Saturday, March 4, 2017

మా సోమనాథ్ యాత్ర -మూడవ, నాలుగవ భాగములు

మా సోమనాథ్ యాత్ర - నాలుగవ భాగము

ఫిబ్రవరి 27 ప్రొద్దున్న అలా ఏడు గంటలకి సోమనాథుని సోమవాగ దర్శనానికి బయలుదేరాము. ఇంకా ‌తెలవారలేదు. చలిగా లేదు గాని, చల్లగా‌ ఉంది. మామూలుగానే షేర్ ఆటోల ద్వారా‌ సోమనాథ్‌ చేరాము.
కొంత మందికి షేర్ ఆటోలు ఎక్కడం మానసిక, మరియు శారీరిక ఇబ్బంది. మరికొందరికి నామోషీ, దర్జా‌ లోపం. మాకు ఆ శషభిషలు ఏమీ లేవు. లగేజీ‌ లేనపుడు ఇబ్బంది అంత ఉండదు. సోమనాథ్ లో గుడి చుట్టుపక్కల హోటళ్ళు, ధర్మశాలలు ఉన్నాయి. వేరావల్ నుంచి వెళ్ళి రానవసరం లేదు.

మేం వెళ్ళేసరికి భానుడు తన బంగరు కిరణములను సోమనాథ‌ దేవాలయంపై, చుట్టుపక్కల ప్రసరిస్తూ ఆహ్లాదమయం చేశాడు. దేవాలయంలో భక్తులు ఎక్కువగా లేరు. కాని క్యూ ఉంది. క్యూలో మన దర్శనం అయిపోగానే వెంటనే వెళ్ళిపోవాలి. కావలిస్తే జనం లేనప్పుడు మళ్ళీ క్యూలో నుంచుని దర్శనం చేసుకోవచ్చు. 15 సెకనులు మించి నుంచోనివ్వరు.

లింగ స్వరూపంలో సోమనాథుడు కనువిందు చేశాడు. రాత్రి అలంకారంలో చూశాము. ఇప్పుడు‌ లింగాకారాన్ని చూస్తున్నాము. ఆ లింగం 1950 లో పునర్నిర్మాణం సమయంలో ప్రతిష్ఠించిన లింగం. అసలు ప్రతిష్ఠించబడిన లింగం దండయాత్రలలో, విధ్వంసాలలో ఎన్నో మారులు ముక్కలు ముక్కలు అయిపోయిఉంటుంది. కాశీలోనూ అంతేకదా. వెనుక ఉన్న పార్వతీ దేవి మందహాసం చిందించుతూ ఆశీర్వదించింది.

సంతృప్తిగా సోమవారం ఉదయం సోమనాథ దర్శనం చేసికొని, అయ్యవారి ఇరుగడలా ఉన్న అంబాదేవి, త్రిపుర సుందరులకు మ్రొక్కి, ఖాళీగా ఒక వేదికగా ఉన్న పార్వతీ దేవి పాత ఆలయభాగం చూసి, వినాయకుని, హనుమంతుని, వెనుక వైపున్న అరేబియా సముద్రాన్ని మరల చూసి, బయట పాత సోమనాథ దేవాలయం దర్శనం చేశాము. ఆవేళ సోమవారం కాబట్టి ఈ పాత దేవాలయంలో పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి.
నమస్కరించి, బయటకు వచ్చి వేరావల్ హోటల్ కి చేరాము. హోటల్ వారి కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ భారీగా చేసి విశ్రమించాము.

అది నిద్రగా మారి మధ్యాహ్నం 3 గంటలకు లేచాము. వెంటనే తెమిలి చుట్టుపక్కల ప్రదేశాల సందర్శనానికి బయలుదేరాము. మాకు ముందుగానే విజిటింగ్ కార్డు ఇచ్చిన ఆటోవాని కార్డులో సందర్శనీయ స్థలాలను గుర్తిమచాము. నిజానికి ఈ సందర్శనపై నాకు అంత ఆసక్తి లేదు. అరుదుగా తన మాట నెగ్గేలా వర్తించే మా ఆవిడ ఈ. సందర్శన జరిగితీరాలని పట్టుబట్టింది. ఆమె మాట విని ఒక మంచి సందర్శన చేయగలిగాను. భర్తలు భార్యల మాటలు అరుదుగా అయినా వినాలి. ఎంతో మంచి జరుగుతుంది.

ఈ ప్రదేశముల సందర్శనకు ఆటోకు ఎంత ఇవ్వచ్చో‌ రైల్లో కలిసిన ఒకాయన సలహా మేరకు ఒక ఆటోవాణ్ణి సంప్రదించాము. వాడు 400 అన్నాడు. మా ఇన్ఫర్మేషన్ ప్రకారము 250 రూపాయలు అన్నాము. ఒప్పుకున్నాడు.
మొదట తీసికొని వెళ్ళినది బాలికాతీర్థ్. ఇక్కడ ప్రస్తుతము ఏ కొలను లేదు. ఒక గుడి కడుతున్నారు. లేదా పునర్నిర్మిస్తున్నారు. ఎవరి గుడి అంటే లోపలికి వెళ్ళి చూడండి అన్నాడు అక్కడి స్వీపరు. లోపలికి వెళ్ళిచూస్తే
కృష్ణపరమాత్మ పడుకొని కాలికి బోయవాని బాణం గుచ్చుకొని ఉన్న శిల్పము. శ్రీకృష్ణుని నిర్యాణము జరిగిన ప్రదేశమది. ఇదే ముఖ్యము అక్కడ. తరవాత సముద్రపుటొడ్డున ఉన్న రెండు శివలింగాలు, ప్రక్కనే ఉన్న శివాలయం చూపించాడు. ఒక మాదిరిగా ఉన్నాయి. తరవాత సోమనాథ దేవాలయం సమీపంలోని మరొక పాత సోమనాథాలయానికి తీసికొని వెళ్ళాడు. చాలా‌ పాతకట్టడము. చాలా చిన్నిది. పురావస్తు శాఖ వారి ప్రకటన
బోర్డు ఉంది. తరవాత తీసికొని. వెళ్ళినది త్రివేణీ‌ సంగమానికి.

ప్రభాస తీర్థం

అక్కడ హిరణ్య, కపిల నదులు కలుస్తున్నాయి. మామూలుగానే సరస్వతి అంతర్వాహిని. అక్కడ ఉన్న ఒకాయన్ని అడిగే వరకు నేను ఏ ప్రదేశాన్ని చూస్తున్నానో‌నాకు తెలియదు. అది ప్రభాస తీర్థం. కృష్ణ నిర్యాణం జరిగిన తీర్థం. కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయలతో సమానమైన ప్రభ, ప్రతిభ కలిగిన తీర్థం. పై క్షేత్రముల వలెనే తీర్థ విధులు పెట్టడానికి అంత ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం.

సోమనాథ దేవాలయంలో శిథిలముల ఫొటోలు చూస్తున్నప్పుడు ఈ ప్రాంతాన్ని పూర్వకాలంలో ప్రభాస్‌ అనే
వారని చదివాను. అది ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఈ సంగమం ఒడ్డున ఎన్నో ఘాట్ లు కట్టారు. ఇక్కడకు ఒక కిలో మీటరు లోపు అరేబియా సముద్రం ఉంది. రెండు నదులు సముద్రంలో కలవ్వు. సముద్రపు ఒడ్డున ఒక పెద్ద డామ్ కట్టారు. నదుల నీరు సముద్రంలో కలవదు, సముద్రం నీరు నదులలో కలవదు. ఈ ప్రదేశం బాగుంది. నాకు నదులని, పర్వతాలని, సముద్రాన్ని, పచ్చదనాన్ని, సెలయేళ్ళని చూడడం ఇష్టం.

ఆ తరవాత హిరణ్య నది ఒడ్డున ఉన్న 5 పాత, క్రొత్త దేవాలయాలను చూశాము. బలరాముడు ‌నిర్యాణం చెందినదీ ఈ ప్రదేశమే. బలరామునికి సర్పరూపంలో ఒక భూగృహ ఆలయం ఉంది. తరువాత పాండవుల గుహ, సూర్యుని ఆలయం, ఒక దేవి ఆలయం చూశాము. దేవి ఆలయం కూడా భూ గృహంలో ఉంది. చాలా సన్నని, ఒకరు మాత్రమే పట్టే గుహద్వారము గుండా క్రిందకు దిగాలి. అమ్నవారి విగ్రహం ప్రత్యేకత కలదిగా లేదు. క్రిందికి వెళ్ళి పైకి రావడం ఒక పెద్ద వ్యాయామము.

గుడులు గొప్పగా లేవు. అలాగే ఉన్నాయి‌ ఆఖరి దేవాలయం కామనాథుని పరిసర గుళ్ళు. ఇక్కడ కూడా ఒక భూగృహ ప్రదేశం ఉంది. అక్కడ శంకరాచార్యులు తపస్సు చేశారని అన్నారు.
తరవాత ఆటో అతనికి బై‌ చెప్పేసి, అతను చెప్పిన షాపులో మంచి టీ తాగి మరల సోమనాథ దర్శనార్థము ఆలయం వైపు అడుగులు వేశాము. ఈ ప్రదేశాలన్నీ సోమనాథ్ కి రెండు, మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. మేము మళ్ళీ ఆలయం చేరేసరికి సాయంకాలం హారతి సమయం. ఇవాళ హారతిని పూర్తిగా చూద్దామని నిశ్చయించుకొని దర్శనం అయ్యాక ఆలయంలోనే కూర్చున్నాము. హారతి కార్యక్రమము ఎంతో హుందాగా, ‌అందంగా, భక్తి ప్రపత్తులతో జరిగింది.

హారతి కార్యక్రమము ఉత్తరాదికి ప్రత్యేకత. దక్షిణాదిని ఈ సాంప్రదాయం ఇంతలా లేదు. గంగా‌హారతి అలా ఉత్తరాదిని హారతులు ఇవ్వడం ఓ ముచ్చట. గోదావరి హారతి, కృష్ణ హారతి అని అనుకరణ ప్రారంభించారు మనవైపు. సాంప్రదాయాలు ఆ ప్రదేశంలో జరిగినప్పుడు అందగిస్తాయి. అరువు తెచ్చుకుంటే అరువు తెచ్చుకున్నట్టే
ఉంటుంది. ఏ ప్రదేశానికి ఆ ప్రదేశం తమ తమ ప్రత్యేకతలను నిలుపుకుంటే బాగుంటుంది. శ్రద్ధాభక్తులతో జరుగుతాయి. సోమనాథ హారతి‌ కడు రమ్యంగా‌ ఉంది.

అరగంట సేపుంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూండగా ధూపము, హారతి స్వామికి, అమ్మవార్లకి, నదీశ్వరునికి ఇవ్వబడతాయి. మధ్యలో రెండుసార్లు దర్శనం క్యూ ఆపేస్తారు. అప్పుడు స్వామి దర్శనం ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అలంకారం మరింత అందగిస్తుంది. నిన్నటి హారతిలో శివ స్మరణం జరిగింది.
ఒక రమ్యలోకంలో అరగంట గడిపిన తరవాత వెనుక వైపున్న అరేబియా సముద్రం పక్కన కూచున్నాము. ఆ సముద్రపు గాలి మరొక సారి పరమేశ్వర దర్శనం చేయించింది. ఆ ఆహ్లాదము మరువరానిది. మరొక అరగంట ఆ ఆహ్లాదాన్ని ఆస్వాదించి వేరావల్ హోటల్ కి చేరి రాత్రికి విశ్రమించాము. రేపు సోమనాథ్-ఓఖా రైలులో ద్వారకకు ప్రయాణం. ఆ యాత్రా విశేషాలనూ పంచుకునే ప్రయత్నం చేస్తాను.

