Showing posts with label వయసులు వచ్చిన మనసు. Show all posts
Showing posts with label వయసులు వచ్చిన మనసు. Show all posts

Monday, June 27, 2016

వయసులు వచ్చిన మనసు


 వయసులు వచ్చిన మనసు


పొంగి వచ్చు తరంగము వలె
సంబరమున దూకు జలపాతము భంగి
విచ్చిన పూవై పరిమళము వెదజల్లుచు
పరువెత్తు నదీప్రవాహము వోలె
భాసించుచు ప్రభాకరుని వలె
ముదము పంచు ప్రణయిని వోలె
వచ్చి పడుచున్నది నా కవితా సుందరి
కమనీయముగ మనసున తలపుల వరుసగా


వయసులు వచ్చి ఇప్పుడే వకసించుచున్నది మనసు
నా కవితా బాలకు; నేర్చినది వాల్చూపులు విసరు సొంపు;
సహజముగ విలసిల్లు మేని హొయలు ; పదగమనములు
హంసల నడకలు; సరసత నిండిన సహృదయ ఉబికి
వచ్చుచున్నది; రసికుల హృదయములకు మనోరంజనియై