Showing posts with label అద్వైతము - ద్వైతము. Show all posts
Showing posts with label అద్వైతము - ద్వైతము. Show all posts

Saturday, September 26, 2015

అద్వైతము - ద్వైతము


 అద్వైతము - ద్వైతము


తత్త్వమును గాలికి వదలి వైచి వ్యక్తుల పట్టుకు
వేలాడుట భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయము కాదు;
తత్త్వము, గురువు సమానము; జీవితాంతము
ఒకనికి శిష్యపరమాణువుగ బ్రతుకు గడుపుట

ఉపనిత్ సంప్రదాయము కాదు; సర్వతంత్ర స్వతంత్రత
తత్త్వశాస్త్ర అవగాహనా పరమార్ధము; అన్ని బంధముల
నుంచి విడుదల; అన్ని కామితముల నుంచి ముక్తి; అహం
భావ మమకారములనుంచి మోక్షము; వ్యక్తిత్వ స్పృహనుంచి

బయటపడి పరమాత్మ స్పృహయే ఊపిరి కాగ
వేదాంత వాక్యార్థములందు సదా రమించుచు
శోకవిహీనులై, నిర్మల మానసమున శాంతానందమౌనములు
ప్రతిఫలింప భక్తి స్థితియందు తత్పరుడై పరాత్ పరుడగుట తత్త్వానుభవము

ఉపనిషత్ స్రష్టల దివ్యానుభవము; అందరు ఆచార్యుల నిర్గుణ స్థితి
అదియే లఘువు గురువునందు ఐక్యమగుట; నిర్వాణ స్థితి; పరబ్రహ్మానుభవము

ద్వైత భావము పోనిదే అద్వైతానుభవము అవదు
వ్యక్తిత్వము ఖాళీ చేయు ప్రదేశమే పరమాత్మ వెలుగు చోటు




ద్వైతము భావము మాత్రమే. అద్వైతము అనుభవము. ద్వైతము వాక్యము. అద్వైతము తాత్పర్యము. తత్ పరము. ద్వైతము విభక్తి. అద్వైతము భక్తి. ద్వైతము వ్యక్తిత్వము. అద్వైతము బ్రహ్మము. ద్వైతము సగుణము అద్వైతము నిర్గుణము.