Sunday, March 25, 2018

Time; భగవన్నిర్వచనము; ముళ్ళబాట? - పూల దారి?; Employment in ancient India; Urge to Publish; చదువులెవరివి?

Time
Time is not a real thing; it does not exist physically on its own or as it is. No one ever comprehended its nature fully. No one ever can. Time manifests physically through processes or events - physical, chemical, biological, cosmological, psychological, historical, social, political, sociological, geological, geographical, etc.,
Past is memory or record, present is awareness. Future is imagination, doubt, fear, apprehension of mind.
Time in a nutshell is a figment of our imagination.
***********
Calming the mind is a process reverse to thinking.
************
భగవన్నిర్వచనము

న దేవో విద్యతే కాష్ఠే
న పాషాణే న మృణ్మయే
భావేషు విద్యతే దేవః 
తస్మాత్ భావోహి కారణమ్
భావము: భగవంతుడు చెక్కతో చేసిన బొమ్మలో గాని, రాతి విగ్రహములో గాని, మట్టి బొమ్మలో గాని ఉండడు. భగవంతుడు మన భావములలోనే ఉన్నాడు. అంచేత భావములే, భావించ గలగలడమే, భావించడమే అంతకూ, అంతటా పరమాత్మని చూడగలగడానికి కారణం.
न देवो विद्यते काष्ठे
न पाषाणे न मृण्मये।
भावेषु विद्यते देवः
तस्मात् भावो हि कारणम्॥

The Lord lives not in the wooden carving
Nor in the sculpture made of stone or clay;
The Lord lives in our thoughts
And it is through our thoughts that we see him dwell in everything.
*************
నేను కి శాంతియే నేను అనేది సరియైన అన్వయం.
********
తాము ప్రవచించవలసిన తత్త్వాన్ని కాని, యోగాన్ని కాని, ఆధ్యాత్మికతను కాని పక్కకు పెట్టి, తమ గురించి డంబాలు చెప్పుకుంటూ, శిష్య పరమాణువులను; తమ లేక వారి జీవితాంతం చుట్టూ తిప్పుకుంటూ, ధన, చరాచర ఆస్తుల సంచయం చేస్తూ తమ గురుత్వాన్ని, ఆకర్షణను దుర్వినియోగం చేసుకునే సామాన్యులు, ఉన్నతమైన, మహిమాన్వితమైన, అసామాన్యమైన భారతీయ తత్త్వ బోధనకు, ప్రచారానికి, ప్రసారానికి, ప్రాతినిధ్యం వహించడానికి అనర్హులు.
**********
ముళ్ళబాట? - పూల దారి?
పెళ్లి; బంధము, చెఱసాల, వంటింటికి, పడకటింటికి
పరిమితమౌ బానిస జీవితమని భయపెట్టు మేధావులు, స్త్రీ వాదులు కన్నెల వివాహ
విముఖులను చేసి సంసార విముక్తులను
చేయుచున్నారు; చాలీచాలని జీతాలతో
ఎందరో మధ్యతరగతి కింది తరగతి ముదితలు ఇల్లు సర్దుకుంటూ
ఎదుగూ బొదుగూ లేని "ఉద్యోగాలు"
మాల్స్ లో, ప్రైవేటు సంస్థల్లో పది గంటలు
పైగా చేస్తున్నారు; సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే
యువతీ యువకులను వేళ్ళమీద లెక్క పెట్ట
వచ్చును; పొంతన లేని మాటలతో, జీవితాలను
అగమ్యగోచరం చేస్తున్న నేడు ఏది సత్యం? ఏది
నిత్యం? ఏది అనుసరణీయం? ఏది విస్మరణీయం?
ఏది సుఖశాంతిదాయకం? ఏది ముళ్ళబాట?
ఏది పూల దారి? అంతా అయోమయం! సంఘమున
ఉపదేశించువారు ఎక్కువై బతుకులు శూన్యమైనవి!
**********
Employment in Ancient Indian Times

Various technologies in India in good olden days, are with various communities with various skills and application.
And there were no government jobs. Every one has to take one profession or the other. Else there was no livelihood. Barter system was existing.
No currency was in vogue. Later money entered in circulation as coins. No human being was able to live without being indulged in one occupation or the other. Money circulation as now was not rampant. Accordingly people were working and living.
Currency availability has brought out many professions different from earlier vocations. This is true throughout the globe.
So various jobs are created in addition to British era occupations and employment. Agriculture and cottage industries were chief occupations in ancient India.
It is unwise to compare earlier occupations, living and culture as of now. Culture is like a flowing river. So is "civilization".
Ability to speak and learn languages has revolutionized human mental endeavours.
Human faculty has originated various sciences, arts, philosophies, technologies and applications.
Living in the past and criticising will be of no use today. Eminence must help us in adjusting to current culture and civilization.
Harping on the past will only increase animosities and hatred. Divisions will be exploited by unscrupulous elements in society some times in the form of intellectuals and political fraternity.
Unfortunately in India make believe and not understanding is ruling Indian citizens' mind and heart. Let us pray and work for elimination of easy work attitudes and be cautious with intellectuals and political parties who and which harp on earlier divisions to keep us divided.
*********
ఇప్పటికి మనకి కొద్దిగా అర్థమైనదేమిటంటే, ప్రభుత్వ బేంక్ లు ఎందరో వ్యాపార వేత్తలకు, వారి సంస్థలకు అప్పనంగా వేల కోట్లు దోచి పెట్టారు. ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. చేతులెత్తేసాయి అంతే!
********
Urge to publish
The urge to publish our works is also a vice. Being aware that the probability that our published works' sale is very low; and still we indulging in publication of our works spending our money is really irresistible. It is the vice that grips all creators of literature.
It is an unavoidable urge, longing and liability.
********

మనల్ని వెర్రి మొహాల్ని చేసి వార్తా మాధ్యమాల్లోనూ, అంతర్జాల సాంఘిక సాలెగూళ్ళలోనూ రాజకీయ పార్టీలు ఎంతెంత అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయో!
స్వోత్కర్ష, పరనింద ఇంత స్థాయిలో చేయడం మనకూ ఆలోచించే శక్తి, నేర్పు ఉన్నాయని పట్టించుకోకపోవడమే.
హిట్లర్ గోబెల్స్ లాగ అబద్ధపు ప్రచారాలు ఘనంగా చేసి మన బుర్రలను గందరగోళంలో పడేస్తున్నారు. మనం వారి ఈ తప్పుడు ప్రచారాలని నమ్మేస్తాము అనుకోవడం నిజంగా వారి దుస్సాహసమే.
******
చదువులెవరివి?

