Thursday, July 6, 2017

భగవన్నామములు; Yoga; Cognitive Biology; Sermonizing; Concessional India; Education in India

భగవన్నామములు ఎన్నో. భగవంతులు ఒకరే. పేర్లు ఎన్నో. కరుణ అదే.

 ************

Yoga is a process reverse to mental activity.

 Silence is melody of Divinity!
 *****************

Cognitive biology is hardware and mind and its functions and psychology are software of the same subject, aspect. This comes under physiological psychology.

 *********

Sermonizing

We are living less and are sermonizing more. We are lecturing more and following less. Tradition is more talked about and less implemented, and not made part of our life.

We more want others to follow tradition and change for good than we ourselves. This sort of concern or expectations helps none.

Every field of human activity has become more casual and less sincere.

No one means what one says; one does not follow what one preaches.

Criminals, the corrupt, the fanatics, the terrorists, the money-making bees are so dedicated and intent on their work that they are succeeding and are proliferating though sans conscience because of their one-pointed aim.

************

Concessional India

In India all citizens are equal.

But men have one income tax slab and women another. Men and women are not equal in India.
Women have reservations for political positions. Why? When they are equal with men why they be specially treated? And given concessions and reservations.

All Indian citizens are equal. But certain sections are pampered with so many concessions and reservations, why?

Are all Indian citizens not equal? Are some sections and genders more equal?

Now demands are made for reservations in the selection of Indian cricket team.
 
One slogan is all Indian citizens are equal.

Another slogan is, of them some sections and genders are more equal in the garb that they are less equal.

How all equal citizens are deferentially, differently, discriminatingly treated?

Because they are vote banks. Indian presidential candidate selection even is tainted with this.

India is a nation of concessions and special treatments; even though Constitution wished for an India of equal opportunities gradually and progressively.

India is converted into a weird country in the name of  inequality.

Whatever political party forms government, these concessions and pampering goes on forever. There is no escape for BJP or Congress or any regional party.

To that extent Indian democracy is destroyed.!!!!!!!!?????

**********

Education in India

Education has lost its meaning, significance, style, grace, dignity, definition. Many are enamored by tags and names.

The three "r" s, the foundation of education are neglected and many useless and unnecessary attractions are added. And the parents are buying them.

The three "r' s can be simply and with very less expenditure learnt and basis for education is provided. But none wants such cheapness.

The school our kids go to has also become our status symbol. As long as the true meaning, significance, spirit and value are recognized, money spending only will be equated with "providing" education.

Parents' arrogance, ignorance, innocence, helplessness and also greed are responsible for this corporate education business of thousands of crores of rupees at the primary, secondary, tertiary and professional courses level.

A vain hope that this "education" and a certificate that it gives at the end of the course will bring a job too is responsible for all this drama. No one wants learning, study, knowledge, which are essential ingredients of education. Job-provision is not part of education.

No one even is aware of this. Sad state of affairs and very deep ignorance and too much greed are ruining the education and governments are encouraging the private educational institutions and most of these money-spinning institutes are run by trusts headed by politicians, their kith and kin and even criminal-minded people are running schools for the money one can make.

Tuesday, July 4, 2017

ఈశావాస్యోపనిషత్ - భాష్యము - జ్ఞానబోధ మీమాంసా దృష్టి - 1

ఈశావాస్యోపనిషత్ - భాష్యము - జ్ఞానబోధ మీమాంసా దృష్టి - 1

పీఠిక:

ఉపనిషత్తులు భారతీయ తత్త్వశాస్త్రము యొక్క తల్లి వేరులు. “ఇంతింతై వటుడింతై చందముగ ఎదిగిన త్రివిక్రమ స్థితి భారతీయ తత్త్వశాస్త్రమునకు కలగడానికి ఆధారము, కారణము ఉపనిషత్తులు. వేదములలోని జ్ఞానశాఖకు చెందినవి ఉపనిషత్తులు.

మనకు ఇంత వరకు ఉపనిషత్తుల భాష్యము ముఖ్యముగా అద్వైత పరము గాను, విశిష్టాద్వైత పరముగాను, ద్వైత పరముగాను, శాక్తాద్వైత పరముగానూ లభిస్తువ్నాయి. చాలామంది ఆచార్యులు మనకు దైవపరముగా వ్యాఖ్యానములను అందించారు. ఈ పై తత్త్వ గ్రంథములనన్నిటినీ జ్ఞానబోధ మీమాంసా పరముగాను వ్యాఖ్యానించవచ్చు. ఇది ఉపనిషత్తుల అసలు దృష్టి. జ్ఞానబోధ మీమాంస ఆంగ్ల అనువాదము cognitive science.

ఈ దృష్టిని ఆస్తికులు అభినందించలేకపోవచ్చు. సత్యము, జ్ఞానము మన ఇష్టాయిష్టములకు అతీతము.

"సత్యమ్ జ్ఞానమ్ అనంతమ్ బ్రహ్మా".

మనకు "ఏకమ్ సత్ విప్రాః బహుధా వదంతి" అని తెలిసిన విషయమే కదా.

వేదములలోని జ్ఞానశాఖకు చెందిన ఉపనిషత్తులు “సత్” ప్రతిపాదికములు.