శుభం భూయాత్!

మా సోమనాథ్ యాత్ర - మూడవ భాగము

మహమ్మదు గజనీ, మహమ్మదు ఘోరీ, వాళ్ళ సామంతులు సోమనాథ దేవాలయాన్ని ఎన్నోసారులు విధ్వంసం సృష్టించి ధ్వంసం చేశారు. అన్నిసార్లు నెమ్మదిగా సోమనాథ దేవాలయం పునర్నిర్మాణం జరిగింది.
"సౌరాష్ట్రే సోమనాథం చ‌" అని ద్వాదశ జ్యోతిర్లింగముల జాబితా సోమనాథ్ దేవాలయంతో మొదలవుతుంది. మనవైపు వారెవరూ ఇన్ని శతాబ్దాలలో ఇక్కడికి రావడం చాలా‌ అరుదు అయిఉంటుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాక మనలాంటి వాళ్ళం రావడం సులువు‌ అయింది. ఇక్కడికే కాదు అన్ని క్షేత్రాలకు, పర్యాటక కేంద్రాలకు సులువుగా వెళ్ళి రావడం వీలుగా ఉంది. భక్తి మాట ఎలా ఉన్నా అందరం అన్ని దర్శనాలు చేసికునే ప్రయత్నాలు, ఏర్పాట్లు చేసికుంటున్నాము. 

మేము దేవాలయంలో ప్రవేశించేసరికి హారత కార్యక్రమము ఆఖరుకు వచ్చేసింది. సోమనాథ జ్యోతిర్లింగాన్ని కనులారా, మనసారా చూశాము. ఓం నమశ్శివాయ అనుకుంటూ ఎంతో అందముగా అలంకరింపబడిన ప్రదోష శివుని ఆనందంతో దర్శించుకున్నాము.

సోమనాథ దేవాలయంలో ఒక క్రొత్త విషయం ఉంది. అమ్మవారు పార్వతి. గర్భగుడిలోనే అమ్మవారు అయ్యవారికి వెనుక భాగంలో సర్వాలంకారయుతయై‌ భాసిస్తూ ఉంటుంది. గుడి బయట పార్వతీ దేవి పురాతన దేవాలయం యొక్క శిథిల ప్రదేశం ఉంది. ఒక ఎత్తైన చప్టా‌ మీద అలా ఖాళీగా ‌ఉంది. ఎందరు తురుష్క ముష్కరుల చేతిలో ధ్వంసం అయిపోయిందో కదా. పార్వతీ దేవికి గుడి కడతారేమో.

ఆలయ ప్రాంగణంలోనే ద్వాదశ జ్యోతిర్లింగముల విశేషములతో కూడిన శిల్ప ప్రదర్శన‌శాల ఉంది. వినాయకుడు, ఆంజనేయ స్వామివారలకు ప్రాంగణంలో ఆలయములు ఉన్నాయి. ప్రాంగణాన్ని ఎంతో శ్రద్ధగా, అందంగా ఉంచుతున్నారు. గుడి వెనుక వైపు అరేబియా సముద్రం. గుడి సరిహద్దుని ఆనుకొని ఒక పెద్ద గోడ కట్టారు. సముద్రం ఆటులో నున్నట్టుంది. అమావాస్య కదా. సాయంత్రం.అక్కడ కూర్చుని ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది. గంట సేపు కూర్చుని పక్క సరిహద్దులో ఉన్న సోమానాథుని పాతదేవాలయము అనబడే దానిని చూశాము. ఇది భూ గృహంలో ఉంటుంది. శివలింగం బాగుంది. మునపటి లాగానే అమ్మవారు శివుని వెనుక ఆహ్లాదంగా‌ ఉంది.
ఇక్కడ శివలింగముల ఆకృతి, పరిమాణము ఒకలాగానే ఉన్నాయి.

ఇంక తొమ్మిది కావస్తూంది. షేర్ ఆటోల ద్వారా హోటల్ కి చేరి భుజించి నిదురించాము. మరునాడు సోమవారం. శివునికి ప్రీతియైన రోజని, ఆవేళ సోమనాథుని మళ్ళీ‌ దర్శించు కుంటున్నామని మనసు పొంగిపోతూ‌ఉంది. ఎంతయినా మనసు చంద్రుని వలె కళలు పోతుంది కదా. కొంతసేపు పొంగు, కొంతసేపు కుంగు; సోముని శుక్లవక్ష, కృష్ణపక్ష కళల పెరుగుట, తరుగుట వలె.

మనసు పొంగినా, క్రుంగినా తట్టుకోలేము. నిజానికి, ఆధ్యాత్మికతే అయినా మనసు చెప్పినట్టల్లా ఆడకూడదు. అవును ఆధ్యాత్మికతలో కూడా. బాగుందని ఏదో పూజలోనో , పునస్కారంలోనో, స్వామిజీ, బాబా, అమ్నల సేవలోనో పడేసి తత్త్వానికి దూరంచేసి ఆధ్యాత్మిక జీవన ఫలితాన్ని మనలని పొందనీయదు.

మా ద్వారకా యాత్ర - మొదటి భాగము

మా ద్వారకా యాత్ర - మొదటి భాగము

ద్వారకాధీశుని దర్శనం

మరి మరి మ్రొక్కెద హరికిన్
కారుణ్యోత్తుంగ గిరికిన్
వాత్సల్యామృత ఝరికిన్
సిరి పెనిమిటికిన్ ముక్కంటి సరికిన్

అనుకున్నట్టు సోమనాథ్ - ఓఖా ఎక్స్ ప్రెస్ లో ద్వారక వచ్చాము. ఎందుకో నేను ద్వారక, ఓఖా ఒకే ఊరనుకున్నాను.‌ కాని కాదు. ద్వారక ముందు వస్తుంది, 30 కిలోమీటర్ల తరువాత ఓఖా వస్తుంది. ఓఖా ప్రత్యేకమైన, ప్రత్యేకత గల ఊరు. ఆ విషయాలు తరువాత ముచ్చటించుకుందాం.

మా అబ్బాయి ముందే రిజర్వ్‌ చేసిన హోటల్ కి చేరి స్నాన పానాదులు ముగించి ద్వారకాధీశుని దర్శనానికి బయలుదేరాము. ఊరు కాశీకి మల్లే పాతగా ఉంది. సందులూ కాశీ వలె ఇరుకు. పాత వాసనలతో బాగుంది. ద్వారకాధీశుని కోవెల మేమున్న హోటల్ కి కూత వేటు, అరకిలోమీటరు దూరములో ఉంది. శుభ్రంగా నడిచి వెళ్ళిపోయాము. ఇక్కడా సోమనాథ్ వలె మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు దేవస్థానము వారి కష్టడీకి‌ అప్పగించి లోనికి కదిలాము.

ఒక కుర్ర పురోహితుడు మమ్మల్ని కలిసి ఒక గైడ్ లా దేవాలయ దర్శనము చేయిస్తానని మాకు తోచినది ఇవ్వచ్చని అన్నారు. ఎంత అంటె రూపాయి అయినా రెండు వందలైనా అయినా సరే మీ ఇష్టం అన్నాడు. ఆయన పేరు కశ్యప్. 30-35 మధ్య వయస్కుడు. వాచకము బాగుంది. ఆంగ్లభాష చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ విషయం నాకు ఎంతో నచ్చింది.

అందుకనే గైడ్ ల సంస్కృతి పట్ల అంత ఆసక్తి లేని నేను అతని ప్రపోజల్ కి ఒప్పుకున్నాను. ఇలా పురోహితులు గైడ్ లా గైడ్ చేయడం ద్వారకకు శోభస్కరంగా ఉందేమో అనిపించింది. మనం ఏ పురోహితునీ ఏర్పరచుకోకుండా మనంత మనమూ దర్శనము చేసికోవచ్చు. కశ్యప్, మనకు తెలిసినదే అయినా భాగవత కథనం చేస్తూ కృష్ణ పరమాత్మ గురించి చెబుతూ ఆలయ సందర్శనం చేయించడం మాకు ఎంతో నచ్చింది.

మమ్మల్ని మేము వచ్చిన. వైపు ద్వారం గుండా. లోనికి తీసికొని వెళుతూ దీనిని మోక్షద్వారం అంటారని, ఆలయంలోకి స్వర్గద్వారం వైపునించి ప్రవేశించాలని, దర్శనం పూర్తి అవుతున్న సమయంలో అలా కూడా ప్రవేశిద్దామని కశ్యప్ చెప్పాడు.

ముందుగా క్షేత్రాధీశుడు కుశేశ్వర మహాదేవ్ దర్శనం చేయించాడు. ఆయన శివుడు. ముందుగా నంది లేని శివాలయము. కృష్ణ పరమాత్మ మధుర‌ నుంచి ద్వారకకు మకాం మార్చేటప్పుడు కృష్ణుని కోరిక మేరకు‌ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడున్నంత కాలం శ్రీకృష్ణుడు ఈ ఈశ్వరుని, పక్క గుడిలో ఉన్న అంబికా జీ (పార్వతీ దేవిని) రోజూ అర్చించేవాడు. ద్వారక చుట్టుపక్కల రాజ్యము ‌బలరాముని మామగారిది. రేవతీదేవి పుట్టినిల్లు. బలరాముడు అక్కడ ఉన్నాడని అన్నయ్య దగ్గరకు ‌వచ్చాడు కృష్ణుడు మధురను విడచి.

తరువాత ఎదురుగా ఉన్న గాయత్రీ‌ మాత ఆలయం చూపించాడు. పక్కనే ఉన్న ప్రద్యుమ్న, అనిరుద్ధుల ఆలయాలను చూపించాడు. ప్రద్యుమ్నుడు రుక్మిణీ కృష్ణుల సుతుడు, మన్మథావతారుడు, రతీపతి అంశజుడు, ప్రభావతీ కళత్రము ‌అని మనకు తెలుసు. అతని కొడుకు ‌అనిరుద్ధుడు. శ్రీకృష్ణునికి మనుమడు. ఉషా‌ మనో హరుడు, ప్రియుడు, భర్త అనీ‌ మనకు తెలుసు.

బాణాసురుడు అనిరుద్ధుని చెఱపట్టినపుడు అతనిని ‌విడిపించడానికి కృష్ణుడు శివునితో యుద్ధము చేయవలసి వచ్చినదనీ‌, బ్రహ్మాది దేవతలందరూ అడ్డుపడి‌ ఆ‌ విపరీతాన్ని, ప్రళయాన్ని‌ ఆపారని భాగవత పురాణము, హరివంశము ‌తెలుపుతున్నాయి. అనిరుద్ధ చరిత్ర ఒక తెలుగు కావ్యము. ఉషా పరిణయము కూచిపూడి భాగవతుల ప్రదర్శనలలో‌ అగ్రగణ్యము.

‌ముసలం‌ పుట్టి యాదవులందరూ ‌వారిని వారు నాశనము చేసికుంటున్నప్పుడు అనిరుద్ధుడు‌ అత్తవారి రాజ్యంలో‌ ఉండి మిగిలాడు. ఇది ఈజిప్టు (మిశ్ర రాజ్యము) అని కశ్యప్ అన్నాడు. ఇతని తరువాత ఇతని కొడుకు వ్రజనాథ్‌ సముద్రంలో మునుగక మిగిలిన ద్వారకను వృద్ధిచేసి, అభివృద్ధి పరిచాడని ఐతిహ్యం.

