Thursday, July 20, 2017

డ్రగ్స్ అలవాటు; వ్యసనపరుల మనస్తత్వాలు; ఊపిరి ఆగునంత వరకు విద్యార్థినే నేను; Money-making and Education


డ్రగ్స్ అలవాటు

డ్రగ్స్ అలవాటు ఒక కార్చిచ్చు. ఇది ఆరని కార్చిచ్చు.

జూదం, తాగుడు, వ్యభిచారం, అవినీతి పక్కన కూర్చుని పూర్తిగా కాల్చేస్తుంది.

ఇవేమీ పోయే వ్యసనాలు కాదు. ఇబ్బడిముబ్బడిగా రకరకాల మార్గాల్లో డబ్బు వచ్చిపడుతున్నపుడు వ్యసనాలు మరీ విజృంభిస్తాయి.

వ్యసనాల పాలయ్యేవారందరూ అన్నీ తెలిసే అందులోకి దిగుతారు. ధర్మపన్నాలు వారి పట్ల పనికిరావు. ఇది వాస్తవం. మిగతాదంతా మన wishful thinking మాత్రమే.

ఈ వ్యసనపరులలో రాజకీయ నాయకులూ, వారి సంతానం, సంఘంలో అతిగా సంపాదించే వారందరూ ఉన్నారు. ఇది మరొక వ్యసనం. అంతే.

ఈ విషయంలో ప్రభుత్వాలు ఏమీ చేయవు. చేయలేవు.

మన జీవనశైలి, జీవనవిధానం రకరకాల కారణాల వల్ల మారిపోయాయి. పిల్లలను పట్టించుకోవడానికి తల్లిదండ్రులకు సమయం లేదు. ఉపాధ్యాయుల పాత్ర ప్రస్తుత సమాజంలో సున్నా.

మన ధోరణులే మనకు అవరోధం. అడ్డు.

 ************

వ్యసనపరుల మనస్తత్వాలు



తనివితీరా జూదమాడాలి, జూదరి అనిపించుకోకూడదు.

హాయిగా, సుబ్బరంగా తాగాలి, తాగుబోతు అనిపించుకోకూడదు.

తిరగాలి, అన్నీ, అందరినీ అనుభవించాలి, తిరుగుబోతు అనిపించుకోకూడదు.

ఇష్టం వచ్చినట్టు గంజాయి, నేర్కొటిక్స్, డ్రగ్స్ ఎంజాయ్ చెయ్యాలి, డ్రగ్స్ బోతు అనిపించుకోకూడదు.

ఏమిటో ఈ వ్యసనపరుల మనస్తత్వాలు??!! ఆ పనులు చేసేటప్పుడు పనికిరాని, గుర్తుకు రాని పరువు ప్రతిష్టలు నలుగురికి తెలుస్తోంది అనేసరికి ఎందుకు గుర్తుకు వస్తాయో?

చాటుమాటుగా చేయడమే అందులో పసందేమో?


 ***************

 ఊపిరి ఆగునంత వరకు విద్యార్థినే నేను

ఊపిరి ఆగునంత వరకు విద్యార్థినే నేను
అధ్యయన అధ్యాపనములు సఖులు నాకు
నేర్చుకొనుచూ ఉండుట జీవ లక్షణము;
మన వృద్ధికి, మానసిక పరిణితికి సతత
తత్త్వావలోకనము; మనం పండడానికి, తరించడానికి,
సదా నందగోపకుమారుని నామ స్మరణం, అవసరం

**************** 
Money making and Education

Many give examples of Sachin Tendulkar, Bill Gates, Steve Jobs to stress how with scanty​ education or sans formal education one can become "great" hinting formal education produces stereotypes who work under these stalwarts or earn much much less money. 

This cannot be a role model. This is only an exception. Education always triumphs over business and money making sans education. You need education to invent new things; business cannot invent new things. It can only market and or sell. Money brings many things but education revolutionizes human life and civilization.

మాయ చిత్రములు 5, 6

మాయ చిత్రములు 5

పూర్ణమదః పూర్ణమిదమ్
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమ్ ఏవ అవశిష్యతే


ఇది మనందరికీ బాగా తెలిసిన ఉపనిషత్ శ్లోకం.