“సత్” పదము ‘అస్’ ధాతువునకు నపుంసక లింగ ఏక వచన ‘శత్రు’ రూపము (present continuous form). ‘అస్’ ధాతువు యొక్క ఈ రూపము వర్తమానములో, ఉంటూ ఉన్నదాన్ని సూచిస్తుంది. అలా “సత్” పదము వర్తమానములో సదా ఉండే వస్తువు ఉనికిని తెలియజేస్తుంది. ‘అస్’ ధాతువు, ఆంగ్ల భాషలోని “to be” అని infinite form కల క్రియ యొక్క present continuous form –Being.

అలా “సత్” పదము వస్తువు వర్తమానపు సదా ఉనికిని తెలియజేస్తుంది. ఏ వస్తువు? ఆ వస్తువుని సంస్కృత భాషలో ‘బ్రహ్మా’ అనీ, ‘ఆత్మా’ అనీ సూచిస్తారు. తెలుగు భాషలో వాటిని ‘బ్రహ్మము’, ‘ఆత్మ’ అంటారు. ఆ విధముగా ‘సత్’ అనగా అస్తమానూ ఉంటూండేది అని తాత్పర్యము. భూత, భవిష్యత్, వర్తమానములలో, వాటికి అతీతంగా కూడా ఉండేది అని సారాంశము.

శాంతి మంత్రము

ఓం పూర్ణమద: పూర్ణమిదమ్ పూర్ణాత్ పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||
|| ఓం శాంతి శ్శాంతి శ్శాంతి: || .

పూర్ణత్వము సమృద్ధిని, నిరపేక్షతను, తెలియజేస్తుంది. స్వయం సమృద్ధ: పూర్ణ:.

‘ఆత్మా సత్’, ‘బ్రహ్మా సత్’ అని వ్వవహరిస్తారు. ఇందాకా చెప్పినట్టు ‘సత్’ అనగా ఉనికిని సదా కలిగి ఉన్నది అని సారము.

అలా అద: అంటే బ్రహ్మము లేక ఆత్మ.

ఇదమ్ అంటే జగత్. ఇది Becoming. ముందు చెప్పినట్టు ఆత్మ Being. మానసిక కార్యకలాపములు మొదలవడం, జరగడం, విరమింపబడడం లను ఇదమ్ సూచిస్తుంది. అలా జగత్ అంటే మనసు, ఇతర అంత:కరణములు పనిచేయు మానసిక సమయము; మానసిక దశ. ఉపనిషత్తులు ఆత్మను, బ్రహ్మమును అనుభవపూర్వకముగా ప్రతిపాదించాయి. ఉపనిషత్తులలో ఆత్మజ్ఞానము / బ్రహ్మజ్ఞానము ఉంది. నూట ఎనిమిది పైన ఉపనిషత్తులు మనకి లభిస్తువ్నాయి. వీటిలో పదకొండు ఉపనిషత్తులను ముఖ్యమైనవిగా పేర్కొని‌ ఆది శంకరాచార్యులు అద్వైత పరంగా వ్యాఖ్యానించారు. ఈశావాస్యోపనిషత్ వాటిలో ఒకటి.

ఉపనిషత్తులు, ఆత్మను గురించి‌ మాట్లాడినపుడు చైతన్యమనీ (శక్తి పరముగా), బ్రహ్మమును గురించి మాట్లాడినప్పుడు వస్తువని, పదార్థమనీ అన్నాయి. వాసనా-భావ-నామ-రూప రహిత వస్తువును పదార్థము అన్నాయి. అలా ఆత్మశక్తి లేక ఆత్మచైతన్యము ‌అనీ, బ్రహ్మపదార్థము అనీ మాటలు వాడుకలోకి వచ్చాయి.
అయమ్ ఆత్మా బ్రహ్మా - అనే ఉపనిషత్ మహావాక్యము‌, ఆత్మ, బ్రహ్మము ఒకటే అని తెలిపింది.

అహమ్ బ్రహ్మాస్మి, ప్రజ్ఞానమ్ బ్రహ్మా, తత్ త్వమ్ అసి, రసోవై సః, ఆనందో బ్రహ్మా, సర్వమ్ ఖలు ఇదమ్ బ్రహ్మా- అనేవి ఇతర ప్రసిద్ధ‌ ఉపనిత్ మహావాక్యములు.

వీటన్నిటినీ శ్రద్ధతో అవగాహన చేసికోవాలి. ఇందుకు మనకు ఉపనిషత్ స్రష్టల నుంచి ఆధునికులైన రమణ మహర్షి ప్రభృతుల వరకు అందించిన అవగాహనలు ఎంతో ఉపయోగిస్తాయి. ఈ భాష్యము అందరు ఆచార్యులను, వారి అనుగ్రహభాషణములను సమానమైన గౌరవముతో అవగాహన చేసికుంటుంది. ఉపయోగించుకుంటుంది.
ఉపనిషత్ పరిభాషలో అద:, అహమ్, ఇదమ్ ప్రత్యేకమైన గ్రహింపునిస్తాయి.

