Friday, January 20, 2017

ఇహపరములకు పనికి వచ్చే ధ్యాన మార్గము: Indian Politicians; సారమదే

ఇహపరములకు పనికి వచ్చే ధ్యాన మార్గము


సాధారణంగా ధ్యానం అంటే "ముక్కు మూసుకుని" కూర్చోవడం అనుకుంటారు.

శ్వాసను గమనించడమూ ధ్యానం; ఏక వస్తు చింతనమేవ ధ్యానం; ధ్యానం అర్థభావనం - కూడా.

మూడవ నిర్వచనములో, మనం గ్రంథ పఠనము చేసి, తత్త్వశాస్త్ర రచనలు, పారాయణ చేసి, చదివిన వాటి అర్థము గూర్చి మననం చేసి తాత్పర్యమును ఆకళింపు చేసికొని మనం తత్పరులం అయ్యే విధానము కూడా ధ్యానమే.
మన ప్రకృతిని బట్టి, ప్రవృత్తిని బట్టి వీటిలో ఒకటి నచ్చుతుంది. మనం ఆ పద్ధతిలో ధ్యానం చేస్తాము. ధ్యాన పద్ధతులన్నిటి గమ్యము, ఫలము ఒకటే.

అసలు విస్తృతార్థములో మనం మనసు, శరీరములతో చేసే పని ఏదయినా దానిని శ్రద్ధగా, ఆసక్తితో, భక్తితో, అర్పణ భావంతో చేయడమూ ధ్యానమే. ఈ విస్తృతార్థాన్ని గమనించి మన దైనందిన శారీరిక, మానసిక కార్య కలాపములను తదేక దృష్టితో చేస్తే అదీ ధ్యానమే.

ఇలా చేస్తే పుణ్యము, పురుషార్ధమూను. ఇంటి పనులు, దైనందిన కార్య కలాపములు జరుగుతాయి, మనసుకూ తదేక దృష్టి అలవడి, ప్రశాంతత, స్థిమితము లభిస్తాయి.

గురువులు, ఆశ్రమాలు అంటూ పోనక్కరలేకుండా, వారి చుట్టూ తిరగనవసరము లేకుండా మనింటోనే మనముండి రాజు, రాణీల లాగ ఇహము, పరము సాధించే ఏకైక మార్గము మన విధిని, నియమిత కార్యక్రమములను
శ్రద్ధగా చేయడం. విధివిహిత కర్మములను శ్రద్ధగా తదేక దృష్టితో చేయడమే, చేయగలగడమే గొప్ప ఆధ్యాత్మికత.
పరమపురుషుని తేలికగా చేరి, పరమార్థమునంది, పరమపదమును చేరుటకు, అందే ఉండుటకు సాయపడే దివ్య ధ్యాన మార్గము, విధివిహిత కర్మాచరణము. దీనిని నిర్మలమైన మనసుతో, అర్పిత మనముతో హాయిగా నిర్వహించడమే గొప్ప ధ్యానము.

మనవారైన వారిని ప్రేమాభిమానములతో చూస్తూ, ప్రేమాభిమానములను వారికి పంచుతూ, వారినుంచి అందుకుంటూ, ఇతరుల పట్ల ద్వేష భావము లేకుండా, వారికే అపకారము తలపెట్టక, చేయక; మన జీవితాన్ని నిజాయితీగా జీవించడమే ఉత్తమ ధ్యాన మార్గము.

ఇది లేనప్పడు ఎన్నిసార్లు ముక్కు మూసుకున్నా, ఎన్ని జపమాలలతో జపం చేసినా, ఎందరు గురువుల చుట్టూ తిరిగినా, ఆశ్రమాలను, ప్రార్ధనాలయములను సందర్శించినా, ఎన్నో పూజలు పురస్కారములు చేసినా, ఎన్నో తీర్థాలలో మునిగినా అది ఉపయోగకరమైన ఆధ్యాత్మికత కాదు.

పరమపురుషుని నిత్యమూ, అనుక్షణమూ అందరిలో, అన్ని వేళలలో, అన్ని కార్యకలాపములలో దర్శిస్తూ, పరమాత్మకు అర్పణంగా విధివిహిత కర్మాచరణమే మోక్ష సాధనము. ముక్తి హేతువు. నిర్వాణ పద ప్రాప్తము. జ్ఞాన పీఠము. ఆనందానుభవము. శాంత, ప్రశాంత, మౌన భరిత పరిపక్వ జీవనఫలాస్వాదనము. ధన్య దివ్య జీవనము.
***************
అందరూ ప్రపంచాన్ని మరామత్తు చేద్దామనుకునే వారే! ఎవరిని వారు మరామత్తు చేసికుంటే ప్రపంచం తనంత తానే మరామత్తు అయిపోతుంది కదా!
ఉహు! వీలుకాదు. అది ఎవరికీ ఇష్టం లేదు. తమంతట తాము మారరు. తాము శుద్ధులు, అపర సిద్ధులు. అట్టి తాము మాత్రమే ప్రపంచాన్ని మార్చాలి. తాము మాత్రమే ఆ బృహత్ కార్యం చెయ్యాలి.
అందుకే ప్రపంచం ఇలా ఏడిచింది!
*************

Our politicians lack in any conviction, except for illegal amassing of money, properties, black money.

