Friday, June 8, 2018

నమ్మకము-ప్రేమ; అయోమయంలో మనం; పోస్ట్ మాస్టర్స్ / మిస్ట్రెస్ పౌరుల పాత్ర. ; తెలుగు సారస్వత తీరుతెన్నులు; నిజ తత్త్వము; Poetry

నమ్మకము-ప్రేమ
నమ్మకమే ప్రేమ. ప్రేమయే నమ్మకం అలా ఏర్పడుతుందంతే; ప్రేమ ఏర్పడినట్లు. నమ్మకము, ప్రేమ హృదయానికి సంబంధించినవి.
తర్కకర్కశాలకి, బుద్ధి నైశిత్యానికి, వాద, ప్రతివాద 
తీవ్రతలకి, విజ్ఞాన తీక్షణతకి అందనివి. అతీతమైనవి.
నమ్మకము మూఢ నమ్మకమైనా, ప్రేమ గుడ్డిదైనా, అవి ఇంగితానికి కూడా లొంగవు. మనమేం చేయలేం.
ఆలోచన విజ్ఞానాన్ని కలిగిస్తుంది. అప్పుడు అవగాహన ఏర్పడుతుంది. కాని నమ్మకము తిన్నగా అవగాహనను కలిగిస్తుంది. ప్రేమ కూడా అంతే. ప్రేమ లేక నమ్మకము, అవగాహన ఒకేసారి కలుగుతాయి. అందుకనే అవి మన మీద అంత ప్రభావం చూపుతాయి.
మనిషికి జ్ఞానేంద్రియాల ద్వారా, ఆలోచన, తర్కముల ద్వారా, నమ్మకము, స్ఫురణల ద్వారా
విజ్ఞానము, జ్ఞానము, లౌకిక, ఆధ్యాత్మిక జ్ఞానములు కలుగుతాయి.
అన్నిటికన్నా స్ఫురణ ద్వారా కలిగిన జ్ఞానము శ్రేష్టము. సరియైనది. సత్యమైనది.
నమ్మకము, ప్రేమ ఇచ్చే శాంతి, సుఖము తర్కం ద్వారా కలుగవు.
మనిషికి అన్ని జ్ఞాన సాధనాలు అవసరమే. జ్ఞాన స్వరూపాన్ని బట్టి సాధనాన్ని నమ్మవచ్చు.
*********
If we love and show affection as we do to cine stars, sports persons, wily politicians, criminal minded corporate-giants and the like elite, middle and low strata individuals, to our near and dear, we live a life of joy and serenity.
We can also love, appreciate, lose heart to and admire and fans to our near and dear.
**********
అయోమయంలో మనం
చదువు జ్ఞానార్జనకు కాదు, కొలువెక్కుటకు; అంటే అటువంటి చదువు జ్ఞానార్జన ముందు దిగదుడుపు;
మనకు టెలిఫోన్, టెలివిజన్, టెక్నాలజీ వచ్చింది ఉద్యోగం కోసమే చదివేవారి వల్ల కాదు; జ్ఞాన సముపార్జనా పిపాస కల మేధావుల వల్ల; వారి నిరంతర శ్రమ, నిపుణత, పరిశోధనాసక్తి వల్ల
ఎందుకు అందరూ జ్ఞాన సముపార్జన, నైపుణ్యాలు
మరచి ఉద్యోగం ఉద్యోగం అనుకుంటూ ఈ కార్పొరేట్
విద్యాసంస్థలలో చేరుతారు? చివరకు రెంటికీ చెడ్డ
రేవడౌతారు? ఉద్యోగం రాక జ్ఞానం లేక; మన్ని మనం
లోతుగా ప్రశ్నించుకోవలసిన సమయం ఆసన్నమైంది
మన కోసం ఎవరూ ఆలోచించి పెట్టరు; మనమే
ఆలోచించు కోవాలి; ప్రభుత్వాలు, మేధావులు, విద్యా
వేత్తలు, అధికారులు అయోమయం పెంచే పెద్దలు
********
శుభంకరములు
అహింసతో సమానమైన తపస్సు లేదు.
సత్యమును మాట్లాడుట కన్న మిన్నయైన మంత్రోచ్ఛారణ లేదు.
(స్వ) ధర్మమును ఆచరించుట కన్న ముముక్షుత్వము లేదు.
ఇవియే మోక్ష మార్గములు. ముక్తి దాయకములు. శాంతి ప్రదములు. మౌన తోషణములు. ఆనందయోగములు. శుభంకరములు.
*********
ఫేస్బుక్ లో పోస్ట్లు వాట్సాప్ లోకి వాట్సాప్ లోని మెసేజ్లు, వీడియోలు ఫేస్బుక్ లోకి నిరంతరం ప్రయాణించడమే నేటి స్మార్ట్ ఫోన్ వాడకాలకు ముఖ్యమైన ముడిసరుకు. విషయాలు. ఇలా అటూ ఇటూ పంపేవారే తప్ప, తాము స్వయంగా, స్వంతంగా సృష్టించే విషయములు లేవు, వీడియోలు లేవు.
స్మార్ట్ ఫోన్ యజమానులు / యజమానురాళ్ళు పాతకాలం పోస్ట్ మాస్టర్స్ / మిస్ట్రెస్ లా పనిచేస్తున్నారు. టెక్నాలజీ పెరిగి మనుషులను సోమరిపోతులను చేయడం చారిత్రక పరిణామం. ఈ పంపడాలు, పంపుకోవడాలు దానికి ప్రత్యక్ష సాక్ష్యం, ఉదాహరణ.
కాని ఇందువల్ల మనుషులు రోబోట్లు లా మారిపోతున్నారు. ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదు. ఆహ్వానించదగ్గ మార్పు కాదు.
*********
 పౌరుల పాత్ర.
ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు వేసి, మళ్ళా ఎన్నికలొచ్చే వరకు చేతులు కట్టుకుని, నోరుమూసుకుని కూర్చోవడం మాత్రమే. భారత దేశపు ప్రజాస్వామ్యంలో పౌరుల పాత్ర.
********
తెలుగు సారస్వత తీరుతెన్నులు
రాసే కవితలకు అర్థం తెలియనవసరం లేదు. ఉండనవసరం లేదు. ఇది అస్పష్ట వాదము.
రాసే కవితలు పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎన్ని అవస్థలు అనుభవిస్తున్నారో సభ్య సమాజానికి తెలియజేసి, వాటికి నివారణోపాయాలు సూచించడం స్త్రీ వాదము.
అణగద్రొక్కబడిన వర్గాల బాధలు, కష్టాలు, కన్నీళ్లు కవితలుగా మార్చి వారి హక్కులకై పోరాడే విధానం సూచించడం దళితవాదము.
కార్మిక, కర్షక, , మేధావి, విద్యార్థి ఐక్యతకై, సమైక్యతకై కవనములు సృష్టించి సమ సమాజ స్థాపన చేసే తీరు చెప్పడం కమ్యూనిస్టు వాదము.
ప్రజల్లో గతి తార్కికత పెంచి వాళ్ళు మూఢనమ్మకాల బారిని పడకుండా రక్షించే కవితలు వెలువరించడం. ఇది హేతువాదము.
భగవంతుని ఉనికిని ప్రశ్నిస్తూ, లేడని తార్కిక భౌతికవాదం ద్వారా నిరూపించే కవితలు రాయడం నాస్తికవాదము.
ఇవే తెలుగునాట సారస్వతం అని పిలవబడుతున్నాయి.
ప్రణయము, భక్తి తత్త్వాల పై కవితలు రాయడం విమర్శకుల దృష్టికి రావు.
*********
When once he became president, Mr. Pranab Mukerji is apolitical; he doesn't belong to any political party.
After retirement also he remains so.
Why Congress and other political parties feel that they own Mr. Pranab Mukerji and expect him to behave as they want him to behave?
On what basis they are dictating terms to former president?
Completely ridiculous is the behavior of opposition political parties in India. They don't know principles of democracy!
**********
Humans are beautiful and delighting through their frailties. We need never regret or feel guilty of indulgence in our frailties.
********
నిజ తత్త్వము
తల తిక్క ప్రశ్నలు వెయ్యడమే తప్ప దేనికీ సమాధానం తెలియని కుహనా మేధావులు
తర్కాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక
అయిన దానిని కాని దానిని ఖండించే హేతువాదులు
నమ్మకమూ ఒక విధమైన జ్ఞానమే అని తెలియని
నాస్తికులు, దేవుడు లేడని "నమ్మే" తత్త్వవాదులు!
తర్కం రెండు వైపులా పదునున్న ఖడ్గం; ఎవడు సునిశితమైన బుద్ధి కలవాడో వాడినే వరించు విజయం! ఏది నిజము, ఏది అబద్దము తెలియక
అలమటించే "చార్వాకులు" పొందేది అయోమయం
అనుమాన శబ్ద ప్రమాణములను త్రోసిరాజను ప్రత్యక్ష
ప్రమాణ ప్రియులు తత్త్వదర్శనం నిక్కచ్చిగా చేయలేరు;
ప్రశ్నలు, తర్కములు, మీమాంసలు ఆగిన క్షణమున తనంత తానుగా వెలుగు, ప్రజ్ఞానమై నిజ తత్త్వము
*********
Poetry
Poetry is reflection of experience in solitude. Poetry is written under the influence of experience. Poet does not compose poetry, poetry composes itself in the heart of poet and expresses itself through language. Poet's previous scholarship, language ability and familiarity with literary trends guide the expression.
******
Entertainment is exceeding its brief
Just not stopping at entertaining,
Is becoming our breath, water and food
No other activity or avocation is so dear
**********
చదువక్కరలేని విద్యా సంస్థలు
జ్ఞానమక్కరలేని విద్యార్థులు
ఏమీ నేర్పే సావకాశం లేని గురువులు
కలిసి విద్యార్జనను సున్న చేస్తున్నారు


Tuesday, June 5, 2018

Child labor and child apprentice!; భాష; చదువు-ఉద్యోగం; Compassion; మనసు మన సఖి.