వర్ణక్రమము సరిగా రాయలేని తెలుగు వారు; 
ఒత్తులు, గుణింతాలు పట్టించుకోని సాహితీ స్రష్టలు
భావ దారిద్ర్యమున ద్వేషం తప్ప పంచలేని
 వాద ప్రియులు; రాద్ధాంత ప్రేమికులు
భాష ఎవరి సొత్తో అనుకొని భాషను ఇచ్చవచ్చి
నటుల విధ్వంసం చేసి కవితలు, కతలు రాయువారు
జ్ఞానము వంట బట్టించుకొనక అజ్ఞానమై మిగులు వారు;
చదువుల అర్థము పరమార్థము తెలియక విర్రవీగుచు చదువుల గమ్యము మార్చువారు
కుల, సిద్ధాంత, వాద పంజరముల వసించుచు
సాహితీ సృజనను, సృష్టిని భ్రష్టు పట్టించువారు
హెచ్చి హెచ్చిన మదమున హెచ్చరికలు లేక
సచ్చరితముల వ్రాయ నేర్పు లేనివారు తామర
తంపర అయిన నేడు భాష ఎవరిది, సాహితీ సృష్టి
ఎవరికి; చదువులెవరివి? జ్ఞానము ఎవరికి?
**********
వృథా
భారతదేశమున ప్రజాస్వామ్యము కన్నా రాచరికం భాసించును. నేతలు, వారి పుత్ర, పుత్రికా రత్నములను నోరుమూసుకుని భరించు, ఎన్నుకొను వారికి ప్రజాస్వామ్య మేల?
ఆసేతుహిమాచలము పార్టీల నాయకుల పుత్ర, పుత్రికా రత్నములే పార్టీలను, ప్రభుత్వములను నడిపించు నేడు రాచరికమే సబబు. సిద్ధాంతములు కాక వ్యక్తి పూజతో ప్రభువులను ఎన్నుకొను ప్రజలకు ప్రజాస్వామ్యము కన్న రాచరికమే సరియైనది.
రాజ్యాంగము మార్చి రాచరికమును ప్రతి రాష్ట్రమునందు, కేంద్రమునను ప్రకటించిన వస్తు స్థితికి సరిపోవును. ఎన్నికలు వృథా ప్రయాస. ధనము, శక్తి యుక్తులు, కాలము వృథా.
*******

Monday, March 19, 2018

జీవితం - ఒక అవగాహన; స్త్రీ జనోద్ధరణ;మాకొద్దీ నల్లదొరతనాలు; Irking and inconvenient;

Being every thing to some one is duty in life.
********
జీవితం - ఒక అవగాహన
ఉద్యోగం పక్కన పెట్టి, జీవితానికి సంబంధించిన మిగతా విషయాల్లో యువతీయువకులు చాలా క్యాజువల్ గా, నిర్లక్ష్యం గా ఉంటున్నారు. ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బు జీవితంలో వచ్చే ఎన్నో వడిదుడుకులను తొలగించలేదు. మనుషులు కావాలి. మనం ప్రవర్తనతో, శ్రద్ధతో మనకు సాయం చేసే మనుషులను cultivate చేసికోవాలి. ఈ స్పృహ చాలా మంది లో లేదు. పెళ్లి పట్ల గౌరవం లేదు. పెళ్లి తమకోసం కాదని ఎవరికోసమో అన్నట్లు యువతీయువకులు చరిస్తున్నారు.
ఇప్పటికే రకరకాల వ్యామోహాలు, వ్యసనాలు, నిర్లక్ష్యాలు వివాహ వ్యవస్థను హాస్యాస్పదం చేస్తున్నాయి. ఈ అశ్రద్ధ ఇలాగే కొనసాగితే బాబాలు, స్వాములు, అమ్మలు, ఇతర ఆధ్యాత్మిక తోడేళ్ళు మరింత విజృంభిస్తాయి. బలహీనమైన మనసు కల మనిషి అందరికీ లోకువే.
మనం సరిగా ఆలోచించకుండా, ఉండకుండా, ప్రవర్తించకుండా మనకి జీవితంలో సుఖశాంతులు ఉండవు. వాళ్ళని, వీళ్ళని తిట్టుకుంటూ, మన దౌర్భాగ్యానికి వారినందరినీ బాధ్యులను చేస్తూ జీవితం గడుపుతాము.
************
పలుకు పలుకులో భాష యాస మారును
కులుకు కులుకులో రమణి సొగసు ఇనుమడించును
చినుకు చినుకు లో వాన చల్లదనం హాయి మనసును తాకును
వణుకు వణుకు లో శీతాకాలపు చలి అందగించును
తరుణి తరుణి లో అందములు వేరు
ఆనందములు పలు
తరువు తరువు లో పచ్చదనాలు వేరు
ఫలాలు వేరు
ప్రకృతిని ప్రకృతిని రామణీయకములెన్నో
కవి కవిలో రవి కూడా కాంచని కానుపులెన్నో
***********
చద్దిమూటలు

ప్రకటనలు అబద్ధములు
రాజకీయ నాయకుల మాటలు
హామీలు అబద్ధములు
వెండితెరపై జిలుగులు అబద్ధములు
దానిపై మనుషులు చిత్రమైన అబద్ధములు

కవుల వర్ణనలు అబద్ధములు
అలాగే ప్రేయసీప్రియుల కలలూనూ
మనకు కనిపించు మానసిక జగత్తు అబద్ధము
మన ఊహలు అపోహలు 
అర్థములు అపార్థములు
అబద్ధములు

