Showing posts with label nature. Show all posts
Showing posts with label nature. Show all posts

Friday, October 17, 2014

కొండవాగు, गिरिझरी, THE HILL-STREAM




కొండవాగు నా కవితాధార
ఎండి పోదు ఈ ఆర్ద్రత ఏ వేళా

హృదయ గిరులందు పుట్టి
ప్రవాహమై పరుగులిడుచు
గంతులేయుచు కిందికి దూకు
జలపాతముగ మారి

అడవులలో అందముల మధ్య అందమై
కదలుచు కదిలించు తీయని నీటి జాలు

నాగరికులెవ్వరికి కనబడని జల గమనము
గిరిజనుల మనము వలె కుళ్ళు లేని నిర్మలము

వాదముల సంస్కృతుల సిద్ధాంతముల ఉనికి తెలియని (క)
తనకై తాను  సాగే సామాజిక స్పృహ లేని వట్టి నీటి పరుగు

ఎఱుగదది పద గమన నిర్దేశనలు
ఉన్నట్టే తెలియదు దానికి నడకల సూత్రములు

అలంకారములు ఆర్భాటములు పట్టని తాను
కొండల కోనల స్వేచ్ఛగా విహరించే చెంచీత

రాలపై ఉదాత్తనుదాత్తముల వేగముగ చలించుచూ
శ్రావ్య రాగముల గానము చేయు కోయిల

ఎత్తుల పల్లముల ఇష్టమున గంతులేయుచు
నటనలు నేర్వకనే నర్తించే మయూరి

చిత్ర కారుల కుంచెలంచులు
దిద్దలేవు దాని ఒద్దికలు

ఛందస్సున కనుగుణముగ కదలు
గురు లఘువులు పట్టలేవా పరుగులు

ఆనవు వాద ప్రతివాద సంకులి(చి)త మానస దృష్టికి
దాని తీరు తెన్నులు సహజ గమన సౌందర్యములు

తావమాడరెవరూ గ్రోలరా నీటి నే దొరలూ
దాని ఉనికే తెలియదు
పురవాసులైన వేత్తలకు

నిర్మల మానస ప్రవాహము నా కవిత
దివ్య హృత్ ధ్యాన గమనము దాని నడత

ఆంద్ర సాహితీ గోదావరీ సలిలముల
మౌనముగ కలియుచు
తనదనము కోల్పోని కిన్నెరసాని!
నా కైతల కొండవాగు!



गिरिझरी

गिरिझरी मम कविताधारा
कदा न भवति शुष्का सा

हृदयगिरौ संजाता
प्रवहति धावति
लङ्घयति पतति
जलपातम् भवति

अटव्यां सौन्दर्यानां सौन्दर्यं भूत्वा
चलति स्पृशति सा मधुरसरिता

न जानाति पदगमननिर्देशनानि
न जानाति शब्दतत्त्वसूत्राणि
अलङ्कारानि आर्भाटनि न विचिन्त्य
संचरति पर्वतसानुषु गिरिकन्या इव

पाषाणेषु वेगेण चलन्ती
सृजति गायति श्राव्य गानानि रागानि

उदात्तानुदातौ प्लवन्ती
नर्तन्ती विनायासम् मयूरी इव

चित्रकाराणाम् तूलिकाङ्चलाः
चित्रितुं न शक्नुवन्ति तस्याः चलनानि गमनानि

छन्दोनुगुणेन प्रचलन्त्याः गुरुलघवः
रचयितुं न शक्नुवन्ति तस्याः लाघवानि

निर्मलमानसप्रवाहानि मम कविताः
दिव्यहृत्ध्यानगमनानि तस्याः चलनानि

नैजगुणम् अत्यक्त्वा
मौनेन संगमति किन्नेरसानि इव
साहितीगोदावरी सलिलेषु
मम कवितागिरिझरी


THE HILL-STREAM

The flow of my poesy is a hill-stream
Never will she run dry.

Born in the hills of my heart
She rushes, flows
Jumps and plunges,
A waterfall she.

A beauty among itinerant beauties
Tangible as she moves,

She knows not how to order her steps as she travels
Knows not the intricacies of rules and rhymes.
Without a care for embellishment, pomp and show,
She roams in the hills and valleys, a mountain girl.

Flowing swiftly over stones
She produces musical notes sonorous as if she were singing a raga,

Fluttering up and down, high and low,
Like an untrained dancing peacock.

The brushes of artists
Cannot depict her darting hither and thither;
Prosody has no relevance
For her marathon runs.

Her swift movements do not allow her to settle.
My verse is borne of a plain heart
Absorption in Divinity is the goal of her journey.
Silently she joins the waters of the literary Godavari
Without surrendering her own identity.
Kinnerasani! The hill-stream of my poetry.

Tuesday, October 14, 2014

ప్రకృతి ఉనికియే ఆహ్వానము ఆనందము, ADVERTISEMENT AND INVITATION



భాస్కరునికి ప్రకాశమే ప్రకటనము
మల్లెలకు సౌరభమే ప్రకటనము
తుమ్మెదలకు ఝంకారమే ప్రకటనము
సౌందర్యమునకు ఉనికియే ప్రకటనము
రమణులకు ఎత్తులు పల్లములే ప్రకటనము
ప్రణయినికి  ప్రేమ కురిపించుటయే ప్రకటనము
పూర్ణ చంద్రునికి ఆహ్లాదభరితమైన కౌముదిని పంచుటయే ప్రకటనము
సముద్రునికి అలలు ఎగసి పడుటయే ప్రకటనము
కవికి కవితలల్లుటయే ప్రకటనము
అందగత్తె అయిన అమ్మాయికి ముద్దబంతి ఇంతికి,
దర్పము అతిశయములే ప్రకటనము
రసికులు తమంత తామే వత్తురు అనుభవమునకు
పిలుపులు ఆహ్వానములు ప్రదర్శనము ప్రకటనము
అవసరము లేదు అందమునకు; అందించు ఆనందమునకు
ప్రకృతికి ఉనికియే ప్రకటనము పిలుపు ఆహ్వానము ఆనందము



ADVERTISEMENT AND INVITATION
I
The brilliance is advertisement to sun
And the fragrance to the jasmines
The humming sound to the bees
And very existence is advertisement for Beauty
II
Their elevations and depressions are advertisement to the youthful women
And loving heart to the beloved;
The cool and pleasant moonlight is advertisement to the full moon
And the roaring waves to the sea;
III
Composing verses and lyrics is advertisement to the poet
And pride and arrogance are advertisement to the beautiful girl
IV
No necessity for the bliss showering beautiful ones
To undertake any advertisement or invitations for admirers; 
The aesthetic and romantic hearts on their own
Approach the nature for the pleasant experiences;

Its very existence is invitation
From the nature
Call and advertisement
To the sensitive and sensuous
For enjoyment




Sunday, October 12, 2014

ADVERTISEMENT AND INVITATION







I
The brilliance is advertisement to sun
And the fragrance to the jasmines
The humming sound to the bees
And very existence is advertisement for Beauty
II
Their elevations and depressions are advertisement to the youthful women
And loving heart to the beloved;
The cool and pleasant moonlight is advertisement to the full moon
And the roaring waves to the sea;
III
Composing verses and lyrics is advertisement to the poet
And pride and arrogance are advertisement to the beautiful girl
IV
No necessity for the bliss showering beautiful ones
To undertake any advertisement or invitations for admirers; 
The aesthetic and romantic hearts on their own
Approach the nature for the pleasant experiences;
Its very existence is invitation
From the nature
Call and advertisement
To the sensitive and sensuous
For enjoyment