Showing posts with label rape. Show all posts
Showing posts with label rape. Show all posts

Wednesday, March 18, 2015

అబ్బాయికి ఉపదేశము

అబ్బాయికి ఉపదేశము

నాన్నా ఎలా ఉన్నావు? మేము కులాసా.
వయసులో ఉన్నావు జాగ్రత్త బాబూ!

అమ్మాయిలు ఇప్పుడే ఊఁ అంటారు
మరుక్షణం ఆఁ అంటారు! దేనికైనా

మహామహులే బొక్కబోర్లాపడ్డారు
స్త్రీల విషయంలో వారి అంతరంగ పఠనంలో

"నిన్ను ప్రేమిస్తున్నానన్న" పిల్లను
నువ్వు ప్రేమిస్తున్న పిల్లను
సరదాగానైనా తాకకు;
కొన్నేళ్ళ తర్వాతైనా ఆ స్పర్శ
నీ పీకకు చుట్టుకోవచ్చు నేరంగా

ఇప్పుడిక్కడ చట్టాలు సవరించబడ్డాయి
ఇష్టము ప్రకటిపని ఆడుదానిని
తాకుట నేరము; శృంగార సంభాషణలు
జైలు శిక్షకు పరమపద సోపానములు

కవితలు రాస్తూంటావు జాగ్రత్త!
ఏ విధముగానైనా అయిష్ట స్త్రీని
అలరిచరాదు; అమ్మాయినైనా; ఆంటీనైనా
ఇది అంకుల్స్ కీ వర్తిస్తుంది!

రేప్ నిర్వచనము మారిపోయింది
ఇష్టము చూపని ఆడుదానిని
తాకిన, ఆమెతో శృంగార పరంగా
మాటలాడినా; ఏ విధమైన
కమ్యూనికేషన్ జరిపినా ఆమె
ఫిర్యాదు చేస్తే నీ పని అంతే!

పోలీసులు నీ ఎదుట వాల్తారు
నిన్ను కష్టడీలోకి తీసికుంటారు
చట్టం తన పని తాను చేసుకు పోతుంది
మనం ప్రముఖులంకాదు చట్టాన్ని
తన పని తాను చేయకుండా ఆపడానికి
మామూలు పౌరులం మనం ఎవరూ వెనక
దన్నుగా లేరు మనకు తిమ్మిని బ్రహ్మిని చేయడానికి

స్త్రీలు చంచల మనస్కలు
 ఒక్కొక్క సారి వారికి ఏమి కావాలో
వారికే తెలియని పసికూనలు
ఇప్పుడు ఇది అంతలోనే అది

ఆడువారిని మృగాలైన మగవారినుంచి
రక్షించే ప్రయత్నంలో కలిగిన పెను మార్పు ఇది
అమాయకులైన మగవాళ్ళ పాలిటి బ్రహ్మాస్త్రము
బలాత్కారాలు ఎన్ని తగ్గుతాయో ఆగుతాయో
తెలియదుగాని ఈ చట్టము మగవారి తలపై
వ్రేలాడుతున్న ఖడ్గము; మనఃచాంచల్యము
కలవారి చేతిలో రాయి; విచక్షణా రహితము
మంచివారైన మగవారి పాలిట అశనిపాతము

జాగ్రత్త నాయనా జాగ్రత్త!
జైలు శిక్ష పొందు అమాయకపు
పనులు చేయకు ఆడువారి పట్ల
మెలగు అతి డాగ్రత్తగ; వారి ఆకర్షణల
ఏమరకు; మగువ ఇంక ఎంత మాత్రమూ
కాదు మగవారికి మధుర భావన
ఇది