అయినను అంతయు నిజమనుకొని
జీవించు మనము
అబద్ధమును ప్రేమించినంతగా 
నిజమున జీవించలేము

అబద్ధము నిజములు
పాలు నీళ్ళ వలె 
కలిసిపోయిన 
జీవన సంగరమున
మన విచక్షణయే
మనకు తోడు
పెద్దల మాటలే 
చద్దిమూటలు
**************
దొందుకు దొందే తెలుగు రాష్ట్రాల పాలకులు. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందిట. చూద్దాం.
ఆడలేక మద్దెల ఓటనడం, మన చేతకాని తనానికి ఇతరులను ఆడిపోసుకోవడం అధికారంలోకి తెస్తాయేమో కాని, ప్రజలకేమీ ఒరగబెట్టలేవు.
************
మాకొద్దీ నల్లదొరతనాలు
మాకొద్దీ నల్లదొరతనాలు
తెల్లదొరలను మించిన దొంగతనాలు
దోచుకొనుటయే పరమావధి
ఐదేళ్ళు మాత్రమే అవధి
అయిన కాడికి కూడబెట్టడాలు
తిమ్మిని బ్రహ్మిని చేసే ఆగడాలు
ఒకడిని చూసి ఒకడు బరితెగించి
దోచడాలు; ఎంత తిన్నా లేదు తృప్తి
వెనకాల మళ్ళీ కొడుకులు, కూతుళ్ళు
అల్లుళ్ళు, మనోళ్ళు; అంతా వారసత్వం
ప్రజాస్వామ్యమున వెనకేసుకొనుటయే
పాలన; ఆలనా పాలనా లేని ప్రజ
అరిచి గీ పెట్టినా పట్టించుకోని
కునాయకులు ప్రజాస్వామ్యమున రాజులు
మాకొద్దీ నల్లదొరతనాలు
తెల్లదొరలను మించిన దొంగతనాలు
***********
మనుషులకు మనుషులు బరువౌతున్న ఈ వేళ
కుటుంబాలు మనలేవు; అందరూ వీధులలో తిరుగాడవలసిందే; ఇల్లనేదే ఉండదు, ఊరట హుళక్కి; మాటాడుకుందుకు ఆత్మీయులు ఉండరు;
తోటి మనుషులను భరించి వారికి చేదోడు
వాదోడౌడం నేటి నాగరికత, సంస్కృతి, జీవనశైలి కావు; అంతయు మారిపోయినది; సుంతయు తమ వారికై సమయము కల్పించుకొనుటకు వీలు లేదాయె
ఎవరూ లేక, ఎవరికీ ఏమీ కాక ఏదో నాలుగు రాళ్లు
సంపాదించుటకు ప్రొద్దుట నుండి రాత్రి వరకు కంచి గరుడ సేవ చేయుట ఆనవాయితీ ఆయె; బతుకు లాయె; మనిషికి మనిషి ఏమీకాక ఎటుల బ్రతికెదము
***********
ఒక మామిడిలా వయసున ఒక లాగ, పండిన తరువాత మరొక విధంగా ఎలా ఉపయోగించాలి అని నేర్చుకుందామని నాకూ ప్రేరణ కలుగుతోంది.
***********
మైండ్ కృత్రిమం, అశాశ్వతం. సహజం గమనిక. గమనికలో విషయ అనుభవం కాని, విషయం కాని, సంభాషణ కాని, గ్రహణ కానీ లేక పోవడం మనసు సహజస్దితి. అప్పుడు దానిని నిర్మలమైన మనసు అంటారు. అప్పటి వ్యక్తి అనుభవం శాంతి. మౌనం. ఆనందం.
*************
Irking and inconvenient
In Facebook and other social websites and news websites it has become norm and fashion to put photograph of a highly sick infant, child or adult or aged and request for financial help. This is intruding into our sensitivity. And how far they are genuine is another matter.
This type of online exploitations, real or fake, are causing inconvenience to us and our cultured minds and sympathetic hearts are hurt. We cannot react to all appeals and help. So we feel guilty. Why such a situation is created for us in the name "charity"? And it is not etiquette to make us feel for which we have nothing to do.
**********
స్త్రీ జనోద్ధరణ-స్త్రీల సముద్ధరణ-స్త్రీలను బలోపేతులను చేయుట - 1
స్త్రీలను బలోపేతులను చేయడం ఇప్పుడు ప్రభుత్వాల, మేధావుల, ఎన్.జి.ఓ. ల ప్రథమ కర్తవ్యంగా మారింది. అన్ని ధోరణులు ఈ దిశనే చూపిస్తూ ఈ దిశగానే నడుస్తున్నాయి. నడిపిస్తున్నాయి.
ఎవరూ ఇందుకు విరుద్ధంగా మాట్లాడరాదు. ఎవరికైనా దీనికన్నా బాగా ఏమైనా అనిపించినా చెప్పరాదు. అసలు దీనికన్నా బాగైనది ఏముంటుంది? అమాయకత్వం గాని.
ఏదో డిగ్రీ సంపాదించి, ఒక ఉద్యోగంలో చేరి ఆర్థికంగా స్వంత కాళ్ళ మీద నిలబడడం స్త్రీలు బలోపేతులు అవడంగా ఇప్పుడు అందరూ నిర్ణయించుకున్నారు. నిర్ణయించే గారు. ఇదే స్త్రీ జనోద్ధరణ, స్త్రీ జన సముద్ధరణ అంటున్నారు. దీనికి అనుగుణంగా కాక ఏమి మాట్లాడినా మీద పడిపోతున్నారు. తిట్టిపోస్తున్నారు.
ఒక విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీ మైనారిటీ ని నొక్కి పారేసినట్టు నొక్కేస్తున్నారు. ఈ ధోరణికి విరుద్ధంగా మాట్లాడి ఏ రచయితా, కవి, వ్యాసకర్త బతికి బట్టకట్టలేడు.
మెజారిటీ చెప్పినది, నమ్మేది, ఎన్నుకునేది ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతుంది. వేరే ఇతరాన్ని
పొసగనీయరు. ప్రజాస్వామ్య నియంతృత్వం అంటే ఇదే. ఈ నియంతృత్వం దుర్లక్షణాలు నెమ్మదిగా చర్చించుకుందాం.
*********
చరిత్ర అనేది చదివి వదిలెయ్యడానికి కాదు. చెడ్డ పునరావృతం కాకుండా చూసుకోవడానికి.
***********
మోడీని దోషిగా నిలబెట్టి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీ పాలకులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా? వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారా? ఓటర్లు వారి నైజాన్ని గుర్తించి ఓట్లు వేయాల్సి ఉంటుంది. చూద్దాం, మనం ఏం చేస్తామో!
**********
India is different from Andhra Pradesh. Various regions in India have different caste, religion, community, region, religion and ideology affiliations. Accordingly we will act and react. Many of us do not know what a special status, special package, or central aid, state administration, administrator, and their inner equations and problems. TDP, YRCP and Congress coming together is really wonderful. Such people were together but couldn't prevent state's bifurcation. They cannot do better here. They created an election plank of accusing BJP for their misrule and inefficient administration. Let us see where this drama leads the state to
*********
The defeat of BJP candidates in the just now conducted by-polls seems to have energised TDP to confront and take on BJP. So it is becoming active and is desiring to come out of NDA and also support YCP sponsored no confidence motion on central government.
Sivasena and TDP are trying to save their faces and also to improve their prospects in the ensuing parliament elections to contest separately and escape incumbent tag and also to keep their vote bank in tact.
There is no other issue in their show of "defiance" to Modi.
Let us watch the drama.

Wednesday, March 14, 2018

మృత్యు కౌగిలి అదే ;ప్రముఖు శాస్త్రజ్ఞుల మరణం; పుస్తకములు; గోవిందుడు;

ధరించిన దుస్తులు ఏవైనా లోపలి శరీరము అదే
ఏం భాషను ప్రయోగించినా పలుకుల సారమదే;
మతమేదైనా కరుణలవే; మారణహోమములవే;
వేదాంతమేదైనా తత్త్వమదే; స్త్రీ పురుషులు ఎవరైనా 
శృంగారమదే; యవతీయువకులెవరైనా మన్మథుని
అల్లరి అదే; మానవులెవరైనా మృత్యు కౌగిలి అదే

**********
Parents in India does not want anything short of certificate which can get a job. And the schools must aim it the moment kid joins the school. To teach manners, etc,. Is not essential for them and is not on their radar of school education.
*********
ప్రముఖు శాస్త్రజ్ఞుల మరణం

ఒక సైంటిస్ట్ పోతే అందరికీ బాధే; వారు విజ్ఞాన శాస్త్రం చదువుకోక పోయినా;
ఆ శాస్త్ర వేత్త పరిశోధనలు, ఆవిష్కరణలు తెలియక పోయినా;
ప్రముఖు శాస్త్రజ్ఞుల మరణం అందరికీ వ్యథే
తమ తమ శాస్త్ర పరిచయాలు సున్నైనా!

పేరుని బట్టి నలుగురితో నారాయణా
తీరుని బట్టి "కులంతో" గోవిందా!
ఎన్నెన్నో సానుభూతి ప్రకటనలు
ఎందరెందరో దుఃఖభరితులు
***********
తల్లి వేసిన దుస్తులతో అందగిస్తుంది పసిపిల్ల; దుస్తుల గురించి, అందం గురించీ దానికేమీ తెలియదు. భగవంతుని కరుణతో అందగిస్తుంది మన జీవితం. మన కేమీ తెలియదు.
***********
పుస్తకములు 

