Showing posts with label అటకెక్కుతున్న పెళ్లి. Show all posts
Showing posts with label అటకెక్కుతున్న పెళ్లి. Show all posts

Friday, February 20, 2015

అటకెక్కుతున్న పెళ్లి

 
అటకెక్కుతున్న పెళ్లి 

పూర్వీకుల దృష్టి లో పెళ్లి ఒక పీటముడి
ఎంత గింజుకున్నా విడివడదు విడిపోదు
అది వారికి బాధ్యతతో కూడిన అనుబంధం 

ఆధునికుల దృష్టిలో పెళ్లి ఒక జారుముడి
తేలికగా ఊడిపోయే అతకని బంధం 

పెళ్లి, పెటాకులు అను రెండు పడవలపై
రెండు కాళ్ళు ఉంచి సంసార జలధిపై
పయనించడం; నేటి చాలామంది పెళ్లిచేసికోవడం 

పెళ్లి  అనగానే దగ్గర జేసే కమనీయ బంధం కాక
ఇరుకున ఉంచే, ఇరుకున పెట్టె ఒక బంధనం అని ఎక్కురి మతము 

తరువాత జుర్రుకోవలసిన, శోభనం లో జుర్రుకునే అందాలు ఆనందాలు
ముందే రుచి చూచేసి పెళ్ళికి కూర్చుంటున్నారు శోభనమైన వధూ వరులు 

బాధ్యతను సమానంగా పంచుకుని హక్కులని సామరస్యంగా అనుభవిస్తూ
అనుబంధం పంచుకుని పెంచుకుని పటిష్ఠo  చేసికునే కోవాలెంట్ బాండ్ వివాహ బంధం 

అవసరము బాధ్యత ఇంగితము సమపాళ్ళలో కలిపి సృష్టించితిరి పెళ్లిని పెద్దలు
ఇది తెలియని మనుషులు లాలస, అవివేకము, అజ్ఞానము, మూర్ఖత్వము లతో
పెళ్లిని అటక ఎక్కిస్తున్నారు 

తనవారు లేక, ఆదరణ ఆప్యాయత కరువై
అందని ఎడారి జీవితమున అను "బంధముల" లేమిని 
మందుకు, మత్తు మందు లకు, మాదక ద్రవ్యములకు
బానిసలై ఇహ పరముల కోల్పోయిన దుస్థితి మనకేల?

కలుపుకోలుగా స్నేహితుల వలె ఇచ్చి పుచ్చుకొనుచు
స్త్రీ పురుషులు వివాహ బంధమున మెలగి;

సమంగా అనుగుణంగా జీవన భారం వహించి
హుందాగా తాతలు, మామ్మలు అమ్మమ్మలు గా మారుటకు 
సామ్ప్రదాయమిచ్చిన బహుమతి పెళ్లి; పీట ముడైనను
ఉత్తమము; శాంతి సుఖముల పోగొట్టు జారుముడి కారాదు