ఇందులో అదః ఆత్మని, ఇదమ్ చరాచర ప్రపంచం యొక్క ( మానసిక ) కార్యకలాపాలని తెలియజేస్తాయి. అదః ని
అహమ్ అనీ అంటారు.
అహమ్ గమనికకు, ఇదమ్, కల, మెళకువ మానసిక దశలలో జరిగే అంతఃకరణ పురోధాన తిరోధానయుత పరిణామము లకు చిహ్నం.
అహమ్ నే బ్రహ్మమనీ, ఆత్మయనీ అంటారు. అలా బ్రహ్మము, ఆత్మ గమనికకు మారుపేర్లు.
ఊపిరులు తీసి వదలడం వల్ల ఆత్మశక్తి జనిస్తుంది. ఆత్మ శక్తినే చిత్ శక్తి అనీ అంటారు. ఈ చిత్ శక్తి మేధలో ప్రతి ఫలనం చెంది చిదాభాస గా మారుతుంది. ఈ చిదాభాసనే
మాయ అంటారని అనుకున్నాం. మాయ ముందుకు, వెనుకకు అంతఃకరణముల రూపంలో మార్పు చెందడమే మనలో మానసిక కార్య కలాపాలు జరగడం.
అద్వైత స్థితిలో అహమ్, ఇదమ్ అని విడిగా ఉండక, అహమ్-అహమ్ వరుసగా, గమనికా ప్రవాహం మాత్రం ఉంటుంది. మానసిక కార్యకలాపాలు జరుగవు. జాగ్రత్ సుషుప్తి దశలో సంకల్పిస్తే జరుగుతాయి. గాఢనిద్ర, జాగ్రత్ సుషుప్తిలు అద్వైత స్థితులు.
కల, మెళకువ మానసిక దశలలో అంతఃకరణములు, జ్ఞాన, కర్మేంద్రియాలతో కలిసి పనిచేసి మనల్ని మానసికంగా పనిచేసేలా చేస్తాయి. ఈ స్థితిని ద్వైత స్థితి అంటారు. ఈ దశలలో ( కల, మెళకువ ) అహమ్ - ఇదమ్
అని రెండు గా గమనిక (లో) - ప్రపంచం ( మానసిక ) గా ఉంటుంది.
ఈ మానసిక కార్యకలాపాలు అన్నీ మానసిక శక్తి (మాయ)
యొక్క మార్పులు. కన్నడ భాషలో నిజగుణయోగి అనే ఆయన రాసిన వేదాంత చింతామణి అనే గ్రంథంలో, వేదాంత పరిచ్ఛేదంలో మాయకు ఐదు పేర్లు చెప్పారు.
అవి: తమస్సు; మాయ; మోహం; అవిద్య; అనిత్యం.
జీవచైతన్యాన్ని మఱుగుపరిచేది కనుక తమస్సనీ;
జగద్రూపమైన తనను వేరుగా తోపీంచుటకు కారణమైనది కనుక మాయ యనీ;
అట్లు తోపించు జగమున శుక్తి రజత భ్రాంతి కలిగించేది కనుక మోహమనీ;
విద్యను చెఱపినందున అవిద్య అనీ;
సద్రూపమునకు అన్యమైనందున అనిత్యమనీ;
చెప్పబడింది.
అద్వైత వేదాంత సారమైన
బ్రహ్మ సత్ జగత్ మిథ్యా
జీవో బ్రహ్మ ఏవి న అపరః
వాక్యార్థాన్ని;
రజ్జు సర్ప భ్రాంతి గురించి
తరువాయి భాగం లో పరామర్శిద్దాము.
శుభం భూయాత్!
మాయ చిత్రములు 6

