Showing posts with label బాల కార్మికులు. Show all posts
Showing posts with label బాల కార్మికులు. Show all posts

Thursday, June 16, 2016

బాల కార్మికులు - నేర్పరితనముల నేర్చు బాలలు


 బాల కార్మికులు - నేర్పరితనముల నేర్చు బాలలు



చిన్నప్పుడే జీవికకు ఉపయోగించే పనిని,
నేర్పరితనాన్ని నేర్చుకోనీక, అందరినీ జీవికను
ఎంతమాత్రము ఏర్పరచలేని, అతి ఖరీదైన ప్రస్తుత
చదువులు చదవమనడం అన్యాయం; బాల కార్మికులకు

అభ్యంతరం ఉండవచ్చు గాని బాల ఎప్రిన్టిస్ కి
ఏల అడ్డు చెప్పవలె ఈ నవీన మేధావులు? పనికి
రాని ఈ చదువులను బోలెడు డబ్బు పోసి చదివి
అటు నేర్పరితనములు నేర్వక ఇటు ఈ చదువులు

చదివి రెంటికీ చెడ్డ రేవడుల వలె పిల్లలను తయారు
చేస్తున్న మనం వారికి ఎంతో అన్యాయం చేస్తున్నాం;
ఈ చదువులు ఎంతవరకు చదివినా ఉద్యోగములు
రాని నేటి దుస్థితి లోనికి పిల్లలను నెట్టడం ఎంతవరకు

సబబు? అటు ఫీజులకై లక్షలు పోస్తున్నారు; ఇటు
జీవిక ఏర్పడడం లేదు; వీరి ఈ విషాద స్థితికి కారణం
కారా నవీన మేధావులు, ఎన్ జి వో లు? వీరు పిల్లలను
ఉద్ధరిస్తున్నారా? ఊరికే కాలం, డబ్బూ వృథా చేయిస్తున్నారా?

దీనిని గురించి తమ పాత్రను పునర్విమర్శించుకునే
బుద్ధి మేధావులకు, ఎన్ జి వో లకుఉంటే ఎంత
బావుండును? అందర్నీ ఒకే రాటకి కట్టి
బాల కార్మిక నిర్మూలనా "లక్ష్యంతో" బడులకి పంపి

వేలకు వేలు వారిచే ఖర్చు పెట్టించి, చివరకు ఏదీ నేర్వక
పనిమాలిన వాళ్ళుగా తయారు చేయడానికి ఈ పెద్దలకు
ఎవరు అనుమతినిచ్చారు? వారంతట వారే మొదలెడితే
ఆపవలసిన ఆవశ్యకత నేటి వాస్తవ పరిస్థితుల దృష్ట్యా

మనందరి మీదా, ప్రభుత్వాల మీదా లేదా? ఈ మాట
చెబితే మన్ని తిట్టిపోసి, చదువుకు అడ్డు పడుతున్నామని
మనల రచ్చకీడ్చే ఈ కుహనా సంఘ "సేవకులకు" అడ్డు
పడగలిగిన వాడెవ్వడు? అడ్డు పడితే సమర్ధించేవారెవరు?

అంతా బుద్ధి శూన్యత అలముకున్న నేడు
బుద్ధిమంతుల మాట్లాడనిచ్చేదెవరు? సంఘానికి
మంచీ- చెడూ, హితవు చెప్పనిచ్చేదెవరు?
అంతా గొఱ్ఱెదాటు వ్యవహారంగా మారిన నేడు?