Our politicians do not have any opinion except for division of voters by various affiliations.

Our politicians' idea of governance is promising freebies to have nots, distribute tax-payers' money to party workers in the name of various ill-considered "welfare" schemes.

Our politicians do not have idea of legislature, executive, judiciary and their internal checks and balances.

Our politicians are dictators in the garb of popular leaders. The more popular a politician is the more arrogant and dictatorial one is. They are elected through democracy but do not have any respect for democratic functioning. They run political parties and government as personal fief-doms and not democratic institutions.

Many political parties in India are owned by various families as corporate houses and dynastic perpetuation is followed to run the party and government.

Our politicians do not follow any ideology except for divide and ask for votes policy and divide and rule policy.

*********

సారమదే

కట్టు వేరైనా ఏదైనా లోపలి శరీరం అదే
బెట్టు వేరైనా లోపలి తమకం అదే సరే

చెట్టు వేరైనా అదిచ్చే నీడ సుఖము ఒకటే
భాష వేరైనా మాటల అంతరార్థం ఒకటే

గట్టు ఎటువంటిదైనా మధ్య ప్రవహించే నది ఒకటే
గుట్టు ఎటువంటిదైనా రట్టు చేయుట ఒకటే

భగవంతుడు స్ఫురద్రూపి అయినా, రూపాంతరుడైనా
రూపాతీతుడైనా, రూప రహితుడైనా కరుణ అదే; మనం
రామ నామము తలచినా, జపించినా, రామ పూజ
ఎలా చేసినా, శ్రీరాముని కరుణాకటాక్షవీక్షణము సమమే

కాలము, మనసు గారడీ, బ్రాహ్మణులు-హిందూమతము, శుష్క వచనములు - శూన్యహస్తములు

కాలం వల్ల మార్పు జరగదు. మార్పే కాలాన్ని సృష్టిస్తుంది. మార్పు వల్లే సమస్త కార్యములు రూపుదిద్దుకుంటాయి. కాలం మార్పునకు పుత్రిక. ప్రతీక కూడా.‌ మార్పే కాలమునకు, కాలప్రవాహానికి ఆధారము, ఆలంబన. మార్పు లేక కాలమునకు ఉనికి లేదు. మార్పే కాలము.

************
మనలను మన నిజ స్థితి లోనికి మేలుకొల్పడం తత్త్వసాధన పరమార్ధము.
*************

మనసు గారడీ

చాలా మంది ఫలానా ఛానల్ ని ప్రభుత్వం బేన్ చెయ్యాలని పోష్ట్ లు ‌పెడుతున్నారు. మనంతట మనమే ఆ ఛానల్ ని బేన్ చేసికుంటే కలత ఉండదు కదా! ఆ ఛానల్ ని చూడమని మనలని ఎవరూ బలవంతం‌ చేయడం లేదే! మనం ప్రపంచాన్ని మనకి కావలసినట్టు నడుచుకోమని శాసించలేము. మనము మన మనసుని శాసించుకోగలిగితే ఎన్నో కలతలు, బాధలు, వేదనలు, వ్యథలు మనకు కలగవు. మన చేతిలో ఉన్న పనిని నిర్లక్ష్యం చేసి ఇతరులని మనని సుఖపెట్టమని, ప్రశాంతత కలిగించమని డిమాండ్ చేయడమేమిటి?

దేనిని చదవాలి, దేనిని వినాలి, దేనిని‌ చూడాలి, దేనిని‌ పొందాలి‌ అనేది‌ మన‌ నిర్ణయంపై, విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ఎవరూ మనలని బలవంతం చెయ్యరు. అది పూర్తిగా మన ఇష్టం. ఎవరైనా సూచించినా
మన విచక్షణని, మనఃతత్త్వాన్ని ఉపయోగించుకుని చేసే స్వాతంత్ర్యం ఎప్పుడూ మనదే. ఆ విషయం గ్రహించక ఆరాటపడడం, హైరాన‌ పడడం పసితనం. అనవసరం.


