Showing posts with label క్రూరాత్ములకు లేవు అడ్డు అదుపు. Show all posts
Showing posts with label క్రూరాత్ములకు లేవు అడ్డు అదుపు. Show all posts

Sunday, November 15, 2015

క్రూరాత్ములకు లేవు అడ్డు అదుపు

క్రూరాత్ములకు లేవు అడ్డు అదుపు


తలుపులకు తాళములు వేయునది పెద్దమనుషులకోసం
దొంగలను తాళములడ్డలేవు పగలగొట్టి దొంగతనం చేస్తారు

పాపపుణ్యముల మాట మామూలు మనుషులు తప్పుడు
పనులు చేయకుండుటకు; క్రూరులు దేనినీ లెక్కచేయరు

నీతినియమముల సంగతి న్యాయముగ వర్తించువారికి
అవినీతిపరులైన దుష్టులకు అక్రమ వర్తనమే ఊపిరి

ప్రపంచములో దుష్టులకు దుర్మార్గులకు ఆటవిడుపు
హింస, ఏ వంకనైనా తోటి మనుషులను చంపుట పండగ

క్రూరులను దుష్టులు దుర్మార్గులను అవినీతి పరులను
నియంత్రించే చట్టము మతము‌ లేవు హింసను ఆపలేము

ఇది వాస్తవము నిష్ఠూరమైనా నిజము
మిగిలినవన్నీ మన ఆశలు కలలు ఊహలు
ఆటవికతదే రాజ్యము అప్పడూ ఇప్పుడూ
ఎప్పడూ; నాగరికత క్రూరత్వానికి దాసోహమనవలసినదే

పెద్దలు విజ్ఞులు మంచిని నీతి సూత్రములను వల్లెవేయుట
మనబోంట్లము బుద్ధిగా వర్తించుటకు; మృగసదృశులకు
లేదు అడ్డు లేవు సంకెళ్ళు శిక్షలు లేవు పాపపుణ్యములు
దేశాధినేతలు వారి వారి సైన్యములు ఏమీచేయలేవు వీరిని