Tuesday, June 27, 2017

CHANGING ROLE MODELS; రాతలు మార్చే రాతలు - కబుర్లు; Religious and Spiritual Teachers

CHANGING ROLE MODELS

The modern trend
Of gauging success
in life is, in terms of
Amassing billions;

Contrary to older measure of
Success in life in terms of
Learning, scholarship and
Being knowledgeable;

Times change;
Measures change;

Einstein was our role model
Steve Jobs, Bill Gates, CEOs
Are role models for
Current generations;

Nothing is absolute
Except for suffering
And being happy;
Though the reasons
That cause them
Are
Not necessarily the same;

***************

రాతలు మార్చే రాతలు - కబుర్లు

చిన్నప్పుడు నేను

"ప్రార్ధించే పెదవుల కన్నా
సాయంచేసే చేతులు మిన్న"


అని చదువుకున్నా;

ఈ మాటల సారం
తెలియలేదప్పుడు

కొంత జీవితం గడిచాక
ఇప్పుడు అవగాహన చేసికున్నాను
ఆ మాటల సారాంశం

వట్టి మాటలు కట్టిపెట్టి
గట్టి మేల్ తలపెట్టే వారే ఘనులని;
కార్యశూరులు కవుల కన్నా సాహితీ
కారుల కన్నా సంఘానికి ఎంతో
ఉపకారం చేస్తారని;

ఇంకా తెలిసిందేమిటంటే

మాటలు మనుషులను
కార్యోన్ముఖులను చేస్తాయని

అప్పుడు అనుకున్నా
మాటలు, కార్యశూరులు
సంఘానికి సమానంగా
అవసరమని;

ఇప్పుడు నేను
రెట్టించిన ఉత్సాహంతో
కవనములల్లుతున్నాను
కబుర్లూ చెబుతున్నాను;

కార్యశీలురను
కార్యశూరులను
తయారుచేస్తున్నాను

ఎవరికి వారు సాయం
చేసుకునేలా వారిని
ప్రోత్సహిస్తున్నాను
మలుస్తున్నాను
మారుస్తున్నాను

నేనూ సంఘ నిర్మాణం లో
పాలుపంచుకుంటున్నాను
ఉడుతాభక్తి ఉద్యమిస్తున్నాను
కవితలతో, రాతలతో
************

 Religious teachers protect religions. Spiritual teachers protect humanity.

Monday, June 26, 2017

Water; ప్రశాంతత; Instinct and Intuition; Need for peersonal space

Water

Rain drops form into showers; showers fall on ground and transform into streams; streams singing and dancing join the rivers; rivers full of water and enthusiasm swiftly run to join the oceans. The water from the oceans is evaporated and clouds are formed and they again drench the earth and cause prosperity to us.

Water is our essential ingredient of life together with air and food; and we completely live if we fall in love which is as essential as these for a fruitful living.

**********

ప్రశాంతత


మన మనసులు మొద్దు బారకపోతే మన కనీస జీవితాన్ని కూడా మనం గడపలేము. మన సున్నిత హృదయం ఏ సమస్యనీ పరిష్కరించలేదు. మనల్ని ఇబ్బంది పెట్టడం తప్ప. ప్రపంచంలో ఎన్నో ఘోరాలు, మోసాలు జరుగుతున్నాయి, స్వార్ధాలు పెచ్చు పెరిగి దారుణంగా ఉంది. వీటిని పట్టించుకోవడం ఎంత తగ్గించుకుంటే అంత ప్రశాంతంగా మనం బ్రతుకవచ్చును. లేకపోతే మన్ని మనం అనవసరంగా "హింసించుకుంటూ" మన జీవితాల్లో  పోగొట్టుకోవచ్చు. అంతా మన ఇష్టం. మనం పరిమితులు గల సొమాన్యులమని మనం మరిచిపోకూడదు. స్పందించడం వేరు. కార్యాచరణ వేరు.
***********

Instinct and Intuition


Instinct is animal trait.
Intuition is human trait.
Instinct is hormonal.
Intuition is the result of learning, understanding, possessing insight.
Humans have lost many instincts.
Many humans are also not intuitive enough; because of their poor learning and mental laziness.

*********
Need for personal space

Many times many of our near and dear do not have time, capability, capacity or sensitivity to be able to sense our feelings and mental needs. And we only know what we need. Sometimes we should spend in solitude and take care of ourselves and our mental vicissitudes. And we must give time to ourselves and our needs and comforts else we will be psychologically deprived and depraved.
Intelligence and intellect are useful in quest. Faith and tradition give peace of mind.