పుస్తకములు చదవడం వల్ల మనసు చిలకబడుతుంది. మనోవికాసము కలుగుతుంది.
బుద్ధి పదునెక్కుతుంది. భాషా జ్ఞానం పెరుగుతుంది. భావ పరిపుష్టి కలుగుతుంది. ప్రపంచ జ్ఞానం కలుగుతుంది. కూపస్థ మండూక దశ దాటుతాం. మంచి కవిగా, రచయిత గా రాటుతేలతాం.
చదువు వల్ల రసజ్ఞత, సంస్కృతి, నాగరికతా మనకు అలవడుతుంది. మనం మనీషులం కాక పోయినా, మనుషులం అవుతాము. పుస్తక పఠనం సర్వ శ్రేయోదాయకం. తుష్టి, పుష్టి కరము. మానసిక ఆరోగ్యదాయకం.
**********
There are many faiths in the world. They aim at redeeming the lives of their respective followers. And all the religions are for the welfare of their followers only. The religious teachers will separate their faith people from other faith people for what reason, we do not know. Gods will laugh when they hear the religious teachers words that that faith preached by the teacher will redeem them and not any other faith. Knowingly or unknowingly they seed and allow to grow animosities among followers of various faiths. So are caste, community and ideology leaders.
All these fellows know how to destroy harmony among humans and are hurdles for emotional integration of individuals as human beings. Sad!
***********
గోవిందుడు
ఎన్ని ఏడులు‌ జీవించినను ఇంగితము కలుగక పోవచ్చును
ఎన్ని బడుల చేరినను అజ్ఞానము అటులనే ఉండవచ్చును
ఎన్ని వీడులు మారినను వాస్తుదోషం అటులనే అంటుకొని ఉండవచ్చును
ఎన్ని గాడులు తప్పినను జీవన పయనం సాఫీగా
సాగిపోవచ్చును
ఎన్ని సడులు సవ్వడులు చేసినను ప్రణయము ఫలించక పోవచ్చును
ఎన్ని సుడులు తిరిగినను మనసు ప్రశాంతతను
పొందవచ్చును
ఎన్ని మాడులు పగులకొట్టినను రాజకీయ నాయకులకు వెంట్రుక ఊడకపోవచ్చును
ఎన్నెన్ని తొడలు చరచినను బాహువుల కండరములు చూపినను కుస్తీలో ఓడిపోవచ్చును
ఎన్ని ఏడుపులు ఏడిచినను పౌరుల జీవితములు
అటులనే కొండెక్కి పోవచ్చును
అన్ని ఎడదల వసించియున్న గోవిందుడు మాత్రము తప్పక తరింపజేయును
***********
Politicians are a special class with so many facilities, advantages and pampering.
*********
వసంతం బయట కాక భావుకుల మనసులో ఉంటుంది.

Monday, March 12, 2018

స్మార్ట్ ఫోన్; South-North Divide; Hurt Ego; ప్రేమ; BJP in Andhra; కావ్య రచన; ఆధ్యాత్మిక చింతన; ఆత్మ శక్తి - జగత్; Pad

జీవన కళ
నిజంతో నిమిత్తం లేకుండా మనము ఊహల్లో బ్రతుకుతాము.
ఊహవల్లే మనకు సుఖదుఃఖాలు కలుగుతాయి.
ఊహించేది మనసే. తలపుల లేక భావముల వరుసే మనసు.
నిజంతో నిమిత్తం లేకుండా ఊహ వల్ల కలిగే తలపులు అసత్యములు. అబద్ధాలు. ఈ అబద్ధాల మీద ఆధారపడే మన జీవితం సాగుతుంది. అపార్థాలు, ఊహలు ఆకర్షించినట్టుగా మనసును నిజం ఆకర్షించలేదు.
ఊహల ఉయ్యాల అయిన మనసు స్ఫూర్తికి, స్ఫురణకు వ్యతిరేకి. మనసున మల్లెల మాలలూ ఊగవచ్చు, తీరని, తీయని, తీపి వ్యథలూ మాగవచ్చు.
రాగము, అనురాగము కలిగించే మనసే వేదన, బాధ కలిగిస్తుంది. నేను, నాది అనే భావములు, ఆ అహంకార మమకారములు ఆనందంతో పాటు, ఏదైనా అనుకున్నట్లు జరగకపోతే దుఃఖాన్ని, బాధను కలిగిస్తాయి.
మనశ్శాంతికి తలపుల రణగొణ ధ్వని తగ్గాలి. మనసు నిండుకోవాలి. మనసంతా నైర్మల్యము నిండి ఉండాలి. పరిపూర్ణమైన మనసే శాంతి. ఆనందము. మౌనము. అనవసరమైన తలపులు కలగకుండా, రాకుండా చూసుకోవడమే The Art of Living. జీవన కళ. జీవించే కళ.
*********
స్మార్ట్ ఫోన్
పొద్దున్నే లేవగానే స్మార్ట్ ఫోన్ ను పరామర్శింపవలె;
అది తెచ్చిన సందేశములతో అలరవలె;
దంతధావనం, మిగతా కార్యక్రమములు తరువాత
ఆపై లంఘింపవలె దినపత్రికలపై, టెలివిజన్ ఛానెల్స్ పై; ఇది అంతయు ప్రభాత కార్యక్రమము మనందరకు
ఉద్యోగములకు వెళ్ళనక్కర లేనివారు సమయమంతా స్మార్ట్ ఫోన్ తోనే గడిపెదరు
ఉద్యోగములకు వెళ్ళిన వారు స్మార్ట్ ఫోన్ తో అలరుచు మధ్యమధ్యలో ఉద్యోగవిధి నిర్వహింతురు
జీవితము పట్ల నిబద్ధత కలవారు సమయము
తమ తమ ప్రియ కార్యక్రమములలో గడిపెదరు
కాని స్మార్ట్ ఫోన్ ముట్టుకోని నాగరీకులు లేరు
వారు పయనించని అంతర్జాల విషయ వాహనములు లేవు; మెదడు నిండా ఈ ఘోషే
నిశ్శబ్దము, మౌనములలోని మానసికారోగ్యము
అనుభవించు వారే లేరు; ఏది నాగరికత, ఏది సంస్కృతి అని విచారించిన స్మార్ట్ ఫోన్ లతో
గడుపుటయే అని సమాధానమీయవచ్చు; కుదురుకున్న మనసులే లేవు; కుదురు నేర్చిన
హృదయములే కరువాయె; నిజ జీవితమున
వడి దుడుకులకు తోడు ప్రపంచంలోని వడి
దుడుకులన్నిటినీ స్వంతము చేసికొని వగచు,
దిగులుచెందు మనకు శాంతి ఏది, సౌఖ్యములేవి
*********
స్నానము చేయడం వల్ల శరీరం శుభ్రపడి శుచిగా ఉంటుంది. భగవద్దర్శనము, భగవద్ధ్యానముల వలన మవసు శుభ్రపడి, పునీతమౌతుంది. నిర్మలమై శాంతానందములు నిండి ఉండగా మౌనియై, మానసిక కార్యకలాపముల విరమణ ‌వలన రామమై అలరారుతుంది. రామబ్రహ్మము, ఆత్మారామము అవుతుంది.
*********
South-North Divide
South-North or Dravidian-Aryan divide - Dreams of southern regional parties' political leaders to consolidate position and power
here i a rumor that political leaders of South India belonging various regional parties are thinking of forming a front against center after observing the BJP hawa in north-eastern India. Actually they want to from a 'Dravidian" front of south India. The political leaders out of fear of losing power, if at all, are not worried in dividing Indian citizens on another plank - north-south, in addition to the dangerous divisions we are already having in the name of caste, community, region, religion, ideology, urban, rural, etc,. The leaders can be panicky. But are the citizens are also desiring a south-north divide?
The irresponsibility of these regional leaders who already acquired power by dividing citizens on region basis will reach peak if their voters side them.
And is there a leader having potential enough to divide citizens on north-south lines? Let us see. In a democracy anything can happen if the voters desire.