ప్రపంచంలో‌ మనకి నచ్చనివి, కలత పెట్టేవి ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఎందరో‌ మన‌ మనసు కష్టపెట్టేలా మాట్లాడతారు, ప్రవర్తిస్తారు. అలా జరగకుండా చేసే శక్తి, యుక్తులు, సావకాశం మనకు లేవు.
మనని బాధపెట్టే, మనకు అయిష్టమైన వారిని ఎదిరించే, సవరించే సమర్ధత మనకు లేదు. మన శక్తియక్తులు పరమితమైనవి. వాటికి అనుగుణంగా‌ జీవించడం ఇంగితం.

మనకయిష్టులందరిపైనా, మన కారణం ఏదయినా, ఎంతో సబబని మనకి అనిపించినా, చర్య తీసికోమని ప్రభుత్వాన్ని కోరడం, ప్రభుత్వం మనకు కావలిసినట్టు చర్య తీసుకోవడం ఎంతో‌ complex and involved process. ఎన్నోసార్లు జరగకపోవచ్చు కూడా. జరగకపోవచ్చేమిటి, జరగదు కూడా.

మన‌చేతిలోని పనిని చేయక, చేయలేక, ఎవరో మనకి శాంతిసుఖములు కలిగించే దాకా కలత చెందుతూనే ఉంటామంటే‌ మనకు భగవంతుడు‌ కూడా సాయం చేయలేడు. ఆ ఛానల్ చూడడమెందుకు, కలత చెందడం ఎందుకు, ప్రభుత్వపు సాయం కోరడమెందుకు?

ఓపిక, కౌశలము ఉంటే, మన సంస్కృతినీ, సాంప్రదాయాన్ని పరిరక్షించుకునే క్రియ చేబట్టగలిగితే బెస్ట్. అంతర్జాలంలో ఏక్టివ్ గా ఉండడం మన "నాగరికతను, సంస్కృతి" నీ తెలియజేస్తుంది తప్ప దాని వల్ల మాత్రమే సంస్కృతీ సాంప్రదాయముల పరిరక్షణ‌ జరగదు.

సంస్కృతీ, సంప్రదాయములు, వాటిని మనం పాటించడం వల్ల, అనుసరించడం వల్ల, ఆచరించడం వల్ల మాత్రమే నిలుస్తాయి తప్ప; మనం ఊరికే హడావుడి పడడం వల్ల, హడావుడి చేయడం వల్ల నిలవవు. శుష్కవచనములు, శూన్యహస్తముల వలన మన సంస్కృతీ, సాంప్రదాయములు పరిరక్షించబడవు.

అడుసు తొక్కనేల, కాలు కడగనేల?

ఇదే సూత్రం మన జీవితంలో ఎన్నో కలతలకు మందు.

మన ఏవ కారణం మనుష్యాణాం బంధ మోక్షయోః.

ఈ నిజం తెలుసుకొని మనసుని నియమించుకుంటే సుఖము, శాంతి. మనసుని అరికట్టుకోలేకపోతే‌ మనకు అనుక్షణము కలతే. ఈవాళ ఆ ఛానల్, రేపు ఇంకోటేదో మనకు కలత కలిగిస్తూనే ఉంటుంది, మనసుని అలా వదిలేస్తే.

దారిలోని ముళ్ళు గుచ్చుకోకుండా‌ చెప్పులు ధరించడం వంటిది మనసుని నియమించుకోవడం. నేలపైనంతా తివాచీ పరవాలనడం కోతివంటి మనసు చెప్పినట్టల్లా‌ ఆడడం.

Ignorance is bliss. అంటే ఏమీ తెలియకపోవడం ఆనందం అని కాదు. I ignore you - అనే sense లో తీసికోవాలి.
ఈ ఆంగ్ల సామెత అసలు అర్థం ఏమిటంటే, పట్టించుకోకుండా ఉండడం హాయినిస్తుంది అని.
దీనిని కావలిస్తే, దేనిని పట్టించుకోవాలి, దేనిని పట్టించుకోనవసరం లేదు అనే విచక్షణను కలిగి ఉండడం మానసిక ప్రశాంతతకు అత్యవసరం అనీ అన్వయం చేసికోవచ్చు.

అనవసరంగా పట్టించుకోవడం అశాంతి. విచక్షణను ఉపయోగించి పట్టించుకోవడం, పట్టించుకోకపోవడం చేస్తే మన మానసిక సుఖశాంతులకు లోటుండదు. భంగమూ వాటిల్లదు.

శుభం భూయాత్!

