యోగాసనం వేసిన ప్రపంచం
యోగాసనం వేసిన ప్రపంచం
యోగమంటే ఏమిటో విన్న ప్రపంచం
యోగము అంటే ఏమిటో ఈ "యోగులకు"
తెలుసునా? జీవనమున ఇది భాగమగునా?
యోగాసనం వేసిన ప్రపంచం
యోగమంటే ఏమిటో విన్న ప్రపంచం
యోగము అంటే ఏమిటో ఈ "యోగులకు"
తెలుసునా? జీవనమున ఇది భాగమగునా?
తెలియదు కాని ఎన్నో యోగా సంబంధమైన
వస్తువులు అమ్ముడు పోతాయి! ఎందఱో
యోగా గురువులు కావచ్చు; ఇప్పటికే
కుటీర పరిశ్రమల నుంచి కార్పొరేట్ స్థాయికి
ఎదిగిన యోగా మార్కెటింగ్ విను వీధులు
దాటవచ్చు! దేవతలు దేవుళ్ళకే యోగా నేర్పవచ్చు
ఆసనముల స్థాయి నుంచి ఎప్పటికీ ఎదగని
కుర్ర యోగా పతంజలి యోగ సూత్రముల ఉనికి
గురించి వింటుందా? దానినీ యోగా లో భాగము చేస్తుందా?
చిత్ర విచిత్ర మానవులు సంప్రదాయ యోగము నేర్చెదరా?
యోగా పలువిధములు; యోగా గురువులును
పలు పలు విధములు; "యాచకో యాచకశ్శత్రు:"
విధమున విభేదింతురా? కలహించేదరా? కాసులు
కుప్పలు కుప్పలుగా వెనకేసెదరా ? అంతయును
భగవన్మాయ! అంతరంగములకెక్కని కాలు సేతుల
కదలికలు జనులకుపయోగించునా? ప్రాణాయామము
మనసు నియంత్రణలు యోగా లో భాగమగునా?
యోగము భగవన్నియోగము భగవదనుసంధానము
భక్తి జ్ఞాన కర్మ యోగములు యోగా అగునా?
విద్యాలయముల ఆటల సమయములు కుదించి
ఆటలాడించక "చదువులో నిమగ్నము చేయు"
ప్రైవేటు విద్యాలయములపై వేటు లేదు; యోగా
ఎవరు నేర్పుదురు? స్కూలు సిలబస్ లో చేర్చిన
మాత్రమున; శారీరిక మానసిక ఆరోగ్యముల కొరకు
యోగము; సరదాకి యోగా! ప్రచారమునకు యోగా
యోగాసనం వేసిన ప్రపంచం; దద్దరిల్లిన గ్లోబు
వ్యాయామము మాత్రం ఆరోగ్యమునకై ప్రవచనం
వస్తువులు అమ్ముడు పోతాయి! ఎందఱో
యోగా గురువులు కావచ్చు; ఇప్పటికే
కుటీర పరిశ్రమల నుంచి కార్పొరేట్ స్థాయికి
ఎదిగిన యోగా మార్కెటింగ్ విను వీధులు
దాటవచ్చు! దేవతలు దేవుళ్ళకే యోగా నేర్పవచ్చు
ఆసనముల స్థాయి నుంచి ఎప్పటికీ ఎదగని
కుర్ర యోగా పతంజలి యోగ సూత్రముల ఉనికి
గురించి వింటుందా? దానినీ యోగా లో భాగము చేస్తుందా?
చిత్ర విచిత్ర మానవులు సంప్రదాయ యోగము నేర్చెదరా?
యోగా పలువిధములు; యోగా గురువులును
పలు పలు విధములు; "యాచకో యాచకశ్శత్రు:"
విధమున విభేదింతురా? కలహించేదరా? కాసులు
కుప్పలు కుప్పలుగా వెనకేసెదరా ? అంతయును
భగవన్మాయ! అంతరంగములకెక్కని కాలు సేతుల
కదలికలు జనులకుపయోగించునా? ప్రాణాయామము
మనసు నియంత్రణలు యోగా లో భాగమగునా?
యోగము భగవన్నియోగము భగవదనుసంధానము
భక్తి జ్ఞాన కర్మ యోగములు యోగా అగునా?
విద్యాలయముల ఆటల సమయములు కుదించి
ఆటలాడించక "చదువులో నిమగ్నము చేయు"
ప్రైవేటు విద్యాలయములపై వేటు లేదు; యోగా
ఎవరు నేర్పుదురు? స్కూలు సిలబస్ లో చేర్చిన
మాత్రమున; శారీరిక మానసిక ఆరోగ్యముల కొరకు
యోగము; సరదాకి యోగా! ప్రచారమునకు యోగా
యోగాసనం వేసిన ప్రపంచం; దద్దరిల్లిన గ్లోబు
వ్యాయామము మాత్రం ఆరోగ్యమునకై ప్రవచనం
No comments:
Post a Comment