**********
In every wo-man there is man.
*********
In India third front has many births and deaths. But present statements are unpatriotic - because of their north-south divide posture - and in a way naive too. Hatred and dislike for something or some person will not make you succeed. You should have your own positive philosophy and commonsense.
********
పుస్తకం హృదయభూషణమ్; హృదయభాషణమ్ అపి !
**********
ఒక పబ్లిషర్ ఒకసారి అన్నాడు: మీకు కావలసినది మీరు రాసి పాఠకులని చదవమంటే వాళ్ళు చదవరు. వాళ్లకు కావలసినది రాస్తే చదువుతారు.
*********
When people around you are not capable of acknowledging your talent, do not be discouraged. Work hard and make them attentive to your achievements.
********
We identify ourselves with the statements we make, the actions we undertake, ideas we express, the feelings we share, the thoughts we entertain, the likes and dislikes we form, the spiritual Guru we follow, the, individuals we admire and adore, the causes we fight for; in a nutshell with the individual we are.
Any criticism of any of these will offend and hurt us and we react violently as if we are abused. Such is the power of ego.
**********
మనం ఎంత చెప్పినా హీరో ముందు దర్శకుడు నిలవలేడు. ఇదంతే. జనాలకు హీరోయే ఆనతాడు. దర్శకుడు లేక హీరో లేడు. కాని అంతే. పునాది లేక భవంతి లేదు. కాని భవంతి ఆనుతుంది. పునాదులు అనవు. భవంతినే అందరు శ్లాఘిస్తారు. పునాదుల గురించి ఎవరూ మాట్లాడరు. వాల్మీకి, వ్యాసులు లేక శ్రీరామ, శ్రీకృష్ణులు లేరు. కాని రామకృష్ణులను తలుచుకున్నట్టు వారిని తలుచుకోరు. సృష్టి ఎప్పుడూ స్రష్టను అధిగమిస్తుంది. మరిపిస్తుంది.
**********
We can know about many things but need not necessarily make them our own. Our objectivity will not get affected. Also we should have an open mind. Anything about anything is not final. So we should be open. And if necessary we may have to change our "established" opinions depending on realities and truth put before us.
**********
 ప్రేమ
అవును ప్రేమ బంధం, కాని ఇష్టమైన అనుబంధం, అనుభవం. హృదయం కోల్పోకపోతే స్వేచ్ఛ ఉంటుంది కాని అనుబంధం ఉండదు. ఏ బంధం, అనుబంధం ఇద్దరి మీద ఆధారపడి ఉంటాయి.

మనం కూడా కాస్త అహంకారం తో ప్రవర్తించామో బంధం సడలుతుంది. ప్రేమలో నిజంగా పడితే వ్యక్తిత్వాలు కనుమరుగు అవుతాయి. ప్రేమలో లీనం అయిపోతాయి. స్వేచ్ఛ మాటలో వ్యక్తిత్వం ఉన్నట్టు అనిపిస్తుంది. వ్యక్తిత్వం మిగిలి ఉంటే ప్రేమ పండదు.
రెండుగా ఉంటే ప్రేమించడం, నమ్మడం. ఒకటై ఒకటిగా ఉన్నప్పుడు కేవలం ఆనందం. మరేమీ ఉండదు.
If light is white, it is snow, jasmine, moonlight and your heart.
Is writing love poetry improperly viewing fair sex ?
*************
If no fruits are there what is the use of roots?
********
అందరూ దొంగలే ఊళ్ళు పంచుకు దోచుకుందుకు
దోపిడీ సొమ్మును పంచుకొనెదరందరు తరతమ
ప్రభుత్వ ప్రతిపక్ష భేదము లేక; అందిన వానికి పాయసము
అందని వానికి ఏడుపు; ప్రజలకు మాత్రము ఎప్పుడూ ఏడుపే!
**********
ఆత్మ శక్తి - జగత్
శిల్పంగా మారినా అందులోని రాయి ఎక్కడికీ పోదు
వడ్డాణమైనా అందులోని బంగారం మెరుస్తూ, ఉంటుంది; బట్టగా తయారైనా అందులోని పత్తి
అందులోనే ఉంటుంది; కుండగా అయినా అందులో
మట్టి అలానే ఉంటుంది; జగత్ గా మారినా
అందులో ఆత్మశక్తి చిద్రూపంగా భాసిస్తూనే, ఉంటుంది
నమ్మకమే బలం. నమ్మకమే దైవం. నమ్మకమే మతం.
********
ఆధ్యాత్మిక చింతన
ఆధ్యాత్మిక చింతన, జీవితము మనిషి మనిషికీ వేరు. ఏ ఇద్దరికీ ఒకే దారి ఉండదు. గుంపు అందరికీ ఒకే దారి అనడం, చూపడం తత్త్వం అర్థం అవలేదని. తత్త్వం పై అవగాహన లేదని.
మూకుమ్మడి ఆధ్యాత్మికత మనల్ని మోసం చేయడమే.
మనస్తత్వ వైద్యులు ప్రతి రోగిని ప్రత్యేకంగా చూస్తారు. అందరు రోగులకూ ఒకే మందు ఉండదు. రోగి రోగికీ లక్షణాలు వేరు, వైద్యం వేరు. మందులు వేరు.రమణ మహర్షి సందేశం ఇది.
************
BJP must not align with any of the regional parties even though it may get zero seats. That is the only way to grow in Andhra Pradesh.
The efficient organization of BJP secured red bastion Tripura. Even they fail in ensuing election, can come out of regional parties' hegemony and can correct the blunder committed in 1983.
The caste-infested Andhra Pradesh political scene will have some reprieve from false promises and businessmen coterie. It is a well-known fact that Andhra Pradesh people's representatives have only self interest in mind to improve their riches at the cost of citizens' welfare and well-being.
BJP must fight the elections alone. Who knows, AP people may bring Tripura like outcome.
*********
కావ్య రచన
కావ్య రచన ఆషామాషీ కాదు. "నానృషిః కురుతే కావ్యమ్" అనేది అందరకు పరిచయమైన వాక్యమే.
కవులు తామరతంపరగా‌ ఉన్న నేడు ఏది కవిత? ఏది కావ్యము? ఏది పాఠకులకు‌ ఉపయోపడేది? పాఠకులకు ఉపయోగపడకుండా కవికి‌ మాత్రమే‌ పేరు ప్రతిష్టలు తెచ్చే కవనాలు వెలయించడమే ఇప్పుడు సాంప్రదాయ మైంది. ఏదో‌ సిద్ధాంతాన్నో, వాదాన్నో అంటకాగి వాటిపై కవితలు రాయడం రివాజయింది. విమర్శకులూ వర్గములుగా విడిపోయి, అభినందించడమో, అభిశంసించడమో చేస్తున్నారు. ఎవరికీ నిబద్ధత లేదు. కవితను అధ్యయనము చేసి, అవగాహనతో ఎందరో విమర్శకులు విమర్శ‌ చేయడంలేదు. తమ ఇష్టాయిష్టముల ఆధారంగా‌ కవిని ఆకాశానికి ఎత్తెయ్యడం లేదా తీసిపారేయడం మాత్రమే విమర్శ అయిపోయింది.
కవయో నిరంకుశః!
వాక్యమ్ రసాత్మకమ్ కావ్యమ్!
************
అమ్మవారి వాహనం సింహం. ఈశ్వరునిది ఎద్దు. సింహానికి ఎద్దు లోకువే కదా.
అమ్మవారు పట్టుచీరలు ధరిస్తారు. పరమేశ్వరుడు గజచర్మ ధారి.
అమ్మవారు సకల భూషణములను ధరిస్తారు. శివుడు భస్మాంగుడు.
అమ్మవారు హిమగిరి తనయ. బంగారు పర్వతం యొక్క ముద్దుల కూచి. శంభుడు శ్మశాన వాసి.
అమ్మవారు సకలైశ్వర్యప్రదాత్రి. సదాశివుడు ఆదిభిక్షువు.
అమ్మవారు గౌరాంగి. శ్యామల కూడా! చంద్రశేఖరుడు వెన్నెల వంటి ధవళ దేహుడు. మంచు, మల్లె పూవుల వర్ణము వాడు.
అమ్మవారు తపస్విని. శంకరుడు జ్ఞాన ప్రదాత.
నమశ్శివాభ్యాం నవయవ్వనాభ్యాం
పరస్పరాశ్లిష్ట వపుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా
వృషకేతనాభ్యాం నమో నమశ్శంకర పార్వతీభ్యాః
*********
Indian literary scene is being dominated by feminist, dalit and women empowerment literature in quantity. The quality of literature is of course not to the mark as this kind of literature is biased and also abusive in content. It is highly self-centered instead of depicting self-esteem.
*********
Undertaking charity and donating for charitable activities are ancient Indian way of practicing socialism.
*******
Pad
కొంత కాలం క్రితం వరకు తల్లి, కూతురు మధ్య మాత్రమే ఉండే మాటలు, వ్యవహారం ఇప్పుడు అందరికీ టముకు వేయడంలా మారింది. ఎందుకిలా? దీని మీదా ధనం, పేరు ప్రతిష్టలు సంపాదించు కోవాలా? ప్రకృతిని ఇంత కళావిహీనంగా మార్చాలా?
సినిమాలు తీసి హడావుడి చెయ్యాలా? పత్రికల్లో, టివిల్లో, ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా చర్చించాలా? చదవక ముందు కాకరకాయ అని, చదివేక కీకరకాయ అన్నట్లు, ఆధునికం అయ్యే కొద్దీ ఇంగితం తగ్గిపోతోంది.
దేనిని బహిరంగంగా చర్చించాలి, దేనిని ఇళ్ళల్లోనే మాట్లాడుకోవాలి తెలియనంత వేలం వెఱ్ఱి లోకి ఎదిగాము. అన్ని విషయాలు బహిరంగంగా చర్చించరాదు. జుగుప్సాకరంగా ఉంటుంది.
********
The statues of Lenin, Periyar, Syam Prasad Mukherjee, Mahatma Gandhi etc,,. individuals are being vandalized in India. In Tamilnadu some Brahmin's sacred threads were cut off.
But all modern intellectuals, media, self-styled rationalists all attacking only the vandalism against Lenin statue. Why so?
Earlier Buddha statue in Afghanistan, many temples in Kashmir have been vandalized and destroyed. But none of above said anything in relation to these vandalism. Why so?
*********
The women being felicitated by governments on Women's Day are all from elite sections of society. Is this Women's Day or Elite Women's Day or Celebrity Women's Day?
*******

