Saturday, September 3, 2016

మామూలు

మామూలు

డాక్టర్లకు చావులు మామూలు
మంత్రులకు స్కాములు మామూలు
అవినీతి పరులకు బొక్కుట మామూలు
నాయకులకు బొంకుట మామూలు


ఏక్టర్లకు, రాచకీయులకు వారసత్వములు మామూలు
ప్రజాప్రతినిధులకు తమ ఓట్లమ్ముకొనుట మామూలు,
ఎలక్షన్లలో ఓట్లు కొనుట మామూలు; ఏమీ చేయని
ఆ నాయకులనే పదే పదే ఎన్నుకొనుట జనాలకు మామూలు;

ప్రభుత్వ వైఫల్యములకు ప్రతిపక్షములను
నిందించుట ప్రధాన, ముఖ్య మంత్రులకు మామూలు
సంఘమున జరుగుతున్న అన్ని దారుణములకు
ఇప్పటి మన సాంఘిక స్థితికి బ్రాహ్మణుల, ఆస్తికుల

నిందించుట మేధావులకు, నాస్తికులకు మామూలు
కవులకు పేరు ప్రతిష్టలు, డబ్బు రాకుండుట మామూలు
తమ కవనముల తామే చదువుకొనుట మామూలు
ఈ వరసన కవితలల్లుట మనబోంట్లకు మామూలు

No comments:

Post a Comment