Child labour and child apprentice!
Child labour is banned legally. Every one is asked to join a school and spend there till X class. Who has decided this? Government? Intellectuals? NGOs?
Child labour like lifting weights, and other physically straining adult works can be avoided and banned. But insisting every one must join a school and waste precious years to complete a X class is difficult to understand. And most of the families are below poverty line and they need every family member to earn from early age. These are realistic situations. The reality is after passing all our laws and "banning" child labour, millions are working as child labour for economic and financial reasons.
Many intellectuals and governments are refusing to think realistically and also out of the box.
Politicians are playing with our lives. Passing right to livelihood act as compared to right to education act will open the eyes of all concerned. Just as government cannot pass such a law for livelihood, what is the use of right to education act.
Nowadays none is joining schools or other educational institutions to learn. The aim of all is to get a job.
So it will be useful if child apprentice is introduced as early as possible; The unnecessary, non-employable and financially burdening present style of academics is time, energy and resourcesis a wasteful exercise.
The earlier the intellectuals, governments and educationists wake up and do away compulsory academics the better it would be.
This academic education being imparted is not guaranteing any job to any one at any level. Children are getting frustrated even after completing a professional degree and even, the ultimate of academics, a Ph.D. degree. They are woking a bonded labour in privately run financed educational institutions for meagre "salaries". That being the reality what would be the fate of Bachelor degree holders sans any other employable skill?
It would be useful if children are encouraged to join to learn any employable skill as apprentice after becoming literate. He can use his learnt skills for his livelihood. The cheating by the governments must end.
Encouraging every one to get a pale degree for getting a job when there are no or scarcity in job opportunities it would be grossly incorrect, lack of concern and is of no use.
**********
భాష
భాష ఎవరికి చెందుతుంది? సమాజానికి చెందుతుంది. కాని భాషని రకరకాల యాసలతో మాట్లాడతారు. అప్పుడు భాష ఎవరికి చెందుతుంది? ఆ యా యాసల వారికి చెందుతుంది.
భాష మీద ఏ విధమైన గౌరవము, ఆప్యాయత లేక నేర్చుకోవడంలో అశ్రద్ధ, అమర్యాద, నిర్లక్ష్యం. కాని తాము నేర్చుకున్నది, మాట్లాడేది మాత్రమే తమ భాషయనీ, తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి చందంగా గోరోజనంతో భాష గురించి మాట్లాడడం, భాష మాట్లాడడం ఒక అంటువ్యాధిలా తయారైంది. ప్రపంచంలోని భాషా సాహిత్యాలతో తెలుగు సారస్వతం పోటీ పడాలని ఏ ఆచార్యులకు, మేధావులకు లేదు.
భాషని నిర్లక్ష్యం చేసే జాతి పురోగతి అనుమానమే!
*********
సావిత్రి, ఎస్వీ. రంగారావు, బాల సుబ్రహ్మణ్యం, వంటి సినీ ప్రముఖుల స్మరణలో, ఆరాధనలో, చర్చల్లో, మమేకం అయిన మనం ఇలా సినీ జీవుల ధ్యాసలో, ఆరాధనలో మన్ని మనం మర్చిపోయి ఆ తన్మయత్వంలో ఇహమూ, పరమూ దృష్టిలో లేక, సినీ ధ్యాన తత్పరులమై సమయాన్ని గడపడం సినిమా పట్ల, సినిమా వారి పట్ల మనకి గల మితిమీరిన మోహాన్ని, వ్యామోహాన్ని తెలియజేస్తోంది.
ఇంతటి పారవశ్యం ఆనవసరమేమో!!
*********
చదువు-ఉద్యోగం

ఇప్పుడు చదువుకునే చదువు ఉద్యోగాలు రావడానికి ఎంత మాత్రమూ ఉపయోగపడటం లేదని తెలీసీ, వేలు, లక్షలు ఖర్చుపెట్టి ఈ చదువులు చదవడం ఎంతో బాధగా ఉంది. అందరు మధ్య తరగతి వారు, ఆర్థికంగా అంతకు తక్కువ వారు వేరే గతి లేనట్టు ఇలా డబ్బుల్ని వృథా చేసికోవడం ప్రత్యామ్నాయం లేకనే. ప్రత్యామ్నాయాలు బయటి వాళ్ళు చెప్పాలా? ఎవరికి వారు ఆలోచించుకోవాలా? మేధావులు చాలా మంది నేల విడిచి సాము చేస్తున్నారు. ఆదర్శం ఆలోచనను కొడిగట్టించరాదు.

మనలో ఆర్ధికంగా తక్కువ స్థాయిలో ఉన్నా వారికి ఇంగిత జ్ఞానానికి లోటు లేదు. ఇతరుల మాటలు వినకుండా తమ ఇంగితాన్ని, స్ఫురణను ఎందుకు నమ్ముకోవడం లేదో అర్థం కాదు. ఇది ఇతరులు చెప్పే విషయం కాదు.

డబ్బులు ఎంతో కష్టపడి సంపాదించి ఇలా వృథా చేసికోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.ఈ చదువు వేరు, ఉద్యోగం రావడం వేరు. నాలుగు రాళ్లు సంపాదించడానికి నేర్వవలసిన కౌశలములు వేరు.ఉద్యోగార్థులైన వారు తమ చదువుల గురించి చర్చించుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఆలస్యం అయింది.

******
Compassion is beyond love and hatred. Compassion never sulks. It releases one from sulking. Having and showing compassion is the noblest human trait. Compassion is always present in us. But many times our ego masks it.
*******
మనసు మన సఖి.
మనసు పోకిరిది. చిలిపిది.అల్లరిది. అంతా బాగున్నా, లేనిది ఎదో తలచి మనకు ఇబ్బందిని, అసంతృప్తిని కలిగిస్తుంది. రమ్యమైన ఊహలు ఊహిస్తుంది. కలలు కంటుంది. మనకు అన్ని భావములు కలిగిస్తుంది. మనసే అందాల బృందావనం. మనసు గతి ఇంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే అనిపిస్తుంది.
అంతా మాయ చేస్తుంది. అన్ని గ్రహణలు చేస్తుంది. అన్ని "గ్రహణాలు" పట్టిస్తుంది. 
బాధ పెడుతుంది. సంతోషము కలిగిస్తుంది. సున్నితమైనది. సుఖం వచ్చినా పట్టలేదు. దుఃఖం వచ్చినా పట్టలేదు. నిర్మలమైతే ఏంటో ప్రశాంతతను ఇస్తుంది.
మన సుకవి మనసుకవి ఆత్రేయ గారికి మాత్రము కొద్దిగా అవగాహన అయింది.. వేదాంతులనూ ఆట పట్టించింది.
నియమించబడితే మంచి చెలియ. ఆడించనిస్తే అల్లరి పిడుగు. మనం పట్టు వదిలేస్తే కోతిలా ఆడుతుంది. మనలను ఆడిస్తుంది
మనసు మన సఖి.
*********
The meaning of love: Love is absorption of our ego in the dearness to our beloved. The individuals are merged in the Love. No trace of individuality exists.
*******
When we become perfect in knowledge, we do not escape into a nirvana of nothingness, but enter into a state of being without qualities and relations, are removed from all chances of identifying ourselves with our ego and distinct individuality and personality.
*********



Thursday, May 31, 2018

పూర్ణశాంతి; రెండవ గృహిణి; కైజోతలు; సినిమా- మన తరం

పూర్ణశాంతి

దేవుడు లేడని ఇంక పూజలు పునస్కారములు దేవాలయ 
సందర్శనలు దేనికని భారతీయ నాస్తికులు చెవిని ఇల్లు కట్టుకుని పోరెదరు;

వారి దృష్టిలో హిందూ దేవుళ్ళే లేరు; మిగతా మతాల దేవుళ్ళున్నారో లేరో 
వీరు నిశ్చయింపరు; నోరు విప్పరు; వారి గోలంతా హిందూ దేవుళ్ళ గురించే

భగవంతుని మనిషే సృష్టించాడు, కనుక దేవుడు లేడు అని వీరి వాదన 
తర్కం; మనం భక్తి ప్రపత్తులు చూపించనవసరం లేదని తీర్మానం;

మరి మన అన్ని సౌకర్యాలు, సిద్ధాంతాలూ కూడా
మనిషి సృష్టించినవే; ఎందుకని మనం వాటిని
గౌరవిస్తాం? దీనికి సమాధానం ఏమిటి? ఏమో?