**********

 బ్రాహ్మణులు-హిందూమతము

బ్రాహ్మణులను గౌరవించక హిందూ మతము పునరుద్ధరింపబడదు. బ్రాహ్మణులను పక్కన పెట్టి, అగౌరవపరుస్తూ, అమర్యాద ‌చేస్తూ హిందూ మతాన్ని‌ పునరుద్ధరింప బూనడం‌ అమాయకత్వం. పసితనం. జరగని పని.

హిందూమతానికి బ్రాహ్మణులు పునాది, సన్యాసులు కాదు. బౌద్ధము, జైనములకు సన్యాసులు పునాది. హిందూమతమునకు గృహస్థులు పునాది. బ్రాహ్మణులను, గృహస్థులను తక్కువగా చూస్తూ, కించ పరుస్తూ, అగౌరవపరుస్తూ, అమర్యాద చేస్తూ హిందూ మతాన్ని పునరుద్ధరించబూనడం వెఱ్ఱి పని.
గృహస్థాశ్రమాన్ని, బ్రాహ్మణులను ద్వేషిస్తూ‌ హిందూమతాన్ని పునరుద్ధరించే ఊహ అపోహ.
 
హిందూ మతానికి బ్రాహ్మణులు ముఖ్యమే గాని, హిందూమతం బ్రాహ్మణుల సొత్తు కాదు. హిందూమతం నిలవాలని అందరూ అనుకుంటేనే నిలుస్తుంది. నిలవనక్కర లేదనుకుంటే కాలగర్భంలో కలిసిపోతుంది.
*********

శుష్క వచనములు - శూన్యహస్తములు

అందరూ కవులే కవిత్వం చదివేవారే అరుదు
అందరూ నాయకులే ప్రజాసేవ చేసేవారే అరుదు
అందరూ మేధావులే వారిలో మేధ మాత్రం అరుదు
అందరూ గురువులే పరమాత్మను దర్శించిన వారే అరుదు
అందరూ స్కూళ్ళు నడిపేవారే చదువు రావడమే అరుదు
అందరూ సంఘసేవకులే ఇళ్ళల్లో మాత్రం సేవ అరుదు
అందరూ సమాజాన్ని నడపాలనుకునేవారే నడపగలిగిన వారు మాత్రం అరుదు
అందరూ జీవకారుణ్య ఉపన్యాసకులే కోడి, మేక, పంది
మాంసములను తినని వారే అరుదు

కబుర్లు ఘనం ఆచరణకు గ్రహణం
నేటి మన భారత పర్వం ఒక నిరంతర
ఆషాఢభూతుల మయం రెండు నాలికల
ధోరణులు ప్రబలం అంతా శూన్యహస్తం



Sunday, December 11, 2016

The apparently wasteful exercise; Definition of Meditation

The apparently wasteful exercise

How so many people across India are able to get wades of new currency notes worth crores when honest citizens are languishing in que to get a mere two thousand?
During the fight against black money many are making black money using new currency. Highly ironical!

Corrupt individuals in banks, post offices, government are facilitating black money hoarders to white their money, meanwhile they themselves are "making and earning" black money.
The spirit of fight against black money is defeated and ridiculed by black money hoarders in collusion with their corrupt friends in public and private financial institutions and
the honesty of normal citizens is laughed at and made the citizens look first rate fools.
This is irritating and disturbing. A corrupt former minister launders black money and performs marriage of his daughter in vulgar display of black money; many such marriages took place in the homes of ministers, other "elite" citizens who have connection.

All this is happening in the midst of fight by "whole" nation against black money and corruption!
Really honest citizens are taken for granted and are advised to be soldiers in the fight against corruption and black money; and ruling and other influential black money hoarders are let off with impunity. Many ruling party politicians are also involved in this arrogant and vulgar display of hoarding of black money and this is slapping on government and honest citizens.

Then we can be sure to conclude that all the negative elements in society help one another and hoard black money again in no time through corrupt practices and evasion of tax payment.
All this fight by ordinary soldiers against corrupt practices and hoarding of black money is and will be defeated and made null by connivance of generals, majors, lieutenants and other higher rank in the form of politicians and corrupt citizens in relevant political, social and financial institutions, is disgusting.

Wish government works hard through its institutions to see that the sacrifice of ordinary citizens does not go a waste and black money will not get hoarded again through corrupt practices by elite and influential bad elements of the society.

Else citizens will reject the de-monetisation exercise as a wasteful and painful plan.

************

Definition of Meditation

Meditation starts in de-learning what all we have learnt till then. We must relearn about method of meditation of our liking and de-learn that also but after digesting the essence which should remain in memory. Then we must completely unlearn and the state in which we are then is the State of the Self - the state of peace, silence and bliss.