అహమ్ అన్నా, అద: అన్నా, ఆత్మా అన్నా, బ్రహ్మా అన్నా ఒకే వస్తు చైతన్యము సూచించబడుతుంది. విజ్ఞానశాస్త్రములలో సాంకేతిక పదములుండి, వాటికి ప్రత్యేకమైన అర్థములుంటాయి. అలానే ఉపనిషత్తులలో, తత్త్వశాస్త్ర గ్రంథములలో ఎన్నో సాంకేతిక పదములుంటాయి. వాటి ప్రాచుర్యార్థము వేరు, సాంకేతికతార్థము వేరు.
పై ఉపనిషత్ శాంతి పాఠ శ్లోకములో సూచించబడిన అద: పూర్ణమైనది. ఇదమ్ పదము మానసిక కార్యక్రమముల నిర్వహణను, వాటి స్వరూప, స్వభావములను సూచిస్తుంది. పైన చెప్పినట్టు ఇదమ్ ని జగత్ అంటారు. ప్రపంచమనీ అంటారు. జగత్ కు ప్రపంచానికీ స్వల్ప, సూక్ష్మ సాంకేతిక భేదముంది.

ముందు అద:, ఇదమ్, జగత్ ల గురించి పరామర్శించుకొని ప్రపంచ పదాన్ని, దాని నిర్వచనము, అవగాహనలను పరామర్శించుకుందాము.

శ్లో|| అస్తి భాతి ప్రియం నామం రూపమ్ ఇతి అంశ పంచకమ్|
ఆద్యత్రయం బ్రహ్మరూపం తతో ద్వయమ్ జగత్ రూపమ్||

( వేదాంత పంచదశి)

ప్రపంచం అస్తి, భాతి, ప్రియము, నామము, రూపము అనే ఐదు అంశములతో ఏర్పడింది. మొదటి మూడు బ్రహ్మ రూపము, చివరి రెండూ జగత్ రూపము.

జాయతే, గచ్ఛతే ఇతి జగత్ అని ఒక నిర్వచనము. పుట్టి, విరమింపబడేది, లేకుండా పోయేది జగత్ అని దీని అర్థము.

ఈ వ్యాఖానము భగవత్ పరముగా మాత్రమే చేయబడదు.

ముఖ్యముగా జ్ఞానబోధ మీమాంసా దృష్టితో చేయబడతుంది.

ఈశావాస్యోపనిషత్ - భాష్యము

అథవాజసనేయినాం సంహితోపనిషదం వ్యాఖ్యాస్యామః

మొదటి శ్లోకము

ఓం ఈశావాస్యమ్ ఇదమ్ సర్వమ్
యత్ కిం చ‌ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుఞ్జీథా
మా గృధః కస్యస్విద్ధనమ్

పురుషోత్తముడు; రాలిన పారిజాతములు; "ఆత్మజ్ఞానులము" అనుకునే వారి రంధి

పురుషోత్తముడు

నిదుర పోతూ ఎఱుక గలవాడు భగవంతుడు; జ్ఞాని; మౌని;

నిదుర మానసిక కార్యకలాపాలు విరమింపబడిన, మనసు నిండుకున్న, హృదయం పూర్తిగా శాంతి తో నిండిన పూర్ణ
నిర్మల మానసిక స్థితి. 


మానసిక కార్యకలాపాలు జరుగక,ఎఱుక రూపంలో గమనిక, గమనించే తెలివి నిండుగా ఉన్నవాడు దేవుడు. ప్రజ్ఞానఘనుడు.

ఆనందస్వరూపుడు, శుద్ధ జ్ఞాన స్వరూపుడూ ఆయనే.

విభక్తము కాని భక్తి యుతుడు, స్వరూపుడు ఆయనే. ప్రణవ, నాద, స్ఫోట స్వరూపుడు ఆయనే.

నిత్య క్రియా తంత్రుడు, పరతంత్రుడు, స్వతంత్రుడూ ఆయనే.

పరమార్థము, పరమాత్మ, శ్రుతి, స్మృతి, శాస్త్ర, పురాణముల ఐశ్వర్యము, కలిమి, తాత్పర్యమూ ఆయనే.
ప్రపంచ, జగత్, విశ్వ సృష్టి స్థితి లయ కారకుడు ఆయనే.

తను స్థితి శక్తి యై, తన దేవేరి గతి శక్తి యై రాజిల్ల సమస్త విశ్వాన్ని సృష్టించి, స్థితి నిచ్చి, లయబద్ధంగా నడిపి, ప్రళయకాలమునందు జగత్ ను, మన వ్యక్తిత్వమును తనలో లయము చేసికునే కర్మ పరుడు, కర్మ సాక్షి, విశ్రాంతి స్వరూపుడు ఆయనే.
 
ఆయన జగత్కర్త, జగన్నియామకుడు, జగల్లయకారకుడు
ఆయనే.

అట్టి పరమపురుషునికి, పురుషోత్తమునికి ప్రణామములు.

మోక్షప్రదాతకు శరణాగతి. ప్రపత్తి.

ఓం తత్ సత్ పరబ్రహ్మార్పణమస్తు!

