Showing posts with label కవనోదయము. Show all posts
Showing posts with label కవనోదయము. Show all posts

Saturday, April 30, 2016

కవనోదయము

కవనోదయము

కామసూత్రములు నేర్వక ప్రణయినితో కూడుట నిషిధ్ధమొ
గమనసూత్రములు అభ్యసించియే నదులు ప్రవహింపవలెనో
సరిగమలు సంగతులు తెలియక కోయిల గళము విప్పరాదో
ఛందోనియమము లేక అందమైన భావనల కవనములల్లరాదో
మనో నియతిని కలుగు గేయములు కవవితలు కావో కదిలించలేవో 


మనసు నియతిని వ్రాయుట మాని
ఛందస్సు నకై వ్యాయామము చేయుట;
ప్రియురాలు దరిచేరి మురిపింప
సొక్కి సోలక కామ సూత్రాధ్యయనమునకై
సమయము వ్యర్థము చేయుట

కన్నియకు అందములు అమరినటుల
కలుగును భావములు మదిలో; మారును
కమనీయమైన కవితగా భాసిఉంచు
రమణీయమైన లావణ్య విలాసముల వోలె