Friday, May 20, 2016

ఇప్పటి అమ్మాయిలు

ఇప్పటి అమ్మాయిలు


ఇప్పటి అమ్మాయిలు ఉద్యోగం ఒక్కటీ చేసి మిగిలిన జీవితాన్ని అనుభవించడానికిి ఖాళీయే లేకుండా చేసికుంటున్నారు. ఒకరితో ఒకరు పోల్చుకుని జీవించడం కృత్రిమం అవుతుంది. మగవారితో పోల్చుకొని జీవించడం వల్ల ఆడవాళ్ళు, ప్రకృతి వాళ్ళకి అమర్చిపెట్టిన విధిని పాటించడానికి ఇష్టపడడం లేదు. వారికి సహజమైన లాలిత్యము, అనురాగము, మార్దవము, చూపించే సావకాశములే రాకుండా పోతున్నాయి.

ప్రేమానురాగములు వర్షించడం, తిరిగి వాటిని పొందడం స్త్రీలకు ప్రకృతి ఇచ్చిన వరం. అది వారి ప్రకృతి కూడా. అలా జరగక పోతే వైకల్యములు కలుగుతాయి. దురదృష్టవశాత్తు నేటి జీవన విధానములో ఆ ప్రకృతిని చూపే అవకాశమే ఉండటం లేదు. ప్రేమానురాగములు ఇచ్చి, పుచ్చుకోవడం పురుషులకన్న స్త్రీలకు వారి మానసిక ఆరోగ్యానికి మరింత అవసరం. 

ఇలా ఆడువారు ఇచ్చే, పుచ్చుకునే, ప్రేమానురాగాలు కోల్పోతున్నారు. ఈ లోటు, లోపము మానసిక అనారోగ్యనుునకు దారితీయవచ్చు.‌ ఇది లోటు, లోపము అవునా, కాదా అనేది ఎవరికి వారు స్ఫూర్తితో పరిశీలించి, తేల్చుకుని, అలా అనుసరించాలి. ఇది ఇంగితానికి సంబంధించిన విషయము.

ప్రక్కన ఉన్న కుటుంబ సభ్యుల గురించి‌ ఏమీ‌ తెలుసుకోవటం లేదు, పట్టించుకోవటం లేదు. దగ్గర ఉన్నవారు ఆనటంలేదు. ఎక్కడివారో‌ "దగ్గర" వారవుతున్నారు.‌ ఇది స్త్రీ, పురుషులకు సమానంగా వర్తిస్తుంది. ఇలా ఉండడం తెలివైన, వివేకముతో కూడిన విషయము కాదు.

మనిషికి, స్త్రీలకి, పురుషులకు‌ వారి వారి ప్రకృతీ, స్వభావములు, ధర్మములకు అనుగుణంగా జన్యువుల ప్రభావంతో‌ అవయవాలు, మనస్సులు ఏర్పడతాయి. మన జీవన విధానముతో ఈ ఏర్పడడాన్ని పరిగణించక అడ్డుకుంటే మానసిక ధర్మములు,‌ అవసరములు, ఘర్షణ చెంది వికల మానసములు, వికృతులు రూపుదిద్దుకుంటాయి.
అన్ని జంతువులలాగే స్త్రీ, పురుషులు ప్రకృతి కార్యము నిర్వహించడానికి పరిణమించారు. ప్రకృతులకు తగ్గ‌ట్టు జీవించక నాగరికత, ఆధునికత పేరుతో ప్రకృతితో పరాచకాలు ఆడడం తెలివియైన పనికాదు. ప్రకృతికి స్ఫురణ, ఆవేశము తప్ప ఆలోచన ఉండదు. ప్రకృతికి ఆవేశమొస్తే ఎవరూ పట్టలేరు. ఎవరూ ఆపలేరు. ఎవరూ ఆగలేరు. మన విజ్ఞానము, గణితము, ప్రణాళికలలోనికి ప్రకృతీ వర్తనము ఇమడదు.

It is chemistry rather biochemistry in the form of genes and hormones that define and direct us, the human beings. We, humans, the embodiment of Physics and Chemistry and are essentially a biochemical and biophysical beings. This must never be forgotten whatever is our "progress", advancement and modernity. We must not move too far from our basic natures and natural responsibilities. We do so at our peril. One must be aware of this reality when choosing life and life styles.