*************

రాలిన పారిజాతములందము
వాలిన ప్రియ రమణి ఆనందము
చాలిన కోర్కెలు మనసుకు శాంతము
ఏలిక శ్రీ వేంకటేశ్వరుడు మనకు సమస్తము

************

"ఆత్మజ్ఞానులము" అనుకునే వారి రంధి

మనం వేదాంతం చదివితే మనకు ఉపయోగించుకోకుండా మిగతావాళ్ళందరికీ చెప్పి వాళ్ళకి మన గొప్పతనము తెలియాలని తాపత్రయ పడతాము. వేదాంతము వంటబడితే ఇంటువంటి తాపత్రయాలు ఉండవు.

మనలని మనము ఉద్ధరించుకోవడమే వేదాంతము చదవడములోని, వినడములోని పరమార్ధము. వేదాంతాన్ని శ్రవణము, మననము, నిదిద్యాసనము చేయాలని పెద్దల సలహా. వేదాన్తములోని మాటలన్నీ మనకి చిన్నప్పటినుంచి కరతలామలకాలే. మన దేశములో పుట్టి పెరిగిన చిలక, పిచ్చుక, కుక్క, పిల్లి, పులి కూడా వేదాంతము చెప్పగలవు. వేదాంతము మన జన్యువులలో ఉంది. మన రక్తములో ప్రవహిస్తోంది.

ఇంతలా మన జీవితాలతో పెనవేసికున్న వేదాంతము అంటే అసలు ఏమిటి?

విన్నంత మాత్రాన, తెలుసుకున్నంత మాత్రాన, ఉపన్యసించినంత మాత్రాన వేదాన్తులము అయిపోతామా? అందరిని శిష్యులుగా పరిగణించేoత జ్ఞానులగా మారిపోతామా మనము? కొన్ని వేదాంత సాంకేతిక పదాలు విన్న లేదా పలికినంత లేదా తెలిసినంత మాత్రాన ఆత్మజ్ఞాన సంపన్నులము, తత్త్వవేత్తలము, మునిశ్రే ష్ఠులము అయిపోతామా?

మన గురించి మనము మర్చిపోయి, మన ఉద్ధరణకు సున్నా చుట్టుకుని ఇతరులను ఉద్ధరించేది ఏమైనా ఉంటుందా? ఈ అనుమానము మనకి ఒక్కసారి వచ్చినా సరే మనము ధన్యులము. మనకు మెళకువ కలిగి, మనము తెలివి తెచ్చుకుని మన ఉద్ధరణకు మనము నడుము బిగించుకుంటాము. ఇతరుల జోలికి పోము.
కౌపీన పంచకములో శంకరాచార్యుల వారు బ్రహ్మజ్ఞానులను వర్ణించారు. అది వింటే, చదివితే, మనసు వికసిస్తుంది. అలాగే వారి విరచితమే అయిన నిర్వాణ షట్కము విన్నా చదివినా కూడా అంతటి అనుభూతి లభిస్తుంది.

వేదాంతము ఎంత చక్కనిదో అంత చిక్కనిది. దానిని సాధించి జీవన్ముక్తులము అవుదాము

Monday, July 3, 2017

తాగుబోతు వాహన చోదకులు;కాలము-సమయము-కాలాతీతము-మానసాతీతము-రామబ్రహ్మము; Adventurous China;


 తాగుబోతు వాహన చోదకులు

తాగి వాహనములు వడపడం ఆడవారికి, మగవారికి ప్రాథమిక హక్కు అయిపోయింది. బాగా ఖరీదైన జీవితాలు కలవారు, మరెంతో ఖరీదైన వాహనములను తాగి నడుపుచూ నరమేధం చేస్తున్నారు. వారి విశృంఖలత్వానికి, విచ్చలవిడికి అడ్డూ అదుపూ లేవు.

ఈ తాగి నడిపే హంతకులందరూ సెలిబ్రటీ స్టేటస్ కలవారే. వీరిపై కేసులు పెట్టబడవు. ఒకవేళ ఖర్మకాలి పెట్టినా దశాబ్దాల తరబడి కోర్టుల్లో నానతాయి. నేరస్థులు బెయిల్ పై బయటకు వచ్చి మరిన్ని రకరకాల నేరాలు చేస్తూంటారు.

త్రాగుడు బడుగులకే నేరం. సెలిబ్రిటీలకు, ధనవంతులకు త్రాగడం స్టేటస్ సింబల్. ఈ పరిస్థితులలో పబ్ లలో, లేదా ఎక్కడో తాగి బళ్ళు నడపడాన్ని సమాజం ఎంతో సానుభూతిగా చూస్తూ, తాగుబోతు హంతకులందరినీ బుజాన వేేసుకుంటోంది.

ఈ తాగుబోతుల నుంచి ప్రజలకు రక్షణ కలిగించడం ప్రభుత్వాల వల్ల కావటం లేదు. కాదు కూడా అనిపిస్తోంది.
అలాగే రకరకాల నేరాలూ మందకొడిగా విచారణకు వస్తున్నాయి. విచారణలూ ఇంకా మందకొడిగా జరుగుతున్నాయి. న్యాయమూర్తుల కొఱత మొదలైన వాస్తవాలు సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి.

అలాగే అత్యాచారాలు. నూరు శాతం నిరోధింపబడవు. పౌరుల సహకారం కూడా అత్యాచారాల విషయంలో ఉండాలి. తగు జాగ్రత్తలను పౌరులు తమంత తాము తీసికోవాలి. విశృంఖలత, విచ్చలవిడి తనము ప్రాథమిక హక్కులు కావు. 24×7 రక్షణ ఏ ప్రభుత్వమూ సమకూర్చలేదు.