ఉన్నది మరొకలా కనపడితే దాన్ని భ్రాంతి అంటారు.
ఇలా ఎందుకు జరుగుతుంది?
బయటి భౌతిక ప్రపంచం లోని వస్తు సముదాయాన్ని మనసు జ్ఞానేంద్రియముల సహాయముతో గ్రహించి మస్తిష్కంలో ఆంతర ప్రపంచం గా ముద్రిస్తుంది.
ఇది మెళకువ మానసిక దశలో జరుగుతుంది.
ఈ ఆంతర ప్రపంచం నుంచి మనసే వస్తు సముదాయ ముద్రలని గ్రహిస్తుంది. ఇది కల మానసిక దశలో అంతర్ముఖ దృష్టిని పొంది తలపుల రూపంలో వెలికి తీస్తుంది.
ఈ మెళకువ, కల దశలు ఒకే సమయంలో ఒక దాని తర్వాత ఒకటి చక చకా కలుగుతూ, బహిర్ముఖ, అంతర్ముఖ దృష్టులు ఏర్పడి మానసిక కార్యకలాపాలు జరుగుతాయి.
బయటి భౌతిక ప్రపంచం లోని ఒక వస్తువుని బహిర్ముఖ దృష్టి ద్వారా చూసి, అంతలోనే మనసు అంతర్ముఖమై ఆంతర ప్రపంచం నుంచి బయటి ప్రపంచంలో చూసిన వస్తువును అకార, ఇతర సదృశాలతో సమమైన వస్తువు గా మనకి కనిపింపజేస్తుంది.
అలా ముత్యపు చిప్ప మెరుస్తూ వెండిలా భాసిస్తుంది.
శుక్తి - రజత భ్రాంతి.
తాడు పాములా అనిపిస్తుంది.
రజ్జు - సర్ప భ్రాంతి.
మనసు ఇలా నిజాన్ని (ఉన్నదానిని) అబద్ధం గా (లేని దానిగా) చూపడం భ్రాంతి. లేని దాన్ని ఉన్నదానిగా చూపడం భ్రమ. భ్రమలు తలపులు గా ఉంటాయి. భ్రాంతి ఉన్న వస్తువు ని అబద్ధపు వస్తువు గా చూపుతుంది.
ఈ భ్రమ, భ్రాంతులు కలగడానికి మనసు తప్పుగా విషయ లేదా వస్తు గ్రహణం చేయడం.
మనసు ద్వారా గ్రహణము, చిత్తం ద్వారా గ్రహింపు ఏర్పడతాయి. బుద్ధి తర్కాన్నీ, విచక్షణా సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అహంకారం అనేది మన గురించి మనకు ఏర్పడిన, కలిగే భావ సముదాయము. తలపుల సమూహం. అహంభావ, మమకారాలని ఏర్పరిచే, కలిగించే అనుభవాలకు కారకం. కారణం.
మానసిక కార్యకలాపాలు జరిపే చిత్ శక్తి రూపమే మాయ.
ఉన్నది, ఉండేది బ్రహ్మము (గమనిక) ఒక్కటే. మిగతావన్నీ వచ్చి పోయేవే. ఆభాసలు. ఆనింపులు. అంతర్ముఖ దృష్టితో మనసు గ్రహించిన భావ సముదాయమే జగత్. ఇది భావముల రూపంలో గమనికలోకి వచ్చిపోయేది.
మిథ్యా పదానికి రెండు అర్థాలు. ఒకటి నిజము కానిది. అబద్ధమైనది. అద్దములోని మన ప్రతిబింబం మిథ్య.
అది నిజము కానిది. మన ముఖం నిజమైనది. ప్రతి బింబానికి వస్తువు గా అస్తిత్వం లేదు. ఉనికి లేదు. అద్దం లేకపోయినా, ముఖం లేకపోయినా ప్రతిబింబం ఉండదు.
దానికి స్వంతంగా, స్వయంగా అస్తిత్వం, ఉనికి లేదు. అది అద్దంలో కాంతి పరావర్తనం వల్ల ఏర్పడిన నిజము కాని ఒక అబద్ధం.
రెండవ అర్థం శాశ్వతత్వం లేనిది.
అలాగే జగత్ ఒక అబద్ధం. ఆభాస. మనసుచే కల్పించబడింది. దృష్టి లోకి వచ్చి పోయేది. శాశ్వతం కానిది. మానసిక దశ, అవస్థలని బట్టి ఏర్పడేది. మనసు చూపే, మనసే అయిన భావ పరంపర.
నిజము గమనిక. ఇది వ్యక్తి (భావ రూపంలో) ఉన్నప్పుడు, లేనప్పుడూ ఉండేది. మెళకువ, కల మానసిక దశలలో వ్యక్తిత్వం, వ్యక్తిత్వ భావన ఉంటాయి.
అలా, వ్యక్తిత్వం రూపంలో జీవాత్మ ఉన్నా, జాగ్రత్ సుషుప్తి, సుషుప్తి దశల్లో లేకున్నా ఎల్లప్పుడూ, సర్వ కాల (భావ), సర్వావస్థలయందూ ( మానసిక అవస్థలు, లేదా దశలు) ఉండేది, గమనిక గా ఉండేది బ్రహ్మము, ఆత్మ.
బ్రహ్మము, ఆత్మ ఒకటే. అయమ్ ఆత్మా బ్రహ్మా.
అహం బ్రహ్మాస్మి - నేను గమనికకు, దష్టికి మరియొక పేరు.
జీవాత్మ ( దృష్టిలో వ్యక్తిత్వ స్పృహ) ఉన్నా, పరమాత్మ (దృష్టిలో వ్యక్తిత్వ స్పృహ లేకున్నా) ఉండేది, రెంటికీ ఆలవాలమైనది ఒకటే. అదే దృష్టి రూపమైన బ్రహ్మము.
అంచేత జీవ భావమునందు, బ్రహ్మానుభవమునందు ఉండే గమనిక ఒకటే. ఒక్కటే. వేరు కాదు.
జీవో బ్రహ్మ ఏవ న అపరః.
ఇది బ్రహ్మ, ఆత్మ జ్ఞాన సారాంశము. అద్వైత వేదాంత సారము.
భావములు సుఖదుఃఖ కారణములు. అభావము శాంతి. ఆనందము, మౌనము.
ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!

