Monday, August 28, 2017

మహాలక్ష్మి ప్రార్థన; దేవుడు ఒక్కడే; మన్మథుని తూపులు;The Glows of Mind Within; విద్యుత్ శక్తి - మానసిక శక్తి

 మహాలక్ష్మి ప్రార్థన

శ్రీమన్నారాయణ మనోల్లాసినీం శ్రీ మహాలక్ష్మీం శరణమహం ప్రపద్యే!
కనకధారాం కారుణ్యవరదాం విష్ణు వక్షస్థలవాసినీం ఇందిరాం నమోస్తుతే!
సముద్రతనయాం మన్మథజననీం ఐశ్వర్య కారిణీం పద్మాసనస్థాం భజేహం!
ఈశ్వర భగినీం సరస్వత్యాః స్వసురాం ధనలక్ష్మీం 


ధాన్యలక్ష్మీం మాధవప్రియాం స్మరేహం!

వరలక్ష్మీం విద్యాలక్ష్మీం సకల విజ్ఞాన దాయినీం
మంత్రరూపాం‌ శుద్ధమానసాం పూజామ్యహం!
శ్రీ మహాలక్ష్మీం నమోస్తుతే!

***************

దేవుడు ఒక్కడే

దేవుడు ఒక్కడే ఆయన విష్ణువని వైష్ణవులు
దేవుడు ఒక్కడే ఆయన శివుడని శైవులు
దేవుడు ఒక్కడే ఆయన అల్లా అని‌ ముస్లిములు
దేవుడు ఒక్కడే ఆయన యెహోవా అని క్రైస్తవులు


దేవుడు ఒక్కడే ఆయనకు పేర్లు ఎన్నో అని సనాతన ధర్మము
దేవుడు ఒక్కడే ఆయన మనిషికి వేరు కాదని తత్త్వము
ఇందరు దేవుని స్వరూపము వర్ణించుచుండ
దేవుడే లేడని నాస్తికులు క్రిందమీద పడుచుండ

గురువులు దక్షిణామూర్తి, హయగ్రీవులు, కృష్ణ పరమాత్మల
బోధనలు నాకు దిక్సూచి నన్నుద్ధరించు ప్రమాణములు
***************
 మన్మథుని తూపులు

తలిస్తేనే తాకినట్టుగా అనిపిస్తుంది కొందరికి
మాట వింటేనే వివశులౌతారు కొందరు; తలుచుకుంటూ
పిలిచేవా అని అడుగుతారు ఇంకొందరు; మనసులు
కలిసిన పరవశమున కలయొ మెళకువయో

తెలియని స్థితుల నిదురవోవుదురు వాస్తవమునకు
యువతీయువకులు పెళ్ళి వద్దందురు ప్రేమ ముద్దందురు

అంతరంగమున అలజడులు రాతిరి నిదుర కరవౌటలు
అంతయును మన్మథుని తూపుల ప్రభావమొ నిజమైన హృదయాశ్లేషమొ
*************

The Glows of Mind Within

Criminals in the guise of saints;
Selfish leaders in the name of saviours;
Indians glorify and blindly believe in
Wrong people for right actions and rights


In the land of knowledge, ignorance and
Innocence are ruling; ruling dispensations
Are conniving with cheats and fake gurus
For vote bank politics; Divinity is pious

God and Lords are our intuition
The glows of our minds within
*******************

 విద్యుత్ శక్తి - మానసిక శక్తి

విద్యుచ్ఛక్తి తగిన పదార్ధ‌ సంపుటి ‌ద్వారా రకరకాల శక్తులుగా మారుతూ మనకి ఎన్నో సౌకర్యాలు కలిగిస్తోంది. ఆధునిక జీవనశైలి, జీవనవిధానం విద్యుత్ శక్తి పై ఆధారపడి ఉన్నాయి.
మన మానసిక శక్తి కూడా వివిధ రకాల పదార్థ సంపుటి ద్వారా రూపమును మార్చుకొని మనం మానసికంగా వ్యవహరించేలా చేస్తోంది.

ఈ మానసిక శక్తిని చిదాభాస, మాయ, ప్రణవం, స్ఫోట అని పిలుస్తారు. అన్నీ ఒకే మానసిక శక్తికి వివిధ నామాలు. వేదాంతులు చిదాభాస, మాయ, ప్రణవం అంటారు. వ్యాకరణ వేత్తలు, భాషాశాస్త్ర వేత్తలు స్ఫోట, ప్రణవం అంటారు.
భక్తులు దైవశక్తి అంటారు. ఎవరేమన్నా ఇదంతా చిత్ శక్తి. ఆత్మ శక్తి. మన మానసిక కార్యకలాపాలు జరిపే శక్తి.