Thursday, June 22, 2017

The Most Under-celebrated Artiste; Need to care ourselves; యోగః చిత్తవృత్తి నిరోధః.


The Most Under-celebrated Artiste

A writer is the most under-celebrated artiste;

In literature it is the characters
Created by the writer who get the
Limelight; it is Rama and Krishna
Who are celebrated more than
Valmiki and Vyasa; 


Devadas is more popular
Than Saratchandra Chatergee;
Hamlet outshines Shakespeare

In movies it is the director, hero
And heroine who are talked about
More than the story-provider or the
Screen-play writer; lyric writer will
Be overshadowed by lilting tune and music

Writers of manifestos, speeches never
See the light of the day; only parties
And leaders are applauded;

A writer is roots to tree
Basement to buildings
Space to hold all drama, action;
Time to give life and liveliness
To all enactments and entertainments

Still a writer is undermined
Under-celebrated and seldom
Thought of when drama is
Going on or after it is finished

Writer is such self-less creature;
Creating wonders but surrendering
His efforts and self-esteem to others
Though being the nucleus to all creation

A writer is the most under-celebrated artiste

**************
Need to care ourselves

Many times many of our near and dear do not have time, capability, capacity or sensitivity to be able to sense our feelings and mental needs. And we only know what we need. Sometimes we should spend in solitude and take care of ourselves and our mental vicissitudes. And we must give time to ourselves and our needs and comforts else we will be psychologically deprived and depraved.
************
Intelligence and intellect are useful in quest. Faith and tradition give peace of mind.
**********

యోగః చిత్తవృత్తి నిరోధః.
యోగః కర్మసు కౌశలమ్
చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే!
భక్తి, యోగము ఒకటే. ఒకే గమ్యానికి రెండు పేర్లు.
భౌతిక వ్యాయామము, వివిధ భంగిమల్లో శరీరాన్ని వంచడం, ఉంచడం యోగానుసరణంలో ప్రథమము. మొదలు. అది మాత్రమే యోగము కాదు. ప్రాథమిక స్థాయి. అది "యోగా" మాత్రమే.
మనసును నిరోధించుకోగలగడం చరమ స్థాయి. మనసుని నియమించుకునే దృష్టి లేనప్పుడు యోగము "యోగా" స్థాయిలో ఆగిపోతుంది.
భౌతిక వ్యాయామం చేయడం మాత్రమే యోగానుష్ఠానము కాదు. యోగాసనాలు మాత్రం వేయడం పతంజలి చెప్పిన యోగాభ్యాసము కాదు.
***********

మెరుగైన విద్య అంటే ఉద్యోగము తెచ్చే పట్టా సంపాదించే విద్యాలయ జీవితము; అని ఇప్పటి నిర్వచనము.

***********
The noblest pleasure is the joy of understanding - Leanardo Da Vinci!
 

Tuesday, June 20, 2017

ఘోష ; వృథా వ్యథలు; Terrorism; Almighty and Time; The Relationships; Lakshmi; చదువు - బుద్ధి - నడత


ఘోష

హిందూ మత సంస్కృతని ఘోష
పెట్టుట కన్న పాటించుట మిన్న
భగవద్గీత గురించి పది వ్యాసములు వ్రాయుట కన్న
ఒక శ్లోకమును ఆకళింపు చేసుకొనుట మిన్న

మా తాతల నాడు నేతులు తాగారు మా మూతులు
వాసన చూడండి అనడం కన్న తాతల మించిన
మనుమలగుట మిన్న; ఆస్తికత్వమో నాస్తికత్వమో
మనసారా ఆచరించుట మిన్న; వట్టి మాటలు కట్టిపెట్టి
మతావగాహన కలిగించుకొనుట మిన్న; తత్త్వానుభవము
పొంది జీవితమును పండించుకొనుట సనాతనజీవనము

**********

వృథా వ్యథలు

మధ్యతరగతి వారికి విమానయానములు గొప్ప
తమ తమ వాయు ప్రయాణములను
అంతర్జాలమున పెట్టి ఠీవి చూపెదరు;
తమ అమెరికా సంబంధముల గురించి చెప్పుకొనుట పండుగే;

ఇప్పుడిప్పుడది ఏమీ ఉత్కంఠ కల్గించకున్నను
అప్పుడే విడుదలైన వేడి వేడి సినిమా చూసి
ప్రదర్శనశాలతో సహా సెల్ఫీ పెట్టెదరు;
ప్రపంచ దేశ ప్రాంతీయ సంఘటనలపై తమ