Saturday, March 3, 2018

అంతా భ్రాంతి; నేర ప్రవ్రుత్తి; అలరించే తాకిడులు; Sridevi and Jayendra Saraswati;"Intellectual" Indians

అంతా భ్రాంతి
సినిమా వాళ్ళు చెబితే గాని
మన పిల్లలు మంచి మాటలు వినరా?!
ఓ కుఱ్ఱ (మధ్య వయసు హీరో) సైబర్ సెక్స్ క్రైమ్ ల
గురించి చెప్పడం విన్నాను; మాదక ద్రవ్యాలు సేవించ
వద్దని ఒక హీరో, తాగి వాహనాలు నడపవద్దని మరొక హీరో; ఇలా అన్ని సూక్తులు సినిమా వాళ్ళ
చేతనే వల్లింప చేస్తున్నారు మన నాయకులు
ప్రకటన కర్తలు; ఏమిటో మనం? మన పిల్లల ఇమేజ్
ఇలా దెబ్బ తినడం శోచనీయం; ఉపాధ్యాయులో
సంఘంలో వృత్తి పరంగా, నడవడిలో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న సత్పురుషులో, మేధావులో ఈ పనికి
పనికి రావడంలేదు; ఈ సినిమా ప్రభావం ఎంత
గాఢంగా ఉన్నది మనపై??!!
వినోదము, వికాసము సినిమా
వారికే చేతనవునని ఎంత భ్రమ
మనకు? ప్రకటన కర్తలకు, ప్రభుత్వాలకు
ఈ సూక్తులను మనం విద్యాలయములలో
నేర్పడం లేదు; చేతులు కాలాక ఆకులు
పట్టుకున్నట్టు ఉంది మన వ్యవహారం, ధోరణి;
తల్లిదండ్రులకు తెలియనిది ఈ నటీనటులకు
తెలుసా? అంతా వింత తరచి చూచిన; మన
వ్యక్తిత్వములే సమర్పించితిమి మిథ్యా చలన
చిత్ర నటీనటులకు; ఏ మంచి చెప్పాలన్నా వారే;
వారి నిజజీవితాలు మాత్రం కాదు ఆదర్శవంతమైనవి
ఏదో జీవిస్తారు; ఏవేవో చేస్తారు; తాగుతారు తందనా
లాడుతారు; తాగి వాహనాలు నడుపుతారు; మాదక
ద్రవ్యముల సేవిస్తారు; సరియైన స్త్రీ పురుషు సంబంధములు నెఱపని వీరందరూ మనకు
నీతి పాఠాలు చెప్పువారు; ఇంతకు మించిన
వెఱ్ఱి తనాలుంటాయా ఎక్కడైనా? అంతా భ్రాంతి

*************
నేర ప్రవ్రుత్తి 
సంఘంలోని అన్నిరకాల మనుషులకు ఏది మంచి, ఏది చెడ్డ, ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు, అనేవాటి మీద పూర్తియైన పరిజ్ఞానం ఉంది. అయినా ఎందరో చెడ్డగా, ఇతరులను దోచుకుంటూ, బాధిస్తూ, అన్నిరకముల నేరములను నిర్భయంగా చేయడానికి కారణం ప్రభుత్వ, పోలీసుల అసమర్ధత; నేరములు చేస్తూ, నేరస్థుల కొమ్ము కాసే రాజకీయ నాయకుల వల్లా.
ప్రజాస్వామ్యాన్ని ఇంతలా భ్రష్టుపట్టించే రాజకీయ పార్టీలు, వాటి స్వార్ధ, దేశభక్తిరహిత ప్రవర్తనలే కారణం. ప్రజలూ కులం, మతం, ప్రాంతం, సిద్ధాంతం పేర్లతో ఈ నాయకులకు వత్తాసు పలకడం అగ్నికి వాయువు తోడైనట్టు అయింది.
*********
దేవుణ్ణి వాడుకుందామనుకునే వారే తప్ప భగవంతుణ్ణి పూజిద్దామనుకునే
వారు, పూజించుకుందామనుకునే వారే తక్కువ.
**********
అలరించే తాకిడులు
ముసలివాళ్ళు జ్ఞాపకాలలో
పడుచువాళ్ళు పరస్పర స్పర్శలో
పులకింతురు ఆనందింతురు
జగమున; పరవశము చివరకు
మనసుదే; హృదయాహ్లాదము
ఇంద్రియముల ద్వారా, ప్రియుల
మనసు ద్వారా అందును; స్మృతియూ
అందగించును లోలోపల; ఇంద్రియ
హృదయస్పర్శలు మనుషులకు
అందం ఆనందం; అలరించే తాకిడులు
*********
Beauty is in variety; so is beholding.
********
Sridevi and Jayendra Saraswati

Whether it is Sridevi
Or, Jayendra Saraswati,
All have to leave this mortal coil

And make it inert
Reactions following the deaths
Are the reflection
Of tastes of individuals;
The bodies may be burnt
Or laid to rest in deep pits
On which tombs may be constructed
Are all subsumed by nature
Life is temporary
And death is certain
For Sridevi or Jayendra Saraswati
Knowing all this, still we grieve
Or do not care for deaths;
It is our relation to the dead
That makes us sad and grief
Fills our heart; else death, such
An inevitable phenomenon
Is of no concern for us
We grieve in relation to our
Culture, civilization and craziness
Exhibit it enormously
Death is a great leveler
After the play the pawn
And the king are put back
In the same box
********
Corrupt Indians in connivance with like-minded people are making governments and governance dance to their tunes and governments are helplessly watching the situation. An auditor, a fraudulent corporate and businessman are able to show Indian banking system in poor light and made it a laughing stock. The scene of governments bowing to these fraudulent elements is unbearable to witness.
**********
Time is a sense, not a physical reality; but depends on physical activity for its "being". Sans an activity time does not exist.
*******
"Intellectual" Indians

