Thursday, February 5, 2015

మరపు (కథానిక), विस्मृतिः



1mc
                డా. వారణాసి రామబ్రహ్మం
మందాకిని నా స్నేహితురాలు. ఆమె అందగత్తె. శరత్కాల పూర్ణ చంద్రుని పోలే ముఖం ఆమెది. ఆమె హృదయ సౌందర్యం శారీరిక సౌందర్యాన్ని మించినది. ఆమె మనసు సున్నితమైనది. రమ్యమైన కవితలల్లడం ఆమె ప్రవృత్తి. ఆమె కవితల మనోజ్ఞధార. కావ్య లహరి కూడ.

ఒక వనితా మాసపత్రికకు ఆమె ఉప సంపాదకురాలు. ఆ పత్రికకు వచ్చే సారస్వత, సాహితీ రచనల పరిశీలన ఆమె నిత్య కృత్యము. సాంఘిక సమస్యల గురించి ఆమె ఎన్నో రచనలు చేసింది. మందాకిని నాకు అత్యంత ప్రియమైనది. నాకు కాబోయే భార్య కూడాను.

నేను సారస్వత ప్రేమికుణ్ణి. కథలు, కవితలు, నవలలు చదవడమంటే నాకు ఎంతో ఇష్టం. నాకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచి భాషలు తెలుసు. ఆయా భాషల్లో ఉన్న సాహిత్యాన్ని చదువుతూంటాను. విమర్శనాత్మక దృష్టితో ఆయా రచనలను పరిశీలిస్తూంటాను.

అన్నిరకాల సారస్వతాల గురించి, సాహిత్యాల గురించీ మందాకిని, నేను చర్చిస్తూంటాము. కవులూ, రచయితలు, వారి కవితా, సాహితీ సృష్టులు, రచనా సమయంలో, వారి, వారి, మానసిక దృష్టి, స్థితుల గురించి మాట్లాడుకుంటూంటాము. ఇలాంటి చర్చలతో సమయం గడపడమే మా ఇద్దరి మధ్య మైత్రిని పెంచింది. ఇలా పెరిగిన మా స్నేహమే మమ్మల్ని భావి దంపతులను చేస్తోంది.

ఒకరోజు నేను మందాకినీ వాళ్ళింటికి వెళుతున్నాను. ఆ రోజు పౌర్ణమి. నిండు చంద్రుడు తన వెన్నెలతో సమస్త జగతిని ఆహ్లాదపరుస్తున్నాడు. ఆ ఆహ్లాదతరంగాలు నన్ను తాకి, నాలో మాధుర్యాన్ని నింపుతున్నాయి. “ఈ ఆహ్లాదాన్ని నా ప్రణయిని మందాకిని సమక్షంలో పండించుకోవాలి. తనతో మధురాలాపాలతో పరవశిచాలి” అనుకుంటూ మందాకిని వాళళింటి వైపు వడిగా అడుగులు వేశాను. 

మందాకిని ఇంట్లోనే ఉంది. ఆమె నిరుత్సాహంగా కనిపించింది. ముఖం చిన్నబోయి ఉంది. ఏదో ఆమె మనసును తీవ్రంగా కలచివేసిదని నా మనసు చెప్పింది. ప్రతిసారీ చిరునవ్వుతో పలకరించి నన్ను ఉత్సాహంగా ఆహ్వానించే తను మౌనంగా, ఉదాసీనంగా కుర్చీ చూపించి కూర్చోమంది. ప్రియసఖి మందాకినిని ఆ స్థతిలో చూసి ఎంతో ఆందోళన చెందాను. ఆమెను అనునయంగా చూస్తూ, స్నేహభరిత స్వరంతో సంభాషణ మెదలు పెట్టాను.