Monday, July 17, 2017

The Son-Rises; రమణీయమైన కావ్యములు; పసికందుల అందం; కాలము - ముదిమి; అమ్మలేరి?


The Son-Rises

The Son-Risesare inevitable in Congress or any other political party. Our leaders cannot see beyond family, kith and kin whatever is the political party - national or regional. 

It is the bankruptcy of ideas and commitment to nation and nation's growth. They have only quick-fix solutions for any problem and have no vision or will to develop the nation.

Every political party in India is vulnerable to caste-based, community-based, region- and religion-based calculations to win elections, whether the party is left or right.

They are not interested in being a victim in elections by not playing divisive cards.
Voters are teaching the leaders bitter lessons and politicians of all parties are sinking politics to nether worlds.

 *************
రమణీయమైన కావ్యములు

రాతిపై మలచిన కవిత శిల్పం
దివ్యతేజం నిండిన హస్త కళా స్వరూపం

ఎన్నో వన్నెలు దిద్దిన భగవత్ స్వరూపం
ప్రసన్నత కురిపించే భక్తుల పాలిటి గట్టి నమ్మకం

ఆచార్యుల ఆధ్యాత్మిక దృష్టి
ప్రతిబింబించే యోగ సమాహారం

విగ్రహారాధనను గేలి చేస్తూ ,
సిధ్ధాంతకర్తల నాస్తిక ప్రముఖుల
నాలుగు రోడ్ల కూడలుల లోని వారి
శిలా విగ్రహాల మెడలలో పూల మాలలు
వేసి తమ భక్తి ప్రపత్తులు ప్రకటించే
నాస్తిక శిఖామణుల రెండు నాలుకల
ధోరణిని అపహాస్య దృక్కులతో పరికించే దైవ శిఖామణి

గుడులు గోపురములు వాటిపై;
వాటిలో కన్నుల పండుగ చేసే
శిల్ప సంపద; ఆనాటి రాజుల రుచి,
శిల్పుల కళా నైపుణ్యం చాటే రాళ్ళ వైభవములు;

అప్పటి పేదల ఉపేక్షించి; వారి బాగోగులు నిర్లక్ష్యము చేసి,
సొమ్ముల ప్రభువులు రాతి గుండెతో రాళ్ల పాలు చేసినను

శిల్పములు శిలా కట్టడములు
సంస్కృతీ ప్రకటనములు; పరిరక్షణములు

దేశ చరిత్ర వహించిన కాల నాళికలు
శిల్పాలు శిలలపై చెక్కిన
రమ్య రమణీయ కావ్యములు
***************

 పసికందుల అందం

పసికందుల కదలికలు అందం
బోసి నవ్వులు ఇంకెంతో అందం
మాట రాదు కాని హావభావములు
ఆనందదాయకములు; ఏడ్పులు కలరవములు