వ్యాఖ్యలు పిలవని పేరంటము వలె చేయుదురు;
సమస్తమును సంగ్రహించి రాజసముగ పంచెదరు
అన్ని అంతర్జాల తగాదాలలో తలదూర్చెదరు
ప్రతి క్షణము ఆటల ప్రగతి పోస్టులు పెట్టెదరు

తమ తమ నిర్వాకముల ఘనముగ చెప్పెదరు
కుటుంబ విషయముల కీర్తుల ప్రతిష్టల అప్డేట్స్
అందించెదరు; అందర స్నేహితులందురు; వాట్సాప్
వదలరు; అన్ని కబుర్లు వీడియోలు ఇతరుల

ప్రయోజనమునకై విరివిగా వెదజల్లెదరు;
ఆధ్యాత్మిక కబుర్లయందు దిట్టలు; దేవాలయ విశేషముల
సంగ్రహముగ విపులముగా అందించెదరు; పిల్లల ఘనతలు
పిచ్చాపాటి అవి ఇవీ ఉటంకించెదరు; ఇంతటి

పరిజ్ఞానం కలిగి వీరు ఎందుకో వృథాగా వ్యథల చిక్కెదరు
********
 Terrorism comes full circle: The US and Europe are paying price for stoking Islamic fundamentalism in the past
 *******
 Almighty and Time
Almighty takes care of us and helps us through fellow human beings. All of us have humaneness in us and help mutually. Such humaneness is basic and natural to all humans irrespective of their community, caste, religion, region and ideology. And we all transcend our all affiliations and exhibit our compassion, helping and friendly nature to all fellow humans irrespective of their affiliations. Human being is as compassionate as the Almighty.

Time may be able to heal but can not erase.

********

Relationships

Relationships are not automatic. Bonds formed must be consciously nurtured, cultivated, sustained, kept fresh by frequent communication and touch and be allowed to bloom in the affectionate hearts. Else the "ships" naturally drown in the ocean of Time leaving no trace.

*********

Lakshmi

Lakshmi is normally equated with material wealth. The word ఐశ్వర్యం includes material, psychological and spiritual richness. And the essence of successful living is to live a contented life. In that sense ముదము is used. శ్రీ is the original name of Lakshmi. Thus శ్రీ is all encompassing richness.

మోక్షమన్న మనసు నిండుకొనుట
లక్ష్మి యన్న మనసున ముదము
నిండుట; వృక్షముల సాకుట మనల
మనము రక్షించుకొనుట; రామ నామము
స్మరించుట మనలకు‌ శ్రీరామ రక్ష;
********

చదువు - బుద్ధి - నడత

ఎంత చదివినను ఎంత నేర్చినను
బుద్ధి మారకున్న "చదువులు" వృథా;
పుస్తకములెన్నియో కొనుట ఇంటికి
అలంకారం చదువుట కాలక్షేపానికి;


నడత సరిలేని చదువులు బోధనలు మనుషులకు
సంఘానికి బరువులు‌; నడత సరిచేయలేని
విద్యాభ్యాసం, బోధనలు ఫీజులు కట్టి ధనాన్ని
దుర్వినియోగ పరచడం; వృథా చేయడం; తనను తాను

సంయమించుకోగల చదువు చదవని వాడు,
నేర్వని వాడు; ఎంత సంపాదించినను ఒక్క
జీవితపు దెబ్బకు బెంబేలెత్తిపోవును; ఆ ఈ
స్వాముల, సన్యాసుల చుట్టూ ప్రదక్షిణలు చేయును

శాంతి దొరకదు, స్వాముల దోపిడికి గురౌను
చదువన్న గుండె ధైర్యం పెంచుకోవడమూను
ఇతరుల మనసు గ్రహించి సామరస్యముగ
పలుకగల చేతల రాణించగల కౌశలమూ చదువు

బుద్ధి గరపని చదువు మనసుకు ఆయాసం
నడత నేర్పని చదువు సంఘానికి అపకారం

శ్రద్ధాంజలులు ; మనకేల వెఱపు ; మోక్షాపేక్ష - అపోహలు, అపార్థాలు ; ప్రేమ


శ్రద్ధాంజలులు

చనిపోయిన వారికి శ్రద్ధాంజలులెన్నో
బ్రతికున్న వారిని పట్టించుకునే నాథుడే
లేడు; మరణం కారాదు పొగడ్తకు కారణం
చనిపోవడం జీవికి సహజం; అందరం దీనికి
కాదు అతీతం; ముసలితనం కారాదు గౌరవించడానికి
ఆధారం; చావు, జాలి, దుఃఖం చేయలేవు మనిషిని ఘనం