“సఖీ! మందాకినీ!  ఏమిటీ దేనికో ఆందోళన చెందుతున్నావు, ఏమిటది? ఎందుకని?”
కళ్ళలోంచి ఉబికి వస్తున్న అశ్రుకణములను చేత్తో తుడుచుకుంటూ అంది.
“ఈ వేళ నేను సుప్రసిధ్ధ కవి శ్రీహర్ష గారిని మా పత్రిక కోసం ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ స్నేహపూర్వక వాతావరణంలో ఆహ్లాదంగా జరిగింది. శ్రీహర్ష నా ప్రశ్నలకు చాల చక్కగా సమాధానాలిచ్చారు. చివరలో నేనొక ప్రశ్న వేశాను. దానికి ఆయనిచ్చిన సమాధానం నన్ను ఎంతో కలచి వేసింది.
“నువ్వు వేసిన ఆ ప్రశ్న ఏమిటి?”
“అదే విపులంగా చెబుతాను విను.”
*      *         *           *  
ఇంటర్వ్యూలో నేను అడిగాను.
“శ్రీహర్ష గారు! అతి పిన్న వయసులోనే ప్రసిధ్ధ కవిగా పేరు తెచ్చుకున్నారు.  మీ కవితలు మనోజ్ఞములు. రసభరితములు. మానసికోల్లాసాన్నిస్తాయి. అలా మీలా కవితలల్లగలిగే వాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు. అటువంటి వారిలో మీరు అగ్రగణ్యులు. దీనికి మీరేమంటారు?”
“ మైత్రి నిండిన మీ మాటలు నన్ను ఎంతో సంతోషపరిచాయి. నా మనసు పూర్తిగా స్పందించినప్పుడే నేను కవితాసృష్టి చేస్తాను. మరొక విధంగా, మరొకప్పుడు రాయలేను. మనసే మనసు గతులు, సంగతులు గ్రహిస్తుంది. అనుకంపన గల మీరు రసహృదయులు. రసాస్వాదకులు. అంచేతే నా కవితలు మిమ్మల్ని రంజింపచేస్తున్నాయి. పాఠకుల సంతృప్తే కవికి కావలసినది. అప్పుడు కవి ధన్యతనొందినట్టే”.
మరికొన్ని ప్రశ్నలడిగి చివరలో ఇలా ప్రశ్నించాను. 
“కవి గారూ, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను.
మీరు అన్ని విషయాలనూ వస్తువుగా తీసికొని కవితలల్లారు. కాని మాతృ ప్రేమను వస్తువుగా తీసికొని ఒక్క కవితా వెలయించలేదు. మాతృ దేవత అనురాగం గురించి మీ ఏ కవితా స్పృశించలేదు.
మాతృమూర్తి మనని తన గర్భంలో వహించి, నెలలు నిండాక ప్రసవిస్తుంది. జన్మనిస్తుంది. పుట్టిన క్షణం నుంచీ మన లాలన, పాలన, పోషణలు చూస్తూ, అన్ని సేవలూ చేస్తూ పెంచుతుంది.
నడక, నడత నేర్పుతుంది.
తల్లి తన సంతానం కోసం ఎంతో చేస్తుంది. సంతానం నుంచి ప్రేమ, ఆపేక్షలని తప్ప మరేమీ ఆశిచదు. తన జీవితాంతం అమ్మ మనకోసమే జీవిస్తుంది. ఒక్క క్షణమైనా మనలని మరువదు.
ఇంతటి అమ్మను గురించి మీరు ఒక్క కవితా వెలయించలేదు. అమ్మ వాత్సల్యాన్ని, అనురాగాన్ని ప్రకటించే ఏ కవితా మీరు రాయలేదు. ఎందుచేత?”