Friday, August 11, 2017

దృక్ - దృశ్య వివేకము; ముక్తి; మోక్షము;

దృక్ - దృశ్య వివేకము

భౌతిక శాస్త్రమున ఐన్స్టైన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతము అవగాహన చేసికోవడానికి భౌతిక శాస్త్రం, గణితము మెండుగా రావాలి. లోతుగా అధ్యయనం చేయగల సత్తా ఉండాలి. సునిశితమైన బుద్ధి ఉండాలి. అది సామాన్యులకు అందని మ్రానిపండు. ఇవన్నీ చేయగలిగితే ఎవరికైనా సాపేక్ష సిద్ధాంతం కరతలామలకం అవుతుంది. శ్రద్ధ, శ్రమ పడగల శక్తి యుక్తులు, ఆసక్తి కలవారికి అది అందుతుంది.

భారతదేశంలోని మేధావుల్లో ఎందరో విజ్ఞాన శాస్త్ర విద్యార్థులు కారు. భౌతిక శాస్త్రం వచ్చిన వారు ఇంకా తక్కువ. అందువల్ల వీరెవరూ సాపేక్ష సిద్ధాంతం గురించి మాట్లాడరు. కాని వీరే తమకు ఏమీ తెలియని తత్త్వ శాస్త్రం గురించి తెగ మాట్లాడతారు.

భారతీయ తత్త్వ శాస్త్రం కూడా సాపేక్ష సిద్ధాంతం అంత గహనమైనదే. తత్త్వం పై పూర్వ జ్ఞానం, ఆసక్తి, శ్రద్ధ, శ్రమ పడే తత్త్వము లేక ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పట్టుబడవు.

ఇవన్నీ ఉంటే ఆత్మ జ్ఞానం సాపేక్ష సిద్ధాంతం వలె కరతలామలకం అవుతుంది.

మనుషుల లోని బుద్ధి, ఇతర తారతమ్యాల వల్ల అన్నీ అవగాహనకు వచ్చే విధంలో తేడా ఉంటుంది.
దృక్-దృశ్య వివేకము అటువంటి జ్ఞాన భాండాగారం. ఆత్మజ్ఞాన సారాంశము. ఆదిశంకరుల వివేక చూడామణి లో వివరించబడింది.

దృక్ అంటే చూపు. దృశ్యము అంటే ఆ చూపుచే చూడబడేది. ప్రజ్ఞానం బ్రహ్మా - మహా వాక్యము ద్వారా ఈ చూపు మన గమనిక. ఆత్మయే ఈ గమనిక.

ఆత్మనుంచి ఉద్భవించిన చిత్ శక్తి మేధలో చిదాభాసగా మారి మానసిక కార్యకలాపాలకు ముడి శక్తి అవుతుంది. ఈ ముడి శక్తినే మాయ లేక ప్రణవం అంటారు. ఈ మాయా వివర్తన - పురోధాన, తిరోధాన - పరిణామములే మన వివిధ మానసిక దశలలో అంతఃకరణములు, జ్ఞాన కర్మేంద్రియాలతో జరిగే మన మానసిక కార్యకలాపాలు.
దృక్ చూపు. అదే గమనిక. అదే ఆత్మ లేక బ్రహ్మము.

అంతఃకరణములు, జ్ఞాన కర్మేంద్రియాలకు దృష్టిలో ఉండే అనుభవములు, తలపులు, తన్మాత్రలే దృశ్యాలు.
రూపము, ధ్వని, శబ్దము, మాట, వాసన, రుచి, స్పర్శ ఇవన్నీ జ్ఞానేంద్రియములకు దృశ్యాలు. అనుభవములు చిత్తమునకు, తలపులు మనసుకి, తర్కము, విచక్షణ బుద్ధికి, వ్యక్తిత్వపు భావాలు అహంకారానికి దృశ్యాలు.
దృశ్యం దృష్టిలో ఉంటే దృక్ "కనుమరుగు" అవుతుంది.

దృక్ యే దృష్టి అయితే దృశ్యం కనుమరుగు అవుతుంది.