***********

మనకేల వెఱపు

తల్లి వాహనము సింహము తండ్రిది వృషభము
తల్లి పద్మ వాసిని తండ్రి క్షీరాబ్ధిశయనుడు
తల్లి లలితకళా రాజ్ఞి తండ్రి చతుర్వేదవేత్త; ఇందరు
మనల కాచుచుండ మనకేల వెఱపు వగచుటలు

***********

మోక్షాపేక్ష - అపోహలు, అపార్థాలు

మోక్షం పొందాలని సగటు భారతీయ ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు ​కోరుకుంటారు. వీరిలో నూటికి తొంభై శాతం మంది మోక్షం అంటే ఏమిటో తెలియకుండానే మోక్షం పొందాలని ఉవ్విళ్లూరుతూంటారు. అసలు మోక్షం అంటే ఏమిటో తెలిస్తే వీరిలో చాలామంది మోక్షం అక్కర్లేదు అనుకుంటారు.

నిజానికి జ్ఞాన లోపం వల్ల ఎందరో మోక్షం అంటే భగవంతుడు కనిపించడం అనుకుంటారు. వరాలు కూడా ఇస్తే బాగుంటుంది అనుకుంటారు. లేదా పునర్జన్మ లేకపోవడం అనుకుంటారు. చిల్లర ఆధ్యాత్మిక వేత్తలు కోకొల్లలుగా తయారై మోక్ష నిర్వచనాన్నే మార్చేశారు.

మోక్షం గురించి కొద్దిగా అవగాహన రావడానికి రమణ మహర్షి సన్నిధిలో రమణాశ్రమంలో జరిగిన ఒక సంఘటన అవలోకిద్దాం. ఈ విషయం ప్రాతః స్మరణీయురాలు, శ్రీమతి సూరి నాగమ్మగారు తమ రమణాశ్రమ లేఖలు గ్రంథంలో లిఖించారు.

" ఒక సారి శ్రీ రమణ సందర్శనార్ధిని అయిన ఒక ముముక్షువు రమణ సన్నిధిలో కొంతసేపు కూర్చుని, సమయం దొరికినప్పుడు, రమణులని మోక్షం ప్రసాదించమని అర్ధించింది.

రమణులు ఉదాసీనంగా "ఓహో! అట్లాగా!" అని అన్నారు.

ఆమె మరల ధైర్యం పుంజుకుని "అవును స్వామీ! మరేమీ అక్కర్లేదు, మోక్షం ఒక్కటీ ఇస్తే చాలును" అంది.

రమణులు పొంగి వచ్చే నవ్వును ఆపుకొని, "సరి సరి, మంచిదే" అన్నారు.

"ఎప్పుడో ఇస్తానంటే కాదు స్వామీ, ఇప్పుడే ఇవ్వాలి" అందామె.

"సరిపోయింది" అన్నారు స్వామి.

"ఇస్తారా? పోయివస్తా" నన్నది.

ఆమె గడప దాటి వెళ్ళగానే త్రుళ్ళిపడి నవ్వుతూ, మోక్షం ఒక్కటీ ఇస్తే చాలునుట, మరేమీ అక్కర్లేదుట." అన్నారు భగవాన్.

అక్కడే ప్రక్కనున్న సుబ్బలక్ష్మి గారు అందుకుని మాట్లాడుతూ, "మేమూ అందుకే వచ్చి ఉన్నాము, ఇంకేమీ వద్దు మోక్షమిస్తే చాలు" నంది.

"ఓహో! అట్లాగా! ఏమీ వద్దని అన్నింటినీ విడిచిపెడితే ఉండేది మోక్షమేనే! ఒకరిచ్చేదేమి? అది ఉండేదే కదా" అన్నారు మహర్షి.

"అదంతా మాకు తెలియదు. భగవానే మాకు మోక్షం ఇవ్వాలని" అని వెళ్ళిపోయింది.

భగవాన్ పక్కనున్న సేవకులతో " ఏమోయ్! వాళ్ళకి మోక్షం ఇవ్వాలట. అదేమైనా మూటా, ముల్లా, కట్టి ఇచ్చేందుకు?

