Showing posts with label భారతీయ సంస్కృతీ సంప్రదాయములు. Show all posts
Showing posts with label భారతీయ సంస్కృతీ సంప్రదాయములు. Show all posts

Tuesday, December 1, 2015

సూర్య చంద్రులుండు వరకు నిలిచి ఉండును

సూర్య చంద్రులుండు వరకు  నిలిచి ఉండును


కచ కుచ వర్ణనంబులొద్దని పుర్రచేతి భావజాలములతో
కవితల వెలయించి‌ తెలుగు కవన సామ్రాజ్యము నేలిన 
ఘనుల సాహిత్యమునెవరు చదువుచున్నారు నేడు? 
ప్రజాసాహిత్యమును ఏ ప్రజ పారాయణము చేయుచున్నారు?

భర్త శ్రేయస్సే తన శ్రేయస్సనుకునే భార్యలు బానిసలనీ
కుటుంబంలోని అందరిపై హృది నిండా ప్రేమ నిండిన తల్లులు
ఉండరాదని; స్త్రీ తన కోసమే తను బ్రతకాలని ఇతరులకోసం కాదని;
స్వంత కాళ్ళపై నిలబడి మగవాని వలె సంఘమున మెలగాలని
రాతలు రాస్తూ అందరి తలరాతలు అతలాకుతలం చేసే ఘనులు
అధునాతన ఆలోచనా  ధోరణితో అన్ని తారుమారు చేసిరి కుజనులు

ప్రతీదీ కొంతకాలము మాత్రమే వెలుగును; ప్రభావము ఉండును; ఇట్టి ఎన్నో
ప్రతికక్షులను ప్రతిద్వందులను చూసినది సనాతన భారతీయ సాంప్రదాయము;
పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయే గంతులు ఇవి; చిరముగ మానవ నాగరికత
విలసిల్లునంతవరకు నిలిచి ఉండును భారతీయ సంస్కృతీ సంప్రదాయములు బ్రహ్మ తత్త్వము
మావపరిణామ చరిత్రలో ఎన్నో పుట్టుకలు ఎన్నో లయములు
లయబద్ధముగా జీవితముల నడుపుకొను వీలిచ్చును, లాలించును;
అమ్మవలె ఆదరించును బుజ్జగించును; సన్మార్గ  నడచుటకై చేయి అందించును
సనాతన భారతీయ సంప్రదాయము సూర్య చంద్రులుండు వరకు  నిలిచి ఉండును
నాగరికతలకే నాగరికత నేర్పును ఆత్మజ్ఞానము
విజ్ఞాన శాస్త్రముల పరిశోధనల ముందుకు తీసికెళ్ళును జ్ఞానబోధ మీమాంస;
జ్ఞానము కలుగు విధము; భాషల తీరుతెన్నులు; మనసు స్వరూప
స్వభావములు  కాచి వడబోసిన జ్ఞాన భాండాగారము భారతీయ సంస్కృతి