కాని తాగుబోతు వాహన చోదకుల విషయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసికోవచ్చు. కాని ప్రభుత్వాలు పాలన మర్చిపోయి సంవత్సరాలు అయింది.

పాలనంటే చాలామంది నాయకులకు, పాలితులకు ఉచితాలు వాగ్దానం చేయడం, ఖజానాాను డొల్ల చేయడం.
పౌరులను కుల, మత, ప్రాంత, వంటి విభేదములతో విడదీసి భేదనీతితో ఓట్లడగడం.

ఏమయినా యథా ప్రజా తథా రాజా (నాయకాః) లాగ జరుగుతున్న పాలనలు పౌరులకు గంతకు తగ్గ బొంతే.

**************

కాలము-సమయము-కాలాతీతము-మానసాతీతము-రామబ్రహ్మము

సమయము, కాలము వేరు. కాలము పరిణామము. సమయము కాల వ్యవధి. కాలము శక్తి లేక శక్తి ప్రేరిత పదార్ధ పరిణామము. పదార్ధము ద్వారా శక్తి రూపపరిణామమూ కాలమే. కాలము కలనము. కలనము అంటే లెక్క బెట్టుట.

మనము అనుకునే కాల ప్రవాహము నిజానికి శక్తి లేక పదార్ధ పరిణామము. శక్తి, పదార్ధ పరిణామములు చర్యలను, ప్రతిచర్యలను, ఆంతర చర్యలను కలిగిస్తాయి. శక్తి, పదార్ధ పరిణామములు లేక ఎటువంటి చర్యలు జరగవు. చర్యలు లేక కాలము కాని, కాల గతి, గమనము కాని లేవు. కాలపు ఉనికి చర్యలు జరగడంపై ఆధారపడి ఉంటుంది.
కాల స్పృహ, కాలగమన దృష్టి శక్తి, పదార్ధ పరిణామ గ్రహణలు. ఈ గ్రహణలు ఆగిపోతే మనము కాలాతీత స్థితిని అనుభవిస్తాము.

గ్రహణారాహిత్యమే కాలాతీతము, మానసాతీతము కూడా. మనసు ఉనికి లేక కాల స్పృహ, కాలపు ఉనికి లేవు. మన గాఢనిద్ర మానసిక దశలో మనసు పనిచేయక విరమింపబడి ఉంటుంది. అన్ని తలపులు, అనుభవములు స్పృహలోనుండవు. దృష్టి విశ్రాంతమై ఉంటుంది. ఈ స్థితిని జాగ్రత్ సుషుప్తి అంటారు. ఇది మానసాతీత ఆత్మ దశ.

శాంతమన్నా, ఆనందమన్నా, మౌనమన్నా, మోక్షమన్నా, నిర్వాణమన్నా, శుద్ధాహం స్థితియన్నా, ప్రజ్ఞాన స్థితియన్నా, నిర్మల మానసిక స్థితియన్నా, పరా స్థితియన్నా, భక్తి స్థితియన్నా, రస స్థితియన్నా, దివ్య స్థితియన్నా, భగవత్ స్థితియన్నా ఇదే. జీవబ్రహ్మైక్య స్థితియన్నా ఇదే. ఈ దశలో వ్యక్తిత్వము విస్మరింపబడి ఉంటుంది.

ఆత్మారామ స్థితియన్నా, రామబ్రహ్మ స్థితియన్నాఇదే. సమస్త వేదాంత, సకల ఉపనిషత్ సార అవగాహనము, గమ్యము, ఆధ్యాత్మిక జీవన ఫలము ఈ స్థితిని పొంది, అందు సదా నిలిచి ఉండడమే.

ఏతత్ సర్వమ్ శ్రీ పరమేశ్వరార్పణమస్తు!

సమస్త సన్మంగళాని భవంతు!

భగవత్ ప్రీతిరస్తు!

Adventurous China

China is testing waters with us. Is it trying to bully us, frighten us? Why this psychological war with us? Why it is teasing and irritating us with its daily dose of statements? What is its aim? What it wants? Dragon is trying to be mysterious with us. Let us see.

*********

Orphan Children

Save orphan children of India. Good. How about children who have parents but not mother. Who will take care of them?
 

Sunday, July 2, 2017

Marriage; Democratic India; Builders and Bricks; ఈశ్వరానుభవం ; చేయి తిరిగిన రచయితలు

Marriage

Marriage is essentially an economic transaction, whether one is aware of it or not; agreeing or not.
Even live-in-partnerships have reduced to that even though they are neither legal nor traditional.
It is amusing to read about people going to courts to claim economic benefits from the other party when they decide to separate from each other.

And when divorce is fought it is finances and economics that are being dealt with by courts or any other mutually agreed to adjudicator or mediator.

All other descriptions are just fancies. It should be borne in mind before blaming this or that; him or her.

**********
Democratic India

If government's land is occupied by influential people or by vote-bank people it is an uncontested and authorized deed. Real estate is developed by former category and own business is conducted by later category.

The moral is such occupations are never probed, contested and the occupants are allowed to get away with their booty.

This is democratic India.

