Showing posts with label రాధామాధవము. Show all posts
Showing posts with label రాధామాధవము. Show all posts

Sunday, February 8, 2015

రాధామాధవము (అ)

రాధామాధవము





మాధవ ఉవాచ:

సఖీ! రాధా! 

చిదిమి నిన్ను  పెట్టుకొనవచ్చును దీపము
అదుముకొని  నిన్ను తీర్చుకొనవచ్చును తాపము 

రత్నహారములచే నీ శంఖ సదృశ కంఠ  సీమల నలంకరించనను 
బంగారు గాజులు నీ పసిడి చేతులకు తొడిగినను  
పట్టుచీర గట్టి వడ్డాణము పెట్టి నే మురిసిపోయినను
ఈ పై మెరుగులు నీ మేని సహజ సౌందర్యము ముందు 
వెల వెల బోవునేమో నని సందియమగుచున్నది ప్రియా!

నీ పై ప్రేమ తప్ప మరే పెన్నిధి లేని పేదవాడను
మనసున మనసు కలిపి నీతో పొందునకై అలమటించుచున్న 
చేలికాడను నీ వాడను నీవే నేను సఖీ!

శృంగారముల రస సింగారముల ముంచి తేల్చమని 
రస ప్రణయ  పాఠములు నేర్ప మని మురిపెముతో 
నిను చేర లేదనుటలు కాదనుటలు ఈ జన్మ కింతే యనుటలు
నా హృదయము పై సమ్మెట పోటులు తల పై రోకటి పోటులు రాగమయీ!

శృంగారము నీవు తత్త్వము నేను నేరుపుచుండ
మన మేనులు పరస్పరము అల్లుకొని లీనమై
మమేకమగు క్షణములిప్పుడే రావలె
లేనిచో నేవు నేను ఆనందమునకు దూరమై దూరమగుదుము
సరసము పండవలె ప్రణయము జాలువారవలె మన రస ప్రయాణమున

సఖీ! ప్రియా! నీవును  నేనును ఒకటే 
రాస లీల మన సయ్యాట; మన జీవితముల జీవమదే
చెలీ! మన ప్రత్యేకానుబంధమున మనమిద్దరమూ
మన మేనుల కలయికలో పెంచుకొవలె ఫలింప చేసుకొవలె

గోపాలుడ నేను గోపికవు నీవు
పురుషుడను నేను ప్రకృతివి నీను
మన సంగతిలో పులకించును
ప్రణయము! రసాస్వాదనము! 
ప్రకృతి; పుడమి అంతా!