. Maya is normally commented as "illusion", and the like meanings. Maya is having many definitions - yaa maa saa maayaa - is one having the above meaning. There is another definition - yayaa asantam pasyati saa maayaa - iti-. This definition means - Through which we cognize the within mental world and outside physical world - that is maya - . The traditional differences and non-agreements handed down to us through generations can be reviewed and reconciliation is to be attempted. Comprehensive understanding of evolution of Indian spiritual thought is the need of the hour. We better try to agree on common points than perpetuating earlier differences in the insight of "prasthaanatrayam" - the Upanishads, Brahmasutras and the Bhawadgita - commentaries by the three eminent aachaaryas - Sankara, Raamaanuja and Madhwa. Refreshing and reconciliation leads to harmony in our traditional insights and understanding.

Maya has to be understood as psychic or mental energy which facilitates our cognitions and communications that are carried out by our mind during acquisition and communication of knowledge of all kinds and languages and skills of all types likes music, dance, sculpting, painting like fine- arts and driving, like techniques.

Sunday, July 17, 2016

సృష్టికర్త - సృష్టి; ప్రయోజనము లేని ఉనికిలు: రమణీయమైన కావ్యములు; జ్ఞానమే శరణ్యము మనకు



సృష్టికర్త - సృష్టి

వాల్మీకి వ్యాసుల కన్న రామ కృష్ణులు ప్రముఖులు
వందనీయులు; అభినందనీయులు ఆనందకారకులు

జక్కన్న కన్న బేలూరు లోని ఆలయ శిల్పసంపదలు
చిర దర్శనీయములు; భరతముని కన్న నాట్యశాస్త్రము
మిన్న; ఐన్ స్టైన్ కన్న సాపేక్ష సిద్ధాంతమునకు ఎక్కువ
ప్రాచుర్యము; యల్లాప్రగడ సుబ్బారావు కన్న ఆయన

కనిపెట్టిన మందులు రోగనివారకములు; త్యాగరాజ
స్వామి కన్న "ఎందరో మహానుభావులు" బ్రహ్మానంద
దాయకము; టి. వి. రాజు కన్న "జయ కృష్ణా ముకుందా
మురారీ" కర్ణపేయము; విశ్వనాథ్ కన్న శంకర శాస్త్రి

ప్రభావము అధికము; రాముని కన్న రామ నామము
ఎక్కువ మోక్షప్రదము; శ్రీ కృష్ణుని కన్న భగవద్గీత
పఠన పాఠనముల హెచ్చు; చతుర్ముఖ బ్రహ్మ కన్న
ఆయన సృష్టించిన జీవజాలమున వైవిధ్యము, అందము
 రామణీయకత ఎక్కువ; అమ్మ కన్న ఆమె సంతానము
నలుగురికీ తెలియును; తమ తపః ఫలమున,
శ్రద్ధాసక్తులతో, అకుంఠిత దీక్షతో సృష్టించిన సాకిన సృష్టి
సృష్టి కర్తల కన్న మిన్నగా రాణించును; లోకమున
అందగించును, అలరించును, అజరామరమగును
*************
 
ప్రయోజనము లేని ఉనికిలు

చిత్తరువు లోని కాఫీ ఘుమ ఘుమలాడదు
మల్లియ పరిమళాలు వెదజల్లదు; నాతి రతి
సుఖమునీయ లేదు; పళ్ళు, ఫలహారములు
ఆకలి తీర్చలేవు; డబ్బు, బంగారము మన
అవసరము తీర్చలేవు; రాజకీయుల మాటలునూ
చిత్తరువు గీతలు; మన గీతల మార్చలేవు

అబద్ధము ఆస్వాదనకు పనికి రాదు; నిజమిచ్చు
సుఖశాంతులు, భ్రమ, భ్రాంతులు, అసత్యము ఈయలేవు;
త్రికరణశుద్ధి లేని ఊహలు, పలుకులు చేతలుగ మారవు
నీటిపై రాతల వలె ఆ క్షణమునకు మాత్రముండును

ప్రయోజనము లేని ఉనికిలు పార్టీల మేనిఫెస్టోలు
అబద్ధాలు ప్రజలను అందలాలెక్కించలేవు; ఆసరా
కాలేవు; ఆయాసము, ఆశాభంగములను మాత్రమిచ్చును
చిత్రములు ప్రజల నమ్మకములు; చిత్తరువుల గీతలు
**************

రమణీయమైన కావ్యములు

రాతిపై మలచిన కవిత శిల్పం
దివ్యతేజం నిండిన హస్త కళా స్వరూపం

ఎన్నో వన్నెలు దిద్దిన భగవత్ స్వరూపం
ప్రసన్నత కురిపించే భక్తుల పాలిటి గట్టి నమ్మకం

