Showing posts with label తెనుగు. Show all posts
Showing posts with label తెనుగు. Show all posts

Wednesday, February 11, 2015

తెనుగు, తెలుంగు, తెలుగు, ఆంధ్రము

 



తెనుగు, తెలుంగు, తెలుగు, ఆంధ్రము

"దేశ భాషలందు తెలుగు లెస్స"
అని రాయలు పొగిడిన బాస
"సుందర  తెలుంగు" అని సుబ్రహ్మణ్య భారతి
కొనియాడిన రమణీయ పలుకుల పుట్ట
"ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్" అని సర్వులు
తెలుగు భాష లాలిత్యమును గురించి చెప్పు మాట
తెనుగు, తెనుంగు, తెలుగు, ఆంధ్రము అని
సంగీతమునకు సరియైన గురియైన
గీతములనిచ్చు శ్రావ్య భాష అని
ఎమ్. ఎల్. వసంత కుమారి మెచ్చుకున్న
పదముల తోట తెలుగు భాష మన నుడికారము
పద్యములను హృద్యముగా కలిగిన రాసి
పద్యముల పాడుచున్నప్పుడు మనల
పులకింప చేయు పున్నమి చందమామ
వసంతమున కోకిల పాట ఆంధ్రము

నేడు మాట్లాడు వారు లేక
సొగసులను సోయగములను
పట్టించుకొను వారు లేక శూన్యమైనది
పలికి, పదముల ఉచ్చారణలో కులికి
మైమరచు పిల్లలు లేని మాతృ భాష
పద్య పఠనమున పులకించు కుర్రలు
కావ్యముల చదివి ఆనందించు యువత
నాణ్యమైన రస భరిత భాషనుపయోగించి కవనములు రాని
తెలుగు వాణి; వాగ్దేవికి వాడబడిన ఆభరణము
తెనుగు, తెనుంగు, తెలుగు, ఆంధ్రము