Meditation is also contemplating on the meaning of the relevant texts and be the purport and import of those texts.




The cheapness of Indian democracy; పిల్లులకు కుక్కలకు పెళ్ళిళ్ళెవరు చేతురు?; Cults and spirituality

 The cheapness of Indian democracy

Indian democracy has become so cheap. Any one whose mere qualification is intimacy with a popular leader, can and will dream to exploit that nearness not only to be an extra-constitutional power, amass money and assets but also arrogates to wear the mantle of succession of that popular leader without any other merits or capabilities or capacity.

Not only the kith and kin of a popular leader but the leaders' "friends" and companions also try and become leaders of that party. Unfortunate and dangerous situation has been prevailing in India ridiculing democratic norms and reducing politics to mere heritage and nepotism of leaders of parties.

**************

 పిల్లులకు కుక్కలకు పెళ్ళిళ్ళెవరు చేతురు?



పిల్లులకు కుక్కలకు పెళ్ళిళ్ళెవరు చేతురు?
శోభనములు ఎవరు నిర్వహింతురు? పురుళ్ళెవరు
పోయుదురు? అన్నియు వాటికి ఆరుబయటే;
ఆపై తల్లి జంతువు మాత్రమే గడి కట్టువరకు

పసికూనల ఆలనా పాలనా చూచును; మగ జంతువేమి
సాయమూ చేయదు!అందుకు భిన్నముగ తల్లిదండ్రు
లిరువురు సమానముగా బాధ్యత వహింతురు; తండ్రి
అంతా తానై ఎంతో సాయము చేయును పిల్లల పెంపకము

నందు, మిగిలిన బాధ్యతలు వహించుట యందు;
ఏల మగవారిని నేటి మేధావులు స్త్రీలకు శత్రువులుగ,
బానిసలుగచేయు దుర్మార్గులుగ చిత్రీకరించుచున్నారు?
మనుషులము జీవించుటయందు జంతు సంతతికి

భిన్నమైన వారము కదా! ఏల ఈ విడతీతలు, తప్పుడు
పనులు? అపార్థములు కలిగించు రాతలు, కూతలు? మాయలు?

స్త్రీ పురుషులను సయోధ్యగ సామరస్యముగ ఏల బ్రతక
నీయరు? లేనిపోని మాటలతో విరోధములేల పెంతురు?

**************
 

Cults and spirituality

Cults themselves are not spiritual ultimates. They are primary as primary education and are starting points. They are not end in themselves. We need or need not start in a cult but must not remain bound to that. We must enlighten and enlarge our horizon of spirituality. Great seers never expected or expect us to confine to their sayings and expressions and be mere parrots. 

Spirituality is liberty and freedom not slavery to thought, experience, cult or person. Transcending all these and knowledge therein and de-learning of what all we learnt is essential for spiritual awakening and peace, silence and bliss to be experiences then and thereafter incessantly; this facilitates to perform our ordained duties efficiently and calmly.

Tuesday, December 6, 2016

రాజకీయనాయకులు - ప్రజల వ్యక్తి ఆరాధనా భావము; రూపు కోల్పోవుచున్న తత్; Adulation for corrupt politicians

Love is intuitive nearness in dearness, admiration, appreciation, respect and sensuous attraction too.

రాజకీయనాయకులు - ప్రజల వ్యక్తి ఆరాధనా భావము

భారత దేశంలో రాజకీయనాయకులని దేవుడి కన్న మిన్నగా ఆరాధించడం ఒక గ్రహపాటు. ప్రజాస్వామ్యంలో వ్యక్తి ఆరాధన ముప్పు తెస్తుంది అనడానికి భారతదేశపు ప్రజల నాయకారాధన ఒక ఉదాహరణ.

రాజకీయనాయకులు రాజకీయాల్లోకి మన బాగుకోసం రాలేదు. వాళ్ళు మనకి బంటులు. మన జీవితాలను సుఖమయం చేస్తామని వాగ్దానములు చేసి మన ఓట్లు అడుగుతారు. ఆ వాగ్దానములను నెరవేర్చవలసిన బాధ్యత, విధి వారిది. వాళ్ళు చాలా వాగ్దానములు నెరవేర్చరు. ఒకటి రెండు వాగ్దానములు నెరవేర్చినా అది వారు చెయ్యవలసిన విధి. అందుకు మనము వారికి కృతజ్ఞతాభావంతో ఉండవలసిన పని లేదు. 

