Showing posts with label చలన చిత్రములు. Show all posts
Showing posts with label చలన చిత్రములు. Show all posts

Tuesday, March 29, 2016

చలన చిత్రములు

చలన చిత్రములు

ఉత్సాహము కలిగించెడివి మనసుకు నిన్నటి‌ చలనచిత్రములు;
సంగీతము పాటలు వాటిలోని సాహిత్యము
తూగు సంభాషణలు ఆహార్యములు నటన
సున్నిత హాస్యము; ఇచ్చెడివి అందమైన
అనుభూతులను; మళ్ళీ మళ్ళీ చూడాలనిపించెే
తహతహను తమకమును తృష్ణను తపనను


ఇప్పటి సినిమానటులు వంశపారంపర్య హక్కుదారులు;
తండ్రి నటనా సామర్ధ్యము ఇసుమంతయును పట్టించుకొనకనే
అంటకనె రంగులు పూసుకొనుచున్నారు; ప్రేక్షకులను
మాత్రము తమ "నటనతో" చంపుచున్నారు; రాజకీయ
వారసులు తమ పాలనతో చంపుతున్నట్టు; సినిమా,
రాజకీయ వారసత్వములు భారత దేశమునతు పట్టిన చీడ

భౌతికాకర్షణతో యవతీ యువకుల ఆకర్షించి
వారి వారి హృదయముల "దోచి" వారి చదువులు
అటక  ఎక్కించుచున్నారు; నటులకు విటులకు
సంఘమున గౌరవము హెచ్చి యువతకు
"ఆదర్శప్రాయులైన" వ్యక్తులైరి; తెలిసీ తెలియక
వినోదమును భ్రష్టు పట్టించుచున్నారు; వికాసము
ఏ మాత్రము కలగని వెఱ్ఱి మొఱ్ఱి కథలతో మొత్తుచున్నారు

చక్కని చుక్క నాయికయై అందముల అన్నీ
ప్రదర్శించుచు ఊగుతు తూలుతూ స్టెప్పులేయ
యువతను ఊపు వెఱ్ఱెక్కించు గీతముల నాడు;
వారసనటులు వాచకము ఆంగికము నటన లేకయే
హీరోయిన్ల ఒంపు సొంపుల మోటుగ తాకుచు; డబ్బులు,
ప్రాచుర్యము పొందుచు; అభిమానులను సంపాదించుకొనుచున్నారు

సినమాలకు పేర్లు పెట్టుట రాదో, చేతకాదో,
లేక పేర్లు నిండుకొనుచున్నవో, పెట్టిన పేర్లే పెట్టి
మూకలనాకర్షించు మోటు పేర్లు పెట్టి తమ
సాహితీ అజ్ఞానమును, అభిరుచిని, లలితకళల
యందు తమ పరిచయ, ప్రవేశ లేములతో
మన హృదయ సున్నితత్వమును సరసతను
అవమానించుచున్నారు; మన హృదయ
రాసిక్యతను అసలు పట్టించుకొనుటలేదు

ఇరవయ్యవ శతాబ్దపు "మార్వెల్" సినిమా;
చేతకాని వారి చేతులలో పడి మనల ఏడిపించుచున్నది