ఈ చూడడం అయ్యాక

భగవద్గీతాచార్యుడు, నరాద్వైతుడు, నీ నా జత, రుక్మిణీ సత్యభామా వల్లభుడు, ప్రహ్లాదాహ్లాదకారకుడు, అర్జున సఖుడు, బాంధవుడు, భక్త వరదుడు, ముక్తి ప్రదాత, శ్రీమన్నారాయణుడు, కందర్ప జనకుడు, కామినీ మనోహరుడు, ద్వారకాధీశుడు అయిన శ్రీకృష్ణభగవానుని, నల్లనివానిని, గోపికా‌ మానసచోరుడు, వస్త్రాపహారి, రాధా సఖుని దర్శనం చేసికున్నాము.

మా అదృష్టం కొద్దీ అవి సరస శృంగార మూర్తియైన కృష్ణ పరమాత్మకి శృంగార హారతి ఇచ్చే క్షణాలు. మనసు ఎంతో రంజనము పొందింది ఆ భాగ్యానికి. ఆ రస క్షణాలు మా. స్వంతం అయేలా కరుణించిన పర దైవతమునకు మనసారా నమస్కరిస్తూ ఆ అందమైన, ఆనందకరమైన క్షణాలను హృదయ రంజకముగా ఆస్వాదించాము. భగవంతునికి ప్రణమిల్లాము, మనసా, వచసా, కర్మణా.

ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడు చతుర్భుజుడు. నీల మేఘశ్యాముని విగ్రహం నల్లనిది. నయనానందకరంగా ఉంది. పై రెండు చేతులలో గద, చక్రములు, క్రింది రెండు చేతులలో శంఖము, ముద్రలకు వెండి తాపడములు ఉన్నాయి. మా చర్మ చక్షువులు, మనో చక్షువు ఆ దివ్య మంగళ విగ్రహాన్ని వీక్షించి తరించాయి. మనసు నిర్మలమై పరమాత్మానుభవాన్ని చవిచూసింది.

చందురుడందం పున్నమి రేయికి
ప్రభాకరుడందం ప్రతి పగటికి
తారకలందం అమవస నిశికి
గోవిందుడందం ప్రతి హృదయానికి

మన పురాణములు, భగవత్ కథలు నమ్మకము వలన మరింత రమ్యముగా, రంజకముగా ఉంటాయి. నమ్మకము లేకపోతే ఏవో అబద్ధాల పుట్టలుగా అనిపిస్తాయి. పురాణములు పుక్కిటివి అని కదా నానుడి.

తరవాత కశ్యప్ మాకు దూర్వాస మహాముని ఆలయం చూపించాడు. దూర్వాసుడు కృష్ణుని వంశం వారికి, హరి వంశీకులకు కులగురువు. శ్రీకృష్ణుడు, రుక్మిణి విదర్భ దేశంలోని కుండిన నగరం నుంచి పారిపోయి వస్తూ గాంధర్వ వివాహం చేసికొని తమ కులగురువైన దూర్వాసుని కూడా, తమతో కూడా ద్వారకకు రమ్మని ఆహ్వానించారు.
గుర్రములను తీసివేసి కృష్ణుడూ, రుక్మిణీ తామే గుర్రములై రథాన్ని లాగితే వస్తానన్నాడు. అలాగే అని దూర్వాసుని రథముపై ఆరోహింప జేసి, కృష్ణుడూ, రుక్మిణీ గుర్రములై రథాన్ని ద్వారకకు నడపసాగారు. ఆ శ్రమ వల్ల రుక్మిణికి తీవ్రమైన దాహం కలిగింది. తట్టుకోలేక పోయింది. మంచినీళ్ళతో దాహం తీర్చమని కృష్ణుని కోరుకుంది. అంతట ఆయన తన అంగుళీయకముతో నేలను తవ్వి గంగను రప్పించాడు. ఆ గంగోదకముతో రుక్మిణీ కృష్ణులిరువురు తమ దప్పిక తీర్చుకున్నారు.

ఇదంతా దూర్వాస మహర్షికి నచ్చలేదు. తన సహజ స్వభావం కొద్దీ ఎంతో కుపితుడైనాడు. గురువునైన నాకు ఆహార, పానీయముల వ్యవస్థ కల్పించకుండా మీరిరువురే దప్పిక తీర్చుకుంంటారా, అని కోపంలో మామూలుగానే, ఆ‌ ఆది దంపతులను శపించాడు.

"రుక్మిణీ కృష్ణులిద్దరూ పన్నెండేళ్ళ పాటు వియోగం అనుభవించాలని, ద్వారకలో మంచినీరు దొరకదని, పంటలు పండవని" ఆ శాప సారాంశం.

ఈ కథ కశ్యప్ చెప్పాడు. ఆ కథ చెప్పడానికి ఇంకో కారణం కూడా ఉందని నాకు తరువాత అవగతమైంది. అదేమిటో ఆ సందర్భం వచ్చినపుడు రెండవ భాగంలో చెబుతాను. ఇప్పటికి స్వస్తి.

ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం
హృత్ పద్మ మధ్యే సతతం వ్యవస్థితమ్
సమాహితానాం సతతాభయ ప్రదం
తే యాంతి సిద్ధిం పరమాం చ వైష్ణవీం

మా ద్వారకా యాత్ర - రెండవ భాగము

మా ద్వారకా యాత్ర - రెండవ భాగము

అందమైన అర్థము నిచ్చు పదములు అలంకారం రచనకి
మందమైన నడక నిచ్చు పదములు అలంకారం తరుణ రమణికి
డెందమును ఊయలలూపు పదములు అవసరం కవితకి
నంద గోపబాలుడు గోవిందుని పదములు అవసరం మనశ్శాంతికి

అవగాహన లేని జ్ఞాన సముపార్జనము
ఆచరణ లేని సదాచార శ్రవణము
ఉపాసన కాని విద్యాభ్యాసము
మూఢత నిండిన‌ గోవింద తత్త్వావలోకనము
పృథివిని నేడు ఆవరించి అలుముకున్నవి
గోవిందా! కలినేమి నీ ఈ వింత వింతలు జనార్దనా!

ద్వారకాధీశుని దివ్య దర్శనము‌ అయ్యాక కశ్యప్ మమ్మల్ని అమ్మవార్ల, శ్రీకృష్ణుని‌ రాణుల దేవాలయాల సందర్శనం చేయించాడు. ముందుగా‌ జాంబవతీ ఆలయం, పిదప రాధికా‌దేవి ఆలయం చూపించాడు. నాకు రాధ పదము కన్న రాధికా పదము మీద మోజు కొంచెం ఎక్కువ.

శ్రీలక్ష్మ్యార్ధనారాయణ దర్శనం

మనందరము‌ శివపార్వతుల అర్ధనారీశ్వర తత్త్వానికి, రూపానికి బాగా‌ అలవాటు పడ్డవాళ్ళము. ద్వారకలో లక్ష్మీదేవి‌ అర్ధ భాగమై ఉండగా‌ ఒకే‌ విగ్రహములో లక్ష్మీనారాయణులను చెక్కిన శిల్పానికి ఆలయం ఉంది. ఇది‌ వింతగాను, సరదాగాను, అర్ధనారీశ్వర తత్త్వాన్ని లక్ష్మీ నారాయణులకు అనువదించిన తీరు ముచ్చట గొలిపింది. ఆపై‌ రాధా‌మాధవుల గుడి, ద్వారకాధీశుని ప్రతిరూపమైన మరొక విగ్రహం కల ఆలయాన్ని‌, సత్యభామ ‌ఆలయాన్ని‌, సరస్వతీ దేవి ఆలయాన్ని చూశాము. బలరాముని, దేవకీ మాతల ఆలయాలను దర్శించాము.

ద్వారకా శంకర మఠ పీఠాధిపతి‌ ఆవాసము ఈ‌ ద్వారకాధీశుని ఆలయ ప్రాంగణం లోనే‌ ఉంది. ముందుగా, శారదాంబా విగ్రహము, ఆపై ద్వారకాపీఠ శంకరాచార్యుల వారు శ్రీ స్వరూపానందుల పటము, ఆది శంకరాచార్యుల విగ్రహము వరుసగా ఉన్నాయి. శంకరాచార్యులు శ్రీ స్వరూపానంద్ జీ మహరాజ్ పర్యటనలో ఉన్నారు.

ఆపై ఒక ఎత్తైన ప్రదేశంలో‌ శంకరాచార్యుల వారు పూజించే‌ చంద్రమౌళీశ్వర స్వామి, నవగ్రహముల రజత విగ్రహముల బొమ్మల కొలువు ఉంది. వారికి, వాటికి నమస్కరించి, గుడి బయటకు‌ మరొక వైపు నుంచి వచ్చాము.
మాతో సందర్శన చేయిస్తున్న క్షణం నుంచీ‌ కశ్యప్ ద్వారకను శ్రీకృష్ణుని కర్మభూమిగా పరిచయం చేస్తూ, కృష్ణభగవానుడు తన పాతికో ఏట ఇక్కడకు వచ్చి వంద సంవత్సరములు ద్వారకను పాలించి తన నూట పాతికో ఏట నిర్యాణం చెందాడని చెబుతూ వచ్చాడు. కృష్ణ పరమాత్మ పాతిక అడుగుల ఎత్తు ‌ఉండేవాడనీ‌, అ నీడలు (ఛాయలు) ఆలయ నిర్మాణంలో ప్రతిబింబిస్తున్నాయని, ఏవేవో పోలికలు చెప్పాడు. ఆలయానికి ఏడు‌ అంతస్తులు ఉన్నాయి. వాటికీ ఏదో చెప్పాడు.

కృష్ణుని లీలలు నంద వ్రజము, బృందావనం, మధురల లోనివి మనకు చాలా పరిచయము.‌ అంతకు‌ మించి ఎన్నో సంవత్సరాలు ద్వారకలో పాలన చేశాడు‌ కృష్ణుడు. యదువంశంలో ముసలం పుట్టి వారు‌ తమ వంశాన్ని నిర్మూలనం చేసికుంటున్నప్పుడు‌ శ్రీకృష్ణుడు, బలరాముడు ‌సోమవాథ్ పక్కన‌గల‌ ప్రభాస తీర్థం పరిసరాల అరణ్యము లోనికి వచ్చారు. అక్కడ బోయవాని బాణానికి కృష్ణుడు‌ నిర్యాణం చెందడానికి ముందుగా బలరాముడు‌ నిర్యాణం చెందాడు.

కృష్ణుడు‌ ఆ రోజులలో ఆహారం తీసికునే (భోజన) సమయానికి పూరీ జగన్నాథానికి వెళ్ళేవాడని (ద్వారకలో పంటలు పండవు, మంచి నీళ్ళు దొరకవు అని దూర్వాసుని శాపం ఉంది కదా) ఐతిహ్యాన్ని కశ్యప్ ఉటంకించాడు. అతని మాటల్లో చార్ ధామ్‌ అనే పదం చాలాసార్లు వచ్చింది.

ఆ నాలుగు ధామ్ లు - రామేశ్వరం, పూరీ జగన్నాథం, బదరి, ద్వారక. ఇందులో రామేశ్వరం జ్ఞానభూమి అనీ, జగన్నాథ పూరీ ఆహార భూమి అనీ, బదరి మోక్షభూమి అనీ, ద్వారక కర్మభూమి అనీ;

ద్వారకా దర్శనంతో‌ మనిషి ఇహలోక జీవితానికి పరిపక్వత వచ్చి, రాలిపోయే ముందు భగవద్దర్శనం చేసికొని పరమాత్మలో ఆనందరూపంలో కలిసిపోతాడని భగవంతుడు ‌మాతో అన్నట్టు‌ నాకు‌ అనిపించింది. నేను, మా ఆవిడ సంసార బాధ్యతలను శ్రద్ధగా వహిస్తూ, సంసార తాపత్రయాలను ‌నెమ్మదిగా‌ తగ్గించుకుంటూ వానప్రస్థాశ్రమం లోనికి బుడి బుడి‌ అడుగులు వేస్తున్నాం. ద్వారక తీర్థయాత్ర మాకు ‌ఆ అనుభవాన్ని, అవగాహనను రుచి చూపించింది.

