Sunday, September 25, 2016

భేదముల ఆరళ్ళు; కవితా వైభవం

భేదముల ఆరళ్ళు

భావముల‌‌ పలికించుటకు భాషలు
వలదు వాటికై అనవసర ఘోషలు;
సాంఘిక అవసరములకై వృత్తులు
కులములన్ననూ అవే; మనిషి అనురాగ
అనుబంధ ప్రకటనమునకై మతము;
కష్టములయందు‌ వ్యథలందు ఉపశమనమునకై
భగవంతుడు; ఆయన ఉన్నాడనుట ఒక నమ్మకము 


ఇవియన్నియూ‌ "లోకో భిన్న రుచి:", "పుఱ్ఱెకో బుద్ధి
జిహ్వకో రుచి" లాగ భిన్న దృక్పథజనితములు సహజ
భేదములు; "భిన్నత్వములో ఏకత్వము" గ్రహించి
స్నేహ సామరస్యములు ఘటింపవలెను‌ పౌరులు

ఈ ఇంగితము అందరి సుఖశాంతులకు అవసరము
లేనిచో పరస్పర‌ కలహములు కొట్లాటలు‌ అనాగరికతను
పెంచును; మనుషుల‌ మనుగడను కష్టతరము చేయును
అందుకే కుల, మత, ప్రాంతీయ, సిద్దాంత సామరస్యముల
పాటింపవలెను; సుఖసంతోషములతో అందరూ జీవించవలెను
 ***********


కవితా వైభవం

కవిత్వము వినిపించెదనన్న పారిపోయెదరు ఎందరో
జనులు; కవిత్వమన్న చెవి కోసుకొనెదరు సాహితీ
ప్రియులు; మన ప్రవృత్తుల బట్టి మన సంస్కారము, సరస
భావములు, అంద చందములపై ఆసక్తులు; కవితలల్లుట

వలన నడవదు జీవిక; కాని స్పందన కల హృదయము
కవిని ఆ అలజడికి పదముల కూర్పు నిచ్చువరకు నిలవ
నీయదు; కవనములు, రస హృదయ మాధుర్యాస్వాదనా
నీరాజనములు; సరస హృదయ రసాస్వాదనా పద

సరళులు; అలంకారముల ఆర్భాటముల పరవశింప
చేయును; నాగరికత, సంస్కారము, సంస్కృతులకు చక్కని
ప్రతిరూపము; కవి లేక లేదు భాషాసౌందర్య
దర్శనము; భాషా చమత్కృతుల గని, మనకు మార్గ

నిర్దేశనము చేయు మిత్రులు; మనల కాచు సారస్వత
విశేషము; మనల దివ్యుల చేయు విద్యా వైభవము
*************


ఎవరికీ ప్రపంచాన్ని ఉద్ధరించాలని లేదు. వాళ్ళకు చేతకాదు కూడ. కాని ఎన్నో వేషాలు వేసి, కబుర్లు ఆసక్తికరంగా చెప్పి ప్రపంచ సేవలో, ప్రజా సేవలో, మానవ సేవలో తమంత వాళ్ళు లేరని బుకాయిస్తూంటారు. ఇలాంటి అదృశ్య ప్రచ్ఛన్న మోసగాళ్ళ వల్లే సంఘానికి, దేశానికీ, ప్రపంచానికి ముప్పు ఏర్పడుతోంది.
వీరు ఉపకారం చేయరు, చేసేవాళ్ళను చేయనివ్వరు. ఏమీ చేయక పోయినా, ఏమీ చేతకాక పోయినా తాము తప్పుకుని, నిజాయితీగా ఉపయోగపడేవారిని ఉపయోగపడనివ్వరు. అంతా రాజకీయం, అంతా కీర్తి కాంక్ష, స్వార్ధము. ఈ ఆషాఢభూతులు సంఘానికి, దేశానికీ చీడపురుగులు.
************* 
పుస్తకములలో వ్రాసినవి ప్రవర్తనలోనికి తీసికొని రాకుండ పదే పదే
చదువుట, ఊకదంపుడు ఉపన్యాసములిచ్చుట‌ వృథా ప్రయాస;
ఆయాసమును మిగుల్చును; అనుసరించ నపుడు ‌ఎంతటి గొప్ప
గొప్ప వ్రాతలు బూడిదలో పోసిన పన్నీరగును; నిరుపయోగ మగును