ప్రకృతి ఇచ్చిన స్ఫూర్తితో జీవించాలో, లేక ప్రకృతి ఆవేశములో కొట్టుకుపోవాలో, అన్నీ బేరీజు వేసికొని ఎవరికి వారు నిర్ణయించుకొని జీవించాలి. ఇప్పుడు మేధావులూ ఏమీ తులనాత్మకముగా పరిశీలించక, బాధ్యతతో చూడక, ఒకటి రెండు వాదములకు వశులై అనారోగ్యకర ధోరణులను ప్రచారము చేస్తున్నారు. వాటి కొమ్ము కాస్తున్నారు.

జన్యువులు, హార్మోనులు మనలను స్త్రీ, పురుషులు గా విడదీసి, తదనుగుణ ఊహలు, కోరికలు, క్రియలు జరిగేలా చూస్తాయి. చదువు, ఉద్యోగము మన కల్పన. ప్రకృతికి ఈ చదువులు, ఉద్యోగాలు, ఆధునికతలు పట్టవు.
అందువల్ల స్త్రీ, పురుషులు తాము, తాము జీవన ప్రాధాన్యములను నిర్ణయించుకొని జీవనం సాగించడం తక్కువ క్లేశకరంగా ఉండవచ్చు. ప్రకృతీ‌ పులకించవచ్చు.

మనసులు ఆహ్లాదమయములు కావచ్చు.

భారతదేశంలో ఎన్నికలు - పాలకులు



భారతదేశంలో ఎన్నికలు - పాలకులు


నిన్న, మొన్న జరిగిన రాష్ట్రాల ఎన్నికలలో దక్షిణాదిన ఒక రాష్ట్రంలో తాయిలాలు ఎక్కువగా ఎర జూపి, అవినీతి ఆరోపణలమీద జైలుకెళ్ళొచ్చిన leader మళ్ళీ అధికారం పీఠం ఎక్కబోతున్నారు.
ప్రజాస్వామ్యంలో జరిగే అనర్ధాలలో ఇటువంటి అవినీతిపరులు, ఆపై కొందరు రౌడీలు, నేరస్థులు, అసాంఘిక శక్తులు ఎన్నికవడం.

సత్తా లేని పౌరులు తమకు ఇచ్చే తాయిలాలు, జరగబోయే మేళ్ళు దృష్టిలో ఉంచుకొని ఇలా ఓట్లేస్తే అవినీతి, నేరాలు, రౌడీతనం, అసాంఘిక కార్యకలాపములు చట్టబద్ధమై పోయినట్టు లెక్క.

మరింక anti-corruption bureau లు, పోలీసులు, కోర్టులు, హడావుడీ, CBI, NIA లు ఎందుకు? దండగ కదా! సామాన్యులకొక న్యాయం, పాలకులకు, డబ్బున్నవారికీ మరొక న్యాయం మన కళ్ళెదురుగుండా ఇంత ఘన ప్రమాణములో జరుగుతోంటే మామూలు పౌరులు మాత్రమే ఎందుకు శిక్షించబడాలి?

దీనికి సమాధానం మనలని ఏలుతున్న రాజకీయ పార్టీలు, నాయకులు, పాలకులు, వీరి అండదండలున్న కార్పొరేట్ లు, మేధావులు, ఇతర super rich citizens నుంచి లభించదు.

భారత రాజ్యాంగాన్ని, రాజసాన్ని, న్యాయ వ్యవస్థను లెక్కచేయని, వాటికి భయపడని, వాటిని నిర్వీర్యపరిచే వ్యక్తులు పాలకులవడం ప్రజాస్వామ్యం ద్వారా జరుగుతున్నపిపుడు ప్రజాస్వామ్యం గొప్ప ఏమిటి? రాచరికం లోనూ ఇలాగే జరుగుతుంది.

ఆనువంశిక పాలనగా భారతదేశంలో రాజకీయ పార్టీలు తమ పార్టీలను నడుపుతున్నప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడడం లేదా?

పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నవెరూ చూడడం లేదనుకున్నట్టు భారతదేశంలో ప్రజాస్వామ్యం నిర్వహింపబడుతోంది. ఇదంతా ప్రజాస్వామ్యమ్యాన్ని అపహసించడం. ప్రజాస్వామ్యాన్ని నిర్వహించడం కాదు.
దీని వల్ల తెలుస్తున్నదేమిటంటే ప్రజల కొఱకు, ప్రజల చేత, ప్రజల వల్ల నిర్వహింపబడేది ప్రజాస్వామ్యం అనే అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డ్ లాంటి నిర్వచనాన్ని ఉటంకించడం వృథా. ప్రజాస్వామ్యాన్ని వేళాకోళం చెయ్యడం. అవమానపరచడం. చిన్నబుచ్చడం.