ఎత్తులు పల్లములు సహజము రమణికి
మెత్తని పల్లవములు సహజము తరువునకు
తీయని జలములు సహజము నల్లని మబ్బుకు
హాయిని కలిగించుట సహజము నల్లనయ్య గోవిందునకు

ద్వారకను మరుభూమి‌ అని కూడా అన్నాడు‌ కశ్యప్. యాదవులందరూ మడిసిన భూమి కదా అది. మరుభూమిలో శరీరం తన ఆకృతిని భస్మం చేసి కుంటుంది. ఇక్కడ ద్వారకలో కూడా‌ మన శరీర స్పృహ, అహంకార మమకార స్మృతి భస్మీపటలం చెంది‌ మిగల కుండా, వాటి జనన ప్రదేశంలో‌ఉనికిని కోల్పోవడంగా ద్వారకాధీశుని సందర్శన ఫలంగానూ‌ చెప్పుకోవచ్చు.

మానసిక కార్యకలాపములు తమ జనన ప్రదేశమైన‌ బ్రహ్మములో లీనమవడంగా కూడా‌ ఈ ద్వారకాధీశ ‌దర్శనాన్ని‌ అన్వయించుకోవచ్చు.

అప్పుడు కశ్యప్ మమ్మల్ని ఒక శాల లోనికి తీసికొని వెళ్ళాడు. అక్కడ‌ ధాన్యములు, పంచదార, పప్పులు, నేయి లతో తులాభారం, అన్నదానం లకు ధన సమర్పణ వ్యవస్థలు కల ప్రదేశం. ద్వారకలో ఏ పంటలూ పండవు గనక (ఇప్పుడూ ద్వారక చుట్టు పక్కల అంతా‌ ఎరిడ్ (arid) గా‌ ఉంది. చవుడు నేల. చవిటి పర్ర. ఉప్పు నీరు. ఏ పంటలూ అస్సలు పండవు. సస్యశ్యామలతే లేదు. క్షార భూమి.

అందుకని పూర్వకాలంలో యాత్రీకులనుంచి ఈ ‌వస్తు సంగ్రహం చేయడానికి ఈ ‌వ్యవస్థ పెట్టారని నాకు అనిపించింది. ఇప్పుడు పరిస్థితులు మారినా ఈ పద్ధతి ఇంకా‌ పా టిస్తున్నారని నాకు అవిపించింది. ద్వారకాధీశుని ఆలయాన్ని పురోహితుల సంఘం నిర్వహిస్తుంది. వారి మనుగడకై ఆ రోజులలో ఈ ఏర్పాటు చేయబడింది. తమిళనాడు లోని చిదంబర ఆలయ నిర్వహణ కూడా గురుకులులు చేస్తారు.

మేము 45 రోజులకు అన్నదాన నిర్వహణ ఖర్చు నిమిత్తం ధన సమర్పణ చేశాము. ఈ ‌కార్యక్రమము‌ మనకు ఇష్టం కాని, నమ్మకం కాని లేని పక్షాన చేయనవసరం‌ లేదని నాకు అనిపించింది.

అటు పిమ్మట ఆలయ ఆ ద్వారం గుండా బయటకి‌ వచ్చి మెట్లు దిగితే గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశం వస్తుంది. సాగర నదీజల వయ్యారపు సంగమం అక్కడనుంచి‌ కనిపించే‌ సుందర దృశ్యం. గోమతీ నది‌ లక్నో నగరం పక్కనుంచి ప్రవహిస్తుంది. ఈ గోమతి, ఆ గోమతి వేరు. గోమతీ నదీ జలంతో‌ ప్రోక్షణం చేసికొని, ద్వారక సందర్శన లోని స్నాన్ కార్యక్రమము పూర్తి చేసికొని,‌దాన్‌ ముందే‌ ఇచ్చి;

ఇప్పుడు జ్ఞాన్ ;

గోమతి నది ఘాట్ నుంచి ఆలయానికి‌ 56 మెట్లు ఎక్కుతూ ఓం‌ నమో భగవతే‌ వాసుదేవాయ అని స్మరించుకుంటూ, 56 వికారములను పోగొట్టమని నేను - 56 సంఖ్య కశ్యప్ చెప్పినది - (మా ఆవిడ మాత్రం ఏ వికారమూ కలగకూడదంటూ) కృష్ణపరమాత్మను వేడుకుంటూ జ్ఞాన సిద్ధికై ప్రార్ధిస్తూ యాత్రా సాఫల్యాన్ని కూర్చమనీ అచ్యుతుని అర్ధిస్తూ, స్వర్గ ద్వారమైన ఆ‌వైపు నుంచి మరల ఆలయ ప్రవేశం చేసి కృష్ణ‌పరమాత్మను మరొక సారి తనివితీరా దర్శించి కృతార్ధులమైనాము.

ఇంతటి దివ్యానుభవాన్ని పూర్తిగా తన గైడెన్స్ ద్వారా నే అని కాకుండా, తన మాటలతో‌ మా ఊహలకు రెక్కలనిచ్చి, మా అంతట మాకు అవగాహనకు వీలు కల్పించిన, మా యాత్రను అందగింపజేసిన ‌కశ్యప్ కు మనసారా దక్షిణ ‌అనుకున్నట్టు సమర్పించి, నమస్కరించి అతని నుంచి శలవు తీసికున్నాము.

వాదములు ప్రసంగములు వేదాంతములు
శుష్కాయాసములు; చూపించలేవు పరంధాముని;
నిరంతర గోవింద నామ స్మరణమున
శుద్ధమైన మనసు చూచును విశ్వాత్ముని

మా ద్వారకా యాత్ర - రెండవ భాగము

మా ద్వారకా యాత్ర - రెండవ భాగము

అందమైన అర్థము నిచ్చు పదములు అలంకారం రచనకి
మందమైన నడక నిచ్చు పదములు అలంకారం తరుణ రమణికి
డెందమును ఊయలలూపు పదములు అవసరం కవితకి
నంద గోపబాలుడు గోవిందుని పదములు అవసరం మనశ్శాంతికి

అవగాహన లేని జ్ఞాన సముపార్జనము
ఆచరణ లేని సదాచార శ్రవణము
ఉపాసన కాని విద్యాభ్యాసము
మూఢత నిండిన‌ గోవింద తత్త్వావలోకనము
పృథివిని నేడు ఆవరించి అలుముకున్నవి
గోవిందా! కలినేమి నీ ఈ వింత వింతలు జనార్దనా!

ద్వారకాధీశుని దివ్య దర్శనము‌ అయ్యాక కశ్యప్ మమ్మల్ని అమ్మవార్ల, శ్రీకృష్ణుని‌ రాణుల దేవాలయాల సందర్శనం చేయించాడు. ముందుగా‌ జాంబవతీ ఆలయం, పిదప రాధికా‌దేవి ఆలయం చూపించాడు. నాకు రాధ పదము కన్న రాధికా పదము మీద మోజు కొంచెం ఎక్కువ.

శ్రీలక్ష్మ్యార్ధనారాయణ దర్శనం

మనందరము‌ శివపార్వతుల అర్ధనారీశ్వర తత్త్వానికి, రూపానికి బాగా‌ అలవాటు పడ్డవాళ్ళము. ద్వారకలో లక్ష్మీదేవి‌ అర్ధ భాగమై ఉండగా‌ ఒకే‌ విగ్రహములో లక్ష్మీనారాయణులను చెక్కిన శిల్పానికి ఆలయం ఉంది. ఇది‌ వింతగాను, సరదాగాను, అర్ధనారీశ్వర తత్త్వాన్ని లక్ష్మీ నారాయణులకు అనువదించిన తీరు ముచ్చట గొలిపింది. ఆపై‌ రాధా‌మాధవుల గుడి, ద్వారకాధీశుని ప్రతిరూపమైన మరొక విగ్రహం కల ఆలయాన్ని‌, సత్యభామ ‌ఆలయాన్ని‌, సరస్వతీ దేవి ఆలయాన్ని చూశాము. బలరాముని, దేవకీ మాతల ఆలయాలను దర్శించాము.

ద్వారకా శంకర మఠ పీఠాధిపతి‌ ఆవాసము ఈ‌ ద్వారకాధీశుని ఆలయ ప్రాంగణం లోనే‌ ఉంది. ముందుగా, శారదాంబా విగ్రహము, ఆపై ద్వారకాపీఠ శంకరాచార్యుల వారు శ్రీ స్వరూపానందుల పటము, ఆది శంకరాచార్యుల విగ్రహము వరుసగా ఉన్నాయి. శంకరాచార్యులు శ్రీ స్వరూపానంద్ జీ మహరాజ్ పర్యటనలో ఉన్నారు.

ఆపై ఒక ఎత్తైన ప్రదేశంలో‌ శంకరాచార్యుల వారు పూజించే‌ చంద్రమౌళీశ్వర స్వామి, నవగ్రహముల రజత విగ్రహముల బొమ్మల కొలువు ఉంది. వారికి, వాటికి నమస్కరించి, గుడి బయటకు‌ మరొక వైపు నుంచి వచ్చాము.
మాతో సందర్శన చేయిస్తున్న క్షణం నుంచీ‌ కశ్యప్ ద్వారకను శ్రీకృష్ణుని కర్మభూమిగా పరిచయం చేస్తూ, కృష్ణభగవానుడు తన పాతికో ఏట ఇక్కడకు వచ్చి వంద సంవత్సరములు ద్వారకను పాలించి తన నూట పాతికో ఏట నిర్యాణం చెందాడని చెబుతూ వచ్చాడు. కృష్ణ పరమాత్మ పాతిక అడుగుల ఎత్తు ‌ఉండేవాడనీ‌, అ నీడలు (ఛాయలు) ఆలయ నిర్మాణంలో ప్రతిబింబిస్తున్నాయని, ఏవేవో పోలికలు చెప్పాడు. ఆలయానికి ఏడు‌ అంతస్తులు ఉన్నాయి. వాటికీ ఏదో చెప్పాడు.

కృష్ణుని లీలలు నంద వ్రజము, బృందావనం, మధురల లోనివి మనకు చాలా పరిచయము.‌ అంతకు‌ మించి ఎన్నో సంవత్సరాలు ద్వారకలో పాలన చేశాడు‌ కృష్ణుడు. యదువంశంలో ముసలం పుట్టి వారు‌ తమ వంశాన్ని నిర్మూలనం చేసికుంటున్నప్పుడు‌ శ్రీకృష్ణుడు, బలరాముడు ‌సోమవాథ్ పక్కన‌గల‌ ప్రభాస తీర్థం పరిసరాల అరణ్యము లోనికి వచ్చారు. అక్కడ బోయవాని బాణానికి కృష్ణుడు‌ నిర్యాణం చెందడానికి ముందుగా బలరాముడు‌ నిర్యాణం చెందాడు.