***********

Builders and bricks

People's behavior is reflected as a nation. There is no nation sans its citizens. Mere geography is not a nation.

One must note when one is criticizing a nation, knowingly or unknowingly one is criticizing it's citizens and their behavior.

So India is criticized means its citizens are criticized. When one finds India is inhabitable it's inhabitants are responsible for such a situation.

Nation is adorable if its citizens are adorable. A nation is admirable if its citizens are admirable.
A nation is backward if its citizens crave to be backward and demand to be considered backward. But who has to bear the burden of so many backwardness claimants?

Citizens have to build a nation by being bricks of the building. But in India there are many "builders" than bricks.
***********
 ఈశ్వరానుభవం

"తమ మనసనే అద్దాన్ని తుడిచిపెట్టుకోగలిగితే చాలు, ఈశ్వరవదనం ప్రతి ఒక్కరిలోనూ ప్రతిఫలిస్తుంది".
ఇది అనుకున్నంత, చెప్పినంత తేలిక కాదు.

వర్ణ, లింగ, మత, భాషా, సంస్కృతీ, నాగరికతలకు అతీతంగా ఎవరికైనా ఈ అనుభవం కలుగవచ్చు.
కలిగించుకోగలిగిన అర్హత మాత్రం అందరికీ ఉండదు.

దీనికి ఆలోకన, అవగాహన, వినయము, జిజ్ఞాస, ముముక్షుత్వము అవసరము.

ఆ పై వ్యక్తిగత కృషి, శ్రద్ధా కూడా అవసరము.
*************

చేయి తిరిగిన రచయితలు


ఒక స్థాయికి వచ్చాక చేయి తిరిగిన రచయితలు ఏది రాస్తే అది ప్రాచుర్యము పొందుతుంది. అప్పుడు వర్ధమాన రచయితలు ఆశ్చర్యపోతూంటారు.

"తమ రచనలు వాసిలో బాగుంటాయి, అయినా ఈ ప్రముఖుల సాదా సీదా రచనలే అచ్చవుతున్నాయి."
అని.

అసలు సాహిత్యం చదివే వాళ్శే తక్కువ. ఆ కొద్దిమందిలో ఎక్కువ మంది ప్రముఖుల రచనల పట్ల మొగ్గు చూపుతారు. ఆ రచనలను వారు పూర్తిగా చదవకపోయినా ఒక అభిప్రాయం కలిగి ఉంటారు. 

వర్ధమాన రచయితలకు పేరు, ప్రాచుర్యము రావడం భగీరథ ప్రయత్నం జరిగినా జరగదు. కీర్తి కాంత ఎవరిని వరిస్తుందో తెలియదు. ఎంత ప్రతిభావ్యుత్పన్నతలున్నా, మంచి పస గల రచనలు చేసినా ప్రఖ్యాతి చెందరు చాలామంది రచయితలు, కవులు.

నిజానికి, రచించగలగడం, కవనములు అల్లడం అందరకూ అబ్బదు. కొందరికే ఆ భాగ్యము పడుతుంది. కాని పేరు, ప్రఖ్యాతులు రావడం దేని మీద ఆధారపడి ఉంటుందో ఏ జ్యోతిష్కుడు, భవిష్యత్ వేత్త చెప్పలేరు.

కీర్తి, ధనము కొందరినే వరిస్తాయి. ఇది ప్రకృతిలోని తమాషా.

Friday, June 30, 2017

ఐశ్వర్యవంతులు - శ్రీనాథులు; Preachers and We

ఐశ్వర్యవంతులు - శ్రీనాథులు

యాచకో యాచకశ్శత్రుః

ఇది అందిరికీ తెలిసిన, అనుభవవేద్యకమైన మాట.
ఇద్దరు ముష్టి వాళ్ళు ఒకరికొకరు శత్రువు.

ఒకే వృత్తిలో ఉన్నవారు ఒకరి పట్ల ఒకరు సహజంగా మత్సరంతో ఉంటారని తాత్పర్యం. ఈ విషయలో ఎవరికీ భేదాభిప్రాయాలు ఉండవు.

రాజకీయ నాయకులు, వ్యాపారస్థులు, ఇలా వివిధ వృత్తుల్లో ఉన్నవారు పోటీని ఇష్టపడరు. అసూయ, ఈర్ష్య కలవారై చేతకాని వారైతే అయిష్టం ఎక్కువ మోతాదులోనే ఉంటుంది.

సాహితీ సృష్టులు, విమర్శలు చేసేవారిలోనూ ఈ దృష్టి ఉంటుంది. కొండొకచో ఈర్ష్యలు, కొండొకచో నిరసన భావములు, కొండొకచో తక్కువ చూపులు, కొండొకచో అతిశయం, కొండొకచో అయిష్టం, కొండొకచో గర్వం, అహం, దర్పం ఇలా మాత్సర్యములుంటాయి.

చాలా మంది సాహితీ స్రష్టలు తమ సృష్టి నలుగురి దృష్టిలో పడాలని, తోటి కవులను, రచయితలను, విమర్శకులను, సాహితీ వేత్తలను ఆకర్షించాలని, ఆకట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు. లబ్ధ ప్రతిష్టుల మెప్పు పొందడం కోసం పరితపిస్తూ ఉంటారు.