రాచరికంతో సమానంగా ప్రజాస్వామ్యం నిర్వహింపబడుతున్నప్పుడు ప్రజాస్వామ్యం అనే గుదిబండను మనమెందుకు మోయాలి?

ప్రధాన మంత్రి ప్రత్యేకంగా పరిపాలిస్తానని అధికారంలోనికి వచ్చారు. మరి???.

బహుశా ఆయన సమాధానం ఇలా ఉండవచ్చు:

"ఆదర్శాలు వల్లించడం వేరు, వాస్తవాలు వేరు. ఎన్నికల వేడిలో ఎన్నో మాటలు చెబుతాము. ఎలక్షన్ మేనిఫెస్టో వేరు రాజకీయం వేరు. ఎవరిని పడితే వారిని ఎన్నుకునే దేశంలో ప్రధానమంత్రి ఒక్కడూ ఏమి చేయగలడు? వాడూ మానవ మాత్రుడే కదా!

అయినా ఇంట్లో కూర్చుని నిర్వచనాలు బట్టీ పట్టే మామూలు మనుషులకు ఎన్నికలంటే తెలుసా? రాజకీయం తెలుసా? ఎన్ని సర్దుకోవడాలుంటాయి ఒక దేశాన్ని ఏలడంలో! ఆదర్శాలు వల్లించడంతో దేశం నడవదు. దేశాన్ని నడిపించలేము.

జైలుకెళ్ళొచ్చిన ముఖ్యమంత్రుల తోనూ సర్దుకోవాలి, జైలుకి వెళ్ళబోయే ముఖ్యమంత్రులతోనూ సర్దుకోవాలి; అవినీతి ఆరోపణలున్న పార్టీలనీ దూరం చేసుకోకూడదు.

ఆదర్శాలు వల్లించడం మానసిక అనారోగ్య చిహ్నము. సర్దుబాటులు చేసుకుంటూ, ఇస్తూ, తీసికుంటూ, అమాయక ముఖ్యమంత్రుకు ఏమీ ఇవ్వకుండాను, ఆ రాష్ట్రాన్ని, ఆ ప్రజలను దువ్వుతూ గడపడం, ఇవన్నీ
దేశాన్ని‌ ఏలడంలో భాగాలు."

Friday, May 13, 2016

Scientists by profession, knowledge and spirit

Now-a-days people called scientists are so by profession or job, and not by intellect or temperament. Most of the contributions to knowledge in relation to natural sciences has been by amateurs, who worked for their pleasure.

The professionalization of "doing" science has produced more number of "scientific" papers and more "scientists" and not so equal contributions to knowledge.

Compelling more youngsters to do science is not much meaningful if we produce more professionals in science than contributors to knowledge. For the last many decades the trend throughout the globe is development of technology and fundamental contributions to knowledge have been far and wide.
Many professional scientists do not know the philosophy and its spirit to the contribution to knowledge. Many famous physicists have been great philosophers.

Scientific temperament is not merely studying science and denounce which is not based on mere logic and reason.

It would-be interesting to know that it is also the intuition of the intellectuals and scientists which contributed to the furtherance of knowledge and revolutionary concepts about time, space and energy. Mere logic and reasoning stop contributing after a level. Concepts contributed by intuition also is science.

The essence of and sign of possessing scientific temperament is to have an open mind without any inhibitions to welcome new knowledge which may nit conform to our likes or dislikes. Sometimes subjective perspective may reveal natural phenomenon better than mere objective observations.
We are interested in valid knowledge; we may get it through any mental faculty, and not merely by logic or reasoning. Scientific temperament is to recognize knowledge and use it to seek and establish truth by subjective or objective perspectives.

We must be aware that we use faith in the intellectual or intuitive expressions of scientists, intellectuals, philosophers, seers and like eminent personalities and take that as valid knowledge and truth. Our faith in the authority of eminent intellectuals mostly consists of our knowledge and knowledge-systems.

Let us also admire, adore, respect and utilize knowledge given to us through all means of human mental endeavours.

Let us help us in being knowledgeable and not confuse or condemn what is beyond our mental grasp or individual likes and dislikes.

Truth is many times transcendent to our mental capabilities and abilities.

Let us learn to honor intellectual and intuitive contributions to knowledge, reality and truth despite and inspire of our innocence and ignorance.

May us seek truth through all our mental faculties.