నేను వేసిన ఈ ప్రశ్నను విన్న శ్రీహర్ష ముఖంలో ప్రసన్నత మాయమైంది. అనురాగ రహితమైన భావం గోచరించింది.
“మీ పరిశీలనాశక్తి అపూర్వము. అవును, నేను మాతృప్రేమను గురించి, మాతృత్వ మాధుర్యాలు నిండిన
వాత్సల్యానురాగాల గురించి ఏమీ రాయలేదు. దానికి కారణం ఉంది. నాకు తల్లి చూపించే ప్రేమ గురించి తెలియదు. తల్లి అందించే అనురాగం నాకు అందలేదు.
తల్లి ఉండి కూడ అనాథలా పెరిగాను. నా పాలనా, పోషణా నా కన్నతల్లి చెయ్యలేదు. తల్ల పాలను కూడా నేను తాగలేదు. ఒక సంపన్న కుటుంబంలో పుట్టాను నేను. నన్ను పెంచడానికి, అసలు నాతో గడపడానికే నా తల్లికి ఖాళీ ఉండేది కాదు. ఆమె ఒక “హై సొసైటీ లేడీ”. ఆయాయే నన్ను పెంచింది. ఆయా “ లాలనలు” మాత్రమే తెలుసు నాకు. అమ్మ వాత్సల్యానురాగములు తెలియవు నాకు.
తల్లి లాలనలకు, పాలనకు నోచుకోక నేను పసితనాన్ని, బాల్యాన్ని విచారగ్రస్తంగా గడిపాను. నన్ను తీర్చి దిద్దినది మా శకుంతలా టీచర్. ఆవిడ మలిచిన శిల్పాన్ని నేను.
తల్లి వాత్సల్యం, ప్రేమ, మృదుత్వం, మార్దవం నాకు ఎండమావులు. నా మనసు తల్లి అనుకంపనని చవి చూడలేదు. నా హృదయం అమ్మ ఆప్యాయతని ఆస్వాదించలేదు. పొందని అనుభూతిని ఎలా ప్రకటించగలం?
శుష్కించిన హృదయంలో కరుణార్ద్రతా గోదావరులు ఎలా ప్రవహిస్తాయి? స్పందన కలిగించబడకపోవడం వల్ల మాతృప్రేమపై నాలో కవితలు పొంగలేదు.
పగలు ప్రకాశించనని సూర్యుడు
వెన్నెలలను చిందించనని చంద్రుడు
మధర జలములను వహించమని నదీమతల్లులు
మధుర ఫలముల అందించమని తరువులు
నిజసంతానాన్ని సాకమని,  తమకు ముఖ్యమైన
పనులు వేరని తల్లులు ప్రకటించిన; ప్రకృతిని
కలుగు వికృతుల నెవరాపగలరు? వీరి సహజ
గుణములు నిండుకొనిన ఎవరు దిక్కు జగతికి
సూర్య చంద్రాదులలో సహజ ప్రకృతులు లోపించిన సృష్టిలో కలుగు గందరగోళానికి ఏది ఉపశమనం? తల్లులందరూ నా తల్లిలా కాక, సంతానాన్ని తాకితే నాలాగ చిత్తక్షోభ పడే అవసరం ఏ పసికందుకూ ఉండదు.
మీ పత్రికను విద్యావతులైన స్త్రీలందరూ చదువుతారు. వారందరికీ నాదొక విన్నపం. “తల్లులారా! మీ వివిధ వ్యవహారాల్లో మీ ప్రగతికి మీ శిశువులు అడ్డు వస్తారు అనిపిస్తే, వారిని సాకడానికి మీకు సమయం ఉండదనిపిస్తే పిల్లల్నే కనకండి. పనిమనుషులచే పెంచబడే దుర్గతి మీ పిల్లలకు పట్టనీయకండి.”.
“మీ అంతరంగంలో రగులుతున్న భావానలాన్ని నేను అర్థం చేసికోగలను. మీ మనసుని నిస్సంకోచంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శలవు తీసికంటాను శ్రీహర్ష గారూ.”
“నమస్కారం! మళ్ళీ కలుద్దాం మందాకిని గారూ!”
#   #    #
 “ ఇలా జరిగింది ఇంటర్వ్యూ. అగ్రగణ్యుడైన కవికి బాల్యం ఒక అనాథలా గడిచింది అనీ, తల్లి వాత్సల్య స్పర్శ అతని మనసుకి సోకలేదనీ తలుతుకుంటూంటూనే గుండె బ్రద్దలయ్యిపోతోంది. నా మనసు ఎంతో ఖిన్నమై పోయింది. మనసు ఉద్విగ్నంగా ఉంది” అంది మందాకిని.
నిండు చందమామ లాంటి ఆమె ముఖం గ్రహణం పట్టిన చంద్రునిలా ఉంది. పున్నమి అమావాస్య అయింది. ఇంకా ఇలా అంది మందాకిని. “ తమ తమ జీవితాలలో అందుకోవలసిన ఎత్తులను అందుకోవాలని, స్వంత అభిరుచులకు, ఊహలకు అనుగుణంగా జీవించాలని ఉవ్విళ్ళూరే నేటి మహిళలు సంతానాన్ని ఉపేక్షిస్తున్నారు. తాము అందలాలు అందుకోవడమే ప్రథమమని, మహత్వపూర్ణమనీ భావిస్తున్నారు.
అనురాగాన్ని అందించక, అనురాగాన్ని పొందడానికి తమని తాము అనర్హులని చేసికుంటున్నారు. తల్లి జీవితంలో పిల్లలు ఉపేక్షింపబడుతున్నారు. ఈ తలపు వస్తే ఊహలోనే భరించలేక పోతున్నాను. జీవితాల్లో పరస్పరం అనురాగం పంచుకొని, ఆనందం నింపుకుంటూ జీవించాలి. జీవితంలో తన గురించి మాత్రమే ఆలోచిస్తే పరస్పర సంబంధాలు శిథిలమైపోతాయి. అటువంటి జీవితాలు సార్ధకాలు అవుతాయా? ఇటువంటి విపరీతమైన జీవన విధానం నాలో ఆశ్చర్యాన్ని, విచారాన్నీ కలిగిస్తోంది.”
అది పౌర్ణమి. నా ప్రణయిని ప్రక్కనే ఉంది. ఆహ్లాదకరమైన వెన్నెల అంతటా పరుచుకొని ఉంది.  కాని మనసు ఉదాసీనంగా ఉంది. నా ప్రియురాలి విచారం నన్ను కలవరపరచింది. ఆమె ఆవేదన నన్ను కరుణాభరితుణ్ణి చేసింది. కాసేపు మౌనం వహించి ఇలా అన్నాను.
“మందాకినీ! ఈ యంత్రయుగంలో స్త్రీలు, పురుషులు తమ తమ ప్రకృతులను మరచి స్భావ విరుధ్ధంగా జీవిస్తున్నారు. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు వంటి సంబంధం తెలిపే మాటలు తమ అర్థాలను కోల్పోయాయు. మనుషులు ఇటువంటి ముఖ్య బంధాలను కూడా అనుబంధాలతో పెనవేసుకోవడం లేదు. అలా చేయడం ఆధునికుల లక్షణంలా కనిపించడం లేదు.
“మాతృత్వం మధురమైనది” వంటి వాక్యాలు పుస్తకాలకే పరిమితమౌతున్నాయి. ఒకరి కోసం ఒకరు జీవించడం లేదు. తల్లి పెంపకం కరువైన బాలల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. మాతృ వాత్సల్యం చవి చూడని వారి ఆక్రోశం అరణ్య రోదనం అవుతుంది. సమాజంలో ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకోవడం శోచనీయమైన విషయం.”
అలా ఆ మాటా, ఈ మాటా చెప్పి మందాకినికి ఉపశమనం కలిగించి ఇంటికి వచ్చాను. అప్పటికి అర్ధరాత్రి దాటింది. అమ్మ భోజనం చేయకుండా నా గురించి కాచుకుని ఉంది. ఇద్దరం కలిసి భోజనం చేశాము. ముఖం చూడగానే నా మన:స్థితిని గ్రహించిన అమ్మ వాత్సల్యపూరితమైన మాటలతో నన్ను సేదదీర్చింది.

