Sunday, March 25, 2018

Time; భగవన్నిర్వచనము; ముళ్ళబాట? - పూల దారి?; Employment in ancient India; Urge to Publish; చదువులెవరివి?

Time
Time is not a real thing; it does not exist physically on its own or as it is. No one ever comprehended its nature fully. No one ever can. Time manifests physically through processes or events - physical, chemical, biological, cosmological, psychological, historical, social, political, sociological, geological, geographical, etc.,
Past is memory or record, present is awareness. Future is imagination, doubt, fear, apprehension of mind.
Time in a nutshell is a figment of our imagination.
***********
Calming the mind is a process reverse to thinking.
************
భగవన్నిర్వచనము

న దేవో విద్యతే కాష్ఠే
న పాషాణే న మృణ్మయే
భావేషు విద్యతే దేవః 
తస్మాత్ భావోహి కారణమ్
భావము: భగవంతుడు చెక్కతో చేసిన బొమ్మలో గాని, రాతి విగ్రహములో గాని, మట్టి బొమ్మలో గాని ఉండడు. భగవంతుడు మన భావములలోనే ఉన్నాడు. అంచేత భావములే, భావించ గలగలడమే, భావించడమే అంతకూ, అంతటా పరమాత్మని చూడగలగడానికి కారణం.
न देवो विद्यते काष्ठे
न पाषाणे न मृण्मये।
भावेषु विद्यते देवः
तस्मात् भावो हि कारणम्॥

The Lord lives not in the wooden carving
Nor in the sculpture made of stone or clay;
The Lord lives in our thoughts
And it is through our thoughts that we see him dwell in everything.
*************
నేను కి శాంతియే నేను అనేది సరియైన అన్వయం.
********
తాము ప్రవచించవలసిన తత్త్వాన్ని కాని, యోగాన్ని కాని, ఆధ్యాత్మికతను కాని పక్కకు పెట్టి, తమ గురించి డంబాలు చెప్పుకుంటూ, శిష్య పరమాణువులను; తమ లేక వారి జీవితాంతం చుట్టూ తిప్పుకుంటూ, ధన, చరాచర ఆస్తుల సంచయం చేస్తూ తమ గురుత్వాన్ని, ఆకర్షణను దుర్వినియోగం చేసుకునే సామాన్యులు, ఉన్నతమైన, మహిమాన్వితమైన, అసామాన్యమైన భారతీయ తత్త్వ బోధనకు, ప్రచారానికి, ప్రసారానికి, ప్రాతినిధ్యం వహించడానికి అనర్హులు.
**********
ముళ్ళబాట? - పూల దారి?
పెళ్లి; బంధము, చెఱసాల, వంటింటికి, పడకటింటికి
పరిమితమౌ బానిస జీవితమని భయపెట్టు మేధావులు, స్త్రీ వాదులు కన్నెల వివాహ
విముఖులను చేసి సంసార విముక్తులను
చేయుచున్నారు; చాలీచాలని జీతాలతో
ఎందరో మధ్యతరగతి కింది తరగతి ముదితలు ఇల్లు సర్దుకుంటూ
ఎదుగూ బొదుగూ లేని "ఉద్యోగాలు"
మాల్స్ లో, ప్రైవేటు సంస్థల్లో పది గంటలు
పైగా చేస్తున్నారు; సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే
యువతీ యువకులను వేళ్ళమీద లెక్క పెట్ట
వచ్చును; పొంతన లేని మాటలతో, జీవితాలను
అగమ్యగోచరం చేస్తున్న నేడు ఏది సత్యం? ఏది
నిత్యం? ఏది అనుసరణీయం? ఏది విస్మరణీయం?
ఏది సుఖశాంతిదాయకం? ఏది ముళ్ళబాట?
ఏది పూల దారి? అంతా అయోమయం! సంఘమున
ఉపదేశించువారు ఎక్కువై బతుకులు శూన్యమైనవి!
**********
Employment in Ancient Indian Times