ఆస్తికత్వము, నాస్తికత్వము రెండూ నమ్మకములే!
మన నమ్మకమే సరియైనది అనుకునే పసితనం పోవాలి! 
అన్ని తర్కములు, మీమాంసలు ఆగినదే
దివ్యస్థితి; దానికి ఎన్నో పేర్లు! అది తెలిస్తే పూర్ణశాంతి
*********
రెండవ గృహిణి
నా చిన్నప్పుడు వార పత్రికలో ఒక హాస్యపు సంభాషణ అచ్చయింది.
ఇద్దరు గృహిణులు మాట్లాడుకుంటూ ఉంటారు. మొదటి మహిళ ఎంతో గొప్పగా అంటారు:
"మా ఆయన రామాయణం రాస్తున్నారు, తెలుసా" అని.
అది విన్న రెండవ ఆవిడ:
"మళ్ళీ రాయడం ఎందుకొచ్చిన శ్రమ? బజార్లో దొరికే ఏదో రామాయణం కొనుక్కోవచ్చు కదా" అంటారు.
మొదటావిడకి ఒళ్ళంతా నీరసం ఆవహించి, ఏం మాట్లాడాలో పాలుపోక, అక్కడ నుంచి నిష్క్రమిస్తారు.
సాహిత్యం గురించి ఏమీ తెలియని వాళ్ళు రెండవ గృహిణిలా మాట్లాడతారు.
సారస్వత సృష్టి, లలితకళాభినివేశము అందరి హృదయాలను తాకవు. వారు వారి సంకుచిత, పరిమిత జ్ఞానంతో ఏదో మాట్లాడతారు.
సంస్కృతి, సంస్కారం, అభిరుచి, ఆస్వాదనా సామర్థ్యం లేని సామాన్యులు తమ దృక్పథానికి లోబడి మాట్లాడతారు, ప్రవర్తిస్తారు.
సంఘంలో రసికులు తక్కువ. ఎక్కువ మందికి జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను తృప్తి పరిచే
వినోదం చాలు. అటువంటి వారు సాహితీ, లలిత కళా విమర్శకులు అయితే చెప్పేదేముంది!
రసికులు అంటే శృంగార పురుషులు అనే తప్పుడు అభిప్రాయం లోకంలో ఉంది. రసికులంటే సాహిత్యంలో, లలిత కళల్లో ప్రతిబింబించే ఆహ్లాదాన్ని ఆనందించగల రసాస్వాదనా చతురులు.
అటువంటి వారి ఆనందంతోనే, వారి హృదయ ఆహ్లాదనా ప్రకటనలు వల్ల కళాకారులు ఉత్సాహం పొంది మరింతగా అలరింపజేస్తారు.
ఏ సమాజంలో నైనా సామాన్యులు వేరు, రసికులు వేరు. రసికులు లేక సారస్వతం, లలిత కళలు, సంస్కృతి, నాగరికతా పరిఢవిల్లవు. ప్రస్తుతం తెలుగు సాహితీ రంగంలో అటువంటి రసికులు లేరు. అందుకే ఒక్క, వాద, వివాద ప్రోత్థితమైన సంకుచిత సారస్వతం సాహిత్యంగా చెలామణి అవుతోంది.
రాసిక్యాన్ని, వాద వివాద సిద్ధాంత రహిత సాహితీ సృష్టిని తెలుగు సాహితీ రంగం సృష్టించలేకపోతోంది.
కొండ వాగులా నిర్మలోదకం కలిగి చెంచీతలా
స్వాతంత్ర్యం అనుభవిస్తూ స్వేచ్ఛగా సంచరించే సాహిత్యం రావటంలేదు.
రెండవ గృహిణులు తెలుగు సాహితీ రంగంలో ఎక్కువగా ఉన్నారు. అందుకే సాహితీ, లలిత కళా రంగాల్లో తెలుగు వారు పుర్ర చేతి భావములను మించి, వాద ప్రసక్తి మరచి సాహితీ సృష్టి, లలిత కళా రామణీయకతా సృజించలేక పోతున్నారు.
*******
BJP not able to win in by-elections across India,  is not necessarily alarming. After not winning parliament seats in UP, BJP has swept northeast and emerged as largest party in Karnataka.
*******
కైజోతలు
ఎవరి కులానికి చెందిన వారిని వారు
ఎవరి ప్రాంతానికి చెందిన వారిని వారు
ఎవరి మతానికి చెందిన వారిని వారు
ఎవరి సిద్ధాంతానికి చెందిన వారిని వారు
ఆకాశానికి ఎత్తేస్తున్న ఈ రోజుల్లో ఫేస్బుక్
అందరికీ సర్వ మానసిక రోగ ప్రదర్శనా వాటిక
ప్రజాస్వామ్యమున తమ పాత్రను యథేచ్ఛగా
తప్పుగా నిర్వహిస్తున్న పత్రికా యాజమాన్యములకు
పత్రికా రచయితలకు లెంప దెబ్బ కొట్టే సావకాశం
కల్పిస్తున్న ఫేస్బుక్ కు సామాన్య పౌరుల నీరాజనం
పౌరులు నిర్భయంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా
వార్తా నాయక రాజకీయ సామాజిక కథనాలను
తమ తమ దృక్పథాలతో పంచుకునే వీలు కల్పిస్తున్న
సామాజిక సాలెగూడు మాధ్యమములకు కైజోతలు
******
Always contemporary colleagues tend to undermine new talent with their limited knowledge and closed minds. They hide behind their seniority. This has been happening in all societies and fields in all places. Many times the genius is not recognized when the individual is alive. And later colleagues who are not biased will recognize the talent and popularize.
********
సినిమా- మన తరం
మనందరిదీ సినిమాల తరం. సినిమాలు ఆకర్షించినట్టుగా మనల్ని ఏ మీడియమ్ ఆకర్షించలేదు. అందుకనే ఇప్పుడు కూడా ఆ సినిమా వాళ్ళని గురించి కొట్టుకుంటున్నాము. మన తరంతో
ఈ కొట్టుకోవడాలు ఆగిపోతాయి.
మన తరం మీద సినిమా మీడియమ్ ప్రభావం లెక్క కట్టలేనిది. మన ఊపిరి, మంచినీళ్లు, ఆహారము సినిమాలుగానే బ్రతికాము. తరువాతి తరాల వారికి సినిమాల మీద ఇంత మోహం లేదు.
సాహిత్యం, ఇతర లలిత కళలు మన దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ఇప్పటి తరాలకి ఇంటర్నెట్ లా మనకు సినిమా. మనందరమూ ఆ సినిమాల విషయంలో పండితులమే. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది, ఏ ప్రొడక్షన్స్ ది, నాయికా నాయకులు ఎవరు, సంగీతం ఎవరు, కెమెరా మెన్ ఎవరు, కళా దర్శకుడు ఎవరు, ఏ రిలీజ్, ఏ నాయకునిది ఏ ప్రొడక్షన్స్, ఏ నాయకునిది ఏ రిలీజ్, ఎన్ని చోట్ల శతదినోత్సవాలు జరుపుకొంది, ఎన్ని రజతోత్సవాలు, ఇలా సినిమా గురించి అనంతమైన విషయాల్లో మనకు పరిజ్ఞానం ఉండేది. ఉంది.
ఈ పిచ్చి వల్లే సినిమా వాళ్ళని ఎన్నుకొని, ఏదో పాలన అనుభవించి, వారి చుట్టాలచే పాలింపబడుతూ, ఏ విధమైన గుర్తింపు లేక వాళ్శిచ్చే వేయి రూపాయల నిరుద్యోగ భృతికై భిక్షుకుల వలె ఎదురు చూస్తున్నాం.
మన మనసుల మీద ఇంత పట్టున్న మీడియమ్ ఇంకోటి లేదు. అందుకే ఈ వయస్సులో కూడా అభిమాన తారల గురించి ఇంత సమయం వృథా చేసికుంటున్నాము. ఈ విషయమై అమ్మలక్కల కబుర్ల వంటి కబుర్లు ఎక్కువై పోయాయి. ఆడ, మగ భేదం లేకుండా ఈ చర్చల్లో, వాద, ప్రతి వాదాల్లో విసుగు లేకుండా పాల్గొంటున్నాము.
మనందరి వినోదం సినిమాతో మొదలై సినిమాతో
ఆగిపోయింది. సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రకళ, శిల్పకళ, మొదలైనవి ఉన్నట్లు కూడా మనలో చాలా మందికి తెలియదు. సాహిత్యం పుర్రచేతి భావాలలో ఇరుక్కుపోయింది, సంగీతం, నాట్యం, ఇటువంటి విషయాలలో తెలుగు వారికి ఇష్టము, శ్రద్ధ, ప్రీతి, గౌరవం చాలా తక్కువ.
మన సంస్కృతి అంతా సినిమా, కుల రాజకీయాలు మాత్రమే. మరే విధమైన దృష్టి మనకు లేదు. సినిమా, రాజకీయం, డాక్టర్ దగ్గరకు వెళ్ళడం, స్కూల్లో చేర్పించడం అంతా మనోళ్లు, మనోళ్లు అనుకుంటూ అభిమానించడమే, చెయ్యడమే;
ఈ కులగజ్జి తప్ప మరో సాంప్రదాయమే మనకు లేకుండా పోయింది. సినిమాతో సమానంగా మనకు అంటుకుంది

Wednesday, May 30, 2018

కవులు - ఊహాధురీణులు ; అదృష్టవంతులు; Brazen Disrespect; Arrogance;