సంస్కృత మూలం “ విస్మృతి:” (సంభాషణ సందేశ: - ఆగష్టు 1997) తెనుగు సేత: డా. వారణాసి రామబ్రహ్మం

Sanskrit Original:




विस्मृतिः

       मन्दाकिनी मम सखी। सा अमितसौन्दर्यवती। शरच्चन्द्रनिभानना सा। तस्याः हृदयसौन्दर्यं शरीरसौन्दर्यात् अपि अघिकम्। सा मृदुस्वभाववती। स्मरणीयाम् पद्यानां रचनं तस्याः प्रवृत्तिः। सा कवितायाः मनोज्ञधारा।
        सा कस्याश्र्चित् वनितामासपत्रिकायाः उपसंम्पादिका अपि। तस्याः
पत्रिकायाः साहित्यिकलेखानां परिशीलनं तस्याः नित्यकार्यम्। सामाजिकविषयान् अधिकृत्य अपि तया बहवः लेखाः लिखिता सन्ति। सा मम अत्यन्तप्रियतमा भाविपत्नी अपि।
    अहं तु सारस्वतप्रेमी। कविताः, कथाः, प्रबन्धाः इत्यादीनां पठने मम विशेषरुचिः। मया संस्कृत्-हिन्दी-तेलुगू-जर्मन् प्रभृतयः भाषाः ज्ञायन्ते। ताभिः भाषाभिः उपनिबद्धाः प्रसिद्धाः अनेकेन साहित्यलेखाः मया पठिताः। अहं विमर्शात्मकदृष्ट्या तानि परिशीलयामि।
         सकलान् सारस्वतविषयान् अधिकृत्य मन्दाकिन्या सह चर्चां कुर्वन् अहं कालं यापयामि। कवयः, तेषां कृतयः, काव्यसृष्टिकालीना कवीनां मानसिकस्थितिः इत्यादीन् विषयान् अधिकृत्य आवयोः मैत्रीं वर्धितवती आसीत्।
                                                                           

पूर्णिमादिनम् आसीत्। चन्द्रः कौमुद्या सकलं जगतीम् आह्लादमयीं कुर्वन् आसीत्। ते आह्लादतरङ्गाः मयि अपि भावनिर्भरताम् उद्धौदितवन्तः आसन्। एतस्य दिनस्य सार्थकता सम्पादनीया एव  इति निश्चित्य अहं प्रियया मन्दाकिन्या सह मधुरालापं कर्तुम् इच्छन् वेगेन तस्याः गृहं प्रति प्रस्थितवान्।
      मन्दाकिनी गृहस्य अन्तः आसीत्। सा तु अनुत्साहिनी दृष्टा मया। तस्याः म्लानवदनता अपि मया अवलोकिता।  केनचित् कारणेन एतस्याः मानसं चिन्ताक्रान्तम् अस्ति  इति अहम् अप्रयत्नेन एव ज्ञातवान्। या सर्वदा मन्दहासयुक्तेन उत्साहपूर्णेन मुखभावेन मम स्वागतं करोति स्म सा अद्य तूष्णीम्भावम् अवलम्ब्य सङ्केतेन एव उपवेशनं सूचितवती आसीत्।
             मम सख्याः एषा स्थितिः माम् अपि आन्दोलनभरितमनस्कम् अकरोत्।
      अनुनयदृष्ट्या तां पश्यन् स्नेहशीतस्वरेण तया सह सम्भाषणम् आरब्धवान् अहम्।
      सखि ! मन्दाकिनी !  केन कारणेन  आन्दोलितमनस्का अस्ति भवति? वदतु, किं तस्य कारणम् ?”
      सा नेत्राभ्यां निर्गतान् अश्रुबिन्दून् हस्तेन मार्जयन्ती उक्तवती –