కృష్ణుడు‌ ఆ రోజులలో ఆహారం తీసికునే (భోజన) సమయానికి పూరీ జగన్నాథానికి వెళ్ళేవాడని (ద్వారకలో పంటలు పండవు, మంచి నీళ్ళు దొరకవు అని దూర్వాసుని శాపం ఉంది కదా) ఐతిహ్యాన్ని కశ్యప్ ఉటంకించాడు. అతని మాటల్లో చార్ ధామ్‌ అనే పదం చాలాసార్లు వచ్చింది.

ఆ నాలుగు ధామ్ లు - రామేశ్వరం, పూరీ జగన్నాథం, బదరి, ద్వారక. ఇందులో రామేశ్వరం జ్ఞానభూమి అనీ, జగన్నాథ పూరీ ఆహార భూమి అనీ, బదరి మోక్షభూమి అనీ, ద్వారక కర్మభూమి అనీ;
ద్వారకా దర్శనంతో‌ మనిషి ఇహలోక జీవితానికి పరిపక్వత వచ్చి, రాలిపోయే ముందు భగవద్దర్శనం చేసికొని పరమాత్మలో ఆనందరూపంలో కలిసిపోతాడని భగవంతుడు ‌మాతో అన్నట్టు‌ నాకు‌ అనిపించింది. నేను, మా ఆవిడ సంసార బాధ్యతలను శ్రద్ధగా వహిస్తూ, సంసార తాపత్రయాలను ‌నెమ్మదిగా‌ తగ్గించుకుంటూ వానప్రస్థాశ్రమం లోనికి బుడి బుడి‌ అడుగులు వేస్తున్నాం. ద్వారక తీర్థయాత్ర మాకు ‌ఆ అనుభవాన్ని, అవగాహనను రుచి చూపించింది.

ఎత్తులు పల్లములు సహజము రమణికి
మెత్తని పల్లవములు సహజము తరువునకు
తీయని జలములు సహజము నల్లని మబ్బుకు
హాయిని కలిగించుట సహజము నల్లనయ్య గోవిందునకు

ద్వారకను మరుభూమి‌ అని కూడా అన్నాడు‌ కశ్యప్. యాదవులందరూ మడిసిన భూమి కదా అది. మరుభూమిలో శరీరం తన ఆకృతిని భస్మం చేసి కుంటుంది. ఇక్కడ ద్వారకలో కూడా‌ మన శరీర స్పృహ, అహంకార మమకార స్మృతి భస్మీపటలం చెంది‌ మిగల కుండా, వాటి జనన ప్రదేశంలో‌ఉనికిని కోల్పోవడంగా ద్వారకాధీశుని సందర్శన ఫలంగానూ‌ చెప్పుకోవచ్చు.

మానసిక కార్యకలాపములు తమ జనన ప్రదేశమైన‌ బ్రహ్మములో లీనమవడంగా కూడా‌ ఈ ద్వారకాధీశ ‌దర్శనాన్ని‌ అన్వయించుకోవచ్చు.

అప్పుడు కశ్యప్ మమ్మల్ని ఒక శాల లోనికి తీసికొని వెళ్ళాడు. అక్కడ‌ ధాన్యములు, పంచదార, పప్పులు, నేయి లతో తులాభారం, అన్నదానం లకు ధన సమర్పణ వ్యవస్థలు కల ప్రదేశం. ద్వారకలో ఏ పంటలూ పండవు గనక (ఇప్పుడూ ద్వారక చుట్టు పక్కల అంతా‌ ఎరిడ్ (arid) గా‌ ఉంది. చవుడు నేల. చవిటి పర్ర. ఉప్పు నీరు. ఏ పంటలూ అస్సలు పండవు. సస్యశ్యామలతే లేదు. క్షార భూమి.

అందుకని పూర్వకాలంలో యాత్రీకులనుంచి ఈ ‌వస్తు సంగ్రహం చేయడానికి ఈ ‌వ్యవస్థ పెట్టారని నాకు అనిపించింది. ఇప్పుడు పరిస్థితులు మారినా ఈ పద్ధతి ఇంకా‌ పా టిస్తున్నారని నాకు అవిపించింది. ద్వారకాధీశుని ఆలయాన్ని పురోహితుల సంఘం నిర్వహిస్తుంది. వారి మనుగడకై ఆ రోజులలో ఈ ఏర్పాటు చేయబడింది. తమిళనాడు లోని చిదంబర ఆలయ నిర్వహణ కూడా గురుకులులు చేస్తారు.

మేము 45 రోజులకు అన్నదాన నిర్వహణ ఖర్చు నిమిత్తం ధన సమర్పణ చేశాము. ఈ ‌కార్యక్రమము‌ మనకు ఇష్టం కాని, నమ్మకం కాని లేని పక్షాన చేయనవసరం‌ లేదని నాకు అనిపించింది.

అటు పిమ్మట ఆలయ ఆ ద్వారం గుండా బయటకి‌ వచ్చి మెట్లు దిగితే గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశం వస్తుంది. సాగర నదీజల వయ్యారపు సంగమం అక్కడనుంచి‌ కనిపించే‌ సుందర దృశ్యం. గోమతీ నది‌ లక్నో నగరం పక్కనుంచి ప్రవహిస్తుంది. ఈ గోమతి, ఆ గోమతి వేరు. గోమతీ నదీ జలంతో‌ ప్రోక్షణం చేసికొని, ద్వారక సందర్శన లోని స్నాన్ కార్యక్రమము పూర్తి చేసికొని,‌దాన్‌ ముందే‌ ఇచ్చి;

ఇప్పుడు జ్ఞాన్ ;

గోమతి నది ఘాట్ నుంచి ఆలయానికి‌ 56 మెట్లు ఎక్కుతూ ఓం‌ నమో భగవతే‌ వాసుదేవాయ అని స్మరించుకుంటూ, 56 వికారములను పోగొట్టమని నేను - 56 సంఖ్య కశ్యప్ చెప్పినది - (మా ఆవిడ మాత్రం ఏ వికారమూ కలగకూడదంటూ) కృష్ణపరమాత్మను వేడుకుంటూ జ్ఞాన సిద్ధికై ప్రార్ధిస్తూ యాత్రా సాఫల్యాన్ని కూర్చమనీ అచ్యుతుని అర్ధిస్తూ, స్వర్గ ద్వారమైన ఆ‌వైపు నుంచి మరల ఆలయ ప్రవేశం చేసి కృష్ణ‌పరమాత్మను మరొక సారి తనివితీరా దర్శించి కృతార్ధులమైనాము.

ఇంతటి దివ్యానుభవాన్ని పూర్తిగా తన గైడెన్స్ ద్వారా నే అని కాకుండా, తన మాటలతో‌ మా ఊహలకు రెక్కలనిచ్చి, మా అంతట మాకు అవగాహనకు వీలు కల్పించిన, మా యాత్రను అందగింపజేసిన ‌కశ్యప్ కు మనసారా దక్షిణ ‌అనుకున్నట్టు సమర్పించి, నమస్కరించి అతని నుంచి శలవు తీసికున్నాము.

వాదములు ప్రసంగములు వేదాంతములు
శుష్కాయాసములు; చూపించలేవు పరంధాముని;
నిరంతర గోవింద నామ స్మరణమున
శుద్ధమైన మనసు చూచును విశ్వాత్ముని

మా ద్వారకా యాత్ర - మూడవ భాగము

మా ద్వారకా యాత్ర - మూడవ భాగము

ద్వారకాధీశ దర్శన సుధాంబుధిలో మునకలు వేసి రసప్లావిత మనస్కులమై ఆలయ ప్రాంగణంలోనే చాలా సేపు కూర్చున్నాము. బయటకి వచ్చి భోజనం చేసి ద్వారక చుట్టుపక్కల దర్శనీయ స్థలములను చూడ్డానికి 5 గంటలు సమయం పట్టే ప్రైవేట్ టూరిష్ట్‌ మినీ బస్ లో సీట్లు రిజర్వు చేసికొని ఆ మధ్యాహ్నం 2-7 p.m. కి మినీ టూర్ కి బయలుదేరి వెళ్ళాము. ఆ టూర్ చూపించే చోట్లు: రుక్మిణీ దేవి ఆలయం, ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకటైన నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, గోపీ తలాబ్, బెట్ ద్వారక.

ఇవన్నీ ద్వారకకు 30 కి.మీ‌ పరిధిలో ఉన్నాయి.

ముందుగా రుక్మిణీ‌దేవి‌ మందిర దర్శనము. దూర్వాస మౌని శాపము వలన రుక్మణీ కృష్ణులకు 12 ఏళ్ళ ఎడబాటు ప్రాప్తించింది కదా. అందుకని రుక్మిణీ ఆలయం 12 కి. మీ. దూరంలో వసించింది. అక్కడ ఒక ఆలయం కట్టారు. చిన్నది. ఇక్కడ దూర్వాస ముని శాప కథ చెప్పి జలదానానికి చందా‌ అడిగారు. ఎక్కువ మంది స్పందించ లేదు. ఆ కార్యక్రమము జన సమ్మర్దం వల్ల 20 నిమిషాలు పట్టింది. సంసార పక్షముగా ఉంది.

పిట్ట పాటలో ఏటి నీటిలో
వీచు గాలిలో పూచిన పూవులో
నాతి ప్రేమలో నీతి నడతలో
కల గోవిందుడు కలడంతట

శ్రీరమణీ కుచదుర్గ విహారివి నీవు
శ్రీ రాధా తనులతానందనా రసికుడ వీవు
శృంగారరస సామ్రాట్టువు; రసికా వతంసుడవు
రసపట్టులో తర్కం, మెట్ట వేదాంతం ఆపమని
ఈ స్వయంభూ కుహనా సన్యాసులకు బుర్రకెక్కు
నట్టు చెప్పి; మా రత్యానందములకు పానకంలో
పుడకలు కావద్దని దంండించుము ఈ ఆధ్యాత్మిక
గురువుల రసావతారా! నందనందనా! గోవిందా!

వర్షము పడనున్నప్పటి చల్లని గాలి కలిగించును హర్షము
శరత్తున పున్నమి వెన్నెలలిచ్చును సుఖము; వేసంగిని
గుబాళించి హాయి నిచ్చును మల్లియలు; గోవిందుని స్మరించిన
కలుగును అట్టి హర్షము సుఖము హాయి ఎల్లవేళల యందు

Buy one, get one free - నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం

ఈ ప్రకటన మనం అన్ని ఆధునిక అంగళ్ళలోనూ చూస్తాము. దానికి లోనై కొంటూంటాము కూడా. సోమనాథ్ యాత్ర మొదటి వ్యాసములో జ్యోతిర్లింగ దర్శనం; ముందు తెలిసి అనుకొని చేసిన యాత్ర. తర్వాత ద్వారక సందర్శించుకొని, చుట్టు పక్కల చిన్నా చితక దర్శనీయ క్షేత్రాలను, స్థలాలను చూసుకుని‌ మార్చ్‌ 3 న బొంబాయికి‌ సౌరాష్ట్ర మెయిల్ లోనే తిరుగు ప్రయాణానికి బుక్ చేసికున్నాము.

(సౌరాష్ట్ర మెయిల్‌ బొంబాయిలో ఒక రైలుగా బయలుదేరి, రాజ్ కోట జంక్షన్ వద్ద రెండు భాగములుగ విడుతుంది. ఒక భాగము వేరావల్ (సోమనాథ్), రెండవ భాగము ఓఖా (ద్వారక) వెళతాయి. తిరుగు ప్రయాణంలో ఓఖా, వేరావల్ ల నుంచి విడి విడిగా బయలుదేరి, రాజ్‌కోటలో కలసి ఒక రైలుగా బొంబాయి చేరతాయి).