**********


నా హృదయము నీవే; నా హృదయ స్పందనలు ప్రణవ నాదములే;
నీ దరిని చేరటకునై భవసాగరమీది అద్దరిని చేరిన సంసార సంద్రపు
ఈతగాడను; నీ మౌన సంద్రమున కలిసిన నిశ్శబ్ద వ్యక్తిత్వ సంగమమును;
నారాయణా! నేనన్నది పిసరంతైన, నాదన్నది ఇసుమంతైన లేని, అద్వైతిని
**********
మొక్కలు లేత చిగుళ్ళు తొడిగినట్టు మనసున చివురులు
తొడుగును భావములు, డెందపు సడులు, సవ్వడులు;
హృదయమాలాపించును శ్రావ్య గీతములు, వసంతమున
పొంగి కూయు కోకిల కిలకిలారావములు, సంగతులు
 ***************


గుడులలో పుస్తకములలో కొలువై ఉన్న
భగవంతుడు మన మనసులో నిండి ఉండి
ఇచ్చును ఉల్లాసము ఉత్సాహము శాంతి;
ఆనందరూపుడైన దేవుడు మౌనస్వామి మన ఏలిక
*************
 జీవులు పరిణమించెనో లేక భగవంతుడు సృష్టించెనో
మనుషుల గాథలు బాధలు వేదనలు హాయిలు
ఎక్కువగా స్వయంకృతములో విధి చెక్కడములొ
ఏది ఏమయిననూ సుఖ దుఃఖములు మనసు నిర్మితములు

Girls and their psyhe

Many earning-girls seem to prefer the culture of having boyfriends, live-in mates and the like not husbands. Husbands are demanding and commanding might be the cause.
But every man wants to demand or command "his" woman once the commitment is rooted. Boy-friend, live-in mate or husband are all one and the same man - with all his "demonizing" qualities.
Angels have no choice or preference outside these three "relations". Living as spinster or nun is the other alternative if man's touch is abhorred.
The same is true for boys also.
 **************
Beautiful girls under vanity assume that it is their beauty which attracts people & makes them admirers. But even though a thing of beauty is a joy forever, there should be an aesthetic and romantic heart to rejoice that pleasantness. Existence of beauty and its appreciation are equally important. Transmission is a waste in the absence of reception; it is like full moon light spread over a wild forest sans reception.
************
Now a days youth is craving for temporary admiration, adoration and nearness, even physical, sans any kind of bond, but are not enthusiastic not for permanent bond and accompaniment.
**************
We are destroying the family structure. Home is our maternity, nursery, school, restaurant, hospital. sink to all our mental disturbances, psychological counseling and rehabilitation center, spiritual ashrama, old age home rolled into one; where we peacefully dissolve into nature at the inevitable moment in the midst of our near and dear. Why we are destroying this beautiful place? I do not know.
**********
Forgetting and forgiving enhances our peace of mind. Discreetly ignoring things, happenings and persons saves us from unnecessary wastage of our mental energy and time. Ignoring (ignorance) is bliss.

Monday, September 12, 2016

కవితలు; ప్రైవేట్ బళ్ళు ; లంచావతారుల ఆదాయములు; Professor Stephen Hawking; విద్య వైద్యము ఆధ్యాత్మికతలు


కవితలు

గోవిందమాల

 ఉన్నతమైన ఆలోచనలు వాటికి తూగు
ఉత్తమమైన మాటలు, వాటికి సరిపడు
సదాచరణము; త్రికరణములు శుద్ధమై
సయోధ్యగ నుండు సౌభాగ్యము నిమ్ము గోవిందా!

నామములను పెట్టుకొని బహు నీమములను పాటించి
నారాయణుని దివ్యనామమును నియతిగ జపించి తపించి
మనసునాయత్తపరచుకొని‌ అందు భగవంతుని చిద్విలాసములు
శాంతి మౌనములై వెలుగొంద ఆ దివ్యానుభవమును పలుకగ లేము

**************


 భక్త శంకరం 

పువ్వులేవైననేమి? అసలు పువ్వులే లేకున్నను
మనసుపుష్పముగ పూజలందుకుందువు భక్తపాలన
కళాచతురా! భక్తవశంకరా! భోళాశంకరా! శంకరా!
భక్తిప్రపత్తులతో ఉద్ధరిణెడు నీళ్ళతో చేయు అభిషేకము
స్వీకరింతువు మోదమున, బ్రోతువు మమ్ముల సదా
చల్లగచూతువు మమ్ము పావనగంగాధరా! పార్వతీ వల్లభా !