अद्य अहं प्रसिद्धेन कविना श्रीहर्षवर्येण सह मत्पत्रिकायै साक्षात्सम्भाषणं कुर्वती आसम् । सम्भाषणं तु मैत्रिपूर्वकं प्राचलत् । श्रीहर्षवर्यः मम प्रश्नानाम् उत्तराणि उत्साहेन यच्छन् आसीत् । सम्भाषणअन्ते अहं कञ्चन प्रश्नं पृष्टवान् । तस्य उत्तरम् यत् तेन दत्तं तत् मम अमितक्लेशाय अभवत् ... ।
             कः सः प्रश्नः आसीत् भवत्याः ?”
              तदे विवृणोमि,  श्रुणोतु ।
                                                   *****
      सन्दर्शनावसरे अहं पृष्टवती – श्रीहर्षवर्य ! भवान् अत्यल्पे एव वयसि प्रसिद्धः कविः इति कीर्तिं सम्पादितवान् । भवतः सर्वाः कविताः मनोज्ञाः, रसस्यन्दिन्यः मनोल्लासिन्यः च सन्ति। अरङ्गुलिगणनीयाः एव कवयः एतेन क्रमेण सारस्वतसृष्टिं कर्तुं समर्थाः। भवान् तेषु अग्रेसरः। एतद् विषये भवतः अभिप्रायः कः?”
तः अस्मि अहम् । यदा मम मानसं पूर्णं स्पन्दनं प्राप्नोति तदा एव अहं कवितासृष्टिं करोमि, न अन्यदा, न अन्यथा ।  मनः एव  मनसः अनुकम्पनं जानाति । ततः भवत्सदृशाः रसास्वादिनः रसिकात्मानः रज्जिता अभवन् । पठितारः यदि सन्तृप्ताः तर्हि कविः प्रशस्तिं प्राप्तवान् इव ।