కవులు - ఊహాధురీణులు 

మనం రాసేది కొందరే చదువుతారు
మనం పోయాక అందరూ మనలను మరుస్తారు
అందరికీ తెలియరు వ్యాస వాల్మీకులైనా
భాస కాళిదాసులైనా నన్నయ్య పోతనలైనా
రామాయణ మహాభారతాలే చదవడం లేదు
ఇప్పుడెవరూ; మన రచనలెంత? కాని ఎంత
చెట్టుకు అంత గాలి; రాయడము ఒక ప్రవృత్తి
కాదది ఒక వృత్తి; ధన సంపాదన లేని వ్యాసంగం
జన్యువులో పూర్వ జన్మ సుకృతం తపః ఫలములో
కారణం కవితల ఉదయానికి; నేర్చుకొని రాయలేని
కళ; సహజ సిద్ధమైన పాండితీ భావనా ప్రకర్షల వరం
ఏ దేశమేగినా ఎందు కాలిడినా వెలుగుచూ ఉందురు
కవులు; రవి కాంచనిచో కూడా కాంచగల సిద్ధులు
ఊహాధురీణులు, రసికులు, సారస్వత స్రష్టలు వారు
********
అదృష్టవంతులు

ఎవరు ఎంత గొప్ప వారైనా మరణించక తప్పదు.
సామాన్యుడైనా, అసామాన్యుడైనా కాల వశమున శరీరం వీడక తప్పదు.
చిన్న వింతైన విషయం‌.
ఎవరు చనిపోయినా మనకి ఎంతో నష్టం జరిగింది అంటారు. నిజానికి చనిపోయే సమయానికి ఎంతటి అసామాన్యులైనా శరీర దార్ఢ్యం కోల్పోయి ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు. మానసికంగా, శారీరకంగా జీర్ణ స్థితిలో ఉండి ఏ పనీ చేయలేని నిస్సహాయతలో ఉంటారు. ఆ స్థితిలో వారికి తమ అసామాన్యత గురించి స్పృహలో ఉండదు.
ఆ స్థితిలో వారు ఇదివరకిటిలా సృష్టులు, కార్యకలాపాలలో దక్షత చూపించలేరు. మర్యాదకి, గౌరవానికి మనం సంతాప సందేశాలలో, తీర్మానాలలో వారి మరణం లోటు అంటాము.
మరణించేటప్పటికి కొద్ది సంవత్సరాల ముందు నుంచే ఏమీ చేయలేక ముసలితనాన్ని ఈడుస్తూ
ఉంటారు. ఆ స్థితిలో వారు ఉన్నా, మరణించినా తేడా ఉండదు.
అదో మర్యాద కింద యాంత్రికంగా మాట్లాడేస్తాము.
వినా దైన్యేన జీవితమ్
అనాయాసేన మరణమ్
జరిగిన వారు అదృష్టవంతులు.
********
Brazen Disrespect and wayward behavior
No media says anything about the ridiculous impasse in Karnataka where the coalition partners are unable to finalize cabinet composition. Why they couldn't finalize? What is the reason?
The press reports say there is no understanding on the distribution of portfolios. Is it not brazenly exhibiting the selfishness and ridiculing citizens about their fate?
Some years back in Maharashtra the same impasse continued for two months. These attidudes show the least regard the politicians have for propriety of conduct of representatives - the would be ministers and rulers and citizens.
Once they are elected, they say by their actions that they are not answerable to anyone, even to citizens and that the citizens must bear their selfish and corrupt ways of implementation of democracy and democratic rule.
This brazen behavior of politicians is bane of Indian democracy and its rulers.
********
సంఘంలో బాధ్యత గల మేధావులు, సినిమా, ఇతర లలితకళలలో ప్రావీణ్యులు తక్కువ. ప్రజలకు ఉపయోగపడే దానికన్నా ప్రజల జంతు తత్త్వాన్ని ఉపయోగించుకొని నాలుగు రాళ్లు సంపాదించుకోవాలి అనుకునేవారే కోకొల్లలు. ఈ విపరీతాల నుంచి తల్లిదండ్రులే తమ సంతానాన్ని రక్షించుకోవాలి. ఇతరులకు వదిలిపెట్టడం తెలివితక్కువ తనం.
*******
Arrogance
A chief minister of a regional party said Governor system is unnecessary and should be dumped with.
Now another chief minister says why to pay central taxes when central government is not releasing funds to states.
How many chief ministers have given funds to zilla parishats, mandal parishats and panchayats?
What is the reply from the chief minister if a Panchayat president or sarpanch says why should the village pay taxes to state when state is not releasing any funds to it?
Similarly presidents of mandal and zilla parishats can give statements.
In India getting elected to be a chief minister is amounting to the chief minister owning the state. Such arrogance is exhibited in the name of democracy and federal structure.
It is high time Indian politicians are given lessons on Indian Constitution and democratic principles and unless one is successful in the examination conducted on the lessons must be barred from contesting any election.
Executive is not all powerful. Judiciary, legislature/parliament and citizens are checks and balances in the democracy.
Every one must behave accordingly. Being a chief minister or any representative does not give absolute license to loot the nation at the respective levels of the politicians.
Because all these realities are unknown to leaders and citizens, a peculiar and ridiculous functioning of democracy is taking place in India.
Manipulating voters is considered as the intelligence of the politicians. But the citizens are deprived of quality representatives and rulers.
Innocence and arrogance are intoxicating Indian politicians and leaders to the extent of questioning everything which is not to their advantage and embracing everything that benefits them in all illegal and corrupt ways.
*******

Tuesday, May 29, 2018

గుణము; Indian religions; సత్య దర్శనంలో తేడాలు , భేదాలు; ఫేస్బుక్ వాడు;RESONATING HEARTS

గుణము
గుణం అంటే ఏమిటో మనందరికీ తెలుసు. గుణం పదం మనిషి స్వభావాన్ని, ప్రవర్తన గురించి మాట్లాడే సందర్భంలో ఉపయోగిస్తాము.
మంచి గుణములు కలిగి ఉండడం, చెడ్డ గుణములు కలిగి ఉండడం అని మాట్లాడుతాము. ఆ విధంగా గుణమును విశేషణంగా వాడతాము.
"మందు మంచి గుణాన్నిచ్చింది" అనేది ఆయుర్వేద చికిత్సలో పరిభాష. మందు పనిచేసిందని దీని భావము.
శ్రేష్ఠతని గుణ శబ్దంతో సూచించే సంప్రదాయమూ ఉంది. ప్రతి భాషలోనూ ఒక పదానికి నానార్థాలు ఉంటాయి. వివిధ సందర్భాల్లో వివిధ అవగాహనలు
కలుగుతాయి. భాషల సొగసు నానార్థాలలో, అలంకారాల ఉపయోగంలో, శ్లేషలో అందగిస్తుంది.
ఇలాంటి సొగసులను మన ఇప్పటి జీవనశైలిలో నిర్లక్ష్యం చేస్తున్నాం. లేదా అంతటి "పాండిత్యం" మనకి ఉండటం లేదు.
భాష, మాట్లాడగలగడం, ప్రకృతి మనిషికి మాత్రమే ఇచ్చిన ప్రసాదం. వరం. దురదృష్టవశాత్తు ఇంతటి సిద్ధిని మనం సద్వినియోగం చేసుకోలేక పోతున్నాము. ఎంతో నిరాదరణ, నిర్లక్ష్యం చూపిస్తున్నాం. భాష పట్ల, దాని ఉపయోగం పట్ల శ్రద్ధాసక్తులు లేవు. గౌరవాభిమానాలు చూపించడం లేదు.
ప్రస్తుతానికి వస్తే, గుణ శబ్దాన్ని భారతీయ తత్త్వశాస్త్రాలు ప్రత్యేక అర్థంలో వాడాయి. సత్వరజస్తమో గుణాలు అని మనం విన్నాము. వాటి అర్థాలు సరిగా తెలియని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ఏదో చెబ్తారు వాటి గురించి.
వైశేషికము, సాంఖ్య యోగాలు, వేదాంతము ఈ పదాన్ని వాడాయి.
గుణము అంటే ముడి అని సంస్కృతభాషార్థము.
తత్త్వశాస్త్రాలలో ముడి అనే అర్థంలో ఉపయోగిస్తారు.
మనకు విషయములను, అవి కలిగించే అనుభవములను (విషయానుభవములు లేక వాసనలు) గ్రహింపజేసే మానసిక కార్యకలాప వ్యవస్థ ఉంది.
ఇక్కడ సత్త్వ గుణము అంటే విషయ, విషయానుభవములతో "ముడి" పడి లేచిన శుద్ధ మానసిక అవస్థ (Phase of mind).
రజో గుణము అంటే విషయానుభవముతో "ముడి" పడిన మానసిక అవస్థ. అంతఃకరణ కలాప స్థితి.
తమో గుణము అంటే విషయముతో "ముడి" పడిన
మానసిక గతి. అంతర, బాహ్య భౌతిక ప్రపంచంలతో
మనసు "ముడి" పడి మనకు గ్రహణ కలిగిస్తుంది.
అంతర ప్రపంచం నుంచి ఈ గ్రహణ జరిగితే అది భావము అవుతుంది.
విషయానుభవములతో గాని, విషయములతో గాని
"ముడి" పడని ఆంతరంగిక లేక అంతర స్థితి. ఈ స్థితిలో మనోబుద్ధ్యహంకారచిత్త రూపములైన అంతఃకరముల పరిణామం ఉండదు. అంతఃకరణముల కలాపములు విరమింపబడి ఉంటాయి. దీనిని "నిర్గుణ" స్థితి అంటారు. విషయానుభవాలతో గాని, విషయములతో గాని
"ముడి" పడి లేని నిర్మల మానసము పరిఢవిల్లే ఆత్మ సమయము. పరమాత్మ నిర్గుణుడు అంటే పైన చెప్పిన విధానములో అర్థం చేసుకోవాలి. ఆయన విషయ గ్రహణ, విషయానుభవ స్థితులకు అతీతుడై
ఉంటాడు. నిజానికి నిర్గుణ స్థితి శాంతానందమౌన స్థితి.
దీనినే భాషా శాస్త్ర పరంగా భక్తి స్థితి, తత్పర లేక తాత్పర్య స్థితి అంటారు. మానసిక కార్యకలాపాలు జరిగే స్థితి విభక్తి స్థితి.
ఆస్తికులు నిర్వచించిన భక్తి స్థితీ ఇదే.
అస్మిన్ పరమ ప్రేమ రూపా - ఆస్తిక నిర్వచనం.
స్సవస్వరూపానుసంధానం భక్తిః ఇతి అభిదీయతే - ఇది తత్త్వశాస్త్ర నిర్వచనము.
తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి మూలములలోకి వెళ్ళాలి. తక్కువ రకం మనుషుల వ్యాఖ్యానాలు, భాషణములు అపార్థాన్ని మాత్రమే కలిగిస్తాయి.
ఆస్తికులు సత్త్వ గుణానికి విష్ణువుని, రజోగుణానికి చతుర్ముఖ బ్రహ్మను, తమోగుణానికి శివుని ప్రతీకలుగా చేశారు. మరి కొందరు సత్త్వ గుణాన్ని మంచితనానికి, రజోగుణాన్ని కార్యకలాపాలపై దృష్టికి, తమో గుణాన్ని అలసత్వానికి, సోమరితనానికి, నిద్రకు, రాక్షస ప్రవృత్తికి, చెడ్డ తనానికి ప్రాతినిధ్యం వహించేలా చేశారు.
గుణ శబ్దాన్ని మనం ఇన్ని రకాలుగా అవగాహన చేసి కోవచ్చు.
శ్రీర్భూయాత్!
సమస్త సన్మంగలాని భవంతు!
ఏతత్ సర్వమ్ శ్రీ పరమేశ్వరార్పణమస్తు!
*******
Indian Religions
Religions in India are serving least the followers of their faith and are inconveniencing followers of other faiths with their lures, foolish propaganda, intolerance, fundamentalism, non-patriotism and blindness to Divinity and ignorance of Truth and Reality.
All their energies are wasted in vain and foolish pursuits and never used for Divine pursuits.
********
సత్య దర్శనంలో తేడాలు , భేదాలు