Wednesday, May 11, 2016

నల్లధనం నాగరికానికి సోయగం

ధనవంతులు దాచిన నల్లధనం చిరాయువు;
దానినెవరు ముట్టలేరు,పట్టలేరు; అవినీతితో
నల్లధనం పోగేయడం నాగరికానికి సోయగం,
ఆయువు పట్టు ఆర్ధిక నేరస్థులకు, అక్రమార్కులకు

నల్లధనం గురించి అల్లరి చేయడం గొడవ పెట్టడం
అనాగరికత; కొందరికే డబ్బు రకరకాల క్రమాక్రమ మార్గాలలో
వచ్చిపడుతూండగా; ఏ విధముననైననూ సిరి తావచ్చి
తలుపు తట్టుచున్న వేళ, తీయని వాడెవడు? తీయనిది

కదా ఆస్తుల సమీకరణ! ధనవంతుడగుట మనిషి
ప్రథమ కర్తవ్యము; ఎటులైననూ ధనసంచయము చేయుట
నేటి సంఘనీతి; ఎన్ని బ్యాంకులలో ఎంత నల్లధనమున్న
అంత గౌరవము; నల్లదో, తెల్లదో, డబ్బున్నవాడే దొర; దొంగైననూ

నల్ల ధనము పోగేయుట మనిషి "తెలివితేటలకు" చిహ్నము
సంఘమున పరపతికి గౌరవమునకు మెచ్చుకోలుకు ఆధారము

Saturday, April 30, 2016

కవనోదయము

కవనోదయము

కామసూత్రములు నేర్వక ప్రణయినితో కూడుట నిషిధ్ధమొ
గమనసూత్రములు అభ్యసించియే నదులు ప్రవహింపవలెనో
సరిగమలు సంగతులు తెలియక కోయిల గళము విప్పరాదో
ఛందోనియమము లేక అందమైన భావనల కవనములల్లరాదో
మనో నియతిని కలుగు గేయములు కవవితలు కావో కదిలించలేవో 


మనసు నియతిని వ్రాయుట మాని
ఛందస్సు నకై వ్యాయామము చేయుట;
ప్రియురాలు దరిచేరి మురిపింప
సొక్కి సోలక కామ సూత్రాధ్యయనమునకై
సమయము వ్యర్థము చేయుట

కన్నియకు అందములు అమరినటుల
కలుగును భావములు మదిలో; మారును
కమనీయమైన కవితగా భాసిఉంచు
రమణీయమైన లావణ్య విలాసముల వోలె

Quotas and Caste Politics in Indian Democracy

Quotas and Caste Politics in Indian Democracy

Quotas bring votes so also notes;
Freebies bring votes so also drinks;
Indian democracy is ruled by quotas,
notes, liquor, caste-based reservations;

All politicians are lazy fellows
And are incapable of getting votes
Through ideology, fresh thinking
And innovative methods to run


Democracy and nation; to whatever
Party they belong, all politicians are
Same caste people; cast in the same
Mold; ruining nation under the weight of
Their inefficiency and inability to govern

Friday, April 29, 2016

బ్రహ్మ జ్ఞాన సంపన్నుల ప్రవర్తన



బ్రహ్మ జ్ఞాన సంపన్నుల ప్రవర్తన

"బ్రహ్మ విద్ బ్రహ్మ ఏవ భవతి" అని శాస్త్ర వచనము. బ్రహ్మమును తెలిసికొన్న వాడు బ్రహ్మమే
అవుతాడు - అని దీని అర్థము.
 
బ్రహ్మము అనగా ఆత్మ. "అయమ్ ఆత్మా బ్రహ్మా" అని ఉపనిషత్ వాక్యము.
 
ప్రజ్ఞానమ్ బ్రహ్మా - ఉపనిషత్ వాక్యము ప్రజ్ఞానమే బ్రహ్మము అంది. ప్రజ్ఞానము అనగా గమనిక. దృష్టి.
బ్రహ్మజ్ఞానులు వట్టి గమనికగా ఉంటారు. దృష్టిలో వారికి విషయములు, విషయానుభవములు (వాసనలు - స్థిరపడినవి - జ్ఞప్తిగా ఉన్నవి - జ్ఞప్తియందు ఉన్నవి) ఉండవు. వారి మనసు కడిగిన అద్దము వలె ఉంటుంది. వారిది నిర్మల మానసము. నిర్మల మానసమునే బ్రహ్మము అంటారు. నామ-భావ-వాసనా రహిత వస్తు పదార్థః
అని పదార్థ నిర్వచనము. బ్రహ్మము పదార్థము. బ్రహ్మ పదార్థము, ఆత్మ శక్తీ ఒకటే.
 