Various technologies in India in good olden days, are with various communities with various skills and application.
And there were no government jobs. Every one has to take one profession or the other. Else there was no livelihood. Barter system was existing.
No currency was in vogue. Later money entered in circulation as coins. No human being was able to live without being indulged in one occupation or the other. Money circulation as now was not rampant. Accordingly people were working and living.
Currency availability has brought out many professions different from earlier vocations. This is true throughout the globe.
So various jobs are created in addition to British era occupations and employment. Agriculture and cottage industries were chief occupations in ancient India.
It is unwise to compare earlier occupations, living and culture as of now. Culture is like a flowing river. So is "civilization".
Ability to speak and learn languages has revolutionized human mental endeavours.
Human faculty has originated various sciences, arts, philosophies, technologies and applications.
Living in the past and criticising will be of no use today. Eminence must help us in adjusting to current culture and civilization.
Harping on the past will only increase animosities and hatred. Divisions will be exploited by unscrupulous elements in society some times in the form of intellectuals and political fraternity.
Unfortunately in India make believe and not understanding is ruling Indian citizens' mind and heart. Let us pray and work for elimination of easy work attitudes and be cautious with intellectuals and political parties who and which harp on earlier divisions to keep us divided.
*********
ఇప్పటికి మనకి కొద్దిగా అర్థమైనదేమిటంటే, ప్రభుత్వ బేంక్ లు ఎందరో వ్యాపార వేత్తలకు, వారి సంస్థలకు అప్పనంగా వేల కోట్లు దోచి పెట్టారు. ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. చేతులెత్తేసాయి అంతే!
********
Urge to publish
The urge to publish our works is also a vice. Being aware that the probability that our published works' sale is very low; and still we indulging in publication of our works spending our money is really irresistible. It is the vice that grips all creators of literature.
It is an unavoidable urge, longing and liability.
********

మనల్ని వెర్రి మొహాల్ని చేసి వార్తా మాధ్యమాల్లోనూ, అంతర్జాల సాంఘిక సాలెగూళ్ళలోనూ రాజకీయ పార్టీలు ఎంతెంత అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయో!
స్వోత్కర్ష, పరనింద ఇంత స్థాయిలో చేయడం మనకూ ఆలోచించే శక్తి, నేర్పు ఉన్నాయని పట్టించుకోకపోవడమే.
హిట్లర్ గోబెల్స్ లాగ అబద్ధపు ప్రచారాలు ఘనంగా చేసి మన బుర్రలను గందరగోళంలో పడేస్తున్నారు. మనం వారి ఈ తప్పుడు ప్రచారాలని నమ్మేస్తాము అనుకోవడం నిజంగా వారి దుస్సాహసమే.
******
చదువులెవరివి?

వర్ణక్రమము సరిగా రాయలేని తెలుగు వారు; 
ఒత్తులు, గుణింతాలు పట్టించుకోని సాహితీ స్రష్టలు
భావ దారిద్ర్యమున ద్వేషం తప్ప పంచలేని
 వాద ప్రియులు; రాద్ధాంత ప్రేమికులు
భాష ఎవరి సొత్తో అనుకొని భాషను ఇచ్చవచ్చి
నటుల విధ్వంసం చేసి కవితలు, కతలు రాయువారు
జ్ఞానము వంట బట్టించుకొనక అజ్ఞానమై మిగులు వారు;
చదువుల అర్థము పరమార్థము తెలియక విర్రవీగుచు చదువుల గమ్యము మార్చువారు
కుల, సిద్ధాంత, వాద పంజరముల వసించుచు
సాహితీ సృజనను, సృష్టిని భ్రష్టు పట్టించువారు
హెచ్చి హెచ్చిన మదమున హెచ్చరికలు లేక
సచ్చరితముల వ్రాయ నేర్పు లేనివారు తామర
తంపర అయిన నేడు భాష ఎవరిది, సాహితీ సృష్టి
ఎవరికి; చదువులెవరివి? జ్ఞానము ఎవరికి?
**********
వృథా
భారతదేశమున ప్రజాస్వామ్యము కన్నా రాచరికం భాసించును. నేతలు, వారి పుత్ర, పుత్రికా రత్నములను నోరుమూసుకుని భరించు, ఎన్నుకొను వారికి ప్రజాస్వామ్య మేల?
ఆసేతుహిమాచలము పార్టీల నాయకుల పుత్ర, పుత్రికా రత్నములే పార్టీలను, ప్రభుత్వములను నడిపించు నేడు రాచరికమే సబబు. సిద్ధాంతములు కాక వ్యక్తి పూజతో ప్రభువులను ఎన్నుకొను ప్రజలకు ప్రజాస్వామ్యము కన్న రాచరికమే సరియైనది.
రాజ్యాంగము మార్చి రాచరికమును ప్రతి రాష్ట్రమునందు, కేంద్రమునను ప్రకటించిన వస్తు స్థితికి సరిపోవును. ఎన్నికలు వృథా ప్రయాస. ధనము, శక్తి యుక్తులు, కాలము వృథా.
*******

No comments:

Post a Comment