Showing posts with label పెద్దల ఊసులే చద్దికూడు మనకు. Show all posts
Showing posts with label పెద్దల ఊసులే చద్దికూడు మనకు. Show all posts

Monday, July 20, 2015

పెద్దల ఊసులే చద్దికూడు మనకు

పెద్దల ఊసులే చద్దికూడు మనకు

కృష్ణుడు ఇస్కాన్ కల్టు వారి స్వంతమా‌ లేక వారి‌ కాపీరైటా, పేటెంటా?
వేంకటేశ్వరుడు వైష్ణవులకు‌‌ మాత్రమే దేముడా ఇతర భక్తుల కాయడా?
ప్రాంతము అక్కడి రాజకీయుల జాగీరా? తాతల ఆస్తా? మరెవరికి అక్కడ
చోటెందుకు లేదు? సంకుచిత్వము విషము చిమ్ముచువ్న నేడు, మత గురువులు,
నాస్తికులు, ప్రాంతీయ నాయకులు బరువు దేశమునకు; సామరస్యము తెలియని‌
మనుషులు శాంతి విధ్వంసకులు, సంఘ విద్రోహులు; అన్య మతముల,
అన్య తత్త్వముల, అన్యదైవముల దూషించు‌వారు కారు మానవులు

ఇంగితము లేని వారు విద్యలు గరపగలరా? ఈ ఎల్లయ్యలు పుల్లయ్యలు?
ద్వేషము క్రక్కు వారు సంఘమును నడుపగలరా? ఈ ఆధునిక  సిద్ధాంత వాదులు?
మూర్ఖులై మూఢులై అనాగరికులు, సంస్కార హీనులు
గాక ఆ‌ ( నా )స్తిక శిఖామణులు? సమత మమత తెలియక,
నలుగుర కలుపుకుపోగల హృదయ‌ నైర్మల్యము లేక
పేచీ పెట్టు గురువులు, నాయకులు మేధావులు పుడమికి చేటు గాద!

ఆడలేనమ్మ మద్దెల ఓటన్నట్టు చేతగాక,
నూతనముగ ఏమి ఆవిష్కరించక
సాంప్రదాయమును, జ్ఞానమును నిందించువారు
సంస్కృతి, సంస్కారములు లేని అనాగరికులు, ‌
ఆటవికులు; ఇందర కుమనస్కుల భరించుట
భారతమునకు కష్టమగుచున్నది‌ నష్టమగు చున్నది‌;
ఎవరూ దేశమునకు చెందరు! అందరి సుఖ శాంతుల పోగొట్టు
దుండగీడులు వీరు; మేధావుల మనుకొను వాగుడు మూకలు!
జ్ఞానమే శరణ్యము మనకు; పెద్దల ఊసులే చద్దికూడు మనకు