మనం ప్రభువులం. వారు మన భృత్యులు. ఇది మరచి వారిని ఆకాశానికి ఎత్తెయ్యడం బానిస మనస్తత్త్వము‌.
వ్యక్తిపై ఆరాధనా భావము చూపడం వ్యక్తిత్వము కలవారికి చిరాకుగా అనిపిస్తుంది. మరణం సహజం. మరణించిన వారి తప్పులన్నీ మరచిపోవాలని ఏ ధర్మశాస్త్రములోనూ రాయలేదు.

నాయకుల అవినీతి మరణంతో మాసిపోదు. ప్రజా జీవితంలో ఉన్నవారు వారి తప్పులన్నిటికీ సమాధానం చెప్పాలి. చావు మనుషుల పాపములను, అవినీతిని కడిగి వెయ్యదు.

చేసిన తప్పులకు అందరూ శిక్షననుభవించవలసినదే. అది మనకి, మనం ఎవరమైనా, ఎంత గొప్పవారమైనా, ప్రముఖులమైనా, మనం అంటే ఎందరో పడిచస్తున్నా తప్పని తద్దినం.

ఆవేశం, మూఢ భక్తి, వ్యక్తి ఆరాధన, తప్పులను ఒప్పులు చేయవు. కుపాలకులు తమ కుపాలనకు శిక్ష అనుభవించ
వలసినదే. ఇది ప్రజాస్వామ్యంలో జరిగితీరాలి. లేకపోతే ప్రజాస్వామ్యమునకు నియంతృత్వానికి తేడా లేదు. ప్రజాస్వామ్యానికి రాచరికానికి తేడా లేదు.

మరణం వల్ల వ్యక్తి తన పనుల ఫలాన్ని, పనుల తీవ్రతనీ అనుభవించకుండా కుదరదు.

జాతస్య మరణం ధ్రువమ్. ఇది ప్రకృతి ధర్మం. చనిపోయాడు కాబట్టి వాడి పుణ్య పాపములు వాడిని అంటక మానవు. మన ఇష్టాయిష్టములు, భక్తి ప్రపత్తులు మామూలు వ్యక్తిని దేవుని చేయవు.

భారత దేశంలో ఓటర్లకు రాజకీయనాయకులపై ఉన్న వ్యక్తి ఆరాధనా భావము ప్రజాస్వామ్య నిర్వహణమునకు అశ నిపాతము. గొడ్డలి పెట్టు. మనం పౌరులుగా రాజకీయ నాయకులకన్నా ముఖ్యమైన వారము. ఇది మరచి వ్యవహరించడం అమాయకత్వము. తెలివితక్కువ తనము.

మనం పౌరులుగా హుందాగా ఉందాము. రాజకీయనాయకులు మనలను సేవించేలా చేసికుందాము.
వారి వెధవ పనులను మరచి వగచవలసిన ఖర్మ మనకు పట్టలేదు. అలా కాకపోతే ఈ రాజకీయనాయకులను
సేవించుకుంటూ, నియంతృత్వం లోనో రాచరికంలోనో మగ్గుదాము.

***********


రూపు కోల్పోవుచున్న తత్


అహం వదులుకోని, వదులుకోలేని సన్యాసులు; మోహం
వదులుకోలేని ఆధ్యాత్మిక గురువులు; విపరీతమైన
ఆస్తులు కూడబెట్టుకుంటూ కోటికి పడగలెత్తు స్వాములు,
అమ్మలు; భారత దేశపు తత్త్వ బోధనా వారసత్వానికి

కువారసులు; ఆత్మజ్ఞానమును అవగాహన చేసికొనలేని,
అనుభవమునకు తెచ్చుకోలేని చిలకపలుకుల కాషాయాంబర
ధారులు; జనరంజకముగా ప్రవచనములిచ్చుచు
 ప్రవచన సారము మాత్రము వంటబట్టించుకొనని ప్రవచనకారులు;

తత్త్వ జ్ఞాన క్షీరాన్నపు పాత్రలో సతతము ఉంటూ అందరికీ
 పరమాన్నమును పంచుతూ, పరమాన్నపు రుచిని
ఎంత మాత్రము తెలియని ఆధ్యాత్మికవేత్తలు, వ్యాపారులు;
అంతయు మిథ్య, మాయయని తెలియక

లౌకిక సుఖములకై వెంపర్లాడు ఆధ్యాత్మికాశ్రమ నిర్వాహకులు;
శిష్యపరమాణువులకు, తమ భక్తులకు
ఊకదంపుడుగ నిచ్చు తత్త్వమును ఇసుమంతయు
వంటబట్టించుకొనని వాగాడంబర యతులు, "వ్రతులు";

ఆత్మ, సత్-చిత్-ఆనంద బ్రహ్మ జ్ఞానముల తాత్పర్యమును
కించిత్ కూడ ఎఱుగక "లౌకిక సంసార సాగరమున"
మునకలు వేయుచు మునిగిపోవు ఈత రాని తత్త్వ
జ్ఞానులు; వీరందరి చేతిలో రూపు కోల్పోవుచున్నది తత్

**************

Adulation for corrupt politicians

In India dearth of statesmen/stateswomen is glaring. Where there are no trees a mustard plant is admired as tree. Also corruption by politicians, and other economic and social offences and offenders are not at all considered as offenders against the society and nation.