దృశ్యం దృష్టిలో ఉంటే దానిని - అది బహిః భౌతిక ప్రపంచం లోని విషయములతో అనుసంధానించబడి ఉంటే - బహిర్ముఖ దృష్టి అంటారు. ఇప్పుడు మనకు గ్రహణ జరుగుతుంది. ఇది జాగ్రత్ (మెళకువ) మానసిక దశ.
దృశ్యం దృష్టిలో ఉంటే - అది ఆంతర ప్రపంచం లోని విషయ లేదా విషయానుభవం తో అనుసంధానించబడి ఉంటే దానిని అంతర్ముఖ దృష్టి అంటారు. ఈ గ్రహణ లో భావములు కలుగుతాయి; వివిధ మానసిక స్థితులు జనిస్తాయి. ఇది స్వప్న (కల) మానసిక దశ.

దృశ్యములు ఈ రెండు మానసిక దశలలో కనిపించి, వీటి ఆధారంగా మానసిక కార్యకలాపాలు జరుగుతాయి.
ఏ విషయము, విషయానుభవము దృష్టిలో లేకుంటే అప్పుడు దృష్టి విశ్రాంత మౌతుంది. దీనిని విశ్రాంత దృష్టి అంటారు. జాగ్రత్ సుషుప్తి, సుషుప్తి (గాఢనిద్ర) దశలలో దృష్టి విశ్రాంత మౌతుంది. అంతఃకరణములు మౌనం వహిస్తాయి.

దృశ్యం కనిపిస్తే మనసు, ఇతర అంతఃకరణములు బహిర్ముఖ, అంతర్ముఖ దృష్టులతో బహిః, ఆంతర ప్రపంచములతో అనుసంధానించబడినట్టు.

దృశ్యం కనిపించకపోతే దృక్ యే దృష్టి అయినట్టు. ఆత్మానుభూతి, బ్రహ్మానుభూతి కలిగినట్టు.

ఈ దృక్ దృశ్య వివేకము కలగడమే తత్త్వానుభూతి.

ఇది ఉపనిషత్ సారము. భారతీయ తత్త్వానులోకనము. ఆకళింపు.

*****************

ముక్తి; మోక్షము;

జ్ఞాపకములు అను ఎండుటాకులు
ఆత్మజ్ఞానాగ్ని యందు భస్మమైన;

అనుభవములు అను నెత్తిపై బరువులు
పరమాత్మ స్మరణమను భుజశక్తితో నేలకు చేరి
మనసు తేలికైన;


ఎఱుక కలిగి వేదనలు, వ్యథలు, అహం భావనలు
అహంకార మమకారములు అందు అదృశ్యమైన;

ప్రజ్ఞానము వెలుగులు చిందించుచు సాక్షి మాత్రమై
సమస్తమును తెలియజేయుచు శాంత్యానందముల
నింపిన;

అది ముక్తి; మోక్షము; పరమపదము;
నిజస్థితి; స్వస్థితి; అదియే వికుంఠము,
కైలాసము, సాయుజ్యము; సామ్రాజ్యము

*****************
 

Thursday, August 10, 2017

మనిషి మంచి-మర్యాద; సిరిచూలు; కాగితపు, ఇ- ప్రచురణలు -పురస్కారాలు-సన్మానాలు

మనిషి మంచి-మర్యాద


మనిషిని గౌరవించి అతని మర్యాదకు భంగం కలగకుండా ప్రవర్తించడం ఈ రోజుల్లో అరుదైపోయింది.
మత గురువులు, కుల నాయకులు, మేధావులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు, ఇతర వృత్తులలో ఉన్నవారు, ఎవరైనా సరే తోటి మనుషుల సున్నితత్వాన్ని గణించకుండా దున్నపోతు వ్యవహారంలా ప్రవర్తించడం ఎక్కువ మందికి రివాజై పోయింది.

"సామాన్యులకు" ఏమీ తెలియదని వారితో ఎలా ప్రవర్తించినా తమకేమీ కాదని పైన ఉదహరించిన పెద్ద మనుషులకు నమ్మకం కలిగిపోయింది. మర్యాద చూపించడం కరిగిపోయింది.

మనిషిని గౌరవించకుండా, మర్యాద చూపించకుండా "బిచ్చగాణ్ణి" చూసినట్లు చూడడం సంస్కృతి అయింది.
ఈ వాస్తవం మారాలి.
****************

 సిరిచూలు మన్మథుడు;
కొండల రాకొమరిత చూలు

గణాధిపతి; చదువుల తల్లి
చూలు నారదమునీంద్రుడు;

అందరు మనల చల్లగ చూచి
యోగ క్షేమముల వహింతురుగాక!

