Monday, September 12, 2016

కవితలు; ప్రైవేట్ బళ్ళు ; లంచావతారుల ఆదాయములు; Professor Stephen Hawking; విద్య వైద్యము ఆధ్యాత్మికతలు


కవితలు

గోవిందమాల

 ఉన్నతమైన ఆలోచనలు వాటికి తూగు
ఉత్తమమైన మాటలు, వాటికి సరిపడు
సదాచరణము; త్రికరణములు శుద్ధమై
సయోధ్యగ నుండు సౌభాగ్యము నిమ్ము గోవిందా!

నామములను పెట్టుకొని బహు నీమములను పాటించి
నారాయణుని దివ్యనామమును నియతిగ జపించి తపించి
మనసునాయత్తపరచుకొని‌ అందు భగవంతుని చిద్విలాసములు
శాంతి మౌనములై వెలుగొంద ఆ దివ్యానుభవమును పలుకగ లేము

**************


 భక్త శంకరం 

పువ్వులేవైననేమి? అసలు పువ్వులే లేకున్నను
మనసుపుష్పముగ పూజలందుకుందువు భక్తపాలన
కళాచతురా! భక్తవశంకరా! భోళాశంకరా! శంకరా!
భక్తిప్రపత్తులతో ఉద్ధరిణెడు నీళ్ళతో చేయు అభిషేకము
స్వీకరింతువు మోదమున, బ్రోతువు మమ్ముల సదా
చల్లగచూతువు మమ్ము పావనగంగాధరా! పార్వతీ వల్లభా !

*******************


అవ్యయము మారనివి లంచావతారుల ఆదాయములు

లంచములడుగుట లంచములిచ్చుట ‌ఆనవాయితీ
ఏ పార్టీ అధికారములోనున్ననూ తప్పని తద్దినమిది;
సూర్యుడు ఉదయించుట మానవచ్చును, శశాంకుడు
శీతల కిరణముల మనపై ప్రసరించక పోవచ్చును

అవ్యయము మారనివి లంచావతారుల ఆదాయములు;
ఇందందరూ భాగస్థులే; అడుగువారు, ఆశపెట్టువారు,
అందించువారు; మనకే ఇన్ని అవతారములు! కావివి
మన జీవితములకు శోభనిచ్చు అలంకారములు;

ప్రభుత్వముతో పని జరుగుటకు నిశ్చయించబడిన
రేట్లు; ఎవరేమన్ననూ, ఎవరు పాలించుచున్నను
సన్నకారు, పెద్దకామందుల సదృశ లంచావతారులు
ఎవ్వరు చేయివేయలేని నిరంతర శాశ్వత వసూళ్ళు

నాయకులు పెద్ద పెద్ద వాగ్దానాల చేయుదురు
కోట్ల విలువైన ప్రాజెక్టుల గురించి పగలు రాత్రి లేక
ఉపన్యాసముల దంచెదరు; పంచెదరు మత్తు మందు
మాటలు; క్రియ శూన్యము; మరేదీ చేతకాదు, చేత రాదు

***********
ప్రైవేట్ బళ్ళు 


చేసినవి దర్జాగా ప్రైవేట్ బళ్ళు అన్ని చదువులను కబ్జా
మనల రవాణాచేయుచున్నవి ప్రైవేట్ బళ్ళు దోచుచు;
మనందరకూ కార్పొరేట్ ఆస్పత్రులే గతి; చవక వైద్యము
హుళక్కి అయినది; ఆశించుట వెఱ్ఱిదనమాయె; చదువులకై,
వైద్యమునకై ఇళ్ళు గుల్ల చేసికొనుట రివాజు అయ్యె;
ఏదో ఇంత ఉడకేసుకు తినుటయే భారమయ్యె
**********
భాషను చక్కగ నేర్చి పెక్కు శాస్త్రముల నేర్వక
ముక్కున పట్టి పరీక్షహాలులో అయినదనిపించి
ఒక కాగితపు ముక్కను చేతను బట్టి ఉద్యోగార్ధియై
చెప్పులరుగ తిరుగువారు, పునాదులు లేక భవంతుల
కట్టి అందు సుఖనివాసమునకై కలలు కనుచు
అర్రులు చాచువారు, అప్పుల మిగులు వారు
*********** 

ఆత్మ విశ్వాసమును పెంపొందింపలేని చదువులవి‌ ఏల?
ప్రజల సంక్షేమము చూడని నాయకులు, పాలకులేల?
పసికందుల దాదులకొదలు తల్లులు అమ్మలా వారు?
ముసలివగ్గుల తల్లిదండ్రుల వృద్ధాశ్రమములలో చేర్చు
సంతానమది ఏల? చదువులలోని మర్మములవి తెలియని
విద్యార్థులు, తత్త్వము తెలియని సన్యాసులు వారేల?


అంతయు అందరు బరువు పృథివికి దేశమునకు; మన
శక్తియుక్తుల, మనల చల్లగచూచు దైవముండ వగచుట
ఏల? నిజ ధర్మమును, బాధ్యతలను శ్రద్ధగ పాటించు
హృదయముండ మనము దేనినైన లెక్కచేయనేల?

*********
ఈన కాసి నక్కలపాలు చేసినట్టయింది భారతదేశపు సంస్కృతి, సనాతన ధర్మముల పరిస్థితి .
*****************

Professor Stephen Hawking

 Professor Stephen Hawking, one of the greatest living physicists predicts now that God Particle or Highs Boson can and will destroy the world. Why the Western Scientific Community is so crazy to create and observe Highs Boson spending so many billions of dollars? Is it we are all taken for granted by scientistific community and they did such dangerous experiment just to quench their thirst of knowledge at the risk of annihilation of human kind and all life? All the great scientists approved it and did not stop the conduct of such a devastating experiment is really incomprehensible. Scientists too are negligant to human well-being and are nihilists; a wrecking reality and unbearable information.

************

గుడులు కట్టుట కన్న బడులు తెరచుట
మిన్నయని హేతువాదులు; గుడులైనను
బడులైనను సమానముగ ఆదాయము
తెచ్చునని నాయక శిఖామణులు; వాటికి
వైద్యసహాయమును కలపమని వ్యాపారులు
చెవిలో ఊదరకొట్టుచుండ; మంచి మంచిగా
విద్య వైద్యము ఆధ్యాత్మికతలతో జనులు పెద్ద
పెద్ద వ్యాపారములు చేయుచుండ; గుడియో
బడియో ఆసుపత్రియో తెరచుకొని బ్రతుకుట
ధనము పరపతి పేరు ప్రఖ్యాతులు సంపాదించుట
తెలివైన పని; కార్పొరేట్ ల సరసన బైఠాయించ వచ్చు;
అంతను వర్తకము వ్యాపారములు ఆక్రమించిన నేడు
విద్య వైద్యము ఆధ్యాత్మికతలు కోల్పోయినవి వాటి సహజకాంతులు
 


No comments:

Post a Comment