చాలా మంది జనాలకి సత్యం దాని నిజ స్థితిలో అక్కర్లేదు.
సత్యాన్ని వాళ్ళ పరిమిత జ్ఞానంలో ఇమిడిస్తే చూస్తాం అంటారు.
వాళ్ళు చూసినా, చూడక పోయినా సత్యానికి ఏమీ నష్టం లేదు.
సత్యాన్ని ఎవరు కావాలనుకున్నా, అక్కర్లేదనుకున్నా సత్యానికి ఏమీ ఇబ్బంది గాని, లోటు గాని లేదు.
తమ తమ పరిమిత జ్ఞానములతో సత్యాన్ని కొలవడం వల్లే సత్యం స్వరూపం, అవగాహనా మారిపోయాయి. ఒక్కోసారి అనిపిస్తుంది: సత్య దర్శనం రకరకాలుగా జరగడం వల్ల, ఎన్నో తప్పుడు
వ్యాఖ్యానాలు, వికృత ఆలోకన, అవలోకనలు ప్రచారం లోకి వచ్చాయి.
అలా సత్యం అర్థమైన వాళ్ళ కన్నా సత్యాన్ని అపార్థం
చేసుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు.
ఏది ఉన్నదో అది సత్యం. మన పరిమిత గ్రహింపు ఉన్నదాన్ని ఉన్నట్లుగా అర్థం చేసికోనివ్వదు. మన రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు మన అవగాహనకు
రంగులు పూస్తాయి. ఆ రంగుల ప్రపంచంలో జీవించి
మరణిస్తాం. అదే సత్యమని ఎందరినో భ్రమింప చేస్తాము. మన చుట్టూ పరిభ్రమింప చేసుకుంటాము.
ఒకే అనుభవాన్ని పొందిన జ్ఞానులలోనే, ఆ అనుభవాన్ని మనకు వివరిస్తున్నప్పుడు, వారి వారి పూర్వాశ్రమ జీవితాన్ని బట్టి, అనుభవం గురించి చెప్పే మాటలు ఒకేలా ఉండవు. కాని మనం వారి మాటలను అర్థం చేసుకుంటే మనకు కలిగే అనుభవం మాత్రం ఒకటే.
నిజమైన సత్య దర్శనం శాంతిని, సంతృప్తిని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
సత్య దర్శనం చేయాలనుకుని మనం జీవితంలో ఎందరో "మహానుభావులను" ఆశ్రయిస్తాము. కాని ఆ మహానుభావులలో తర తమ భేదాలు ఉండడం వల్ల
మనకు సాఫల్యం కలిగే స్థాయిలో తేడాలుంటాయి.
అందువల్లనే - ఏకమ్ సత్ విప్రాః బహుధా వదంతి -
అనే నానుడి వచ్చింది.
సత్యం ఒకటే కాని జ్ఞానులు రకరకాలుగా చెబుతారు.
ఆ అవగాహనా భేదం వల్ల కలిగిన కల్పిత భేదాభిప్రాయాలతో వివాదములు పెంచుకుని వాదములలో మునిగి తేలుతూ జీవితాన్ని గడిపేస్తారు. కడతేరకుండానే కడతేరతారు.
ఈ వైరుధ్యాల వల్లే తత్త్వం రకరకాలుగా భాసిస్తోంది,
భావింప చేస్తోంది.
******
ఒక్కోసారి మనకు మనమే మంచి తోడు; మనకు మనమే మంచి సాహిత్యం.
********
ఫేస్బుక్ వాడు
వార్తా ఛానెల్స్ లో అవే విజువల్స్ పదే పదే చూపించి బోర్ కొట్టినట్లు, ఈ మధ్య ఫేస్ బుక్ అవే పోస్టింగ్స్ ని పదే పదే చూపించి బోర్ కొట్టిస్తోంది. పొద్దున్నే చూసిన ఓ ఇరవై ముప్ఫై పోస్టింగ్స్ పొద్దుటి నుంచి రాత్రి దాకా తిప్పుతోంది. అలాగే మనకు "ఫ్రెండ్స్" ఎందరో ఉన్నా కొద్ది మంది పోస్టింగ్స్ నే చూపిస్తోంది.
ఎక్కువ కాంటాక్టు లో ఉన్న ఫ్రెండ్స్ పోస్టులు మాత్రమే మనకు చూపబడుతున్నాయేమో! ఇదివరకు తాజా తాజాగా ఎన్నో న్యూ పోస్ట్లు వచ్చేవి. ఇప్పుడు సంఖ్య బాగా తగ్గిపోయింది. తాజాగా రావటంలేదు.
మన ఫ్రెండ్స్ పెట్టటం లేదో, సాఫ్ట్వేర్ మార్చేశాడో ఫేస్బుక్ వాడు. చూసిన పోస్టులే చూడడానికి విసుగుగా ఉంది. ఎందుకు ఫేస్బుక్ వాడు ఇలా మార్చేశాడో!?
********
RESONATING HEARTS
Resonating hearts fall in love
It can be at first sight or blind;
Intuition of nearness is dearness
For the youth in initial stages of
Courting and proximity due to
Studies or job or neighborhood
Love is though termed falling
It is invigorating for the ripened
And matured hearts and minds
It becomes rising together in the
Company of each other and
Enjoy union of hearts contentedly