****************


కాగితపు, ఇ- ప్రచురణలు -పురస్కారాలు-సన్మానాలు

ఇ-ప్రచురణలని చిన్నచూపు చూడటం నేటి సాహితీ, ఇతర రంగముల సంస్కృతి. ఇ-ప్రచురణలను పురస్కారములకు గణింపరు. ఎందుకు? ఏమో!!?

రచయిత లేక కవి లేక సాహితీ వేత్త గుర్తింపు పొందాలంటే తన సాహితీ, విజ్ఞాన, శాస్త్ర, జ్ఞాన సృష్టిని ప్రచురించి తీరాలి. పురస్కారాలు ఇవ్వడానికి కాగితపు పుస్తకంగా ప్రచురించిన పుస్తకాలనే గణనలోకి తీసికుంటారు.

ఒక కవి లేక రచయిత తన రచన ప్రచురించబడాలంటే నానా తంటాలు పడాలి. ఏ ప్రచురణకర్త ప్రచురించడానికి ముందుకు రాడు. అంతర్జాలము, ఇ-ప్రచురణలు లేని, ఒక్క ప్రచురించబడిన రచనే అందరిని చేరగల రోజుల్లో కాగితపు ప్రచురణ తప్ప మరో మార్గం లేదు. అప్పడు పెట్టిన ఈ నియమాన్ని ఇప్పుడూ తప్పదనడం, ఆ విషయాన్ని రచయితలు, కవులపై రుద్దడం మార్పుని ఆహ్వానించలేని చాదస్తపు మనుషుల మూర్ఖత్వాన్ని తెలియజేస్తుంది. కాగితపు ప్రచురణ పొందిన రచనే పురస్కారాలకి గాని, ఇతర సన్మానాలకి గాని అర్హం అంటే, ఈ పాతకాలపు మనుషుల గురించి ఏమి మాట్లాడితే వారు మారతారు?

ప్రచురణకర్తలు నియంతలుగా రాజ్యం చేస్తున్న నేటి ప్రచురణారంగంలో ఒక రచన ప్రచురించబడడం తేలిక కాదు. తమ రచన ప్రాచుర్యం, గుర్తింపు పొందాలనుకునే "బడుగు" రచయితలు తమ రచనని కాగితపు ప్రచురణ చేయడం తప్ప మరో గతి లేక పోవడం, సాంకేతికత ఇంతలా వటవృక్షంగా ఎదిగిన నేడు సిగ్గుపడాల్సిన విషయం. కాగితపు పుస్తకంగానే ప్రచురించబడి తీరాలనే ఈ నియమం రచయితలకు, కవులకు ఆర్ధికంగా ఎంతో భారం కూడాను. చేతిచమురు భాగవతం ఆడాలంటే అందరికీ ఆర్ధిక స్తోమత ఉండదు. రచయిత, కవి అనిపించుకోవడానికి ఆర్ధిక స్తోమతకీ ముడి పెట్టడం అన్యాయం. అనవసరం.

కాగితపు ప్రచురణ జరగని రచనలో సాహితీ, ఇతర విలువలు ఎలా హ్రస్వమౌతాయో అంతుపట్టని విషయం.
రచనని ఒక్క కాగితపు ప్రచురణలోనే గుర్తిస్తాం అనేది పసితనం.

పురస్కారాలకు, ఇతర సన్మానాలకి ఇ-ప్రచురణలని, కాగితపు ప్రచురణలతో సమానంగా గుర్తించడం సాహితీ క్షేత్రంలో వెంటనే జరగవలసిన పరిణామం.

రచనలో, కవితలో పస ముఖ్యం కాని ప్రచురణ ఎలా జరిగింది అనేది గుర్తింపుకి పునాది కారాదు.
ఇ-ప్రచురణలను పురస్కారములకు కాగితపు ప్రచురణలతో సమానంగా గుర్తించడం వల్ల ఎందరో రచయితలు, కవులు అనవసర ఆర్ధిక ఇబ్బందుల నుంచి రక్షింపబడతారు.

ఇది అందరు మేధావులు, కవులు, విమర్శకులు, రచయితలు, పురస్కార ప్రదాతలు, ఇతర సన్మాన నిర్వాహకులు గమనించి తీరవలసిన విషయం. మార్పుకు శ్రీకారం చుట్టి తీరవలసిన సమయం.
 

