Showing posts with label భారతదేశము. Show all posts
Showing posts with label భారతదేశము. Show all posts

Tuesday, January 12, 2016

భారతదేశము





భారతదేశము

గోవునిక్కడ పూజించెదరు మిగతాచోట్ల అది ఒక జంతువు మాత్రమే
నదులనిక్కడ పవిత్రతీర్థములంచు స్నానములనాచరించెదరు వాటియందు
ఇంకెక్కడైనా అవి వట్టి నీటి ప్రవాహములు మాత్రమే మరింకేమీ విశేషము లేనివి;

గిరులిక్కడ దేవుళ్ళు దేవతల జన్మ స్థానములు విహార భూములు
మరెక్కడ చెట్ల సెలయేళ్ళ వహించు రాతి శ్రేణులు వట్టి ఎత్తులు

చెట్టులు పుట్టలు జంతువులును పూజార్హములిచట
మరేచోట స్థావర జంగమముల సమూహము మాత్రము

ప్రకృతి దేవత ఇచట; స్త్రీయును పవిత్ర స్వరూపము, దేవి;
బాల్యమున కౌమారమున యవ్వనమున వార్ధక్యమున; వరుసగా
తండ్రి, భర్త, కొమరులచే రక్షణ కల్పింపబడు కోమల రూపము;

మాతృదేవోభవ! పితృదేవోభవ! ఆచార్యదోవోభవ! అతిథిదేవోభవ! యని
మానవులకు గౌరవము, మర్యాద, దైవత్వము కల్పించిన సంస్కారము
వెల్లివిరిసినదిచట; సంస్కృతికి, జ్ఞానమునకు పెద్దపీట వేసిన నాగరికత ఇచటిది;

నేడు అపార్ధముల, కువిశ్లేషణల, మేధాసంపత్తీరహిత "మేధావులచే"
నిరసింపబడుతున్నది; వక్రభాష్యముల పలుచన చేయబడుచున్నది;

మనిషినే దైవము చేసిన ఉపనిషత్ సారము అద్వైతము;
ధనకనకవస్తువాహనములకన్న మానవత్వము జేజేలందుకున్నది

రామాయణభాగవతమహాభారతపంచతంత్రజాతకకథల తదితర సాహిత్యముల
అన్నిశాస్త్రముల జ్ఞానముల విజ్ఞానముల సృష్టించి పెపొందించి, పంచిన
సకలభాషాశాస్త్రకళారూపముల సర్వస్వము సంపదల సరసుల మయము
నేడు సంస్కారరహితుల స్వార్ధ, అవినీతి పరుల, దుష్టుల, దుర్మార్గుల పాలై వగచుచున్నది