మనం షాపులలో buy one get one free అనుభవాన్ని మనకు మనం కలిగించుకుంటాము. అంతటి అనుభవాన్ని‌ సాక్షాత్తూ లయ కారకుడు పరమేశ్వరుడే మనకు కలిగిస్తే కలిగే ఆనందానికి అవధులుండవు కదా.

ప్రణమామి శంకరమ్
భక్తజన కింకరమ్
భవతిమిర భాస్కరమ్
పార్వతీ సహచరమ్

అని శివుని తలచుకుంటూ ఉంటాను. అట్టి భక్త జన కింకరుడు, భక్త సులభుడు, భోళా శంకరుడు తనంత తాను మాకు‌ మరొక జ్యోతిర్లింగ దర్శనం ప్రసాదించాడు. ద్వారకలో ఈ మినీ‌బస్ ఎక్కేవరకు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన దారుకావన స్థిత నాగేశ్వరుడు మేము దర్శించబోయే నాగేశ్వరుడు‌ ఒకరేనని నాకు తెలియదు. బీహర్ లోనో ఎక్కడో ఉందనుకున్నాను. ఇదే అది అని తలిసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. పరమేశ్వరుడిచ్చిన‌ వరంగా ఈ ‌దర్శనాన్ని‌ మేము గణించుకున్నాము. ద్వారకకు‌ ఇంత సమీపమని తెలియదు. ఈ పర్యటనలో భోలానాథ్, మహదేవ్ అని ఈ ‌ప్రాంతంలో కొలవబడే సదాశివుడు మాకిచ్చిన బోనస్ ఈ దర్శనము.

నాగేశ్వరుని ఆలయం, జ్యోతిర్లింగము‌ కనుల విందుగా‌ ఉన్నాయి. అమ్మవారు పార్వతి. సోమనాథ్ దేవాలయం వలె ఇక్కడ కూడా‌ అమ్మవారు అయ్యవారి లింగం వెనుక ప్రతిష్ఠితయై ఉన్నారు. పరమశివుని కరుణకు పొంగిపోతూ
దారుకావన స్థిత నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని, అమ్మవారిని తనివి తీరా‌ దర్శించాము. ప్రార్ధించాము. మవసారా కొలిచాము. మవసు శాంతానందమయమైంది. హృదయమున ప్రశాంతత వెల్లి విరిసింది.

ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులను నాగుడు-నాగిని లుగా తలచి నాగ దంపతీ పూజ చేస్తారు. టిక్కెట్టు ‌ఖరీదు
ఎక్కువే. చాలామంది చేసుకుంటున్నారు. గర్భగుడిలో జంటలు కూర్చుని పూజలు చేసుకుంటున్నాయి. పూజా ద్రవ్యములు అక్కడే దండిగా ‌లభిస్తున్నాయి. చాలా హడావుడిగా ఉంది. మేము వెళ్ళినపుడు సాయంకాలం నాలుగు అయింది. ఆ వేళ బుధవారం. 1-3-2017 తేదీన.

మేము మామూలుగానే శివపంచాక్షరి జపిస్తూ‌ మా దర్శనం కానిచ్చుకున్నాము. పరమేశ్వరునికి వెండి తొడుగు తొడిగారు. పార్వతీ దేవి అలంకార భూషితయై అలరారుతోంది.

రమణ మహర్షుల శిష్యులు ఒకరు ఒక కావ్యం రాస్తూ, ఆ కావ్యంలో సందర్భ వశంగా దారుకావన తాపసులకు ఆత్మజ్ఞానము బోధించే ఘట్టాన్ని రమణులను రాయమని, తాను రాయలేనని చేతులెత్తేశాడు. ముందు కాదు కాదన్నా భక్తజన వత్సలురైన రమణులు ఆ ఆత్మజ్ఞాన బోధనా ఘట్టాన్ని తమిళంలో రాసారు.
దానిని, సంస్కృతంలోకి, ద్విపదల రూపంలో తెలుగులోకి, పాట రూపంలో మళయాళం లోకి కూడా‌ రమణులే అనువదించారు. తెలుగులోను, సంస్కృతంలోను ఆ చిన్ని రచన పేరు ఉపదేశసారము. అలతి అలతి పదములతో రెండు భాషలలోను రమణుల ఉపదేశసారము‌ సులభ గ్రాహ్యము. ముముక్షువులు పఠించి ఆనందిస్తారు.

దారుకావనం లోని నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనము చేసికుంటూంటే ఇదంతా మవసులో మెదిలింది. మహాదేవుని కరుణకు, తన దర్శన భాగ్యాన్ని కలిగించిన తీరుకి‌ అబ్బురపడుతూ, విభ్రమము లేని సంభ్రమము మనసును ముప్పిరిగొన వినయ, భక్తి ప్రపత్తులతో శరణాగతినొంది నిటలాక్షుని, ఆయన దేవేరిని స్మరిస్తూ, వారి భక్తపాలన కళా సంరంభమునకు వినతులిడుతూ, నుతిస్తూ తదుపరి దర్శన స్థలానికి బయలు దేరాము.

వర్షము పడనున్నప్పటి చల్లని గాలి కలిగించును హర్షము
శరత్తున పున్నమి వెన్నెలలిచ్చును సుఖము; వేసంగిని
గుబాళించి హాయి నిచ్చును మల్లియలు; గోవిందుని స్మరించిన
కలుగును అట్టి హర్షము సుఖము హాయి ఎల్లవేళల యందు

వెనుకకు ప్రవాహింపవు సముద్రుని కలిసిన నదుల నీళ్ళు
మరలి రావు గడచిపోయిన ఏళ్ళు వయసు పరవళ్ళు
కొండల గుట్టల తిరిగి ఎక్కవు పొంగుచు దూకిన సెలయేళ్ళు
ఎన్నడు క్రుంగవు వీడి రావు ఇంపార గోవిందుని కలసిన మనసులు

కైలాసమన్ననేమి? వైకుంఠమన్ననేమి?
కాశి అన్ననేమి పూర్ణ ప్రకాశమన్ననేమి?
"కాశ్యాన్తు మరణం నామ" అన్ననూ; ఇన్నియూ
నీయందు నా వ్యక్తిత్వము లీనమగుట కాదె శంకరా?

వశిష్ఠ వామదేవ గౌతమాది విశిష్ఠ మహర్షి సంఘములు
భక్త వేదాంతులు శంకర ప్రభృతులు; భక్త శిరోమణులు
నాయనమారులు బసవవేశ్వరాది జంగమదేవులు;
కాళిదాస నన్నెచోడ సోమనాథ శ్రీనాథ ధూర్జటీ
కవి సార్వభౌములు ఈశ్వరార్చనాకళాశీలురై
ధన్యత నొందిరి మనమున మిమ్ము నిలిపి;
నిర్మల హృదయులైరి శివ పంచాక్షరి జపించి;
నాకును శివ మంత్రమును ఉపదేశింపుడు;
తపించి నేనును మిమ్ము కాంతును శంకరా!

శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః!
శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః!
శ్రీ పార్వతీపరమేశ్వరాభ్యాం నమః!

మా ద్వారకా యాత్ర - నాలుగవ భాగము

మా ద్వారకా యాత్ర - నాలుగవ భాగము
 
లిపి తెలియక భాష చదవలేనటుల; పరిచయము లేక
నారీ హృదయము తెలియలేనటుల; ప్రాథమిక శిక్షణ లేక
విజ్ఞాన శాస్త్రములు, తత్త్వము అర్థము కానటుల; మీ పై
భక్తి, మీ కరుణ లేక మిమ్ము తెలియ లేము శంకరా!

భ్రమియించు భూమిపై భ్రమల సుడిగుండాల
చిక్కుకొని సంభ్రమము పొంది విభ్రమము మిగిలి
జీవితము భ్రాంతిగా తోచు మాకు భ్రమ విభ్రమములు
అంటని సంభ్రమము సంబరము నిండు శంకరా!

శ్రావ్యము కాని పాట విశ్వ శ్రేయము కాంక్షించని
కావ్యము, కన్నులకింపు గాని నృత్యము, ప్రజల బాధ
ల వ్యథల బాపి సేమము చూడని నాయకత్వము గోవిందుని
దివ్య నామము స్మరింపని హృదయము పృథివిని వృథా! వృథా!

నాగేశ్వర జ్యోతిర్లంగ దర్శనము కలిగించిన ఆహ్లాదాన్ని అనుభవిస్తూ, పార్వతీపరమేశ్వరుల ఆశీర్వచనమునకు సంతసపడుతూ, తరువాతి దర్శనయ స్థలానికి బయలు దేరాము. అది గోపీ తలాబ్ యదువంశ నిర్మూలనం మొదలయ్యే ముందు బృందావన గోపికలను రక్షణగా అర్జునుడు‌ ఉండి నంద వ్రజానికి తీసికెళుతున్నప్పుడు, అంతకు ముందు‌ ఈ తటాకానికి సంబంధించిన పురాణ కథ ఏదో చెప్పాడు బస్ లోని గైడ్. నాకేమీ‌ అర్థము కాలేదు. దానికి తగ్గట్టే ఆ గ్రామస్తులు ఆ తటాకాన్ని చూడడానికి 100 రూపాయలు ప్రవేశ రుసుము అన్నారు. మేము అంత ఆసక్తి చూపించ లేదు. తరువాతి చోటు బెట్ ద్వారక. గుజరాతీలో బెట్‌ అంటే‌ ద్వీపం.

గోమతి ద్వారక - బెట్ ద్వారక

ద్వారకాధీశుని ఆలయం ఉన్న ప్రదేశాన్ని‌ గోమతి ద్వారక అంటారు. అక్కడికి 30 కిలోమీటర్లలో ఓఖా ‌అనే ఊరు ఉంది. కృష్ణుడు రాజ్యపాలనం, రాజ్య సంబంధ విషయాలు గోమతి ద్వారకలో, పట్టపు రాణులతో ఆయన
నివాసము బెట్ ద్వారకలో ఉండేది. ఈ బెట్ ద్వారక చాలా భాగం తరువాత సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు కొద్దిగా భూ ప్రదేశం మిగిలి ఉంది. అక్కడి విశేషాలు, శేషాలు చూడడానికి బెట్ ద్వారకకు బయలుదేరాం.
ఓఖా నుంచి బోట్ లో సముద్రం మీద అరగంట ప్రయాణించి బెట్ ద్వారక చేరుకోవాలి. బస్ వాడు‌ మమ్మల్ని అక్కడ దింపేసి వెళ్ళి రమ్మన్నాడు. అప్పుడు ‌సాయంకాలం నాలుగున్నర అయింది. ఆరున్నరకు ఠంచన్ గా బస్ ద్వారకకు బయలుదేరి వెళ్ళిపోతుందని‌ఆ లోపులో మేం వెనక్కి వచ్చెయ్యాలని పదే పదే హెచ్చరించాడు. మా బస్ బుకింగ్ టిక్కెట్లను ఇమ్మని‌ తీసేసుకున్నాడు.

దిగి బోట్ వైపు నడిచాము. జనం ఉన్నారు. ఒక్కో‌ బోట్‌ వస్తోంది, జనాలను ఎక్కించుకొని వెళ్ళిపోతోంది. బోట్ లోనే డబ్బులు తీసికుంటారు. ఆ బోట్ లో‌ 50 మందిని మాత్రమే ఎక్కించుకోమని, ప్రయాణీకుల వద్ద ఒక వైపుకి
పాతిక రూపాయలు ‌తీసికోమనీ గవర్నమెంట్‌వారి‌ ఆర్డరు.