కావ్యములు; మనసుతో చూడాలి;
దోబూచులాడే వారిని అపురూపంగా
పెంచాలి మన సమయమంతా కేటాయించి;
మన ప్రేమానురాగాలు ఉగ్గుతో రంగరించి
***************
 కాలము - ముదిమి

 కాలము పరుగిడుచున్నది వేగంగా
అంతే వడితో ముదిమి అడుగిడుచున్నది;
శరీరంలో మార్పులు ప్రకృతి నియమం;
మనసులో కూర్పులు చేర్పులు మన సుఖదుఃఖములు

********
 పుస్తకములన్ననేమి
మస్తిష్కమునకు విందులు;
పసందులు; మనసును
వెలిగించు దివ్వెలు, ప్రకాశములు
***********
తాగుబోతులు, డ్రగ్స్ బోతులు, తిరుగుబోతులు సంఘంలో గౌరవనీయులు. మర్యాదస్తులు. నట, విట, విదూషక సమూహమునకు హారతి పట్టు జనులు వీరికి బానిసల వంటి అభిమానులు.
***********

అమ్మలేరి?



నా బొందోయని ప్రాకులాడుచు

ఇళ్ళను కాచేటి ముగురమ్మల
కలయికయైన గృహలక్ష్ములేరి?
అవ్యాజానురాగముల పంచి
ప్రేమల, అనుబంధముల తెలుపు
కొమ్మలేరి? ముద్దుల దేవేరులేరి?
పురుషునితో సమానత్వము
రుజువుచేయుటకై ఆఫీసులకేగిరి
అన్నిటియందు పురుషునికి తీసిపోమని
జబ్బ చరుచుచు తొడగొట్టుచు నిరంతర
యుద్ధోన్ముఖులైరి; అమ్మా అనిపిచుకొనుట
కన్న ఏమమ్మాయని ఉద్యోగినులుగ అనిపించుకొనుట
గౌరవము, మర్యాదా పరిరక్షణమనకొనుచుంటిరి
విద్య, వైద్యము ఖర్చులు నింగినంటుచుండ
ఎంత సంపాదించినను సరిపోని ధనార్జనముననుండిరి
స్థిరమైన ఉద్యోగములు లేక ప్రైవేటు యాజమాన్యములకు
తక్కువ ఖర్చు సాదా సీదా ఉద్యోగినులైరి; ఇంటి ఊసే ఎత్తలేక
కట్టు బానిసలైరి; వ్రతం చెడ్డా ఫలం దక్కని నోములు నోచినవారైరి
అమ్మలేరి?
నా బొందోయనుచు
ఇళ్ళను కాచేటి ముగురమ్మల
కలయికయైన గృహలక్ష్ములేరి?

మాయ చిత్రములు 3, 4

మాయ చిత్రములు 3

ఏది లేదో అది మాయ అని;

దేని ద్వారా మనం ఈ చరాచర ప్రపంచాన్ని గ్రహణకు తెచ్చుకొని మానసికంగా వ్యవహరిస్తున్నామో దానిని మాయ అంటారని 2 వ భాగంలో నిర్వచించుకున్నాము.

అదేవిధంగా చిదాభాస, ప్రణవం, స్ఫోట మాయకు నామాంతరములనీ చెప్పుకున్నాము. చిత్ శక్తి మేధలో ప్రతి ఫలనం చెంది చిదాభాస గా మారుతుంది. ఇది మాయ లేదా మానసిక శక్తీ. ఈ మానసిక శక్తి విభూతులే అంతఃకరణములు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములు అంతఃకరణములు.

మాయామయ, మాయానిర్మిత అంతఃకరణ పురోధాన, తిరోధాన పరిణామములే మానసిక కార్యకలాపాలు. అంతఃకరణముల పరిణామమునే వృత్తి అంటారు. అంతఃకరణములు పరిణమించకుండా, పనిచేయకుండా విరమింపబడి ఉంటే అది నివృత్తి. ఆధ్యాత్మిక సాధకులకు ఈ పరిభాష పరిచయమే.

మాయా మయమ్ ఇదమ్ జగత్

ఇది మనకు పరిచయమైన సంస్కృత వాక్యము. అద్వైత సారము.

