Showing posts with label దైవ దర్శనము. Show all posts
Showing posts with label దైవ దర్శనము. Show all posts

Thursday, September 10, 2015

దైవ దర్శనము





దైవ దర్శనము


పంచారామక్షేత్ర విఖ్యాత కుమారారామందు దర్శించితిని
తెల్లని పాలరాయి నిర్మిత ఉత్తుంగ లింగరూపుని పాపఱేనిని
భీమేశ్వరుని బాలాత్రిపురసుందరీ సమేతుని భావారిని భవుని
ఆహ్లాదకర ప్రశాంత పరిసర పరమేశ్వరుని పాపహరిని పశుపతిని
వికసించిన కమలములు నిండిన సరసీ సమీపుని విమలుని తెల్లని
వానిని జ్ఞానిని అద్వైతమూర్తిని నిర్మల తాపసుని నిరాడంబరుని




భావాతీతుని భావనారాయణుని గోదా రాజ్యలక్ష్మీ విభుని
సర్పవరక్షేత్రమందు పంచభావనారాయణులలో ఒకనిని విష్ణుని

పరవశించి వీక్షించితిని బాలాత్రిపురసుందరిని
రామలింగేశ్వరప్రణయినిని అమ్మను అంబను
తటాకతట రాజ్ఞిని తత్త్వస్వరూపిణిని తటిల్లతా
సమరుచిని తాటంకవిభూషితను సర్వేశ్వరిని

అంతయు శివకేశవుల వాత్సల్యము వారి కరుణా
కటాక్షము; వారి దేవేరుల భక్తపాలనాకళాదీక్ష దక్షత
 https://upload.wikimedia.org/wikipedia/commons/0/02/Kumararama_Bhimesvara_temple%2Cfirst_floor%2Cgopuram%2Csamalkota.jpg