ఇంక ఏమీ కోరరటోయ్. ఒక్క మోక్షం ఇస్తే చాలునుట. మోక్షం కావాలనుకోవడం కోరిక కాదా ఏమిటి?
ఉన్నవన్నీ పోగొట్టుకుంటే మిగిలేది మోక్షమే. అవి పోగొట్టుకునేందుకు సాధన చేయాలి.

మహావాక్య రత్నమాలలో ఇదే భావం చెప్పారు చూడు.

"వాసనా తానవం బ్రహ్మ మోక్ష ఇత్యభిధీయతే"

తాత్పర్యము:

పూర్తిగా వాసనలు ( సుఖదుఃఖానుభవములు) జారిపోవుటయే బ్రహ్మమనీ, మోక్షమనీ చెప్పబడుచున్నది".

ఇప్పుడు చెప్పండి, ఎంత మంది మోక్షం ప్రసాదించమని అడుగుతారు?

అపోహ, అపార్థం ఇచ్చిన సుఖం నిజం ఈయలేదు.

నిజం కావాల్సిన వారు చాలా తక్కువ.

శాంతి కుదురుటయే మోక్షం.
*********
 ప్రేమ

ప్రేమ అహేతుక భక్తి;

పరమాత్మ యందైనా, మనుషులపట్ల అయినా.

ప్రేమ, భక్తి పరమమైనవి. బదులు ఏమీ ఆశించని‌ వ్యక్తిత్వ విస్పృహ, అభిమానము, ఆప్యాయత, ఆత్మీయతలే ప్రేమము.

A mocking fugitive and legal luminaries; The course of life; మోహం; శాంతి; నేను; అడ్డులు - అడ్డంకులు - అడ్డుగోడలు


 A mocking fugitive and legal luminaries


A fugitive mocking at Indian nation, catch me if you can is too much to stomach. How this fugitive is allowed to escape from India points towards the inefficiency of the concerned.

In legal battles it does not matter whether you committed the crime, offense or not. It is how your lawyers defend you and prove that you are innocent. Even after committing "visible" crimes and offenses you can escape punishment with the aid of battery of your lawyers.

That is why all criminals and offenders feel safe and commit crimes with impunity. And poor prosecution helps their escape.

So offenders are always arrogant and are fearless in committing offenses.

Long live the fraternity of criminals and their legal luminaries.

************
The course of life writes itself. There is no external author. It is a dynamic selfie video during the so called passage of Time.
********
మోహం నిర్వచనమే అది. నిరంతర దాహమే మోహం.
********
శాంతి కుదురుటయే మోక్షం.
***********
 నేను

తత్త్వపరంగా నేను అంటే గమనిక.

అవగాహన పరంగా నేను అంటే అనుభవం.

భావపరంగా నేను అంటే తలపు.

ఉచ్చారణ పరంగా నేను అంటే వ్యక్త శబ్దము.

అద్వైత పరంగా నేను అంటే పరమాత్మ.

ద్వైత పరంగా నేను అంటే వ్యక్తి.

"నేను" వ్యక్తి అయితే అహంకార, అహంభావ, మమకారములు పెనవేసుకుంటాయి. లోబరచుకుంటాయి.
వ్యక్తిత్వ భావన, జీవాత్మ ఒకటే.

వ్యక్తి నైన నేను అనుకున్నప్పుడు తదనుగుణ సుఖదుఃఖాలు అనుభవాలౌతాయి.

పరమాత్మ నైన నేను అనుకున్నప్పుడు సుఖశాంతులు అనుభవాలౌతాయి.

నేను కి సరియైన అన్వయం చేసి కోవడం ఆధ్యాత్మిక చింతన, సాధనలలో భాగము.

అహం బ్రహ్మాస్మి
**********

అడ్డులు - అడ్డంకులు - అడ్డుగోడలు

పేదల కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిపాయలు కిలో రెండు రూపాయల చొప్పున అందిస్తుందిట. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఋణ మాఫీ చేస్తున్నాయి. మరెన్నో ప్రభుత్వాలు పేదల కోసం మరెన్నో పథకాలు, రాయితీలు ప్రకటిస్తున్నాయి. ఈ ఉదారత కోసం నిధులెక్కడినుంచి తెస్తున్నారు?