మాయచే జగత్ నిర్మింపబడింది అని దీని అర్థం. జగత్ అంతా మాయామయము. మనసు మెళకువ మానసిక దశలో జ్ఞానేంద్రియముల సాయంతో బయటి భౌతిక ప్రపంచాన్ని గ్రహిస్తుంది. దానిని మస్తిష్కంలో ప్రపంచంగా భద్రపరుస్తుంది. బయటి భౌతిక ప్రపంచం విషయములతో నిండిఉంటుంది. వీటిని శక్తి పరంగా తన్మాత్రలు అంటారు.
కళ్ళకు కాంతి శక్తి, చెవులకు శబ్దం, ధ్వని (యాంత్రిక శక్తి),

ముక్కుకు, నాలికకు రసాయన శక్తి, చర్మానికి స్పర్శ ( యాంత్రిక శక్తి ), వేడిమి, చల్లదనం ( ఉష్ణ శక్తి) తన్మాత్రలు. ఇవి విషయ శక్తులు. విషయాలు ఇవి: దృశ్యాలు (కళ్ళు), శబ్దములు, ధ్వనులు, మాటలు (చెవి), వాసనలు (ముక్కు), రుచులు (నాలిక), స్పర్శ, వేడిమి, చల్లదనం (చర్మం).

ఈ విషయములు గ్రహింపబడుతున్నప్పడు అదే సమయంలో అవి కలిగించే అనుభవములను విషయానుభవములు అంటారు. వీటిని చిత్తం వాసనలుగా ఏర్పరిచి, భద్రపరచి మరల తానే వాసనా ప్రకోపం కలిగించి సంకల్ప, వికల్పములను, అనుభవాల జాగరణను చేస్తుంది. భాషలు నేర్చుకుంటున్నప్పడు ఇదే విధంగా జరుగుతుంది. మాటలు, వాక్యములు కలిగించే అర్థ స్పృహనూ, స్మరణాన్నీ చిత్తమే కలిగిస్తుంది, చేస్తుంది.

మనిషికి తన వివిధ భౌతిక, మానసిక, సాంఘిక స్థితి గతుల గురించిన తలుపులే అహంకారం. వాటి వల్ల కలిగే అహంభావం, మమకారం, అన్ని మానసిక వికారములూ మనసు, చిత్తంల ద్వారానే, వల్లనే కలుగుతాయి.
బుద్ధి తర్కాన్నీ, విచక్షణా సామర్థ్యాన్ని కలిగిస్తుంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ అంతఃకరణములన్నీ మాయా విభూతులే, అవతారములే. అంతఃకరణములు పరిణమించి పనిచేయడం మాయా పరిణామములే. అంతఃకరణములు పనిచేస్తూండడమే మానసిక కార్యకలాపాలు జరగడం.

అలా, ప్రపంచంలో ఐదు అంశలు ఉన్నాయి, అవి - ఆస్తి భాతి ప్రియం; నామం, రూపం. ఇందులో ఆస్తి భాతి ప్రియం బ్రహ్మ రూపము. నామము, రూపము జగత్ రూపము.

తరువాయి 4 వ భాగం లో.
****************
 
మాయ చిత్రములు 4

మాయ పదాన్ని చాలామందిమి సరిగా అవగాహన చేసికోలేదు.

అదృశ్యమై పోవడం, లేకుండా పోవడం మాయ గురించి వినగానే మనకు స్ఫురించే అర్థాలు.
మూడవ భాగంలో మాయ మానసిక శక్తికి పర్యాయ పదం అని తెలుసుకున్నాము. అన్ని మానసిక కార్యకలాపాలు నిర్వర్తించే అంతఃకరణములు మాయ యొక్క విభూతులే అని గమనించాము.

అంతఃకరణముల పరిణామములే వృత్తులని; "యోగః చిత్తవృత్తి నిరోధః" అంటే ఈ అంతఃకరణముల పరిణామములను నిరోధించు కోవడమనీ అనుకున్నాము.

"చేతోవృత్తిరుపేత్య తిష్టతి సా భక్తిరిత్యభిదీయతే" అని ఈ అంతఃకరణముల పరిణామములను జరగకుండా చేసికోవడమే భక్తి అనీ అన్నాము.