        अन्यान् कांश्चन प्रश्नान् पृष्ट्वा अहम् अन्ते पृष्टवती – कविवर्य ! भवद्विषये बहोः कालतः मां कश्चन प्रश्नः बाधते । भवान् सर्वविधान् अपि विषयान् अधिकृत्य कविताः रचितवान् , ऋते मातृप्रेम्णः मातृवात्सल्यात् च । मातृदेवतायाः अनुरागः भवता कदापि न स्पृषटः । माता अस्मान् स्वगर्भे वहन्ती काले जन्म ददाति। जन्मानन्तरं लालन-पोषणादि-समस्तसेवां करोति सा एव । सञ्चारं , सदाचारं च वयं ततः एव पठामः । माता पुत्राय सर्वस्वम् अपि समर्पयति , किन्तु पुत्रात् किमपि न  अपेक्षते ,ऋते प्रेम्णः । अस्मभ्यम् एव जीवति सा । ईदृशी माता भवता कदापि न कीर्तिता । तस्य वात्सल्यानुरागादीन् उद्दिश्य एका अपि कविता न लिखिता । एतत् केन कारणेन ?” इति ।
      मम एतं प्रश्नं श्रुतवतः तस्य कवेः वदने विषादचिह्नं दृष्टिगोचरं जातम् । अनुरागरहितभावः उद्धतः मुखे ।
       भवत्याः परिशीलन शक्तिः अपूर्वा । अम् । मया मातुः अनुरागम् अधिकृत्य लालनपालनादिकं वा अधिकृत्य न किमपि लिखितम् । तत्र कारणम् अपि अस्ति । मातुः अनुरागः कीद्दृशः भवति इत्येव न जानामि अहम् । सत्याम् अपि मातरि , अनाथः इव प्रवृद्धः अहम् । मम लालनपोषणादिकं न कृतं मम मात्रा । किम् अधिककथनेन , मातुः दुग्धम् अपि न पीतवान् अहम् ।
       घनिककुले मम जन्म जातम् । मम विषये किमपि कर्तुं , मया सह स्थातुं वा सर्वथा समयं न प्राप्नोति स्म माता । सा तु है सोसैटी लेडी आसीत् । धात्री एव मां पालितवती । अहं तु तस्याः एव लालनतर्जनादीनि जानामि , न कदापि मातुः
       मातुः लालनपालनादिकम् अप्राप्नुवन् अहं बाल्ये सदा विषादम् अनुभवामि स्म । वस्तुतः शाकुन्तलानामिका अध्यापिका माम् एवं रूपितवती । अतः तस्याः शिल्पम् अहम् ।
      मातुः वात्सल्यं , प्रेम , आर्द्रता वा मम विषये मृगमरीचिकायन्ते स्म । मम मानसेन कदापि मातुः अनुकम्पः न आस्वादितः । अनास्वादितः रसः कथं वा वर्ण्येत ? शुष्के हृदये कथं करुणार्द्रताकावेर्याः उद्भवः ? स्पन्दनाभावात् मया तद्विषये कविताः न रचिताः ।
    सूर्यो वक्ति यदि प्रकाशनिचयप्रद्योतने न स्पृहा
    खिन्नश्चन्दनशीतलो यदि पुनश्चन्द्रो वहन् कौमुदीम् ।
    नद्यः स्वच्छगुणं जलं सुमधुरं वोढुं न सिद्धाः यदि
    माता पाति न पुत्रकं यदि, पुनः किं वा वदामो वयम् ?
सूर्यादिषु प्रकृतिसहजाः गुणाः एव लुप्ताः भवन्ति चेत् जगति कथं वा विकृतीनाम् उत्पत्तिः न स्यात् ? कथं वा तासां विजृम्भणं न भवेत् ?
      यदि सर्वाः जनन्यः मम मातृसदृश्यः न भवन्ति तर्हि शिशवः
मत्सादृश्यम् अप्राप्नुवन्तः चित्तक्षोभतः मुक्ताः भवेयुः । भवत्याः पत्रिका तावत् सर्वाभिः गृहिणीभिः विद्यावतीभिः सर्वाभिः च पठ्यते प्रायः । अतः तासु निवेदनम् अस्ति –अयि मातरः ! शिशवः विविघव्यवहारेषु अवरोधिकाः भविष्यन्ति इति यदि भवत्यः चिन्तयनति , शिशूनां पालनपोषणार्थं दातुं समयः यदि भवतीनां नास्ति, तर्हि शिशोः जन्मदानम् एव मास्तु । दासीभिः क्रियमाणं पालनपोषणं शिशूनां कदापि न भवेत् एव इति ।
      आर्य । भवतः अन्तरङ्गस्य तापम् अहम् अवगन्तुं शक्नोमि। स्वस्य आशयं भवान् निस्सङ्कोचं प्रकटितवान् यत् तदर्थं धन्यवादाः । नमो भवते । साधयामि तावत् ।
       नमो भवत्यै । पुनर्मिलाम तावत्
                           ***
      एवं प्राचलत् आवयोः सम्भाषणम् । अग्रगण्यस्य अपि एतस्य बाल्यम् अनाथस्य इव आसीत् इति स्मरन्त्याः, एतस्य जीवने मातुः वात्सल्यस्पर्शः एव न अनुभवत् इत्येतत् परिचिन्तयन्त्याः मम हृदयम् उत्तपति। अहं नितरां खिन्ना अस्मि । नितराम् उद्विग्रा च अस्मि ।
       राकाचन्द्रनिभाननायाः तस्याः मुखं ग्रहणकालीनचन्द्रस्य इव कान्तिविहीनम् आसीत् । पूर्णिमायाम् अमावास्या दृष्टा मया ।
      मन्दाकिनी कथनम् अनुवर्तितवती – एताः आधुनिकगृहिण्यः जीवितकाले स्वस्य इच्छायाः पूर्तिम् एव प्रधान्येन चिन्तयन्त्यः, स्वस्य इच्छायाः पूर्तिम् एव प्रधान्येन चिन्तयन्त्यः, स्वस्य व्यक्तित्वम् एव महत्वपूर्णं भावयन्त्यः अपत्यानि उपेक्षया पश्यन्ति । अनुरागम् अयच्छन्त्यः अनुरागप्राप्तितः अपि वञ्चिताः भवन्ति । मातुः जीवने अपत्यस्य उपेक्षा ! एतादृशं जीवनम् ऊहामात्रेण द्रष्टुम् अपि न शक्नोमि अहम् । जीवनं सदापि परस्परपूरकं भवेत् । जीवने यदि स्वार्थः एव विजृम्भते, पारस्परिकसम्बन्दः यदि शिथिलः भवति तर्हि का वा सार्थकता जीवनस्य ? मित्र ! एतादृशं विलक्षणं जीवनं कदाचित् मयि आश्चर्यं जनयति, सन्तापं च उत्पादयति ।
      सा रजनी पूर्णिमा । मम प्रणयिनी अपि अस्ति पार्श्वे एव । आह्लादजननी कौमुदी सर्वत्र व्याप्ता अस्ति । तथापि मम मनः  सन्तुष्टं न आसीत् । मम प्रियतमायाः खेदः माम् आकुलितमनस्कं  कृतवान आसीत् । मन्दाकिन्याः वेदना मयि अनुकम्पभावं जागरितवति आसीत् । करुणाभरित अहं किञ्चित्कालस्य मौनस्य अनन्तरम् उक्तवान् -   मन्दाकिनी ! एतस्मिन् यन्त्रयुगे स्त्रियः पुरुषाश्चापि स्वस्य प्रकृतिम् एव विस्मृत्य स्वभावविरुद्धं जीवनं यापयन्तः सन्ति।
माता , पिता, पुत्रः, पुत्री इत्यादयः सम्बन्धवाचकाः शब्दाः इदानीम् अर्थविहीनाः इव दृश्यन्ते । जनाः इदानीम् एतादृशसम्बन्धबन्धं न इच्छन्ति । सम्बन्धस्य प्रधान्यकल्पनम् आधुनिकताविरुद्धम् इति चिन्तयन्ति जनाः । मातृत्वम् अतिमधुरम् इत्येतादृशानि वचनानि पुस्तकमात्रे एव दृशयन्ते । जनाः परस्परहिताय न जीवन्ति । मातुः पालन-पोषणात् वञ्चितानां बालानां संख्या महती दृश्यते।सा वर्धमाना
एव अस्ति अपि । मातृवात्सल्यात् वञ्चितानां तेषां रोदनम् आक्रोशं च गगनं स्पृशति । समाजस्य एषा स्थितिः नितराम् शोचनीया अस्ति ।
       ततः विविधैः सान्त्नवचनैः अहं तस्याः सन्तापम् शमयित्वा गहं गतवान् ।
      तदा मध्यरात्रसमयः आसीत् । तथापि मम माता माम् एव प्रतीक्षमाणा जागरिता एव आसीत् ।  उभौ अपि सहैव उपविश्य भोजनं कुतवन्तौ । मुखदर्शनात् एव मम मनसः स्थितिं ज्ञात्वा मात्रा उक्तानि वात्सल्यपूर्णानि वचनानि मयि शान्तिम् अजनयन् ।
               *****************************