Sunday, May 27, 2018

దురాశ; ఫేస్బుక్ పోస్టింగ్స్; సంతసమే; సముద్రుడు

దురాశ
నీటికొరత అన్ని పల్లెల్నీ, పట్టణాలను నగరాలను, బాధిస్తున్న సమస్య. మిగతా వ్యవహారాలలాగే మన పాలకులు స్టేట్మెంట్స్ ఇచ్చేసి చేతులు దులుపు కుంటున్నారు. ఎన్నికైన ఐదేళ్ళలో ఎంత నొల్లుకున్నామా తప్పించి ప్రజలకు సౌకర్యంగా ఏమి చేశాము అని రాజకీయ నాయకులు అనుకోనవసరం లేకుండా వారి మోసపు మాటలకు పడిపోయి వారినే మళ్ళీ ఎన్నుకుంటున్నాము.
కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు, మరికొన్ని వర్గాలకు ఋణ మాఫీలు, ఇంకొన్ని వర్గాలకు తాయిలాలు ఇస్తూ మన్ని మచ్చిక చేసుకునే ఈ ప్రజా ప్రతినిధులనూ; మనందరకూ అవసరమైన మంచి నీరు, పరిశుభ్రమైన గాలి, వాతావరణం కల్పించాలని ఏ నాయకునీ కోరము. వాతావరణ కాలుష్యం లేకుండా చేయండి అని నాయకులను, పాలకులను నిలదీయము.
మాకు మంచి రోడ్లు కావాలి, సుఖ ప్రయాణానికి బస్సులు, రవాణా సౌకర్యాలు కావాలని నాయకుల్ని డిమాండ్ చేయము. ప్రైవేటు ట్రావెల్స్ మన్ని ఎంత దోస్తున్నా ప్రభుత్వాలను, నాయకులను నిలదీయము. దగ్గర ప్రయాణాలకు షేర్ ఆటోల్లో లగేజీలతో ఇరుక్కుని పూర్తి అసౌకర్యంతో ప్రయాణిస్తాము.
ప్రైవేటు విద్యాసంస్థలను అసాంఘిక శక్తులు, రాజకీయ నాయకులు కబ్జా చేసి మన కష్టాన్నంతా ఫీజుల రూపంలో దోస్తున్నా కిమ్మనం. వైద్యం పేరుతో మన ఆరోగ్యాలతో, డబ్బుతో, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైద్యశాలల గురించి ప్రశ్నించము.
కులగజ్జి బాగా పట్టించుకొని అస్తమానూ గోక్కుంటూ, మనోళ్ళనుకుంటూ, సంఘంలోని ఇతర కులస్తులను
మర్యాదగా, సభ్యతగా చూడము. పైపెచ్చు వినడానికి అసహ్యమైన భాషతో నానా తిట్లూ తిడతాము. మన కుసంస్కారాన్ని, అనాగరికతను యథేచ్ఛగా, సిగ్గు లేకుండా ప్రదర్శిస్తాము.
మనకి సుఖశాంతులతో కూడిన జీవితాలు ఎక్కడ లభిస్తాయి? ఇంకా మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేసికొని మనం కూర్చున్న కొమ్మను మనమే నరికేసు కుంటున్నాము. ఏ మేధావుల పుణ్యమో గాని ఇల్లాలిని చంపేశాము.
ఇన్ని వక్రాలు మనలో, మన మనసుల్లో పెట్టుకొని, అవకతవకగా ప్రవర్తిస్తూ, గతాన్ని నిందిస్తూ, దానికి ఫలానా వారు కారకులని బుద్ధి లేకుండా మాట్లాడుతూ, మన ద్వేష విద్వేషాలతో సంఘంలో దారుణమైన అశాంతిని, కష్టాలనూ కలిగిస్తూ ఎంత సేపూ వెనకబడ్డానని వెనుక పడుతూ జీవితాలను స్వయంగా ఛిన్నాభిన్నం చేసికుంటూ ఎవరిమీదో ఏడుస్తూ మనకి మనమూ ఉపయోగపడటం లేదు,
సంఘానికి, దేశానికీ ఉపయోగపడటం లేదు.
మనలో ఇన్ని లోట్లు, లోపాలు పెట్టుకొని మన దరిద్రానికి ఇతరులను బాధ్యులను చేస్తూ మనం ఏడుస్తూ బతుకుతున్నాం. తోటి పౌరులను ఏడిపిస్తున్నాం. కష్ట పెడుతున్నాము.
దీనికి పరిష్కారం మనందరం కూచుని చర్చించుకొని కనుక్కోవాలి. వారిని, వీరిని నిందిస్తూ, వారినీ, వీరినీ కులాల, మతాల పేరుతో అంటకాగి మన జీవితాల్లో వసంతం విరియాలనుకోవడం దురాశ.
********
ఫేస్బుక్ పోస్టింగ్స్ 

ఫేస్బుక్ వివిధ రాజకీయ పక్షాల రణరంగంగా తయారైంది. అమ్మా, ఆలీ బూతులు తిట్టుకుంటున్నారు. సభ్యత లేదు. ఫేస్బుక్ కి ఏమీ సెన్సార్ లేదు కాబట్టి ఈ కుసంస్కారాలు, సభ్యతా రాహిత్యాలు, అనాగరిక, ఆటవిక ధోరణులు; ఇవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఏ విధమైన అడ్డూ, ఆపూ లేకుండా అటు వారు ఇటు వారు చెడుగుడు ఆడేసుకుంటున్నారు.
ఒక పబ్లిక్ ఫోరం లో ఇంత నిర్లక్ష్యంగా, అమర్యాదగా, అగౌరవంగా, తిట్టుకోవడం ఇళ్ళల్లో మాట్లాడే అనాగరిక, అసభ్య భా‌షని వాడడం, నీచాతి నీచమైన వాళ్ళ హీనతని అంత ప్రస్ఫుటంగా చూపించుకోవడం చాలా అసహ్యకరంగా ఉంది.
మానసిక రోగులందరూ ఇక్కడ కట్ట కట్టుకు తయారయ్యారు. చదువు, సంస్కారం లేని జంతు సముదాయం విచ్చలవిడిగా సంచరిస్తున్న సాంఘిక అరణ్యంగా ఫేస్బుక్ తయారైంది.
******
సంతసమే

శతకోటి లింగాలలో ఓ బోడి లింగంగా వెలయించే
నా కవితలు ఏ సరస హృదయాలను తాకునో
ఏ రసికులకు మనోరంజనం కలిగించునో!
ఛందో బద్ధమైనవి కావు ఏ వాదములకూ చెందవు
మనసున విరిసిన మల్లెలు ఏ మది వేసంగిని పూయించునో; మామిడులతో కలిసి ఏ అంతరంగమును రస ఫల భరితము చేయునో!
సారస్వతమున ఉద్దండులైన కవిసార్వభౌములకు
కవి సామ్రాట్ లకు సహజ కవులకు దీటుగా నిలబడ
లేకపోయిననూ నిలబడిననూ నా కవితలు పాఠకుల
అలరించిన చాలును; వారి తలల కాసేపు ఊపినను
అదే పదివేలు; అక్షరముల వరుస, భావ లహరి,
అనుభవముల అల్లిక, శారదకు అభివాదములు
నా బుల్లి హృదయము గానము చేసిన గీతములు;
కవనములు పాఠక మనోహరములు హృదయ 
వికాస కారణములైన చాలును; నా పదపుష్పములు 
వాసుదేవ పదారవిందముల క్షణమున్నను సంతసమే
*********
సముద్రుడు 
తన గాంభీర్యాన్ని ఏమాత్రం సడలించకుడానే నదుల నీటినంతని సముద్రం ఇముడ్చేసుకుంటుంది.
అలాగే మనుషులూ తమ స్థిమితాన్ని ఏమాత్రం కోల్పోకుండా జీవితంలో కలిగే వడిదుడుకులను ఇముడ్చుకోవాలి. ఇది కష్టతరమే కాని అసాధ్యం కాదు. ఎందుకంటే ఇది మనంతట మనం నేర్చుకుని ఆచరించుకోవలసినది.
ఆ మాత్రం శ్రద్ధ వహించక పోతే ఏ ఆధ్యాత్మిక గురువు పాలనో పడతాము. మన అశాంతి పోకపోవడం అలా ఉంచి మన స్వాతంత్ర్యాన్ని, వ్యక్తిత్వాన్ని కోల్పోతాము. మన వ్యక్తిత్వాన్ని భగవంతుని ఆరాధనలో, అర్చనలో, స్మరణలో కోల్పోవాలి, లేదా భగవల్లక్షణాలైన జ్ఞానం, ఆనందం, శాంతి, మౌనము లలో కాని కోల్పోవాలి; మరెవరిలోనూ, మరెందులోనూ కాదు

Friday, May 25, 2018

ఉద్ధరింపులు; పిల్లల పెంపకం; గురువింద గింజలు; సాహితీ సృష్టి; ఊపిరి;

ఉద్ధరింపులు
చాలా మంది భారతీయ సాంప్రదాయం నుంచి, సంస్కృతి నుంచి తాము లాభ పడే ఊసు పెట్టుకోకుండా, మిగిలిన అందరినీ ఉద్ధరించెయ్యాలని
ఎన్నో పోస్ట్లు పెడతారు. ఎంతో తాపత్రయం చూపుతారు. ఈ తాపత్రయంలో అణుమాత్రం తమని తాము ఉద్ధరించుకోవాలని సంకల్పం ఉన్నా వాళ్ళూ బాగుపడతారు మనకీ ఈ పోస్ట్లు చూసే హడావుడీ తగ్గుతుంది.
తనకు మాలిన ధర్మం లేదు - అంటే తను ఆచరించని ధర్మాన్ని ఇతరులకు బోధించడం అనవసరం అని అర్థం. తను ఆచరించకుండా మీరందరూ ఆచరించండి అనడం height of innocence and ignorance.
ఈ బోధనలు మనం ఆచరించి ఇతరులకు చెబితేనే వాటికి విలువ. లేకపోతే చిరాగ్గా ఉంటుంది.
మిగతా వాళ్ళని బాగుచేసే ముందు మన్ని మనం బాగుచేసుకోవడం అత్యవసరం. ఏదో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కదా, అందరికీ క్షణాల్లో పంపిచెయ్యచ్చు కదా అని మనం పంపించేదాన్ని ఏమీ చదవకుండా, అవగాహన చేసుకోకుండా ఇతరులకు తోసేయడం మన శ్రమ మాత్రమే. ఇతరులపై ప్రేమ కాదు. ఉద్ధరింపు మన నుంచి మొదలవ్వాలి.
**********
పిల్లల పెంపకం