India is the only country in the world inhabited by citizens who mock nationalism, laugh at patriotic fervour and want to equate themselves with individuals of "dispassion" towards their own country and embrace isms detrimental to Indian ethos and idea of integrated India. Their idea of India appears laughable, indiscreet, unsophisticated, loveless to the patriots of India.
Only in India you have individuals with affiliations that degrade their own nation; and these citizens do not care and mind for their lack of love for mother land and feel they are intellectuals for having such disrespect and dishonour; and also dictate that all other citizens must follow them and their borrowed and imported silly ideologies. What a clumsiness and unsound mentality are ruling these "intellectual" Indians!!!!???
Such these intellectuals do all this also to express their venom against elected and constitutionally formed government. Their idea of democracy seems to be formation of government which though not support; allows their hatred for ideas of sophistication, culture, time-tested Indian wisdom and nationalism steeped in ancient Indian ideas and knowledge; to be propagated and "preached".
Present government is not India. It is merely governing India through its perception. It is impossible and not obligatory for present government to implement the agenda dictated by these self-styled intellectuals and mindless baiters of anything ancient Indian. These intellectuals are free to spread their isms among citizens, influence them and get elected and form governments to implement their skewed ideologies. They are incapable of that. But want to be heard and followed by citizens through their utterances in news media of all kinds. What a greed!?
And India is more and great than mere present government. Idea of India and India are dear to most of the Indians. Most of Indians are secular through centuries, through onslaughts of all hues and are experts in respecting and allowing various outlooks and perceptions of God, religion, social structure, all civilisations, cultures, knowledge, skills, philosophies and wisdom to thrive on this accommodating and absorbing holy and understanding land. India never encouraged narrow-minded ideas or views and shunned such thought-systems unapologetically and courageously.
The spirit of India is tolerance, accommodation, understanding and wisdom with sharp intellect and compassionate heart. Indian literature, fine-arts, thought-systems, culture, civilisation are all reflections of this great tradition. Present narrow-minded intellectuals with borrowed and clumsy ideas and cultures are not fit to be compared with the battery of intellectuals, scholars, seers, philosophers, spiritual teachers and humane human beings who have defined, initiated and built and spread the cultural and spiritual India of India international acclaim and admiration.
India is famous for phrases like:
वसुधैवकुटुम्बकम्।
सर्वे जनाः सिॉखिनो भवन्तु।
आ नो भद्राः क्रतवोयन्तु विश्वतः।
असतो मा सद्गमयः।
तमसो मा ज्योतिर्गमयः।
मृत्योर्मा अमृतं गमयः।
*********
Vice is vice. Sense of "fashion" and "boldness" won't allow the users to listen. Sense of "achievement" further encourages the teenagers, youth and old alike to become used to vices.

Thursday, February 22, 2018

అష్టమ వ్యసనము; Love; గతం-వర్తమానం-భవిష్యత్తు; Connivance?; ధన-మాన-ప్రాణ-ఓట్లు;

అష్టమ వ్యసనము

పేపర్లు చదివిన బ్లడ్ ప్రెషర్ పెరుగును;
వార్తా ఛానెల్స్ చూచిన మనసు పోవును 
అయోమయంలోకి; న్యూస్ వెబ్ సైట్లు పంచును
గాలి వార్తలు; జగమంతా వార్తలమయం

మన బ్రతుకే ఈ వార్తల నేపథ్యంలో
సతమతమయ్యే వేదనల వాదనల
నిరాశామయం; మనసును గందరగోళ
పరుస్తూ మనశ్శాంతిని హరించే వార్తల పట్ల
ఎందుకో మనకీ మక్కువ; వార్తా పఠనము
వార్తా వీక్షణలు అష్టమ వ్యసనము కాదు కదా!
***********
Love is sublime and eternal; transcending age, color, creed, sex or any social divisions.
**********
గతం-వర్తమానం-భవిష్యత్తు

మనందరం గతం, భవిష్యత్తు లలో జీవించినట్టుగా, జీవించినంత సేపు వర్తమానంలో జీవించం.
వర్తమానం గమనికకు సంబంధించినది. గతము, భవిష్యత్తు తలపులకు సంబంధించినవి. నిజానికి తలపుల రూపంలో తప్ప గతం, భవి‌ష్యత్ లకు ఉనికి లేదు. గతము, భవిష్యత్ కల మానసిక స్థితికి సంబంధించినవి. మానసికము మాత్రమే.
వర్తమానము అలా కాదు. అప్పుడు మనం ప్రస్తుతం ఏం జరుగుతోందో గమనిస్తూ తదనుగుణంగా మానసిక, శారీరక కార్యకలాపాలు నిర్వహిస్తాము.
కల మానసిక స్థితి మాత్రమే అయిన గతం, భవిష్యత్తు లలో జీవించడం అనారోగ్యంకరం. వర్తమానంలో జీవించడం, జీవించగలగడం వరం. మన ప్రయత్నంతో మాత్రమే వర్తమానంలో జీవించగలం. లేకపోతే తలపుల రూపమైన గతం, లేదా భవిష్యత్తుల్లోకి జారిపోతాం.
తస్మాత్ జాగ్రత!
*********
Connivance?

A business man is never punished for any fraud
So so are the politician and bureaucrat; are safe 
enjoying lenience from governments
For any financial or administrative crime
Is this inability to govern
Or connivance?
Is this incapability to identify
Or disinterested?
Money is being looted
By highly connected;
By defaulting huge loans
Are roaming abroad celebrity
Criminals; are making
Fun of Indian banking system
And are celebrating political sagacity for the connivance
***********
Bank frauds - Collusion among staff and scheming business men
The negligence and corruption among bank staff and colluding with business men for some alms from the business men is really saddening. And finance minister asking the business bigwigs who take loans to be honest in repayment is still wonderful. And trust-deficit among business men is not expected is still paining. Not implementing available security processes is still more criminal. But depositors being asked to take care of bad loans is still more appalling. And is appealing to business men to cheat further. The way things are unfolding, there should be many more frauds like these. The banks must be holding them up and reveal at "appropriate" time.
**********
ధన-మాన-ప్రాణ-ఓట్లు 

మనందరం ఒకటే అని పౌరులు అనుకోవడానికి 
భారతదేశంలో కులాలు ఒకటైనవారికి భాష అడ్డుతుంది;
భాష ఒకటైన వారికి కులాలు అడ్డుతాయి; ప్రాంతాలు
అడ్డుతాయి; ప్రాంతాలు ఒకటైన వారికి మతాలు అడ్డుతాయి; మతాలు ఒకటైన వారికి కులాలు, ప్రాంతాలు అడ్డుతాయి; ప్రాంతాలు ఒకటైన వారికి సిద్ధాంతాలు అడ్డుతాయి; సిద్ధాంతాలు ఒకటైన వారికి
ఎడమ, మరింత ఎడమ అంటూ ఎడాలు అడ్డుతాయి; మతాలు ఒక్కటైనా సంస్కృతి అడ్డుతుంది; సంస్కృతి ఒక్కటైన వారికి సాంప్రదాయం అడ్డుతుంది; వెరసి భారతీయులు
అడ్డుగోడల మధ్య విడి విడిగా రాజకీయ నాయకుల
కోసం జీవిస్తారు; ధన-మాన-ప్రాణ-ఓట్లను అర్పిస్తారు
**********