*******************


అవ్యయము మారనివి లంచావతారుల ఆదాయములు

లంచములడుగుట లంచములిచ్చుట ‌ఆనవాయితీ
ఏ పార్టీ అధికారములోనున్ననూ తప్పని తద్దినమిది;
సూర్యుడు ఉదయించుట మానవచ్చును, శశాంకుడు
శీతల కిరణముల మనపై ప్రసరించక పోవచ్చును

అవ్యయము మారనివి లంచావతారుల ఆదాయములు;
ఇందందరూ భాగస్థులే; అడుగువారు, ఆశపెట్టువారు,
అందించువారు; మనకే ఇన్ని అవతారములు! కావివి
మన జీవితములకు శోభనిచ్చు అలంకారములు;

ప్రభుత్వముతో పని జరుగుటకు నిశ్చయించబడిన
రేట్లు; ఎవరేమన్ననూ, ఎవరు పాలించుచున్నను
సన్నకారు, పెద్దకామందుల సదృశ లంచావతారులు
ఎవ్వరు చేయివేయలేని నిరంతర శాశ్వత వసూళ్ళు

నాయకులు పెద్ద పెద్ద వాగ్దానాల చేయుదురు
కోట్ల విలువైన ప్రాజెక్టుల గురించి పగలు రాత్రి లేక
ఉపన్యాసముల దంచెదరు; పంచెదరు మత్తు మందు
మాటలు; క్రియ శూన్యము; మరేదీ చేతకాదు, చేత రాదు

***********
ప్రైవేట్ బళ్ళు 


చేసినవి దర్జాగా ప్రైవేట్ బళ్ళు అన్ని చదువులను కబ్జా
మనల రవాణాచేయుచున్నవి ప్రైవేట్ బళ్ళు దోచుచు;
మనందరకూ కార్పొరేట్ ఆస్పత్రులే గతి; చవక వైద్యము
హుళక్కి అయినది; ఆశించుట వెఱ్ఱిదనమాయె; చదువులకై,
వైద్యమునకై ఇళ్ళు గుల్ల చేసికొనుట రివాజు అయ్యె;
ఏదో ఇంత ఉడకేసుకు తినుటయే భారమయ్యె
**********
భాషను చక్కగ నేర్చి పెక్కు శాస్త్రముల నేర్వక
ముక్కున పట్టి పరీక్షహాలులో అయినదనిపించి
ఒక కాగితపు ముక్కను చేతను బట్టి ఉద్యోగార్ధియై
చెప్పులరుగ తిరుగువారు, పునాదులు లేక భవంతుల
కట్టి అందు సుఖనివాసమునకై కలలు కనుచు
అర్రులు చాచువారు, అప్పుల మిగులు వారు
*********** 

ఆత్మ విశ్వాసమును పెంపొందింపలేని చదువులవి‌ ఏల?
ప్రజల సంక్షేమము చూడని నాయకులు, పాలకులేల?
పసికందుల దాదులకొదలు తల్లులు అమ్మలా వారు?
ముసలివగ్గుల తల్లిదండ్రుల వృద్ధాశ్రమములలో చేర్చు
సంతానమది ఏల? చదువులలోని మర్మములవి తెలియని
విద్యార్థులు, తత్త్వము తెలియని సన్యాసులు వారేల?


అంతయు అందరు బరువు పృథివికి దేశమునకు; మన
శక్తియుక్తుల, మనల చల్లగచూచు దైవముండ వగచుట
ఏల? నిజ ధర్మమును, బాధ్యతలను శ్రద్ధగ పాటించు
హృదయముండ మనము దేనినైన లెక్కచేయనేల?

*********
ఈన కాసి నక్కలపాలు చేసినట్టయింది భారతదేశపు సంస్కృతి, సనాతన ధర్మముల పరిస్థితి .
*****************

Professor Stephen Hawking

 Professor Stephen Hawking, one of the greatest living physicists predicts now that God Particle or Highs Boson can and will destroy the world. Why the Western Scientific Community is so crazy to create and observe Highs Boson spending so many billions of dollars? Is it we are all taken for granted by scientistific community and they did such dangerous experiment just to quench their thirst of knowledge at the risk of annihilation of human kind and all life? All the great scientists approved it and did not stop the conduct of such a devastating experiment is really incomprehensible. Scientists too are negligant to human well-being and are nihilists; a wrecking reality and unbearable information.

************

గుడులు కట్టుట కన్న బడులు తెరచుట
మిన్నయని హేతువాదులు; గుడులైనను
బడులైనను సమానముగ ఆదాయము
తెచ్చునని నాయక శిఖామణులు; వాటికి
వైద్యసహాయమును కలపమని వ్యాపారులు
చెవిలో ఊదరకొట్టుచుండ; మంచి మంచిగా
విద్య వైద్యము ఆధ్యాత్మికతలతో జనులు పెద్ద
పెద్ద వ్యాపారములు చేయుచుండ; గుడియో
బడియో ఆసుపత్రియో తెరచుకొని బ్రతుకుట
ధనము పరపతి పేరు ప్రఖ్యాతులు సంపాదించుట
తెలివైన పని; కార్పొరేట్ ల సరసన బైఠాయించ వచ్చు;
అంతను వర్తకము వ్యాపారములు ఆక్రమించిన నేడు
విద్య వైద్యము ఆధ్యాత్మికతలు కోల్పోయినవి వాటి సహజకాంతులు