లలిత కళల్లో నిష్ణాతులైన వారికి, మేధావులని కీర్తింపబడే వారికి చంచలమైన మనసు ఉంటుంది.
వారి అలవాట్లు, వ్యవహారాలు, బంధాలు, సంబంధాలు సమాజం నిర్దేశించినట్లుండవు. వారు స్వేచ్ఛగా తిరుగుతారు. వాళ్ళ అలవాట్లని, ప్రవర్తనని బట్టి మాత్రమే వారిని గౌరవిస్తాను, ఇష్ట పడతాను అంటే అందుకోసం మనకు ఎవరూ మిగలరు. బలహీనతలు లేని మనుషులు ఉండరు.
ముఖ్యంగా కళాకారులు, పేరొందిన మేధావులు, "పెద్ద మనుషుల్లో" సంఘ నియమాలు పాటించకుండా జీవించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మన కొలబద్దలు అక్కడ ఉపయోగిస్తే ప్రయోజనం ఉండదు. సంఘం ఎప్పటినుంచో కళాకారులు, మేధావులు, ఇతర "పెద్ద మనుషుల" విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించేది. ఇప్పుడు అంతర్జాలం వచ్చేక సామాజిక సాలెగూళ్ళలో నీతి, అవినీతి బోధించడం, అలా లేని సెలిబ్రటీలని ఎండగట్టడం ఒక ఆనవాయితీగా తయారైంది.
అందుకే ఇదివరకు నట, విట, విదూషకులను దూరంగా ఉంచాలనేవారు. ఎందుకంటే వారికి సాంఘిక నియమాల మీద అలస భావం ఉంటుంది.
అది ఆయా వృత్తులలో సహజం. వారు వినోదాన్ని పంచుతారు. అలా మన మనసులని తేలికగా దోచేస్తారు. మన చిన్నప్పుడు మనం, ఇప్పుడు మన పిల్లలు, మనుమలు, మనమరాండ్రు సినీ నటీనటులను ఎంత ఆరాధిస్తారో, వారిపై, వారికై ఎంతో మనసు పారేసుకుంటారో చెప్పనవసరంలేదు.
అందమైన మన అమ్మాయిలు, అబ్బాయిలు ఈ సినీ తారలపై మనసు పారేసుకోవడం నిజంగా నాకు ఇబ్బందిగా ఉంటుంది. దానికి తోడు మన జీవన విధానం పూర్తిగా మారిపోయి ఎప్పుడో 28, 29 ఏట జరిగే పెళ్ళి వరకు ఏ ఆకర్షణలోనూ పడకుండా ఉండడం అసాధ్యం. గర్ల్ఫ్రెండ్, బాయ్ఫ్రెండ్ లు ఈ లోటు కొంత పూడ్చినా సినీ తారల, ఇతర వినోద కారుల ఆకర్షణనుంచి మన పిల్లల్ని కాపాడలేము.
ఏదో బట్టీ పట్టి పరీక్షల్లో రాసేసి సర్టిఫికెట్ తద్వారా ఉద్యోగం మాత్రం సంపాదించి పెట్టే నేటి చదువులు మానసిక వికాసం కలిగించే అవకాశం లేకుండా పోయింది. తల్లిదండ్రులు, వాళ్ళు స్వతహాగా చదువుకున్న రెండు మూడు పుస్తకాలు తప్ప వారికి జీవితం గురించి చెప్పే వారే లేరు. వారు చదివే విద్యాలయాల్లోని ఉపాధ్యాయులకు ఈ శక్తీ లేదు, ఉన్న ఒకరిద్దరు యాజమాన్యాలను అధికరించి జీవితం గురించి ఏ మంచి మాటా చెప్పలేని స్థితి.
ఎక్కువ విద్యాలయాలు అసాంఘిక శక్తులచే నడుప బడుతున్నాయి.
మన పిల్లలకి విద్యాలయాల్లో గడిపే సమయమంతా రేంకులు, రాబోయే ఉద్యోగాల గురించి (చాలామందికి ఏ ఉద్యోగాలు రావటంలేదు, అది వేరే సంగతి) సతమత మయ్యే హడావుడే తప్ప జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమయ్యే విషయాలే చెప్పబడటంలేదు. ఈ విషయంలో ఏ విధమైన సాయం అందటం లేదు. అసలే వయసు తెచ్చే అలజడులు, ఆకర్షణ, ఇంగితం నేర్పేవారు, సావకాశాలు లేని విద్యావిధానం, వ్యవస్థ, జైళ్ళలాంటి ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ కాలేజీలు, అసలు మన పిల్లలు మన ఈ "దౌష్ట్యాన్ని" ఎలా తట్టుకుంటున్నారో!
ఆ ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ జైళ్ళ బందిఖానా నుంచి బయట పడగానే కలిగే స్వేచ్ఛ, అణిచి ఉంచిన వయసు, ఆకర్షణలు ఉన్న కాస్త ఇంగితాన్ని మింగేస్తాయి. అప్పుటికే మనసునాకర్షించిన సినీతారలు, ఆటగాళ్ళు, ఇతర సెలిబ్రిటీలు జీవితంపై దృష్టి పెట్టనీయరు. అప్పుడే తల్లిదండ్రుల పెంపకం; వారికి సహజంగా అంటిన సంస్కారాలు, స్ఫురణ, స్ఫూర్తులు వెన్నంటి ఉండి కాపాడతాయి. లేనివాళ్ళు ఇతరుల వంచనకు లోనవుతారు. జీవితం ఇబ్బందుల్లో పడుతుంది.
ఇదంతా మనం ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించం. ఆలోచించి ఏం ప్రయోజనం అని ఎందరో వదిలేస్తారు.
కాని చురుకైన, మెరుగైన, అందమైన మన ఆడపిల్లలు, మగపిల్లలు వారి వారి అందాలకు, సంస్కారానికి, సంస్కృతికి ఏ మాత్రం తూగని, ఒక్క వినోదం మాత్రం పంచే, అదీ జుగుప్స కలిగించే విధంగా; నిజ జీవితాల్లో ఏమాత్రం ఆదర్శంగా జీవించని; రూపంలో తప్ప మరెందులోనూ తగని, నటీనటుల పట్ల ఆకర్షితులై వ్యవహరించడం మనం ఎవరం కావలసినంత దృష్టి పెట్టని విషయం.
పిల్లల పెంపకంలో మన పాత్ర మరెవ్వరూ తీసికో లేనిది. పూరింపలేనిది. ఈ వాస్తవాన్ని గ్రహించి మనం జాగరూకులమై మన బాధ్యత నిర్వహించక పోతే నష్ట పోయేది మన పిల్లలు, మనం.
************
"Miracle" for setting in peace

People swarm to individuals who "can" tell about your past lives and future. Very few pay attention to the present. All meditations direct us to practice and cultivate the art of living in the present.
We live by our thoughts. Most of the times our thoughts are about what passed and what will happen. These thoughts are related to I, me, mine. This situation is because we are highly ego-centric.
We always think of bonds to I and the merits and demerits of those bonds. The thoughts originate from our experiences relating to I, me, mine; pain, hurt, unpleasant happenings are sourced from our memory. Past is nothing but memory in the form of pleasant and unpleasant experiences. Surprisingly and most of the times our thoughts of past are about unpleasant happenings. Pleasant happenings rarely are activated giving us joy.
Sorrow, pain, hurt dominate past. In a similar way future is active in our mind as fear, anxiety, apprehension, worry, doubt mostly. Both past and future are activated in the present as mere thought forms; and are unreal confined to mental uneasiness and have no physical existence.
Mind always tries to dwell in the past or future; thus giving us no time to live in the present. All mental illnesses are due to weak mind which cannot stop rising of unpleasant thoughts in relation to past or future. Mind has to be and can be strengthened through our conscious efforts.
Every one of us must attempt this strengthening of mind.
First and foremost thing in this direction is to have and maintain harmonious human relationships. In the absence of this any amount of spirituality or gurus, meditation techniques will fail to help us in strengthening our mind to tackle all vissicitudes that envelop and engross us during the course of our lives.
So the primary and only phenomenon that helps us in curtailing disturbances in and of our mind is cultivating and maintaining harmonious human relationships and have respect for fellow humans, animals and nature - cum - environment.
Many erroneously feel that even in the absence of having harmonious relationships, spirituality or gurus or meditations can help and rescue them from mental uneasiness and illnesses.
We have to take care of our relationships among family, society and nation to have peaceful coexistence.
Living in the present in harmony to around living and non-living beings is the miracle that sets in peace in us and society.
********
నయనానందకరము ప్రకృతి అందములు;
శ్రవణానందకరము పక్షుల కిల కిలా రావములు
హృదయాహ్లాదకరము ప్రణయిని రాగ భాషణములు
మదిని పొంగించును రమణీ తనురచనలు సొంపులు
ఆహ్లాదము మనిషి మనిషికీ వేరు
స్త్రీ పురుషులకు అంతరంగ మథనాలు వేరు
మనసుల మంతనాలు జరుగు విధములు వేరు
ఒకరి తత్త్వము వేరొకరి తత్త్వము; మనసులు
పనిచేయు తీరులు వేరు; ఒకరి వైపునుంచి చూచి
మరొకరిని తక్కువగా చూడరాదు; ప్రకృతి ఆట ఇది
********
అనుబంధం ఆత్మీయత లేని "ప్రేమ"
ఎండిపోయిన నదీ ఒకటే; ఆర్ద్రతలుండవు
********
గురువింద గింజలు
ప్రపంచంలో తప్పులు చేసేవారి కన్న తప్పులు చేసిన వారి తప్పులను దుయ్యబట్టే సామాన్య జనం ఎక్కువ. నిజానికి ఈ దుయ్యబట్టే వారంతా కూడా తమ తమ జీవితాల్లో తప్పులు చేసిన వారే. వీరికి ఇతరులలో తప్పులు ఎంచడం, పట్టడం, దునుమానడం ఒక వేడుక.
ఈ తిట్టే వాళ్ళ తప్పులు ఇతరులకు తెలియవు. అలా వీరు తప్పించుకొని సంఘంలో తప్పులు చేసిన వారందరి మీదా కారాలు మిరియాలు నూరతారు.
ముఖ్యంగా సెలిబ్రటీలైతే చచ్చారన్న మాటే. ఈ తప్పులెన్నువారు, నీతి వాక్యాలు చెప్పే వారు వారి వారి జీవితాల్లో తప్పులు చేసే సగటు మనుషులే. సెలిబ్రటీల తప్పుల దగ్గరకొచ్చే పూనకం వచ్చిన వారిలా రెచ్చిపోతారు. ఓ మాట అని ఊరుకోవచ్చు.
ఉహు అలా కుదరదు వీళ్ళకి. ఆ సెలిబ్రటీని చీల్చి చెండాడెయ్యాలసిందే. వాళ్ళ చుట్టాలలో, స్నేహ బృందంలో తప్పులు చేసే వారెందరో ఉంటారు. వీళ్ళు గబుక్కున అంధులైపోతారు ఆత్మీయుల ఆగడాలకి.
తప్పులు అందరం చేస్తాం అనే స్పృహ ఉంటే తప్పులు చేసిన ఎవరినీ అతిగా ఆడిపోసుకోం.
గురువింద గింజ సామెతలా వీరు వ్యవహరిస్తారు.
*******
Rising power of regional parties is not good for emotional integration of India.
Our leaders' narrow-mindedness and no love for nation together with their ignorance of democratic processes and its various wings and sole selfishness and dynasty leadership trends are detrimental to progress of India and the idea of India as an integrated nation.
********
Readers have become rare to find. The entertaining ways are so dominating that "ordinary" people who were readers for time pass are now smart phone savvy and spending their time that way.
********