మాయావిభూతులైన అంతఃకరణ పరిణామముల వలన మనకు, మనలో మానసిక దశలు ఏర్పడతాయి. ఇవి:
జాగ్రత్ సుషుప్తి - మెళకువ తో కూడిన నిద్ర.
ఈ దశలో కావలిస్తే, సంకల్పిస్తే మాయ అంతఃకరణములుగా విభూతి చెంది, అంతఃకరణములు పరిణమించి జ్ఞాన, కర్మేంద్రియానుసంధానంతో మానసిక కార్య కలాపాలు జరుపుతాయి.
సుషుప్తి - గాఢనిద్ర.
ఈ దశలో మాయా పరిణామములు సంభవించవు.

మాయ అంతఃకరణములుగా విభూతి చెందదు. మానసిక కార్యకలాపాలు జరగడం ఉండదు.
మానసిక కార్య కలాపాలు నిర్వర్తించబడక విరమింపబడి ఉండడాన్ని నిద్ర అంటారు. ఈ దశ మనసు నిండుకున్న దశ. ఇప్పుడు దృష్టిలో తమము ఉంటుంది.

ఈ రెండు దశల్లోనూ దృష్టి విశ్రాంతమై ఉంటుంది.

మిగతా రెండు :

జాగ్రత్ - మెళకువ

మెళకువ మానసిక దశలో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియాలు ( మాట, ధ్వని - గొంతు - స్వరపేటిక కదలికలు; చేతుల కదలికలు, కాళ్ళ కదలికలు, ప్రేవుల కదలికలు, జననేంద్రియ కదలికలు) పనిచేస్తూ ఉంటాయి.
హావ భావములు అనుగుణంగా కళ్ళ కదలికలు, ముఖ భంగిమల మార్పు కర్మేంద్రియాలు కిందే లెక్కకు వస్తాయి.
అంతఃకరణములు జ్ఞాన, కర్మేంద్రియాలతో కలిసి పనిచేయడమే మానసిక కార్యకలాపాలు జరగడం. ఇది మెళకువ మానసిక దశలో జరుగుతుంది. అంతఃకరణములు బయటి భౌతిక ప్రపంచం లోని విషయములతో అనుసంధానించబడి విషయ, విషయానుభవ గ్రహణం చేస్తాయి. మస్తిష్కంలో ప్రపంచం, వాసనలు గా ఏర్పరిచి భద్రపరచి మరల అవసరమై నప్పుడు దృష్టికి తెస్తాయి. ఈ దశలో అంతఃకరణములకు బహిర్ముఖ దృష్టి ఉంటుంది.

స్వప్న - కల

కల మానసిక దశలో అంతఃకరణములు కర్మేంద్రియాలతో కలిసి పనిచేస్తాయి. జ్ఞానేంద్రియములు పనిచేయవు. ఈ దశలో మనసు తానే మెళకువ మానసిక దశలో జ్ఞానేంద్రియముల సహాయముతో నిర్మించిన విషయ ఆంతర ప్రపంచం నుంచి విషయములను గ్రహిస్తుంది.

మనసు ఆంతర ప్రపంచం నుంచి విషయములను గ్రహించడమే తలపులు కలగడం; భావములు జనించడం అన్నా, ఉదయించడం అన్నా ఇదే.

కల మానసిక దశలో అంతఃకరణములు అంతర్ముఖ దృష్టిని కలిగి ఉంటాయి. ఆంతరప్రపంచంతో మనసు, విషయానుభవములను వాసనలుగా మార్చి మరల సంకల్ప వికల్పములను కలిగించే చిత్తము మస్తిష్కంలోని;
దృశ్యం, శబ్ద, వాసనలు, రుచులు, స్పర్శలు, వేడిమి, చల్లదనం లను, అవి కలిగించిన అనుభవములను వెలికి తీసి మానసిక దృష్టిలోకి తెస్తాయి.

అంతఃకరణములు మాయయైపోవడమే జాగ్రత్ సుషుప్తి, సుషుప్తి దశల ఉదయం.

ఇలా జాగ్రత్ సుషుప్తి, జాగ్రత్, స్వప్న దశలలో మాయ విభూతి పొంది, అంతఃకరణములు గా మారి జ్ఞాన కర్మేంద్రియాలతో కలిసి పనిచేయడమే మానసిక కార్య కలాపాలు జరగడం లేదా నిర్వర్తింపబడడం.