ఆచార్యుల ఆధ్యాత్మిక దృష్టి
ప్రతిబింబించే యోగ సమాహారం

విగ్రహారాధనను గేలి చేస్తూ ,
సిధ్ధాంతకర్తల నాస్తిక ప్రముఖుల
నాలుగు రోడ్ల కూడలుల లోని వారి
శిలా విగ్రహాల మెడలలో పూల మాలలు
వేసి తమ భక్తి ప్రపత్తులు ప్రకటించే
నాస్తిక శిఖామణుల రెండు నాలుకల
ధోరణిని అపహాస్య దృక్కులతో పరికించే దైవ శిఖామణి
 
గుడులు గోపురములు వాటిపై;
వాటిలో కన్నుల పండుగ చేసే
శిల్ప సంపద; ఆనాటి రాజుల రుచి,
శిల్పుల కళా నైపుణ్యం చాటే రాళ్ళ వైభవములు;

అప్పటి పేదల ఉపేక్షించి; వారి బాగోగులు నిర్లక్ష్యము చేసి,
సొమ్ముల ప్రభువులు రాతి గుండెతో రాళ్ల పాలు చేసినను
శిల్పములు శిలా కట్టడములు
సంస్కృతీ ప్రకటనములు; పరిరక్షణములు

దేశ చరిత్ర వహించిన కాల నాళికలు
శిల్పాలు శిలలపై చెక్కిన
రమ్య రమణీయ కావ్యములు
**********
 జ్ఞానమే శరణ్యము మనకు

కృష్ణుడు ఇస్కాన్ కల్టు వారి స్వంతమా‌ లేక వారి‌ కాపీరైటా, పేటెంటా?
వేంకటేశ్వరుడు వైష్ణవులకు‌‌ మాత్రమే దేముడా ఇతర భక్తుల కాయడా?

ప్రాంతము అక్కడి రాజకీయుల జాగీరా? తాతల ఆస్తా? మరెవరికి అక్కడ
చోటెందుకు లేదు? సంకుచిత్వము విషము చిమ్ముచువ్న నేడు, మత గురువులు,
నాస్తికులు, ప్రాంతీయ నాయకులు బరువు దేశమునకు; సామరస్యము తెలియని‌
మనుషులు శాంతి విధ్వంసకులు, సంఘ విద్రోహులు; అన్య మతముల, 


అన్య తత్త్వముల, అన్యదైవముల దూషించు‌వారు కారు మానవులు

ఇంగితము లేని వారు విద్యలు గరపగలరా? ఈ ఎల్లయ్యలు, పుల్లయ్యలు?
ద్వేషము క్రక్కు వారు సంఘమును నడుపగలరా? ఈ ఆధునిక సిద్ధాంత వాదులు?
మూర్ఖులై మూఢులై అనాగరికులు, సంస్కార హీనులు

గాక ఆ‌ ( నా )స్తిక శిఖామణులు? సమత మమత తెలియక,
నలుగుర కలుపుకుపోగల హృదయ‌ నైర్మల్యము లేక
పేచీ పెట్టు గురువులు, నాయకులు మేధావులు పుడమికి చేటు గాద!

ఆడలేనమ్మ మద్దెల ఓటన్నట్టు చేతగాక,
నూతనముగ ఏమి ఆవిష్కరించక
సాంప్రదాయమును, జ్ఞానమును నిందించువారు
సంస్కృతి, సంస్కారములు లేని అనాగరికులు, ‌
ఆటవికులు; ఇందర కుమనస్కుల భరించుట
భారతమునకు కష్టమగుచున్నది‌ నష్టమగు చున్నది‌;

ఎవరూ దేశమునకు చెందరు! అందరి సుఖ శాంతుల పోగొట్టు
దుండగీడులు వీరు; మేధావుల మనుకొను వాగుడు మూకలు!
జ్ఞానమే శరణ్యము మనకు; పెద్దల ఊసులే చద్దికూడు మనకు

Tuesday, July 12, 2016

కాల నిర్ణయము; అమెరికా విలాసం; ఏభై ఏళ్ళ “బ్రహ్మచారి”; భావ దిగంబరమైన మనసే ఆత్మ



కాల నిర్ణయము

అర్ధరాత్రి ఆస్ట్రేలియాలో, మొదలగును ఒక తేదీ;
నలభై ఎనిమిది గంటల తరువాత అమెరికాలో
మారును ఆ తేదీ; మనిషి కల్పితమైన కాల గణన
సుడిగుండమై అహంకారయుత మనమును తిప్పి
తిప్పి వెతల, వేదనల అడుగుకు చేర్చును; కాలాతీత
తత్త్వము శక్తి, పదార్ధ పరిణామములకు అతీతము;