People are carried away by the charisma of the popular politician who never contributed to the reconstruction of the society but only distributed freebies to the voters mis-spending the tax-payers' money and is adulated and admired for such loot. 

It all started from adulating Mr. Nehru, continued through his family members and all regional political stalwarts and their kith and kin.

Corrupt politicians must be condemned and not elected again, whatever freebies they offer, if one wants the true and real welfare of the nation. Worst of all such politicians are falsely admired as great leaders; this should not happen.

But emotional adherence to politician's charisma is blinding voters and citizens to the corrupt practices followed by individual politician; and jail terms they spent convicted for their economical and administrative irregularities. This is really a sad state of affairs present in Indian democracy.

Objective observers will take all adulations for small scale narrow-minded politicians with a pinch of salt and wonder how fight against black money or political corruption will be successful when citizens are indifferent to or are oblivious of malpractices of popular politicians and are enamoured of the politician.

Friday, December 2, 2016

గృహస్థాశ్రమం - ఆధ్యాత్మిక వ్యాపారులు; ఇజములు- సాహితీ సృష్టులు

When fake-ness is ruling the society, the genuineness will be ignored and not used.

గృహస్థాశ్రమం - ఆధ్యాత్మిక వ్యాపారులు

భారతీయ సంస్కృతిలో గృహస్థాశ్రమానికి పెద్దపీట. మిగిలిన ఆశ్రమములన్నీ తమ ఉనికికి గృహస్థాశ్రమం పైనే ఆధారపడి ఉన్నాయి.
ఇంత ఉత్తమమైన ఆశ్రమాన్ని నడుపుతూ దాని వల్ల కలిగే సాధకబాధకముల భరిస్తూ భారతీయ సంస్కృతిని నిలబడుతున్న స్త్రీ, పురుషులు అభినందనీయులు. రికామీగా తిరుగుతూ, సోమరులైన వివిధ సన్యాసాశ్రమ నిర్వాహకులు గృహస్థులకు ఉపన్యాసములనిస్తూ పొట్ట పోషించుకుంటున్నారు. ఆర్ధిక సామ్రాజ్యములను నిర్మించుకుంటున్నారు.
కాని వట్టి చిలకపలుకులు పలికే ఈ ఘనులు, తమ ఉనికికి, ఆహారవ్యవహారాలకు గృహస్థులపై ఆధారపడుతూ కూడ గృహస్థులను గేలి చేస్తూ మాట్లాడతారు. వీరందరూ "పాపులని" తమచే ఉద్ధరింప బడవలసిన వారని గీరగా మాట్లాడుతూంటారు.
నిజానికి గృహస్థాశ్రమం లోని ఒడి దుడుకులను తట్టుకుంటూ, తమని, తమ ఓపికను, నిత్యమూ పరీక్షించే
కుటుంబ సభ్యుల వల్ల, వృత్తి పరంగాను, రాజకీయనాయకుల దుష్పరిపాలన, సంఘం లోని ఇతర తరగతుల వారి కుసంస్కారం వల్ల, దుష్టుల, నేరస్థుల వల్ల కలిగే, వచ్చే దుష్పరిమాణాలను మౌనంగా తట్టుకుంటూ, సర్దుకుంటూ, భరిస్తూ బతుకులీడ్చే గృహస్థులు ఈ ఆధ్యాత్మిక వ్యాపారుల కన్నా కోటి రెట్లు వందనీయులు.
సన్యాసులు, ఇతర పరాన్నజీవులు; గృహస్థుల ఓపిక, పటిమ, నేర్పరితనముల ముందు బలాదూర్.
గృహస్థాశ్రమం లేక తరువాతి తరములు లేవు. అతిథి అభ్యాతుల సేవ గృహస్థాశ్రమం ద్వారానే జరిగేది. జీవనశైలులలో మార్పుల దృష్ట్యా ఇది జరగడం లేదు.
గృహస్థాశ్రమాన్ని, గృహస్థులను తేలికగా చూసి మాట్లాడే ఆధ్యాత్మిక వ్యాపారులు గృహస్థుల కాలిగోటికైనా పోలరు.
ఈ విషయం ఎంత తొందరగా అందరూ తెలుసుకుంటే అంత మంచిది. గృహస్థులు దైవ స్వరూపులు.
భగవంతునికి ప్రీతి పాత్రులు.
సమస్త సన్మంగళాని భవంతు!
**************