Monday, August 7, 2017

రామబ్రహ్మమును వారాణసీశుడనేను; ప్రవచనకర్తల ప్రసంగాలు

 రామబ్రహ్మమును వారాణసీశుడ నేను

సవ్యసాచిని నేను; లౌకికమును
తత్త్వమును ఇరు చేతుల శరములుగా
సంధించగలను; పరశురాముడ
నేను; పాలకుల దుష్టత్వమును
క్రూరత్వమును దౌర్జన్యమును
పాలనా దక్షత లేమిని ఎండగట్టెదను


జయదేవునిని నేను రాధామాధవుల
సరస శృంగారమును కవనములుగ
అల్లెద; నారాయణతీర్థులను, సదాశివ
బ్రహ్మేంద్రులను; దేవభాషయందు దేవ
దేవీ దైవ స్తోత్రముల విరచించెద; దార్శనికుడను
సప్తమ దర్శనమును సృష్టించుచున్నాను

స్రష్టను నేను రమణీయ కవితా కలరవమును నేను
జ్ఞానిని నేను ప్రజ్ఞాన ఘన గీతాచార్యుడను నేను
నేను కు తాత్పర్యము ను నేను పరమాత్మ పరమార్థమును
బ్రహ్మమును నేను రామబ్రహ్మమును వారాణసీశుడనేను

***************
 విశిష్టాద్వైతమునకు వేదాంత దేశికులు
అద్వైతమునకు అప్పయ్య దీక్షితులు
ద్వైతమునకు శ్రీ రాఘవేంద్రులు
ఎన్నిక గన్న వేదాంత భక్త శిరోమణులు
 *****************

ప్రవచనకర్తల ప్రసంగాలు

ప్రవచనకర్తల ప్రసంగాలు మనసుని రంజింపజేస్తాయి. మనకు ఇవి ఆధ్యాత్మికతలో ప్రాథమిక విద్య. అవే ఆది, అంతము కావు. మనము ప్రవచనకర్తలను అభిమానించాలి, గౌరవించాలి. వారితోనే ఆగిపోకూడదు.
వారు ప్రసంగించిన విషయాలు మననం చేసికోవాలి, అనుసరించాలి. వారిని పొగుడుతూ మరేమీ చేయకుండా, జీవితం గడిపేయడం వలన మనం తరించము.
ఆధ్యాత్మికత గమ్యము మనసు నిరంజనాన్ని పొందడం.
ప్రశాంతతనొందడం. మనసు ఎప్పుడూ ఆనందంగా ఉండడం. మనసు మౌనము వహించి శాంతానందమయం
కావడం. మనలని మన విద్యుక్త ధర్మనిర్వహణకు ప్రోత్సహించడం. ఆ విధి నిర్వహణలో మనం అలసినపుడు సేదదీర్చడం. మనసు స్థితి గతులను గమనిస్తూ మనం సంయములమై నిర్వాణ పదము నందడం.

ఇది వేదాంతము మనకి ఇచ్చే సలహా. ఇంత వరకు వస్తామో, ప్రవచనకర్తల ప్రసంగాల దగ్గర ఆగిపోతామో;
మన ఇష్టం. చదివిన అన్ని చదువులను, విన్న అన్ని మాటలను, చూచిన అన్ని దృశ్యములను దాటి, వాటిని మరచి, దృష్టి నుంచి ఉపసంహరించి అన్ని చదువుల, అన్ని ప్రసంగాల పరమార్థమైన పరమాత్మానుభవంలో మునిగి తేలుతూ జీవితాన్ని గడుపుతామో, మన ఇష్టం.
అహం బ్రహ్మాస్మి
తత్త్వమసి
అయమాత్మా బ్రహ్మా
ప్రజ్ఞానం బ్రహ్మా
ఆనందో బ్రహ్మా
రసోవై సః
సర్వం ఖలు ఇదం బ్రహ్మా
సత్యం జ్ఞానమ్ అనంతమ్ బ్రహ్మా
ఓమ్ ఇతి ఏకాక్షరం బ్రహ్మా
బ్రహ్మా సత్ జగత్ మిథ్యా
జీవో బ్రహ్మ ఏవ న అపరః
పూర్ణమదః పూర్ణమ్ ఇదమ్
పూర్ణాత్ పూర్ణమ్ఉదచ్యతే
పూర్ణస్య పూర్ణమ్ ఆదాయ
పూర్ణమ్ ఏవ అవశిష్యతే
ఆస్తి భాతి ప్రియం నామం రూపం చ అంశ పంచకమ్
ఆద్య త్రయం బ్రహ్మ రూపం తతో ద్వయం జగత్ రూపము
యా మా సా మాయా
యయా అసన్తమ్ పశ్యతి సా మాయా
మాయా మయమ్ ఇదమ్ జగత్
జాయతే గచ్ఛతే ఇతి జగత్
యస్య గమనం సతతం తత్ ఆత్మా
శ్రేష్ఠప్రాణః ఆత్మనః తాను
కాలః పరిణామః. కాలః శక్త్యాః పరిణామః. కాల స్పృహః చిత్ శక్త్యాః పరిణామః.
మన ఏవ కారణం మనుష్యాణాం బంధ మోక్షయోః.
నిర్మల మానసమ్ ఏవ ఆత్మా.
ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!

