Showing posts with label వాడిపోతున్న లతా నికుంజం. Show all posts
Showing posts with label వాడిపోతున్న లతా నికుంజం. Show all posts

Wednesday, February 25, 2015

వాడిపోతున్న లతా నికుంజం





వాడిపోతున్న  లతా నికుంజం

మౌర్యులపై ఆంద్ర శాతవాహనుల విజయపరంపరలలో

రాజరాజనరేంద్రుని కృష్ణరాయని
ధవళ కీర్తి చంద్రికలలో

నన్నయ మొదలు "కరుణశ్రీ" వరకు
జాలువారిన రసపద్యకవితా లహరులలో

రామదాసు అన్నమయ్య త్యాగరాజుల
సంగీత సాహిత్య మధుర సమ్మేళనములో

గురజాడ కందుకూరి జాషువా శ్రీశ్రీ  దేవులపల్లులు
నక్షత్రాలై అలరారు నవ్యసాహితీ వినీలాకాశంలో

గోదావరి కృష్ణవేణీ పెన్న తుంగభద్రల
పవిత్ర నదీ జల ప్రవాహములో

అమరావతీ శిల్పసౌందర్యంలో
కూచిపూడి నాట్యంలో

నాగార్జున వేమన్న కొడవటిగంటిల
సునిశిత ఆలోచనా స్రవంతులలో

ప్రతిఫలించే తెలుగుదనం
అందమైన లతా నికుంజం
ఎప్పడూ ఇలా మరింత సౌరభంతో
పరిమళిస్తూనే ఉండాలి
కాని వాడిపోతున్నది చేతకాని వారి చేతుల్లో
ఎండిపోతున్నది వివిధ రీతుల్లో

పచ్చదనం పూవులతోడి  అందం 
కనిపించునా మళ్ళీ ?

ఏమో?
స్వార్థపరుల 

కళా దృష్టి లేని కునాయకుల
నిర్లక్ష్యం లో సమసిపోతున్నది!


 
ఇంతేనేమో? 
ఇంకా తెప్పరిల్లి పచ్చబడదో? 
మొగ్గలు పూవులతో అలరించదో?

విచారిచవలసిన సమయం 
పరిష్కరించలేని విషాద వాస్తవము 
గడ్డురోజుల నైరంతర్యం