చోటు తప్పిన పువ్వు (కథానిక)



 

ఈ రోజుల్లో రచించడమే వృత్తిగా కల రచయితలు తక్కువ. ఎక్కువమందికి సాహితీ సృష్టి ఒక ప్రవృత్తి మాత్రమె. వృత్తి కాదు. ఆ రచనలవల్ల వారికి పైసా అదాయము రాదు. నాకు కూడా రచించడం ప్రవృత్తి మాత్రమే. నేను రచించిన కవితలు, కథలు సకృత్తుగా పత్రికలలో ప్రచురించ బడ్డాయి. నేనూ ఒక కవిని, కథా రచయితని అని  అనుకుంటూంటాను. నాలాంటి వాళ్ళం కథలు, నవలలు పోటీలలో పాల్గొనడానికి ఇష్టపడుతూంటా

బిల్లు (కథానిక)



 
మరాఠీమూలం: ఆచార్య అత్రే
తెనుగుసేత: డా. వారణాసి రామబ్రహ్మం

బిల్లు    (కథానిక)

దినేశ్ ఎనిమిదేళ్ళ బాలుడు. వాళ్ళమ్మ వాడిని “దినూ” అని ఆప్యాయంగా పిలుస్తుంది. దినేశ్ నాన్నగారు డాక్టరు. తండ్రితో అప్పుడప్పుడు దినేశ్ హాస్పిటల్ కి వెళుతూంటాడు. అక్కడ కూర్చుని అన్నీ గమనిస్తూంటాడు.
హాస్పిటల్ కి రోజూ ఎందరో రోగులు వస్తూంటారు. చికిత్సకోసం కొందరు, మందులకోసం కొందరు. “డాక్టరుగారు! కడుపులో చాలా నొప్పిగా ఉందండి. పరీక్ష చేయండి” అంటారు కొందరు. 

ఇంకొకతను వచ్చి “డాక్టరుగారు! మా బిల్లు ఎంతయిందండి? కాస్త చూసి చెప్పండి” అంటాడు. కుర్చీలో కూర్చున్న దినేశ్ రోగులందరి మాటలూ వింటూంటాడు. వాడికి అన్నీ అర్థము అవుతున్నాయి. కాని, బిల్లు అంటే ఏమిటో అర్థము కాలేదు.
“నాన్నగారూ! బిల్లు అంటే ఏమిటి?” అని తండ్రిని ఒకసారి ప్రశ్నించాడు. అప్పుడాయన తన సొరుగులోంచి ఒక కాగితం తీసి, “ఒరేయ్ చూడు. బిల్లు అంటే ఇది. చదువు” అన్నారు.
దినేశ్ దాన్ని చదివాడు. అక్కడ ఇలా రాసి ఉంది. 

వివరణ                                                 రూ. పై.

రోగ చికిత్సకు                                         10-00             
రెండుసార్లు ఇంటికి వచ్చినందుకు                  25-00
మందులకు                                           30-00

మొత్తం                                                65-00
దినేశ్ చాలాసేపు ఆ బిల్లునే చదువుతూ కూర్చున్నాడు. చదువుతూ నవ్వుకున్నాడు. వాడికేదో ఆలోచన స్ఫురించంది.
ఇంటికి వెడుతున్నప్పుడు వాడి మనసునిండా బిల్లు గురించిన ఆలోచనలే.
మరో ఆలోచనే రావటం లేదు. వాడు ఇలా ఆలోచించాడు. “నాన్నగారు రోగులకి బిల్లు ఇస్తే వాళ్ళు నాన్నగారికి డబ్బులిస్తారు. అంటే నాన్నగారు వాళ్ళకి చేసిన పనికోసం వాళ్ళు డబ్బులిస్తున్నారన్న మాట. నేను అమ్మకోసం ఎన్నో పనులు చేస్తూంటాను. కాని అమ్మ నాకు ఇంతవరకు డబ్బులేమీ ఇవ్వలేదు. అమ్మకివ్వడానికి ఒక బిల్లు తయారు చేస్తేనో? అందువల్ల డబ్బులొస్తాయి. ఆ డబ్బులతో మరమరాలు అవీ కొనుక్కు తినొచ్చు”. ఇలా ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళాడు. 
  