Tuesday, February 20, 2018

Silence; జీవితములు; జయంతులు, వర్ధంతులు; Disposable Writings

Atman/Brahman is silent melody. Peace is melodious silence. Bliss is silent serenity. Silence is blissful peace.
********
జీవితములు

రహదారులపై ప్రయాణములు కాదు ఏ జీవితములు
ముళ్ళడొంకల దారుల శుభ్రము చేసికొని ముందుకు సాగవలె
దైవము, తల్లి తండ్రులు, ప్రాణ స్నేహితులు తప్ప ఎవరు తోడురారు
ప్రభుత్వాలు నాయకులు ఇతరులు తప్పుడు మార్గ నిర్దేశనమున దిట్టలు
వారినుంచి జాగ్రత్త పడుచు ఈడ్వ వలె బతుకు బండిని
ధైర్యము సంయమనము ఇంగితము తోడుగా పయనింపవలె కడ దాకా!

*********
జయంతులు, వర్ధంతులు

రోజూ సినిమా వాళ్ళకో, రాజకీయ నాయకులకో, ప్రసిద్ధులైన వ్యక్తులకో , ఇంకెవరికో పుట్టినరోజో, మరణించిన రోజో అవుతుంది. ఫేస్బుక్లో ఇవన్నీ కొందరు లిస్ట్ చేస్తారు. వాటి మీద ఎన్నో పోస్టులు.
అలా సెలిబ్రిటీల జననమరణముల పోస్ట్ చేయడాన్ని కొందరు ఒక రైట్యువల్ లాగా కొనసాగిస్తూ ఉంటారు. ఈ అభిమానాలో, గాఢ వార్తాసక్తులో, వీటిపై ఎందరికో ఇతరులకు ఏ విధమైన ఆసక్తి ఉండదు. అయినా రోజూ ఇలా పుట్టడమో, మరణించడమో గురించి చదవాలి.
సామాజిక మాధ్యమాల్లో ఉండాలంటే ఈ జయంతులు, వర్ధంతులు మనం కూడా "జరుపు కోవాలి".
***********
భారతదేశము - పేదరికము

పేదరికము ఏ సంఘంలోనైనా, దేశంలోనైనా ఎందుకు ఉంటుంది?

ఎవరికీ తెలియదు. బూర్జువా సంస్కృతి వల్ల అని ఈ మధ్య మార్క్స్ అన్నాడు. పేదరికం అన్ని దేశాల్లోనూ, సంఘాల్లోనూ ఉంది. భారతదేశంలో పేదరికానికి ఒక వర్గాన్ని బాధ్యులుగా చేస్తూ భారతదేశపు నవీన మేధావులు రాత్రి, పగలు అల్లరి, గొడవ చేస్తూంటారు.

భారతదేశపు నిమ్న, దళిత, పేద ప్రజలకు ఎన్నో హామీలు కురిపిస్తూ, అమలు పరచవలసిన అవసరం లేకుండా ఎందరో రాజకీయ నాయకులు, పాలకులు స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో దశాబ్దాలు గడిపేశారు. ఏమీ చేయకుండా హామీలతోనే ఎన్నో శతాబ్దాలు గడిపేశాలా నాయకులు వ్యూహాలు రచించుకుంటున్నారు. ఆ వ్యూహాలలో ముఖ్యమైనది అనువంశిక పార్టీ పాలన. దానిద్వారా రాష్ట్ర, దేశ పాలన ఏ విధమైన జవాబుదారీ లేకుండా తరాలు లాగించెయ్యాలని ఆయా పార్టీల అధినాయకుల కోరిక.

అధికార బలుపుతో అన్ని ఆర్ధిక వనరులను తాము, తమ సన్నిహితులు కబ్జా చేసి ఓటర్లను బిచ్చగాళ్ల గా లెక్క కట్టి ఏదో తృణమో, పణమో పారేసి ఓట్లు కొనడం, లేదా పేదరికము సాకుగా తమ కుల గజ్జితో ఓట్లడగడం, ఓటర్లూ ఆమోదించడం, పేదరికాన్ని ఏమీ పారదోలడం లేదు. ఆయా కులాల నాయకులు అడ్డంగా సంపాదించుకొని విర్రవీగుతున్నారు. పొగరమోత్తనాలు చూపుతున్నారు. పేదరికం అలాగే విరాజిల్లుతోంది. పేదరికానికి ఒక వర్గాన్ని నిందించడం, సంఘంలోని అన్ని ఛిద్రాలకు బాధ్యులని చేస్తూ రోజూ రోడ్డెక్కడం నిరంతరంగా సాగుతూనే ఉంది. సామాజిక న్యాయం జరగడం లేదనే అరుపులు, గొడవలు, గోలలూ అలాగే వర్ధిల్లుతూనే ఉన్నాయి.

ప్రపంచంలో మరే సంఘంలోనూ, దేశంలోనూ ఇలా భారతదేశంలోలా అనవసరంగా నిందకు గురయ్యే వర్గం లేదు. కానీ అక్కడా పేదరికం ఉంది. భారతదేశంలో ఉన్న అన్ని ఛిద్రాలూ, చిత్రాలూ ఉన్నాయి. మరి భారతదేశపు పేదరికానికి, అన్ని ఛిద్రాలకీ ఒక వర్గాన్నే నిందించడం వెనుక స్వార్థ శక్తులు ఎంత కుట్ర పన్నతున్నాయో విశదమౌతోంది.

ఏ దేశంలో నైనా, ఏ సంఘంలోనైనా ఏ పాలకులు, నాయకులు పేదరికం లేకుండా చేయలేరు. ప్రజల్ని మభ్యపెట్టి, ఎందరో నాయకులు, మేధావులు లబ్ధి పొందడం తప్ప మరేమీ ఒరగదు.

గరీబీ హటావో అనేది చాలా శక్తివంతమైన నినాదము. ఆ నినాదాన్ని పూరించి ఒక గాంధీ 17 ఏళ్ళు దేశాన్ని ఇష్టం వచ్చినట్లు పాలించారు. ప్రజలూ అన్నేళ్ళూ ఆ నినాదానికి ఆకర్షితులై ఆ గాంధీకి వరుసగా పట్టం కట్టారు. ఇంత జరిగీ పేదరికం ఎక్కడికీ పోలేదు. తరువాత వచ్చిన అందరు నాయకులూ ఇంకా గరీబీ హటావో నినాదాన్ని పూరిస్తూనే ఉన్నారు. ఈ నినాదాలకి ఏ పేదరికమూ, ఛిద్రాలూ, చిత్రాలూ ఎక్కడికీ పోవనీ, మన్ని అంటుకుని ఉంటూనే ఉంటాయి అనీ ఋజువైంది
********
Disposable Writings
We find many writings daily
Including ours; but how many
Are read? Fed up, many readers
Not even glance through most;
Disposable Writings are they giving
Pleasure only to the creator; neither fellow Writers nor critics care for these creations;
Still why so many works get poured and
Writers, poets, fiction-writers, novelists
Continue creating? Is it a compulsive "disorder", That engulfs the literary creators? May be
Order and disorder continue following each
Other for Eternity; meanwhile languages are
Learnt, hearts and minds get inspired and
Express; without expecting any reward, recognition or return; human nature is
Above money-making; transcends all
Appreciations, indifferences or Insinuations;
Writers are Divine in making and creation
So only writings pour in, disposable or distinct

*********