Showing posts with label దేవుడి గొడవ మీకెందుకు?. Show all posts
Showing posts with label దేవుడి గొడవ మీకెందుకు?. Show all posts

Tuesday, July 21, 2015

దేవుడి గొడవ మీకెందుకు?

దేవుడి గొడవ మీకెందుకు?

దేవుడి గొడవ మీకెందుకు?
వదలండి దేవుణ్ణి, ఆయన భక్తులను
వారి మానాన పోనివ్వండి వారిని;
జీవించండి మీరు మీ "నమ్మకముతో" 


నమకము చమకము
మంత్రపుష్పము అనవసరము మీకు

ప్రాచ్యమో పాశ్చాత్యమో ఒక
సిద్ధాంత వ్యామోహంలో పడి
విలసిల్లండి; ఆ సిద్ధాంత విలాసినీ
మాటల మత్తులో కబుర్ల సొగసు
సోయగములలో చూడండి నాకమును
దేవుడెందుకు మీకు దేవతల ఊసెందుకు మీకు

మీది ప్రశస్త బుద్ధి; జీవించండి
ఆ బుద్ధి కుశలతతో; నమ్మకండి విధిని
దేవుని సంకల్పములను; ఆయన కారుణ్యమును
బ్రతకండి మీ స్వంత ప్రతిభతో, సామర్ధ్యములతో

వదలండి దేవుడిని, గుడిని
వెళ్ళకండి అక్కడకి, వెళ్ళండి
మీ చిత్తమొచ్చిన చోటికి

భక్తుల-భగవంతుని సహజ అనుబంధము
అవగతము కాదు మీకు;

మీరు మెచ్చు సిద్ధాంతమును,
తత్ సిద్ధాంత కర్తను కొలవండి,
పరిగణించండి అతని పుస్తకమును
పవిత్ర గ్రంథముగా; ఆ ఉక్తులను ఉటంకించండి
ఎచ్చోటనైనా; పొందండి కితాబులను

రాకండి మాజోలికి; మా సఖుని జోలికి
హేతువాదులారా, నాస్తికులారా
దేవుడు లేడని మీ "నమ్మకము" మాత్రమె
వదలండి దేవుడిని, గుడిని