కాని ఆ లబ్ధ ప్రతిష్టులు రకరకాల కారణాల వలన సామాన్య సాహితీ స్రష్టల సృష్టులు పట్టించుకోలేరు.
వారి వారి రచనావ్యాసంగానికి సమయం కేటాయించు కోవాలి; ఈ సామాన్యుల సృష్టి వారి స్థాయికి ఆనక పోవచ్చు. వారి సిద్ధాంతం, వాదప్రియత్వం వేరవచ్చు.

ఈ సామాన్యుల సృష్టి పై ఉదాసీనత కావచ్చు. లేదా ఈ సామాన్యుడు అసామాన్యునిగా కనిపించి, తమ ముద్ర వాడిపై వేస్తే ఆ బలంతో తమను మించి పోతాడన్న అసహనం కావచ్చు.

అయినా సామాన్యులైన సాహితీ కారులు లబ్ధ ప్రతిష్టుడైన సమీక్షించుకుని ముద్రకై వెంపర్లాడటం ఒక బలహీనత. కాకి పిల్ల కాకికి ముద్దు లా మన సృష్టులు మనకు ఎంతో బాగుండచ్చు కానీ అందరినీ అలరించాలని నియమం లేదు.

శంఖం లో పోస్తేనే కాని తీర్థం కానట్టు లబ్ధ ప్రతిష్టుడైన సమీక్షకునిచే ప్రశంసింబడితే తప్ప తమ రచన పండలేదు అనుకోవడం అమాయకత్వం. పసితనం.

ఎందరో సాహితీ కారులు తమ జీవిత కాలంలో లబ్ధ ప్రతిష్టులు కాలేదు. త్యాగరాజస్వామికే ఈ అవస్థ తప్పలేదు. ఆయన తన సృష్టిని రామాంకితం అనుకున్నాడు కనుక దేనినీ లెక్కచేయలేదు. మనంతటి వాళ్ళం మనం.

ఎంతటి గొప్ప సృష్టిని సమకాలీనులు రకరకాల కారణాల వల్ల గుర్తించరు. మెచ్చుకోరు. అన్ని రంగాల్లోనూ ఇంతే. ఎందరో ఈ నాడు మనం లబ్ధ ప్రతిష్టులు అనుకుంటున్నవారు వారి, వారి జీవితకాలంలో అనామకులే. పట్టించుకోబడని వారే. నిరసనలకు గురై, అనేక రకాలుగా తీసిపారవేయబడిన వారే.

మనలాంటి వాళ్ళం భగవదర్పితంగా సాహితీ సృష్టులు చేసేవాళ్ళం కాదు. మన కవితా, రచనా వ్యాసంగం మనకు పేరు ప్రతిష్టలు, ప్రఖ్యాతులు, వీలైతే ధనం తేవాలని కలలు కనే వాళ్ళమే.

ఇతరుల ప్రశంసకై మన సాహితీ సృష్టి చేయబడడం లేదు, ఆత్మతృప్తికై మనం సాహితీ సృష్టులు చేస్తున్నాము అనుకుంటే, లబ్ధ ప్రతిష్టులైన సమీక్షకులు, తోటి కవుల, రచయితల, విమర్శకుల మెప్పు లభించక పోయినా నిరుత్సాహపడకుండా సాహితీ వ్యవసాయం చేస్తూనే ఉంటాము. ఒకరిద్దరు పాఠకుల ప్రశంస లభించినా సంతృప్తులమౌతాము.

ప్రకృతిలో పూచిన పూవులం సామాన్య సాహితీ స్రష్టల మైన మనం. ప్రకృతి సోయగాలన్నీ కూడా బదులు ఏమీ ఆశించని‌ సౌందర్య ప్రదర్శనాలు. మన సృష్టి అడవిని కాచిన వెన్నెల కావచ్చు. భగవంతుని మూర్ధమును అలంకరించే కుసుమం కావచ్చు. వాడి రాలిపోయే పువ్వూ కావచ్చు.

విమర్శలు కోరుకోని, ప్రశంసలకు పొంగని, నిరసనలకు క్రుంగని ప్రకృతీ సదృశం మన మనము, మన సాహితీ సృష్టి మన సంపద. ఐశ్వర్యవంతులం మనం. బిచ్చగాళ్ళం కాదు.

మనం మనకి గొప్ప వాళ్ళమే. ఈ మాత్రం దర్పం లేకపోతే శ్రీనాథునికి వారసులం ఎలా అవుతాము!

మన స్థాయిలో సాహితీ సృష్టులు ఎలా కొనసాగించగలుగుతాము!?

*************

Preachers and We


We have many intellectuals championing this ism or that thought. They talk to us as if they are masters in that thought and we "children", and preach us more boringly than the religious missionaries. These intellectuals and missionaries think that we do not know anything and must be "helped".

When these gentlemen realize that we too are equally capable and can guide our life following wise tradition and do not require this unsolicited and irritating "sermons".

They must mind their own business and try to become spiritual with what little knowledge they acquired through the study and practice of their ism, ideology, religion, political philosophy, religious or ideological cult and the like thoughts and feelings.

Every human being is endowed with Divinity in the form of intuition and Divinity glows in us all.
My salutations and obedience to such blissful, peaceful, silent and serene Being in us as pleasantness.