అమాయకంగా పన్నులు కట్టే బాధ్యత తెలిసిన, బాధ్యత కల పౌరుల కాయకష్టం ఇలా కొందరి కోసం మాత్రమే దుర్వినియోగం చేయబడుతోంది. అత్త సొమ్ము అల్లుడు ధారపోసినట్టు; కాకుల్ని కొట్టి గ్రద్దలకు పంచినట్లు చేసి ఈ దగుల్బాజీ నాయకులు, పాలకులు ప్రజల సొమ్ము పంచుతున్నారు. వర్ధిల్లుతున్నారు. 

రూపాయకు 15 పైసలు మాత్రమే అవసరమైన వారికి అందే, అందించే దుష్ట రాజకీయ వ్యవస్థ దేశానికి గుదిబండ అవుతోంది. పాత రోజుల్లో పండగకు వచ్చి అన్ని మర్యాదలు పొందే అల్లునిలా ఈ "లేనివారు" బ్లాక్ మెయిల్" చేసి రాజకీయుల నుంచి, ప్రభుత్వాల నుంచి ఎన్నో రాయితీలు, ప్రత్యేకతలు పొందుతున్నారు.

కష్టపడి తమ జీవితాలను గడుపుకుంటూ, పన్నులు కట్టి ప్రభుత్వాలు నడిచేలా చేసే బాధ్యత కల పౌరులు వెఱ్ఱివారవుతున్నారు.

అధికారానికి వచ్చిన పార్టీలు మారినా ఈ దౌర్భాగ్యం దేశానికి వదలడం లేదు. పేదలను ఎవరూ ఉద్ధరించడం లేదు. ఉద్ధరించలేరు. కుక్కకు రొట్టె వేసి మాలిమి చేసికొన్నట్టు "పేదలైన" ఓటర్లకు రాయితీల ఆశలు చూపి మచ్చిక చేసుకొని ఓట్లు పట్టి, అక్రమ మార్గాల్లో దోచుకోవడమే ప్రజా ప్రతినిధుల హక్కుగా మారింది.

శాసనములు చేయడానికి మాత్రమే వారిని ఎన్నుకుంటున్నారని, వారి "ప్రతినిధిత్వం" దానికి మాత్రమే పరిమితం అనీ; ప్రతినిధిత్వం పొగరు మోతుతనం పెంచుకొని, దోచుకోవడమే పరమావధి చేసికోవడానికి ఉద్దేశించబడలేదని స్వార్థపరులైన ఓటర్లకు, నాయకులకు, పాలకులకు ఉద్దేశపూర్వకంగానే తెలియదు. తెలుసుకోరు. తెలుసుకోనక్కర లేదు. వీరిలో చాలామందికి శాసనము అంటే ఏమిటో తెలియదు. శాసనాలు చేయడం కోసం చట్టసభలకు వారిని ఎన్నుకున్నారని ఎందరో ప్రజా ప్రతినిధులకు తెలియదు. వారసలు చట్టసభలకే హాజరు కారు. చట్టాలు చేసే సమయంలో సభలోనే ఉండరు.

వీరికి వీరు ఎన్నో సౌకర్యాలు, ధన, ఆస్తి, పింఛన్ ఏర్పాట్లు చేసుకుంటారు. వీరు దేశానికి, పౌరులకూ చేస్తున్న‌ అన్యాయాలకి వీరిని అసలు దండించాలి.

ప్రజాస్వామ్యాన్ని ఇంత భ్రష్టు పట్టించిన ఓటర్లు, నాయకులు భారతదేశ ప్రగతికి అడ్డంకులు. అడ్డులు. బాధ్యత కల, నిజాయితీ పరులైన తోటి పౌరుల నిస్సిగ్గుగా దోచుకునే గజదొంగలు. దోపిడి దొంగలు.

పౌరులను శాశ్వతంగా విడదీసి ఉంచే అడ్డు గోడలు.

విభక్తి - భక్తి స్థితులు; పరమ పదము - సర్వజ్ఞ పీఠము; దేవీ దేవతలు


విభక్తి - భక్తి స్థితులు

విభక్తి కన్న ‌భక్తి‌ మిన్న. భాషను, వ్యాకరణమును శ్రద్ధగా అభ్యసించిన వారికి విభక్తి గురించి పరిచయము చేయనవసరము లేదు.