Sunday, August 6, 2017

పలకరింపు లేని స్నేహము; అందమవ్న అది ఏమి

 పలకరింపు లేని స్నేహము

పలకరింపు లేని స్నేహము
ప్రాణము లేని శరీరము
పూవులు పూయని తోట
ప్రవహించని నీటిజాలు

ఎంతటి స్నేహము మౌనమున మలిగిపోవును కలిగిపోవును
ముడులు వీడిన మనసులు రెక్కలు తెగిన పక్షులు కుంటి కులాసాలు
సడులు చేయని వీణాతంత్రులు సుడులు తిప్పు సుడిగుండాలు
పలకరింపు లేని స్నేహము ఆత్మీయత యున్నను శూన్యము ఫలరహితము

చప్పుడు కావాలంటే రెండు చేతులూ కలవాలి
డెందములు సందడి చేయాలి; మనసుల సంబరము
నిండాలంటే హృదయముల పెనవేత శ్రావ్యసంగీతం
ఆలాపించాలి; అలరించుకొనుచు సరససంభాణముల మునిగి తేలాలి

 ****************

విశిష్టాద్వైతమునకు వేదాంత దేశికులు
అద్వైతమునకు అప్పయ్య దీక్షితులు
ద్వైతమునకు శ్రీ రాఘవేంద్రులు
ఎన్నిక గన్న వేదాంత భక్త శిరోమణులు
 ***************

మనుషులకు రెండు రకాలైన బాధలు;
ఒకటి: కోరుకున్నది లభించకపోవడం;
రెండు: కోరుకున్నది లభించడం
************
We will get spiritual strength through our just actions.
**************
 అందమవ్న అది ఏమి, చూపు చూపుకు మారును
బంధమన్న అది ఏమి, మనసు మనసుకు మారును
మంచి గ్రంథమన్న అది ఏమి, బుద్ది బుద్దికి మారును
దైవమన్న అది ఏమి, మతము మతమునకు మారును
**************
 లాభము రాని వర్తకము, ఎంత చదివినను
బుర్రకెక్కని పాఠము, గొంతు శ్రావ్యత లేని పాట
పరిపాలన దంచెదనని ప్రకటనల మాత్రమిచ్చు
మంతిరి గ్రక్కున విడువంగ దగిన వారు సుమతీ!
**************
Politicians can only cause rifts among citizens in the name of caste, religion, region and they can never work for harmony among citizens. They are not capable of keeping peace and serenity in the society. They only know division and never try for integration among Indians.

Thursday, August 3, 2017

Indian Spiritual wisdom; నీటిపై వ్రాతలు; ముసలి వాళ్ళ ముందు జీవితం; కులగజ్జి

Indian Spiritual Wisdom

Each one of us is made of different intellectual and emotional traits. The psychology of each individual is different and unique. Indian spirituality is for liberty to the individual in spiritual matters.

Formation of cults is against Indian spiritual wisdom and tradition. Scope for individual to incorporate his/her originality in spiritual practice is essence and essentiality of spiritual spirit and growth.

Just as a psychiatrist treats each individual getting information about one's individuality and mental make-up, each spiritual enthusiast must be spiritually instructed according to one's intellectual and emotional traits. There is no scope, chance or allowance for mass instruction. Cults do not care for the beauty of each individual's originality.

In cults' culture, the guru finds something and imposes that on all his cult followers. Thus we have blind followers than intelligent and smart followers.

This will instruct but obstruct and inhibit individual's capabilities and efficiency; and the individual will be lost in his aim instead of reaching his/her goal. Thus cults are doing immense harm to the tradition of Indian spiritual wisdom and practice. And also the cult masters are amassing huge money and many types of properties and are building and ruling vast financial empires than spiritual kingdoms.