ఇజములు- సాహితీ సృష్టులు

రచన చేయడం రచయితలకు సహజంగా అలవడే కళ. అలా అలవడేవే కవిత్వం, ఇతర లలిత కళలు.
ముఖ్యంగా సాహితీ సృష్టి బాధ్యతాయుతమైనది. విశ్వశ్రేయమ్ కావ్యపరమార్ధమ్ - అని నానుడి.
ఈ నాడు రచించేవారు, కవనములు అల్లేవారు కోకొల్లలుగా ఉన్నారు. వారి సృష్టులు అంతర్జాలం వచ్చాక నలుగురికి అందడం ప్రారంభించాయి. వీటిలో కొందరు మాత్రమే తమ రచనలను, కవనములను పుస్తకములుగా అచ్చువేయించుకోగలుగుతున్నారు. వారంతట వారు, లేక ఒక ప్రచురణ కర్త ద్వారా కాని.
మళ్ళీ వీరిలో కొందరు మాత్రమే రచయితలుగా, కవులుగా లబ్ధ ప్రతిష్టులు అవుతున్నారు. ఇటువంటి వారి కొందరి సృష్టులు సంఘానికి ఉపయోగించాలి అనే నియమం లేనివిగా ఉన్నాయి. వారి వారికి పేరు ప్రతిష్టలు, ప్రఖ్యాతులు తెస్తే చాలనేట్టుగా ఉంది వాస్తవము.
ఈ పేరు ప్రఖ్యాతులు ఎలా వస్తాయి? తెచ్చుకుంటారా? తేబడతాయా? పేరు ప్రఖ్యాతులకి రచన, కవనముల శేష్ఠతకు సంబంధం ఉందా అనేది కోటి డాలర్ల ప్రశ్న.
రచనల ద్వారా, కవితల ద్వారా డబ్బు సంపాదించే వారు ఈ రోజులలో చాలా అరుదుగా ఉన్నారు. మిగతా వారిలో కొందరికి తమ తమ పరిచయముల ద్వారా "గుర్తింపు" వస్తోంది. వారికి వీరు వీరికి వారు విమర్శకులై పబ్బము గడుపుకుంటున్నారు.
వీరిలో ఎక్కువ మంది "చేతి చమురు భాగోతంలా" తమ ధనాన్ని ఖర్చుపెట్టి పుస్తకములను ప్రచురించుకోవడం, ఉత్సవములు జరుపుకోవడం, ప్రచారము చేసికోవడం రివాజయింది.
సాహితీసృష్టి శ్రేష్ఠతను కొలిచే ప్రమాణాలు మారిపోయినవి.
ఏదైనా ఒక "ఇజాన్ని" కౌగలించుకోకుండా కవనములు అల్లడం "అవుట్ ఆఫ్ ఫేషన్" అయింది. విమర్శకులూ ఏదో ఒక సిద్దాంతానికి దాసులై ఆ సిద్ధాంతేతరములను స్పృశించే సాహితీ సృష్టిని సాహిత్యము గా గుర్తించడమే మానేశారు.
తెలుగు రాష్ట్రములలో అరసం, విరసం, దిగంబర కవుల సంఘం, స్త్రీ, దళిత, ప్రాంతీయ, అస్పష్ట, పుర్రచేతి భావముల వాదములుగా విడి సాహిత్యము రూపు మారిపోయింది. ఇదివరకటి రంజకత్వం కోల్పోయింది.
పొడి పొడి సృష్టులు, డెందపు తడులు లేని తర్కములు, ఆలోచనలు కవితా రమ్యత ను పాడుచేశాయి.
సిద్దాంత రాద్ధాంతములు గా సాహితీ విమర్శ, విమర్శకులు కుచించుకుపోయారు. ఏ "ఇజానికీ" చెందని సాహితీ సృష్టులు "సాహితీ విమర్శకుల" దృష్టి ని ఆకర్షించలేక పోతున్నాయి. కవి, రచయిత ఇష్టప్రకారంగా కాక, విమర్శకుల అవగాహన, ఇష్టాయిష్టముల ఆధారంగా‌ సాహితీ సృష్టి జరిగితేనే దానికి గుర్తింపు వస్తుంది అన్నంతగా సాహితీ విమర్శ దిగజారింది.
ఈ హడావుడిలో ఏ ఇజానికీ చెందని సాహితీ సృష్టులు వెల వెల బోతున్నాయి. గుర్తింపుకు నోచుకోవటం లేదు.