నేను ఫిజిక్స్ లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నప్పుడు పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో భాగమైన మాహే‌లో రెండు సంవత్సరాలు పనిచేశాను. మాహే కేరళలో కల కాలికట్ దగ్గర అరేబియా సముద్రం ఒడ్డున మాహే నది అరేబియా సముద్రంలో కలిసే తావున కలదు. అప్పుడు పురుషోత్తమన్ అని ఒకాయన మాకు ప్రిన్సిపాల్ గా ఉండేవారు. పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే తమిళులు, మలయాళీలతో కలిసి పనిచేయవచ్చు.
అలాగే భారతదేశం లోని ఇతర ప్రాంతాల వారితో కూడా కలిసి పనిచేయవచ్చు. యు.పి.యస్. సి రిక్రూట్ చేసికుంటుంది. ఆ వాతావరణం మినీ భారతదేశంలా ఉంటుంది. మనసు సంకుచితంగా కాకుండా విశాల దృక్పథంతో వెల్లివిరుస్తుంది.

ఇంతకీ చెప్పొచ్చే ముక్క ఏమిటంటే, పురుషోత్తమన్ గారు తమిళులు. మంచి విష్ణు భక్తులు. నేను సంస్కృతం లోనూ, తెలుగు లోనూ భగవంతునిపై, అమ్మవారి పై స్తోత్రాలు రాసే అలవాటు ఉన్నవాణ్ణి. ఆయనతో మాట్లాడుతూ విష్ణు మూర్తి మీద, రాముని మీదా సంస్కృతంలో స్తోత్రాలు రాసేను అన్నాను; ఆయన వైష్ణవ మతానుయాయులు కదా‌ ఉత్సాహ పడతారు అని. ఆయన నా ఆ మాటకు ఇచ్చిన సమాధానం నన్ను కొద్దిగా నిరుత్సాహపరచినా, నాకొక గొప్ప సత్యం, తత్త్వం బోధించింది.

ఇంతకీ ఆయన ఏమన్నారంటే, విభక్తి కన్న ‌భక్తి‌ గొప్పది అని. నాకు ఎంతో సంతోషమూ కలిగింది. మనము మాట్లాడే వాక్యస్థితిని మధ్యమా అంటారు. భాషకు నాలుగు స్థాయిలున్నాయి.

అవి పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ.

భాషయొక్క తత్పర లేక తాత్పర్య స్థితిని పరా అంటారు. ఈ స్థితినే శాంత, మౌన, ఆనంద స్థితులనీ అంటారు. దీనినే భక్తి స్థితియనీ అంటారు. జ్ఞాత, జ్ఞేయము కలిసిపోయి, జ్ఞానముగా మిగిలి ఉండడమే ప్రజ్ఞాన స్థితి. ఇదే వేదాంతులు నుడివే శుద్ధాహం, బ్రహ్మ, ఆత్మ స్థితి. ఈ స్థితి లో శాంతము అనుభవమై ఎఱుక కలిగి‌ మనం శుద్ధ గమనికగా ఉంటాము. అలా తత్పర, తాత్పర్య, భక్తి, శుద్ధ జ్ఞాన స్థితులొకటే.

ఆ విధముగా భక్తి స్థితిలో అన్ని మానసిక కార్యక్రమాలు, కార్యకలాపాలు ఆగి మౌనము అనుభవింపబడుతూ ఉంటుంది. సంకల్ప, వికల్పములు కలిగినపుడు ఈ తత్పర తాత్పర్య భక్తి స్థితి చెదిరి, పశ్యంతీ స్థితి అనుభవం లోనికి వస్తుంది. ఈ స్థితి భాషా పరంగా అర్థ స్థితి. వేదాంత పరంగా అనుభవస్థితి. కర్త, కర్మ రహితమైన క్రియా మానసిక స్థితి. అన్ని అవగాహనలు, ఆకళింపులు, గ్రహింపులు ఈ స్థితిగా, ఈ స్థితిలో భద్రపరుపబడి ఉంటాయి. వాసనా స్థితి అన్నా ఇదే.

ఈ వాసనా స్థితి ప్రకోపింపబడినపుడు తలపులు, భావములు, భావనలు, ఆలోచనలు, తర్కం ఉదయిస్తాయి. దీనిని భాషా పరంగా మధ్యమా స్థితి అంటారు. ఇదే వాక్య స్థితి. క్రియ, కర్త, కర్మలతో కలిసి ఉంటుంది. మన తలపులు, భావములు, భావనలు, ఆలోచనలు, తర్కాలు వాక్యములుగానే మెదులుతాయి. ఊహలు, అపోహలు, కవనములు, కావ్యములు, అన్నిరకాల రచనలు వాక్యములు గానే రాయబడతాయి. ఈ వాక్యస్థితినే విభక్తి స్థితి అంటారు.
ఉచ్చరించబడిన వాక్యము శబ్ద రూపమును పొంది వినిపిస్తుంది. ఈ భాషా స్థితిని వైఖరీ అంటారు.