కానీ బోట్ వాళ్ళు మాత్రం పది రూపాయలు తీసికొని 100-150 మధ్య ఎక్కించుకుంటారు. కొండొకచో ‌200 ల
మందిని కూడా ఎక్కించుకుంటూంటారుట. మనదేశంలో అన్ని విషయాలలోను ఇంతే. రూలు ఒకటి, ఆచరణ ఒకటి. రూలుకి పూర్తిగా వ్యతిరేకమైనా అంతే. ఓట్ బాంక్ లు, రాజకీయ‌ నాయకులు, వారి కుహనా ‌అనుచరులు,
పాలకులు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళకులపోళ్ళయిన మనోళ్ళు, డబ్బున్న వాళ్ళకి రూల్స్ ఏమీ లేవు. దేశ దుస్థితికి ఇందంతా ‌కారణమే.

మేము బోట్ ఎక్కడానికి వెళుతూంటే మరమరాలు, అటువంటివి కల పొట్లాలు అమ్ముతున్నారు. ఎందుకో‌ నాకు‌ అర్థము కాలేదు. దేవుడికి ఇచ్చి ప్రసాదంగా తెచ్చుకోవడానికా‌ అనుకున్నాను.
బోట్ ఎక్కాక తెలిసింది పావురాలకు వెయ్యడానికి అని. ఓఖా నుంచి బెట్ ద్వారకకు వెళ్ళే ప్రయాణ ‌సమయంలో
జనాలు కొన్న ఈ పొట్లాలలోనివి పావురాలకు వేశారు. బోట్‌ వెంబడి వచ్చే డజన్ల కొద్దీ పావురాలు సముద్రంలో‌ పడ్డ ఆ ఆహార పదార్ధాలను లాఘవంగా నోటికి కరుచుకొని పావురాలు తింటున్నాయి.

బోట్ లో ఓఖాలో కోస్ట్ గార్డ్ లో పనిచేస్తున్న ఒకాయన‌ పరచయమయ్యారు. అక్కడి విశేషాలు చెబుతూ‌ మాకు ఆనందం ‌కలిగించే ఒక మాట చెప్పారు. గోమతి ద్వారక, బెట్ ద్వారక ఒకే రోజు దర్శించుకుంటే భగవత్ ప్రసన్నత లభించినట్టే అని, ద్వారకకు మళ్ళీ దర్శనార్ధము ‌రానవసరము లేదని; అలా కాక వేరు వేరు రోజులలో దర్శనము చేసికుంటే మరల తప్పక ద్వారకా‌ యాత్ర చేయయవలసిన అవసరం ఉంటుందని. అప్పటికే‌ ప్రొద్దుట
గోమతీ ద్వారకలో పరమాత్మ దర్శనము చేసేసుకున్నాము, అదే‌ రోజు బెట్‌ద్వారకాధీశుని దర్శనం కూడా ‌అవుతున్వందుకు కృష్ణపరమాత్మ ప్రసన్నతకు, ప్రసాద దృష్టికి‌ మేము అర్హులమయ్యామని సంతృప్తి, సంతోషం కలిగాయి

ఆయన‌ విశాఖపట్టణంలో‌ రెండేళ్ళు పనిచేసారట. భార్యా భర్తలిద్దరికీ విశాఖపట్టణం, ఆ పరిసరాలు ఎంతో నచ్చాయట. బెట్ ద్వారక మీద 1971 యుద్ధంలో పాకిస్తాన్ నేవీ‌ శతఘ్నులను కురిపించిందిట. అప్పుడు మవ వాళ్ళు కరాచీ హార్బర్ పై దాడి చేసి ధ్వంసం చేశారట. అక్కడికి‌ పాకిస్తాన్ సముద్ర సరిహద్దు 140 కి. మీ. ఉందిట.
బెట్‌ ద్వారక లో 9000 మంది ముస్లిములు, 1000 మంది‌ హిందువులు నివసిస్తూంటారట. ద్వారక ప్రాంతం కలిసి ఈ ప్రాంతం‌అంతా‌ దేవభూమి ద్వారక జిల్లాగా ఉంది. బోట్‌ మీద ఆ సాయంకాలం సముద్రప్రయాణం ఎంతో హాయిని‌ గొలిపింది. సముద్రపు గాలి ఎంతో చల్లనిది. ‌సేద తీరుస్తుంది.

బోట్ దిగి ఒక 300 మీటర్లు నడిస్తే అక్కడి ద్వారకాధీశుని దర్శించాము. గుడి బాగానే ఉంది. సంసార పక్షంగా‌ఉంది. లోపల లక్ష్మీదేవి పటం, జాంబవతి, రుక్మిణి, సత్యభామల, శ్రీలక్ష్మ్యార్ధనారాయణ‌ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ, గోమతీ ద్వారకలోనూ సందర్శనానికి ఎందరో గ్రామీణులు వస్తున్నారు. వారి అమాయకపు భక్తి ఎంతో ముచ్చట గొలిపింది.
మరల వచ్చి బోట్ ఎక్కాము. మా బోట్ పై డజన్లకొద్దీ‌ పావురాలు మరల ఎగరడం మెదలు పెట్టాయి‌. మొదటి సారిలా ప్రయాణీకులు మరమరాలు అవీ‌ ఎక్కువగా వెయ్యలేదు. పాపం ఆ అరగంట‌ సేపూ ఆ పావురాలు ఆహారంపై ఆశతో ఎగురుతూ ఇటువైపు దాకా‌ వస్తూనే ఉన్నాయి. వాటికి రెక్కలు, కాళ్ళు బాగా‌ లాగి నెప్పెట్టేశాయేమో‌ అనిపించి బాధ కలిగింది నాకు. పాపం మూగజీవులు. ఏ ఆశ పెడితే ఆ‌ ఆశ.

మేము ఠంచన్‌ గా‌ 6-30 కి‌ బస్‌ దగ్గరకు వచ్చేశాము. లేకపోతే బస్‌ వెళ్ళిపోయేది. ఇంకో‌ బస్ ఎక్కిరావచ్చు. కాని మవిషికి టిక్కట్టు‌ 30 రూపాయలు. మా మొత్తం ట్రిప్ మనుషికి కి‌ 80 రూపాయలు.

ఆ రాత్రికి పూర్తి విశ్రాంతి తీసికున్నాము. మరునాడు కృష్ణుని మరొక సారి‌ దర్శించుకున్నాము. సాయంకాలం గుడి పక్కనే ఉన్న సుధామ సేతు - గోమతీ నదిపై ఉంది - అవతలికి వెళ్ళాము. అది కూడా‌ ఒక చిన్ని దీవి. ఇసక పర్ర. ఒక చిన్న లక్ష్మీనారాయణుల గుడి‌ ఉంది. ఐదుగురు‌ ఋషుల‌ పేర ఐదు నూతులు ఉన్నాయి. ‌నీళ్ళు మెట్ట ప్రాంతంలో నీటి వలె‌ చప్పగా ఉన్నాయి. చుట్టూ సముద్రం మధ్యలో ఈ నూతులు. అదీ ప్రత్యేకత. ఆ దీవిపై ఆ హాయినిచ్చే గాలిని అనుభవిస్తూ చాలాసేపు కూర్చున్నాము.

గోమతీ నది‌ జన్మస్థానము ఉప్పునీటి‌ కయ్యలాంటిది. నీళ్ళు సముద్రపు నీళ్ళ రుచిలో ఉంటాయి, దాని‌ జనన ప్రదేశం నుంచీ! గోమతి వెడల్పు చాలా తక్కువ. విజయవాడ కృష్ణా కాలువ కన్న తక్కువ. ద్వారక ఊరు కూడా చాలా చిన్నది. మన ‌కొవ్వూరు కన్న చాలా చిన్నది.

రాత్రి 8 గంటలకు ద్వారకాధీశుని హారతి సమయంలో తనివి తీరా దర్శించుకొని హోటల్ కి చేరాము. గుజరాతీ ధోక్లా తప్పక రుచి చూడమని మా కోడలు చెప్పింది. తనకి రకరకాల ప్రాంతాలలో ఏ యే ఆహార పదార్ధాలు తింటారు, ఏవి బాగుంటాయి అనే విషయంలో మంచి జ్ఞానము ఉంది. తను రకరకాల పదార్ధాలు బొంబాయిలో రుచి చూస్తూంటుంది. బొంబాయి మినీ ఇండియా కదా. అన్నిరకాలవి దొరుకుతాయి. ఏ ఊరు వెళ్ళినా అక్కడి స్పెషల్స మా ఆవిడ కోడలు నుంచి తెలుసుకుంటుంది. మేము రుచి చస్తాము. ఆ‌ ధోక్లా రుచి చూశాము. బాగుంది. కచౌరి అని మరొక ఆహార పదార్ధాన్ని ఆ షాపతను రికమెండు చేశాడు. తిన్నాము చాలా బాగుంది. మావాళ్ళకి బొంబాయి తెచ్చాము. అందరికీ ‌ఆ ద్వారక గుజరాతీ కచౌరి బాగా‌నచ్చింది. స్వీట్‌ అంతగా ఇష్టపడని. నేనూ‌ దానిని‌ ఇష్టంగా తిన్నాను.

అక్కడ ప్రసాద్ ఘర్ అని ఒక ధర్మశాలలో భోజన సదుపాయం ఉంది. ఇరవై రూపాయలు. ఒక హాట్- కారప్పూస లాంటిది, స్వీట్ బూందీ తో సహా‌ అన్నము, చపాతీలు అన్ లిమిటెడ్, సబ్జీ; పెరుగు, మజ్జిగ ఉండవు. అవి బైట కొనుక్కొని తీసికెళ్ళ వచ్చు. మేము మూడు పూటలు అక్కడ తిన్నాము. రాత్రిళ్ళు అదనంగా‌ ఇచ్చే స్వీట్ హాట్ ఉండవు. చాలా ‌భోజన శాలలు ,హోటళ్ళు ఉన్నాయి, ఎవరి స్థాయిని బట్టి వారు తినవచ్చు. మేము రెండు మధ్యాహ్నములు గుజరాతీ భోజనం మరొక హోటల్ లో చేశాము. బాగుంది.

ఆఖరున, 3-3-2017 ప్రొద్దున్న ఆటో ఎన్ గేజ్ చేసికొని ద్వారక లోకల ప్రదేశాలు చూశాము. అందులో సముద్రపు ఒడ్డున ఉన్నవే అన్నీ. గీతా మందిరం - మామూలు కట్టడము, ప్రత్యేకత ఏమీ‌లేదు- , భడకేశ్వర మహాదేవ్ మందిరము, గాయత్రీ‌ శక్తిపీఠ్, సిద్ధేశ్వర మహాదేవ్ మందిరము చూశాము. భడకేశ్వర్ మహాదేవ్ ఆలయం చాలా చిన్నది, ఒక ద్వీపకల్పము. మామూలుగానే శివలింగం వెనుక పార్వతీదేవి విగ్రహము. సిద్ధేశ్వర్ మహా‌దేవ్ ఆలయంలోనూ‌ అలాగే పార్వతీ‌దేవి శివలింగం వెనుక ఉంది. సోమనాథ్ నుంచీ‌ గర్భగుడిలో ఇలాగే సాంప్రదాయము. నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయంలోను ఇంతే. ఇది సౌరాష్ట్ర దేశ‌ సంప్రదాయమేమో.