నిర్మలమానసయుతులైన బ్రహ్మ‌జ్ఞానులు తలవడం, వ్యవహరించడం, వారి సంకల్పానుసారంగాక భగవత్ సంకల్పానుసారం ఉంటాయి. వారి ప్యక్తిత్వము ఆత్మ/బ్రహ్మము నందు లీనమై ‌ఉంటుంది. వారికి వ్యక్తిత్వము లుప్తమై‌ ఉంటుంది.
 
అందువల్ల వారికి అహంభావ, అహంకార, మమకారములు ఉండవు. వారి సకల భావములు, చేష్టితములు ఈశ్వర నిశ్చితములు. వారి పూర్వాశ్రమము‌ ద్వారా సంబంధీకులు చెంత చేరినప్పుడు‌ ఉదాసీనులై ఉంటారు. కాని అంత జ్ఞాన పయోధిలో మునిగి ఉన్నా ఇంగితమును వీడరు. భగవత్ సంకల్పానికి తమ‌"జ్ఞాని" స్థితిని, ఇతరులు ఇచ్టిన ఆ‌"బిరుదుని" అడ్డురానివ్వరు.

శ్రీ రమణమహర్షి చేసినదదే. మాతృదేవతయైన ఆయన తల్లి ఆయనతో కలిసి ఉండడానికి వచ్చినపుడు వారించలేదు. ఆహ్వానించనూ లేదు. కాని మాతృదేవత ఉత్కృష్టతను తన ప్రవర్తన తో,
తల్లితో తాను వ్యవహరించిన తీరులో చూపించారు. అందరు కొమరుల వలె తల్లి అనారేగ్యములో ఆమెకు సేవ, శుశ్రూష చేశారు. జ్ఞానులైనా, అన్నిటికీ అతీతులైనా మాతృదేవత వద్దకు ఆ ప్రసక్తిని రానీయలేదు. మాతృసేవకు ఆ జ్ఞాని పదాన్ని అడ్డురానివ్వ లేదు.

ఆదిశంకరులూ తమ మాతృదేవత విషయంలో ఇలానే వ్యవహరించి‌, ఆ కాలపు ఛాందసుల మూర్ఖత్వమును లెక్కచేయక తమ మాతృదేవతకు అంత్యక్రియలు నిర్వహించారు.
 
జ్ఞానులు ఇంగితజ్ఞులు. తాము జ్ఞానులమనే దృష్టి వారికి ఉండదు కాబట్టి, ఇతరుల ఆ‌ పరిగణనకు అతీతంగా ఇంగితము, కరుణ, ప్రేమ వహించి తమ కార్యములను నిర్వహిస్తారు. వ్యవహరిస్తారు.

ఇతరుల భావముల పరిధి వారిని, వారి ప్రవర్తన ను, వ్యవహారములను బంధించదు. నిర్ణయించదు.
సర్వము భగవత్ సంకల్పంగా భావించి భగవదర్పణముగా తమ కార్యములను, విధులను నిర్వహిస్తారు. సంఘం, సంఘంలోని పరిమిత జ్ఞానము - లౌకికము, పారలౌకికము - కల జనుల తలపులు, ఆక్షేపణలు, విమర్శలు, అడ్లు, వారి కార్యక్రమములను నిర్దేశించలేవు, నిర్ణయించలేవు.

సాధారణ సంఘ నియమములు, సాధారణ జనుల అభిప్రాయములు, అభిరుచులు, ఇష్టాయిష్టములకు అనుగుణంగా వారి ప్రవర్తన ఉండకపోవచ్చు. ఉండచ్చు.
 
వారి కార్యములు భగవత్ సంకల్పంగా లోక కల్యాణార్ధంగా జరుగుతాయి. వారు తలచిన‌ తలపులు, చేసిన చేష్టలు వారికి తత్ క్షణం‌ మాత్రము దృష్టిలో ఉంటాయి. ఆపై నీటిపై రాతల వలె అదృశ్యమౌతాయి. వారికై వారు ఏమీ సంకల్పించుకోరు, చేసుకోరు, వ్యవహరించరు గనక వీరి భావములు, కార్యములు,‌ కార్యఫలములు వారి జ్ఞాపకములుగా మారవు. వారి జ్ఞప్తియందు ఉండవు.
 
వారి తలపులు, చేష్టలు విశ్వకల్యాణానికే. అందరి సుఖసంతోషాల కొరకే. మన మనశ్శాంతి కొరకే.

తథాస్తు! శ్రీరస్తు! సమస్త సన్మంగళాని భవంతు!