వివరణ                                                      రూ. పై.

తోటలోంచి పువ్వులు కోసి తెచ్చినందుకు                2-00
తమ్ముడికి రెండు గంటలు పాఠాలు చెప్పినందుకు      5-00
పక్కింటికి కబురు తీసికెళ్ళినందుకు                      9-00
కొట్లోంచి పంచదార తెచ్చినందుకు                        0-50

మొత్తం                                                      9-50

బిల్లు తయారుచేశాక నెమ్మదిగా అమ్మగదిలోకి వెళ్ళాడు. బిల్లు అక్కడ పెట్టాడు.
మర్నాడు పొద్దున్న లేవగానే తన బెడ్ పక్కన స్టూలుమీద డబ్బులు, వాటిపక్కన ఒక కాగితం చూసాడు. డబ్బులు లెక్క పెట్టుకొని జేబులో పెట్టుకున్నాడు. కాగితంలో ఏముందోనని కుతూహలంగా విప్పిచూశాడు. ఏముంది కాగితంలో? ఒక బిల్లు రాసి ఉంది. అమ్మ దినేశ్ పేరుమీద ఆ బిల్లు తయారు చేసింది. 

వివరణ                                                     రూ. పై.

చిన్నప్పటినుంచీ పెంచినందుకు                        ఏమీ అక్కరలేదు
ఒంట్లో బాగోనప్పుడు శుశ్రూష చేసినందుకు           ఏమీ అక్కరలేదు
కథలు చెప్పి మనసుని రంజిపచేసినందుకు           ఏమీ అక్కరలేదు
చదువు చెబుతున్నందుకు                              ఏమీ అక్కరలేదు

మొత్తం                                                     ఏమీ ఇయ్యక్కరలేదు

కాగితం దినేశ్ చేతులలోంచి కిందికి జారిపోయింది. కళ్ళు కన్నీళ్ళతో నిండి పోయాయి. గొంతు పెగలలేదు.  కంఠం రుధ్ధమయ్యింది. జేబులోని డబ్బులు చేత్తో పట్టుకొని అమ్మదగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు. కళ్ళవెంట నీళ్ళు కారుతుండగా మౌనంగా తల్లికి డబ్బులిచ్చేసి అమ్మ ఒళ్ళో తల పెట్టుకొని తనివిదీరా ఏడ్చేశాడు. 

అమ్మ దినేశ్ని ప్రీతితో కౌగలించుకొంది. వాడి ముఖాన్ని ముద్దాడి “దినూ! ఇదేరా నీ బిల్లుకి కట్టే డబ్బు. మరేదీ కాదు.” అంది.


Tuesday, February 3, 2015

The poet - wordsmith and his words-worth




The poet is a wordsmith
His composition is Words-worth

Poet is a weaver weaves
nice fabrics of emotion 
by arranging threads of words

Poet is a barber shaves
the ills and ugliness in
the hearts of the readers

Poet is a washer-man washes 
the dirt in one's mind and 
cleanses it with the detergent of 
noble thoughts and feelings

Poet is a goldsmith creates
jewels out of the gold of vocabulary

Poet is a farmer tills and cultivates the
hearts and minds of individuals 
with beautiful seeds of knowledge
and aesthetics making them blissful

Poet is a sculptor etches
beautiful sculptures out of
rocky within of persons of 
strong ideas and opinions 

Poet is a singer
Sings the melody of
all harmonious hearts
in lyrics and music 

Poet is a master of dance
who makes the words and emotions
dance to his tunes 

Poet is a painter paints 
our lives with colorful
canvas and scenes

Poet is a blacksmith makes alloys
with our metal-strong differences 
melting using the fire created
with his pleasant breeze-like compositions


Poet is a potter smoothens our hearts into
required shape with the gentle touch of words

Poet is a scholar teaching us
the disciplines with the aplomb of a teacher

Poet is a philosopher who shines
our philosophies and trains us to 
develop our own philosophy to face life

Poet is a spiritualist shapes our
ideologies, opinions, views, perceptions 
and makes us self-sufficient spiritually

Poet is a Guru preaches us and reaches us
with his with his poems, utterances and love

Poet is all 
of our being;
Poetry in all aspects 
is for our 
Well-being