కాలప్రవాహము అనునది లేదు; అది మనిషి భ్రమ
శక్తి, లేక పదార్ధ పరిణామములే కాల గమనము;
శక్తి, పదార్ధము పరిణమించకున్న కాల గమనము
లేదు, భూత-భవిష్యత్-వర్తమానముల స్పృహ లేదు

మాయా రూప ఆత్మ శక్తి పరిణామమే కాలగమన
స్పృహకు కారణము; మనసు నిర్మితము కాలము;
నేను, నాది అను తలపుల వలన కలుగును
కాల స్పృహ; అహంకార, మమకారాతీతమైన,
శుద్ధ గమనిక రూపమైన ప్రజ్ఞానము కాలరహితము
కాలాతీతము; చిత్ శక్తీ పరిణామ రహితము, మానసాతీతము
భావాతీతము, శాంతము, మౌనము, ఆనందము
 ****************


అమెరికా విలాసం

ఇప్పటికీ అమెరికా వెళ్ళడం ఒక ఘనత
అమెరికా అల్లుళ్ళకు ఇంకా విపరీతమైన
గిరాకీ; సీనియర్ సిటిజన్ లు తమ తమ
సంతానము అమెరికాలో స్థిరపడ్డారని సంబరంగా
చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతూంటారు;

తాము అమెరికా వెళ్ళడం ప్రముఖంగా వెల్లడిస్తారు
అక్కడి తమ నివాస ఛాయాచిత్రాలు విరివిగా
దర్పంగా చూపిస్తూంటారు అంతర్జాలంలో; అమెరికా
ఎందరో భారతీయ మధ్యతరగతి వారి స్వర్గధామం;

ఒక దేశం భారతీయుల మనసును ఇంతలా ఆకట్టుకోవడం
దోచడం విస్మయజనితం; విస్మయభరితం; అమెరికా అనే
మాటే ఎందరి హృదయాలనో తహతహలాడిస్తుంది; గర్వంతో
నింపుతుంది; భారత పౌరసత్వం కన్న అమెరికా గ్రీన్ కార్డ్ మిన్న;

లోకో భిన్న రుచిః; జనుల అహంభావ అహంకార ప్రకటనమునకు
అమెరికా పెద్ద ఆలంబన; అమెరికా సంబంధము లేని భారతీయులు
అధికులు కారని అమెరికాలో స్థిరపడ్డ ఎందరో భారతీయుల నిశ్చిత
అభిప్రాయం; భారతదేశం ఇందరు అమెరికా ప్రియులను కన్న ధన్య
*********************

 ఏభై ఏళ్ళ “బ్రహ్మచారి”


ఏభై ఏళ్ళ “బ్రహ్మచారి” ఎన్నో వివాదములలో ముఖ్యుడు. నాలుగైదు కేసులలో నిందితుడు. కట్ డ్రాయర్ తో సినిమాలో నటిస్తే ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టి కాసుల వర్షం కురిపిస్తున్నారు.
అలాగే ఎన్నో అవినీతి ఆరోపణలను ఎదుర్కొనేవారు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు.
ప్రజలను మభ్యపెట్టే, వారి అవసరాన్ని వాడుకుందామనుకునే కాల్ మనీ నేరస్థులకు, గోల్డ్ టోపీ వారికి అన్ని రాజకీయపక్షములనుంచీ వత్తాసు. బస్ టికెట్లను బ్లాక్ లో అమ్ముకునే వాడు గౌరవ పార్లమెంట్ సభ్యుడు.
విదేశములలో అక్రమముగా డబ్బు లావాదేవీలు జరిపేవాడు గౌరవనీయ కేంద్రమంత్రి.
ఇన్ని ఛండాలాలతో భారతదేశ ప్రజలు, భారతదేశం ఎలా బ్రతుకులు ఈడుస్తున్నారో? ఎన్నాళ్ళు ఇలా ఈడవాలో?!

**********

భావ దిగంబరమైన మనసే ఆత్మ

వలువలు శరీరాన్ని కప్పుతాయి. వలువలని తీసేసినప్పుబు నిజ శరీర దర్శనం జరుగుతుంది. అనాచ్ఛాదిత దిగంబర శరీరం కనబడి రసస్థితి కలుగుతుంది. మనసు ఆ రసస్థితిలో లీనమై తన ఉనికిని కోల్పోయి నిర్మలమై ఆనందానుభవమవుతుంది.
అలా భావములు నిర్మలమైన మనసుపై ఆచ్ఛాదితమైన వలువలు. భావములు ఆత్మస్థితిపైన పేర్పుడులు.
ఆ భావములు అనే వలువలు తొలగిన లేదా తొలగించబడిన తరువాత నిజ మానసిక (ఆత్మ / బ్రహ్మము) దర్శనం కలుగుతుంది. భావ దిగంబరమైన మనసే ఆత్మ. భావాచ్ఛాదిత ఆత్మయే మనసు.