The spirituality they are propagating is neither helpful to them individually nor spiritually to their blind followers. They are ruining the spirit and grandness of Indian spiritual wisdom and tradition. Mere knowledge propaganda and propagation sans associated simplicity and experience is useless to both the gurus and their followers.

Indian spirituality shines more when the individual is allowed to use his/her originality, imagination and intuition.
**************
 పెద్దలు చెప్పిన మాటలు అంతర్జాలంలో నలుగురికీ పంచడం కన్న
వాటిని మనం మన జీవితంలో ఆచరించి లాభపడుట మిన్న
గంగా నదీ స్నాన పుణ్యముపై కావ్యము వెలయించుట కన్న
గంగా నదిలో స్నానము చేసి విశ్వేశ్వరునికి మ్రొక్కుట మిన్న
**************

నీటిపై వ్రాతలు

సతీత్వమునకు ఏ మాత్రము భంగము కలుగకుండ
అంతర్జాలమున తమ రాతలతో, కవితలతో సమధుర
సరసత్వముల పంచు నారీ మణులు; వారల ఆకాశము
పైకెత్తు సోదర శిఖామణులు; వీరి బాంధవ్యముల,

ఆత్మీయతల గమనించుచు ఆశ్చర్యమున ముదమొందు
మేము; గీటు ఏ మాత్రము దాటినను నిర్దాక్షిణ్యంగా
తుడిచివేయు రమణీలలామలు; అంతర్జాలమున
అందరు మిత్రులు, బందుగులు కారు; సంద్రమున

బిందువులు ఈ స్నేహ సముదాయమున; ఎవరికెవరూ
ఏమీ కాని రైలు ప్రయాణీకులు; కాలక్షేపపు బఠానీలు;
ఇంతలో మోదం; ఇంతలో కోపం; ఇంతలో చికాకు;
అంతర్జాలపుటనుబంధములు నీటిపై రాయు రాతలు
***************


ముసలి వాళ్ళ ముందు జీవితం
 
ముసలి వాళ్ళకి ముందు జీవితం లేదు, ముందటి
జీవితం తప్ప; హారతి కర్పూరం వలె మండిపోవును
సమయం; మంచువలె కరిగిపోవును ఉదయం
 
సాయంత్రం; కాలము పరుగెత్తును; నారాయణ
స్మరణం‌ మాత్రం ఉపశమనము‌ కలిగించును
తత్త్వ విచారణ మోక్షమునిచ్చును; మరణం
భయపెట్టదు; నందనందనుని బోధలు పంచిన
************

కులగజ్జి

కులముల బట్టి నాయకులేర్పడెదరు
కులముల బట్టి పదవులకు ఎన్నికగుదురు
కులముల బట్టి పౌరులు ఓట్లేయుదురు
కులవ్యవస్థను మాత్రము అందరు తిట్టెదరు

ఇదేమి చోద్యమో; భారతదేశమున ప్రజాస్వామ్యం
కుల మహమ్మారి చేతిలో బందీ; ఎవరెన్ని కబుర్లు
చెప్పినను కుల కార్పొరేషన్ల ఏర్పాటు చేయుట అనివార్యం
కులమే అంతటిదో; కులగజ్జి అంత తీవ్రమైన వ్యాధియో?

కుల ప్రసక్తి లేని రాజకీయము లేదు; కులమునకు
అంటకాగని పార్టీ లేదు; పొద్దున్నే లేచి అందరూ కుల
వ్యవస్థను దునుమాడెదరు పళ్ళు తోముకున్నట్టు;
భారతదేశము గంగలో కలిసినను, అభివృద్ధి కుంటు

బడినను కుల రాజకీయాలు దిన దిన ప్రవర్ధమాన
మగుచునే యుండును; కులవ్యవస్థ ఖండన ముండనలు
యాంత్రికముగా జరుగుచునే యుండును; కులముల
చుట్టూ తిరుగు భారత ప్రజాస్వామ్యం చట్టమునకు

అతీతము; కుల సమీకరణలు చేయని పార్టీ ఎన్నికలందు
ఖంగుతినును; నాయకులు కులముల కుళ్ళు పంచితిరో
పౌరులు మనసారా కులభేదముల కౌగలించుకొనిరో
స్వార్ధ సంకుచిత రౌడీ నాయకులు భారతదేశ ప్రజా

స్వామ్యమును భ్రష్టు పరచిరి; దశాబ్దములైనను,
శతాబ్దాల పాటైనను ఈ దుర్వ్యవస్థ భారతమును పట్టి
పీడించు చీడ; పంటను నాశనము చేసికొని చీడను,
కలుపును వృద్ధిపరచుకొను మూర్ఖత్వమెన్నడు వీడునో?!