సాహితీ సృష్టి
సమాజంలో మనకి ఆనందం కలిగించే రచనలు చేయడం సామాజిక అంశమే కదా! అవసరమే కదా! ఎటొచ్చీ రచన తరువాత ఈ ఉపయోగం కలుగుతుంది.
సాహిత్యం సమాజంలోని సమస్యలు చిత్రించి మనకు అశాంతి కలిగించడం కన్న మనకు ఆహ్లాదం కలిగించడం మంచిది కదా. వార్తా ప్రసార సాధనాల ద్వారా మనం సమస్యలు తెలుసుకుంటూనే ఉంటాము. అలాగే కాక పాఠకులమైన మనమూ సంఘాన్ని గమనిస్తూ ఉంటాం కదా.
పాఠకులకు ఆహ్లాదం కలిగించడం సామాజిక సేవ కిందే వస్తుంది కదా. అన్ని రచనలూ సమాజంలోని సంఘటనలను, బాధలను, అణచివేతలను మాత్రమే ప్రతిబింబించాలనడం పసితనం. అలాగే ప్రతి రచనా సందేశం ఇవ్వాలనడం ఒక విధమైన మేష్టారి మనస్తత్వం.
రచనలు ఆహ్లాదాన్ని మాత్రమే కలిగించేవి కావచ్చు. అవి రచనలు కావు అలా రాయడం బూర్జువా సంస్కృతి అనడం సంకుచితంగా మాట్లాడడం.
ప్రణయము, ప్రేమ, ఇత్యాది కవితా వస్తువులను పుర్ర చేతి భావ విమర్శకులు తెలుగు సాహితీ రంగంలో అనధికారికంగా నిషేధించారు. సమస్యల వలయాలను చిత్రించడమే సాహిత్య పరమార్థం అని శ్రీ శ్రీ అనుయాయులచే నిర్ణయించబడింది.
తరువాత వాదముల హవా మొదలైంది. ఈ వాద సాహిత్యంలో ఎంతసేపూ ఎవరో ఒకరిని, దేనినినో ఒక దానిని నిరసించడం, దుయ్యబట్టడం ఉంటాయి. సామరస్యం, సౌమనస్యములకు తావుండదు. సాహిత్యం సంఘంలో శాంతి, ఆహ్లాదయుత వాతావరణాన్నీ నిర్మించాలి.
ఊకదంపుడుగా తిట్లు, కువిమర్శలు కల రాతలే సాహిత్యం అనే స్థాయి నుంచి తెలుగు సాహిత్యం సౌమ్యత, సౌమనస్యము, సామరస్యం, ఆహ్లాదం, వివేకము, వివేచన, తత్త్వ జ్ఞానము పొందడంల వైపు పయనించాలి. అప్పుడే మన మధ్య కృత్రిమత, ద్వేష, విద్వేషాలు, కోప తాపాలు, అపోహలు, అజ్ఞానయుత ధోరణులు, వైషమ్యం నిండిన తలపులు తొలగి మనలో, సంఘంలో సుఖశాంతులు ఏర్పడతాయి.
సాహిత్యా సృష్టిని ఇందుకూ వాడుకోవాలి
*********
ఊపిరి
నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం బాగా అలవాటు. ఈ అలవాటు నాకు మా అమ్మ నాన్న గార్లనుంచి వచ్చింది. మా అమ్మగారు పురాణాలు చదివే వారు. మా నాన్నగారు అన్ని రకాల పుస్తకాలు తెలుగు, ఆంగ్ల భాషల్లో చదివేవారు.
నేను బాలల బొమ్మల రామాయణంతో మొదలుపెట్టి
వివిధరకాలను చదివాను. నేను పి హెచ్. డి. చేస్తూంటే నేను ఒక రచయితనైతే బాగుండును అని మొదటి సారి అనిపించింది. అప్పుడు పుర్రచేతి భావాలు తెలుగు సాహిత్యాన్ని ముప్పిరిగొని ఉన్నాయి. వార, పక్ష, మాస పత్రికలు తమ వంతు సాహితీ సేవ చేస్తూ ఉండేవి. కాని రచయితగా మాత్రమే ఉంటే జీవనం గడవదని అర్థమైపోయింది.
మౌనంగా పి. హెచ్. డి. పూర్తి చేసికొని ఉద్యోగంలో చేరాను. కాని రచయితగా మారలేదు.
చిన్న చితకా కవితలు, కథలు రాస్తూ ఉండే వాడిని.
కాని సాహితీ స్రష్టల సందోహం ఎక్కువైపోయి, పత్రికలు తక్కువై పోయి మము బోంట్ల రచనలకు ప్రచురణా భాగ్యం కలిగేది కాదు. ఎప్పుడూ గోడకి కొట్టిన బంతిలా వెనక్కి రావడమే.
ఇంటర్నెట్ వచ్చాక సాంఘిక సాలెగూళ్ళు, వెబ్ సైట్లు పెరిగాక మాకూ ప్రచురణా (ఇంటర్నెట్లో) మాత్రమే కలగడం మొదలు పెట్టింది. రచించడానికి ప్రేరణ, ఉత్సాహం కలిగాయి.
ఆ రోజుల్లో అసలు నేను (ఇప్పుడు కూడా) రచయిత నవ్వాలని ఎందుకనుకున్నానంటే, రచయితలకు పదవీవిరమణ లేదు. ఆరోగ్యం ఉంటే ఆఖరి ఊపిరి తీసేవరకు రాసుకోవచ్చు.
కాని ధన సంపాదనే ఉండదు. ఇప్పుడంటే రిటైర్ అయిపోయాను, ధన సంపాదన అవసరం లేదు, అందుకని తనివితీరా రచనా వ్యాసంగంలో మగ్నమై పోవచ్చు. పేరు, ప్రఖ్యాతులు రాకున్నా మనకు కాలక్షేపం అయిపోతుంది. బుర్రా ఖాళీగా ఉండదు. పదునెక్కుతుంది కూడా. రవంత పేరు రావచ్చు.
రాయడం ఎందరికో ఊపిరి.
********
విశ్వవిద్యాలయములా బొచ్చెడు
చదువులా కులగజ్జిని దాటనివ్వవు
కవులు, మేధావులా వర్గాన్ని మించలేరు
జ్ఞానులు, గురువులా తమ ఆస్తుల పెంపకంలో
ములిగి తేలేరు; అన్ని తమకములు తీర్చుకొనేరు
పాలకులా పదిచేతులతో వెనకేసుకొనేరు
భారత దేశమున అన్ని వృత్తుల్లో నిజాయితీ తగ్గుతోంది; ప్రజల్లో అనైక్యత పెరుగుతోంది
ముఖ్యమైన చదువు, వైద్యం, ఆధ్యాత్మికత
వ్యాపారుల, దళారుల వశమై నిరుపయోగమయ్యేను; అంతనూ సరిచేయడానికి
మేధావులు లేరు, గురువులు లేరు, పాలకులు లేరు
ఉద్యమిద్దాం అంటే మన కులం చూసి దూరమయ్యేరు; ప్రాంతం, మతం పేర్లు
చెప్పి నీరు కార్చేరు; కుహనా మేధావులు
తాము చేయలేరు, ఇతరులను చేయనివ్వరు
ద్వేష విద్వేషాలు మాత్రం మస్తుగా పంచేరు
పెంచేరు; ముసలి ఎద్దుల వంటి వీరు పనికిరారు
దేశంలో ఐక్యత కలిగించే మేధావులు ఏదో
సూత్రం కనిపెట్టి ఆ సూత్రంతో భారతీయులను
ఒక గుదిని గుచ్చి అందమైన మాలగా అల్లడానికి
మనందరం సహకరించాలి; మన బాగు చూసుకోవాలి