Wednesday, June 28, 2017

ఆధ్యాత్మిక జ్ఞానం; Modern men and women; నాస్తికులు

 ఆధ్యాత్మిక జ్ఞానం


ఆధ్యాత్మిక జ్ఞానం మనిషికి అవసరం, కూరలోకి ఉప్పు లాగ. రుచి ఇస్తుంది కదా అని ఉప్పుని మాత్రమే తినము కదా. అలాగే జీవితం నడకని సొంపుగా చేస్తుందని ఫక్తు ఆధ్యాత్మికత పాటిస్తే నీరసాన్ని కలిగిస్తుంది. లౌకికము, పారలౌకికము తగు పాళ్ళలో ఉంటే సొగసు. ఏదీ అతి పనికిరాదు. 

ముఖ్యంగా నేటి స్వాములు, ఆనందాలు, అమ్మలు, బాబాలు, బాపులు, మహరాజ్ లు, మువ్నగు కుహనా వ్యక్తుల బ్రాండు ఆధ్యాత్మిక సర్వదా వర్జనీయము. వీరిలో 99 శాతం ధన, స్త్రీ, కీర్తి, పేరు మొదలైన ఆకర్షణలను అధిగమించలేని అల్పులు. ఆధ్యాత్మిక పరమాన్నము లోనే ఉంటూ, దాన్ని అందరకూ పంచుతూ కూడా, దానిని వంటబట్టించుకోని, కోలేని నిరక్షరాస్యులు. ఆ మాధుర్యము తెలియని బండ నాలుక వారు.
ఆధ్యాత్మిక ని తామే వంటబట్టించుకోని వారు మనకేమి ఒరగబెట్టగలరు?
 
శివ, విష్ణు, రామ, కృష్ణాది దివ్య నామముల వదలి అటునిటు తిరుగువారికి పరమార్దమెటుల తెలియు? పరమాత్మ ఎటుల దర్శనమొసగు?

భగవత్ ప్రీతిరస్తు!

************

Modern men and women

Now a days many are unduly worried for the happenings in the world even though they cannot do much about it..

They are not able to stand the atrocities committed, deceits and cheating practiced, bombs exploding and many innocent lives nipped in the bud or after living for some years, the political, social, financial and other negative things happening throughout the world and are much troubled in their minds due to their sensitive hearts.

Unknowingly when we try to comfort and console them that we need not be concerned with all these unrelated happenings to us and let us not lose our peace of mind and happiness, they seem get offended and think, we who advice like that are insensitive and we need some counseling.
I noted these reactions and decided not to try to say anything to them and do not say to them to not get disturbed because of happenings beyond their control.

And it would be sane to allow them to be what they are and enjoy their indulgences. I understood they do not need external comfort and feel offended if they do not follow religiously the regional, national and international happenings of all hues.

And they seem to think that they are civilized and cultured only if they get disturbed by these non-personal happenings. May be they have a fine personal life, where they have a free time to get "touched" by the unsavoury happenings of the world.

It dawned on me that it is better to let them have their civilized and cultured living with full indulgence in words and comments on anything and everything of their choice.
So it is wise to allow many to follow the worldly events as they want.
***********

నాస్తికులు
నాస్తికులు వేరు, శాస్త్రవేత్తలు వేరు. నాస్తికులు శాస్త్రవేత్తలు కారు. శాస్త్రవేత్తలకు ఓపెన్ మైండ్ ఉంటుంది. వారి ఇష్టాయిష్టములకు అతీతంగా సత్యావిష్కరణ చేస్తారు. తమ రాగ, ద్వేషములను శాస్త్రజ్ఞులు తమ సత్యాన్వేషణకు అడ్డు రానీయరు. నిజము తమ నమ్మకానికి విరుద్ధంగా ఉంటే సత్యానికే ఓటు వేస్తారు. పెద్ద పీట వేస్తారు.
ఆస్తికులు భగవంతుడున్నాడని నమ్ముతారు. నాస్తికులు భగవంతుడు లేడని నమ్ముతారు. ఇద్దరివీ నమ్మకాలే. రాగ, ద్వేషముల వలన ఏర్పడిన ఇష్టాయిష్టములే.

భగవంతుని ఉనికిని నమ్మనంత మాత్రాన నాస్తికులు శాస్త్రవేత్తలు కాలేరు. కారు. ఎందరో నాస్తికులకు లోతైన ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానము, అవగాహన సున్న. 

వారి నమ్మకాలలోనికి శాస్త్రవేత్తలను ఎందుకు లాక్కొస్తారో వారికే తెలియాలి. ఇంచుమించు అందరు శాస్త్రవేత్తలు వినయశీలురు. ఎందరో శాస్త్రవేత్తలు తత్త్వవేత్తలు కూడా.

మతం వేరు, తత్త్వం వేరు అని ఎందరో నాస్తికులకు తెలియదు. శాస్త్రవేత్తల పేరు చెప్పుకొని, నాస్తికులు తమ నమ్మకము రేషనల్ అనుకుంటారు. అది వారి భ్రమ మాత్రమే.

నమ్మకం నమ్మకమే. నమ్మకానికి, రేషనలిజమ్ కీ చుక్కెదురు.