కావ్యాలాపములు - సాహిత్య ప్రశంస: చిన్నిమొలక; సంతానాన్ని పెంచే విధం; విద్యాలయములు; కళ్ళెము లేని గుఱ్ఱము;

కావ్యాలాపములు - సాహిత్య ప్రశంస

కావ్యముల వెలయించు‌ కుతూహలము‌
కలుగుట లేదు; కరిగిపోయె అట్టి కలలు;

నేటి సాహితీ ప్రపంచమున కవితలే చదువబడుటలేదు
కావ్యములనెవరు అవధరింతురు; అగమ్య గోచరముగ
మారినది కవనసృష్టి; అందరు అల్లుచున్నారు అమిత
శ్రద్ధతో పదముల వరుసలను; అలరుటలేదు పాఠకులు

కావ్యనాటకకళాభివ్యక్తి కనబడుటలేదు
సంగీతసాహిత్య మధుర సమ్మేళనము
మృగ్యమయ్యె; చలనచిత్ర దాసత్వమున
రుచులు మారె; రుచులు కోల్పోయె సాహితీ
భాస్కరుడు; రచనలందు రాసిక్యము కన్న
నాసిరకపు లౌల్యము "భాసిల్లుచుండె"

రామాయణ భారత భాగవతాది ఇతిహాసములు
పంచతంత్ర హితోపదేశములు అటకెక్కె; వాల్మీకి వ్యాస
భాస కాళిదాసులు నన్నయ తిక్కన నన్నెచోడ శ్రీనాథ
పోతనలు స్మరింపబడుటలేదు; కావ్యరచన పఠనములు

అరుదయ్యె; అంతయు సిద్ధాంత రాద్ధాంతముల
వాదప్రతివాదముల‌ మయమయ్యె; శాంతి ఉపశమనము
హుళక్కాయె; ఆవేశకావేషములు పుష్కలమాయె
సాహితీ సృష్టియందు వైదుష్యం జ్ఞానం అలంకరణలు
విశ్వశ్రేయస్సు రమణీయార్థప్రతిపాదకత ధ్వని నిండుకొనె
సాహిత్యమన్న‌ సరసతపోయి విరసములు హెచ్చాయె
సామరస్యము పోయి ద్వేషవిద్వేషములు వేషమాయె

సమత మమత కరుణ స్నేహము ఆత్మీయత ఆదరములు
చోటుకోల్పోయె; సాహిత్య ఔన్నత్యము మసకబారుచుండె
*************
 A nation is known more by its leaders than its citizens; but leaders are reflection of their citizens.
**************

చిన్నిమొలక

అంకురించినది వారణాసి వారి తోటయందు
అనూరాధా నక్షత్రమున మా అందరి హృదయముల
అలరించుచు ఆనందము పంచుచు చిన్ని మొలక
అమ్మాయి మా మనుమరాలుగ ఈ నాడు ఇప్పుడు

*****************

సంతానాన్ని పెంచే విధం

రాజవత్ పంచ వర్షాణి
దశ వర్షాణి దాసవత్
ప్రాప్తేతు షోడశే వర్షే
పుత్రం మిత్రవదాచరేత్


అయిదేళ్లు వచ్చేవరకు మనమే అన్ని పనులు చేస్తూ పుత్రుణ్ణి రాజులాగ చూసుకోవాలి.
ఆ తరువాత పది సంవత్సరాలు దాసుడిలా పనులు నేర్పించాలి.
పదహారో యేట అడుగిడినప్పటి నుండి పుత్రుణ్ణి మిత్రుడిలాగా చూడాలి.
***************
 విద్యాలయములు


 విద్యాలయములు విశ్వవిద్యాలయములున్నది
ఉద్యోగార్ధుల ఉపయోగమునకై; విద్యార్ధులకు
జిజ్ఞాసువులకు భారతదేశమున విద్యగఱపు
విద్యాలయములే లేవు; జ్ఞానసరస్వతి అక్కర లేదు

****************
 కళ్ళెము లేని గుఱ్ఱము
నియమము లేని మనసు;
సంయమనము వలన కలుగు
హాయి, శాంతి, శ్రద్ధ; పనులు
జరుగును దివ్యముగ;