భక్తి స్థితి భగవత్ స్థితి. స్తుతులు, స్తోత్రాలు చేయబడే, కథలు, కధనాలు అల్లబడే మానసిక కార్యకలాపస్థితి
విభక్తి స్థితి. లేదా చెదిరిన భక్తి స్థితి. భక్తి స్థితి పరమాత్మ స్థితి. అహం బ్రహ్మాస్మి స్థితి. ఆ ఆత్మ స్థితిని పోగొట్టుకుని
భగవత్ పరంగానే అల్లినా విభక్తి స్థితిని పొందడం ఒక మెట్టు క్రిందికి దిగడం. భగవంతుని స్తుతిస్తూ ఉండడం కన్నా భగవంతుని గా ఉండడం మేలు కదా! మిన్న కదా!

అందుకనే పురుషోత్థమన్ గారు విభక్తి కన్న ‌భక్తి‌ మిన్న అన్నారు. ముందు ఉత్సాహ భంగం కలిగినా ఆ మాట ఇచ్చిన ప్రేరణ ఎన్నో రెట్లు నన్ను ఆనందపరచింది.

(కాని ఆయన భక్తి అన్నది
" భక్తి తు అస్మిన్ ప్రేమ ప్రేమ రూపా" ఉద్దేశ్యం లో.
ఇది సగుణ నిర్వచనము.

నేను తీసికున్నది నిర్గుణ నిర్వచనమైన
"స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే"
ఉద్దేశ్యం లో.

ఇంకా భగవత్ స్తోత్రాలు, స్తుతులు అల్లుతున్నా, మనసు భక్తి స్థితిని పొంది, అందుండిపోవడానికే మొగ్గు చూపుతోంది.

భక్తి స్థితి, యోగదర్శనము ఉటంకించిన నివృత్తి స్థితి ఒకటే. బౌద్ధుల నిర్వాణ స్థితి, వేదాంతుల మోక్ష స్థితి ఒకటే. ఒకే అనుభవానికి ఎన్నో పేర్లు.

శాంతి, మౌనము, ఆనందము, సత్యమూ నిత్యమూ అనుభవంగా, ఆకళింపు గా ఉండే భక్తి స్థితి యందుండడం ముముక్షువుకు‌ తప్పని సరి.

ఉద్వేగమూ, సుఖదుఃఖాలు ఉండే విభక్తి స్థితి కన్న నిర్మల మానసిక‌ స్థితి కల భక్తి స్థితి ‌అభిలషణీయము.

**********

పరమ పదము - సర్వజ్ఞ పీఠము

మనసు పరమపదాన్ని చేరుట
వ్యక్తిగా‌ పరమపదించుట; పరమపద
సోపాన అధిరోహణమున శిఖరమును
చేరుట; జీవితము వైకుంఠపాళి


కాశిని చేరుటన్నను అదే; శివసాయుజ్య
మన్నను కైలాస వాసమును అదే; మనసు
శమించుటయే మరణమును అధిగమించుట
శాంతి ఆనందం మౌనము సర్వజ్ఞ పీఠము అదియే;
**********
దేవీ దేవతలు సువ్యవస్థకు అడ్డం కారు. దివ్యత్వం వేరు. అన్ని మంచితనాలు దివ్యమైనవే. భక్తి, ఆధ్యాత్మికత సువ్యవస్థలో భాగం. సువ్యవస్థను నిర్మించడానికి, దివ్యతను పరిహరించనవసరము లేదు. దేవీ దేవతలు సువ్యవస్థలో భాగం. సువ్యవస్థకోసం వారిని దూరంగా ఉంచవలసిన అవసరం లేదు. ఎందుకనో దేవీదేవతలను ఒక మతానికి ప్రతీకగా భావించి "నిరసించవలసిన" అవసరం కనిపించదు.
*********

అందరికీ తెలుగుదనం చూడడం, తెలుగుదనం గురించి మాట్లాడడం, వ్యాసములు వ్రాయడం ఇష్టం తప్ప తెలుగువాడిగా ఉండడం ఇష్టం లేదు. లోకో భిన్న రుచి:
*********
మాట మనసుకి ప్రతీక. మనసు చంచలమైనది. మాట నిలచి ఉంటుంది, మనసు మారినా!