మనకు కలుగు సకల జ్ఞానములు, భాషా జ్ఞానం, ఇతర పరిజ్ఞానములు, కౌశలములు ఈ పద్ధతి లో జరుగుతాయి.
మాయ గురించి మరిన్ని విశేషాలు, వివరాలు తరువాయి భాగం లో.

Saturday, July 15, 2017

Comprehenion of Time; ఉత్తమ పుస్తకం; Money in Evil Hands;



Comprehension of time

There is no time. There are only changes caused by energy transformation by itself or through matter and change of state and phase of matter by the aid of energy. Time sense is absent in deep sleep and wakeful sleep conscious states. Time sense and sense of passage of time is present only in wakeful and dream conscious states of mind.

Time sense is created by humans for cultural and civilization purposes. Time is as incomprehensible as Divinity and is comprehensible if proper perspective is developed.

Movement, change and becoming are alternatively termed as time as the process is observed and under consideration. Physical and psychological times are formed through energy transformations. The forms of energy vary depending on phase of matter and dimensions of space where the processes take place.

Both natural sciences, social sciences and philosophy and spirituality still have not come to a final and one understanding of time.

Varied insights and comprehensions about time confuse rather than clear the concept.
We must first mentally be prepared for a out of the routine idea and concept of time. Then nature, structure, form and construction time will be gradually comprehended.

*************
ఉత్తమ పుస్తకం

ఉత్తమ పుస్తకాలు ఏవి అనేది మనిషిని బట్టి మారుతాయి. అందరికీ నచ్చిన ఉత్తమ పుస్తకం అంటూ ఉండదు. మనిషి తత్త్వాన్ని బట్టి, మనస్తత్వాన్ని బట్టి, మనిషి కుల, మత, ప్రాంతీయ, దేశ, భాషా, సిద్ధాంత రాద్ధాంతాల్ని బట్టి, వాదాలని బట్టి ఉత్తమ పుస్తకాల లిస్టు మారిపోతుంది.

ఉత్తమత్వం మనిషి దృష్టిలో ఉంటుంది తప్ప పుస్తకంలో ఉండదు. ఇదంతా ఒక ఇంద్రజాలం. మనుషుల రకరకాల ఇష్టాయిష్టాలకి, తిక్కలకి దర్పణం ఉత్తమ పుస్తక ఎన్నిక.

ఆ నిజస్థితిలో ఒకరు ఇది ఉత్తమ పుస్తకం అనడం పదిమంది వెనకాల వంతపాడడం వింతగా ఉంటుంది.
అయినా ఉత్తమ పుస్తకాల ఎన్నిక జరుగుతోంటుంది.

మనుషులు భిన్న స్వభావులు. లోకో భిన్న రుచిః కూడా.

ఉత్తమ పుస్తకాన్ని నిర్వచించడం, ఎన్నిక చేయడం వృథా ప్రయాస. అయినా విమర్శకులు తరతమ భేదాలు ఎంచి ఒక లిస్టు తయారు చేస్తారు.
 
సాహితీకారుడు, లేదా మరే శాస్త్రం లోనైనా రచయిత తీసికున్న విషయాన్ని బట్టి, తామే నిర్వచించిన లక్షణాలని బట్టి బేరీజు వేస్తారు సాహితీ పిపాసులు, విమర్శకులు.

ఆ బేరీజు వేసే వారి ప్రతిభావ్యుత్పన్నతలని బట్టి పాఠకులకు, సామాన్యులకు ఉత్తమ పుస్తక ఎన్నిక అందుతుంది.
ఉత్తమ పుస్తకం మనిషి మనిషికీ మారుతుంది.
 
***************
Money in ecil hands
40 private school and 80 private college managements have brought pressure on the rulers and the investigation on drugs use in these educational institutions has attained suddenly snail pace. The reputation of these institutions is more important than the future of the students who are addicted to drugs while studying in these "educational" institutions. 

This is what our culture and civilization is. Money is able to provide special treatment to a prisoner, hushing up the most dangerous drugs cartel and sincere officers are asked for explanations for the duty they performed as part of their service. 

Celebrities every have hijacked all social institutions, social activities, social customs, culture, civilization and the rulers are more bent on protecting the involved than protecting innocent students and citizens. 

Money in criminals' hands is all destroying and damaging.