భడకేశ్వర్ ఆలయం వద్ద సముద్రం సీనరీ చాలా బాగుంది. అక్కడ అరేబియా సముద్రం అందాలు డెందానికి పసందులు. గాయత్రీ శక్తిపీఠ్ లో విశేషమేమీ లేదు. సావిత్రీదేవి, గాయత్రీదేవి, కుండలినీదేవి ల చిన్న విగ్రహాలు ఒక వేదికపై ఉన్నాయి. సిద్ధేశ్వర్ మహాదేవ్ ఆలయంలో లింగము తెల్లగా ఉండి ముందువైపుకి బొడిప ఉంది. అక్కడ నీళ్ళు ఉంటాయి మనం కావలిస్తే లింగంపై నీరుపోసి అభిషేకం చేసికోవచ్చు. మళ్ళీ ద్వారకాధీశుని ఆలయం దగ్గర వదిలాడు ఆటోవాడు.

మేము దర్శనానికి వెళ్ళేసరికి మరల స్వామికి, రసావతారునికి‌ శృంగార హారతి సమయం. హారతి సనయంలో జనం ఎక్కువ ఉంటారు. పరమాత్మయైన రుక్మిణీ సత్యభామా వల్లభుని కనులార వీక్షించి తరించాము. భగవంతుని ఎన్ని సారులు చూచినా విగ్రహరూపము అచ్చుగుద్దినట్టు మనోఫలకము పై పడదు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి దర్శనానికి వెళ్ళినపుడు రెండుమూడు సారులు భగవంతుని శిలా రూపాన్ని చూశాము. బయటకు రాగానే వెంటనే‌ ఫలకంపైనుంచి ఆ మూర్తిని మరచిపోతాం. ఎన్ని సారులు దర్శనం చేసికున్నా ఇంతే. అందుకే భగవద్గీతాచార్యుడిని ఒకటి వేడుకున్నా. ద్వారకాధీశుని దర్శనానికి రకరకాల భక్తి తెగల వారు, వీరిలో గ్రామీణులెక్కువ, పాటలు పాడుకుంటూ, నాట్యము చేస్తూ అలా ఆడుతూ పాడుతూ గుంపులు గుంపులుగా ద్వారకాధీశుని దర్శనానికి వస్తారు. వారందరినీ చూడడం ఒక వేడుకగా‌ఉంటుంది. వారి భక్తి ప్రపత్తులు మనలను తాకుతాయి. స్వామికి హారతి ఇచ్చినపిపడల్లా గపడిపైన ధ్వజాన్ని మారుస్తారు. హారతి చూసి దానిని చూడడానికి జనాలు వేచి ఉంటారు.

"తండ్రీ! నారాయణా‌ మనసుయొక్క ఈ బలహీనత నుంచి నన్ను విముక్తుణ్ణి చెయ్యవయ్యా‌ అని. నారాయణ నామస్మరణాన్ని సతతము చేసేలా దాన్ని అనుగ్రహించవయ్యా" అని కృష్ణపరమాత్మను పదే పదే వేడుకున్నాను. వయసు మీద పడుతోంది కదా, చూపూ నెమ్మది నెమ్మదిగా మందగిస్తుంది. రూపము మీద మాత్రమే దృష్టి ఉంటే ఎలా?!

అలా నందనందనుని, యశోదా డింభకుని, గోవర్ధనగిరిధారిని, గోపికా వస్త్రాపహారిని, రాధికాప్రియుని, రుక్మిణీ, జాంబవతీ సత్యభామాపతిని కనులార వీక్షించి, మనసార దర్శించి బొంబాయుకి సౌరాష్ట్రా‌ మెయిల్ లో బయలుదేరాము. జాగ్రత్తగా ‌ఇంటికి చేరాము కూడా.

చేయుము నా మనసు స్వచ్ఛమైన
స్ఫటికముగ; ప్రతిఫలించనీయవోయి
నీ వాత్సల్య కరుణా ప్రకాశములు
విశ్వమంత కాంతులు నిండ గోవిందా!

ఉన్నతమైన ఆలోచనలు వాటికి తూగు
ఉత్తమమైన మాటలు, వాటికి సరిపడు
సదాచరణము; త్రికరణములు శుద్ధమై
సయోధ్యగ నుండు సౌభాగ్యము నిమ్ము గోవిందా!

వాడును తనువు; వసివాడదు
నిన్నెరిగిన బుద్ధి; జీవితాంతము
గుబాళించును నీపై భక్తి రక్తి
మనమున నీవు నిండిన గోవిందా!

స్మృతి తప్పనీయకుము నారాయణా!
మరణమాసన్నమైనపుడు; నీ నామ స్మరణము
చేయుచు, నీ చరణకమలముల దృష్టి నిలిపి
తుది శ్వాస వీడు భాగ్యమ్మునిమ్ము గోవిందా!

కాయము పలుకు మనసు ఇంద్రియములు బుద్ధి
ఆత్మ ప్రకృతి స్వభావము నీవెయై భాసింప గోవిందా!
కలవరములు కలతలు కష్టములు క్లేశములు లేవు నాకు
నీవే నేనను ఉపనిషద్వాక్యము మరల ఋజువైయ్యెన్

భావము మల్లె భక్తి సంపంగి
గురు భావము మందార స్నేహము విరజాజి
అనురాగము మరువము భక్తి సూత్రమున
నీకై కూర్చిన రాగమాలను స్వీకరించు గోవిందా!

సమస్త సన్మంగలాని భవంతు!
భగవత్ ప్రీతిరస్తు!
సర్వే జనాః సుఖినో భవంతు!
ఏతత్ సర్వమ్ శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు!

Cricket; The fashion of Today: Non-local, భవుడు-భావములు; మానవ సేవ - మాధవ సేవ

The success of Australian spin duo in destroying Indian top order and tail batting is both surprising and interesting. Indians are adept and are famous in playing spin bowling. Why it is happening like this is not believable.

The reckless and negligent batting in first test made them lose first test. That seems to have transformed into inability in second test. Unless the Indian batsmen come out of this mental block, it is sure that India may lose this test
series to Australia.

Wish Indian batsmen all the best.

***********

The Fashion of Today

The fashion of today is: know about everything but cannot and do not do anything. Blame others for every ill. Relax in bars and pubs. Respond to every incident and event through social networking medium passionately, conduct awareness walk or marathon, light candles; spend time on apps. Occasionally know about culture, religion and spirituality.

Can the "image" of an university be revived by just an accused and non-patriotic student leader? Height of arrogance or ignorance? In India people rate themselves superior by merely shouting slogans.
*************

When people from coastal Andhrapradesh are dubbed as "not local and are foreigners" and "thrown" away from Hyderabad, whom and why Indians are asking "Do we belong here?"; in the USA.
When same Indians are foreigners in their own country just in a different place, how we can ask for "local" tag in America? What right we have in a foreign country which we do not have in our own country,India?
How innocent it is?

***********

Having a soft, tender and sensitive heart is disadvantageous these days. Having an aesthetic heart is quite rare.

సున్నితమైన హృదయం కలిగి ఉండడం ఈ రోజులలో ఎంతో ఇబ్బంది‌ కూడా. కళాహృదయం ఉండడం ఎంతో‌ అరుదు.
 ************
భవుడు-భావములు

నిర్గుణుడైన భవుని నుంచి ప్రభవించును భావములు
భవానీమయములు భాసుర దీప్తులు భవాబ్ధి రూపములు;

మౌని నుంచి వికసించును భాషలు కదంబకుసుమ
న్యాయమున; పరిఢవిల్లును మాటలు వ్యక్తార్థములై;
భావరాగలయాది‌ సమన్వితమైన సంగీతము సదాశివ
మయము; తాళయుక్తమైన నటరాజ నర్తనములే
నాట్యములు, శివకామసుందరీ నూపుర ఝణఝణలు
లలితకళల లావణ్యములు, లాస్యములు, అలరింపులు

మానసవర సంచారము నిలిపి ధ్యానించిన నిర్గుణము
మానసవర సంచారము సలిపి ధ్యానించిన సగుణము
జ్ఞానము, భక్తి లై మనల ముందుకు తీసికొని వెళ్ళు
తత్త్వయుతములు, నిర్వాణపదమధిష్ఠింపజేయు‌ దారులు

పరాపశ్యంతీమధ్యమావైఖరీ గతులనొందు తత్పర
తాత్పర్య నిధులు భక్తిజ్ఞానకర్మమార్గములు; తారకములు
భవబంధవిమోచనములు; భవాబ్ధిని దాటించు‌ నావలు
మోక్షసామ్రాజ్యమునకు చక్రవర్తులచేయు బ్రహ్మవిదులు

అఘములనుండి మరల్చి పద్మాసనుడైన శాంతమూర్తి
కరుణకు మనల పాత్రుల చేయు ప్రమథగణములు;
నందిని, బసవని‌ చేసి మనల శశిధరమకుటునికి
దాసులను చేయు‌ జంగమదేవర కటాక్షములు
చరాచర ప్రపంచమున కన్ను మిన్ను గానక అలమటించు

మనల శివసాయుజ్యము పొందించు పొందికలు; ధ్యాత
ధ్యేయముల ధ్యానములో లీనముజేసి నిరంతర ధ్యానమై
మనము ధన్యతనొంది ముక్తిగా జీవితమును చేయు‌ సిరి
శివ పంచాక్షరిని జపించుచు శివ నామమును స్మరించుచు
హృదయము సదా శివమయమై మనము రమించు
భాగ్యమునిచ్చు భోళాశంకరుడు‌ భక్తజన కింకరుడు
పార్వతీ సహచరుడైన పరమశివుడు మనల గాచుగాక!

*********

మానవ సేవ - మాధవ సేవ

మానవ సేవయే మాధవ సేవ. ఆ మానవులలో అమ్మ, నాన్న, భర్త/భార్య, అబ్బాయి, అమ్మాయి, మనుమలు/మనుమరాండ్రు, అత్త, మామ, తాత/అవ్వ‌ కూడా‌ ఉంటే ఎవరూ వేరేగా మానవ సేవ చెయ్యవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే తమ వాళ్ళు చూడక వీధిని పడే వాళ్ళే ఉండరు. ఎవరి వారు వారికి ఉంటారు. వీరు కాని మానవులకు వేరుగా సేవ చేసే "భాగ్యము" నకు సంసారులమైన మనము నోచుకోము. మన జీవితము జీవించి, మన వారికి తోడు నీడైతే ఇంక ఇతరుల సేవ అవసరం ఏముంది?

ఇలా మన వాళ్ళకు మనం సేవ చేసుకోక, వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలి ఎవరికో మానవ సేవ అంటూ రోడ్డున పడితే; ఇలా అయిన వారి నిర్లక్ష్యానికి గురై, అనాథలైన జీవులకు ఎందరు బైట వాళ్ళు, పరాయి వాళ్ళు సేవకు ముందుకు వచ్చినా వారి సంఖ్య అనాథలైన అందరినీ అక్కున చేర్చుకోవడానికి సరిపోదు.
ఈ ఇంగితం వంటబడితే ఏ ఇల్లూ అనాథ కాదు. ఇళ్ళలో అనాథలూ ఉండరు.

అప్పడు ప్రతి ఇంటికీ ఒక మదర్ థెరిసా "మదర్ (అమ్మ, నాన్న‌ రూపాలలో) ఆదుకోవడానికి, ఆదరణకు, ఆత్మయత చూపించడానికి ఉంటారు. నిజమైన అనాథలకి ఛారిటీ సంస్థలు, ప్రభుత్వ సంస్థల సేవలు సరిపోతాయి.
మానవ సేవ ఒక సాంఘిక ఫేషన్ గా తయారవవలసిన గతి లేదు. అయినవాళ్ళని వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలేసి మానవ సేవ అంటూ వీధిన పడితే సృష్టి కర్త, భర్త, సంహర్త సంతోషించరు. దానిని మాధవ సేవ అనలేము.